postmartam
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
గేదెకు పోస్టుమార్టం.. కారణమిదే?
పట్నా: బీహార్‌లోని పట్నాలో ఓ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఒక గేదె మృతి చెందగా, దానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహింపజేస్తున్నారు. గేదెకు పోస్టుమార్టం నిర్వహించడం ఇదే తొలిసారని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి పట్నాకు 40 కిలోమీటర్ల దూరంలోని ధన్రువాలోని నద్వాన్ సోన్‌మై గ్రామంలో గేదెలను మేపిన అనంతరం మున్నా కుమార్, నావల్ కుమార్ అనే అన్నదమ్ములు ఇంటికి తిరిగి వస్తున్నారు.ఇంతలో నలుగురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చారు. వారు ముందుగా నావల్ ప్రసాద్‌ను కత్తితో పొడిచారు. ఆ తర్వాత అతనిపై కాల్పులు జరిపారు. అయితే మున్నా ప్రసాద్ తృటిలో తప్పించుకోగా, నిందితులు అక్కడున్న గేదెపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల శబ్ధం విన్న సమీప గ్రామస్తులు అక్కడికి వచ్చి నిందితులను తరిమికొట్టారు. వారు మోటార్‌సైకిల్‌పై పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే వారు కిందపడిపోయారు. దీంతో వారు మోటార్‌సైకిల్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ధన్రువా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైక్, పిస్టల్, బుల్లెట్, కత్తి, బుల్లెట్ కేసింగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్నాలోని మసౌరీ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కన్హయ్య సింగ్ మాట్లాడుతూ, నిందితులు రైతుతోపాటు ఒక గేదెపై కాల్పులు జరిపారన్నారు. ప్రస్తుతం రైతు నావల్ ప్రసాద్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతుండగా, గేదెకు కూడా పశువైద్యశాలలో పోస్ట్‌మార్టం చేస్తున్నారు. ఆ గేదె ఎలా మృతిచెందిందనే విషయాన్ని తెలుకునేందుకే దానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. -
పొడవు జుట్టుంటే మహిళ మృతదేహమేనా? పోస్టుమార్టంలో ఏం తేలింది?
యూపీలోని బస్తీలో పోలీసుల నిర్లక్ష్యం మరోమారు కనిపించింది. పోలీసులకు లభ్యమైన ఒక మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో అది మహిళ మృతదేహంగా భావించి, పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే పోస్టుమార్టం సమయంలో వైద్యులు ఆ మృతదేహాన్ని చూసి హడలిపోయారు. పోలీసుల పేర్కొన్నట్లు అది మహిళ మృతదేహం కాదని, పురుషునిదని వారు గుర్తించారు. వివరాల్లోకి వెళితే మూడు రోజుల క్రితం పోలీసులకు ఒక అనాథ మృతదేహం లభ్యమయ్యింది. అది గోనె సంచీలో కట్టివేసివుంది. ఆ మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో వారు అది మహిళ మృతదేహమని నిర్ధారిస్తూ, దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే వైద్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించి అది పురుషునిదని గుర్తించారు. పోలీసులు చేసిన తప్పిదాన్ని నిరసిస్తూ, వారు పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. మరోమారు పంచనామా చేసిన అనంతరమే పోస్టుమార్టం నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబౌలియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోకుల్‌పూర్‌లో రోడ్డు పక్కన పోలీసులకు సంచీలో బంధించిన మృతదేహం లభ్యమయ్యింది. ఆ మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో విపరీతంగా దుర్ఘందం వెలువడుతోంది. ఆ మృతదేహానికి ఉన్న జుట్టు ఆధారంగా పోలీసులు దానిని మహిళ మృతదేహంగా భావించి, దర్యాప్లు ప్రారంభించారు. కాగా ఇంతవరకూ అది ఎవరి మృతదేహమనేది తెలియరాలేదు. ఇది కూడా చదవండి: కుమారుని బర్త్‌డే కేక్ కట్ చేస్తూ తండ్రి మృతి! -
ఎంత పని చేశావ్.. తల్లీ! పోలీసులను పరుగులు పెట్టించి చివరికీ..
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్: నరసరావుపేటలో కనిపించకుండాపోయిన ఏడాది బాలుడు బావిలో శవమై తేలాడు. కిడ్నాప్ అయ్యాడని బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పరుగులు పెట్టిన పోలీసులు పట్టణంలోని 60 సీసీ కెమెరాలను పరిశీలించి.. కిడ్నాప్ జరగలేదని నిర్ధారించుకున్నారు. అనుమానంతో తల్లిని ప్రశ్నించగా.. పిల్లాడిని ఆడిస్తుండగా పొరపాటున బావిలో పడిపోయాడని తెలిపింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటోంది. బావి నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలేం జరిగిందంటే.. పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం బండివారిపాలేనికి చెందిన బండి వాసు, సాయిలక్ష్మి దంపతులకు కుమార్తె మోక్ష, కుమారుడు భానుప్రకాష్ (1) ఉన్నారు. కాగా, వాసు, సాయిలక్ష్మి దంపతులు నరసరావుపేట శివారులోని బ్యాంక్ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తమ ఏడాది కుమారుడు భానుప్రకాష్ కనిపించడం లేదని తల్లి సాయిలక్ష్మి తన భర్త, బంధువులకు సమాచారం అందించింది. దీంతో తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని తండ్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంట్రుకలు కొనుగోలు చేసే వ్యక్తులు శుక్రవారం రెక్కీ నిర్వహించారని, శనివారం సాయంత్రం తమ బాబును అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును తక్షణమే అక్కడికి బదిలీ చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్బీ సీఐ ప్రభాకర్ తమ సిబ్బందితో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. దాదాపు 60 సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాలుడి ఆచూకీ ఎక్కడా నమోదు కాలేదు. తల్లిని ప్రశ్నించడంతో.. బాలుడు భానుప్రకాష్ ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బాలుడి తల్లి సాయిలక్ష్మిని రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రహరీపై ఆడుకుంటున్న బాలుడు కిందకు జారి పాత బావిలో పడిపోయాడని సాయిలక్ష్మి తెలిపింది. ఈ విషయం చెబితే భర్త, బంధువులు ఏమంటారోనన్న భయంతో చెప్పలేదని భోరున విలపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు బావిలో వెతకగా బాలుడి మృతదేహం లభించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాలుడి తల్లి సాయిలక్ష్మి మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. మొదటి కాన్పు సమయంలోనే ఆమె మానసిక సమస్య రావడంతో చికిత్స అందిస్తున్నట్టు భర్త తెలిపారు. నెల రోజుల క్రితం లక్ష్మి తల్లిదండ్రులు క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చిన్నారి తన చేతుల్లో ఆడుకుంటూ కిందపడిపోవడంతో ఆమె భయపడి బాలుడు కనిపించడం లేదని భర్త, బంధువులకు చెప్పిందని ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: అద్భుతాలు చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి) -
పోస్టుమార్టం రోజునే ప్రభుత్వ సాయం
పి.గన్నవరం: గోదావరి వరదల్లో ప్రమాదవశాత్తు గల్లంతై మరణించిన ఇద్దరి కుటుంబాలకు పోస్టుమార్టం పూర్తయిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందించింది. ఈ నెల 16న కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి పల్లిపాలేనికి చెందిన కడలి శ్రీనివాసరావు (48) ఏటిగట్టు నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నదిలో ఈదుకుంటూ వస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. 18వ తేదీన అదే గ్రామానికి చెందిన కారాడి రామకృష్ణ (68) శివాయలంకకు పడవపై గ్రామస్తులను తీసుకువెళ్లాడు. తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయాడు. ఇతడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం అప్పనపల్లిలో వెలికితీశారు. ఇద్దరి మృతదేహాలకు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం సాయంత్రం పోస్టుమార్టం జరిగింది. ఇదే సమయంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. బాధితుల ఇళ్లకు మోకాలి లోతు వరద నీటిలో నడిచి వెళ్లి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వ సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ప్రభుత్వం స్పందించిన తీరును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాలినడకన 4 కిలోమీటర్లు నాతవరం (అనకాపల్లి జిల్లా): రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామానికి అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి బుధవారం కాలినడకన వెళ్లారు. కొండలు, గుట్టలు ఎక్కి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి నాతవరం మండలంలోని అసనగిరి గ్రామంలో గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. గ్రామంలో అన్ని వీధులూ కలియతిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాటాకు గుడిసెల్లోకి కూడా వెళ్లి వారితో మాట్లాడారు. ఆ ఆదివాసీ గ్రామానికి వచ్చిన తొలి కలెక్టర్ కావడంతో గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సుందరకోట పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి, సరుగుడు సచివాలయంలో వలంటీర్లతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. ఇదీ చదవండి: సహాయం.. శరవేగం -
‘హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు’
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): పాతి పెట్టిన మృతదేహాన్ని 20 రోజుల తర్వాత వెలికితీసి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన ఘటన కారేపల్లి మండలం బోటితండా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బోటితండా గ్రామానికి చెందిన పీజీ విద్యార్థి ధర్మసోత్ కిరణ్ కుమార్ (25) ఈ నెల 1వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. కారేపల్లి పోలీసులకు తెలిసినా కేసు నమోదు చేయకపోవటంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిచి్చంది. ఈ క్రమంలోనే కారేపల్లి ఎస్ఐ వెంకన్నను సైతం ‘సాక్షి’వివరణ కోరగా.. ‘బాధితుడి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆత్మహత్యపై ఫిర్యాదు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించారని’ తెలిపారు. ఇదే విషయంపై ఈ నెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. బాధితుల కథనం ప్రకారం.. బోటితండాకు చెందిన ధర్మసోత్ కిరణ్ కుమార్ (25) ఖమ్మంలో పీజీ చదువుతున్నాడు. సమీప చీమలపాడు గ్రామానికి చెందిన అతని మిత్రుడు, చింతలతండాకు చెందిన ఓ యువతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరిరువురు బోటితండాలోని కిరణ్ కుమార్ బంధువుల ఇంట్లో ఉండగా..అక్కడే కిరణ్ కుమార్ సైతం ఉన్నాడు. ఈ క్రమంలో యువతి బంధువులు వచ్చి కిరణ్ కుమార్‌ను, తన స్నేహితుడిని దూషించారు. అదే రోజు రాత్రి కిరణ్ కుమార్ అదే ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం మృతుడి తల్లిదండ్రులు రేలకాయలపల్లి వీఆర్వో ప్రకాశ్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగరేణి తహసీల్దార్ డి పుల్లయ్య, íసీఐ బి శ్రీనివాసులు, ఎస్ఐ పొదిల వెంకన్నల సమక్షంలో 20 రోజుల క్రితం పాతిపెట్టిన శవాన్ని బయటికి తీశారు. ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కిషోర్, హర్షిణి ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. బోటితండాలో ఉద్రిక్తత నెలకొనగా, కామేపల్లి, కారేపల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. హత్య చేసి.. ఆత్మహత్యగా.. నా కొడుకు కిరణ్ కుమార్‌ను ఆరుగురు వ్యక్తులు కలిసి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తల్లిదండ్రులు భద్రు, కాంతి విలేకరుల ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు నచ్చజెప్పటంతో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనుషులు సుమారు రూ.80వేలు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
భీమవరంలో ఉద్రిక్తత
►గరగపర్రు రోడ్డు ప్రమాద బాధితుడి మృతదేహానికి పోస్టుమార్టం ►ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చాలంటూ దళిత సంఘాల డిమాండ్ భీమవరం టౌన్: ఒక వైపు దళిత సంఘాల నేతలు.. మరోవైపు పోలీసుల మోహరింపుతో భీమవరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గరగపర్రు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చినకాపుల యాకోబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు శవపంచనామా రాసే విషయంలో దళిత సంఘాల నేతలు సూచనలు చేయడం, అందుకు పోలీస్ అధికారులు ఆలోచించడం ఇలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఎడతెగని చర్చలు సాగాయి. మరోవైపు యాకోబు మృతి రోడ్డు ప్రమాదంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 302ను ఎఫ్ఐఆర్లో అల్టర్ చేయాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, అడిషనల్ ఎస్పీ వి.రత్న, డీఎస్పీలు జి.పూర్ణచంద్రరావు, సత్యానంద్‌తో వైఎస్సార్ సీపీ నాయకుడు, దళిత సంఘం నేత కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు సూర్యదేవర వరప్రసాద్, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, సీపీఎం నాయకుడు జేఎన్వీ గోపాలన్ తదితరులు చర్చలు జరిపారు. అయితే బయట ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలు మాత్రం తక్షణం ఎఫ్ఐఆర్లో 302 సెక్షన్‌ను అలర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని గరగపర్రు పంపించేందుకు 108 అంబులెన్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన అంబులెన్స్‌ను తమిళనాడుకు చెందిన విముక్తి చిరుతల అధ్యక్షుడు విద్యాసాగర్, మాలమహానాడు మహిళా అధ్యక్షురాలు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు. నేలపై బైఠాయించి ధర్నాకు దిగారు. అడిషనల్ ఎస్పీ రత్న ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశామని నచ్చచెప్పారు. మృతుని కుటుంబీకులు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంతేటి ఆదాము నుంచి కూడా వివరాలు సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు కోరికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని దర్యాప్తు అధికారి కేసు దర్యాప్తు చేస్తారన్నారు. దళితులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య యాకోబు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఊరేగింపుగా పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కొద్దిసేపు శవపేటికను ఉంచి నివాళులర్పించారు. అక్కడి నుంచి గరగపర్రుకు ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యానంద్, సీఐలు, ఎస్సైలు, పోలీసులు స్పెషల్ ఫోర్స్ బందోబస్తు నిర్వహించారు. బాధితులకు సర్రాజు పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చినకాపుల యాకోబు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పరామర్శించారు. చికిత్స పొందుతున్న కంతేటి ఆదామును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడికి వచ్చిన గరగపర్రు దళితులకు మనోధైర్యం కల్పిస్తూ ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, పోలీస్ అధికారులతో సర్రాజు మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కూడా ఆస్పత్రికి వచ్చి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. దళిత, మానవహక్కుల వేదిక నాయకుల రాక ఉభయ తెలుగు రాష్ట్రాల మానవహక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.సుధ, సభ్యులు భీమవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చి బాధిత కుటుంబాల సభ్యులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. గరగపర్రు ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తమిళనాడుకు చెందిన విముక్తి చిరుతల అధ్యక్షుడు విద్యాసాగర్, మాలమహానాడు మహిళా విభాగం అధ్యక్షరాలు గొట్టిపాటి రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో దళితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారిగా భీమవరం వన్‌టౌన్ సీఐ గరగపర్రు రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు అధికారిగా భీమవరం వన్‌టౌన్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావును ఆదివారం మధ్యాహ్నం నుంచి నియమించారు. తొలుత పాలకొల్లు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్‌ను నియమించినా స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న దృష్ట్యా ఆ స్థానంలో వెంకటేశ్వరరావును ఉన్నతాధికారులు నియమించారు. -
తోడికోడళ్ల మృతిపై వీడని మిస్టరీ..!
రాజంపేట: మండలంలోని సిద్దులపల్లె కొత్తరాచపల్లెలో శుక్రవారం మృతి చెందిన తోడికోడళ్ల కేసుకు సంబంధించి మిస్టరీ ముడివీడలేదు. పోలీసుల విచారణలో దివ్య, జ్యోష్న మృతులపై అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి. మృతుల సంబంధీకుల్లో పలు అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా మృతదేహాలకు శుక్రవారం రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం గది వద్దకు మృతిరాలి సంబంధీకులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. తమ బిడ్డల మృతికి అత్తింటివారే కారణమని దివ్య, జ్యోష్న తల్లిదండ్రులు విలపించారు. తమ బిడ్డలు అత్తగారింట్లో పడుతున్న కష్టాలు వివరించేవారని, ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ వచ్చామని వారు తెలిపారు. కాగా జ్యోష్న తల్లి అత్తింటిలోనే శవాన్ని పూడ్చిపెట్టాలని, మృతికి కారణమైన వారిని ఊరితీయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచే మృతుల సంబంధీకులు పెద్దఎత్తున రాజంపేట రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు తరలివచ్చారు. తోడికోడళ్ల సంబంధీకుల నుంచి ఫిర్యాదు తీసుకొని రూరల్ సీఐ హేమసుందరరావు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామన్నారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించామని తెలిపారు. అదుపులో దివ్య భర్త.. తోడికోడళ్ల మృతిలో దివ్య భర్త వెంకటేశ్వరరాజు వ్యవహరించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దివ్య భర్త కువైట్‌లో ఉంటున్నాడు. మృతి చెందిన సమాచారంతో కువైట్ నుంచి హుటాహుటిన రాజంపేటకు శుక్రవారం చేరుకున్నారు. స్ధానిక ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న వెంకటేశ్వరరాజు వైఖరిని మృతుల సంబంధీకులు జీర్ణించుకోలేకపోయారు. వారిలో ఆగ్రహావేశం కట్టలు తెంచుకుంది దీంతో అక్కడే ఉన్న పోలీసులు వెంకటేశ్వరరాజును అదుపులోకి తీసుకొని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కువైట్ నుంచి వచ్చిన వెంకటేశ్వరరాజును తోడికోడళ్ల కేసుకు సంబంధించి ముద్దాయిగా అదుపులోకి తీసుకున్నామని రాజంపేటరూరల్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
డెడ్‌బాడీ తరలింపు ఇక ఈజీ
డెడ్‌బాడీ తరలింపు ఇక ఈజీ అందుబాటులోకి ‘ఫోరెన్సిక్ కార్ప్స్‌క్యారియర్’ ఎలాంటి ఇబ్బందులు లేని పోస్టుమార్టం పరీక్షల కోసం దేశంలో తొలిసారిగా నగర కమిషనరేట్‌లో ఏర్పాటు ప్రారంభించిన సీపీ మహేందర్‌రెడ్డి హిమాయత్‌నగర్: హత్య, ఆత్మహత్య, అనుమానాస్పద మృతి, రోడ్డు ప్రమాదం... ఈ తరహా ఉదంతాలు జరిగినప్పుడు, గుర్తు తెలియని మృతదేహాలు లభించినప్పుడు డెడ్‌బాడీలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు సుముఖంగా లేకపోవడమే ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’ పేరుతో రూపొందించిన వాహనాన్ని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశంలో మరే ఇతర కమిషనరేట్‌లోనూ ఇప్పటి వరకు ఈ తరహా వెహికిల్స్ అందుబాటులో లేవు. ప్రాథమికంగా ఓ వాహనం ఏర్పాటు నగర కమిషనరేట్ పరిధిలో మృతదేహాల తరలింపు కోసం సిద్ధం చేసిన ఒక ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’ను సోమవారం ట్రాఫిక్ కమిషనరేట్ వద్ద అదనపు సీపీలు జితేంద్ర (ట్రాఫిక్), స్వాతిలక్రా (నేరాలు), వీవీ శ్రీనివాసరావు (శాంతిభద్రతలు), మురళీకృష్ణ (పరిపాలన)లతో కలిసి నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మృతదేహాల తరలింపు కోసం ఎస్హెచ్ఓలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ వాహనం అందుబాటులోకి రావడంతో ఆ సమస్య తీరిందన్నారు. ఈ వాహనం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, డిమాండ్‌ను బట్టి వాహనాల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ వెహికల్లో డ్రైవర్‌తో పాటు శవాన్ని తరలించేందుకు ఇద్దరు సిబ్బంది ఉంటారన్నారు. కదిలించిన అనేక ఘటనలు... చట్ట ప్రకారం మెడికో లీగల్ కేసులతో పాటు ఎఫ్ఐఆర్ నమోదైన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి. అలా చేయకుంటే అనేక చట్ట పరమైన ఇబ్బందులు రావడంతో పాటు కేసుల దర్యాప్తు సైతం సరైన దిశలో సాగదు. వీటన్నింటికీ మించి మృతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ తదితరాలు క్లైమ్ చేసుకోవాలంటే ఎఫ్ఐఆర్తో పాటు పోస్టుమార్టం పరీక్ష నివేదిక తప్పనిసరి. ఇలాంటి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రులకు తరలించడానికి పోలీసులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోపక్క గత కొన్ని రోజులుగా మృతదేహాలను మృతుల కుటుంబ సభ్యులు మోసుకెళ్లడం వంటివి మీడియాలో రావడం నగర పోలీసు విభాగాన్ని కదిలించాయి. -
అస్వస్థతతో రిమాండ్ ఖైదీ మృతి
వివిధ కేసుల్లో నిందితుడు గంజాయి అక్రమ రవాణాలో ఇటీవలే చిక్కాడు రాజమహేంద్రవరం క్రైం : గంజాయి కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ గురువారం అస్వస్థతతో మృతి చెందాడు. అనపర్తి గ్రామానికి చెందిన గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి(63)ని ఈనెల 24వ తేదీన గంజాయి కేసులో రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 26వ తేదీన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. సత్యనారాయణకు వైద్య సదుపాయం అందించాలని కోర్టు ఆదేశించడంతో అతనిని 27వ తేదీ మధ్యాహ్నం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఖైదీల వార్డుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున 4.38 గంటలకు గుండె పోటుతో సత్యనారాయణరెడ్డి మృతి చెందాడు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛాతిపై గాయం గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి ఛాతిపై చిన్న గాయాన్ని గుర్తించారు. మృతుడి వంటిపై పలు గాయాలు ఉండడంతో అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నిందితుడి బంధువులు నోరు మెదపడం లేదు. బెయిల్‌పై బయటకు వచ్చి.. గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి వివిధ కేసుల్లో నిందితుడు. గంజాయి కేసులే కాకుండా కిడ్నాప్ కేసు కూడా ఇతనిపై నమోదైంది. జగ్గంపేట పోలీసు స్టేషన్లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో 2008లో సత్యనారాయణరెడ్డికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిం చారు. సొంత బావమరదిని కిడ్నాప్ చేసిన కేసులో ఇతను ప్రధాన నిందితుడు. 2012 జూలై 6న అనపర్తి పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. Výæంజాయి కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై విడుదలైన అతను మళ్లీ అదే వ్యాపారం చేపట్టాడు. ఈ నెల 24వ తేదీన కడియం మండలం జేగురుపాడు వద్ద అక్రమంగా గంజాయిని పుచ్చకాయలు, తవుడు బస్తాల మాటున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెండు ఐషర్ వ్యాన్లు, ఒకలారీ, రెండు కార్లను, రెండు కేజీల చొప్పున 158 పాలి థిన్ ప్యాకెట్లలో ఉన్న రూ. 1.50 కోట్ల విలువ చేసే 4 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ రెడ్డి గుంటూరు జిల్లా నర్సరావుపేటమండలం రామిరెడ్డిపేటకు చెంది న పాములపర్తి శ్రీనివాసరావు అనే మధ్యవర్తి ద్వారా హైదరాబాద్‌లోని చౌహాన్‌కు గంజాయి పంపిస్తున్నాడు. ఈ కేసులో నర్సరావుపేటకు చెందిన షేక్ సుభాని, రాజమహేంద్రవరం బొమ్మూరు కాలనీకి చెందిన చోడవరపు రాజేష్, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
'రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు'
హైదరాబాద్: సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహించలేదంటూ ఆయన బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రశాంతంగా ఉండాలని రంగనాథ్ ఒంటరిగా ఉండేవారని చెప్పారు. రంగనాథ్ శనివారం ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన సంగతి తెలిసిందే. రంగనాథ్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల క్రితం భార్య మరణించాక ఒంటరిగా ఉంటున్న రంగనాథ్.. ఒంటరి తనం, ఆర్థిక ఇబ్బందులతోనే మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రంగనాథ్ భౌతికకాయానికి గాంధీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పోస్టుమార్టం పూర్తియినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తరలించనున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బన్సీలాల్ పేటలో రంగనాథ్‌కు అంత్యక్రియలు జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కమలాపురంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం
వైఎస్సార్(కమలాపురం): కమలాపురం మండలం కోగటం గ్రామ శివారులో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి శవం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఊపిరాడకే యాత్రికుల మృతి
పుష్కరఘాట్ దుర్ఘటనపై వెల్లడించిన పోస్టుమార్టం నివేదిక సాక్షి, రాజమండ్రి: పుష్కరఘాట్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో దుర్మరణం పాలైన 27 మందీ ఊపిరి ఆడనందువల్లనే మృతి చెందారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మృతదేహాలపై ఎటువంటి గాయాలూ లేవని నివేదికలో పేర్కొన్నారు. పుష్కరాల ప్రత్యేక వైద్యాధికారి నాయక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అనారోగ్యంతో నలుగురి మృతి అనారోగ్యంతో నలుగురు యాత్రికులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మంగళవారం మరణించగా, రెండో రోజైన బుధవారం పుష్కరఘాట్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జల్లు అప్పలనర్సమ్మ(70) సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలపై ఆభరణాల తస్కరణ పుష్కరఘాట్ తొక్కిసలాటలో నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బొమ్మిశెట్టి అనసూయమ్మ మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. ఆమె కుమారులు ‘మా అమ్మ వంటిపై ఆరు కాసుల బంగారం ఉండాలి. అది ఇప్పుడు కనిపించడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కూడా మృతుల బంధువులు పలువురు తమ వారి ఆభరణాలు కానరావడంలేదని చెప్పారు. విషాదంలో ఉన్న బంధువులెవరూ నగల కోసం ఆరాటపడకపోవడంతో ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. -
నేటి మధ్యాహ్నం జానకిరామ్ అంత్యక్రియలు
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో జానకిరామ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. పోస్ట్‌మార్టం ప్రాధమిక నివేదికను వైద్యులు వెల్లడించారు. జానకిరామ్ తల, ఛాతి, కుడిచెయ్యి, కడుపులో గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. -
జానకిరామ్ మృతదేహం హరికృష్ణ ఇంటికి తరలింపు
హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మృతదేహాన్ని మసబ్‌ట్యాంక్ సమీపంలోని నందమూరి హరికృష్ణ ఇంటికి తరలించారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జానకిరామ్ మృతదేహాన్నిఅతని సోదరుడు కల్యాణరామ్ కోదాడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ జనార్ధన్, డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో వైద్యుల బృందం పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఉస్మానియా వైద్యుల పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం జానకిరామ్ తలకు, చాతికి, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కుడి చేయి, కుడి కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పక్కటెముకలు విరిగి రక్త సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. ** -
దంపతులను బలిగొన్న మనస్పర్థలు
సింగరాయకొండ : చిన్నపాటి మనస్పర్థలు దంపతులను బలిగొన్న సంఘటన సింగరాయకొండలో విషాదం నింపింది. ఆ వివరాల్లోకెళ్తే... సింగరాయకొండ ఇస్లాంపేటకు చెందిన కుంచాల శ్రీను (55), అంకమ్మ (50) దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా అమ్మవారి కొలుపుల సందర్భంగా ఇటీవల సింగరాయకొండ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కాగా, కొలుపుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూసుకునేందుకు శ్రీను గత గురువారం మళ్లీ సింగరాయకొండ బయలుదేరాడు. ఆ సమయంలో తాను కూడా వస్తానని అంకమ్మ అడిగింది. అయితే, అతను నిరాకరించి ఒంటరిగా వచ్చేశాడు. ఆ వెంటనే శ్రీనుకు తెలియకుండా అంకమ్మ కూడా సింగరాయకొండ వచ్చింది. తనకు చెప్పకుండా వచ్చినందుకు ఆమెపై శ్రీను ఆగ్రహించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీనిపై మనస్తాపానికి గురైన అంకమ్మ శుక్రవారం రాత్రి స్థానిక తమ నివాసంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ సోదరిచావుకు బావ శ్రీను కారణమంటూ అంకమ్మ సోదరులు తన్నీరు కృష్ణ అలియాస్ రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు అలియాస్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య ఆరోపించారు. దీనిపై తీవ్రమనస్తాపానికి గురైన శ్రీను.. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం బజారుకని వచ్చి టీ తాగాడు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం పక్కన హాస్టల్ కోసం నిర్మిస్తూ నిలిచిపోయిన భవనంలోకి వెళ్లి మెట్లకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని జేబులో సిగరెట్ ప్యాకెట్ అట్టపై ‘రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య, నాకు కాలం’ అని రాసి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనస్పర్థల కారణంగా రెండు రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో వారి ముగ్గురు కుమారులతో పాటు బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. -
ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
చిలకలూరిపేట : తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖననం చేసిన 10 రోజుల అనంతరం సమాధి నుంచి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకాకు చెందిన బాబర్ సిద్ధునాథ్ దేవినాథ్ తన భార్య బాబర్ పంచెపుల(30)తో కలసి సాయిబాబా చిత్రపటం బండిపై ఏర్పాటు చేసుకొని వివిధ రాష్ట్రాల్లో బిక్షాటన చేస్తుంటారు. వీరికి గణేష్, రమేష్ అనే ఇరువురు సంతానం. ఈ నెల ఎనిమిదో తేదీ చెన్నై నుంచి చిలకలూరిపేట పట్టణానికి భార్యాపిల్లలతో వచ్చాడు. ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డు పక్కన సామగ్రి ఉంచాడు. భార్య పంచెపుల అనారోగ్యానికి గురయ్యిందంటూ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించాడు. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలసి ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డుపక్కన నిద్రపోయారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 గంటల సమయంలో పంచెపుల మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని పట్టణంలోని శ్మశానవాటికలో ఖననం చేసి వెళ్లిపోయాడు. అయితే మృతిరాలి తల్లి చంద్రాబాయి తన అల్లుడే కుమార్తెను కొట్టి చంపి ఉంటాడని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయడంతో గురువారం పోస్టుమార్టం నిర్వహింపచేశారు. కుమార్తె మృతి చెందిన విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకురాలేదని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం! కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఇంటూరి రామచంద్రబాబు, తహశీల్దార్ జీవీఎస్ ఫణింద్రబాబు, అర్బన్ సీఐ జి చెంచుబాబు, ఎస్ఐ అసన్, ఆర్ఐ యలమంద, వీర్వోలు అప్పారావు, సైదా, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
నా అనే వారు ఉన్నా...
రోడ్డుపైనే తుదిశ్వాస విడిచిన వృద్ధుడు హసన్‌పర్తి : నా అనే వారు ఉన్నప్పటికీ ఆ ముదసలి రోడ్డుపైన తుది శ్వాస విడిచాడు. తొలుత పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా భావించి, పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వృద్ధుడి ఆచూకీ తెలిసింది. నగర పరిధిలోని ముచ్చర్ల ప్రాంతానికి చెందిన దావ వెంకటయ్య(70)గా గుర్తించారు. కొంతకాలంగా ఆయన మతిస్థిమితం కోల్పోయూడు. అతడికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన తండ్రికి చికిత్స చేయించేందుకు వారి వద్ద చిల్లి గవ్వ లేదు. 15 రోజుల క్రితం వెంకటయ్య ఇంటి నుంచి వెళ్లినప్పటికీ... గాలించేందుకు డబ్బులు లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లలేదు. కూలీ చేస్తే కాని పూట గడవని పరిస్థితి. తండ్రి వెంకటయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కుమారుడు... అప్పు చేసి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాడు. -
ముంచింది నిర్లక్ష్యమే..!
- ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నేతల పోస్ట్‌మార్టం - స్వయంకృతాపరాధం.. - కారు స్పీడే కారణం - టీపీసీసీకి డీసీసీ నివేదిక సాక్షి, మహబూబ్‌నగర్: అధికార పక్షం కాంగ్రెస్ జిల్లాలో ఆశిం చిన స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలే కొంపముంచాయనే అభిప్రాయానికి వచ్చారు. అందువల్లే జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు రెండోస్థానం లభించిందని.. కొన్నిచోట్ల స్వల్పఓట్ల మెజార్టీతోనే ఓడిపోయామని నివేదికలో జిల్లా కమిటీ పేర్కొంది. మరికొన్ని నియోజకవర్గాల్లోనైతే చివరివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం వంటి విషయాలు కూడా నష్టాన్ని కలుగజేశాయని వివరించింది. 2009 ఎన్నికల్లో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత ఎన్నికల్లో కంటే ఒక సెంబ్లీ స్థానాన్ని అదనంగా సాధించుకున్నప్పటికీ.. చేరుకోవాల్సిన లక్ష్యాన్ని అధిగమించలేకపోయామని నివేదికలో పేర్కొంది. కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లో మూడోస్థానం, మహబూబ్‌నగర్‌లో నాలుగోస్థానానికి పార్టీ పడిపోవడానికి అనేక కారణాలను విశ్లేషించింది. నియోజకవర్గాల వారీగా.. మహబూబ్‌నగర్‌లో చివరివరకు అభ్యర్థి ఎంపికలో అధిష్టానవర్గం అవలంభించిన ఊగిసలాట ధోరణి, కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన ఒక నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం వంటి విషయాల నేపథ్యంలోనే నాలుగో స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లినట్లు తేల్చింది. - నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పార్టీకి చెందిన కొందరు నాయకులు పలు ప్రలోభాలకు తలొగ్గి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కొంత నష్టం కలిగించిందని పేర్కొంది. కల్వకుర్తి నియోజకర్గంలో ఓ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించకపోవడం తీవ్రఇబ్బందికి గురిచేసినట్లు ప్రస్తావించారు. - షాద్‌నగర్, జడ్చర్ల, కొల్లాపూర్, దేవరకద్ర, అచ్చంపేట నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గాలి బాగా వీయడం కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. నారాయణపేటలో కొత్త వారికి టికెట్ ఇవ్వడం వల్ల మొదటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారు సహాయ నిరాకరణ చేయడంతో ఇక్కడ ఓడిపోయినట్లు వివరించారు. - కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని టీఆర్ఎస్ బరిలో నిలపడం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని నాయకులు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు పార్టీ నుంచి వలస వెళ్లినప్పుడు కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులను ఆ నియోజకవర్గంలో కాపాడుకోవడంలో విఫలమవడం వంటి అంశాలు తీవ్రనష్టానికి గురిచేసినట్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో చతికిలపడిన టీడీపీ గెలుపొందిందని ఆ నివేదికలో పీసీసీ ఆవేదన వ్యక్తం చేసింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ తరువాత కారణాల నేపథ్యంలోనే తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొంది. ఈ గుణపాఠాల వెల్లువలో జిల్లాలో కాంగ్రెస్‌ను సంస్థాగతపరంగా భవిష్యత్‌లో మరింత పటిష్టం చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగుతామని ఆ నివేదికలో డీసీసీ వివరించింది.