కమలాపురం మండలం కోగటం గ్రామ శివారులో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి శవం స్థానికుల కంటపడింది.
వైఎస్సార్(కమలాపురం): కమలాపురం మండలం కోగటం గ్రామ శివారులో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి శవం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.