సాక్షి,తాడేపల్లి: టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.
‘జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ కలిసి వైఎస్‌జగన్‌పై కేసు పెట్టాయి. హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదలాయించారు. షేర్లను బదలాయించినందువల్లే జగన్ ఎన్‌సీఎల్టీని ఆశ్రయించారు
ఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు. చెల్లిపై ప్రేమ ఉన్నందునే వైఎస్‌జగన్ షర్మిలకు ఎంవోయూ చేసుకున్నారు. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా’అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
వైవీసుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
- సరస్వతి సిమెంట్స్ ప్రాపర్టీ ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి.
- అయినాసరే షేర్లు బదలాయించుకోవటం వెనుక కుట్ర ఉంది.
- 2019 ఆగస్టులో వైఎస్‌జగన్, షర్మిల ఎంవోయూ రాసుకున్నారు
- ప్రాపర్టీ చూసుకున్నాకనే షర్మిల సంతకాలు పెట్టారు
- జగన్ ప్రేమ అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారు.
- కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.
- ఇప్పుడు షర్మిల చేస్తున్న రాద్దాంతమంతా ఆస్తుల కోసమే అని అర్థం అవుతోంది.
- షర్మిలకు లీగల్ గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కొనేవారు.
- జగన్ ఒక్కరే జైలుకు ఎందుకు వెళ్తారు?
- జగన్ కు వచ్చిన డివిడెండ్ నుంచి షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చారు.
- జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ జగన్ పెట్టుకున్న పరిశ్రమలు.
- వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఈ కంపెనీలు పెట్టుకున్నారు.
- అందులో షర్మిలకు వాటాలు ఉంటే అప్పుడే రాసిచ్చేవారు.
- షర్మిల అబద్దాలాడుతున్నారు
వైఎస్ జగన్ ఇంట్లో చిచ్చుపెట్టి చంద్రబాబు చలిమంట కాచుకుంటున్నారు: పేర్నినాని
- వైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారు
- తండ్రి ఆశయం కోసమైతే చంద్రబాబు కోసం పనిచేస్తారా
- వైఎస్సార్‌ను అభిమానించేవారు ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు.
- గత మూడు నాలుగు రోజులుగా వైఎస్‌జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు.
- షర్మిల తాపత్రయం అంతా ఆస్తుల కోసమే..తండ్రి ఆశయాల కోసం కానేకాదు
- వ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎలా వచ్చింది?
- చంద్రబాబు అక్రమ రాజకీయాలకు ఇది నిదర్శనం
- కేంద్రంలో బీజేపీతో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నారు
- కాంగ్రెస్‌కు తాము వ్యతిరేకమని చెప్పి చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారు?
- రాజకీయ వింత బంధాలను ఏపీలోనే చూస్తున్నాం
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంవెనుక జగన్ కష్టం,కార్యకర్తలే కారణం
- షర్మిలతో మాలాంటోళ్లు చాలామంది పని చేశాం
- మాలాంటి 30,40 మంది పదవులు వదులుకుని వచ్చారు
- టీడీపీ నుండి చాలామంది వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు
- కానీ ప్రధానమైన కష్టం,నష్టం అంతా జగన్,కార్యకర్తలదే
- షర్మిలతో పాదయాత్ర వద్దని నేనే స్వయంగా జగన్‌తో చెప్పాను
- భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్‌కి చెప్పాను
- కానీ నా కుటుంబంలో అలాంటివేమీ రావని జగన్ చెప్పారు
- కంపెనీల్లో షర్మిలకు వాటాలు ఉంటే ఆమెని కూడా డైరెక్టర్‌గా వైఎస్సార్ పెట్టేవారు
- అలా జరగ లేదంటే షర్మిలకు సంబంధం లేదనే అర్థం కదా
- చంద్రబాబు అనవసరంగా జగన్ కుటుంబ సభ్యుల గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారు
- జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికలకు వాడుకుని ఎందుకు వదిలేశారు?
- చంద్రబాబు నైజంపై ఆయన తోడళ్లుడే పుస్తకం వేశారు
- అసలు చంద్రబాబు తన తోడబుట్టినవారికి ఏం ఆస్తులు రాసిచ్చారు?
- చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారింది
ఇదీ చదవండి: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు షర్మిలా..?
Comments
Please login to add a commentAdd a comment