
ఎస్పీ పాలరాజు చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందుకుంటున్న పోలీస్ అధికారులు
విజయనగరం లీగల్: కేసుల దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించే పోలీస్ అధికారులకు ఎస్పీ పాలరాజు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారు. సాలూరులో జరిగిన లారీ చోరీ కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించిన సాలూరు సీఐ ఇలియాస్ మహ్మద్, సాలూరు పట్టణ సీఐ ఫకృద్ధీన్, ఏఎస్సై జి.శ్రీనివాసరావు, మక్కువ హెచ్‌సీ జి.సన్యాసిరావు, కానిస్టేబుళ్లు ఎం.వాసుదేవరావు, జి.శివప్రసాద్‌లతో పాటు డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష పడేలా కృషిచేసిన కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, నారాయణరావులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ విక్రాంత్‌పాటిల్, అదనపు ఎస్పీ ఏవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment