
పార్వతీపురం: కన్న కుమారుడు చెప్పిన మాట వినడంలేదని మనస్తాపం చెందిన ఓతల్లి సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం జరిగిన సంఘటనపై పార్వతీపురం అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కొమరాడ మండలం గుమడ గ్రామానికి చెందిన మామిడి నాగినికి 16 ఏళ్ల కుమారుడు నితిన్ ఉన్నాడు. నితిన్ వీధిలో ఉన్న ఇతర స్నేహితులతో కలిసి హైదరాబాద్, చెన్నై వెళ్లిపోతానని అంటున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వెళ్లిపోతే ఎలా అని తల్లి నాగిని మనస్తాపానికి గురై సోమవారం రాత్రి తలకు రాసుకునే సూపర్ వాస్మోల్ తాగేసింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.