dolly singh
-
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్‌స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్‌రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు. -
ఏమోయి? తెలుసునా మోయి మోయి!
‘ఇంటర్నెట్టున ఏ నిమిషానికి ఏ ట్రెండు వచ్చునో ఎవరు ఊహించెదరు’ అని పాడుకోవాల్సిన టైమ్ ఇది. ప్రస్తుతం ‘మోయి మోయి’ అనేది వైరల్ ట్రెండ్‌గా మారింది.‘టిక్‌టాక్’లో వైరల్ అయిన సెర్బియన్ పాట నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. ఈ ట్రెండ్‌లో భాగంగా రకరకాల మీమ్స్, పేరడీలు, రీల్స్ వస్తున్నాయి. ‘మోయి మోయి’కి సొంత డ్యాన్స్‌ను కూడా క్రియేట్ చేశారు. సెర్బియన్ సింగర్–సాంగ్‌రైటర్ టెయా డోర ‘మోయి మోయి’ సాంగ్ యూట్యూబ్‌లో 60 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. నిజానికి పాటలో ‘మోయి మోర్’ అని ఉంటుంది. అయితే మిస్టేక్ వల్ల‘మోర్’ కాస్త ‘మోయి’గా మారింది. తన పాట ట్రెండ్ కావడంతో టెయా డోర ఆనందంతో తబ్బిబ్బైపోతూ‘థ్రెడ్స్’లో ఇలా స్పందించింది... ‘సెర్బియన్ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తం కావడం సంతోషంగా ఉంది. ప్రతిరోజూ ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వస్తున్నాయి. ఐ లవ్ యూ’ ‘మోయి మోయి’ ట్రెండ్ నేపథ్యంలో బాలీవుడ్ నటీమణులు ఉర్ఫీ జావెద్, డాలీ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఉర్వీ, డాలీసింగ్ల ‘మోయి మోయి’ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ‘వావ్’ అంటున్నారు. -
నవ్వుల పువ్వుల దారిలో...
ఫ్యాషన్ బ్లాగర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది దిల్లీకి చెందిన డాలీసింగ్. రైటర్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయపథంలో దూసుకుపోతోంది. ‘మనలో ఉన్న శక్తి ఏమిటో మనం చేసే పనే చెబుతుంది’ అంటున్న 29 సంవత్సరాల డాలీసింగ్కు పనే బలం. ఆ బలమే తన విజయ రహస్యం... డాలీసింగ్ మాట్లాడితే చుట్టుపక్కల నవ్వుల పువ్వులు పూయాల్సిందే! ఆమె ఏం మాట్లాడినా సూటిగా ఉంటుంది. అదే సమయంలో ఫన్నీగా ఉంటుంది. ‘స్పిల్ ది సాస్’ అనే ఫ్యాషన్ బ్లాగ్‌తో ప్రయాణం మొదలు పెట్టింది. లైఫ్‌స్టైల్ పోర్టల్ ‘ఐ–దివ’ కోసం జూనియర్ రైటర్, స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘రాజు కీ మమ్మీ’ ఫన్నీ వీడియోలతో కంటెంట్ క్రియేషన్‌లోకి అడుగుపెట్టింది. ఈ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. రోజువారి జీవితం నుంచే తన ఫన్నీ వీడియోలకు కావాల్సిన స్టఫ్‌ను ఎంపిక చేసుకునేది. ‘బయట ఏదైన ఆసక్తికరమైన దృశ్యం కంటపడితే నోట్ చేసుకునేదాన్ని. ఆ తరువాత డెవలప్ చేసేదాన్ని. మనలోని శక్తి ఏమిటో మన రచనల్లో తెలిసిపోతుంది. రచన చేయడం అనేది నాకు ఎంతో ఇష్టమైన పని. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త క్యారెక్టర్లను సృష్టించడానికి ప్రయత్నిస్తాను. ఐ–దివలో పనిచేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం అంటూ ఉండేది కాదు. ఒక టాపిక్ అనుకొని కెమెరా ముందుకు వచ్చి తోచినట్లుగా మాట్లాడడమే. ఆ తరువాత మాత్రం స్క్రిప్ట్ రాయడం మొదలైంది’ అంటుంది డాలీ సింగ్. కామెడీ అయినా సరే, ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాల్పనిక హాస్యం కంటే నిజజీవిత సంఘటనల నుంచి తీసుకున్న కామెడీనే ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచ్‌లైన్స్ విషయంలో రకరకాలుగా ఎక్సర్సైజ్లు చేస్తుంటుంది డాలీ. ‘ప్రేక్షకులను మెప్పించడం అనేది ఫన్ అండ్ చాలెంజింగ్‌గా ఉంటుంది. రెండు మూడు నెలలకు ఒకసారి రీస్టార్ట్ కావాల్సిందే. కంటెంట్ క్రియేషన్‌లో అతి ముఖ్యమైనది ఎప్పుటికప్పుడు మనల్ని మనం పునరావిష్కరించుకోవడం’ అంటుంది డాలీ. తాము క్రియేట్ చేయాలనుకునేదానికీ, ప్రేక్షకులు ఇష్టపడుతున్న కంటెంట్‌కూ మధ్య కంటెంట్ క్రియేటర్ సమన్వయం సాధించాల్సి ఉంటుంది. మరి డాలీ సంగతి? ‘అనేకసార్లు నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో... నేను క్రియేట్ చేసేది ప్రేక్షకులకు నచ్చేది కాదు. వారికి నచ్చేది నాకు నచ్చేది కాదు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది డాలీ. కంటెంట్ క్రియేటర్లకు ఒత్తిడి అనేది సర్వసాధారణం. ‘ఒత్తిడిని పనిలో భాగంగానే భావించాను. దానినుంచి దూరం జరగడం అనేది కుదిరే పని కాదు. అయితే ఒత్తిడి ప్రభావం కంటెంట్‌పై పడకుండా జాగ్రత్త పడాలి’ అంటుంది డాలీ. ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందిన డాలీ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్‌సీరిస్ ‘మోడ్రన్ లవ్ ముంబై’తో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘నేను విజయం సాధించాను అనుకోవడం కంటే, ఇప్పుడే బయలుదేరాను అనుకుంటాను. అప్పుడే ఫ్రెష్‌గా ఆలోచించడానికి, మరిన్ని విజయాలు సాధించడానికి వీలవుతుంది’ అంటున్న డాలీసింగ్ ఒక షార్ట్‌ఫిల్మ్ కోసం స్క్రిప్ట్రెడీ చేసుకుంటోంది. అందులో తానే నటించనుంది. -
Dolly Singh: కాలీ లడకీ... డాలీసింగ్!
సన్నగా, నల్లగా ఉండడంతో.. తోటి విద్యార్థులంతా ‘ కాలీ లడ్కీ’, ‘సుఖీ దాండి’, బ్యాగ్ ఆఫ్ బోన్స్’ అంటూ డాలీసింగ్‌ను ఆటపట్టిస్తుండేవారు. ఖండించాల్సిన టీచర్లు సైతం కొన్నిసార్లు డాలీ వేసుకున్న డ్రెస్ పార్టీకి నప్పదని చెప్పి వెనక్కి పంపించేవారు. ఇటువంటి ఎన్నో అవహేళనలను ఎదుర్కొంటూ కూడా ఫ్యాషన్ టెక్నాలజీ చదివి, సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేసింది డాలీ. ఫ్యాషన్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. నైనిటాల్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1993లో డాలీ సింగ్ పుట్టింది. డాలీ సింగ్ తల్లిదండ్రులకు ‘అప్నా బజార్’ పేరిట ఒక గిఫ్ట్ షాపు ఉంది. ఈ షాపు మీద వచ్చే కొద్దిపాటి ఆదాయమే వారి జీవనాధారం. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ డాలీ సింగ్, తన తమ్ముడితో కలిసి స్కూలుకు వెళ్లి చక్కగా చదువుకునేది. స్కూల్లో తన బక్కపలుచని శరీరాన్ని తోటి విద్యార్థులు గేలిచేసినప్పటికీ చురుకుగా చదువుతూ.. క్లాస్‌లో ఫస్ట్ వచ్చేది. స్పిల్ ది సాస్.. డిగ్రీ తరువాత ఎమ్బీఏ చదివేందుకు క్యాట్ పరీక్ష రాసింది. కానీ ఎమ్బీఏలో సీటు రాలేదు. దీంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ)ఎంట్రన్స్ రాయగా.. ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఢిల్లీ ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. పీజీ చదువుతూనే మరోపక్క ‘స్పిల్ ది సాస్’ పేరిట ఫ్యాషన్ బ్లాగ్‌ను ప్రార ంభించింది. ఈ బ్లాగ్‌లో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఫోటోలను పోస్టు చేసేది. వీటితోపాటు దుస్తుల ఫ్యాషన్ వీడియోలు, యాక్సెసరీస్, బడ్జెట్ ధరలో ఫ్యాషన్ దుస్తుల షాపింగ్ ఎలా చేయాలి... వంటి అంశాలపై వీడియోలను పోస్టు చేసేది. తల్లి, తండ్రి, తమ్ముడితో డాలీసింగ్ పీజీ ప్రాజెక్టులో భాగంగా డాలీ సింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫాం ‘ఐ దివ’ లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక ఐ దివాలో కంటెంట్ క్రియేటర్‌గా చేరి.. నిర్మాతగా, రచయితగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభంలో వీడియోలు షూట్ చేయడం కాస్త కష్టంగా ఉండడంతో...రెండేళ్ల తరువాత ఐ దివ డైరెక్టర్ ‘సౌత్ ఢిల్లీ గర్ల్స్’ పేరిట షోను ప్రారంభించారు. ఈ షోలో డాలీసింగ్ కుషా కపిలతో కలిసి చాలా వీడియో సీరిస్ చేసింది. ఈ సీరిస్ బాగా పాపులర్ అయింది. డాలీసింగ్ కెరియర్లో ఇదో మైలురాయి. ఈ షోతో డాలీకి అపారమైన పాపులారిటి వచ్చింది. సౌత్ ఢిల్లీ గర్ల్స్ సిరీస్ తరువాత డాలీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘జీనత్’ ‘మిసెస్ కపూర్’, ‘నటాషా’ ‘రెక్లెస్ రేణు’, గుడ్డీ బాబాయ్’, ‘బబ్లీ’ వంటి వీడియోలు డాలీసింగ్కు మంచి గుర్తింపు తెచ్చాయి. నైనిటాల్‌లోని డాలీ సింగ్ ఇంటిని ‘మై రియల్ హౌస్ టూర్’ పేరిట ఎడిటింగ్ చేయని వీడియో అప్లోడ్ చేసింది. వాస్తవానికి దగ్గరగా ఉన్న వీడియో కావడంతో వ్యూవర్స్ బాగా ఇష్టపడ్డారు. రాజుకీ మమ్మీ.. ‘రాజుకీ మమ్మీ’ టాక్ షో ద్వారా చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీలను డాలీ ఇంటర్వ్యూ చేసింది. ప్రియాంకా చోప్రా, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దికీ, పంకజ్ త్రిపాఠి వంటి వారితో కలిసి చేసిన క్యారెక్టర్ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. డాలీ సింగ్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫ్యాషన్ బ్లాగ్‌ను ఫాలో అయ్యే వారిసంఖ్య లక్షల్లోనే ఉంది. ఒకపక్క ఫ్యాషన్ బ్లాగర్‌గా, యూట్యూబ్ సిరీస్‌లో తీరికలేకుండా గడుపుతున్న డాలీ గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘భాగ్ బీని భాగ్’ సిరీస్‌లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. -
ఆ పాత్ర నాకు చాలా ఇష్టం: డాలీ సింగ్
టాలెంట్‌ను ఆదరిస్తారు.. గ్లామర్‌ను ఆరాధిస్తారు.. ఈ రెండిటినీ సొంతం చేసుకున్న వెబ్ స్టార్ డాలీ సింగ్. ఫన్నీ వీడియోస్‌తో, ఫ్యాషన్ పోకడలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కదిలించింది. ప్రతిభను చాటుకుంటోంది. యూట్యూబ్‌లో 271కె ఫాలోవర్స్‌ని, ఇన్‌స్ట్రాగామ్‌లో 755కె ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న డాలీ సింగ్ (27).. ‘రాజు కీ మమ్మీ’ అనే పాత్రతో పాపులర్ అయ్యింది. ►డాలీ 1993 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేసింది. ►ఫ్యాషన్ బ్లాగర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌గా మల్టీ టాలెంట్ చూపిస్తోంది. యూట్యూబ్‌లో ‘రాజు కీ మమ్మీ చాట్ షో’లో రాజు కీ మమ్మీ పాత్ర పాపులర్ అయ్యింది. ►ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తయ్యాక స్టైల్ బ్లాగ్ స్టార్ట్ చేసింది. ఐడివాతో ఇంటర్న్‌షిప్ తర్వాత.. స్టైలిస్ట్ కావాలనుకొని.. రచయిత (కంటెంట్ డెవలపర్)గా ఐడివాలోనే జాయిన్ అయ్యింది. ►ఇంటర్న్‌షిప్ చేసే సమయంలోనే ఐడివా ఆన్లైన్ వెబ్సైట్లో స్టైల్ టిప్స్, బ్యూటీ టిప్స్, హెల్త్, వెల్నెస్ మొదలైనవి పోస్ట్ చేసేది డాలీ. ఈ క్రమంలోనే ఆమెకు ఐడివా యూట్యూబ్‌లో నటించే అవకాశం వచ్చింది. ►సౌత్ ఢిల్లీ గర్ల్స్‌లో డాలీ సింగ్, కుషా కపిలా ఇద్దరూ ఒకరిని మించి ఒకరు నటించారు. ఈ సిరీస్‌తో డాలీకి ప్రేక్షకాదరణ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ►డాలీ తన టాక్ షో సిరీస్‌లో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఇందులోనే ఆమె ‘రాజు కీ మమ్మీ’ పాత్రను పోషించింది. ►నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం టాప్ రేటింగ్‌లో ఉన్న ‘భాగ్ బీని భాగ్’లో ప్రధాన పాత్ర పోషించిన డాలీ.. ఆ సిరీస్‌తో ఇంటింటా అభిమానులను సంపాదించుకుంది. ఇందులో స్వర భాస్కర్‌తోపాటు అత్యంత ప్రేక్షకాదరణ పొందిన యూట్యూబర్స్ క్యారీ మినాటి, హార్ష్ బెనివాల్, ప్రజక్త కోలితో వెబ్‌స్క్రీన్ షేర్ చేసుకుంది డాలీ... ‘రాజు కీ మమ్మీ అచ్చం మా అమ్మలానే ఉంటుంది. మా అమ్మను ప్రేరణగా తీసుకునే క్రియేట్ చేసుకున్నాను. అందుకే ఆ పాత్ర నాకు చాలా ఇష్టం’ అంటుంది డాలీ సింగ్. చదవండి: చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతాడనుకున్నారు.. కానీ.. -
జాతీయ కబడ్డీ క్రీడాకారిణిపై దాడి
కాన్పూర్: జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిపై కొందరు వ్యక్తులు కిరాతకంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుప్పించి ఆమె ముఖంపై తీవ్ర గాయాలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. గతంలో కొందరు వ్యక్తులు లైంగికంగా వేధిస్తుండటంతోపాటు.. తీవ్ర ఇబ్బందులు పెడుతుండగా డాలీ సింగ్ (జాతీయ కబడ్డీ క్రీడాకారిణి) అడ్డుకుంది. దీనిని కారణంగా చేసుకొని పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు చేతిలో కర్రలు, తుపాకీలు ఇతర ఆయుధాలతో వచ్చి ఆమె ఇంట్లోకి చొరబడి దాడి చేసి గాయపరిచారు. కాగా, ఇంత జరిగినా ఏ ఒక్కరిపై పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపట్ల ఆమె తండ్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'మేం పోలీసుల వద్దకు వెళ్లాం. అయితే, మీరు వెళ్లండి మేం కేసు నమోదు చేస్తామని చెప్పారు. కానీ అలా చేయలేదు. ఇక డీజీపీని కలిస్తే ఆయన మమ్మల్నే సముదాయించే ప్రయత్నం చేశారు' అని చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైందని, నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారని సమాజ్ వాది పార్టీ నాయకుడు గౌరవ్ భాటియా తెలిపారు.