వందమందిలో భార్యపై భర్త పైశాచికత్వం | Woman Tied To Tree, Beaten As People Watch | Sakshi
Sakshi News home page

చెట్టుకు కట్టేసి వందమందిలో భర్త అమానుషం..

Published Fri, Mar 23 2018 9:13 AM | Last Updated on Fri, Mar 23 2018 9:33 AM

 Woman Tied To Tree, Beaten As People Watch - Sakshi

అందరి మధ్య చెట్టుకు కట్టేసి కొడుతున్న భర్త

సాక్షి, లక్నో : మానవత్వం మంటకలిసింది. ఒకరిని వేధిస్తుంటే మరొకరు చూసి ఆనందపడే పరిస్థితి తారా స్థాయికి వెళ్లింది. కనీసం జాలిపడకపోగా కళ్లప్పగించి చూసి వీడియోలు తీసుకోవడం షరా మాములు అయింది. ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే చుట్టూ ఉన్న వందమందిలో ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేదు. పైగా అదొక సినిమా చూసినట్లు చూశారు. వందమందిలో ఎక్కువశాతం పురుషులే ఉన్నారు. అయినప్పటికీ అలా చేయడం తప్పు అని ఏ ఒక్కరు చెప్పలేదు. ఇదంతా కూడా పంచాయతీ పెద్దలు నిర్వహించిన ఘనకార్యం. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మహిళపై పరాయి పురుషుడితో సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆ ఆరోపణలు కూడా భర్తే చేసి పంచాయతీ పెట్టించాడు. దాంతో ఓ వందమందికి పైగా ఓ చోట చేరి ఆమెను కట్టేసి కొట్టాలని శిక్ష విధించారు. అలా చేయడం తప్పు అని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. వెంటనే ఆ మహిళ చేతులు తాడుతో కట్టి ఓ చెట్టుకొమ్మకు వేలాడదీసి కొట్టడం మొదలు పెట్టారు. ఓ సైకిల్‌ ట్యూబ్‌, టైరు తీసుకొని అందరూ చూస్తు నవ్వుతుండగా ఆమె భర్త దాదాపు చచ్చేన్ని దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె స్పృహకోల్పోయింది. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వేగంగా స్పందించిన పోలీసులు ఆమె భర్తను, పంచాయతీ ప్రధాన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరో 25మందిపై కూడా కేసులు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement