
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరన్ అవార్డు కింద రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభిం చాయి. వీటితోపాటు 2019 నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామపంచాయతీ దక్కించుకుంది. 2017–18కుగాను ఈ పురస్కారాలకు సంబంధించి పీఆర్‌శాఖకు కేంద్రం నుంచి సమాచారం అందింది. ఈ అవార్డుల్లో భాగంగా జిల్లా ప్రజాపరిషత్‌కు రూ.50 లక్షలు, మండల ప్రజా పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామపంచాయతీలోని జనాభాకు అనుగుణంగా రూ.8 నుంచి 12 లక్షల వరకు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. కేంద్రం నుంచి ఆయా పథకాల కింద అందిన నిధులకు సం బంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించిన గ్రామపంచాయతీలకు అవార్డు మొత్తాన్ని విడుదల చేస్తామని పీఆర్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీబ్‌పట్ జోషి సూచించారు. జిల్లా పంచాయతీ విభాగంలో జనరల్ కేటగిరీ కింద ఆదిలాబాద్ పంచాయతీకి, మండల పంచాయతీ జనరల్ కేటగిరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, వెల్గటూరు ఎంపికయ్యాయి
Comments
Please login to add a commentAdd a comment