
యైటింక్లయిన్‌కాలనీ (పెద్దపల్లి జిల్లా) : టీబీజీకేఎస్‌లో ఎడముఖం.. పెడముఖంగా ఉన్న రాజన్న.. మల్లన్న ఒకే బైక్‌పై ఎక్కారు. విభేదాల నేపథ్యంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరిగింది. సోమవారం సీఎన్‌సీలో జరిగిన టీబీజీకేఎస్ బైక్‌ర్యాలీలో ఇద్దరు ఒకేబైక్‌పై కూర్చుని సందడి చేశారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, మాజీ ఎంపీ వివేక్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.