Andhra Pradesh: Wife Planned To Kill Husband With Sleeping Pills In Biryani - Sakshi
Sakshi News home page

భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. ప్లాన్‌ ప్రకారం ప్రియుడు రాక.. అక్కడే ట్విస్ట్‌!

Published Fri, Jul 7 2023 1:44 AM | Last Updated on Fri, Jul 7 2023 1:47 PM

- - Sakshi

విజయనగరం క్రైమ్‌: వివాహేతర సంబంధం మోజులో ఉన్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలిపించి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో భర్తకు తెలివివచ్చి కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. బాధితుడు తేరుకుని టూటౌన్‌ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టూటౌన్‌ సీఐ సీహెచ్‌.లక్ష్మణరావు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరివీధికి చెందిన కోటరాజు, భార్య శ్రీదేవి, పిల్లలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు.

శ్రీదేవికి చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనే ఉద్దేశంతో మట్టుబెట్టాలని ప్రణాళిక వేసింది. తన భర్తను చంపేయమని రఘుకు చెప్పింది. వెంటనే రఘు ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గర నుంచి నిద్రమాత్రలు కొని శ్రీదేవికి ఇచ్చాడు. అవి తీసుకుని శ్రీదేవి భర్త రాజుకు బుధవారం రాత్రి మటన్‌ బిర్యానీలో కలిపి తినిపించింది.

వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్‌ సీఐ సీహెచ్‌.లక్ష్మణరావు (వెనుక ముసుగులో నిందితులు)

రాజు నిద్రలోకి జారుకున్న తర్వాత రఘుకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని పిలవగా వరుసకు బావమరిది అయిన బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను సహాయం కోరి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరూ వచ్చారు. వారు తెచ్చుకున్న నైలాన్‌ తాడును రాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చిన రాజు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయా రు.

ఈ మేరకు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రఘు, శ్రీను, శ్రీదేవిలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై షేక్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement