సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఏం పాపం చేసిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు.
మంత్రి శ్రీధర్ బాబు అతితెలివి ప్రదర్శించొద్దని హెచ్చరించారు. ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సన్నాసి ఎవరు? అని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని సూచించారు.
Live: BRS Party Cadre Meeting, Serilingampally Assembly constituency.@KTRBRS https://t.co/9PwrvDngy6
— BRS Party (@BRSparty) September 24, 2024
చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు
Comments
Please login to add a commentAdd a comment