జాతీయ కబడ్డీ క్రీడాకారిణిపై దాడి | National level woman Kabaddi player beaten up for resisting molestation bid in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

జాతీయ కబడ్డీ క్రీడాకారిణిపై దాడి

Published Wed, Jun 24 2015 4:54 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

జాతీయ కబడ్డీ క్రీడాకారిణిపై దాడి - Sakshi

జాతీయ కబడ్డీ క్రీడాకారిణిపై దాడి

కాన్పూర్: జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిపై కొందరు వ్యక్తులు కిరాతకంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుప్పించి ఆమె ముఖంపై తీవ్ర గాయాలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది.  గతంలో కొందరు వ్యక్తులు లైంగికంగా వేధిస్తుండటంతోపాటు.. తీవ్ర ఇబ్బందులు పెడుతుండగా డాలీ సింగ్ (జాతీయ కబడ్డీ క్రీడాకారిణి) అడ్డుకుంది. దీనిని కారణంగా చేసుకొని పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు చేతిలో కర్రలు, తుపాకీలు ఇతర ఆయుధాలతో వచ్చి ఆమె ఇంట్లోకి చొరబడి దాడి చేసి గాయపరిచారు. 

కాగా, ఇంత జరిగినా ఏ ఒక్కరిపై పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపట్ల ఆమె తండ్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'మేం పోలీసుల వద్దకు వెళ్లాం. అయితే, మీరు వెళ్లండి మేం కేసు నమోదు చేస్తామని చెప్పారు. కానీ అలా చేయలేదు. ఇక డీజీపీని కలిస్తే ఆయన మమ్మల్నే సముదాయించే ప్రయత్నం చేశారు' అని చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైందని, నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారని సమాజ్ వాది పార్టీ నాయకుడు గౌరవ్ భాటియా తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement