సాక్షి, ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపల్లి గ్రామంలో పండగపూట విషాదం నెలకొంది. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన కొడారి రాములు(32) అనే వ్యక్తి మృతుడై కనిపించాడు. గ్రామంలో ఉన్న పత్తి చేనులో సోమవారం ఉదయం శవమై కనిపించాడు. అయితే ఇతడిని ఎవరో హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.