awards received
-
రాష్ట్రానికి మరో 7 ‘స్వచ్ఛ’ అవార్డులు.. కేటీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఏడు పట్టణాలకు చోటు దక్కింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో 16 అవార్డులు రాగా, ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది. తాజాగా కాగజ్‌నగర్, జనగామ, ఆమన్‌గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్ వరంగల్ పురపాలికలకు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్ (వేగంగా ఎదుగుతున్న నగరాలు) కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో తెలంగాణ మొత్తం 26 అవార్డులను సాధించినట్లయింది. 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుధ్యం, మున్సిపల్ ఘన..ద్రవ వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశ వ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ఉమ్మి రహిత వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు.. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, ద్రవ..వ్యర్ధాల నిర్వహణ, ప్రజల అవగాహన, సిటిజెన్స్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్ తదితర అంశాలు పరిశీలించారు. అనంతరం అవార్డులు ప్రకటించారు. తక్కువ మున్సిపాలిటీలు.. ఎక్కువ అవార్డులు: కేటీఆర్ రాష్ట్రానికి మరిన్ని స్వచ్ఛ అవార్డులు దక్కడంపై పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశనంలో అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు దక్కుతున్నాయని చెప్పారు. తక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఉన్నప్పటికీ అత్యధిక అవార్డులు దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. తెలంగాణ అద్భుత, వినూత్న కార్యక్రమాలను యావత్ దేశం ఆదర్శంగా తీసుకుంటోందని అన్నారు. ఈ అవార్డులు రావడంలో పురపాలక శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించారంటూ వారిని అభినందించారు. అవార్డులు సాధించిన పురపాలికల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచి్చన పట్టణాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించారు. ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్ -
ఏపీకి అయిదు నేషనల్ వాటర్ మిషన్ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయిదు నేషనల్ వాటర్ మిషన్ అవార్డులు దక్కాయి. జల వనరుల నిర్వహణలో ఉత్తమ పనితీరుకు గాను ఈ అవార్డులు అందాయి. ఏపీ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ అవార్డులు అందుకోనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నీటి నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రాజెక్టుకు మొదటి బహుమతి, నదీ పరివాహక ప్రాతాల్లో సమీకృత నీటి నిర్వాహణ వ్యవస్థ మొదటి బహుమతి లభించింది. అసెస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ వాటర్ రిసోర్స్ అంశంలో రెండవ స్థానం, సూక్ష్మ నీటి పారుదలలో ఏపీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు వాటర్ మిషన్ అవార్డు లభించింది. అదే విధంగా అత్యుత్తమ నీటి నిర్వహణలో పరిశ్రమల శాఖకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు అందింది. -
రాష్ట్రానికి దీన్‌దయాళ్, నానాజీ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరన్ అవార్డు కింద రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభిం చాయి. వీటితోపాటు 2019 నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామపంచాయతీ దక్కించుకుంది. 2017–18కుగాను ఈ పురస్కారాలకు సంబంధించి పీఆర్‌శాఖకు కేంద్రం నుంచి సమాచారం అందింది. ఈ అవార్డుల్లో భాగంగా జిల్లా ప్రజాపరిషత్‌కు రూ.50 లక్షలు, మండల ప్రజా పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామపంచాయతీలోని జనాభాకు అనుగుణంగా రూ.8 నుంచి 12 లక్షల వరకు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. కేంద్రం నుంచి ఆయా పథకాల కింద అందిన నిధులకు సం బంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించిన గ్రామపంచాయతీలకు అవార్డు మొత్తాన్ని విడుదల చేస్తామని పీఆర్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీబ్పట్ జోషి సూచించారు. జిల్లా పంచాయతీ విభాగంలో జనరల్ కేటగిరీ కింద ఆదిలాబాద్ పంచాయతీకి, మండల పంచాయతీ జనరల్ కేటగిరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, వెల్గటూరు ఎంపికయ్యాయి -
ప్రతిభ చూపిన పోలీస్ అధికారులకు నగదు పురస్కారాలు
విజయనగరం లీగల్: కేసుల దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించే పోలీస్ అధికారులకు ఎస్పీ పాలరాజు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారు. సాలూరులో జరిగిన లారీ చోరీ కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించిన సాలూరు సీఐ ఇలియాస్ మహ్మద్, సాలూరు పట్టణ సీఐ ఫకృద్ధీన్, ఏఎస్సై జి.శ్రీనివాసరావు, మక్కువ హెచ్‌సీ జి.సన్యాసిరావు, కానిస్టేబుళ్లు ఎం.వాసుదేవరావు, జి.శివప్రసాద్లతో పాటు డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష పడేలా కృషిచేసిన కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, నారాయణరావులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ విక్రాంత్‌పాటిల్, అదనపు ఎస్పీ ఏవీ రమణ, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పోలీసులకు అవార్డులు
విజయనగరం టౌన్: కేసుల దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వహించే దర్యాప్తు అధికారులకు రాష్ట్ర డీజీపీ ఇచ్చే ‘ఏబీసీడీ’ ( అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్) అవార్డులు విజయనగరం ఎస్పీ జి.పాలరాజు, పార్వతీపురం ఏఎస్పీ ఎమ్.దీపికా పాటిల్, పార్వతీపురం సీఐ జి.రాంబాబు, మక్కువ ఎస్ఐ కె.కృష్ణప్రసాద్, కానిస్టేబుల్ శంకరరావులకు లభించాయి. శాంతిభద్రతలను పరిరక్షించడంలో సమయానుకూలంగా స్పందించిన విజయనగరం రూరల్ ఎస్ఐ పి.రామకృష్ణ, పాచిపెంట ఎస్ఐ ఎ.సన్యాసినాయుడులకు పురస్కారాలు లభించాయి. డీజీపీ ఎమ్.మాలకొండయ్య చేతుల మీదుగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఈ అవార్డులను జిల్లా పోలీస్ అధికారులు గురువారం స్వీకరించారు. పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకంగా భావించే ఏబీసీడీ అవార్డులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసినందుకు మరో రెండు అవార్డులుతో మొత్తం ఏడు అవార్డులు రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లాకు మాత్రమే లభించడం విశేషం. అవార్డుకు ఎంపికైన వివరాలిలా... 2018 ఏప్రిల్ ఏడో తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో గరుగుబిల్లి మండలం ఐటీడీఎ పార్కు సమీపంలో బంగారు ఆభరణాల కోసం తన భర్త యామక గౌరీశంకరరావును గుర్తు తెలియని దుండగలు హత్య చేసి, బంగారు ఆభరణాలు దోచుకుని పోయినట్లుగా యామక సరస్వతి అనే వివాహిత ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్పీ జి.పాలరాజు, పార్వతీపురం ఎఎస్పీ ఎమ్.దీపికా పాటిల్, పార్వతీపురం సీఐ జి.రాంబాబులను రాష్ట్ర డీజీపీ ఎమ్.మాలకొండయ్య ఏబీసీడీ అవార్డులకు ఎంపిక చేశారు. 2017 సెప్టెంబరు 18న చిటికిల రమణమ్మ అనే వివాహిత కనిపించడం లేదని ఆమె భర్త చిటికిల నర్సింహనాయుడు మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదైంది. ఈ కేసు మిస్టరీని చేధించిన మక్కువ ఎస్ఐ కృష్ణ ప్రసాద్, అతనికి సహాయకారిగా వ్యవహరించిన కానిస్టేబుల్ శంకరరావులను ఏబీసీడీ అవార్డుకు ఎంపిక చేశారు. ∙పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో శాంతిభద్రతలు నెలకొనడంలో కృషి చేసిన పాచిపెంట ఎస్ఐ సన్యాసినాయుడుకు ప్రశంసాపత్రం, నగదు రివార్డును అందజేశారు. విజయనగరం మండలం కోరుకొండ గ్రామంలో 2018 మార్చి 25న ఎస్సీలు, బీసీల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో సమాచారం అందుకొని తక్షణమే చేరుకొని శాంతిభద్రతలను కాపాడినందుకు విజయనగరం రూరల్ ఎస్ఐ పి.రామకృష్ణకు ప్రశంసాపత్రాన్ని, నగదు రివార్డును అందజేశారు. -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
నేడు జేఎన్టీయూకేలో పురస్కారాల ప్రదానం బాలాజీచెరువు (కాకినాడ) : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 89 మందిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తూ డీఈఓ ఆర్.నరసింహారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వవలసి ఉన్నా ఆ రోజు వినాయక చవితి కావడంతో శనివార జేఎన్టీయూకేలో జిల్లాకు చెందిన మంత్రులు పురస్కారాలు అందజేయనున్నారు.