సాక్షి,తాడేపల్లి: ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, చంద్రబాబు తన మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గడికోటశ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం(ఆగస్టు21) శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు మేలు చేశాం. కరోనా సమయంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు అన్నీ చేశాం. చంద్రబాబు ఉద్యోగులతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా లేరు. బాబు హయాంలో ఉద్యోగులకు ఎప్పుడూ మంచి జరగలేదు
ఇష్టంలేని వారిని వేధిస్తూ నవ్వుకునే తీరులో చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరులో ఐఅండ్‌పీఆర్ అధికారిని చంద్రబాబు దారుణంగా దూషించారు. చంద్రబాబు ఉద్యోగవర్గాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారు. ఉద్యోగులను తిడుతూ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైఎస్‌జగన్ హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశాం. కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో మేళ్లు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారు
ఉద్యోగు, అధికారులు అందరినీ వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వదలకుండా వేధిస్తున్నారు. ప్రద్యుమ్న, సాయిప్రసాద్, ఠాగూర్ లాంటి వారంతా చంద్రబాబుకు అనుకూలమైనప్పటికీ వైఎస్‌జగన్ వారికి కీలకమైన పోస్టులు ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు కొందరు అధికారులపై ఎందుకు కక్షసాధింపులకు దిగుతున్నారు?
డీఎస్పీ పోస్టుల్లో ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇసుకరెడ్డి, మైనింగ్ రెడ్డి అంటూ మాట్లాడటం కరెక్టేనా? ఎక్కడ ఏ కాగితం తగులపడినా ఉద్యోగులను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం సబబు కాదు. చంద్రబాబు తప్పులు బయట పడతాయని టీడీపీ వారే తగులపెడుతున్నారనే అనుమానం కలుగుతోంది. అధికారులను వేధించటం, వారిని కించపరిచటం మానుకోవాలి. ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన రెడ్డి కడప జిల్లా వ్యక్తి కావటమే ఆయన చేసిన తప్పా? ఆయనపై కూడా ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారు?
అభివృద్ధి, సంక్షేమం అనేది చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఉండదు. వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు. శ్రీ సిటీని వైఎస్‌ఆర్ తెచ్చినా, తానే తెచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రారంభించిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు’ అని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment