యూపీలోని బస్తీలో పోలీసుల నిర్లక్ష్యం మరోమారు కనిపించింది. పోలీసులకు లభ్యమైన ఒక మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో అది మహిళ మృతదేహంగా భావించి, పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే పోస్టుమార్టం సమయంలో వైద్యులు ఆ మృతదేహాన్ని చూసి హడలిపోయారు. పోలీసుల పేర్కొన్నట్లు అది మహిళ మృతదేహం కాదని, పురుషునిదని వారు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే మూడు రోజుల క్రితం పోలీసులకు ఒక అనాథ మృతదేహం లభ్యమయ్యింది. అది గోనె సంచీలో కట్టివేసివుంది. ఆ మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో వారు అది మహిళ మృతదేహమని నిర్ధారిస్తూ, దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే వైద్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించి అది పురుషునిదని గుర్తించారు. పోలీసులు చేసిన తప్పిదాన్ని నిరసిస్తూ, వారు పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. మరోమారు పంచనామా చేసిన అనంతరమే పోస్టుమార్టం నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పారు.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబౌలియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోకుల్‌పూర్‌లో రోడ్డు పక్కన పోలీసులకు సంచీలో బంధించిన మృతదేహం లభ్యమయ్యింది. ఆ మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో విపరీతంగా దుర్ఘందం వెలువడుతోంది. ఆ మృతదేహానికి ఉన్న జుట్టు ఆధారంగా పోలీసులు దానిని మహిళ మృతదేహంగా భావించి, దర్యాప్లు ప్రారంభించారు. కాగా ఇంతవరకూ అది ఎవరి మృతదేహమనేది తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: కుమారుని బర్త్‌డే కేక్ కట్ చేస్తూ తండ్రి మృతి!
Comments
Please login to add a commentAdd a comment