సాక్షి,ఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సురేష్‌రెడ్డితో కలిసి మంగళవారం(జులై 9) ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.
‘ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే. సీఎం రేవంత్ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్ గొప్పలు చెపుతోంది. ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అది పోచారం దాకా వచ్చింది.
ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోంది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు. రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు కూడా గాలికి వదిలేశారు.
ఆరు గ్యారెంటీలు వదిలేసి, మా పార్టీకి చెందిన ఆరుగురు ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలను కాంగ్రెస్ చేర్చుకుంది. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం. లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బీఆర్‌ఎస్ ఎంఎల్ఏను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు’అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఓటమిపై కేటీఆర్ కీలక కామెంట్స్
- పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా ఏపీలో వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది
- అయినా వైఎస్‌ఆర్‌సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదు
- పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి
- వైఎస్‌జగన్‌ను ఓడించేందుకు షర్మిల ను పావులా ఉపయోగించారు
- అంతకు మించి షర్మిల ఏమీ లేదు
- ప్రతి రోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే
- ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది
- మా వైఖరి మార్చుకోవాలి
- ప్రజలది తప్పు అనడమంటే.. మాదే తప్పు
- హైదారాబాద్‌లో అన్ని సీట్లు గెలిచాం
- అభివృద్ధిని మేము చెప్పుకోలేదు
- తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదు
- మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు
- ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదు
హరీశ్‌రావు చిట్‌చాట్..
- ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదు
- మా పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారు
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన వారిపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి
- తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
- ప్రజలు ప్రస్తు ప్రభుత్వానికి గత మా ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారు
- రేవంత్ రెడ్డికి పాలన పై పట్టు రాలేదు..పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారు.
- అధికారులు మా చేతుల్లో లేదు అన్నారంటే అది వారి చేతగానితనం అన్నట్టే
- గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదు..ప్రజలు డెంగ్యూ ,మలేరియాా బారిన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment