deadbody found
-
తల లేకుండా మహిళ మృతదేహాం.. యూపీలో కలకలం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తలలేకుండా.. నగ్నంగా గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. కాన్పూర్ సమీపంలోని గుజైనా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం మహిళ నగ్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలిపై అత్యాచారం చేసి, హత్యచేసి రహదారిపై పడేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. అయితే ఆమె ఎవరు? అనేది ఇంకా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.బుధవారం ఉదయం 5 గంటలకు తలలేని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాం పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలం దగ్గర ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు కానీ.. హైవేకి అవతలి వైపున ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కొన్ని గంటల ముందు అలాగే ఉన్న ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. ఫుటేజీలో మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపించగా.. మృతదేహానికి సమీపంలోనూ బూడిద రంగు దుస్తులముక్కలు కనిపించాయని పేర్కొన్నారు. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిల్లాలో మహిళ మిస్సింగ్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: శ్రుతి జీవితంలో మరో పెను విషాదంమరోవైపు ఘటనా స్థలిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి, ఆమె దంతాలు, ఎముకల నుంచి నమూనాలను సేకరించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా నేరమా? బాధితురాలు స్థానిక మహిళేనా? వేరే ప్రాంతానికి చెందింది అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరిగిన మరో షాకింగ్ ఘటన ఇది.. తల లేకుండా.. నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని కాన్పూర్ జాతీయ రహదారిపై గుర్తించారు.. ఈ అంశంపై నిప్పక్షపాతంగా విచారణ జరిపించి.. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా నిందితులకు కఠిన శిక్ష విధించాలి’ అని డిమాండ్ చేశారు. -
బీజేపీ ఎంపీ ఇంట్లో బాలుడు మృతి.. ఏం జరిగింది?
గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అసోంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ఇంట్లో ఓ బాలుడి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. అసోంలోని సిల్చార్ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో పదేండ్ల బాలుడి మృతదేహం లభించింది. అతని మెడచుట్టూ బట్ట చుట్టి ఉన్నది. మృతుని తల్లి ఎంపీ ఇంట్లో గత రెండున్నరేండ్లుగా డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఇక, బాలుడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రాజ్‌దీప్ రాయ్ మాట్లాడుతూ.. తన ఇంట్లో బాలుడి మృతదేహం వేలాడి ఉన్న స్థితిలో కనిపించిందన్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పుకొచ్చారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. కాగా, బాలుడు ఎలా చనిపోయడనేది తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు.. బాలుడిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Assam | A 10-year-old boy allegedly died by suicide by hanging himself. My staff called the police they broke open the locked room and took the body to the medical college, but he was declared dead. I immediately called SP Numal Mahatta and urged the police to follow SOPs for… pic.twitter.com/blbKG6KbOE — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: ఘోర ప్రమాదం.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. -
అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలోని పెదపులిపాక గ్రామ శివారు డొంకరోడ్డులో బుధవారం తెల్లవారు జామున ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరుపాలేనికి చెందిన సుధాకర్, రూతమ్మలు విజయవాడ సున్నపుబట్టీల వద్ద ఉంటున్నారు. సుధాకర్ వాచ్‌మేన్‌గా పని చేస్తాడు. వారి కుమారుడు జమ్మలమూడి జీవన్(21) విజయవాడ వన్‌టౌన్‌లోని పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్‌కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం జీవన్ మిత్రుడు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్న జీవన్.. మిత్రుడి యాక్టీవా తీసుకుని బయటకొచ్చాడు. ఆ తర్వాత పెదపులిపాక శివారులోని డొంక రోడ్డులో కాలిపోయి శవమై కనిపించాడు. జీవన్‌ను ఎవరైన పథకం ప్రకారం హత్య చేశారా.. లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా.. అనే విషయం మిస్టరీగా మారింది. ఘటనపై పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి పలు విషయాలు సేకరించారు. జీవన్ మంగళవారం రాత్రి 12:20 గంటలకు మిత్రుడి వాహనంపై రెస్టారెంట్ నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి యనమలకుదురు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సీసాలో రూ.100 పెట్రోల్ పోయించుకున్నాడు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్ వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి 1.40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. రూ.12 వేలు ఈఎంఐ డబ్బు వాడుకున్నాను.. ఇంటికి రావడం లేదు.. అమ్మ సారీ.. అని చెప్పాడు. ఆ తర్వాత జీవన్ ఫోన్ పని చేయలేదు. అంతకు ముందు రోజే జీవన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో.. దిస్ ఈజ్ లాస్ట్ డే. అని పెట్టగా మిత్రులు ఎగతాళి చేశారు. దీనికి జీవన్.. రాత్రి చూస్తారుగా అని పోస్టు పెట్టాడు. ఈ విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. జీవన్ మృతదేహం వద్ద ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రాత్రి పార్టీలో ఉన్న మిత్రులను పోలీసులు ప్రశి్నస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: సీరియల్ రేపిస్ట్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..) -
YMCA బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి
-
చెన్నై.. భర్త మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే..
సాక్షి, చెన్నై: చెన్నై పురసైవాక్కంలో తాళం వేసి న ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న భర్త మృతదేహంతో భార్య రెండు రోజులు గడిపిన ఘటన సంచలనం కలిగించింది. వివరాలు.. చెన్నై పురసైవాక్కం వైకోకారన్ వీధికి చెందిన అశోక్‌బాబు (53). ఇతను ఆంబూరులోని లెదర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య పద్మిని (48), కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమై చెన్నై నుంగంబాక్కంలో ఉంటోంది. కుమారుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు. కాగా పద్మిని 2011 నుంచి మానసిక రుగ్మతకు చికిత్స పొందినట్లు తెలిసింది. భర్త అశోక్‌బాబు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అశోక్‌బాబు కుమారుడు ఈనెల 22న ఇంటికి ఫోన్ చేయగా ఎవరూతీలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూశాడు. లోపల తలుపు వేసి ఉండడంతో వేప్పేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అశోక్‌బాబు మృతి చెంది కుళ్లిన స్థితిలో పడి ఉన్నాడు. అతని పక్కనే పద్మిని కూర్చొని ఉంది. పోలీసులు అశోక్‌బాబు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. -
రామడుగులో విషాదఛాయలు
సాక్షి, హాలియా: రామడుగు గ్రామం ఒక్కసారిగా కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. గోదావరి లాంచీ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాశం తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారనే వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలై కంటిమీద కునుకులేకుండా పోయింది. తమ కుమారుడి ఆచూకీ లభించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఆశపడ్డ కుటుంబ సభ్యులకు పాశం తరుణ్‌రెడ్డి(27) విగతజీవిగా మారి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రామడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుచ్చులూరు సమీపంలో గోదావరి నదిఒడ్డుకు చేరిన తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఏపీ ప్రభుత్వం వారి బంధువులకు తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని అప్పగించింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకుని మంగళవారం రాత్రి 12 గంటలకు గ్రామానికి తీసుకురావడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. విగతజీవిగా మారిన తరుణ్‌రెడ్డిని చూసి రామడుగు వాసులు ఘోల్లుమన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిన్నకుమారుడు తరుణ్‌రెడ్డి ఇక తిరిగిరానిలోకానికి వెళ్లాడని తల్లిదండ్రులు గుం డెలవిసెలా రోదించారు. మృతదేహాన్ని పూర్తిగా వస్త్రంలో చుట్టి తీసుకురావడంతో వారు చూసి తట్టుకోలేక పోయారు. తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. బుధవారం ఉదయం రామడుగులో కుటుంబ సభ్యులు తరుణ్‌రెడ్డికి అశ్రనయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. తరుణ్‌రెడ్డి కడసారి చూపుకోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో రామడుగు శోకసంద్రంగా మారిపోయింది. నాలుగు రోజులైనా లభించని సురభి రవీందర్ ఆచూకీ.. పాపికొండల పర్యటనకు వెళ్లి లాంచీ ప్రమాదంలో గోదావరిలో గల్లంతయిన హాలియా పట్టణానికి చెందిన సురబి రవీందర్ ఆచూకీ లభించలేదు. నాలుగు రోజులు గడిచినా రవీం దర్ ఆచూకీ తెలియకపోవడంతో.. అతని జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కచ్చలూరులోనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ దొరకకపోవడంతో హాలియాలో వారి తల్లితండ్రులు సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మి ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు నేతల పరామర్శ.. రామడుగు గ్రామానికి తరుణ్‌రెడ్డి మృతదేహం తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పలువురు నాయకులు గ్రామానికి చేరుకుని తరుణ్‌రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్ మజ్జిగపు వెంకట్రామ్రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, సైదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. -
గోదారి తీరం.. కన్నీటి సంద్రం
పశ్చిమగోదావరి, పెరవలి: స్నానాల కోసం గోదావరిలో దిగిన యువకుల్లో ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు అధికారులు, మత్స్యకారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకు విడియాల వంశీ సాయినాథ్, విజ్జు సాయికిరణ్, ముత్యాల మణికంఠ మృతదేహాలు కాకరపర్రులో లభ్యమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి గాలించినా ఆచూకీ లభించలేదు. ఉదయం గాలింపు మరింత ఉధృతం చేయడంతో పాటు ఘటనా స్థలం వద్ద 10 మంది, కాకరపర్రు దిగువ నుంచి మరో 10 మంది వలలు వేస్తూ గాలించారు. ఎట్టకేలకు యువకులు గల్లంతైన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాల కోసం బంధువులు, స్నేహితులు రాత్రి తెల్లవార్లు ఇసుకతెన్నెలపై ఎదురుచూస్తూ కన్నీటితో కాలం వెల్లదీశారు. ఉదయం 7 గంటలకు.. ఉదయం 7 గంటలకు ఘటనా స్థలం నుంచి 200 మీటర్ల దూరంలో విడియాల వంశీ సాయినాథ్ మృతదేహం తొలుత లభ్యమైంది. తర్వాత విజ్జు సాయికిరణ్, ముత్యాల మణికంఠ మృతదేహాలు లభ్యమయ్యాయి. అధికారులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఆక్రందనలు యువకుల మృతి చెందారన్న విషయం తెలియటంతో వారి బంధువులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి వచ్చి కన్నీటిపర్యంతం అయ్యారు. తణుకు సీఐ డి.చైతన్య కృష్ణ చాకచక్యంగా వ్యవహరించటంతో పాటు ఎస్సై వి.జగదీశ్వరరావు, తహసీల్దార్ సీహెచ్ ఉదయభాస్కర్ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ గాలింపు చర్యలు చేపట్టడంతో మృతదేహాల ఆచూకీ త్వరగా లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. తాడేపల్లిగూడెం అర్బన్: వారం రోజుల్లో ఉద్యోగంలో చేరతాడని సంతోషిస్తున్న తల్లిదండ్రులకు తమ కుమారుడు మృత్యువాత పడటంతో తట్టుకోలేకపోతున్నారు. మంగళవారం పెరవలి మండలం కాకపరపర్రు వద్ద గోదావరి స్నానానికి వెళ్లిన నలుగురు యువకుల్లో ముగ్గురు మృతిచెందిన విషయం విధితమే. వారిలో వెజ్జు సాయికిరణ్ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వెజ్జు పూర్ణచంద్రరావు, తులసీ దంపతుల ద్వితీ య కుమారుడు. సాయికిరణ్ యానిమేషన్ కోర్సును అభ్యసించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల విశాఖకి చెందిన సంస్థలో ఉద్యోగం రావడంతో ఈనెల 22న విధుల్లో చేరాల్సి ఉంది. ఈలోపు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. పూర్ణచంద్రరావు పట్టణంలో ప్యారాచూట్ హెయిర్ ఆయిల్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. వ్యాపారరీత్యా వీరి కుటుంబానికి పట్టణమంతా స్నేహసంబంధాలు ఉండటంతో సాయికిరణ్ మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. బుధవారం సాయికిరణ్ మృతదేహాన్ని స్వగృహానికి చేర్చడంతో సన్నిహితులు, బంధువులు, మిత్రులు నివాళులర్పించారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగిన స్నేహితుడు విగత జీవిగా మారడంతో వారంతా కంటతడి పెట్టారు. సాయికిరణ్ సోదరుడు దినేష్ విజయనగర్‌లోని రెడ్డి ల్యాబ్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. -
కాలువలో యువకుడి మృతదేహం
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ కాలువలో తేలుతున్న యువకుడి మృతదేహాన్ని బుధవారం ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్ 8లో కాలువలో పడిఉన్న యువకుడి మృతదేహం గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. స్ధానికుల సమాచారంతో కాలువ నుంచి యువకుడి మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారని సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మనోజ్ కుమార్ పంత్ పేర్కొన్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని, కుడి చేయితో పాటు ఛాతీపై విజయ్ అనే టాటూ ఉందని, రెండు చేతులపై ఓం అని రాసిఉందని పంత్ తెలిపారు. బాధితుడికి 28 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆటోప్సీ నివేదిక వెలుగుచూస్తే యువకుడి మరణానికి స్పష్టమైన కారణం తెలుస్తుందని, ప్రస్తుతం బాధితుడిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
సాక్షి, ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపల్లి గ్రామంలో పండగపూట విషాదం నెలకొంది. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన కొడారి రాములు(32) అనే వ్యక్తి మృతుడై కనిపించాడు. గ్రామంలో ఉన్న పత్తి చేనులో సోమవారం ఉదయం శవమై కనిపించాడు. అయితే ఇతడిని ఎవరో హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
మూడుకు చేరిన మృతుల సంఖ్య
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఉలిమెళ్ళ చెరువులో మరో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. సాయంత్రానికి రాంచరణ్, యశ్వంత్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, సోమవారం మరో మృతదేహం లభ్యమవడంతో ఈ సంఘటనలో మొత్తం ముగ్గురు మృతిచెందారు. -
కరీంనగర్లో దారుణం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణ సమీపంలోని బొమ్మకల్ ఫ్లైవర్ వద్ద సోమవారం ఉదయం సగం కాలిన మృతదేహావ లభ్యమైంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి అనంతరం దహనం చేశారా, లేక సజీవదహనం చేశారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుడి ఆనవాళ్లను బట్టి అతని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. -
కమలాపురంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం
వైఎస్సార్(కమలాపురం): కమలాపురం మండలం కోగటం గ్రామ శివారులో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి శవం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పుష్కరాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
కృష్ణా(గుడివాడ): గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తుండగా కాలుజారి గల్లంతైన కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన భార్గవ్‌దీక్షిత్ మృతదేహం లభ్యమైనట్లు బంధువులు తెలిపారు. శనివారం పుష్కరాల కోసం సఖినేటిపల్లి వెళ్లిన భార్గవ్ గల్లంతైన విషయం తెలిసిందే. రెస్క్యూ టీమ్ రెండు రోజులపాటు తీవ్రంగా గాలించగా సోమవారం ఘాట్‌కు కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని గుడివాడ తీసుకొచ్చారు. -
బీచ్ వద్ద ఆరుగురు యువకుల గల్లంతు
-
అప్పికొండ బీచ్ వద్ద ఆరుగురు యువకుల గల్లంతు
విశాఖ: విశాఖ జిల్లాలోని అప్పికొండ బీచ్ వద్ద ఆరుగురు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. సెలవురోజు కావడంతో వారు విహారానికి అప్పికొండ బీచ్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. అయితే గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. మృతుడు (8) ప్రసన్నగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు నితిన్, ఉపేంద్ర, భరత్ లను మత్స్యకారులు రక్షించగా, ఆచూకీ గల్లంతైన మరో ఇద్దరు రూపేష్, అఖిలేష్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే గల్లంతైన విద్యార్థులందరూ డీఏవీ పబ్లిక్ స్కూల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బావిలో చిన్నారి మృతదేహం లభ్యం
బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీముని మండలం కొత్తపల్లి గ్రామంలో పాడుబడిన బావిలో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. బావిలో చిన్నారి మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భీముని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిన్నారి శవాన్ని బావి నుంచి వెలికి తీయించారు. గ్రామస్తులను పాప విషయమై విచారించారు. అయితే పాప వివరాలు తెలియరాలేదు. -
బండరాళ్లతో మోది వ్యక్తి హత్య
నల్లగొండ: గుర్తుతెలియని వ్యక్తి (30)ని కొందరు దుండగులు బండరాళ్లతో మోది చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామపంచాయతి పరిధిలోని ఏడుకోట్లతండ సమీపంలో గొర్రెల కాస్తున్న వ్యక్తులకు ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వంటిపై ఉన్న దుస్తులు.. వేళ్లకు ఉన్న ఉంగరాలను బట్టి గొర్రెల కాపరిగా అనుమానిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పాలమూరుకు చెందిన కొందరు గొర్లకాపరులు సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో.. ఈ హత్య రెండు రోజుల కిందటే జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
డ్రైనేజీలో మృతదేహం లభ్యం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వెనక ఉన్న డ్రైనేజీలో ఒక మృత దేహాన్ని స్థానికులు కనుగొన్నారు. కరీంనగర్ టుటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు వావిలాలపల్లి కాలనీకి చెందిన కందుకూరి శ్రీనివాస్(45)గా గుర్తించారు. శ్రీనివాస్ గతంలో వ్యవసాయశాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేశాడు. సంవత్సరం క్రితం ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. తర్వాత మందుకు బానిసై రోజూ అదే పనిగా తాగుతున్నాడు. 2 రోజుల క్రితం డ్రైనేజీలో పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, జగిత్యాలలో ఉంటున్న భార్యాపిల్లలకు సమాచారం అందించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు.