
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయిదు నేషనల్ వాటర్ మిషన్ అవార్డులు దక్కాయి. జల వనరుల నిర్వహణలో ఉత్తమ పనితీరుకు గాను ఈ అవార్డులు అందాయి. ఏపీ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ అవార్డులు అందుకోనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నీటి నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రాజెక్టుకు మొదటి బహుమతి, నదీ పరివాహక ప్రాతాల్లో సమీకృత నీటి నిర్వాహణ వ్యవస్థ మొదటి బహుమతి లభించింది. అసెస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ వాటర్ రిసోర్స్ అంశంలో రెండవ స్థానం, సూక్ష్మ నీటి పారుదలలో ఏపీ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు వాటర్ మిషన్ అవార్డు లభించింది. అదే విధంగా అత్యుత్తమ నీటి నిర్వహణలో పరిశ్రమల శాఖకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు అందింది.
Comments
Please login to add a commentAdd a comment