
సాక్షి,న్యూఢిల్లీ: పోలవరం ఏపీకి జీవనాడి అని,పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడ రఘునాథ్‌రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) మీడియాతో మాట్లాడారు.
‘150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపైన దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. స్టీల్ ప్లాంట్‌కు ప్లాంటుకు అవసరమైన గనులు కేటాయించాలి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలి. వ్యక్తిగతంగా మా పైన, మా పార్టీ అధ్యక్షుడిపైన మాట్లాడడం మానుకోవాలి. మిర్చి రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది. మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో మేము మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నాం’అని వైవీసుబ్బారెడ్డి తెలిపారు.
ఎత్తు తగ్గిస్తే బనకచర్లకు నీళ్లు సాధ్యం కాదు: మిథున్‌రెడ్డి
- పోలవరం ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్ల ఖర్చు అవుతుంది
- కానీ కేవలం రూ. 30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారు
- పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల బనకచర్లకు నీళ్లు తరలించడం సాధ్యం కాదు
- ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం 45 మీటర్ల ఎత్తు ఉండాలి
- రాష్ట్రం నష్టపోతుంటే, టీడీపీ ఎంపీలు చూస్తూ కూర్చుంటున్నారు
- రాష్ట్రంలో మెడికల్ సీట్లను సరెండర్ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోంది
- వ్యక్తిగత ఆరోపణలకు పార్లమెంటును వేదికగా మార్చుకోవద్దు
- సీఎం రమేష్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) లోక్‌సభలో అన్నారు. సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని చురకంటించారు. మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌పై విచారణ జరగాల్సిందేనని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీపై కేంద్రం చిన్నచూపు: పిల్లి సుభాష్‌చంద్రబోస్
- బీహార్‌కు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీక ఇవ్వడం లేదు
- టీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల ఉపయోగం లేదు
- పార్లమెంటును రాష్ట్ర ప్రయోజనాల కాపాడేందుకు సద్వినియోగం చేసుకోవాలి
- టీడీపీ ఎంపీలు పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారు
- మేము మాట్లాడుతుంటే అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదు
- పోలవరం ఎత్తు తగ్గింపు రైల్వే జోను ఇతర అంశాలపై ఐక్యంగా పోరాడుదాం
- ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడింది
- రైతులను ఆదుకోవాలని మేము అడుగుతుంటే టీడీపీ వారు సభలో అడ్డుకుంటున్నారు
- రైతులను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది
ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడ్డారు: వైఎస్ అవినాష్‌రెడ్డి
- విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయించడం చంద్రబాబు రాజీ పడ్డారు
- 25 వేలకోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారు
- పోలవరం ఎత్తును కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది
- రూ. 57 వేలకోట్లకుగాను 30 వేలకోట్ల రూపాయలకు పోలవరాన్ని పరిమితం చేశారు
- 27 వేల కోట్ల గ్రాంట్ వదిలేశారు ఫలితంగా అమరావతికి 15000 కోట్ల అప్పు సాధించారు
- పోలవరం ఎత్తును, కెపాసిటీ తగ్గించి రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు
- 16 మంది ఎంపీల మద్దతు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడడం లేదు
- చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు
- మేము ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు
- కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్‌ను తీసుకొస్తే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు
- దాని ఫలితంగా ఆయన మహారాష్ట్రకు వెళ్లిపోయి మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు
- చంద్రబాబు చర్యల వల్ల యువత రైతులు నష్టపోయారు
- 9 నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు ఏ వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు రాజీపడుతున్నారు
కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలను మానుకోవాలి:గురుమూర్తి
- తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నాపై దాడికి పాల్పడ్డారు
- ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేశారూ
- ఒక్కరే సభ్యులు ఉన్న టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది
- పార్లమెంట్‌లో రాష్ట్రం పరువు తీయొద్దు
- శిఖండి తరహా రాజకీయాలకు పాల్పడవద్దు
- మాపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు
సంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి అప్పులు చేస్తున్నారు:గొల్లబాబూరావు
- సూపర్ సిక్స్ పేరుతో జనం చెవులలో ఊదరగొట్టారు
- ఒక్క హామీ కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నారు
- చంద్రబాబు వల్ల మోసపోయామని జనం అంటున్నారు
- వైఎస్ జగన్ మాటిస్తే వెనక్కి పోరు
- రాష్ట్ర ప్రయోజనాలపై మేము టీడీపీతో కలిసి వస్తాం
- తమిళనాడు కర్ణాటక ఎంపీల తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి
ఏపీకి న్యాయం జరగాలనే మా పోరాటం: మేడ రఘునాథ్‌రెడ్డి
- తిరుపతి ఐఐటీకి అదనపు నిధులు కావాలి
- తిరుపతిని నూతన రైల్వే డివిజన్ చేయాలని సభలో కోరా
- పార్లమెంటులో ఏపీ పరువు తీయొద్దు
- సాధ్యమైనంత ఎక్కువగా ఏపీకి నిధులు వెళ్లేలా మేమే చొరవ తీసుకుంటున్నాం
- వ్యక్తిగత విమర్శలుమాని, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ఎంపీలు పనిచేయాలి
Comments
Please login to add a commentAdd a comment