టాలెంట్‌ను ఆదరిస్తారు.. గ్లామర్‌ను ఆరాధిస్తారు.. ఈ రెండిటినీ సొంతం చేసుకున్న వెబ్ స్టార్ డాలీ సింగ్. ఫన్నీ వీడియోస్‌తో, ఫ్యాషన్ పోకడలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కదిలించింది. ప్రతిభను చాటుకుంటోంది. యూట్యూబ్‌లో 271కె ఫాలోవర్స్‌ని, ఇన్‌స్ట్రాగామ్‌లో 755కె ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న డాలీ సింగ్ (27).. ‘రాజు కీ మమ్మీ’ అనే పాత్రతో పాపులర్ అయ్యింది.
►డాలీ 1993 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేసింది.
►ఫ్యాషన్ బ్లాగర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌గా మల్టీ టాలెంట్ చూపిస్తోంది. యూట్యూబ్‌లో ‘రాజు కీ మమ్మీ చాట్ షో’లో రాజు కీ మమ్మీ పాత్ర పాపులర్ అయ్యింది.
►ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తయ్యాక స్టైల్ బ్లాగ్ స్టార్ట్ చేసింది. ఐడివాతో ఇంటర్న్‌షిప్ తర్వాత.. స్టైలిస్ట్ కావాలనుకొని.. రచయిత (కంటెంట్ డెవలపర్)గా ఐడివాలోనే జాయిన్ అయ్యింది.
►ఇంటర్న్‌షిప్ చేసే సమయంలోనే ఐడివా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో స్టైల్ టిప్స్, బ్యూటీ టిప్స్, హెల్త్, వెల్‌నెస్ మొదలైనవి పోస్ట్ చేసేది డాలీ. ఈ క్రమంలోనే ఆమెకు ఐడివా యూట్యూబ్‌లో నటించే అవకాశం వచ్చింది.
►సౌత్ ఢిల్లీ గర్ల్స్‌లో డాలీ సింగ్, కుషా కపిలా ఇద్దరూ ఒకరిని మించి ఒకరు నటించారు. ఈ సిరీస్‌తో డాలీకి ప్రేక్షకాదరణ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది.
►డాలీ తన టాక్ షో సిరీస్‌లో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఇందులోనే ఆమె ‘రాజు కీ మమ్మీ’ పాత్రను పోషించింది.
►నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం టాప్ రేటింగ్‌లో ఉన్న ‘భాగ్ బీని భాగ్’లో ప్రధాన పాత్ర పోషించిన డాలీ.. ఆ సిరీస్‌తో ఇంటింటా అభిమానులను సంపాదించుకుంది. ఇందులో స్వర భాస్కర్‌తోపాటు అత్యంత ప్రేక్షకాదరణ పొందిన యూట్యూబర్స్ క్యారీ మినాటి, హార్ష్ బెనివాల్, ప్రజక్త కోలితో వెబ్‌స్క్రీన్ షేర్ చేసుకుంది డాలీ...
‘రాజు కీ మమ్మీ అచ్చం మా అమ్మలానే ఉంటుంది. మా అమ్మను ప్రేరణగా తీసుకునే క్రియేట్ చేసుకున్నాను. అందుకే ఆ పాత్ర నాకు చాలా ఇష్టం’ అంటుంది డాలీ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment