Peddapalli district
-
మధ్యాహ్న భోజనానికీ ఫేస్ రికగ్నిషన్!
కొత్తగూడెం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) డేటాను మధ్యాహ్న భోజన పథకా నికి కూడా ఉపయోగించాలని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దప ల్లి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సరిచేసి, మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేయాలని గత శనివారం ప్రభుత్వం ఆదేశించింది.దీంతో భద్రాద్రి కొత్తగూడెం, పెద్ద పల్లి జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, కోయ శ్రీహర్ష రెండు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, బిల్లుల చెల్లింపు తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పథకంలో మార్పుచేర్పులపై రాష్ట్రస్థాయిలో 12 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో భద్రాద్రి, పెద్దపల్లి కలెక్టర్లు, డీఈఓలతోపాటు కొత్తగూడెం ఎంఈఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నా రు. వీరు మరోమారు అధ్యయనం చేసి సంస్కరణలపై నివేదిక సమర్పించనున్నారు. బిల్లుల పెండింగే సమస్య..మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు సమకూరుస్తున్నాయి. వారానికి మూడుసార్లు కోడిగుడ్ల తో పాటు ఆకు, కూరగాయలతో మెనూ అమలు చేస్తున్నా రు. ఇటీవల మెనూలో మార్పులు చేసినా పూర్తిస్థాయిలో అమలు కావటంలేదు. ఈ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సకాలంలో బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో 54,200 మంది కార్మికులు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 2,150 మంది పని చేస్తున్నారు. ఈ జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి గతేడాది నవంబర్ నుంచి.. 9, 10 తరగతుల వారివి సెప్టెంబర్ నుంచి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వీరికి నెలకు రూ.3,000 చొప్పున ఇచ్చే గౌరవ వేతనాలు కూడా అందాల్సి ఉంది.కలెక్టర్ల నివేదికలోని అంశాలు⇒ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా నమోదు చేస్తున్నారు. ఇదే డేటాను మధ్యాహ్న భోజన బిల్లులకూ అనుసంధానం చేయాలి. దీనివల్ల రోజువారీగా ఎందరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందో తెలిసిపోతుంది. ⇒ ప్రస్తుతం 1 నుంచి 5 వరకు.. 6 నుంచి 8వ తరగతి వరకు ..9 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి మూడేసి బిల్లులు రూపొందిస్తున్నారు. అలాగే, కోడి గుడ్లకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేతన బిల్లు.. ఇలా ఆరు బిల్లులను రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. వీటి ఆధారంగా ఈ–కుబేర్ నుంచి కార్మికులకు బిల్లుల సొమ్ము అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే నెలల తరబడి బిల్లులు పేరుకుపోతు న్నాయి. దీంతో కొందరు వంట సిబ్బంది అప్పులు చేసి భోజనాలు వండిపెడుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా బిల్లుల తయారీ, చెల్లింపునకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను భోజన బిల్లులకు అనుసంధానిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కలెక్టర్లు నివేదికలో సూచించారు. -
తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు!
సాక్షి, పెద్దపల్లి: ‘గజ్జల లాగులను ధరించిన ఓదెల మల్లన్న దండాలో.. మమ్మేలు మా స్వామి దండాలో.. ఆలుమిలా తారడో బోలుమియా గారడో..’ అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేల్పును దర్శించేందుకు భక్తులు ఆ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు.. మల్లన్నగా.. ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందాడు. అదే పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం. ఆ ఆలయ చరిత్ర తెలుసుకుందాం.నాగలి చేసిన గాయంతో..పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా (Deep Forest) ఉండేది. ఆ రోజుల్లో స్వయంభూలింగంగా వెలసిన మహాశివుడిని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభంపై మునీశ్వరుల బొమ్మలు, నామం చెక్కి కనిపిస్తాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్దఎత్తున పుట్ట పెరిగింది. అయితే, చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా.. నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలింది. జరిగిన పొరపాటును ఓదెలు తెలుసుకొని, స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. దీంతో ఓదెలుకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా, అతడి పేరుతోనే భక్తులకు దర్శనం ఇస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభ వర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 1300 మధ్య కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో దక్షిణ దిశగా శ్రీభ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీవీరభద్రస్వామిని, క్షేత్రపాలకుడిగా శ్రీభైరవస్వామిని ప్రతిష్టించారు.మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామ చంద్రస్వామి విగ్రహాలుశ్రీసీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరిఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగా మల్లన్నస్వామి ఆలయానికి సమాంతరంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు.సంతానం కోసం టెంకాయ బంధనం‘గండాలు తీరితే గండదీపం పెడతాం.. కోరికలు తీరితే.. కోడెలు కడతాం.. పంటలు పండితే.. పట్నాలు వేస్తాం.. పిల్లాజెల్ల సల్లంగా ఉంటే.. సేవలు చేస్తాం’ అని స్వామివారికి భక్తులు మొక్కుకుంటారు. వచ్చే భక్తుల్లో చాలామంది సంతానం కోసం ‘టెంకాయ బంధనం’ కట్టి వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు. మల్లన్నను దర్శించుకున్న తర్వాతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఒగ్గుపూజారుల పట్నాలతో..ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులు (Devotees) స్వామివారి పేరిట పట్నం వేస్తారు. ఒగ్గుపూజారుల చేతిలో ఢమరుకాన్ని మోగిస్తూ శ్రుతిని తలుస్తుండగా స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మండపంలో ఒగ్గు పూజారులు గజ్జెలతో కుట్టిన లాగుల (నిక్కర్లు)తో పూసలు కట్టిన అంగీలు (చొక్కాలు), పూసల కుల్లాయి (టోపీ) సన్నని జాలిచెద్దరు, చేతిలో త్రిశూలం, దానికి చిరుగంటలు, మరోచేతిలో కొరడా (వీరకొల) వంటివి ధరించి భక్తి తన్మయత్వంతో పూనకాలతో ఊగుతూ, గంతులు వేస్తూ.. శివతాండవం చేస్తూ దేవున్ని ప్రత్యేకంగా కొలవడం విశేషం.పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాకఏటా సుమారు రూ.2 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవాలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.భక్తుడి పేరుతో దర్శనం చింతకుంట ఓదెలు అనే భక్తుడి పేరు మీద మల్లన్న క్షేత్రం విరాజిల్లు తోంది. శ్రీరాముడు కూడా మల్లన్నను దర్శించుకొని పూజలు చేశాడని ప్రతీతి. శ్రీశైలం, ఓదెల ఆలయం రెండు ఒకే సమయంలో నిర్మించడంతో తెలంగాణ శ్రీశైలం అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.– పంచాక్షరి, ఆలయ అర్చకులుబుధ, ఆదివారాల్లో రద్దీ ఉగాది పర్వదినం రోజున ఎడ్లబండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్దపట్నాలు, అగ్నిగుండాలు దాటడంతో ఏటా జాతర సాగుతుంది. ఆలయంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణాలకు సహకరించిన దాతలకు జాతర సమయంలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం.– బి.సదయ్య, ఈవో(403) -
మందలించారని ఉరేసుకున్నారు
యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం)/ గోదావరిఖని: అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని తండ్రి మందలించడంతో ఒకరు, పద్ధతి మార్చుకోవాలని తల్లి హెచ్చరించడంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీలో ఉంటూ, ఏఎల్పీ గనిలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు కొండిల్ల శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సాయి అవినాష్ (20) డిప్లొమా చదువుతూ వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యాడు.అతడి కోరిక మేరకు తండ్రి మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో చదివిస్తున్నాడు. ఈనెల 29న ఇంటికి వచ్చిన అవినాష్.. ఆదివారం రాత్రి బయటకు వెళ్తానని, బైక్ కావాలని తండ్రిని అడిగాడు, రాత్రి సమయంలో బయటకు వెళ్లద్దని, బైక్ ఇవ్వనని తండ్రి చెప్పడంతో కలత చెందిన అవినాష్.. తెల్లవారు జామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మరో ఘటనలో తల్లిమందలించిందన్న మనస్థాపంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ముక్క రోహక్(16) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. రోహక్ మార్కండేయ కాలనీలో నివాసం ఉంటూ ఎస్టీపీసీలోని సచ్దేవ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సరిగ్గా వెళ్లడంలేదు. కనీసం ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా రాయలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఆదివారం కూడా బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇలా చేస్తే కెరీర్ పాడవుతుందని, పద్ధతి మార్చుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన రోహక్ పెంట్‌హౌస్ ఇనుపరాడ్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. -
ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!
సాక్షి, పెద్దపల్లి: గుడి ఉంటే దేవుడు ఉండాలి. దర్శనం చేసుకునేందుకు భక్తులు రావాలి. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాలి. కానీ, ఈ గుడిలో దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు రారు. వెడ్డింగ్ ఫొటోషూట్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌లు, పిక్నిక్ల కోసం వచ్చే సందర్శకులు, పర్యాటకులతోనే గుడి కళకళలాడుతోంది. ఆ గుడి ఏంటి? విశేషాలు, చరిత్ర తెలుసుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఆండాలమ్మ గుడి కోసం.. 13వ శతాబ్దంలో జైనుల కాలంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్.. రాఘవాపూర్ సంస్థానా«దీశుల ఆదీనంలో ఉండేది. ఆయా సంస్థానాధీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు, ఆయన కుమారుడు లక్ష్మీకాంతరావు గుడికి అంకుర్పారణ చేసినట్లు చరిత్రకారులు, గ్రామస్తులు చెబుతున్నారు. తొలుత రంగనాయకస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనికి అనుబంధంగా 500 అడుగుల దూరంలో ఆండాలమ్మ దేవాలయం నిర్మించారు. ఈ రెండింటి మధ్య రోప్ వే నిర్మించి, దీనిద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి.. కల్యాణవేడుక జరిపించాలన్న ఆలోచనతో గుడి నిర్మించారు. దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందటంతో.. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. అనంతరం వారి వారసులు సైతం అమ్మవారి విగ్రహం ఏర్పాటపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో.. విగ్రహం లేకుండానే గుడి మిగిలిపోయింది. ఎత్తయిన కొండల మధ్య.. అద్భుత శిల్ప కళాసౌందర్యంతో.. దట్టమైన అడవి, చుట్టూ ఎత్తయిన పచ్చని కొండల నడుమ గుడి దర్శనమిస్తోంది. ప్రధాన గోపురంలో అమ్మవారు, గర్భగుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం నిర్మించారు. గోపురంపై జీవకళ ఉట్టిపడేలా చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి. మండపానికి కొద్దిదూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చేలా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, దేవత విగ్రహం లేకపోవడం, రంగనాయకుల స్వామి గుడి పరిధిలోని 439 ఎకరాల దేవాదాయ భూములు కాలక్రమంలో అన్యాక్రాంతమవడంతో.. ఈ గుడిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఇటీవల పల్లె ప్రకృతివనం కార్యక్రమంలో ఆండాలమ్మ గుడిచుట్టూ ఉన్న మూడెకరాల్లో మొక్కలు నాటి పార్క్ ఏర్పాటు చేశారు. దీంతో పురాతన ఆలయాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రదేశం వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌ల చిరునామాగా మారింది.అభివృద్ధి చేయాలిమా తాతల కాలంలో రాఘవపూర్ సంస్థానాదీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు ఆండాలమ్మ గుడి నిర్మించాడు. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో.. ఎవరో చనిపోవడంతో అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుడిని అభివృద్ధి చేస్తే బావుంటుంది.– అందె పోచమల్లు, గ్రామస్తుడుఅరకొర సౌకర్యాలు ప్రాచీన సంస్కృతి, శిల్పకళ ఉట్టిపడేలా గుడి నిర్మించారు. అనివార్య కారణాలతో ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ప్రస్తుతం అరకొర సౌకర్యాలు ఉన్నాయి. అయినా, వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్‌ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు, దర్శకులు వస్తున్నారు. ఈ గుడితోపాటు పక్కనే ఉన్న రంగనాయకులస్వామి ఆల యం, సబ్బితం జలపాతం, రామగిరి ఖిలాతో టూరిజం సర్క్యూట్ నిర్మించి, అభివృద్ధి చేస్తే బాగుంటుంది. – నల్లగొండ కుమార్, స్థానికుడు -
Harshitha: కామన్ మ్యాన్ ఫ్రెండ్..!
ఆలోచించాలేగానీ.. శతకోటి సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు ఉంటాయి. మామయ్యను అనారోగ్యానికి గురి చేసిన సమస్యపై దృష్టి పెట్టిన హరిత ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుంది. శాస్త్రప్రపంచంలో తొలి అడుగు వేసింది...పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన హర్షిత చిన్ననాటి నుంచి తెలివైన విద్యార్థి. జెడ్పీ హెచ్ఎస్ చందనాపూర్లో చదువుతుండేది. క్రమం తప్పకుండా బడికి వచ్చే హర్షిత ఒకసారి వరుసగా వారంరోజులు రాలేదు. ఆ తరువాత బడికి వచ్చిన హర్షితను సైన్స్ టీచర్‌తో పాటు క్లాస్ టీచర్‌గా ఉన్న సంపత్ కారణం అడిగారు.తన మామయ్య వెల్డింగ్ పనిచేస్తాడని, వెల్డింగ్ పొగ పీల్చి ఊపిరితిత్తులు జబ్బు పడ్డాయని, ఆయనకు సహాయంగా ఉండేందుకు స్కూలుకు రాలేదని చెప్పింది. ‘మామయ్య మరోసారి జబ్బు పడకుండా ఏదైనా చేయాలని ఉంది’ అని తన మనసులోని మాట చెప్పింది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో హరిత ఒక హెల్మెట్ తయారుచేసింది. చిన్న ఫ్యాన్ అమర్చి రూపొందించిన ఈ హెల్మెట్ వెల్డింగ్ సమయంలో పొగను ముఖం వరకు చేరనివ్వదు. హరిత రూపొందించిన హెల్మెట్ చూసి సైన్స్ టీచర్ ఆశ్చర్యపోయారు. హరితను అభినందించారు.తొలుత ప్రోటోటైప్‌గా రూపొందించిన ఈ హెల్మెట్‌ను ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో మరింత మెరుగు పరిచింది. హెల్మెట్‌కు ఒక సెన్సార్ బిగించి, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి ముఖం పైకి పొగ రాగానే హెల్మెట్‌పై ఉన్న ఫ్యాన్ దానంతట అదే తిరిగేలా డిజైన్ చేసింది. సిమెంటు, ఇటుక, పిండిమర.... మొదలైన పరిశ్రమలలో పని చేసే కార్మికులు, నిరంతరం దుమ్ములో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా రక్షణ ఇస్తుంది. దీనికి ‘కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్’గా నామకరణం చేసింది. ఈ హెల్మెట్ జపాన్ సకురా ఇంటర్నేషనల్ సైన్స్ప్రోగ్రాం, ఇండియన్ ఇంటర్నేషన్ ఇన్నోవేషన్ప్రోగ్రాం, ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ప్రోగ్రామ్లకు ఎంపికైంది.స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్‌బాటిల్.కరోనా టైమ్‌లో స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్ బాటిల్‌ను తయారు చేసింది హర్షిత. ఈ బాటిల్‌ను మూడు అరలుగా విభజించారు. మొదటి అరలో శానిటైజర్, రెండో అరలో తాగునీరు, మూడో అరలో సబ్బు/స్నాక్స్ పెట్టుకునేలా ఈ బాటిల్‌ను రూపొందించింది. ప్రతీ అరగంటకు ఒకసారి నీరు తాగే విషయాన్ని మనకు రెడ్‌లైట్‌తో లేదా వైబ్రేషన్, సౌండ్ సదుపాయాల ద్వారా గుర్తు చేస్తుంటుంది. హర్షిత కరీంనగర్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. – బాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
జంట గ్రామాల ‘ఐ’కమత్యం
సాక్షి, పెద్దపల్లి: ఆయుష్షు అరవై ఏళ్లు ఉందనుకుంటే.. మరణానంతరం మన కళ్లకు.. మరో అరవైఏళ్లు లోకాన్ని చూసే అదృష్టం కల్పించవచ్చని ఆలోచించారు ఆ జంట గ్రామాల ప్రజలు. పుట్టుకతో చూపు పోయినవారు కొందరు, ప్రమాదవశాత్తు కళ్లు పోయినవారు మరికొందరు.. వారికి జీవితమంతా చీకటే.ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా.. చనిపోయిన తర్వాత కూడా కళ్లకు జీవితాన్నివ్వాలన్న గొప్ప ఆలోచన వారిలో తట్టింది. వెరసి ఆ ఊరు ప్రజలంతా మూకుమ్మడిగా నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఓదెల, అబ్బిడిపల్లి గ్రామాలపై స్ఫూర్తిదాయక కథనమిది. ఒక్కరి కృషితో.. ఒక్కొక్కొరుగా కదలివచ్చి పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఆర్ఎంపీ మేర్గు భీష్మాచారి స్థానికంగా ప్రాథమిక వైద్య చికిత్స చేస్తుండేవారు. ఆయన అత్తమ్మ చనిపోయినప్పుడు.. ఆమె కుమారులు నేత్రదానం చేశారు. నేత్రదానం అంటే.. పూర్తిగా కన్ను తీసుకుంటారనే అపోహలో ఉన్న ఆ ఆర్ఎంపీ.. కార్నియా సేకరణకు సహకరిస్తే.. మరొకరికి చూపు ఇచ్చిన వారవుతారని తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు కంటిచూపు పోయి ఇబ్బంది పడుతున్న ఎందరినో చూసిన ఆయన.. మరికొందరితో కలిసి 2015లో సదాశయం ఫౌండేషన్ స్థాపించారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తన వద్దకు వైద్య సాయం కోసం వచ్చేవారిని చైతన్యపరచటం ప్రారంభించారు. అదే స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరుస్తూ ఇప్పటివరకు దాదాపు 2,000 మందితో నేత్రదానానికి హామీపత్రాలిచ్చేలా కృషి చేశారు. ఒకరిని చూసి మరొకరు.. తొలుత ఓదెల మేజర్ గ్రామపంచాయతీలో ఒక్కొక్కరుగా నేత్రదానం చేసేందుకు ముందుకురాగా, వారిని చూసి పక్కనే ఉన్న అబ్బిడిపల్లి గ్రామస్తులు సైతం ముందుకొచ్చారు. ఓదెల గ్రామంలో చనిపోయిన 190 మంది నేత్రదానం చేశారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న సమీప అబ్బిడిపల్లి గ్రామస్తులు అదే స్ఫూర్తి కొనసాగిస్తున్నారు. 500. మంది ఉన్న గ్రామ జనాభా మూకుమ్మడిగా నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు. నేత్రదానం చేస్తామని.. 2022లో గ్రామ పంచాయతీలో తీర్మానించారు. తీర్మానం ప్రతిని కలెక్టర్‌కు ఇచ్చి గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. నేత్రదానంతోపాటు అవయవదానానికీ సదాశయం ఫౌండేషన్ ఆయా గ్రామాల్లో అవగాహన కలి్పస్తోంది. దీనికి కూడా ప్రజలు ముందుకు వస్తున్నారు.మా ఆయన కండ్లు ఇచ్చిన..మా ఆయన జింకిరి మల్లయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిండు. నాకు ఐదుగురు బిడ్డలు. మట్టిలో కలిసిపోవడం కంటే మరొకరికి కంటిచూపు ఇవ్వొచ్చని నా కొడుకు నిర్ణయించిండు. మా ఆయన కండ్లు దానం చేసినం. ఓదెల గ్రామానికి చెందిన సదాశయ ఫాండేషన్ వారికి అప్పగించినం. కళ్లదానం చేసేందుకు ఊరోళ్లందరం ఒక్కటైనం.– జింకిరి శాంతమ్మ, అబ్బిడిపల్లికొంటే దొరకనివి నేత్రాలు ఏది కొన్నా దొరుకుతుంది.. కానీ నేత్రాలు దొరకవు. అందుకే మా ఊరోళ్లందరం నేత్రదానం చేయాలని మూకుమ్మడిగా తీర్మానం చేసినం. ఈ క్రమంలో గ్రామంలో ఎవరు చనిపోయినా నేత్రదానం చేస్తున్నం. నేను కూడా నేత్రదానం చేస్తానని హామీ పత్రం ఇచ్చినసంస్మరణ సభలతో అవగాహననేత్రదానం, అవయవదానంపై ప్రజ ల్లోని అపోహలు తొలగించేందుకు మా సంస్థ కృషి చే స్తోంది. నేత్ర, అవయవ దానం చేసిన వారికి, దశ దినకర్మ రోజు మా సంస్థ సంస్మరణ సభలు నిర్వహిస్తోంది. అక్కడికి వచ్చే బంధువులు, మిత్రులకు అర్థమయ్యేలా వివరిస్తూ, మృతుల కుటుంబ సభ్యులను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందిస్తున్నాం. -
ప్రమాదంలో సుందిళ్ల పార్వతి బ్యారేజ్
-
చిన్నారిని చిదిమేసిన మానవ మృగం
సాక్షి, పెద్దపల్లి, సుల్తానాబాద్/సుల్తానాబాద్ రూరల్: గంజాయి మత్తులో ఓ మానవ మృగం రెచ్చిపోయింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణ హత్యకు ఒడిగట్టింది. జిల్లావాసులను ఉలికిపాటుకు గురిచేసిన ఈ దారుణ ఘటనపై స్థానికులు, పోలీసుల కథనమిలా.. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి చెందిన దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో నెలరోజులుగా కూలి పనికి కుదిరారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సమీప మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వలసకూలీ వినోద్ మాజ్హి ఆరేళ్ల చిన్నారిపై కన్నేశాడు.ఈ క్రమంలో గురువారం రైస్‌మిల్లు ఆవరణలో కూలీల కోసం నిర్మించిన గదుల ఎదుట బాలిక తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో పాపతో కలిసి దంపతులు ఇంట్లోకి వెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత భరించలేక దంపతులు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు చీకట్లో పాపను అపహరించాడు. అదే రైస్‌మిల్లు వెనకాల ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.తన బండారం బయటపడుతుందని భావించి పాప గొంతు నలిమి చంపి అక్కడే పొదల్లో పడేశాడు. కాగా, కొద్దిసేపటికి ఇంట్లోకి తల్లిదండ్రులు వచ్చి చూడగా.. ఓ పాప కనిపించలేదు. ఆందోళనతో సమీపంలో వెతికినా.. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్ పోలీసులకు చిక్కిన నిందితుడు ఈ క్రమంలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు.. గురువారం రాత్రి (శుక్రవారం వేకువజామున) సుమారు 2గంటల సమయంలో నిందితుడు వినోద్ మాజ్హి మిల్లు వద్ద తన బట్టలకు అంటిన మరకలను శుభ్రం చేస్తూ కనిపించాడు. అనుమానం వచి్చన పోలీసులు.. అతడిని విచారించగా విషయం మొత్తం చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.నిందితుడు పాపను తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డాగ్‌స్కా్వడ్ బృందం తనిఖీల్లో మరో ఇద్దరు నిందితులను అనుమానితులుగా గుర్తించగా పోలీసులు వారిని సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. మరోవైపు.. రాత్రి ముగ్గురూ కలిసి మద్యం, గంజాయి తాగామని, ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయామని, ఆ ఘటనతో తమకు సంబంధంలేదని ఇద్దరు అనుమానితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. కాగా, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.దద్దరిల్లిన తెలంగాణ చౌక్ అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనలో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ప్రజాసంఘాల నాయకులు తెలంగాణ చౌక్‌లోని రాజీవ్ రహదారితోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్ట్‌మార్టం గది ఎదుట బైఠాయించారు. చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని, బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించారు. -
ఆ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన అమానుష ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.మరో వైపు, నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. -
ప్రశ్నిస్తే.. గొంతు నొక్కారు!
సాక్షి, పెద్దపల్లి: చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తాను మాట్లాడితే, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే.. తన గొంతు నొక్కేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం పెట్టించారని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదేమని నిలదీశారు.బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికి ఓటేసినా.. సింగరేణిని ముంచేసి, కార్మికుల నోట్లో మట్టికొడతాయని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర.. ఈసీ పెట్టిన 48 గంటల నిషేధం అనంతరం శుక్రవారం రాత్రి రామగుండం పట్టణంలో తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నిషేధించిన నా గొంతు 48 గంటల తర్వాత మాట్లాడుతోంది. నేను ఏం చేశానని నా గొంతును నొక్కేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు రూ.375 కోట్లు విడుదల చేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మా పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. ఓ కాంగ్రెస్ నాయకుడు.. ‘ఇన్ని రోజులు దొబ్బితిన్నది చాలలేదా? పొయి నిరో«ద్లు, పాపడాలు అమ్ముకోండి’ అన్నడు. మీకు చేనేత కార్మికులు అంత చులకనగా కనపడుతున్నారా? అధికారంలో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా.. అని కోపంలో ఒక్కమాట మాట్లాడిన. వాళ్ల మాటలు ఈసీకి కనిపించవు కేసీఆర్ బస్సుయాత్ర చేపడితే కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. వాళ్లు కుమ్మకై నన్ను ఆగబట్టేందుకు నాపై నిషేధం పెట్టారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కేంద్ర మంత్రి అమిత్ షా రోజూ దేవుడి బొమ్మను చేతిలో, నెత్తిన పెట్టుకుని మాట్లాడితే ఎన్నికల సంఘానికి కనిపించదు. డైరెక్టుగానే హిందువులు, ముస్లింలని దేశ ప్రధాని మోదీ మాట్లాడినా కనిపించదు.రాష్ట్ర సీఎంని ప్రజ లకు ఇచ్చిన వాగ్ధానాల అమలు ఏదని మేం అడిగితే.. గుడ్లు పీకి గోళీలు ఆడుతం, పేగులు తీసి మెడలో వేసుకుంటం, పండబెట్టి తొక్కుతం అంటే సభ్యతగా ఉందా? కానీ చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని నేను మాట్లాడితే.. నా గొంతు నొక్కేశారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారు. పంటలు ఎందుకు ఎండాయి? ఐదు నెలల కింద రాష్ట్రం ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవరి చేతకానితనం దీనికి కారణం? ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 50వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడైనా పంటలు ఎండాయా? గత తొమ్మిదేళ్లు కడుపు నిండా కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంట్ కోతలు మొదలయ్యాయి.ఈ కోతలు ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి. గతంలో గోదావరిలో పైసలు వేయాలంటే నీళ్లు వెతికేలా ఉండేది. అలాంటి గోదావరిని సజీవంగా చేశా. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినం. ఇప్పుడు ఎందుకు రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. హామీల అమలు ఏది? కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటోంది. రైతు రుణమాఫీ అయిందా? రైతు కూలీలకు రూ.15 వేలు ఎక్కడ? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 వస్తున్నాయా? మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. సంతోషమే. మరి ఆటో కార్మికులు నష్టపో యి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆదుకోరా? ఆటోకార్మికులకు న్యాయం జరగాల్సిందే. వారి తరఫున బీఆర్ఎస్ పో రాడుతుంది. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒ ట్టేస్తున్నారు. పనిచేసేటోడు ఎవడైనా ఒట్టు పెట్టుకుంటడా? పెద్ద ప్రమాదం రాబోతున్నా.. సీఎం మాట్లాడట్లేదు.. ఇప్పుడున్న సీఎం కృష్ణా నదిని తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండు. గోదావరి నీళ్లు ఎత్తుకుపోతా, తమిళనాడు, కర్ణాటకలకు ఇస్తానని ప్రధాని మోదీ అంటుంటే.. చప్పుడు చేయడం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన తెస్తే.. నా ప్రాణం ఉన్నంత వరకు నీళ్లు తీసుకుపోనివ్వనని చెప్పిన. మరి ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక మతలబేంటో ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. దేశం అప్పుల పాలైంది. రూపాయి విలువ పడిపోయింది. మోదీ కంటే ముందున్న 14 మంది ప్రధానుల కాలంలో ఎన్నడూ ఇంత తక్కువకు పడిపోలేదు. పబ్లిక్ సెక్టార్ నాశనమైంది. అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. తెలంగాణలో 14 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. మన హక్కులను, మన సింగరేణిని కాపాడుకోవచ్చు.అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు కర్రువాల్చి వాత పెట్టాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ సింగరేణి కార్మికులు ఆలోచించాలి. మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి 100శాతం మన దగ్గరే ఉండే. కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, అది తీర్చలేక 49శాతం వాటాను అప్పజెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీయే. మేం సింగరేణికి లాభాలు తేవడానికి, కార్మికుల కోసం ఎన్నో మంచి పనులు చేశాం. సీపీఐ, సీపీఎం నాయకులను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా.. ధైర్యముంటే సమాధానం చెప్పాలి, సీఎంతో సమాధానం చెప్పించాలి.నాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చింది మేం కాదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 19వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కలి్పంచాం. సింగరేణిని లాభాల్లోకి తెచ్చేందుకు డైరెక్టర్లను ఆ్రస్టేలియా, ఇండోనేషియాలకు పంపి.. అక్కడ బొగ్గు గనులు తీసుకుని వెలికితీయాలనే ప్రయత్నం చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అదానీకి అప్పజెప్పి మన కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరిని గెలిపించినా సింగరేణి ప్రాంతాలు బొగ్గు అయ్యే పరిస్థితి. మీరు లేని లోటు కనిపిస్తోందిసారూ మీరు సీఎంగా ఉన్నప్పుడు మంచిగుండె. ఇప్పుడు మీరు లేని లోటు కనిపిస్తోంది. పచ్చగా ఉండే పల్లెలు మళ్లీ ఎండిపోతున్నాయి. మాకు దిక్కు, దిశ మీరే.. మీరు మళ్లీ వస్తేనే మా బతుకులు మారుతాయి. – రేణుక, గృహిణిమళ్లీ కరువు వచ్చిందిమీ పాలనలో పచ్చని పొలాలు చూసినం. ఇప్పుడు ఎండిపోయిన పంటలు కనిపిస్తు న్నాయి. మీ పాలన లేని లోటు కనిపిస్తోంది. రైతుబంధు రాలే దు. నీళ్ల కరువు వచ్చింది. మీరు రావాలె. మునుపటిలా కావాలె.. – బొల్లెడ సడవలి, భూపాలజిల్లామాకు అండగా నిలవాలికొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు కరువు ప్రారంభమైంది. మీ పాలనలో కల్యాణలక్ష్మి, దళి త బంధు పథకాలు వచ్చినయి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. మీ పాలనలో అందరికీ న్యాయం జరి గింది. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మాకు అండగా ఉండాలి.– కృష్ణప్రసాద్, యువకుడు -
పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం?
సాక్షి, పెద్దపల్లి: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ ప్రస్తుత ఛైర్మన్ పుట్టామధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి జడ్పీటీసీలు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాగా, బుధవారం స్టాండింగ్కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అసంతృప్త జడ్పీటీసీలు వేర్వేరు చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్ బాడీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మెజారిటీ బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. జిల్లాలోని 13 మంది జెడ్పీటీసీలకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇదీ చదవండి: ముఖేష్ గౌడ్ కొడుకు దారెటు.? -
ఓ జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలు, డబ్బు స్వాధీనం
-
పాడైనయి పెడ్తున్నరట ఇడ్లీలు...కోపంతోని రోడ్డెక్కిండ్రు విద్యార్థులు
-
పెద్దపల్లి రామగుండం నియోజకవర్గ రాజకీయ చరిత్ర
రామగుండం నియోజకవర్గం రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే, ఆర్టిసీ చైర్మన్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ ఓటమి చెందగా, టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ది పార్వర్డ్ బ్లాక్ టిక్కెట్ పై పోటీచేసిన కురుగంటి చందర్ విజయం సాదించారు. చందర్ 2014 ఎన్నికలలో పోటీపడి ఓడిపోయారు.కాని 2018 ఎన్నికలలో విజయం సాధించగలిగారు. ఆ తర్వాత చందర్ టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. చందర్‌కు 61400 ఓట్లు రాగా, సోమారపు సత్య నారాయణకు 34981 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే చందర్‌కు 26419 ఓట్ల మెజార్టీ రావడం ఒక ప్రత్యేకతగా భావించాలి. కాగా ఇక్కడ కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ఇరవైఆరువేలకు పైగా ఓట్లు వచ్చాయి. చందర్ మున్నూరుకాపు వర్గానికిచెందిన నేత. రామగుండం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009 ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందిన సోమారపు సత్యనారాయణ 2014లో టిఆర్ఎస్ పక్షాన గెలిచారు. 2009లో గెలిచిన తర్వాత కొంతకాలం కాంగ్రెస్ ఐలో ఉన్నా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రం అవడంతో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. గతంలో రామగుండం, మేడారం రిజర్వుడ్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. మేడారంలో పదిమంది ఎస్.సి.నేతలు గెలుపొందగా, జనరల్‌గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్లు గెలిచారు. మేడారం నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి నాలుగు సార్లు, టిడిపి మూడుసార్లు, టీఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. మేడారం, రామగుండం ఒకే నియోజకవర్గంగా భావిస్తే, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచినట్లవుతుంది. 1983లో ఇక్కడ గెలిచిన మాతంగి నరసయ్య 1989లో కాంగ్రెస్ఐ పక్షాన, 1999లో టిడిపి తరుపున గెలుపొందారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కరరావు గ్రూపులోను, 1996లో ఎన్.టి.ఆర్ టిడిపి పక్షాన ఉన్నారు. 1985లో మేడారంలో గెలిచిన మాలం మల్లేషం 1994లో కూడా గెలుపొందారు. 1972, 78లలో జి.ఈశ్వర్ గెలిచారు. ఈయన సీనియర్‌నేత, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన వెంకటస్వామికి సమీప బంధువు 1967లో ఇక్కడ గెలిచిన గడిపల్లి రాములు 1957,62లలో హుజూరాబాద్‌లో విజయం సాధించారు. మాతంగి నరసయ్య 1984లో నాదెండ్ల వెంట ఉన్నప్పుడు నెలరోజుల మంత్రిగా పనిచేసారు. మేడారం జనరల్ స్థానంగా ఉన్నప్పుడు 1962లో ఎమ్. రామగోపాలరెడ్డి ఇండిపెండెంటుగా గెలిచారు. ఈయన నిజామాబాదు నుంచి మూడుసార్లు లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. రామగుండం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బాసర నుంచి భద్రాచలానికి లాంచీ!
మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు. తీరం వెంట అడవి అందాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్‌ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంను కలుస్తాం.. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ -
రోడ్లపై ధాన్యం నిల్వలు, ప్రమాదాల భారిన వాహనాలు
-
బేగంపేట సభా వేదికపై ప్రధాని మోదీ
-
హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు: ప్రధాని మోదీ
PM Modi RFCL Visit: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రామగుండం పర్యటన అప్డేట్స్ 04: 39 PM రామగుండం బహిరంగ సభలో మోదీ ప్రసంగం ►సోదర, సోదరీమణులకు నమస్కారాలంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు ►ఈ సభకు వచ్చిన రైతులందరికీ నమస్కారాలు ►70 నియోజకవర్గాల్లో రైతు సోదరులు ప్రసంగం వింటున్నారు ►ఈ ఒక్కరోజే 10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ►రైల్వేలు, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ►గత రెండున్నరేళ్లుగా కరోనాతో పోరాడుతున్నాం ►సంక్షోభంలోనూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాం ►కష్టకాలంలోనూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం ►గత 8 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయి ►అభివృద్ధి పనుల మంజూరులో వేగం పెంచాం ►నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తున్నాం ►ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం ►రైతులు లైన్లలో నిలబడేవాళ్లు, లాఠీ దెబ్బలు తినేవారు ►ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో ఎరువులు కొరత తీరుతుంది ►ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం ►టెక్నాలజీ అప్‌గ్రేడ్ కాకపోవడంతో గతంలో ఈ కంపెనీ మూతపడింది ►కొత్త టెక్నాలజీతో కంపెనీ పునఃప్రారంభమయింది ►సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. ►బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ►హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు ►పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ►సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే ►కేంద్రం వాటా 49 శాతం మాత్రమే ►ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి ఉండదు 04: 22 PM భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను ప్రారంభించిన ప్రధాని భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి. 04: 07 PM ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆయన వెంట గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు. ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది. 03: 49 PM ► రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించిన ప్రధాని మోదీ 03: 09 PM ► రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ 2:47 PM ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో రామగుండం చేరుకోనున్నారు. 2:28 PM రామగుండం బయల్దేరిన ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శించి.. జాతికి అంకితం చేస్తారు. వర్చువల్‌గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 1:20PM బేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ ►భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం ►తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది ►తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు ►తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను ►మీరు ఒక యుద్ధం చేస్తున్నారు..ఒక పోరాటం చేస్తున్నారు ►తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు ►తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది ►తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది ►తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు ►తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు ►ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది ►బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది ►మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం ►గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది ►కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు ►1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు.. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు ►హైదరాబాద్ ఇన్ఫరేషన్ టెక్నాలజీకి కోట లాంటింది ►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది ►తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం ►కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు ►ఆ బూతులను నేను పట్టించుకోను ►బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ►నన్ను తిట్టినా పట్టించుకోను కానీ..తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు ►తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు ►పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు ►తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు ►డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారు ►బీజేపీ యువకుల పార్టీ.. పేదలకు అనుకూలంగా పాలన చేసే పార్టీ ►తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత 1:14 PM కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పీచ్ ►తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు ►ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు ►దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు ►సీఎం కేసీఆర్‌ది నిజాం రాజ్యాంగం ►సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది ►తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు ►తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది ►రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంది 01:12 PM ► షెడ్యూల్ కంటే ముందుగానే ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ. కార్యక్రమంలో వేదికపై మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్, డాక్టర్ లక్ష్మణ్, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముడు-మోదీతో కూడిన ఓ చిత్రపటాన్ని ప్రధాని మోదీకి బహూకరించిన బీజేపీ శ్రేణులు. 12:49 PM ► బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి తలసాని, బీజేపీ శ్రేణులు 12:46 PM ► కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి ప్రధాని మోదీ 12:40 PM ► ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళిసై బేగంపేటకు చేరుకున్నారు. ► ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున్న చేరుకుంటున్నాయి. ► తెలంగాణలోని రామగుండం పర్యటనలో భాగంగా.. దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సిన యూరియా డిమాండ్‌ను తీర్చేందుకు పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్(రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్) ప్లాంటును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేయనుంది. ► రామగుండం వేదికగానే.. దాదాపు రూ.1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్‌ను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. ► దాదాపు రూ.9,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్‌హెచ్ 765 డీజీకి చెందిన మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి సెక్షన్, ఎన్ హెచ్ 161 బీబీకి చెందిన బోధన్– బాసర–భైంసా సెక్షన్, ఎన్‌హెచ్ 353సీకి చెందిన సిరోంచా– మహాదేవపూర్ సెక్షన్లున్నాయి. ► తెలంగాణలోని రామగుండం పర్యటన కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ముందుగా చేరుకుంటారు. ► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బేగంపేట పరిసరాల్లో 1,500 మంది పోలీసులను మోహరించారు. మరో 100 కేంద్ర బలగాలు నిఘా నిర్వహిస్తున్నాయి. ► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్ బేగంపేట పరిసరాల్లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారు. ఆపై అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 12:25 PM ► ఏపీ విశాఖలో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. హైదరాబాద్‌కు ప్రయాణం అయ్యారు. పర్యటన సాగేదిలా.. ► ముందుగా బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ► ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ► ఆపై రామగుండం బయలుదేరతారు. ► RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శించి.. జాతికి అంకితం చేస్తారు. ► వర్చువల్‌గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ► అనంతరం రామగుండంలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. ► కార్యక్రమం ముగించుకుని.. రామగుండం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ► సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు -
పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టులు కలకలం
-
పెద్దపల్లి జిల్లా: నూతన కలెక్టరేట్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప్లాంట్
-
పాములు పడితే రూ.22 వేలు!
సాక్షి, మంచిర్యాల: వరదలతో పాముల బెడద ఏర్పడటంతో వాటిని పట్టేవారికి గిరాకీ ఏర్పడింది. మంచిర్యాల పట్టణం గోదావరి తీరంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలోకి కుప్పలు తెప్పలుగా సర్పాలు కొట్టుకొచ్చాయి. వారం రోజులుగా బురదను శుభ్రం చేస్తున్నప్పుడు ఇవి బయటపడుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని బురదను తొలగిస్తుండగా ఓ మహిళను పాము కాటు వేసింది. దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు పాములు పట్టేవారిని రప్పించారు. మూడు రోజుల పాటు పాములు పట్టేందుకు పెద్దపల్లి జిల్లా కల్వచర్లకు చెందిన శ్రీనివాస్, బెల్లంపల్లికి చెందిన సంజీవ్‌లకు రూ.22 వేలు చెల్లిస్తున్నారు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం నాలుగు పాములు పట్టారు. మరో రెండు రోజులు వీరి పని కొనసాగనుంది. ముంపు బాధితులకు కూడా సర్పాల బెడద ఏర్పడటంతో వారు పాములు పట్టేవారిని పిలిపించుకుంటున్నారు. -
Viral Video: పెద్దపల్లి జిల్లాలో బాహుబలి సీన్‌ను తలపించిన దృశ్యం
-
మంథనిలో వరద బీభత్సం: అంతెత్తు నీటిలో.. 3 నెలల బాలుడిని బుట్టలో పెట్టుకుని
సాక్షి, పెద్దపల్లి: వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబం తమ నెలల పసిపాపను వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటీ చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యక్ష్యంగా సాక్షాత్కరించిందీ దృశ్యం. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి. చదవండి: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం -
విడిచి ఉండలేక.. విడివిడిగా ఆత్మహత్య!
సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): వారిద్దరిదీ తెలిసీతెలియని వయసు. అయినా ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆ అమ్మాయి, అబ్బాయిల కులాలు వేర్వేరు. పెద్దలు వారించడంతో కలసి ఉండలేమని భావించి ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన సురువ్ రామస్వామి, శ్రీలత దంపతుల కుమారుడు శివ(18) తొమ్మిదో తరగతి, అదే గ్రామానికి చెందిన సిరిపురం కుమార్, పద్మ దంపతుల కూతురు సుస్మిత(17) పదోతరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. కొద్దిరోజులుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిని మందలించారు. పెళ్లిచేసుకునే వయస్సు కాదంటూ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా ఆ ప్రేమజంటలో మార్పు రాలేదు. ఆర్నెళ్ల క్రితం ఇద్దరూ కలసి హుజూరాబాద్‌లోని శివ అమ్మమ్మ ఇంటికి పారిపోయారు. శివ మేనమామ వారిద్దరినీ మందలించి సుస్మిత బంధువులకు సమాచారం ఇచ్చారు. హుజూరాబాద్ పోలీసుల సమక్షం నుంచి సుస్మితను ఆమె తల్లిదండ్రులు తమ గ్రామానికి తీసుకెళ్లారు. చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మూడ్రోజులపాటు అప్పటి నుంచి శివ హుజూరాబాద్‌లోనే ఉంటూ సుస్మితతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 12న శివ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వరంగల్‌కు, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అతడి మృతదేహానికి అదేరోజు సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. అనంతరం సుస్మిత సోమవారంరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. మంగళవారం వేకువజామున సమీప వ్యవసాయబావిలో శవమై తేలింది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రామగుండంలో 3.74 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్‌సిటీ(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో 2021–22 సంవత్సరం 3,74,728.32 టన్ను ల యూరియా ఉత్పత్తి అయిందని ఆ కర్మాగారం సీజీఎం విజయ్‌కుమార్ బంగార్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కర్మాగారం వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. దేశీయంగా ఎరువుల కొరత తీర్చడమే ఆర్ఎఫ్సీఎల్ ఉద్దేశం. ఈ ప్లాంట్‌లో ప్రతిరోజూ 2,200 టన్నుల అమ్మో నియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కర్మాగారం వాణిజ్య ఉత్పత్తుల్లో తెలంగాణకు 2,11,073.13, ఆంధ్రప్రదేశ్‌కు 1,00,321.11, కర్ణాటకకు 63,334.08 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల కొరత తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరించిందని, వాటిల్లో ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్‌సీఐ) కూడా ఒకటని తెలిపారు. -
ఆ ముగ్గురూ ఎక్కడ?
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదం నుంచి మంగళవారం ఓ కార్మికుడిని రెస్క్యూ టీం రక్షించింది. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ప్రమాదం జరిగి 40 గంటలవుతున్నా వారి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా సోమవారం ప్రమాదం జరిగింది. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్‌ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాజ్, శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. 40 గంటలుగా నీరు, ఆహారం లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. బొగ్గుపెళ్లలను తొలగించడానికి చాలా సమయం పడుతోంది. గల్లంతైన వారి ఆచూ కీ బుధవారం ఉదయం కల్లా తెలియొచ్చని భావిస్తున్నారు. 4 షిఫ్టులుగా వీడిపోయి షిఫ్టుకు 100 మంది గాలింపు చేపట్టారు. ఫ్రంట్ బకెట్ లోడర్ (ఎఫ్బీఎల్) ఆపరేటర్ జాడి వెంకటేశ్, ఓవర్‌మేన్ పిల్లి నరేశ్, బదిలీ కార్మికుడు రవీందర్, సపోర్టుమేన్ ఎరుకల వీరయ్య ప్రమాదం నుంచి బయటపడ్డారు. బొగ్గు పెళ్లల సందులోంచి పాక్కుంటూ బయటపడ్డానని ఆయన అన్నారు. యంత్రంతో పనిచేస్తుండగా బొగ్గుపెళ్ల కూలి చీకటైందని, రెస్క్యూ సిబ్బంది అరుపులు విని యంత్రం హారన్ మోగించడంతో తనను బయటకు తీశారని జాడి వెంకటేశ్ చెప్పారు. కాళ్లు బొగ్గుపెళ్లల్లో చిక్కుకొని గాయాలయ్యాయని, నడుం పైభాగంలో దెబ్బలు లేకపోవడంతో బతకగలిగానని రవీందర్ అన్నారు. కనీస సమాచారం ఇవ్వలేదు గని ప్రమాదంలో చిక్కుకున్న డిప్యూటీ మేనేజర్ చైతన్యతేజ పరిస్థితిపై యాజమాన్యం మాకు సమాచారం ఇవ్వ లేదు. ఓ ఉద్యోగి ప్రమాదంలో చిక్కుకుంటే కుటుంబీకులకు సమాచారం ఇవ్వరా? తేజ ఇంటి పక్కన ఉండేవాళ్లు ఫోన్ చేస్తే వచ్చాం. – చైతన్య తేజ తండ్రి సీతారాములు, మామ వెంకటేశ్వర్లు ట్రైనింగ్ అయిపోతుందన్నాడు ట్రైనింగ్ ఈ రోజుతో అయిపోతుందని సోమవారం చెప్పి గనిలోకి వచ్చాడు. గని ప్రమాదంలో చిక్కుకున్నాడని టీవీలో వార్తలు చూసి ఇక్కడికి వచ్చాను. అన్నయ్య పరిస్థితిపై ఎవరిని అడిగినా చెప్పడం లేదు. రెండురోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఎదురుచూస్తున్నాం. సహాయకచర్యలు ముమ్మరంగా చేపట్టి అన్నయ్యను త్వరగా బయటకు తీసుకురావాలి. –వీటీసీ ట్రైనీ తోట శ్రీకాంత్ సోదరుడు రాకేశ్ గనిలో రెస్క్యూ బృందం సహాయక చర్యలు -
భూతగాదాలకు దంపతులు బలి
పాలకుర్తి(రామగుండం): భూతగాదాలు దంపతుల హత్యకు దారితీశాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మంచినీళ్ల వెంకటి (55), తమ్ముడు రాజయ్య మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాజయ్య కుమారుడు రవితేజ గురువారం పొలం వద్దకు వెళ్లి బావి నీటి విషయమై వెంకటితో ఘర్షణ పడ్డాడు. గొడ్డలితో దాడి చేయడంతో ప్రాణాలొదిలిన వెంకటిని లాక్కెళ్లి సమీపంలోని పొదల్లో పడేశాడు. పొలంలో కలుపుతీస్తున్న వెంకటి భార్య కనకమ్మ గమనించి పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆమెపైనా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కనకమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం నిందితుడు బసంత్‌నగర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. మృతిచెందిన వెంకటి దంపతులకు కూతురు రాధ, కుమారుడు రమేష్ ఉన్నారు. రాధకు వివాహం కాగా, రమేష్ కరీంనగర్‌లోచదువుకుంటున్నాడు. వెంకటి గతంలో గ్రామ ఎంపీటీసీగా పనిచేశారు. పంపకాల్లో తేడాలతోనే... వెంకటి, రాజయ్యల వారసత్వ భూమిలో ఇదివరకు సబ్సిడీ బావిని తవ్వారు. భూపంపకాల అనంతరం ఆ బావిలో రాజయ్యకు వాటా లేదని వెంకటి అనడంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఇరువురి మధ్య వ్యవసాయబావి, భూముల విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వివాదం పోలీసుస్టేషన్ వరకు వెళ్లినా అది సివిల్ సమస్య కావడంలో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే రవితేజ పథకం ప్రకారం పెద్ద నాన్న, పెద్దమ్మను గొడ్డలితో నరికి చంపాడని గ్రామస్థులు భావిస్తున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో గ్రామానికి చెందిన కొండ గట్టయ్య దంపతులను వారి కుమారులు కల్లుగీత కత్తితో గొంతులు కోసి హత్య చేశారు. ప్రస్తుతం అదేరీతిన భూవివాదాల నేపథ్యంలో సొంత పెద్దమ్మ, పెద్దనాన్నను కుమారుడి వరసైన యువకుడు గొడ్డలితో హత్య చేసి చంపాడు. -
కోడి పుంజుకు కూడ టికెట్టు కొట్టాడు..
-
కోడికి ఫుల్ టికెట్... డిపో మేనేజర్ వెంకటేశం ఏం అన్నారంటే...
కోల్‌సిటీ(రామగుండం): ఓ ప్రయాణికుడు వెంట తీస్కపోతున్న కోడికి టికెట్ కొట్టాడో ఆర్టీసీ బస్సు కండక్టర్. కోడేంది? బస్సుల టికెట్ గొట్టుడేంది? అని సినిమాల్లో బ్రహ్మానందం కండక్టర్గ జేసిన సీన్లు గుర్తు తెచ్చకుంటున్నరా? ఆగుర్రాగుండ్రి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇది. మహమ్మద్ అలీ.. గోదావరిఖని డిపో బస్సు ఎక్కిండు. కరీంనగర్‌కు టికెట్ తీసుకున్నడు. చుట్టాలింటికి పోతున్నడో.. చుట్టాల దగ్గరనుంచే వస్తున్నడో... తెల్వదుగానీ కోడిని మాత్రం వెంట తెస్తున్నడు. చీరల మూటగట్టుకుని సీట్ల కూసున్నడు. అసలే కోడి. కూయకుండా ఉంటుందా? సుల్తానాబాద్ రాంగనే ‘కొక్కొరోకో’ అన్నది. సప్పుడొచ్చిన కెయ్యి చూసిండ్రు. ఇగ కండక్టర్ తిరుపతి ఊకుంటడా... మహమ్మద్ అలీ దగ్గరకొచ్చి చీర తీసి చూస్తే... కోడి. బస్సులో కోడిని ఎట్ల తీసుకొస్తవని సీరియస్ అయ్యిండు. టికెట్ తీసుకుంటవా లేదాని పట్టుబట్టిండు. కోడికి టికెటేందని అలీ... తీసుకోవల్సిందేనని తిరుపతి.. ఇద్దరూ లొల్లిపెట్టుకున్నా... చివరకు రూ.30లతో ఫుల్ టికెట్ కొట్టి కూల్ అయ్యిండు కండక్టర్. పైసలు పోతే పొయినయి.. కోడి మిగిలిందని నిమ్మలపడ్డడు అలీ. ఇదేందని అడిగితే.. ‘బస్సులో కోడిని తీసుకురావడానికి అనుమతి లేదు. అధికారులు తనిఖీ చేస్తే ఇబ్బందులొస్తయని టికెట్ ఇచ్చిన’ అని కండక్టర్ చెబితే.. ‘కోడిని బస్సులో అనుమతించిన కండక్టర్‌పై చర్యలు తీసుకుంటాం’ అని డిపో మేనేజర్ వెంకటేశం అంటున్నడు. అసలు పదేండ్లు దాటితే గానీ ఫుల్ టికెట్ ఉండదు... కానీ పదేండ్లుకూడా బతకని కోడికి ఫుల్ టికెట్ కట్ చేసుడేందని జనం నవ్వుకుంటున్నరు. -
సింగరేణిలో కొత్త ఓసీపీ
గోదావరిఖని: సింగరేణిలో శనివారం మరో ఓపెన్ కాస్ట్‌గని (ఓసీపీ) ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఈ గనిలో 33 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. 11 సంవత్సరాల పాటు ఏటా 3 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీయనున్నారు. రూ.471 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అధికారులు ప్రభావిత గ్రామాలైన సుందిళ్ల, ముస్త్యాల, జనగామల్లో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. ఇప్పటికే ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. సంస్థలో ప్రస్తుతం 18 ఓసీపీలు ఉన్నాయి. కొత్త ఓసీపీ ఏర్పాటుతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు చేతులమీదుగా గనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా ఓసీపీలో పేలుళ్ల కారణంగా ఇబ్బందులు వస్తాయని, అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతాయనే ఆందోళన ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. కాగా, సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
లోన్ కడతారా.. జైలుకు పోతారా?
పెద్దపల్లి: పంట కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేదని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎస్బీఐ బ్రాంచ్ అధికారులు మండలంలోని 164 మంది రైతులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. రుణాలు వడ్డీతో సహా 15 రోజుల్లో చెల్లించకుంటే సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని నోటీసులో పేర్కొన్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటివరకు చాలామంది రైతుల రుణాలు మాఫీ కాలేదు. రుణం మాఫీ అవుతుందన్న ధీమాతో చాలామంది రైతులు మూడేళ్లుగా బ్యాంకులకు వాయిదాలు చెల్లించడం నిలిపివేశారు. దీంతో వడ్డీలు పెరిగి పోతున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు ప్రస్తుతం వడ్డీ రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు అయింది. ఈ నేపథ్యంలో తాజాగా బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయి. ఈవిషయమై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పలేదు. మృతి చెందిన మహిళా రైతుకు నోటీసు ఓ మహిళా రైతు మరణించి ఏడాదైనా.. ఆమెకు కూడా బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన కొమురమ్మ రుణం తీసుకున్నప్పుడు రైతు బీమా చేసినా.. మరణించిన ఆమెకు నోటీసు ఇవ్వడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాఫీ అయినా నోటీస్: రవీందర్ రెడ్డి, లక్ష్మీపురం, రైతు, సర్పంచ్ అప్పు మాఫీ అయింది. అయినా నాకు నోటీసులు పంపారు. బ్యాంక్ అధికారులు నోటీసులు పంపడం వల్ల రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. -
చెల్లి శవంతో నాలుగు రోజులుగా సహవాసం చేసిన అక్క
-
చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో..
పెద్దపల్లి: వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరు శ్వేత, మరొకరు స్వాతి. గతంలోనే తల్లితోపాటు నాయనమ్మ కూడా మృతిచెందారు. వీరిద్దరిని వదిలి తండ్రి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్దిరోజులుగా శ్వేత కనిపించట్లేదు. ఇదే విషయాన్ని స్థానికులు స్వాతిని ఆరా తీస్తే సమాధానం చెప్పలేదు. సోమవారం సాయంత్రం వీరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా శ్వేత శవమై కుళ్లిపోయినస్థితిలో ఉండగా.. అక్క స్వాతి ఆ శవం వద్దే కూర్చుని ఉంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. రేషన్ బియ్యం తెచ్చుకొని తింటూ.. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వాతి, శ్వేత. 2016లో వీరి తల్లితో పాటు నాయనమ్మ చనిపోయారు. తల్లి చనిపోయినప్పుడు పిల్లలు సుమారు రెండురోజుల పాటు శవంతోనే ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆమె శవాన్ని ఇంట్లోనే ఖననం చేసినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో తండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. ప్రగతినగర్ పెద్దపల్లికి శివారులో ఉండడంతో వీరు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారుకాదు. పైగా ఇద్దరికీ మానసిక పరిస్థితి సరిగా ఉండేదికాదు. రేషన్ బియ్యం తెచ్చుకుని తింటూ ఇంట్లోనే ఉండేవారు. శ్వేత శవంతోనే 4 రోజులుగా.. శ్వేత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో స్థానికులు స్వాతిని ఆరా తీశారు. అయినా ఆమె బదులు చెప్పలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా శ్వేత (24) శవం కుళ్లిపోయి ఉంది. ఆమె 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంత దుర్వాసనలోనూ స్వాతి ఎలా ఉందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎస్సైలు రాజేశ్, రాజవర్ధన్ ఆధ్వర్యంలో శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. స్వాతి వద్ద డబ్బులు లేకపోవడంతో పోలీసులే దహన సంస్కారాలు పూర్తిచేయించారు. స్వాతి మానసిక స్థితి సరిగా లేదని ఎస్సై తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది!
కోల్‌సిటీ (రామగుండం): పెళ్లయిన 11 ఏళ్లకు గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. సిజేరియనైనా కొడుకు పుట్టాడన్న ఆనందంలో నొప్పిని భరించింది. వారమైనా కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడంతో ప్రసూతి వార్డులోనే ఉండాల్సి వచ్చింది. రెండుసార్లు కుట్లేసినా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం, మూడోసారి కుట్లేస్తామని వైద్యులు చెప్పడంతో హడలిపోయింది. ఓ పక్క నొప్పి.. మరోపక్క వైద్యుల నిర్లక్ష్యంతో మనోవేదన చెంది ఆదివారం వేకువజామున ప్రసూతి వార్డులోని బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించి ఉరి నుంచి తప్పించిన కుటుంబీకులు వైద్యులకు సమాచారమిచ్చినా పట్టించుకోకపోవడంతో కళ్లముందే చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నొప్పితో తల్లడిల్లి.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమ (29)ను ప్రసవం కోసం ఈ నెల 11న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మర్నాటి రాత్రి ఉమకు సిజేరియన్‌చేసి వైద్యులు మగబిడ్డకు పురుడు పోశారు. ఉమతో పాటు శిశువును ప్రసూతి వార్డుకు తరలించారు. ఉమ (ఫైల్) సిజేరియన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయలేదో ఏమోగాని అవి అతుక్కోలేదు. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చింది. 18న వైద్యులు రెండోసా రి కుట్లేశారు. అయినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. శనివారం పరిశీలించిన వైద్యులు మరోసారి కుట్లు వేయాల్సి వస్తుందన్నారు. అప్పటికే కుట్లు వేసిన ప్రాంతంలో నొప్పిగా ఉందని తల్లడిల్లిందని ఉమ తల్లి రాజేశ్వరి, అత్త మల్లమ్మ, ఆడబిడ్డ స్వప్న తెలిపారు. వేకువజామున ఉరేసుకొని.. బిడ్డను తన అత్త మల్లమ్మ వద్ద పడుకోబెట్టిన ఉమ.. ఆదివారం వేకువజామున 4.50 సమయంలో బాత్రూమ్కు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో అత్త, ఆడపడుచు వెళ్లిచూడగా షవర్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఉరి నుంచి తప్పించి బెడ్‌పైకి తరలించారు. విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని, అరగంటైనా వైద్యులు రాకపోవడంతో చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తే ప్రాణాలు దక్కేవని.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఉమ తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. బాలింత మృతికి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని, వాళ్ల నిర్లక్ష్యంతోనే ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డీసీహెచ్ఎస్ విచారణ ఉమ మృతిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ వాసుదేవరెడ్డి ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఉమకు సిజేరియన్ చేసిన డాక్టర్, శనివారం రాత్రి డ్యూటీలోని డాక్టర్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిందని తెలిసిన తర్వాత సిబ్బంది ఎప్పటిలోగా వెళ్లారు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త సంజీవ్‌తో మాట్లాడారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని డీసీహెచ్ఎస్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు వైద్యుల నిర్లక్ష్యం లేదు. డీసీహెచ్ఎస్ దర్యాప్తు చేస్తున్నారు. కొందరిలో కుట్లు మానకపోవడమనేది జరుగుతుంది. – డాక్టర్ భీష్మ, ఆర్ఎంవో నా బిడ్డను పొట్టనబెట్టుకున్నారు రెండుసార్లు కుట్లేసినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మూడోసారి కుట్లు వేస్తామని డాక్టర్లు చెప్పారు. శనివారం రెండు గంటలు లేబర్ రూంలో డ్రెస్సింగ్ చేసి నరకం చూపించారు. లేబర్ రూం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మంట, నొప్పి అంటూ తల్లడిల్లిపోయింది. ప్రైవేట్‌కు తీసుకుపోవాలనుకున్నాం. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. – రాజేశ్వరి, మృతురాలి తల్లి -
దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా
సాక్షి, పెద్దపల్లి: సాంకేతికకాలంలోనూ కుల బహిష్కరణ సంస్కృతి కొనసాగుతోంది. తమ మాట వినడం లేదంటూ మూడు కుటుంబాలను కుల పెద్దలు వెలివేసిన సంఘటన సుల్తానాబాద్ మండలం గట్టెపల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు దివ్యాంగులు కావడం విశేషం. బాధితుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో నల్లవెల్లి సమ్మయ్య, నల్లవెల్లి మల్లయ్య, నల్లవెల్లి రాజయ్య అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అలీ వద్ద గతంలోనే గంపగుత్తగా ఆరు గుంటల భూమిని సాదాబైనామాపై కొనుగోలు చేశారు. సదరు స్థలాన్ని కుల సంఘానికి కావాలని వారి కులానికే చెందిన పెద్దలు కోరడంతో ముగ్గురు అన్నదమ్ములు అంగీకరించారు. సదరు స్థలాన్ని అబ్దుల్ అలీతో 2008లో రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నాళ్లక్రితం అబ్దుల్‌అలీ చనిపోయాడు. ఈనేపథ్యంలో సదరు భూమికి కొలతలు వేయగా.. తక్కువగా ఉంది. దీనికి సమ్మయ్య కుటుంబమే కారణమని, కొనుగోలు చేసిన సమయంలోనే భూమికి హద్దులు వేయిస్తే సమస్య ఉండేది కాదని, దీనికి బాధ్యత వహించి మొత్తం స్థలం చూపించాలని కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే తాము కొనుగోలు చేసిన భూమిని అలాగే కుల సంఘానికి విక్రయించామని, ఇందులో తాము తప్పు చేయలేదని ముగ్గురు అన్నదమ్ములు అంటున్నారు. ఈ విషయమై కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. చదవండి: (సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. వీరంతా కేరళ ఆయుర్వేదిక్ సిబ్బంది) సమస్య పరిష్కారం చూపే వరకూ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారితో మాట్లాడిన వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో అప్పటినుంచి వీరితో కులానికి చెందిన వారెవరూ మాట్లాడడం లేదు. ఈనెల ఒకటో తేదీన బాధితుల పినతల్లి నల్లవెల్లి మల్లమ్మ (75) అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను చివరిచూపు చూసేందుకు సమ్మయ్య, మల్లయ్య, రాజయ్య వెళ్తే కుల పెద్దలు అడ్డుచెప్పారు. గత్యంతరం లేక బాధితులు అక్కడి నుంచి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పేర్కొంటూ సమ్మయ్య మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన సోదరులు మల్లయ్య, రాజయ్య దివ్యాంగులు అని, కుల సభ్యులు ఎవరూ కనీసం పాలు పోయడం లేదని, సుల్తానాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులుగా న్యాయం కోసం స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసుల వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, కుల సంఘానికి విక్రయించిన భూమి ప్రస్తుతం లేదని కుల సంఘం పెద్దలు, ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని పేర్కొన్నారు. -
కాపురానికి రానందని కాటికి..
మంథని: కట్టుకున్న భార్యను అతికిరాతంగా చంపాడో భర్త. వేధింపులతో వేగలేకపోతున్నానని.. కలిసి కాపురం చేయడం కుదరదని పంచాయితీలో పెద్దమనుషుల సమక్షంలో చెప్పి భార్య ఇంటికి వెళ్తుండగా వెంటపడి బండ రాయితో మోది హతమార్చాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో శనివారం జరిగిందీ దారుణ సంఘటన. తల్లీకూతుర్లను వేధిస్తుండటంతో.. గ్రామంలోని కాసిపేట బానయ్య.. అదే గ్రామానికి చెందిన కాసిపేట రేణుక (35)ను 17 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు ధనలక్ష్మి (16) ఉంది. దంపతుల మధ్య గొడవలు రావడంతో రేణుక మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ఘట్కేసర్లో పనిచేసుకుంటూ జీవిస్తోంది. కూతురును కాటారం మండలం దామెరకుంటలోని వసతి గృహంలో ఉంచింది. బానయ్య కూతురు వద్దకు వెళ్లి వేధిస్తుండేవాడు. రేణుకనూ వేధించేవాడు. దీంతో ఆమె మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్యకు తన ఆవేదనను చెప్పుకుంది. ఈ క్రమంలో శనివారం సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలతో కలిసి పంచాయితీ పెట్టారు. వేగలేకపోతున్నానన్న రేణుక భర్తతో వేగలేకపోతున్నానని, తన బతుకు తాను బతుకుతానని పెద్ద మనుషుల ముందు రేణుక వాపోయింది. కలిసి ఉందామని బానయ్య బతిమిలాడినా.. ఒప్పుకోలేదు. దీంతో పెద్ద మనుషులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కూతురుతో కలిసి రేణుక వెళ్లిపోతుండగా బానయ్య వెంబడించిన భర్త బండ రాయి విసిరాడు. అది రేణుక తలకు తగిలి కిందపడిపోయింది. వెంటనే మరో రాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఘటనా స్థలాన్ని మంథని సీఐ సతీశ్, ఎస్సై చంద్రకుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి కూతురు ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భరించలేకనే.. ‘నన్ను, మా అమ్మను డాడీ వేధిస్తున్నాడు. అతడి నుంచి దూరంగా వెళ్లిపోదా మనుకు న్నాం. వెనకాలే వచ్చి తలపై బండతో కొట్టాడు. నేను పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే కొట్టి చంపాడు. అతడి టార్చర్ భరించలేక 3 నెలల క్రితమే అమ్మ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అడ్రస్ తెలుసుకుని అక్కడకూ వెళ్లి టార్చర్ పెట్టాడు. నాకు విషయం చెప్పడంతో నేను హాస్టల్ నుంచి మూడ్రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాను. మాట్లాడుకుందామని అమ్మను గ్రామానికి పిలిపించారు. అతడితో ఉండలేనని అమ్మ చెప్పింది. దాన్ని దృష్టిలోపెట్టుకుని కొట్టి చంపాడు..’ అంటూ ధనలక్ష్మి రోదిస్తూ తెలిపింది. -
సింగరేణిలో సమ్మె సైరన్
శ్రీరాంపూర్ (మంచిర్యాల): సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలను నిరసిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో 5 జా తీయ సంఘాలతోపాటు సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీబీజీకెస్ నేతలు ఇప్పటికే కొద్దిరోజుల కిందట సమ్మెనోటీసు ఇచ్చారు. జేఏసీ కూడా సింగరేణి యాజమా న్యానికి మంగళవారం మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామస్వామి తెలిపారు. కార్మిక నేతలు మొత్తం 9 డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. యువతితో కలిసి నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, ఆపై
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి పొత్కపల్లి పోలీసులు గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా అసలు విషయం బయట పడినట్లు సమాచారం. గత కొంతకాలంగా మడకకే చెందిన ఓ యువతితో రాకేశ్, మరికొందరు నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, నీలి క్యాసెట్ల దందాను నడుపుతున్నట్లు తెలిసింది. పోలీసులు పక్కా సమాచారంతో ఆ యువకుడిని పట్టుకోగా వీణవంక మండలంలోని చల్లూరు సెల్ పాయింట్లో నీలి క్యాసెట్లు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం. నీలి చిత్రాల ముఠా గత కొంతకాలంగా యువతులను, మహిళలను లొంగదీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెనక చాలామంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పొత్కపల్లి ఎస్సై ఎస్.లక్ష్మణ్‌ను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, వివరాలు తర్వాత చెబుతామని పేర్కొన్నారు. (చదవండి: Health Benefits of Butter: ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి) -
పెద్దపల్లి: మూడేళ్ల ప్రేమ.. పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి ఇంట్లో చొరబడి..
-
పెద్దపల్లిలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసిన ప్రేమోన్మాది
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. అత్యంత కిరాతకంగా గొంతు కోసి యువతిని హతమార్చాడు. రామగుండం కార్పొరేషన్ యైటింక్లైయిన్ కాలనీ కేకే నగర్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజు, గొడుగు అంజలి అనే ఇద్దరు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంజలి డిగ్రీ చదువుతుండగా.. ప్రియుడు రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అంజలి పెళ్లికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాజు.. ప్రియురాలి ఇంట్లోకి చొరబడి గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: (పోర్న్ వీడియోలు చూసి రాక్షసంగా.. ఓ చిన్నారి కేకలు వేయడంతో..) -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఏఈ
మంథని: పెద్దపల్లి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఎన్పీడీసీఎల్ ఎక్లాస్పూర్ సెక్షన్ అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఏఈ కాసర్ల రాజ్‌కుమార్ ట్రాన్స్ఫార్మర్ను బిగించడం కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ కథ నం ప్రకారం.. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన ఎండీ షౌకత్ అలీ గోదావరిఖని ఫైర్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బాధితుడు షౌకత్ అలీ ఆయన తన వ్యవసాయ భూమిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లైన్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావడంతో అధికారులు, ఏఏఈ రాజ్‌కుమార్‌ను కలవాలని లైన్‌మన్ ద్వారా సమాచారం అందించారు. షౌకత్ అలీ ఏఏఈని కలవగా ట్రాన్స్ఫార్మర్ను బిగించడానికి రూ.25 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు ప్రాధేయపడడంతో రూ.20 వేలకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో షౌకత్ అలీ ఏసీబీని ఆశ్రయించంతో అధికారులు, సబ్‌స్టేషన్‌లో ఏఏఈ రూ.20 వేలు తీసుకుంటుం డగా పట్టుకున్నారు. ఏఏఈ రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ -
పలు ప్రాంతాల్లో భూకంపం
జగిత్యాల/రామగుండం/మొగుళ్లపల్లి/మల్హర్/మంచిర్యాలటౌన్: రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఆదివారం స్వల్పంగా భూమి కంపించింది. 3 నుంచి 5 సెకన్లపాటు కంపించడంతో ఆయా జిల్లాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యా రు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సాయం త్రం 6.48 గంటల సమయంలో 5 సెకన్లపాటు భూమి కంపించింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, బీర్పూర్, రాయికల్, గొల్లపల్లి మండలాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరు గులు తీశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అంతర్గాం, ముత్తారం మండలాల్లో భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి. జయశంకర్ భూపాలపల్లి మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు రంగాపురంలో రాత్రి 7 గంటల సమయంలో భూమి 3 సెకన్ల పాటు.. మల్హర్ మండలం కుంభపల్లి, దుగ్గొండి మండలం రేకంపల్లిలో, కొత్తపల్లి(బి), మానేరు పరీవాహక ప్రాంతంలో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 2 సెకన్లపాటు భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలో... మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ ఆదివారం సాయంత్రం 6:48 గంటల సమయంలో 3 సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ, ఐబీ ప్రాంతం, నెన్నెల మండలం చిత్తాపూర్, జంగాల్‌పేటలో, హాజీపూర్ మండలం నర్సింగాపూర్‌లో, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, దండేపల్లి, భీమారం మండలాల్లోనూ భూమి కంపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా భూమి కంపించి రిక్టర్ స్కేల్‌పై 4.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. అక్టోబర్ 23న కూడా వీటిల్లోని కొన్నిప్రాంతాల్లో భూకంపం సంభవించింది. వారం తర్వాత మళ్లీ భూమి కంపించడం తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం
జ్యోతినగర్(రామగుండం)/మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅగ్రికల్చర్: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలకు ఇంట్లో ఉన్నవారు భయపడి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్, నర్రాశాలపల్లె, అన్నపూర్ణ కాలనీతోపాటు మేడిపల్లి ప్రాంతంలోని ఓపెన్‌కాస్ట్ గనిలో ప్రతిరోజు బొగ్గు వెలికితీయడానికి బాంబు పేలుళ్లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో శనివారం సంభవించిన భూ ప్రకంపనలను బాంబుపేలుళ్లు కావచ్చని చాలామంది భావించారు. అయితే అది భూకంపమని తర్వాత తేలింది. భూకంప లేఖిని(రిక్టర్ స్కేల్)పై 4.0గా నమోదైనట్లు గుర్తించారు. మధ్యాహ్నం 2.03 గంటల ప్రాంతంలో కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో.. జిల్లా కేంద్రమైన మంచిర్యాలతోపాటు నస్పూర్, శ్రీరాంపూర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల కలెక్టరేట్లో కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు కదిలినట్లు అనిపించడంతో సిబ్బంది భయాందోళన చెందారు. శ్రీరాంపూర్, నస్పూర్ ప్రాంతాల్లోని ప్రజలు మొదట దీన్ని ఓసీపీ బ్లాస్టింగ్‌గా భావించారు. 2016 నవంబర్‌లో నస్పూర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు పలువురు గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు. భూకంపం వచ్చిన ప్రాంతం -
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు..
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లాలో కాలేజ్ రోడ్, సున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్, షిర్కేలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ, జ్యోతినగర్, మల్కాపూర్, నర్రాశాలపల్లె ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: (ఇది విన్నారా?.. ఇక్కడ కిరాయికి ఇల్లుందా!) -
ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
రామగుండం క్రైం(పెద్దపల్లి జిల్లా): ఓ యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడం రెండు కుటుంబాల మధ్య వివాదానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సీఎస్పీ కాలనీకి చెందిన శనిగరం సాయి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీశాంకతో పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. దీంతో వారు ఈనెల ఒకటో తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి సాయి ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం వేకువజామున శ్రీశాంక తల్లి, మేనమామ, ఇతర బంధువులైన తిలక్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌తో కలిసి వచ్చి సాయి కుటుంబ సభ్యులను కర్రలు, ఇతర మారణాయుధాలతో బెదిరించి శ్రీశాంకను తీసుకెళ్లారు. దీంతో సాయి కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు శ్రీశాంకను తీసుకువెళ్లిన కారు వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిఖని ఏసీపీ ఎస్.గిరిప్రసాద్, వన్‌టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేశ్‌బాబు విచారణ చేపట్టారు. సాయికుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లితోపాటు, మేనమామలు, మరో నలుగురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, కిడ్నాప్ కేసు సైతం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేసుకుని అప్పుడలా ఇప్పుడిలా !
-
యువతిపై లైంగికదాడికి యత్నం
సాక్షి, పెద్దపల్లి: ఇంట్లో ఒంటరిగా కనిపించిన ఓ యువతిపై లైంగికదాడికి యత్నించాడో కామాంధుడు. ఆమె ప్రతిఘటించడంతో పురుగులమందు నోట్లో పోసి ఆమె ప్రాణాలు బలి తీసుకోబోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మంథని సీఐ సతీశ్ కథనం ప్రకారం... బాధితురాలి తండ్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరేసరికి లోపలి నుంచి అరుపులు వినిపించాయి. తన కూతురును అదే గ్రామానికి చెందిన మంథని సతీశ్ బలాత్కరిస్తూ కనిపించాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో పురుగులమందు పోసేందుకు ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ఆమె తండ్రి గమనించి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా యువకుడు తప్పించుకుని పారిపోయాడు. కర్ర దెబ్బ కూతురు తలకు తాకడంతో బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని యువతిని మంథని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, తమ ఇంటి పక్కన ఉన్న కరెంటు స్తంభాల విషయమై రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయని, దీనిని మనసులో పెట్టుకునే సతీశ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఇంటి నుంచి పారిపోయి ... హిజ్రాగా మారి!
సాక్షి, వేములవాడ(పెద్దపల్లి) : పెద్దపల్లి జిల్లా మంజంపల్లికి చెందిన వి.మహేశ్ అనే యువకుడు రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి... వేములవాడకు చేరుకున్నాడు. ఈ ప్రాంతంలోని హిజ్రాలతో చేరిపోయి తన రూపం మార్చుకుని వారితోనే తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం వేములవాడకు చేరుకుని మహేశ్ గురించి ఆరా తీశారు. వేములవాడ పరిసరాల్లోని అగ్రహారం, తిప్పాపూర్, చంద్రగిరి ప్రాంతాల్లో వెతికారు. పట్టణంలోని జాత్రాగ్రౌండ్ వద్ద మహేశ్ కనిపించడంతో ఇంటికి రమ్మని ప్రోద్బలం చేశారు. ఈ క్రమంలో హిజ్రాలకు మహేశ్ తల్లిదండ్రులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి మహేశ్ కాళ్లు కట్టేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మంజంపల్లిలో ఆస్తిపరులుగా ఉన్న వీరికి ఒక్కగానొక్క కొడుకు అని, ఆ కొడుకు చెప్పాపెట్టకుండా రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లొచ్చి ఇలా హిజ్రాలతో కలసిపోయాడంటూ స్థానికులకు మహేశ్ కుటుంబ సభ్యులు రోదిస్తూ పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందేలోగానే వారు మహేశ్‌ను తీసుకెళ్లినట్లు తెలిసింది. చదవండి: అనుమానంతో భార్యను హతమార్చిన భర్త -
అమెరికాలో ఉన్నా బతికేదానివి తల్లీ..
జ్యోతినగర్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను చూసేందుకు రామగుండం వచ్చిన నరిష్మారెడ్డి అనే యువతి కరోనా కాటుకు బలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘అమ్మా.. నువ్వు అమెరికాలో ఉన్నా బతికే దానివి.. మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనాకు బలైపోయావా తల్లీ..’ అంటూ తల్లడిల్లిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లోని కృష్ణానగర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే నాలుగేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటానికి తల్లిదండ్రులు రామగుండం పిలిపించారు. దీంతో ఆమె నెల కిందట ఇక్కడికి వచ్చింది. అయితే ఆమె 20 రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు తల్లికీ పాజిటివ్‌రాగా, ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారం కిందట మరోసారి టెస్ట్ చేయించుకోగా నరిష్మారెడ్డికి నెగెటివ్ వచ్చింది. అయినా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి ఆమె మృతిచెందింది. మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. -
Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే ఆయన అదృశ్యం కావడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈటలకు సన్నిహితుడిగా పేరున్న పుట్ట మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని ఎందుకు కనిపించకుండా పోయారనేది హాట్ టాపిక్ అయింది. ఈటల ఎపిసోడ్ వెలుగులోకి రాకముందే.. అడ్వకేట్ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని, హత్య కోసం రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే పుకార్లు షికారు చేశాయి. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెరపైకి రాగా.. అనూహ్యంగా మధు అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన ఫోన్లోనూ అందుబాటులో లేరు. గన్మెన్లు మధు వెంటే ఉన్నారా..? ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని అదృశ్యం అయిన పుట్ట మధు వెంట రక్షణ కోసం నలుగురు గన్మెన్లు ఉంటారు. మంథని నుంచి గన్మెన్లకు కూడా చెప్పకుండా మధు అదృశ్యం అయినట్లు మంథనిలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ధ్రువీకరించలేదు. ‘జెడ్పీ చైర్మన్ మధు వెంటే గన్మెన్లు ఉన్నారు. మధు అదృశ్యమైనట్లు గన్మెన్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిర్యాదు రాలేదు’ అని ‘సాక్షి’కి తెలిపారు. గన్మెన్ల ఫోన్లు పనిచేస్తున్నాయని మాత్రం చెప్పిన సీపీ మధు ఎక్కడున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ‘ప్రజాప్రతినిధులు పనుల మీద దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. వారితోపాటు వారి రక్షణ కోసం గన్మెన్లు కూడా వెళతారు. ఆ వివరాలేవీ గన్మెన్లు మాకు రిపోర్టు చేయరు’ అని సీపీ సత్యనారాయణ వివరించారు. హంతకులను అరెస్టు చేసినట్లు అసెంబ్లీలో చెప్పిన సీఎం వామన్‌రావు దంపతుల హత్య వ్యక్తిగత కక్షలతో జరిగిందే తప్ప రాజకీయ కోణంలో కాదని, తమ పార్టీ వారికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. కేసులో దోషులను కూడా అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే.. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ హత్యకేసులో నిందితుడు కావడంతో మంథనిలో పుకార్లు ఆగలేదు. తాజాగా వామన్‌రావు హత్యకు రూ.2 కోట్ల సుపారీ అందించారని, ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఒకరిద్దరిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. నిందితుల్లో ఒకరు అప్రూవల్‌గా మారారని.. చాలా విషయాలు వెల్లడించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మధు కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది. ఒకట్రెండు రోజుల్లో ఫోన్ ఆన్ అవుతుందన్న ముఖ్య నేత పుట్ట మధు ఎక్కడికీ పోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత ‘సాక్షి’తో చెప్పారు. ఐదు రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ అవడం వ్యక్తిగతమని చెప్పిన ఆయన.. ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తారని అన్నారు. అయితే.. మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లినట్లు చర్చ జరుగుతుండగా.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటలతో తనకేమీ సంబంధం లేదనే విషయాన్ని హైకమాండ్‌కు చెప్పాలని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చదవండి: ఈటల ఎమ్మెల్యే పదవిపై తొలగని ఉత్కంఠ Etela Rajender: సరైన సమయంలో సరైన నిర్ణయం -
ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ
సాక్షి, పెద్దపల్లి జిల్లా: మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. 18 లక్షల 46 వేల నగదు, 6 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్‌తో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేసి చోరీకి తెగబడ్డారు. ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరా డీవీఆర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. పకడ్బందీగా అలారం మ్రోగకుండా బ్యాటరీల కనెక్షన్ తొలగించి, బ్యాటరీలను సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఘటన వివరాలను వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హైలీ ప్రొఫెషనల్ దొంగలు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు. త్వరలోనే చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకుంటామని సీపీ తెలిపారు. చదవండి: నిర్మాత ఇంట్లో డ్రగ్స్.. అరెస్టు విషాదం...ఆటోలో నటుడి మృతదేహం -
పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం
సాక్షి, పెద్దపల్లి: పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అధిష్టానానికి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లేఖ రాశారు. దీంతో ఆ పార్టీలో ముసలం రాజుకుంది. తనకు తెలియకుండానే పార్టీ మీటింగ్‌లు పెడుతున్నారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం జిల్లా అధ్యక్షుడిగా వేసిన కమిటీని అధిష్టానం ఆమోదించని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య -
చెట్టే కదా.. అని నరికితే!
కోల్‌సిటీ (రామగుండం): చెట్టే కదా.. అని ఓ వ్యక్తి నరికాడు. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. వీధి మొత్తం అంధకారమైంది. ఫలితంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును అనుమతి లేకుండా మూడు రోజుల కిందట నేలకూల్చాడు. కొమ్మలు తెగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. దీంతో మున్సిపల్ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్ పి.ఉదయ్‌కుమార్ మంగళవారం సతీశ్‌కు నోటీసు జారీ చేశారు. సతీశ్ జరిమానా చెల్లించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని హామీనిచ్చాడు. ఈ విధంగా పచ్చదనం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి. -
అయ్యో పాపం.. కొడుకులు కాదన్నారు
ముత్తారం(మంథని): ఒకప్పుడు ఆయన పదెకరాల భూమి ఉన్న మోతుబరి రైతు. పది మందికి అన్నం పెట్టాడు. ఐదుగురు సంతానాన్ని ఒంటి చేత్తో పోషించి ఓ ఇంటి వారిని చేశాడు. ఉన్న ఆస్తిని కొడుకులకు పంచి ఇచ్చాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో అందరికీ కాని వాడయ్యాడు. దీంతో న్యాయం చేయండంటూ ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన అల్లాడి ముకుందరావు(85)కు ఐదుగురు సంతానం. ఐదెకరాల వ్యవసాయ భూమి విక్రయించి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. ఈ ఇద్దరిలో ఓ కూతురు ఇదివరకే అనారోగ్యంతో చనిపోయింది. ఇక పెద్ద కుమారుడు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా, రెండో కుమారుడు గోదావరిఖనిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మూడో కుమారుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేయగా మిగిలిన ఐదెకరాల భూమిని కొడుకులకు పంచి ఇచ్చాడు. కాగా కొద్ది రోజుల క్రితం ముకుందరావు భార్య మృతిచెందగా.. పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నాడు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో పెద్ద కుమారుడు తన కుటుంబాన్ని పోషించుకోవడమే భారంగా ఉందని.. మిగతా వారి వద్దకు వెళ్లాలని తండ్రిని వదిలేశాడు. అయితే ఆయనను మిగతా వారూ పట్టించుకోలేదు. నాలుగు రోజులుగా ఆకలితో అలమటించి గురువారం ముకుందరావు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాడు. మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు.. అందరూ ఉన్నా.. అన్నం పెట్టే వారు కరువయ్యారని ముకుందరావు పోలీసులను ఆశ్రయించడంతో వృద్ధుడి ఆకలిని గ్రహించి కానిస్టేబుల్ రాజేందర్, హోంగార్డు వెంకటేశ్వర్లు భోజనం తెప్పించి దగ్గరుండి అతనికి తినిపించారు. అన్నం పెట్టిన పోలీసులకు ఆ వృద్ధుడు రెండు చేతులు జోడించి దండం పెట్టడం అక్కడున్నవారిని కదిలించింది. ఆయన కొడుకులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. -
టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం ఇదే!
సాక్షి, రామగుండం: చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు యువకులు నూతన యాప్‌ను రూపొందించారు. దీనికి బిస్కెట్ యాప్‌గా నామకరణం చేశారు. ఈ యాప్ లోగోను పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా యువకులు ఎంతో శ్రమించి టిక్‌టాక్‌లో ఉన్న ఫీచర్స్ కంటే ఎన్నో రెట్లు అదనంగా ఉన్న బిస్కెట్ యాప్ రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిస్కెట్ యాప్ ఆవిష్కర్తలు రంగు శ్రీనివాస్‌గౌడ్, దుర్గేష్, ప్రణయ్, సాయికుమార్, సత్యాన్వేష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: 97.58 శాతం మందికి అర్హత -
మానవత్వంలో దైవత్వాన్ని చూపించారు
పెద్దపల్లికమాన్/సుల్తానాబాద్: జిల్లా కరోనా ప్రత్యేకాధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరాంపై రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, అ ధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి హరీశ్‌రా వు సోమవారం ట్విట్టర్ ద్వారా ఆయనకు అభినందనలు తె లిపారు. కరోనాపై యుద్ధంలో స్ఫూర్తిదాయకంగా ని లి చారని, మానవత్వం బతికే ఉంది, మానవత్వంలో దైవత్వం దర్శించుకునేలా చేశారన్నారు. శ్రీరాం సేవలను తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రశంసించారు. జిల్లా అధికారులు సంఘం సభ్యులు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రాజన్న, జిల్లా సహకారాధికారి చంద్ర ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి వినోద్‌కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్‌లు అభినందించారు. (అన్నీ తామై ముందుకొచ్చారు) మంత్రి హరీశ్‌రావు ట్వీట్ వైరస్ కారణంగా ఓ వ్యక్తి ఆదివారం మరణించగా అతడి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడానికి సిబ్బంది, ఇతర వ్యక్తులు ముందుకు రాకపోవడంతో మానవతా దృక్పథంతో డాక్టర్ శ్రీరాం స్పందించి, రోగి కుటుంబసభ్యుల సహకారంతో మున్సిపల్ ట్రాక్టర్‌ను స్వయంగా నడిపి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అపోహలను తొలగించారు. విపత్కర సమయంలో ప్రతీ మనిషి జాగ్రత్తలు పాటిస్తూ మరో మనిషికి తోడుండాలని జిల్లా అధికారుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కరోనాపై సమష్టి పోరు.. పెద్దపల్లికమాన్: జిల్లాలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సమష్టిగా కరోనాపై పోరాడుతున్నాం. ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో ఓ రోగి దురదృష్టవశాత్తు మరణించాడు. కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాల తరలింపు కోసం ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆసుపత్రిలో మార్చురీ అంబులెన్స్ అందుబాటులో లేనందున మృతదేహం తరలింపు కోసం ఇతర వాహనాన్ని ఉపయోగించాం. మృతదేహం తరలింపులో శాఖల మధ్య సమన్వయ లోపం లేదు. కరోనా సోకి మరణించినందున గ్రామంలో బంధువులు మరింత ఇబ్బందికి గురి కావద్దని, డ్రైవర్ రావడానికి సమయం పడుతుందని, కరోనాతో మృతదేహం తరలించే పక్షంలో ఇతరులకు ఇబ్బంది కలుగకుండా నేనే స్వయంగా శ్మశానవాటికకు తరలించా. కరోనా మృతుల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్న. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు పకడ్బందీగా చేస్తున్నారు. త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్న. ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణ పాటించి మహమ్మారిని తరిమి కొట్టాలని కోరుతున్న. – డాక్టర్ శ్రీరాం, జిల్లా సర్వేలెన్స్ అధికారి -
‘ఏఎల్పీ’లో విష వాయువు!
సింగరేణికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూడోప్యానెల్ ఏర్పాటుకు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. గనిలో బొగ్గు నిల్వలు పూర్తయిన రెండో ప్యానెల్లో విషవాయువుల తీవ్రత అదుపులోకి రాలేదు. ప్యానెల్లో బొగ్గుకు మంటలంటుకోవడంతో కార్బన్‌మోనాక్సైడ్(సీఓ) విషవాయువులు పెరిగిపోయాయి. మే 4న రెస్క్యూ సిబ్బంది సహాయంతో ప్యానెల్‌కు గోడలు కట్టి మూసివేశారు. అదే ప్యానెల్లో ఉన్న బొగ్గుకు ఆక్సిజన్ తగలకుండా ప్యానెల్‌కు సమాంతరంగా బోర్వెల్స్వేసి సీఓటూ, నైట్రోజన్ పంపించారు. ఈ క్రమంలో ఈనెల 2న ప్యానెల్‌ను తిరిగి ఓపెన్ చేశారు. గోదావరిఖని(రామగుండం): రెండు నెలల అనంతరం గనిలోని రెండో ప్యానెల్‌ను రెస్క్యూ సిబ్బంది సాయంతో ఈనెల 2న తెరిచారు. మొదటి రెండు రోజుల్లో ప్యానెల్లో విషయవావుల ప్రభావం కన్పించలేదు. మూడో రోజు ఆదివారం నుంచి విషయవావులు పెరగడంతో బొగ్గు చల్లారనట్లుగా భావిస్తున్నారు. ఈక్రమంలో మండుతున్న బొగ్గు పొరలపై నీటిని చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రూ. 145కోట్ల విలువైన చాక్స్ సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టులో రెండు ప్యానెళ్లలో బొగ్గును విజయవంతంగా వెలికితీశారు. మూడో ప్యానెల్ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్న క్రమంలో రెండో ప్యానెల్లో ఉన్న యంత్రాలను మూడో ప్యానెల్లోకి తరలించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో లాంగ్వాల్ యంత్రానికి సంబంధించి మిగితా భాగాలు తరలించారు. హైడ్రాలిక్ చాక్స్ మాత్రం అందులోనే ఉండిపోయాయి. అందులో ఉన్న విషవాయులను అరికట్టేందుకు మే 4న ప్యానెల్‌కు గోడ పెట్టి మూసివేశారు. దీంతో రూ.145కోట్ల విలువచేసే 145హైడ్రాలిక్ చాక్స్ అందులోనే ఉండిపోయింది. విషవాయుల తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి ప్రాపర్టీని వెలికితీయాలనే ఆలోచనతో యాజమాన్యం వేచి చూసింది. ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో మూసివేసిన గోడలను తిరిగి ఓపెన్ చేశారు. ప్యానెల్లో మళ్లీ మొదలైన మంటలు.. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూసివేసిన రెండో ప్యానెల్‌ను ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో తెరిచారు. మొదటి రెండు రోజులు బాగానే ఉన్నప్పటికి మూడో రోజునుంచి అందులోంచి మళ్లీ వేడి రావడంతో పాటు విషయవాయువుల తీవ్రతను గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అందులో ఉన్న చాక్స్‌ను తొలగిస్తూ మంటలను అరికట్టే పనిలో నిమగ్నమైయ్యారు. అయితే తొందరపడి ప్యానెల్ గోడలు తొలగించారని దీంతో పాత పరిస్థితి పునరావృతం అయ్యిందని నిపుణులు అంటున్నారు. మరికొన్ని రోజులు ప్యానెల్ మూసివేసి ఉంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ కంట్రోల్ చేస్తూ చాక్స్ వెలికితీస్తాం: అధికారులు మూసివేసిన ప్యానెల్ తెరిచిన మాట వాస్తవమేనని, అందులో 145 హైడ్రాలిక్ చాక్స్ ఉన్నాయని, ప్యానెల్లో ఉన్న వేడిని తగ్గిస్తూ చాక్స్‌ను బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు తెలిపారు. గనిలోని ప్యానెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఒకవైపు మంటల తీవ్రతను తగ్గిసూ్తనే రోజుకు నాలుగుచొప్పున హైడ్రాలిక్ చాక్స్కు బయటకు తీస్తామని తెలిపారు. మరీ అదుపులోకి రాకుంటే తిరిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన అధికారులు రెస్క్యూ, వైద్య సిబ్బంది గనిపై నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. -
తహసీల్ ఎదుట రైతు ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఉసురు తీసింది. భూ రికార్డుల ప్రక్షాళనలో దొర్లిన పొరపాటును సరిచేయకుండా ఏడాది కాలంగా తిప్పించుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి (60) తండ్రి మల్లారెడ్డికి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లోని ఊబకుంట కింద సర్వేనంబర్ 694/íసీలో 1.22 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఆ భూమిని రాజిరెడ్డి తన పేరిట విరాసత్ చేయించుకున్నాడు. ప్రభుత్వం జారీ చేసిన పాస్‌బుక్‌లో రాజిరెడ్డి తండ్రి మల్లారెడ్డి అని రావాల్సి ఉండగా.. నారాయణరెడ్డిగా నమోదు చేశారు. ఈ పొరపాటును సరి చేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో గురుమూర్తి కాలయాపన చేశాడు. హైదరాబాద్ తిరుమలగిరి తహసీల్దార్‌గా పనిచేస్తున్న తమ దాయాదులు మందల రాజిరెడ్డి కూతురు మాధవి, మందల రమేశ్‌రెడ్డి, మందల రాంరెడ్డిల ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు పేరు సరి చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుసుకున్నాడు. వారు రెవెన్యూ శాఖలో ఉన్నత స్థానంలో ఉండటం, ఆర్థికంగా కూడా బలంగా ఉండటంతో భూమి తనకు కాకుండా పోతోందని రాజిరెడ్డి ఆందోళన చెందాడు. ఈ క్రమంలో పట్టా పాస్‌పుస్తకంలో తన తండ్రి పేరు మారకుండా చేస్తున్నారంటూ దాయాదుల పేర్లు, ఒత్తిడికి తలొగ్గి తనకు అన్యాయం చేయాలని చూస్తున్న రెవెన్యూ అధికారుల పేర్లతో సూసైడ్ నోట్ రాసి, పురుగు మందు డబ్బాతో ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారులు వేణుగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజిరెడ్డి మృతదేహం (ఇన్సెట్లో) కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత రాజిరెడ్డి ఆత్మహత్యతో కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధ్యులైన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మృతుడి కుమారులు, స్థానికులు డిమాండ్ చేశారు. అలాగే.. అధికారులపై ఒత్తిడి పెంచిన తమ దాయాదులపై చర్యలు తీసుకోవాలని, అంతవరకు మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఉంచుతామని ఆందోళనకు దిగారు. పోలీసులు మాట్లాడి వారిని శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణం పోయాక పేరు మార్చారు పట్టా పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరిచేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా తిరిగినా స్పందించని అధికారులు.. అతడి ఆత్మహత్యతో ఒక్కసారిగా కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శంకర్‌కుమార్ హుటాహుటిన కాల్వశ్రీరాంపూర్‌కు చేరుకున్నారు. విచారణ జరిపి రాజిరెడ్డి పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరి చేయాలని తహసీల్దార్ వేణుగోపాల్‌ను ఆదేశించారు. రైతు బతికుండగా పట్టించుకోని అధికారులు.. ప్రాణం పోయాక పేరు మార్చడం గమనార్హం. మృతుడి కుమారులు మందల వేణుగోపాల్‌రెడ్డి, అనిల్రెడ్డిలకు ఒక్కొక్కరికీ 31 గుంటల భూమిని పట్టా చేశారు. ఈ విషయమై ఆర్డీవో శంకర్‌కుమార్ మాట్లాడుతూ బాధితుల అభ్యర్థన మేరకు గ్రామస్తుల సమక్షంలో మృతుడి కుమారుల పేరున పట్టామార్పిడి చేశామని తెలిపారు. విచారణ జరుపుతున్న ఆర్డీవో శంకర్‌కుమార్ బాధ్యులపై చర్యలు: ఆర్డీవో రాజిరెడ్డి మృతికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో శంకర్‌కుమార్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అంశాలపై విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు. పై అధికారులకు నివేదిస్తా: తహసీల్దార్ వీఆర్వో, వీఆర్ఏలు ఇబ్బందులకు గురి చేసినట్లు సూసైడ్ నోట్లో మృతుడు రాసిన విషయమై ఉన్నతాధికారులకు వివరించి తదుపరి చర్యలకు సిఫారసు చేయనున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. రైతులు తమ ఫిర్యాదులను నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. -
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే శాయ్. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తా యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది. ’తెలంగాణలోని అనేక ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలోని మొత్తం ప్రాంతాలు, కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో మొత్తం ప్రాంతాలు, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలోని మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు, అసోం, మేఘాలయలోని మరి కొన్ని ప్రాంతాల్లోకి ఇవి విస్తరించాయి. మధ్య అరే బియా సముద్రంతో పాటు మహారాష్ట్రలో మరి కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం లోని మొత్తం ప్రాంతాలు, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతా ల్లోకి 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించింది. దీంతో శని, ఆదివారాల్లో రుతుపవ నాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం కనిపి స్తోంది. కాగా, గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొంచెం ముందు.. కొంచెం లేటు వాస్తవానికి, మన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవ నాలు ఈ ఏడాది జూన్ 8నే ప్రవేశించాలి. కానీ మూడు రోజులు ఆలస్యంగా 11న వచ్చాయి. కానీ గత ఏడాదితో పోలిస్తే మాత్రం పది రోజులు ముందే ప్రవేశించాయి. 2019లో జూన్ 21న, 2018లో జూన్ 8న ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మొత్తమ్మీద తొలకరి జల్లులు పలకరించిన వెంటనే రుతుపవనాలు కూడా రావడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మరోవైపు ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయని, వచ్చే మూడు నెలలపాటు సాధారణం కన్నా ఎక్కువ వర్షం వస్తుందని వాతావరణ నిపుణుల అంచనా. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు సంబంధించి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా చాలావరకు సాధారణ వర్షపాతం (96 నుంచి 104 శాతం) నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జూన్‌లో 102 శాతం, జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం, తెలంగాణలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షపాతం 102 శాతం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అత్యధికంగా 20.4 సెం.మీ వర్షం రాష్ట్రంలో గురువారం అంతా మేఘావృతమై కని పించింది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి జిల్లాల్లో 11.5 నుంచి 20.4 సెం.మీల మధ్యలో వర్షపాతం నమోదైంది. ఇక 6 నుంచి 11 సెం.మీల మధ్యలో వర్షం కురిసిన జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, భూపాలపల్లి, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా సాధారణ వర్షాలు కురిశాయి. మొత్తమ్మీద జూన్‌లో గురువారం నాటికి 142 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ 1–11 వరకు సాధారణ వర్షపాతం 28.8 మిల్లీమీటర్లు కాగా, 69.6 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్ 11న 3.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 69.6 మిల్లీమీటర్లు నమోదైంది. రేపు, ఎల్లుండి భారీవర్షాలు.. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు బాగానే కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. దీని కారణంగా శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం అక్కడక్కడ భారీ నుండి అతి భారీవర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తగ్గిన ఉష్ణోగ్రతలు.. వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యధికంగా మంథనిలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొమురంభీతో సహా 8 జిల్లాల్లో 39 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం నల్లగొండలో 34.2, హైదరాబాద్‌లో 28.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే నిజామాబాద్‌లో 8.5, హన్మకొండలో 7.3, మెదక్‌లో 1.9 డిగ్రీలు తక్కువగా నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఎందుకింత నిర్లక్ష్యం?
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ‘రోగులకు వైద్యం అందించడంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారు. సమయానికి విధులకు ఎందుకు హాజరు కావడం లేదు. కరోనా లక్షణాలతో పేషెంట్ ఆస్పత్రికి వస్తే ఏం ట్రీట్మెంట్ చేస్తారు.. ’ అని కలెక్టర్ సిక్తాపట్నాయక్ కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ప్రశ్నించారు. ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, హెడ్ సిస్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్ వస్తే కనీసం మీరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరూ సరిగా సమాధానం చెప్పకపోవడంతో మందలించారు. అసలు ఆసుపత్రిలో పీపీఈ సెట్లు, మాస్క్‌లు ఉన్నాయా అని ప్రశ్నించినా ఎవరూ నోరు మెదపలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు పనిచేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఆస్పత్రి వైద్య సిబ్బందికి వెంటనే మమో జారీ చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంపత్ కలెక్టర్‌ను కలిసి ఆస్పత్రిలో వసుతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో కిషన్‌నాయక్, హెచ్‌ఈవో సుధాకర్ ఉన్నారు. -
కరోనా.. కడచూపుకు రాని బంధువులు
సాక్షి, పెద్దపల్లి : కరోనా వైరస్ భయం పెద్దపల్లి జిల్లాలో మహా విషాదాన్ని నింపింది. ధర్మారం మండలం నందిమేడారంలో కొసరి రాజవ్వ (55 ) అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ రాలేదు. దీంతో కడసారి చూపుకు నోచుకోక అనాథ శవంలా మారింది. సంతానం లేని రాజవ్వ భర్త అంజయ్య 2 నెలల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి మానసిక ఆందోళనలో ఉన్న రాజవ్వ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే కరోనా భయంతో ఎవరు రాజవ్వ మృతదేహాన్ని చూడటానికి రాలేకపోయారు. 24 గంటలు గడిచిన ఎవరు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చివరకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ శవాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి చెత్తను తరలించే రిక్షాలో అంతిమయాత్రకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో రాజవ్వ శవం అనాథగా తరలిపోవడం చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని అభిప్రాయపడ్డారు. -
ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్‌ఫ్లూ..
సాక్షి, రామగుండం: ‘ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్‌ఫ్లూ..’ ప్రాణాంతకమైన వైరస్లు ప్రజలను వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కువగా మాస్క్‌లు ధరించినవారే కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేసిన వైద్యులు చివరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ కుటుంబం ఇటీవల చైనా నుంచి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం బాధిత కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచారు. చైనాలో తొలిసారిగా.. చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ మనదేశంలోకి సైతం ప్రవేశించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతోపాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలో చాలా మంది మరణించారు. అలాంటి వారిని ముట్టుకోవద్దు.. విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, గొంతులో గరగర, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి.. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్‌లను వాడడం మంచిది. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి.. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించాలి. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలను అడ్డుగా పెట్టుకోవాలి. జలుబు చేసిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర చేతులతో ముక్కు, నోరు తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేసేవారు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది. అంతేకాక, ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట్ల అనవసరంగా ఏ వస్తువులను పడితే వాటిని తాకకూడదు. లక్షణాలు ఇవే.. కరోనా వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, గొంతులో మంట ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ వైరస్ సోకినా వారికి వేరే ఏ లక్షణాలు కనిపించవు. ఇక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని ఎవరూ చేతులతో టచ్ చేయవద్దని, రోగులకు దగ్గరగా ఉండొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ దేశాల్లోనూ వైరస్ ప్రభావం.. చైనాలోని బీజింగ్, షాంఘై, సౌత్ గాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లోనూ చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. దక్షిణకొరియా, జపాన్, థాయ్‌లాండ్‌లోనూ ఈ వ్యాధి కేసులు వెలుగు చూశాయి. చైనాలో అనేక కేసులు అధికారికంగా నమోదైనా ఇంకా వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పెద్దపల్లి జిల్లాకు ‘జాతీయ’ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతం కోసం కృషి చేస్తున్న పెద్దపల్లి జిల్లాకు జాతీయ పురస్కారం లభించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం స్వచ్ఛత కార్యశాలలో స్ఫూర్తిదాయక పనితీరు కనబరిచిన జిల్లాలకు ఆదివారం ఢిల్లీలో స్వచ్ఛత దర్పణ్ అవార్డులు ఇచ్చారు. బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన అమిర్‌ఖాన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ‘సమగ్ర బహిరంగ మల విసర్జన నిర్మూలన–సమాచారం, విద్య, కమ్యూనికేషన్–సామాజిక మరుగుదొడ్లు’అనే అంశంపై దేవసేన ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. -
తరగతి గదిలో ఆగిన టీచర్ గుండె
పాలకుర్తి (రామగుండం): విధుల్లో ఉన్న ఓ టీచర్ ఊపిరి ఆగింది. పాఠం చెబుతుండగానే గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. వివ రాలు.. శాయంపేటకు చెందిన రాజయ్య (45) బసంత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడి పోయారు. అక్కడికి చేరుకున్న తోటి సిబ్బంది పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణికి విషయం చెప్పారు. జెడ్పీటీసీ వాహనంలో గోదావరిఖనిలోని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
కిడ్నాపర్లను పట్టించిన ఏటీఎం
పెద్దపల్లి: ఖాజీపేట రైల్వే జంక్షన్లో సిగ్నల్ ఇంజినీర్లుగా పని చేస్తున్న గుండ రజని, గడ్డం ప్రవీణ్ ఇటుకబట్టీ వ్యాపారి సిద్ధయ్య కిడ్నాప్ వ్యవహారంలో సూత్రధారులుగా తేలారు. కిడ్నాప్‌కు సిగ్నల్ ఇచ్చింది ఆ ఇద్దరే ఏ1, ఏ2లుగా పేర్కొంటు పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ ఇటుకబట్టీ వ్యాపారీ నల్లూరి సిద్ధయ్యను నవంబర్ 25న కిడ్నాప్ చేసిన ముఠాలోని ఏడుగురిలో ఆరుగురిని ఆరెస్టు చేశారు. పెద్దపల్లిలోని గౌరెడ్డిపేట రోడ్డుమార్గంలో ఉంటున్న గుండ రజని, గడ్డం ప్రవీణ్ రైల్వేశాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి అప్పులపాలయ్యారు. ఈజీగా డబ్బు రాబట్టేందుకు సిద్ధయ్యను కిడ్నాప్ చేయడానికి పన్నాగం పన్నారు. రజని మేనమామ వేల్పుల తిరుపతి, సిద్ధయ్య వద్ద గుమాస్తాగా పని చేస్తుండడం, సిద్దయ్య వ్యాపార లావాదేవీల గురించి అవగాహన కలిగి ఉన్నాడు. సిద్దయ్యను కిడ్నాప్ చేస్తే పెద్దమొత్తంలో డబ్బు రాబట్టవచ్చని, రూ.కోటి వరకు గిట్టబాటవుతుందని భావించారు. ప్రవీణ్ సోదరుడైన రమేశ్ సహకారంతో కిరీటీ, మున్నా, షేక్‌భాషా, షకీల్ కలిసి గతనెల 19న కిడ్నాప్‌కోసం ప్రయత్నించగా పోలీసులను చూసి అమలు చేయలేదు. అనంతరం ఇన్నోవా, టవేరా వాహనాల్లో బయలుదేరిన ముఠాసభ్యులు రెండుగా విడిపోయి కిడ్నాప్‌కు పాల్పడ్డారు. సిద్ధయ్యను వాహనంలో ఎక్కించుకొని బెదరించి రూ.8.5 లక్షలు వసూలు చేశారు. ప్రవీణ్, రజనీ, రమేశ్ తమను సిద్దయ్య గుర్తు పడతాడని రెండోవాహనంలో ఉండి ఆపరేషన్‌ను పూర్తి చేయించారు. రూ.కోటి కోసం డిమాండ్ చేయగా తన ఇంట్లో రూ.8లక్షలు మాత్రమే ఉన్నాయని, జేబులో రూ.50 వేలు, ఏటీఎంకార్డు, బంగారు ఉంగరాన్ని అప్పగించి క్షేమంగా ఇంటికి వెళ్లాడు. అదేరాత్రి ఒంటింగట సమయంలో సమాచారం తెలసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. జాడచెప్పిన ఏటీఎం కార్డు.. ముసుగులు ధరించిన కిడ్నాపర్లు సెల్‌ఫోన్ ఉపయోగించకుండా పని పూర్తిచేసుకున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. టోల్గేట్ దాటితే వాహనాలు రికార్డు అవుతాయని, గమనించిన కిడ్నాపర్లు సిద్దయ్య వద్ద ఉన్న ఏటీఎం కార్డు మాత్రం తీసుకెళ్లారు. దీంతో సిద్ధయ్యను పోలీసులు బ్యాంకు అకౌంట్లో మరింత డబ్బు వేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. పోలీసుల సూచన మేరకు తన అకౌంట్లో సిద్దయ్య డబ్బు వేస్తుండగా నిందితులు ఏటీఎం కార్డు ద్వారా పెట్రోల్, డీజీల్‌కు స్వైప్‌ను ఉపయోగించారు. సూర్యాపేటతోపాటు హైదరాబాద్, గోవాలో ఏటీఎంను ఉపయోగించడంతో అనుమానిత ప్రాంతాల్లో అప్పటికే పోలీసులు మాటు వేశారు. డబ్బు డ్రా అవుతున్నట్లు సిద్దయ్యకు మెసేజ్ వచ్చిన వెంటనే ముఠా సభ్యులను పట్టుకున్నారు. సూర్యాపేట వద్ద రూ.40 వేలు ఈనెల 26న డ్రా చేసిన నిందితులకు తిరిగి బ్యాంకు ఖాతాలో డబ్బుతో ఎరవేసి పట్టుకున్నారు. కాగా మంగళవారం పెద్దపల్లి పట్టణ శివారులో నిందితులు వాహనాల్లో వెళ్తుండగా తనిఖీ చేసిన సమయాల్లో పట్టుబడ్డారని ప్రకటించారు. -
డబ్బా ఇసుక రూ.10
మంథని: ఇసుక బంగారమైంది. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో సోమవారం డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదారేశ్వర వ్రతానికి కొత్త ఇసుక అవసరం. గద్దెల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు ఇసుక వినియోగిస్తారు. గోదావరిలో స్నానం చేసి నదిలో కాసింత ఇసుకను భక్తులు ఏటా తీసుకెళ్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంథని వద్ద గోదావరి నిండుగా ఉండి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఇదే అదనుగా గోదావరి అవతలి వైపు మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి కొంతమంది సంచుల్లో ఇసుకను తీసుకొచ్చి స్నాన ఘట్ల వద్ద ఇలా విక్రయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు కొనుక్కుని వెళ్లారు. -
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, మంథని: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతోనే సమ్మెలోకి వెళ్లారని, వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సమస్యల సాధన కోసం మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మంథనిలో శ్రీధర్‌బాబు, పెద్దపల్లిలో విజయరమణారావు సోమవారం సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.60 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచిన్న తప్పిదాలు ఉండేవని, రాష్ట్రం వస్తే అలాంటి సమస్యలను పరిష్కారమవుతాని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని పేర్కొన్నారు. సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిసినా గత నెల కార్మిక సంఘాలు నోటీస్ ఇస్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ముగ్గురు అధికారులతో కమిటీ వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాసామ్య బద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మంది కార్మికులను తీసేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె సమయంలో 27 రోజులు సమ్మె చేసినా ఒక్క కార్మికుడిని కూడా సస్పెండ్ చేయలేదన్నారు. కార్మికులను ఒక్క రోజులో విధుల నుంచి తీసేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. కార్మికులకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో ప్రళయమే వస్తుంది హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల వేతనం కేవలం రూ.13 వేల నుంచి రూ.30 వేలు దాటడం లేదని, సీఎం మాత్రం రూ.50 వేలు తీసుకుంటున్నారనడం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ ధర రూ.70.25 ఉండగా మన రాష్ట్రంలో రూ.73.00 ఉందన్నారు. డీజిల్‌పై జీఎస్టీ, వ్యాట్ 27 శాతం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో 21 శాతం ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 42 రోజులు సకలజనుల సమ్మెలో పాల్గొని జీతాన్ని కోల్పోయిన కార్మికులు ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే రాజరిక వ్యవస్థను కేసీఆర్ గుర్తు చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రజలంతా సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్‌కాచే, జిల్లా కార్యదర్శి సెగ్గెం రాజేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు మంథని సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి, మాజీ జెడ్పీసీసీ చొప్పరి సదానందం, ఆరెల్లి కిరణ్, జంజర్ల శేఖర్, ఆర్టీసీ సంఘం నాయకులు ఐలయ్య, కేకే.రెడ్డి, రాజయ్య, నూగిళ్ల మల్లయ్య, వేముల రామ్మూర్తి, జగదీష్, సురేశ్‌గౌడ్, బొడ్డుపల్లి శ్రీను, రాజమల్లు, రాజు, ఎంఏ.ఖయ్యూం, ఎస్కే.అహ్మద్, నర్సింగం, కొమురయ్య, ఎంఏ. అలీం, బాబా తదితరులు పాల్గొన్నారు. -
గిరి దాటని ‘ఖాకీ’లు
సాక్షి, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో పనిచేసే కొందరు ‘ఖాకీ’లు రెండుమూడు ఠాణాల పరిధిలోనే దీర్ఘకాలికంగా గిరిదాటకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఠాణాలో పనిచేస్తూనే మరొక ఠాణాలో అటాచ్డ్గా.. విధులను అదనంగా నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు పోలీసుల క్రిందిస్థాయి సిబ్బంది.. ఈ అటాచ్డ్ విధుల కోసం ప్రత్యేకంగా ఆయా ఠాణాల్లోనే అటాచ్డ్ విధులను కొనసాగిస్తున్నారు. ఆ కొందరికి మాత్రమే ఈ అటాచ్డ్ విధులను అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటో అని మిగతా పోలీస్ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కమిషనరేట్ పరిధిలో పోలీసుల బదిలీలు అనేకం జరిగినప్పటికీ.. ఆ కొందరు మాత్రం యథావిధిగా ఆయా ఠాణాల్లోనే బదిలీలు లేకుండా, కాకుండా ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నారు. అనేక మంది పోలీస్ సిబ్బంది పలు పోలీస్స్టేషన్లకు బదిలీలు అయినా ఆ వారు మాత్రం బదిలీలు వచ్చినప్పటికీ, బదిలీ కాకపోవడం వెనుక మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు. రాజకీయంలో జోక్యం.. కమిషనరేట్ పరిధిలోని కొందరు పోలీస్ సిబ్బంది రాజకీయ పలుకుబడితో తమకు నచ్చిన ఠాణాలకు బదిలీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. అదేవిధంగా మరి కొంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌స్టేషన్‌లోనే కొనసాగేలా రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా దీర్ఘకాలంగా పనిచేసే కొందరు సిబ్బందిని, అదేవిధంగా చాలా రోజులుగా ఒక ఠాణాలో పనిచేస్తూ మరొక ఠాణాలో అటాచ్డ్గా విధులు నిర్వర్తించే వారిపై సైతం ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు.. రామగుండం కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా కమిషనరేట్ ఉన్న ప్రాంతంలోని రెండు ఠాణాల్లో పని చేసే కొందరు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి పోలీసులు బదిలీలు జరుగుతున్పప్పటికీ కొందరు మాత్రం ఆయా ఠాణాల్లో పనిచేస్తూ ఇక్కడిక్కడే మరొక ఠాణాలో అటాచ్డ్గా పనిచేస్తున్నారు. ఆ కొందరి సిబ్బందికి అడ్డూ.. అదుపు లేకుండా ఇక్కడిక్కడే ఏళ్లతరబడి పనిచేస్తున్నారు. 95 శాతం బదిలీలు.. ఇటీవల జరిగిన పోలీసుల బదిలీల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 95 శాతం సిబ్బందికి బదిలీలు అయ్యాయి. జిల్లా మొత్తంలో పదుల సంఖ్యలో మాత్రమే బదిలీలు ఆగాయి. ఇటీవల జరిగిన గణేశ్, నవరాత్రోత్సవాలు, మొహర్రం పండుగల నేపథ్యంలో ఆయా సిబ్బంది స్టేషన్లలో విధుల నిమిత్తం ఉంచడం జరిగింది. కొంత మందికి మాత్రం కుటుంబసభ్యులు అనారోగ్యం కారణంగా, త్వరలో పదవీ విరమణ పొందే వారికి మాత్రం బదిలీలు ఆపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేశాం. దీర్ఘకాలికంగా ఒకే చోట అటాచ్డ్గా ఎక్కువ కాలం విధులు నిర్వహిస్తున్న వారిపై దృష్టి సారిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సిబ్బందిని గుర్తించి బదిలీ అయ్యేలా చూస్తాం. – టి.సుదర్శన్‌గౌడ్, పెద్దపల్లి డీసీపీ -
'తెలంగాణకే తలమానికం ఆర్ఎఫ్సీఎల్'
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణ పనులను గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానందగౌడ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణకే తలమానికం రామగుండం ఎరువుల కర్మాగారం' అని అన్నారు. మరో నాలుగు నెలల్లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దక్షిణ భారత రైతులకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా సదానందగౌడ చెప్పుకొచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల కల్పనకు డిసెంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుందనీ ఆయన ప్రకటించారు. స్థానికులకు ఉద్యోగాల విషయమై కేంద్రంతో చర్చించి న్యాయం చేస్తామని ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. -
రాష్ట్రానికి దీన్‌దయాళ్, నానాజీ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరన్ అవార్డు కింద రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభిం చాయి. వీటితోపాటు 2019 నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామపంచాయతీ దక్కించుకుంది. 2017–18కుగాను ఈ పురస్కారాలకు సంబంధించి పీఆర్‌శాఖకు కేంద్రం నుంచి సమాచారం అందింది. ఈ అవార్డుల్లో భాగంగా జిల్లా ప్రజాపరిషత్‌కు రూ.50 లక్షలు, మండల ప్రజా పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామపంచాయతీలోని జనాభాకు అనుగుణంగా రూ.8 నుంచి 12 లక్షల వరకు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. కేంద్రం నుంచి ఆయా పథకాల కింద అందిన నిధులకు సం బంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించిన గ్రామపంచాయతీలకు అవార్డు మొత్తాన్ని విడుదల చేస్తామని పీఆర్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీబ్పట్ జోషి సూచించారు. జిల్లా పంచాయతీ విభాగంలో జనరల్ కేటగిరీ కింద ఆదిలాబాద్ పంచాయతీకి, మండల పంచాయతీ జనరల్ కేటగిరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, వెల్గటూరు ఎంపికయ్యాయి -
పెద్దబొంకూర్ వీఆర్ఏ సస్పెన్షన్
సాక్షి, పెద్దపల్లి: భూమిలేని నిరుపేదలకు పం చాల్సింది పోయి వీఆర్ఏగా పనిచేస్తున్న వ్యక్తే తన పేరిట ప్రభుత్వభూములను అక్రమ పద్ధతుల్లో పట్టా చేసుకున్న సంఘటన పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ ఎంపీటీసీ మిట్టపల్లి వసంత సమాచారహక్కు చట్టం ప్రకారం సద రు భూములకు సంబంధించిన వివరాలు కోరడంతో రెవెన్యూ అధికారులు చేసేదేమీలేక సదరు వీఆర్ఏ పేరిట ఉన్న పట్టాదారు పాసుబు క్కులను రద్దు చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దబొంకూర్ గ్రామంలోని సర్వే నంబర్ 325/16/1లో ఎకరం, సర్వేనంబర్ 485/20/1లో 20గుంటలు, 590లో 19 గుం టలు, 592లో 12గుంటలు, 620లో 16గుంట లు, 622లో 11గుంటలు, 649లో 14గుంటల భూమిని అక్రమంగా తనపేరిట రాయించుకు ని పాసుబుక్కు నంబర్ టీ20100190237 పొందినట్టు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాసుపుస్తకాలను రద్దు పర్చినట్లు ప్రకటించారు. వీఆర్ఏ రాయమల్లును సస్పెం డ్ చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ రాజనరేందర్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అంది స్తున్న రైతుబంధు పథకం కింద పొందిన పె ట్టుబడి సాయాన్ని కూడ రికవరీ చేసేలా సం బంధిత అధికారులకు సూచించామని పేర్కొన్నారు. కాగా పెద్దబొంకూర్‌లో రెవెన్యూ సం బంధమైన అవకతవకలు అనేకంగా జరిగా యని, ఈ విషయమై జిల్లాకు సంబంధంలేని అధికారులతో బహిరంగ విచారణ జరిపితే అ నేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎంపీటీసీ వసంత కోరారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ భూములను భూముల్లేని పేదలకు పంచాలని ఆమె కోరారు. సుల్తాన్పూర్ పంచాయతీ కార్యదర్శి.. పెద్దపల్లిఅర్బన్: విధులల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తు కలెక్టర్ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి డి.సంపత్ కృష్ణారెడ్డి విధులకు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం సంపత్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. -
పెద్దపల్లి పెద్దవ్వ
జిల్లా కేంద్రం పెద్దపల్లి కమాన్ చౌరస్తా నుంచి కిలోమీటరు దూరం వెళ్తే బ్రాహ్మణ వీధి వస్తుంది. ఆవీధిలోని ఒక ఇంట్లో.. రెండు మూడేళ్లు తక్కువగా నూరేళ్ల వయసున్న మాతృమూర్తి కనిపిస్తుంది. పేరు మల్లోజుల మధురమ్మ. ఆమె పేరు చెవిన పడని తెలంగాణ ప్రాంతం లేదు. ఉత్తర తెలంగాణలోనైతే ఇంటింటా ‘‘అవును.. మల్లోజుల మధురమ్మ నాకు తెలుసు.. నేను చూశా.. నేను విన్నా’’ అని చెప్పుకునేవారే. కారణం.. ఆ తల్లి జీవితంలో ప్రతి పేజీ ఓ చరిత్రకు ముడిపడి ఉంది. నాడు తెలంగాణ విమోచన పోరాటం నుండి సమసమాజ స్థాపన కోసం నేటికీ జరుగుతున్న ప్రతి పోరాట ఘట్టంలో మల్లోజుల మధురమ్మ పాత్ర పరోక్షంగా ఉంది. ఆమె భర్త మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రాష్ట్ర విమోచన ఉద్యమంలో ఒకరయ్యారు. మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు.. అసమానతలు లేని నవసమాజ నిర్మాణం కోసం అడవులు పట్టి వెళ్లారు. ఆ అన్నదమ్ముల్లో ఒక్కరు కిషన్‌జీ అమరుడయ్యారు. మరొకరు మల్లోజుల వేణు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ నాయకుడు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం సందర్భంగా.. తల్లిగా, తెలంగాణ సాయుధ వీరుడు వెంకటయ్య భార్యగా మధురమ్మ జీవిత విశేషాలు కొన్ని. సమరయోధుని భార్యగా గుర్తింపు మల్లోజుల మధురమ్మ పండు ముసలితనంలోనూ కళ్లద్దాలు లేకుండానే స్పష్టంగా చూస్తుంది. చెవులు వినబడుతాయి. అంతే స్పష్టంగా మాట్లాడుతుంది. కారణం.. ఈ సమాజాన్ని రెండు వైపులా చూసింది. రజాకార్లు, పోలీసులు పెట్టిన వేధింపులు అనుభవించింది. ప్రభుత్వాధికారుల నుండి సన్మానాలు అందుకుంది. సమరయోధుడి భార్యగా ఏటా జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలలో సన్మానాలు అందుకుంటూనే ఉంది. ఇటీవల సాక్షాత్తూ పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు పాదాభివందనం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకులంతా మధురమ్మ నుంచి ఆశీర్వాదం అందుకున్నవారే. ఇందుకు భిన్నమైన కోణం కూడా ఉంది. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో రామగుండం మండలం ముర్మూరు వద్ద ప్రభుత్వం వెంకటయ్యకు కేటాయించిన ఏడు ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయింది. భూమికి బదులు భూమిని ఇస్తామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేయడంతో.. మధురమ్మకు అభినందనలు మాత్రమే మిగిలాయి. భర్త ఆచూకీ కోసం చిత్రహింసలు పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఐదారుగురు యువకులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందులో మల్లోజుల మధురమ్మ భర్త వెంకటయ్య ఒకరు. నాగపూర్ క్యాంపులో కమ్యూనిస్టు కార్యకర్తగా శిక్షణ పొందిన వెంకటయ్యను రజాకార్లు అరెస్టు చేసి సుల్తానాబాద్ కోర్టులో హాజరుపరిచి వరంగల్ జైలుకు తరలించారు. అంతకు ముందు భర్త ఆచూకీ కోసం మధురమ్మను వారు పెట్టిన చిత్ర హింసలు అన్నీ ఇన్నీ కావు. అడవిబాట పట్టిన కన్నబిడ్డలు తెలంగాణ ప్రాంతం విముక్తి తర్వాత పదేళ్లకు పుట్టిన మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో పెద్ద వారైన ఆంజనేయశర్మ ప్రస్తుతం పెద్దపల్లిలోనే పౌరోహిత్యం చేస్తున్నారు. ‘‘చివరిసారి 25 ఏళ్ల క్రితం పోలీసులు నా కొడుకుల జాడ చెప్పా లంటూ ఇల్లు నేలమట్టం చేయడంతో నిరాశ్రయురాలినై తుంగ గుడిసెలోనే నాలుగేళ్లు కాలం గడిపాను’’ అని చెమర్చిన కళ్లతో మధురమ్మ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. – కట్ట నరేంద్రాచారి, సాక్షి, పెద్దపల్లి ఫొటోలు : సతీష్ రెడ్డి అగ్రనేత కిషన్‌జీ ఎనిమిదేళ్ల క్రితం ఎన్కౌంటర్లో మరణించిన మధురమ్మ రెండో కొడుకు కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) మావోయిస్టు పార్టీ నిర్మాణ కర్తల్లో ఒకరు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు అయిన విప్లవ సానుభూతిపరుడు. జగిత్యాల జైత్రయాత్ర నుండి మొదలైన కిషన్‌జీ ప్రస్థానం పీపుల్స్‌వార్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘ కాలం సాగింది. ఆ తర్వాత కేంద్ర కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్నారు. భారత విప్లవోద్యమ పితామహుడైన చారుమజుందార్ సొంత గడ్డ పశ్చిమబెంగాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని కిషన్‌జీ పునరుజ్జీవింపజేశారు. పెద్దపల్లిలో ఆయన అంత్యక్రియలకు ముంబై, ఢిల్లీ, కలకత్తాలకు చెందిన జాతీయ మీడియా ప్రతినిధులు సైతం రావడం విశేషం. -
కిలో ఇసుక 6 రూపాయలు
పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో కిలో ఇసుకను రూ.6 చొప్పున విక్రయిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గోదావరి, మానేరు నదులు వరద కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇసుక కొరత ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణాలు చివరిదశలో ఉన్న యజమానులు మాత్రం అక్కడక్కడ ఇసుక బస్తాలు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు 25 కిలోల ఇసుక బస్తాను రూ.150 విక్రయిస్తున్నారు. అంటే దాదాపు కిలో ఇసుక రూ.6కు దొరుకుతోంది. ఇళ్ల నిర్మాణంలో చివరగా ప్లాస్టరింగ్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తూ బస్తాల చొప్పున ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. వేసవి సీజన్లో ఇసుకను జల్లెడ పట్టి బస్తాల్లో నింపి మానేరు, గోదావరి ఒడ్డున గ్రామాల్లోని కొందరు ఏజెంట్లు రహస్యంగా నిల్వ ఉంచుకున్నారు. వారే ప్రస్తుతం వ్యాపారులకు 25 కిలోల బస్తా రూ.100కు విక్రయించగా రిటైల్‌గా వ్యాపారులు రూ.130 నుంచి 150కి అమ్ముతున్నారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టు సగం ఖాళీ..!
సాక్షి, రామగుండం: ఎత్తిపోతలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రమంగా ఖాళీ అవుతుండడంతో ప్రస్తుతం నీటి సామర్థ్యం సగానికి చేరింది. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసిన నీరు అన్నారం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీలో ఉన్న నీటిని పార్వతీ (గోలివాడ–సుందిళ్ల) పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపింగ్ చేస్తారు. ఈ క్రమంలో గత నెల 31న పార్వతీ పంపుహౌస్ నుంచి ఒక మోటారు రన్ చేసి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోశారు. అప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో క్రమంగా ఎల్లంపల్లిలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో మోటార్లకు టెస్టింగ్ చేసే నిమిత్తం అరగంట పాటు రన్చేసి ఆఫ్ చేశారు. కాళేశ్వరం–ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు విజయవంతం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్–1 పూర్తయింది. సగానికి పడిపోయిన నీటి మట్టం.. గడిచిన వారం రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6లో భాగంగా ప్రాజెక్టులోకి బ్యాక్ వాటర్‌ను పంపింగ్ చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతుంది. దీనికి తోడు ఎగువన భారీ వర్షాలు, వరదలు నిలిచిపోవడంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఇందులోని వాటర్ క్రమంగా రివర్స్ పంపింగ్ విధానం చేపడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వేంనూర్ నుంచి నంది మేడారం చెరువులోకి గ్రావిటీ ద్వారా వెళుతుంది. అక్కడ నాలుగు మోటార్లతో 3,500 క్యూసెక్కులు వరద కాల్వకు ఎత్తిపోయడంతో అవి మిడ్‌మానేర్‌కు చేరుతున్నాయి. మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేయడంతో లోయల్ మానేర్ డ్యాంలోకి చేరుతున్నాయి. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం సగానికి పడిపోవడంతో పార్వతీ పంపుహౌస్ హెడ్ రెగ్యురేటర్, డెలివరీ సిస్టం వద్ద నీటి నిల్వలు కనుమరుగయ్యాయి. ఎల్లంపల్లి దిగువన ఇసుక తెప్పలు దర్శనమిస్తున్నాయి. వివిధ అవసరాలకు నీటి కేటాయింపులు.. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.915 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,502 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 11,137 క్యూసెక్కులుగా ఉంది. కాగా ప్రాజెక్టు నుంచి నీటి కేటాయింపుల్లో అబ్దుల్ కలాం సుజల స్రవంతి తాగునీటి సరఫరాకు 336 క్యూసెక్కులు (2.64 టీఎంసీలు), కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6కు 10,588 క్యూసెక్కులు (13.03 టీఎంసీలు), రామగుండం–పెద్దపల్లి నియోజకవర్గాల తాగునీటి అవసరాలకు 59 క్యూసెక్కులు, మంచిర్యాల జిల్లా మిషన్ భగీరథకు 25 క్యూసెక్కులు, వేంనూర్ పంపుహౌస్‌కు 0.13 టీఎంసీలు, ఎన్టీపీసీకి 0.57 టీఎంసీలు, సాధారణ నష్టం 129 క్యూసెక్కులుగా ఉంది. ఫలితంగా వరద నీటి మట్టం సగానికి పడిపోయింది. ఎత్తిపోతలు ప్రారంభించేనా..! కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో భాగంగా కన్నెపల్లి బ్యారేజీ నుంచి సుందిళ్ల బ్యారేజీ, అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలకు అనుకూలంగా ఉండడంతో నీటిపారుదలశాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కన్నెపల్లి బ్యారేజీ సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా, అక్కడి నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజీలోకి వరద నీటిని మళ్లిస్తారు. దీని సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టీఎంసీలున్నాయి. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీ మళ్ళిస్తారు. దీని సామర్థ్యం 8.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.24 టీఎంసీలు నిల్వ ఉంది. పార్వతీ పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం/నీటి నిల్వ సగానికి చేరడంతో ఎత్తిపోతలు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు రన్ చేసేందుకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆదేశాలు రాలేదు పార్వతీ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభించాలనే విషయమై తమకు ఉన్నతాధికారుల నుంచి ఏలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు వెట్‌రన్ చేసి సిద్ధం చేశాం. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన మరుక్షణమే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభిస్తాం. – బండ విష్ణుప్రసాద్, ఈఈ, పార్వతీ బ్యారేజీ -
నేటినుంచి అసంక్రమిత వ్యాధులపై సర్వే
సాక్షి, పెద్దపల్లి: పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్ఠు బయటపడుతోంది. నియంత్రిస్తున్నామనుకుంటున్న క్షయ విస్తరిస్తోంది. చికిత్సతో నయమయ్యే ఈ రెండు అంటువ్యాధులు పూర్తిగా నియంత్రించవచ్చు. నిర్మూళన కోసం ప్రత్యేక వ్యవస్థలు కృషి చేస్తున్నప్పటికీ.. కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఏకకాలంలో ఈ రెండు వ్యాధులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు సర్వే చేపట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. పక్షం రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్న ఈ ప్రక్రియకు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు పూర్తి ఆరోగ్యం తో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అసంక్రమిత వ్యాధులపై సర్వే నిర్వహించాలని నిర్ణయించిం ది. పెద్దపల్లి జిల్లాలో ఈనెల 26 నుంచి సర్వే ప్రారంభించనున్నారు. సెప్టెంబర్12వరకు కొనసాగనుంది. ప్రతీరోజు ఉదయం పూట 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఏఎన్ఎంలు.. మగ వలంటీర్లు ఇంటింటా తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే శిక్షణకూడా పూర్తి చేశారు. నెలకు 100కుపైగా క్షయ కేసులు ఇటీవల క్షయ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటికే 1000కిపైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. నెలకు 100కుపైగా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. గాలితోనే వచ్చే ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కుష్ఠుతో పాటే క్షయ రోగుల సంఖ్య పక్కగా లెక్కతీస్తే చికిత్స అందించవచ్చన్నది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆలోచన. జిల్లాలో 49 కుష్ఠు వ్యాధి కేసులు పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 49 కుష్ఠు వ్యాధి కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఇంకా అక్కడక్కడ కుష్ఠు వ్యాధి కేసులు ఉండచ్చేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. శ్వాసతో వ్యాప్తిచెందడానికి ఆస్కారమున్న వ్యాధికి ప్రాథమికస్థాయిలో చికిత్స అందించకపోతే... శరీరంలో ముక్కు, కాలి, చేతి వేళ్లు కొరికేసినట్లు కరిగిపోతాయి. వైకల్యం ఏర్పడుతుంది. పుండ్లతో ఇబ్బందిగా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకయ్యే వ్యాధిని నిలువరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏకకాలంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. సర్వేకు 1258 మంది.. కుష్ఠు, క్షయ రోగుల లెక్క తేల్చడానికి ఏకకాలంలో సర్వే చేపట్టడానికి ఒక ఆశా కార్యకర్త, మరో పురుషుడిని కార్యకర్తతో ఒక బృందంగా ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ వీరి పరిధిలోని 20నివాసాలు సందర్శించి, పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు క్షుణ్ణంగా పరీక్షించి వివరాలు సేకరించాలి. జిల్లావ్యాప్తంగా సుమారు 8లక్షల జనాభా ఉండగా, ఇందులో 2లక్షల పైచిలుకు నివాసాలున్నాయి. రోజువారీగా పీహెచ్‌సీలకు అనుమానస్పద కేసుల వివరాల సమాచారాన్ని తెలియజేయాలి. జిల్లా వ్యాప్తంగా 514 మంది ఆశా కార్యకర్తలు ఉండగా, వారికి సహాయకులుగా మరో 514 మంది పురుషులను బృందాలుగా నియమించారు. వీ రిపై 230 ఏఎన్ఎంలు పర్యవేక్షణ చేపట్టనున్నా రు. సర్వే చేసే సిబ్బందికి ఒక్కోక్కరికి రూ.75 చొప్పున పారితోషికం అందించనున్నారు. ఇలా పరీక్షిస్తుంది బృందం సర్వే కోసం అధికారులు ఏర్పాటు చేసిన బృందం ఒక ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు.ఇప్పటికే కుటుంబసభ్యుల వివరాలు ఆరోగ్య కార్యకర్త వద్ద సిద్ధంగా ఉండడంతో వాటికి ఆధార్‌నంబర్లు జోడించాల్సిఉంది. ఆశా కార్యకర్త మహిళలను, స్వచ్ఛంద కార్యకర్త పురుషుల దేహంపై క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎక్కడన్నా మచ్చలున్నాయా అన్నది చూస్తారు. ఒకవేళ కుష్ఠి వ్యాధికి ప్రాథమిక లక్షణమైన తెల్లమచ్చలు వీపుపై ఉంటే తెలుసుకోవడం కష్టం. అందుకే నిశిత పరిశీలన చేస్తారు. మచ్చలు ఉన్నట్లు గుర్తిస్తే, వారి వివరాలను పీహెచ్‌సీకి అందజేస్తారు. వైద్యులు మరోసారి పరీక్షించిన తర్వాత నిర్ధారిస్తే చికిత్స ప్రారంభిస్తారు. ఇక ‘క్షయ’ వ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. ఒకవేళ రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరంవంటి లక్షణాలు ఉంటే వారికి తెమడ తీయడానికి ఒక డబ్బా ఇస్తారు. ఆ డబ్బాలో సేకరించిన తెమడను క్షయ నియంత్రణ విభాగానికి చెందిన డీఎంసీల్లో పరీక్షలు చేపడుతారు.వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సమక్షంలో చికిత్స ప్రారంభించే ప్రణాళిక రూపొందిస్తారు. సర్వేతో కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి కుష్ఠు, క్షయ వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించడం ద్వారా కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి. సోమవారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వే చేపట్టాల్సిన తీరుపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. సర్వే బృందాలకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్ఓ, పెద్దపల్లి -
నడిచే కారులో అకస్మాత్తుగా మంటలు
సాక్షి, పెద్దపల్లిరూరల్: నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. వివరాలు.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం మందంపల్లికి చెందిన సిద్ధం నానయ్యకు కాలు విరగడంతో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు అతని భార్య మల్లక్క, కొడుకు మల్లేశ్‌తో కలసి వారి సొంత కారు ఏపీ 30ఏ3880లో వెళ్లారు. చికిత్స అనంతరం గురువారం హైదరాబాద్ నుంచి ఇంటికి బయల్దేరారు. మల్లేశ్ నడుపుతున్న కారులో నానయ్య, మల్లక్క ప్రయాణం చేస్తున్నారు. పెద్దపల్లి సమీపంలోని కల్వల క్యాంపు దాటుతున్న సమయంలో కారు ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన మల్లేశ్.. వెంటనే కారును రోడ్డుపై నిలిపి తల్లి మల్లక్క సహయంతో తండ్రి నానయ్యను కిందకు దించారు. కారును రోడ్డు పక్కన ఆపేందుకు మల్లేశ్ ప్రయత్నిస్తున్న సమయంలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో కారును వదిలేసి మల్లేశ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. రాజీవ్‌రహదారిపై మంటల్లో కారు కాలిపోతుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. -
పెద్దపల్లి పురపోరుకు బ్రేక్!
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల విభజన సరిగా జరుగలేదని రంగంపల్లి గ్రామానికి చెందిన వేములరాజు, కాసు మహేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రంగంపల్లిలోని 10, 11, 12వార్డుల్లో ఉండాల్సిన ఓటర్లు 2 కి.మీల దూరంలోని ఎల్లమ్మచెరువుకట్ట కింద కాలనీల్లోని 32 వార్డులో చేర్చడాన్ని సవాలుచేస్తూ హైకోర్టు న్యాయవాది చింతలఫణి అవనిరెడ్డి హైకోర్టులో రిట్ వేశారు. దీనిపై న్యాయమూర్తి నర్సింగరావు విచారణ జరిపి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయాలంటూ ఉత్వర్వులు జారీ చేశారు. నాలిగింటిపై స్టే.. ముందుగా సుల్తానాబాద్ నుంచి మొదలైన తిరుగుబాటు వ్యవహారం, హైకోర్టు నుంచి స్టే తీసుకరావడంపెద్దపల్లి వరకు చేరింది. రామగుండంలో ఇదేమాదిరిగా వార్డుల విభజన సక్రమంగా లేదని కాంగ్రెస్‌పార్టీ నాయకులు కొందరు కోర్టుకు వెళ్లారు. రామగుండం ఎన్నికనూ హైకోర్టు నిలిపివేసింది. మంథనిలోను కొందరూ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పెద్దపల్లిలో వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని కోర్టుకు వెళ్లడంతో పెద్దపల్లిపైనా స్టే విధించడంతో జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలపై హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా ఎన్నికలపై అనుమానాలు పెరిగాయి. ఇప్పటికే హైకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలపై కొందరూ కోర్టుకు వెళ్లగా ఇప్పుడు ఎక్కడిక్కడ మున్సిపాలిటీల వారీగా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసిన ఇక్కడస్థానికంగా ఎక్కడిక్కడ హైకోర్టుకు ఫిర్యాదులు వెళ్లడంతో స్టే విధించారు. దీంతో ఇక ఎన్నికలు జరుగడం ఇప్పట్లో అనుమానమేనంటున్నారు. అన్నింటిపై ఒకేసారి తీర్పు... రాష్ట్రంలో సుమారు 60 చోట్ల నుంచి అభ్యంతరాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి. ఒక పెద్దపల్లి జిల్లాలోనే నాలుగు, ఉమ్మడి కరీంనగర్లో ఎనిమిది మున్సిపాలిటీలపై హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. అన్ని మున్సిపాలిటీలో కూడా వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందనేది పిటిషనర్ల వాదన. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి స్టే ఇప్పించాం. పెద్దపల్లిలో చాలా అద్వానంగా ఇష్టానుసారంగా వార్డుల విభజన, ఓటర్ల గుర్తింపు ప్రక్రియ జరిగింది. హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులన్నింటిపై ఒకే సమయంలో తీర్పు రానుంది. అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం. – అవనిరెడ్డి, హైకోర్టు అడ్వకేట్ -
జోరు చల్లారింది
సాక్షి, పెద్దపల్లి : మున్సిపల్ పోరుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీల్లో ఉత్సాహం, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కనిపించింది. ప్రభుత్వ యంత్రాంగం సైతం ఏర్పాట్లపై హడావుడి చేసింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటంతో అంతా చల్లబడ్డారు. రేపో మాపో రిజర్వేషన్లు ఖరారవుతాయని ఉత్కంఠగా ఎదురుచూసిన వారు కాస్త నెమ్మదించారు. అభ్యంతరాలు పరిష్కరించే వరకూ ఎన్నికలకు వెళ్లమంటూ తమకు ఈసీ హామీ ఇచ్చిందని, పిటిషన్ల విచారణ సమయంలో హైకోర్టు పేర్కొంది. ఈ పరిణామంతో మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా రాజకీయాలు స్తబ్ధుగా మారాయి.. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గత నెల 21 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన చేపట్టింది. ఇది జరుగుతున్న సమయంలోనే వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం అర్డినెన్స్ జారీ చేయడంతో వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో అంశానికి మొదట పేర్కొన్న తేదీలను ఎప్పటికప్పుడు కుదిస్తూ తుది జాబితాలను సిద్ధం చేయడంతో ఆయా అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వా టి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటు న్నారు. దీంతో ఎన్నికలకు హడావుడిగా జరుగుతున్న ఏర్పాట్లను చూసి రాజకీయ పార్టీల్లోను వేడిపుట్టింది. వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అధిష్టానాలు జిల్లా నాయకత్వాలకు మున్సిపల్ పోరుకు సన్నద్ధతపై కొన్ని సూచనలు చేశాయి. టీఆర్ఎస్, బీజేపీలు ఇదే సందర్భంలో సభ్యత్వ కార్యక్రమాలు తెరపైకి తెచ్చాయి. వరుస ఓటమిలతో డీలా పడ్డ కాం గ్రెస్ సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. కోర్టు ఉత్తర్వులతో.. వార్డుల విభజనలో గందరగోళంపై స్థానిక అధికారులు తీసుకున్న చర్యలకు సంతృప్తి చెందని వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలుచోట్ల న్యాయస్థానానికి వెళ్లడంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలో సుల్తానాబాద్ మున్సిపాలిటీగా వార్డుల విభజన సక్రమంగా జరుగలేదని, పెద్దపల్లిలో సైతం ముస్లిం ఓటర్లకు అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇష్టానుసారంగా వార్డులను విభజించారని మాజీ వార్డు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. 29న కీలక నిర్ణయం.. పలు చోట్ల పిటిషనర్ల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను సరిచేసే వరకు ఎన్నికలకు వెళ్లమంటూ ఈసీ తమకు తెలిపిందని సోమవారం జరిపిన విచారణ సందర్భంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను 29కి వాయిదా వేసింది. 29న హైకోర్టు తీసుకునే నిర్ణయం మున్సిపోల్స్‌పై ప్రభావం చూపనుంది. కొందరు ఇప్పటికే నెల నుంచి రెండునెలలు వాయిదాపడవచ్చని, మరికొందరు 3 నెలలు వాయిదా పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణలో కోర్టు నిర్ణయం ఏముంటుంది.. ఎన్నికల ప్రక్రియలో ఎంత ఆలస్యం జరుగనుందనేది 29న తేలనుంది. -
ఆన్లైన్లో వీలునామా
సాక్షి, పెద్దపల్లి: వీలునామా ఒక వ్యక్తి తదనంతర ఆస్తిపాస్తులను వేరొకరికి ఇవ్వడానికి వీలు కల్పించే పత్రం. వ్యక్తి మరణించిన తర్వాత ఆయన పేరిట ఉన్న ఆస్తులు, నగదు కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సహజం. కోర్టు కేసులూ మామూలే. కాస్తముందు చూపుతో ఆలోచించి వీలునామా రాస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. వీలునామా రాయడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. కేవలం తనకు నచ్చిన విధంగా వీలునామా రాస్తే సరిపోదు. దీనిని రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేయాలి. అప్పుడే కోర్టుతో సహ అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వీలునామాను ఆన్లైన్లో తేలిగ్గా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత దాన్ని రిజిస్టర్ చేయడం వంటి బాధ్యతలు చేపడుతున్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ మినహ వీలునామాకు రూ.15వేల వరకు ఖర్చు అవుతుండగా ఆన్లైన్లో రూ.4 నుంచి రూ.5వేలు ఖర్చు అవడం గమనార్హం. నిజప్రతిలోనూ సవరణలు మన చేతికొచ్చిన వీలునామా నిజప్రతిలో కూడా ఏమైనా సవరణలు అవసరమైతే సరి చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత రుసుము చెల్లించాలి. దీంతోపాటు అవసరమైన వారికి వీలునామాను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను ఈ సంస్థలు తీసుకుంటాయి. ఇ–విల్ సౌకర్యం.. ఎస్బీఐకు చెందిన ఎస్బీఐ క్యాబ్ ట్రస్టీ కంపెనీ ఆన్లైన్ వీలునామా అందుబాటులోకి తేగా.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్టక్చర్, వార్మెండ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటర్స్ (ముంబై) సంయుక్తంగా ఈ సేవలు అందిస్తున్నాయి. హెచ్ఎఫ్సీ సెక్యూరిటీస్ సంస్థ సైతం లీగల్ జినీ అనే సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తుంది. 5దశల్లో పూర్తి.. – సంబంధిత వెబ్సైట్లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న పక్షంలో ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ లభిస్తాయి. వీటి సహాయంతో వీలునామా రాసుకోవచ్చు. – అక్కడి నుంచే నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లి సదరు కంపెనీలు నిర్దేశించిన రుసుము చెల్లించాలి. – ఆ తర్వాత కుటుంబ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. – ఆపైన తదనంతరం మన ఆస్తులు, నగదును ఎవరికి ఎంతమేర బదలాయించాలో తెలుపుతూ సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. – ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మనం నమోదు చేసిన వివరాలన్నీ కంపెనీ లీగల్ నిపుణుల వద్దకు చేరుతాయి. వారు మనం ఇచ్చిన వివరాల ఆధారంగా వీలునామా రాస్తారు. దాని చిత్తు ప్రతిని మనకు ఈ–మెయిల్ చేస్తారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైనచో వాటిని తిరిగి కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సవరణలు పూర్తయిన తర్వాత నిజప్రతి వీలునామా డాక్యుమెంట్‌ను మన ఈ–మెయిల్‌కు లేదా మనం ఇచ్చిన చిరునామాకు 90రోజుల్లో పంపిస్తారు.