ప్రేమోన్మాది ఘాతుకం.. విజయవాడలో వ్యాపారి దారుణహత్య! | Merchant Brutally Murdered In Vijayawada Andhra Pradesh Crime News | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది ఘాతుకం.. విజయవాడలో వ్యాపారి దారుణహత్య!

Published Fri, Jun 28 2024 9:27 AM | Last Updated on Fri, Jun 28 2024 10:55 AM

Merchant Brutally Murdered In Vijayawada Andhra Pradesh Crime News

యువతి తండ్రిపై కత్తితో దాడి.. మృతి

ఎన్టీఆర్‌, సాక్షి: విజయవాడ బృందావన కాలనీలోని గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. యువతి తండ్రిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యాధరపురానికి చెందిన కంకిపాటి శ్రీరామచంద్రప్రసాద్‌(56) లబ్బీపేటలోని బృందావన్‌ కాలనీలో సింధూ భవన్‌ సమీపంలో కిరాణా షాపు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఉదయం వచ్చి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి ఇంటికి వెళ్తుంటాడు. ఆయన కుమార్తె బీ.టెక్‌ పైనలియర్‌ చదువుతుంది.

గత కొన్ని నెలలుగా ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న విద్యాధరపురానికి చెందిన మణికంఠ ప్రేమిస్తున్నానని తనను పెళ్లిచేసుకోమని శ్రీరామచంద్రప్రసాద్‌ కుమారై వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు మణికంఠను మందలించారు. గురువారం సాయంత్రం తండ్రితో పాటు కుమార్తె కూడా షాపునకు వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇద్దరు ఇంటికి బయలుదేరుతున్నారు.

ఆ సమయంలో వారిపై కోపం పెంచుకున్న మణికంఠ షాపు వద్దకు చేరుకున్నాడు. అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీరామచంద్రప్రసాద్‌పై దాడి చేసి నరికి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే వ్యాపారి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మణికంఠను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement