pressmeet
-
స్టీల్ ప్లాంట్‌ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్‌షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్‌కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు. -
భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు. భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు -
వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలవంతంగా పెట్టించిన కేసులో విషయం ఏమీ లేకపోవడంతో ఏసీబీ అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ‘పాడిందే పాడరా’ అన్నట్లు 82 ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారు. తెలంగాణ ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లుగా నిబద్ధతతో, పైసా అవినీతికి తావు లేకుండా పనిచేశా అని చెప్పా. ఏసీబీ మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా.ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటా. ఏడాది కాలంగా లగచర్ల, హైడ్రా, విద్యుత్ చార్జీల పెంపు వంటి అనేక అంశాలపై కొట్లాడుతున్నాం. కేసులు పెట్టి మా కేడర్, ప్రజల దృష్టిని రేవంత్ మళ్లించలేరు. అవసరమైతే తెలంగాణ కోసం చస్తాను తప్ప ఇలాంటి కేసులకు తలవంచేది లేదు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులతో విచారణకు హాజరైన కేటీఆర్.. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఉదయం విచారణకు వెళ్లే ముందు నందినగర్ నివాసం వద్ద కూడా ఆయన మాట్లాడారు.అణా పైసా అవినీతి లేదని చెప్పా‘తెలంగాణకు పెట్టుబడులు తేవడం, ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలనే దూరదృష్టితో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కష్టపడి ఫార్ములా ఈ రేస్‌ను తెచ్చానని చెప్పా. ఇందులో అణాపైసా అవినీతి లేదని స్పష్టం చేశా. అలాంటి గలీజు పనులు చేయడం రేవంత్‌కు అలవాటు అని కుండబద్ధలు కొట్టి చెప్పా. ఇక్కడ నుంచి డబ్బులు పంపాం.. డబ్బులు అందినట్లు ఎఫ్ఈఓ (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) వాళ్లు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని చెపితే ఏసీబీ అధికారులు నీళ్లు మింగుతున్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ ఇతరులను కూడా పంపి పైశాచిక, శునకానందం పొందాలని చూస్తున్నాడు. రేవంత్ తరహాలో నేను లుచ్చా పనులు చేయలేదు. కేబినెట్లో ఉంటూ లాండ్ క్రూజర్లు కొనుగోలు చేయలేదు. బావ మరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టు ఇవ్వలేదు. రేవంత్ తరహాలో డబ్బు సంచులతో దొరకలేదు. పెట్టుబడులు తెచ్చేందుకు విదేశాలు తిరిగా. రేవంత్ పెట్టే కేసులకు భయపడేవారెవరూ తెలంగాణలో కానీ బీఆర్ఎస్లో కానీ లేరు..’ అని కేటీఆర్ అన్నారు.రేవంత్‌ను ఎవరూ సీఎంగా గుర్తించడం లేదు‘ఇదొక లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం. రాష్ట్రంలో రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. తనను గుర్తించని వారిపై కేసులు పెట్టి లోపలేస్తున్నడు. ఏడాది తర్వాత కూడా ఆయనను ఎవరూ సీఎంగా గుర్తు పట్టకపోతే నేనేం చేయాలి. కేసులకు భయపడేది లేదు, బాధపడేది లేదు. లేని అవినీతిని పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎక్కడ దొరుకుతుంది? ఏసీబీకి రేవంత్ మళ్లీ ప్రశ్నలు పంపితే తిరిగి పిలుస్తారేమో. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంది. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతా. కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాదంతా రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఉంటాం. ఎంత కొట్టినా రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పెన్షన్, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టం వస్తే మేమున్నామంటూ వచ్చిన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎల్లోమీడియాకు అంబటి రాంబాబు వార్నింగ్
సాక్షి,గుంటూరు: ఎల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం(జనవరి6) అంబటి మీడియాతో మాట్లాడారు. ‘పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం.మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేం మీలా కక్ష సాధింపులకు పాల్పడం. గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు. చనిపోయిన వారికి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్‌చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు. సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరివల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు.రోడ్డుబాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని అంబటి రాంబాబు అన్నారు. -
నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా
-
2023 కంటే 2024 చాలా బెటర్..
-
ఆరు నెలలు అయ్యింది.. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది
-
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం
-
హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
-
రేవంత్ కుంభకోణాలు బయటపెడుతున్నందుకే..
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభోణా లను బయట పెడుతున్నందునే రాష్ట్ర ప్రభుత్వం మాపై రాజకీయ వేధింపులకు దిగుతోంది. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగి నట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని సవాలు చేస్తున్నా. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని సీఎం, దద్దమ్మ మంత్రులు లీకులతో దుష్ప్రచారం చేస్తు న్నారు. సీఎం, మంత్రులకు ఈ అంశంపై అవగా హన ఉంటే అసెంబ్లీ సాక్షిగా అవినీతిని బయట పెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంలో అణా పైసా వృథా కాలేదు అనేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నా యి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రేసులు రద్దయ్యాయి. దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పేరు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసా లను ప్రజాస్వామ్య యుతంగా ప్రజల ముందు పెడతాం. నాపై నమోదైన కేసులపై చట్ట ప్రకారం ముందుకు వెళతాం. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఉద్యమకారులం, అణిచివేతలు, చిల్లర కుట్రలకు భయపడకుండా కొట్లాడతాం..’ అని అన్నారు. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు.‘ఈవీ’కి తెలంగాణను హబ్‌గా చేయాలనుకున్నాం..‘కేసీఆర్ నాయకత్వంలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఎలక్ట్రిక్ వాహన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ఫార్ములా–ఈ రేస్’ను నిర్వహించాలని భావించాం. నాలుగు సీజన్ల పాటు నిర్వహించేలా 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరింది.2023 ఫిబ్రవరి 10న తొలి సీజన్ రేసింగ్ నిర్వహించాం. రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ రూ.35 కోట్లు, ప్రమోటర్ సంస్థ గ్రీన్ కో రూ.110 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల అదనంగా రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని నీల్సేన్ సర్వే సంస్థ తెలిపింది. అయితే నష్టాలను కారణంగా చూపుతూ రెండో సీజన్లో ప్రమోటర్ గ్రీన్ కో తప్పుకోవడంతో హెచ్ఎండీఏ నుంచి రెండు విడతల్లో రూ.55 కోట్లు చెల్లించాలని నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ఆదేశించా. ఎలాన్ మస్క్‌ను రప్పించి ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈవీ రంగానికి తెలంగాణను హబ్‌గా ప్రమోట్ చేయాలని అనుకున్నాం..’ అని కేటీఆర్ తెలిపారు.అవినీతే జరగనప్పుడు కేసు ఎలా?‘ఈ నేపథ్యంలో తదుపరి చెల్లింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ఫార్ములా–ఈ సంస్థ కోరింది. దీని సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లొంగోతో అదే నెల 13న సీఎం రేవంత్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సమావేశయ్యారు. తర్వాత రేస్ నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ, కాంట్రాక్టు నిబంధనలు ప్రస్తావిస్తూ డిసెంబర్ 21 లోగా నిర్ణయం తెలపాలని సంస్థ లేఖ రాసింది. డిసెంబర్ 26 వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రేస్ నిర్వహణ సాధ్యం కాదని చెప్తూ నిర్వాహక సంస్థ రూ.73 లక్షల రేస్ ఫీజును కూడా వెనక్కి పంపింది. ఎఫ్ఈఓ ఎన్నిమార్లు కోరినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫీజును వెనక్కి తీసుకోవడం లేదు. రూ.55 కోట్లు రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని నిర్ధారిస్తూ మూడో వాయిదా చెల్లించడంపై ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో సంస్థ సంప్రదింపులు కొనసాగించింది. అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్ఎండీఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. అవినీతే జరగనప్పుడు కేసు నమోదు చేసే అంశం ఏసీబీ పరిధిలో లేదు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హరీశ్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా–ఈపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టింది..’ అని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఫార్ములా వన్ యోచన‘చంద్రబాబు హయాంలో 2001లో ‘ఫార్ములా వన్’ నిర్వహించాలనుకున్నారు. ట్రాక్ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన 15 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ విషయాన్ని 2013 ఎన్నికల అఫిడవిట్లోనూ రేవంత్ ప్రస్తావించారు. ట్రాక్ ఏర్పాటు కోసం గోపన్‌పల్లిలో మొత్తం 580 ఎకరాల భూ సేకరణకు గతంలో రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ట్రాక్ ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి పోగా రైతులు తమ భూమి కోసం నేటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు..’ అని కేటీఆర్ వివరించారు.రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు ఫార్ములా–ఈ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని కేటీఆర్ అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని చెప్పారు. ‘రేవంత్.. ఏం చేసుకుంటావో చేసుకో.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదానీతో అనుబంధంపై మీ సీఎంను ప్రశ్నిస్తారా?రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖఅదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధంపై ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేందుకు మౌనంగా ఉంటారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీకి వ్యతిరేకంగా నిరసనల పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాహుల్‌గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.జాతీయ స్థాయిలో అదానీపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం రేవంత్ నాయకత్వంలో అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే, తెలంగాణలో అదానీ గ్రూప్‌నకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడం విడ్డూరంగా ఉందన్నారు. గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌కు ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం పరస్పర ప్రయోజనాలకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు‘ఫార్ములా–ఈ రేసు ఆరోపణల్లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమ్మకం ఉంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్‌లాగా తయారైంది’ అని అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు: గడికోట
సాక్షి,తాడేపల్లి:ప్రపంచంలో ఏ నియంత చేయని దుర్మార్గాలను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.గురువారం(డిసెంబర్19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నిటిలో తనకుతానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం హాస్యాస్పదంగా ఉంది.జడ్జిల మీద నిఘా పెట్టటం ఎంతవరకు సమంజసం? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నలుగురు ఐపీఎస్‌లను కూడా సస్పెండ్ చేశారంటే ఇది నియంత పోకడ కాదా? ఈ తప్పులను ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.అరెస్టు చేయడానికి వచ్చే పోలీసులు కనీసం ఐడీ కార్డులు కూడా చూపడం లేదు.రాష్ట్ర అప్పుల విషయంలో చంద్రబాబు విష ప్రచారం చేశారు.పార్లమెంటు చెప్పిన మాటలను కూడా తప్పుదారి పట్టించారు.అప్పులేకాదు ప్రతి విషయంలోనూ దుష్ప్రచారం చేశారు.వైఎస్ జగన్ తన హయాంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు.చేసిన మంచిని కూడా వైఎస్ జగన్ చెప్పుకోలేకపోయారు.ఇప్పుడు ఈ విషయాన్ని జనం గుర్తించి సొంతంగా ప్లెక్సీలు పెడుతున్నారు.చంద్రబాబు చేసిందంతా విధ్వంస పాలన.రూ.50 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేస్తున్న చంద్రబాబు మిగతా ప్రాంతాల సంగతేంటో చెప్పాలి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు భాగం కాదా? వైఎస్ జగన్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తే చంద్రబాబు ఆ రికార్డులు చూపించాలి.చంద్రబాబు ష్యూరిటీ,వీరబాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది’అని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
మరోసారి మీడియాతో అల్లు అర్జున్
-
అరెస్ట్ పై అల్లు అర్జున్ ప్రెస్ మీట్
-
అది ‘విద్యా మీట్’ కాదు..దగా మీట్: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు? రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్‌లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్ జగన్ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..? -
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్‌కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి.. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించింది
-
కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లే: కారుమూరి
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలును గాలికి వదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధానకార్యాలయంలో శుక్రవారం(నవంబర్29) కారుమూరి మీడియాతో మాట్లాడారు.‘రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లోమీడియాలో కూడా వార్తలు వచ్చాయి. రైతులకు ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.నేరుగా రైతుల ఖాతాలోనే నగదు వేశాం. మధ్యలో దళారుల ప్రమేయమే లేదు. ఇప్పుడు మళ్ళీ దళారులు,మిల్లర్లు సిండికేట్ అయి దోచుకుంటున్నారు.అసలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు.ఈక్రాప్,ఇన్సూరెన్స్ అనేవి లేనే లేవు.ఎక్కడ చూసినా రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా ధాన్యం కనపడుతోంది.మా హయాంలో జియోట్యాగ్ చేసి ధాన్యం లారీ ఎటు వెళ్తుందో గమనించేవాళ్లం.ఇప్పుడు ఆ జియోట్యాగ్ తీసేయటం వెనుక ఉద్దేశం ఏంటి?టీవీల్లో షోలు చేయటం తప్ప రైతులకు ఎలాంటి మేలు చేయడం లేదు.ప్రభుత్వం కనీసం ఒక్క మీటింగ్ కూడా రైతుల కోసం పెట్టలేదు.ఇదేనా రైతుల మీద ఉన్న ప్రేమ? జగన్ హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 అందేవి.ఇన్పుట్ సబ్సిడీ అందేది.ఇప్పుడు ఏ ఒక్క పథకమూ అందడం లేదు.రేషన్ బియ్యం ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.రేషన్ మాఫియా మళ్ళీ రెచ్చిపోతోంది.షిప్పులలో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?చౌకడిపోల ద్వారా మా హయాంలో చాలా రకాల సరుకులు అందించాం.ఇప్పుడు బియ్యం,పంచదార తప్ప మరేమీ ఇవ్వడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి’అని కారుమూరి డిమాండ్ చేశారు. -
సంక్షేమ పాలన అనగానే గుర్తొచ్చేది YSRCP ప్రభుత్వం
-
Watch Live: YS జగన్ సంచలన ప్రెస్ మీట్..
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
-
పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే తప్పులేదా ?
-
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(నవంబర్20) నిర్వహించిన మీడియా సమావేశంలో పోలవరం జాప్యం వెనుక అసలు విషయాలను వైఎస్ జగన్ వివరించారు. ‘ఇది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు తప్పిదం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయన్నది స్పష్టంగా చెప్పింది. పోలవరం వద్ద గోదావరి నది దాదాపు 2.5 కిలోమీటర్ల వెడెల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కద ప్రాజెక్టు కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్‌వే పనులు పూర్తి చేయాలి.కానీ అవి పూర్తి చేయలేదు. అవి పూర్తి కాకుండానే కాఫర్‌డ్యామ్ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్ డ్యామ్ పనులు చేయాలి. నదికి అటు,ఇటు రెండు కాఫర్‌డ్యామ్‌ల పనులు మొదలుపెట్టాడు. అంటే ఒకవైపు స్పిల్‌వే పూర్తి చేయలేదు.మరోవైపు మెయిన్డ్యామ్కు ఫౌండేషన్ వేశారు. ఎందుకంటే అవన్నీ ఎర్త్‌వర్క్‌లు..కమీషన్లు వస్తాయి. సిమెంటు పనులైతే కమిషన్లు రావు. ఈలోగా సీజన్ వచ్చింది. కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయలేదు. దాంతో నీరు పోవడానికి కాఫర్డ్యామ్పై రెండు గ్యాప్‌లు వదిలారు. అప్పుడేం జరిగింది. రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న నది, ఇక్కడికి రాగానే 400 మీటర్ల మేర తగ్గింది.ఆ ఉధృతికి ప్రాజెక్టు ఫౌండేషన్ అయిన డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. చంద్రబాబు హయాంలోనే 2018–19లోనే భారీ వరదలకు అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే మేం రాగానే స్పిల్‌వే పూర్తి చేశాం. దాంతో నీరు క్లియర్‌గా వెళుతున్నాయి. కాఫర్‌డ్యామ్ మరమ్మతులు మేమే చేశాం. ఇక డయాఫ్రమ్‌వాల్‌ను ఏం చేయాలి? మళ్లీ కట్టాలా? వద్దా అనేది నిపుణులు తేల్చాలి.చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం పనులు నాశనమయ్యాయి. అయినా అదే పనిగా దుష్ప్రచారం. ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది’అని పోలవరంపై చంద్రబాబు మోసాలను వైఎస్జగన్ ఏకరువు పెట్టారు. -
కొడంగల్‌లో మణిపూర్ తరహా ఘోరాలు: కేటీఆర్
సాక్షి,న్యూఢిల్లీ: వికారాబాద్ జిల్లా లగచర్లలో అర్థరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో సోమవారం(నవంబర్18) లగచర్ల ఫార్మాసిటీ బాధితులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. మణిపూర్ తరహాలో కొడంగల్‌లో అత్యాచారాలు: కేటీఆర్సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్‌లో గిరిజనులను బెదిరిస్తున్నాడులగచర్లలో గిరిజనులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారుఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటే దాడులు చేస్తారా ?పీఎం మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదుమణిపూర్ తరహాలోనే కొడంగల్ లో అత్యాచారాలు జరుగుతున్నాయిరాజ్యాంగ రక్షకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ ఈ అంశంపై నోరు విప్పాలిగిరిజనుల గోడు వినాలని సీఎం రేవంత్ ను రాహుల్ ఆదేశించాలిగిరిజనుల భూమి లాక్కుంటున్నా రాహుల్, మల్లికార్జున ఖర్గే నోరు మెదపడంలేదుఉపన్యాసాలతో కాకుండా చేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలిప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది:లగచర్ల ఫార్మా బాధితులురేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే, మమ్మల్ని రోడ్డు మీదకు తెచ్చారుతొమ్మిది నెలలు నుంచి ధర్నాలు చేస్తున్నాంకలెక్టరు కాళ్ళు మొక్కినం అయినా మా గోడు వినడం లేదుమా భూముల జోలికి రావొద్దుమా వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలిరాత్రి పూట పోలీసులు వచ్చి పిల్లల్ని పట్టుకుపోయారుమా ప్రాణం పోయినా ఫర్వాలేదు, భూమి ఇచ్చే ప్రసక్తి లేదుమా గ్రామాల్లోనే ఎందుకు ఫార్మ కంపెనీ పెడుతున్నారుభూమి పై ఆధారపడి బతుకుతున్నాంమమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టిస్తున్నారుఫార్మా కంపెనీలు వల్ల కాలుష్యం పెరిగి మా బతుకులు మసి చేస్తున్నారురైతులను రోడ్డుపైకి ఈడుస్తున్నారునాపై దాడి జరగలేదని కలెక్టరే అన్నారుమహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారుపోలీసులను శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి -
వైఎస్ జగన్ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్
సాక్షి,తాడేపల్లి:వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం(నవంబర్ 18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్ మీడియాతో మాట్లాడారు.‘మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు,మంద కృష్ణ చూస్తున్నారు.మాల,మాదిగలను రెండు కళ్లుగా వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబులాగ రాజకీయాలకు వాడుకోలేదు.సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ వైఎస్ జగన్‌ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు.అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలా చూడాలి. కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం.కొమ్మూరి కనకారావు కామెంట్స్...మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడువర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారుముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదేమాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారురెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడుపెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదుమరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్?ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి?చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్‌ను దూషించడంంకరెక్టు కాదువైఎస్ జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారుఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు వైఎస్ జగన్ ఇచ్చారుచంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, వైఎస్ జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారుచర్మకారులు, డప్పు కళాకారులకు వైఎస్ జగన్ పెన్షన్లు ఇచ్చారుచంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు -
బడ్జెట్లో పథకాలకు నిధులు సున్నా: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి,తాడేపల్లి: పథకాలకు కేటాయింపులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్‌ను రూ.41వేల కోట్లు పెంచిందని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌పై సోమవారం(నవంబర్ 11)తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటో అప్పో చెప్పలేదు. మైనస్‌లో ఉన్న మీరు ఆరు నెలల్లో రూ.24 వేల కోట్ల ఆదాయం ఎలా పెంచుతారు. అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి ఇస్తారో చెప్పలేదు. దీనికి బడ్జెట్లో పెట్టింది. కేవలం రూ.1000కోట్లు. ఈ పథకం అమలు చేయాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఊసే లేదు. పథకాలకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గించారు’అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రెస్మీట్లో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదు నెలలపాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు బడ్జెట్ పెట్టలేదు?ఐదు నెలలపాటు బడ్జెట్ పెట్టకపోవడం గండికోట రహస్యంగా మారింది.గత ప్రభుత్వం" అనే మాటని 21 సార్లు ఉపయోగించారు.మేనిఫెస్టో అమలు చేస్తారని భావించిన వారికి నిరాశ కలిగేలా బడ్జెట్ ఉంది.గత ప్రభుత్వం కంటే రూ.41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఎలాంటి పథకాలు అమలు చేయకుండానే ఇంత ఖర్చు ఎందుకో అర్థం కావడం లేదు.అమరావతి కోసం పెట్టే రూ.15 వేల కోట్ల ఖర్చు అప్పా? గ్రాంటా? ఆ లెక్కలకు క్లారిటీ ఇవ్వలేదు.మా హయాంలో ఆదాయం పెరిగితే చంద్రబాబు హయాంలో మైనస్ వచ్చింది.తల్లికివందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు.ఎవరికీ ఈ పథకాన్ని అమలు చేయకుండానే చేసినట్టు మాట్లాడారు.ఇంతకంటే అన్యాయం ఉంటుందా?రూ.10,706 వేల కోట్లకుపైగా అన్నదాత సుఖీభవకు ఇవ్వాల్సి ఉండగా వెయ్యి కోట్లు మాత్రమే ఇవ్వడమేంటి?మహిళలకు ఉచితబస్సు గురించి ప్రస్తావనే లేదు.కరెంటు సంస్థలకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొడితే మా ప్రభుత్వం చెల్లించింది.కానీ మా ప్రభుత్వం వల్ల కరెంటు సంస్థలకు నష్టాలు వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.గతంలో కూడా రూ. 87వేల కోట్లు రైతురుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.15 వేల కోట్లు చేశారు.డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీలు 21వేల కోట్లు చెల్లించకుండా మోసం చేశారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గొట్టారు.మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి గెలిచారు.2009,2014,2019,2024 లో వరుసగా అవే హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తూ వచ్చారు.అమరావతి ఏ రకంగా గొప్ప నగరమో తెలియదు.ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకుని కడతామంటున్నారు.మా హయాంలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తామో వివరంగా జనానికి తెలిపాం.ఎన్నికల సమయంలో ఆసరా డబ్బు ఇవ్వనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఎల్లోమీడియాలో తెగ వార్తలు రాశారు.మరి ఇప్పటి అప్పులు కనపడటం లేదా?రూ.14లక్షల కోట్ల అప్పులు చేసినట్టు గతంలో మాపైఆరోపణలు చేశారు.కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే రూ. 4 లక్షల కోట్లుగా అప్పు చేసినట్టు లెక్కలు చూపెట్టారు.మాపై తప్పుడు సమాచారం ప్రచురించిన మీడియా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.2014-19 మధ్య చంద్రబాబు చేసిన అప్పులకంటే మా హయాంలో చాలా తక్కువగా అప్పులు చేశాం.ప్రజలంతా పరిస్థితులను గమనించాలి.మోసపూరిత మాటలు ఎవరు చెప్తున్నారో? ప్రజలకోసం ఎవరు చేస్తున్నారో చూడాలిఇదీ చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు