gadikota srikanth reddy
-
‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. తాజాగా రాయచోటి పర్యటన సందర్భంగా సీఎం హోదాలో కొత్త విద్యాసంస్థలు, రాయచోటి నీటికష్టాలకు పరిష్కారంను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు తీవ్ర నిరాశను మిగిల్చారని అన్నారు.శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:చంద్రబాబు నిస్సిగ్గు అబద్ధాలు:చంద్రబాబు అంటేనే చేయాల్సింది చేయడు.. ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూల పురుషుడుగా, హైదరాబాద్‌కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను సిగ్గు లేకుండా పరిచయం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ది చెందింది. గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా తానే ఐటీని కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నాడు. చివరికి హైదరాబాద్‌ను సైతం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. నిన్న (శనివారం) ఐటీ ఉద్యోగులను పక్కన పెట్టుకుని రాయచోటిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని అందరూ ఆశించారు.కానీ చంద్రబాబు చెంత ఉన్న ఐటీ ఉద్యోగులు ‘‘మేం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం, మేం సంపాదించినది పార్టీ కోసం ఖర్చు చేశాం, ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నాం. గ్రామాల్లో మేమే పార్టీ బాధ్యత తీసుకున్నాం’’ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాంతానికి సీఎం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడే అవకాశం లభించినప్పుడు యువతకు స్పూర్తిదాయకమైన మాటలు చెబుతారని అందరూ భావించారు. కానీ దానిని కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉంది. దానికి తగినట్లుగా చంద్రబాబు మండల స్థాయిలోనే ఐటీ టవర్స్ నిర్మిస్తాను, వర్క్ ఫ్రం హోంను కూడా తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరింత ఆశ్చర్యం కలిగించింది.స్థానిక సమస్యలపైన ఎందుకు మాట్లాడలేదు?:వైఎస్ జగన్ హయాంలో రాయచోటి ప్రజలకు నీటి కష్టాలు తప్పించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయంగా గండికోటలో నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశాం. కాలేటివాగును ఒక టీఎంసీకి అభివధ్ధి చేసి, అక్కడి నుంచి వెలిగల్లుకు నీటిని పంపించేందుకు వీలుగా పనులకు శ్రీకారం చుట్టాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశాం. దాని మిగిలిన పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు తన పర్యటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు.రాయచోటి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఒక్క విద్యాసంస్థను కూడా ప్రకటించలేదు. మహిళా జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, రెండో ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో సాధించుకున్నాం. రాయచోటిలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ఇప్పటికే 80 ఎకరాలు భూమిని కూడా సేకరించి సిద్దంగా ఉంచాం. ఈ కాలేజీని ప్రైవేటీకరించ వద్దంటూ విద్యార్ధులు ప్రశ్నిస్తే, వారిని సంఘ విద్రోహశక్తులు అంటూ నిందిస్తారా? యూనివర్సిటీకి నిధులు, కొత్త కలెక్టరేట్ భవనాలు, గండికోట నుంచి నీటని అందించే ప్రాజెక్ట్ వంటి వాటిపై చంద్రబాబు మాట్లాడతారని అందరూ అనుకున్నారు.కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను వంచించారు. కర్నూలులో శాశ్వత హైకోర్ట్ కావాలంటే, దానికి బదులుగా బెంచ్ తో సరిపెట్టారు. కొప్పర్తి పారిశ్రామికవాడను ఆనాడు వైయస్ఆర్, ఆ తరువాత వైఎస్ జగన్ ప్రత్యేక సెచ్గా అభివద్ధి చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు చొరవ చూపాలి. చేసింది చెప్పాలే కానీ.. జరిగిందంతా తానే చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.గ్రామాల్లోనూ నాడు ఐటీకి ప్రాధాన్యం:సీఎంగా వైఎస్ జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనులు చేసుకోవాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిని కొనసాగించకుండా చంద్రబాబు ఆ నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు మండల స్థాయిలో ఐటీ టవర్స్ నిర్మిస్తానని చెప్పడం చంద్రబాబు రెండు నాలుకల ధోరణికి, ద్వంద వైఖరికి నిదర్శనం.సంపద సృష్టించడం గురించి ప్రజలకు చెప్పడం కాదు, వారు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం పని చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రిగా ఆదుకున్నది వైఎస్ జగన్. ఈ రోజు అన్ని అవకాశాలు ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోటిన్నర మందికి పైగా అర్హులైన మహిళలు చంద్రబాబు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. యాబై ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ ఏడాది రైతుభరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.సాగునీటి ప్రాజెక్ట్‌లపై అడుగడుగునా నిర్లక్ష్యం:చంద్రబాబు ఏనాడూ తన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నా, ఆయన ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే, తరువాత దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు వృథా అని మాట్లాడారు. హంద్రీనీవా నుంచి 40 టీఎంసీలు రావు. కేవలం 5 టీఎంసీల నీరే వస్తాయని ఏకంగా జీఓ ఇచ్చారు. అలాగే గండికోటను 20 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు కుదించి జీఓ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో అడివిపల్లి వరకు 90 శాతం కాలువ పనులు పూర్తి చేశారు. 27 టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్ట్, దానిలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. చంద్రబాబు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కృష్ణా బ్యారేజీ వద్ద టీడీపీ వారితో ధర్నాలు చేయించారు.ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరు అందుతోంది. ఏడు నెలలు ఇన్ ఫ్లో ఉన్న కష్ణానదిలో ఈ రోజు డెడ్ స్టోరేజీ స్థాయికి నీటిని తోడేశారు. రాయలసమీకు ఎలా నీరు ఇస్తారో చంద్రబాబు చెప్పాలి. గతంలో పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎలా ఇస్తారో చెప్పండి అంటే దానిపై మాట్లాడరు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?ఇప్పుడు కొత్తగా బనకచర్ల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బనకచర్ల క్రాస్ నుంచి సరైన అవగాహన చంద్రబాబుకు లేదు. దీనిని ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పగలరా? రాష్ట్ర ప్రజలకు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కుదిస్తున్నా చంద్రబాబు మాట్లడటం లేదు. పోలవరం నుంచి కష్ణా బ్యారేజీకి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు, అక్కడి నుంచి వెలుగొండ ద్వారా బనకచర్ల క్రాస్ కు నీటిని తరలిస్తారో సరైన ప్రణాళిక ఉందా?ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ:మీడియా సమావేశం అనంతరం ఈనెల 5న పార్టీ తలపెట్టిన ఫీజు పోరు పోస్టర్‌ను పార్టీ సీనియర్ నేత ఆకెపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకెపాటి అమర్నాధ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. రైతుసమస్యలు, పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్సీపీ ఇప్పటికే ఆందోళనలు చేసింది.తాజాగా విద్యార్ధులకు సకాలంలో చెల్లించాల్సిన ఫీజు, స్కాలర్ షిప్ బకాయిలను కూడా చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి పేద విద్యార్ధి చదువుకోవాలని ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టారు. దీనితో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రోఫెషనల్ కోర్స్ లతో తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. నేడు చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్ధుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నారు. విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల అయిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను చేపడుతున్నాం. -
పబ్లిసిటీకి మాత్రం రెండు కోట్లు ..బాబు దావోస్ టూర్ పై కామెంట్స్
-
ఇంకెంత కాలం ప్రజల్నిమోసం చేస్తావు... చైనా,అమెరికాలోనే అంత జీడీపీ లేదు..
-
చేసిన అభివృద్ధి జీరో.. బాబును ఏకిపారేసిన గడికోట శ్రీకాంత్
-
ఇదేనా చంద్రబాబు సాధించిన ప్రగతి?: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబే దేశంలోనే ధనవంతుడైన సీఎం అని.. మిగతా అందరి సీఎంల అందరి ఆస్తులు కలిపినా చంద్రబాబు కంటే తక్కువేనంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి (Gadikota Srikanth Reddy) వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా, ఆయన మాత్రమే సంపద సృష్టించుకున్నారన్నారు.‘‘సంక్రాంతి పండుగ వచ్చినా ఏ కానుకలూ ప్రజలకు ఇవ్వలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేశారు. జగన్ అధికారంలో ఉన్నట్లయితే ఇప్పటికే అనేక పథకాల కింద ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేవి. చంద్రబాబు ఇవేమీ ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు..మెగా డీఎస్సీ అంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. మహిళలకు అనేక పథకాల ఆశలు చూపించి గొంతు కోశారు. ఆరోగ్యశ్రీని ప్రయివేటు పరం చేయబోతున్నారు. రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని సైతం పేదలకు జగన్ అందిస్తే.. చంద్రబాబు దాన్ని పక్కన పెట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేశారు.ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్..జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రధానితో శంకుస్థాపన చేయిస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటీ తేలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటికే మూడు లక్షల ఉద్యోగాలు తొలగించారు. రెండేళ్లపాటు అసలు మాట్లాడకూడదనుకున్నాం. కానీ చంద్రబాబు చేస్తున్న మోసాలు, దోపిడీలపై పోరాటం చేయక తప్పటం లేదు. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం షాపులే కనిపిస్తున్నాయి. ఇదేనా చంద్రబాబు సాధించిన ప్రగతి?’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు...మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వంలో కనీసం స్పందనేలేదు. జగన్ కార్యకర్తలకు మంచి భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఎక్కువ దృష్టి పెట్టటం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. ఇక మీదట కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్ చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు అన్నీ జగన్ తెచ్చినవే. రాష్ట్రంలో జగన్ హయాంలో పెట్టుబడులు వచ్చాయి. వాటికే చంద్రబాబు ఇవ్వాళ శంకుస్థాపన చేసుకుంటున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. -
పవన్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే తన విధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్నమయ్య జిల్లా గాలివీడులో పవన్‌కళ్యాణ్ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని విమర్శించారు. అదే ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యను హేళన చేసేలా డిప్యూటీ సీఎం మాట్లాడటం దారుణమని అన్నారు.గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు:గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో దాడిని రాజకీయం చేస్తూ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హుటాహుటిన పర్యటించారు. కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించడంతో పాటు, గాలివీడు మండల పరిషత్ కార్యాలయం సందర్శించిన ఆయన, ఏ మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా, ఏకపక్షంగా మాట్లాడడం దారుణం. పిచ్చిగా విమర్శలు చేయడం, హెచ్చరికలు జారీ చేయడం అత్యంత హేయం.గాలివీడులో వాస్తవంగా ఏం జరిగింది?:మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన ఎంపీపీ ఛాంబర్‌కు వెళ్లారు. ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ వారు ఆయనపై దాడి చేశారు. ఏకంగా పెప్పర్ స్ప్రే ఉపయోగించారంటే వారి ఉద్దేశం అర్థమవుతోంది. అటువంటి దారుణ ఘటనలో న్యాయవాదిగా, మంచిపేరున్న నాయకుడుగా ఉన్న సుదర్శన్‌రెడ్డిపై పోలీసులు హేయంగా వ్యవహరించారు.ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలంటే, ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్స్ డేటా పరిశీలిస్తే, ఎవరు దీనికి ఆదేశాలు ఇచ్చారు? ఎవరు హింసను ప్రేరేపించారు? అన్నది తెలుస్తుంది. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు ఇవ్వన్నీ తెలుసుకునే ఓపిక లేదు. ఏకపక్షంగా ఆయన మాట్లాడటం, వైయస్ఆర్సీపీని రాజకీయ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం.రాయలసీమపై చులకన భావం:పవన్‌కళ్యాణ్ మాటల్లో రాయలసీమ ప్రజలపై చులకనభావం కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఈ వైఖరి పెరిగిపోయింది. ఎక్కడో రైలు తగలబడితే రాయలసీమ గూండాలు చేశారంటూ గతంలో ఆయన మాట్లాడిన మాటలను మరిచిపోలేదు. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్ట్‌ను, లా వర్సిటీని తీసుకుపోతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు కూడా ఈ ప్రాంతం పట్ల మంచి భావం లేదనేదే దీనికి అర్థం.రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా?:గాలివీడు పర్యటన సందర్భంగా అక్కడకు సమీపంలోనే రైతు ఆత్మహత్య జరిగింది. దీనిపై మీడియా పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. రైతులకు పంటలు బాగానే వచ్చాయి. డబ్బులు బాగానే ఉన్నాయి. అయినా, ఎందుకు చనిపోయారు? అంటూ పవన్ చాలా హేళనతో మాట్లాడిన తీరు బాధ కలిగిస్తోంది.దళితులపై అత్యాచారాలు, అవమానాలు జరిగినప్పుడు, తన పార్టీ ఎమ్మెల్యేలే దాడి చేసినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కడప అనగానే రాజకీయం చేయాలని ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో జరుగుతున్న సమయంలో, ఇక్కడ కడపలో పవన్‌కళ్యాణ్ రాజకీయం చేశారు. రైతుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా?తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే పవన్ లక్ష్యం:తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే తన లక్ష్యంగా, వైఎస్సార్సీపీని రాజకీయంగా దూషించడమే తన విధానంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, దానిలో వైయస్సార్సీపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు రాగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తు్తన్నారు. కనీసం ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏకపక్షంగా విషయాన్ని వింటూ, రాజకీయంగా వైయస్ఆర్సీపీపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు.వాటన్నింటిపై ఎందుకు స్పందించలేదు?:కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లకే వినుకొండలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దానిపై పవన్ మౌనంగా ఉన్నారు. నందికొట్కూరులో బీసీ మెనర్ బాలికపై దారుణ అత్యాచారం చేసి, హతమార్చినా ఆ కుటుంబాన్ని ఇంత వరకు పరామర్శించ లేదు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించారు. ఈరోజు దానిపై ఎక్కడా మాట్లాడటం లేదు. బద్వేల్‌కు చెందిన ఒక బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బాలిక కుటుంబసభ్యులను కూడా పవన్ పరామర్శించ లేదు.కాకినాడలో జనసేన ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత ప్రోఫెసర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసినా కనీసం తన ఎమ్మెల్యేను ప్రశ్నించే సాహసం చేయలేదు. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే దానిపైనా మాట్లాడలేదు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే విలేకరులను నిర్భందించి వేధిస్తే కనీసం పెదవి విప్పలేదు. ఇదేనా పవన్‌కళ్యాణ్ విధానం?. ప్రశ్నిస్తాను అన్న ఆయన నైజం?హామీలపైనా నోరు మెదపడం లేదు:కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా సూపర్ సిక్స్ హామీల అమలు లేదు. దానిపై పవన్ మాట్లాడ్డం లేదు. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఉద్యోగులకు డీఎ, ఐఆర్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. రైతులను ఆదుకునే చర్యలు అంతకన్నా లేవు. వీటన్నింటిపై పవన్ ప్రశ్నలు ఏమయ్యాయి? సన్నాతన ధర్మం అన్నారు. తిరుపతి లడ్డూ అన్నారు. తరువాత వాటిపై మాట్లాడటమే మానేశారు.ఇకనైనా వైఖరి మార్చుకోవాలి:రాజకీయం కోసమే పవన్‌కళ్యాణ్ ఇలా వ్యవహరించడం దారుణం. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన సంఘటనలో జవహర్‌బాబుకు మంచి జరగాలి. అదే క్రమంలో ఎందుకు పెప్పర్ స్ప్రే చల్లారనే దానిపైనా విచారణ జరగాలి. అలా కాకుండా ఏకపక్షంగా వైయస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుంటూ, ఆ పార్టీని ఎక్కడా ఉండనివ్వకూడదు అనేది దారుణమైన ఆలోచనలు చేయడం అత్యంత హేయం. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అధికారంలో ఉన్న వారు ముందుగా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే పవన్‌కళ్యాణ్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
గాలివీడు ఘటన.. కాల్‌డేటా తీస్తే వాస్తవాలు తెలుస్తాయి: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అన్నమయ్య: గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. ఎంపీపీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దది అయ్యిందని చెప్పుకొచ్చారు. కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. ఎంపీపీ అయిన తన తల్లి సంతకం కావాలని ఎంపీడీవో కార్యాలయ అధికారులు కోరారు. ఎంపీపీకి చెందిన సామాగ్రి లోపల ఉందని, తాళాలు తీయాలని ఆయన అడిగారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. దాన్ని రాజకీయం చేస్తున్నారు.ఎంపీడీవో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దదైంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ హింసను ప్రోత్సహించకూడదు. ఘటన జరగకముందే టీడీపీ నేతలు అక్కడకు ఎలా చేరారు. వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద చేసిన హంగామాపై విచారణ చేయాలి. ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్ని వివరాలు తెలుకోవాలి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన్ను కోరుతున్నాను. ముందు కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలేంటనేది తెలుస్తుంది. నిజ నిర్ధారణ జరిపిన తర్వాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
జడ్జీలకు బెదిరింపులు..
-
చంద్రబాబు దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు: గడికోట
సాక్షి,తాడేపల్లి:ప్రపంచంలో ఏ నియంత చేయని దుర్మార్గాలను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.గురువారం(డిసెంబర్19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నిటిలో తనకుతానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం హాస్యాస్పదంగా ఉంది.జడ్జిల మీద నిఘా పెట్టటం ఎంతవరకు సమంజసం? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నలుగురు ఐపీఎస్‌లను కూడా సస్పెండ్ చేశారంటే ఇది నియంత పోకడ కాదా? ఈ తప్పులను ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.అరెస్టు చేయడానికి వచ్చే పోలీసులు కనీసం ఐడీ కార్డులు కూడా చూపడం లేదు.రాష్ట్ర అప్పుల విషయంలో చంద్రబాబు విష ప్రచారం చేశారు.పార్లమెంటు చెప్పిన మాటలను కూడా తప్పుదారి పట్టించారు.అప్పులేకాదు ప్రతి విషయంలోనూ దుష్ప్రచారం చేశారు.వైఎస్ జగన్ తన హయాంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు.చేసిన మంచిని కూడా వైఎస్ జగన్ చెప్పుకోలేకపోయారు.ఇప్పుడు ఈ విషయాన్ని జనం గుర్తించి సొంతంగా ప్లెక్సీలు పెడుతున్నారు.చంద్రబాబు చేసిందంతా విధ్వంస పాలన.రూ.50 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేస్తున్న చంద్రబాబు మిగతా ప్రాంతాల సంగతేంటో చెప్పాలి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు భాగం కాదా? వైఎస్ జగన్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తే చంద్రబాబు ఆ రికార్డులు చూపించాలి.చంద్రబాబు ష్యూరిటీ,వీరబాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది’అని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
-
చంద్రబాబుకు రాయలసీమ ప్రజలపై ఎందుకు ద్వేషం
-
సీమకు చంద్రబాబు ద్రోహం కుట్రలతోనే నడుస్తున్న కూటమి
-
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
-
రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్‌ని చేస్తాననటం సరికాదన్నారు.‘‘రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినా రాయలసీమ వాసులు కాదనలేదు. కనీసం హైకోర్టు వస్తుందని రాయలసీమ వాసులు భావించారు. ఇప్పుడు అదికూడా లేకుండా చేస్తున్నారు. శంకుస్థాపన జరిగిన లా యూనివర్సిటీని ఎందుకు తరలిస్తున్నారు?. మా కళ్లెదుటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక పోతున్నాం. హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌ది. ఆయన వలన అనంతపురం జిల్లా కరువులోకి పోకుండా ఆపగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఆ ప్రాజెక్ట్‌ని నాశనం చేశారు. జిఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్టు నీటిని చంద్రబాబు కుదించారు’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.‘‘గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని వైఎస్ జగన్ పెంచారు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ను చంద్రబాబు పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడుని వైఎస్సార్ పూర్తి చేయటం వలన సాగునీరు అందుతోంది. శ్రీసిటీ, కొప్పర్తి ప్రాజెక్టులు వైఎస్సార్, జగన్‌ల వలనే సాధ్యమయ్యాయి. చంద్రబాబు ఏ ఒక్కపనీ చేయకపోగా వైఎస్ కుటుంబం చేసిన పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు దారుణం. వరద బాధితులకు పులిహోర పెట్టి రూ.550 కోట్లు కొట్టేశారు. అగ్గిపెట్టెల కోసం రూ.23 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు. వీటిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు.మరి చంద్రబాబు, లోకేష్‌లు జగన్‌ని కించపరిచేలా పోస్టులు పెడితే వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల పేరుతో టీడీపీ వారే దొంగ ఖాతాలను ఓపెన్ చేసి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. చట్టం ఎవరికైనా ఒకటే అన్నట్టుగా ఉండాలి. అధికారంలో ఉన్న వారికి ఒకలాగ, ప్రతిపక్షంలోని వారికి ఇంకోలా ఉండటం సరికాదు. ల్యాండ్ టైట్లింగ్ వలన భూసమస్యలు పరిష్కారమయ్యేవి. కానీ దానిపై విష ప్రచారం చేసి జనాన్ని భయపెట్టి ఎన్నికలలో పబ్బం గడుపుకున్నారు..ప్రజాజీవితంలో ఉన్నవారికి మంచితనం కూడా ఉండాలి. అబద్దాలే ప్రచారం చేసుకుని బతుకుతామంటే కుదరదు. పోలవరం ప్రాజెక్టులో 90 శాతం అనుమతులు వైఎస్సారే తెచ్చారు. కానీ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కన్నా జగన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. చంద్రబాబు పాలనలో విధ్వంసం మాత్రమే జరిగింది. కానీ అభివృద్ధి మొత్తం తన హయాంలోనే అన్నట్టుగా బిల్డప్‌లు ఇస్తున్నారు. పోర్టులు, మెడికల్ కాలేజీలను జగన్ తెస్తే వాటిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టించటం అంటే?. అదాని పరిశ్రమపై దాడి చేయటం దారుణం. జగన్ హయాంలో పారిశ్రమలు పెట్టటానికి పారిశ్రామిక వేత్తలు వచ్చారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వేత్తలు భయంతో పారిపోతున్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తెస్తానని ఎప్పట్నుంచో చెప్తూనే ఉన్నారు. మాటలు కాదు పనుల్లో చేసి చూపించాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. -
కర్నాటకలో 90రూ ఉండే మద్యం ఏపీ 99 రూపాయాలు...
-
చర్చకు సిద్ధమా చంద్రబాబూ.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని.. శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ వైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు. శాంతిభద్రతలు అనేవి ఏపీలో లేవు. నందికొట్కూరు లాంటి ఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి వైఎస్ జగన్‌ని ఎలా దూషించాలో టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు మద్యం షాపుల కోసం దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. 2014-19లో అనేక డిస్ట్రిలరీకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. దీని వలన జనం రోగాలపాలు అయ్యారు. అందుకే జగన్ వచ్చాక 48 వేల బెల్టుషాపులు రద్దు చేశారు. జగన్ పాలనలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు.‘‘కేరళ మాల్ట్ బ్రాండ్ 90 రూపాయలకు ఇస్తుంటే ఇక్కడ 99 రూపాయలకు పెంచారు. ఇదేనా నాణ్యమైన మద్యం అందిచటం అంటే?. ఈవీఎంలను ఎలా టాంపరింగ్ చేయాలో కూడా లైవ్‌లో చాలామంది చూపిస్తున్నారు. ఇలాంటి వాటిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. జనాభిప్రాయంతో సంబంధం లేకుండా టీడీపీ గెలిచింది. అందుకే ప్రజల ప్రాణాలంటేనే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. టార్గెట్ పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు.’’ అని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’! ‘‘ఇప్పటికే అమ్మఒడి, విద్యాదీవెన, రైతు భరోసాలాంటి పథకాలేవీ అమలు చేయడం లేదు. వైఎస్ జగన్ తొలి రోజునుండే మేనిఫెస్టోని అమలు చేశారు. కేరళా మాల్డ్ మద్యం కర్నాటకలో 90 రూపాయలే. దాన్ని ఏపీలో రూ.99కి ఎందుకు ఇస్తున్నారు?. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచనే ఉండదా చంద్రబాబూ?. ఎంతసేపూ దోపిడీ ఆలోచనలేనా?. మద్యాన్ని వ్యసనంగా మార్చ వద్దు. జేసీ ప్రభాకరరెడ్డిలాంటి వ్యక్తులు డైరెక్టుగా కమిషన్లు అడుగుతున్నారు. మద్యంలోనే 15 శాతం కమిషన్ అడుగుతున్నారంటే మిగతా వాటిల్లో పరిస్థితి ఏంటి?. జేసే లాంటి చాలామంది నాయకులు ఇలా బెదిరించిన వీడియోలు, ఆడియోలు వచ్చాయి. అయినా చంద్రబాబు వారిని ఎందుకు కట్టడి చేయటం లేదు?’’ అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. -
దేవుడిని కూడా బాబు రాజకీయాలకు వాడుకుంటున్నారు
-
పేదల పెన్నిధి మన జగన్
-
ఏపీలో శాడిస్టు పాలన: వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి,తాడేపల్లి: ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, చంద్రబాబు తన మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గడికోటశ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం(ఆగస్టు21) శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు మేలు చేశాం. కరోనా సమయంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు అన్నీ చేశాం. చంద్రబాబు ఉద్యోగులతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా లేరు. బాబు హయాంలో ఉద్యోగులకు ఎప్పుడూ మంచి జరగలేదుఇష్టంలేని వారిని వేధిస్తూ నవ్వుకునే తీరులో చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరులో ఐఅండ్‌పీఆర్ అధికారిని చంద్రబాబు దారుణంగా దూషించారు. చంద్రబాబు ఉద్యోగవర్గాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారు. ఉద్యోగులను తిడుతూ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైఎస్జగన్ హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశాం. కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో మేళ్లు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారుఉద్యోగు, అధికారులు అందరినీ వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వదలకుండా వేధిస్తున్నారు. ప్రద్యుమ్న, సాయిప్రసాద్, ఠాగూర్ లాంటి వారంతా చంద్రబాబుకు అనుకూలమైనప్పటికీ వైఎస్జగన్ వారికి కీలకమైన పోస్టులు ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు కొందరు అధికారులపై ఎందుకు కక్షసాధింపులకు దిగుతున్నారు?డీఎస్పీ పోస్టుల్లో ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇసుకరెడ్డి, మైనింగ్ రెడ్డి అంటూ మాట్లాడటం కరెక్టేనా? ఎక్కడ ఏ కాగితం తగులపడినా ఉద్యోగులను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం సబబు కాదు. చంద్రబాబు తప్పులు బయట పడతాయని టీడీపీ వారే తగులపెడుతున్నారనే అనుమానం కలుగుతోంది. అధికారులను వేధించటం, వారిని కించపరిచటం మానుకోవాలి. ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన రెడ్డి కడప జిల్లా వ్యక్తి కావటమే ఆయన చేసిన తప్పా? ఆయనపై కూడా ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారు?అభివృద్ధి, సంక్షేమం అనేది చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఉండదు. వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు. శ్రీ సిటీని వైఎస్ఆర్ తెచ్చినా, తానే తెచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రారంభించిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు’ అని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. -
కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదంతా కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదనే విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయం విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోందని పేర్కొంది. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ స్పందనను మాజీమంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో వారు ఏం పేర్కొన్నారంటే..» రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలేంటి? అపరిష్కృత అంశాలేంటి? పంచాల్సిన ఆస్తులేంటి? ఎందుకు ముందుకెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులేంటి? అనే వాటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత కూడా ఉంది. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల గుర్తింపునకు మళ్లీ కమిటీ అన్నట్లుగా చెప్పడం విభజిత సమస్యల పరిష్కారంలో మరింత జాప్యానికే దారితీస్తుందన్న సంకేతాన్ని ఇద్దరు సీఎంల సమావేశం ఇచ్చిందని అభిప్రాయపడుతున్నాం.» పార్లమెంటు చేసిన విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం గతంలో సీనియర్ అధికారి షీలా బేడీ కమిటీని ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై కూడా ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటిపై అనేక దఫాలుగా పదేళ్లపాటు చర్చలు జరిగాయి. కొన్ని సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. చర్చలను ఆ దశ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి మళ్లీ కమిటీ ఏర్పాటుచేయడమంటే వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకెళ్లడమేనని భావిస్తున్నాం.» ఇక తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టాలని, దశాబ్దకాలంగా అంగుళం కూడా ముందుకు పడకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి ఎదుట గొంతెత్తారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత కాలపరిమితిలోగా సమస్యలు తీరుస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు కూడా విభజిత సమస్యలపై చర్చల ప్రక్రియ వేగం అందుకుంది. వీటిని కూడా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టకుండా మళ్లీ కమిటీని ఏర్పాటుచేయడమంటే.. మళ్లీ వెనక్కి లాగడమే అవుతుందని భావిస్తున్నాం.» పైగా ఇప్పుడు కమిటీ ఏర్పాటు అన్నది కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా, వారి ప్రమేయంలేకుండా ఏర్పాటవుతోంది. విభజన చట్టం చేసింది పార్లమెంటు, దాన్ని అమలుచేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కమిటీ ఏర్పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. » ఇక రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.7వేల కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా ఆ బకాయిలు చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై దృష్టిపెట్టి పరిష్కారం సాధించే ప్రయత్నం ఇప్పుడు జరిగిన సమావేశంలో పెద్దగా జరిగినట్లు లేదు. » ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతం గొంతెండుతున్న పరిస్థితుల్లో కూడా విద్యుత్ రూపేణా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాల్వ నుంచి నీటిని ఇష్టానుసారం విడిచిపెడుతోంది. దీనిపై తక్షణం పరిష్కారానికి ప్రయత్నించి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే. » ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడికాల్వ, స్పిల్‌వే భాగాన్ని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీ మేరకు సంయమనం పాటించాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు దీనిపై కూడా దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించకపోవడంతో విభజిత సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.» ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరినట్లుగా మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. అలాగే, ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కాని, ఒక అధికారి కాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరిచినట్లే అవుతుందని వైఎస్సార్సీపీ భావిస్తోంది. -
టీడీపీపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
చేతనైతే మంచి చేయండి
రాయచోటి/రాయచోటి రూరల్: అధికారాన్ని దక్కించుకున్న వారు చేతనైతే అభివృద్ధితో ప్రజల మనసులను చూరగొనాలే కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం ఏమిటని అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలోకి వచి్చన వారు అందరికీ మంచి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాకాండకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సోమవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.. నిర్మాణాలు పూర్తి చేసుకున్న సచివాలయాలపై అల్లరి మూకలు దాడులకు తెగబడి బోర్డులు ధ్వంసం చేయటాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం టీడీపీకి చెందిన అల్లరి మూకలు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్‌పై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాయన్నారు. రామాపురం మండలం చిట్లూరు, రాయచోటి రూరల్ మండలం శిబ్యాల గ్రామ సచివాలయాల్లో సంఘ విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టించాయని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు అనునిత్యం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకవైపే ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. దాడులు, పోలీసుల నిర్లిప్త వైఖరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.హోదా ఇస్తేనే మద్దతివ్వాలి కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సువర్ణావకాశమని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు దీన్ని సది్వనియోగం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రానికి మద్దతు ఇస్తామని గట్టిగా చెబితే కచి్చతంగా సాధించే వీలుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులతోపాటు నలుగురు లోక్‌సభ ఎంపీలు అండగా నిలబడతారని చెప్పారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా ఒత్తిడి చేయడంతో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని వివరించారు. -
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన దరిద్రుడు
-
చరిత్రలో ఎన్నడూలేని విధంగా 10 లక్షల మంది తరలి వస్తున్నారు
-
‘చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘సీఎం జగన్ రూ.2లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు.నాయకత్వం అంటే సీఎం జగన్‌ది.మేనిఫెస్టోలోని ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా సీఎం జగన్ నిలబడ్డారు. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది కనుకనే ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ‘పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు కడుపుమంట. రాజకీయమే అజెండాగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. మాటలతో మభ్యపెట్టే చంద్రబాబుని ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? చంద్రబాబు చెప్పుకునేందుకు ఓ మంచి పథకం ఉందా?. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
జగనన్న సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం
-
‘రాష్ట్ర నిధులు దోచేసి నిప్పు అని చెప్పుకుంటే సరిపోతుందా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు నాయుడు.. తాను నిప్పును అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం నిజంగా సిగ్గు చేటన్నారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి. ఈరోజు(గురువారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి.. క్విడ్ ప్రోకో కింద రాష్ట్ర నిధుల్ని దోచేసి నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిన స్కాములు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ‘అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. మరి ఆ సమావేశాల్ని నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారు. టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో చెప్పాలి. టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లను సంబంధిత అధికారులు బయటపెడితే అదేదో రాజకీయ కక్ష సాధింపు అంటూ మాట్లాడటం సరికాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తించింది. చంద్రబాబు తప్పు చేయకపోతే కోట్లు పెట్టి లాయర్లను ఎందుకు పెట్టుకుంటాడు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారు’ అని తెలిపారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏమన్నారంటే.. ►చంద్రబాబు అవినీతి ప్రపంచమంతా తెలిసిపోయింది ►దీనిపై అసెంబ్లీలో చర్చకు రాకుఙడా టీడీపీ నేతలు పారిపోయారు ►తమ బండారం బయట పడుతుందని తెలిసి టీడీపీ వారు వెళ్లిపోయారు ►పైగా స్పీకర్ పై దాడి చేయటం, విజిల్స్ వేయటం, తిడ కొట్టటం వంటి అరాచకాలు చేశారు ►వారి అరాచకం అంతా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవటానికే ►టీడీపీ వారు అడిగిందే మొదట టేకప్ చేయమని ముఖ్యమంత్రి చెప్తారు ►అందుకే బిఎసీలో కూడా పాల్గొనకుండా పరారయ్యారు ►రెండో రోజు కూడా బాలకృష్ణతో సహా టీడీపీ వారంతా అడ్డగోలుగా వ్యవహరించారు ►ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్పరు ►వారు ఇచ్చిన వాయిదా తీర్మానం మీదనే చర్చిద్దామన్నా కూడా రాలేదు ►విజిల్స్ వేసిన ముగ్గురినే సస్పెండ్ చేస్తే మిగతావారు కూడా ఎందుకు సభ నుండి పారిపోయారో ప్రజలకు చెప్పాలి ►స్పీకర్ మీద పేపర్లు వేశారు, టేబుల్ మీద అద్దం పగులకొట్టారు ►బయటకు వెళ్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంటూ హడావుడి చేశారు ►అదే చర్చ సభలో పెడితే మేము సమాధానం చెప్పేవాళ్లం ►చంద్రబాబు అరెస్టు అయ్యాక ఎల్లోమీడియా పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లింది ►దీన్ని ఎల్లో ఇజం అనాలో ఏమనాలో కూడా అర్థం కావటం లేదు ►నిజంగా చంద్రబాబు నిప్పు ఐతే మరి సభలో ఎందుకు చర్చించలేదు? ►మా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయని తెలిసి మూడో రోజు నుండి ఇక సభకు రాలేదు ►దేవాలయంలాంటి అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ►సీఐడీ కూడా కోర్టు ముందు ఇవే అంశాలను చెప్పింది కాబట్టే చంద్రబాబుకు రిమాండ్ విధించింది ►చంద్రబాబు చేసిన తప్పులన్నీ సీఐడీ బయట పెట్టింది ►షెల్ కంపెనీలకు డబ్బు ఎలా మళ్లించారో వాస్తవాలు ప్రజలకు తెలిశాయి ►చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ►కోట్లకొద్దీ డబ్బు వెదజల్లి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చినా కోర్టు వాస్తవాలనే గ్రహించి రిమాండ్ వేసింది ►18 బిల్లులపై చర్చించాం ►ప్రజలజు ఉపయోగపడే అనేక అంశాలపై చర్చిస్తుంటే ఎందుకు పారిపోయారు? ►కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నా ఎల్లోమీడియాకు కనపడలేదు ►మహిళా స్వాబలంబన గురించి సుదీర్ఘ చర్చ జరిగినా టీడీపీ వారు పట్టించుకోలేదు ►పదవుల నుండి పథకాల వరకు అన్నిటిలోనూ మహిళలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం ►దీనిపై చర్చించటానికి రమ్మంటే టీడీపీ వారు రాలేదు ►కోర్టులపైనే దూషణలు చేస్తున్నారు ►జైల్లో నుండే చంద్రబాబు అరాచకాలకు ఆదేశాలు ఇస్తున్నారు ►జగన్ గురించి టీడీపీ సభ్యులు చులకనగా మాట్లాడారు ►అలాంటి సమయంలో మావాళ్లు ఎంతో సంయమనం పాటించాం ►కానీ చంద్రబాబు మాత్రం తన భార్యను ఎవరో ఏదో అన్నారని మీడియా ముందు ఏడ్చారు ►అప్పుడే మేము వివరణ కూడా ఇచ్చాం ►కానీ భువనేశ్వరి మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని రాజకీయ లబ్ది కోసం మాట్లాడారు ►ఇది తప్పు అని భువనేశ్వరి గుర్తించాలి ►ఫైబర్ నెట్, రింగ్ రోడ్లో ఎలాంటి స్కాంలు జరిగాయో అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది ►చంద్రబాబు మేనేజ్ పాలిటిక్స్ మానుకోవాలి చదవండి: నారా లోకేష్ యువగళం వాయిదా!.. టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్! -
రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చం: శ్రీకాంత్ రెడ్డి
-
కేవలం రెచ్చగొట్టి గొడవలు సృష్టించడమే చంద్రబాబు పని
-
ఆ దమ్ము లేని పవన్‌కు రాజకీయాలు ఎందుకు?
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ట్రైనింగ్‌లో బలిపశువు కాబోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తనకు పోటీ లేకుండా ఉండేందుకు పవన్‌ను బాబు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీతో చంద్రబాబు పైరవీలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి సంగతి ఢిల్లీలోని పెద్దలకు కూడా బాగా తెలిసొచ్చిందని, అందుకే దూరం పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగుచేస్తున్నారు. హుందాతనానికి ఆయన ఇచ్చే విలువలు అందరికీ ఆదర్శం. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు హుందాగా ఎప్పుడూ వ్యవహరించలేదు. వెన్నుపోటు, వ్యవస్థల మేనేజ్‌మెంట్‌కే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఓటమి చెందినా దాన్ని అంగీకరించలేడు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చనుకుంటున్నారు. పవన్ ఉన్మాదిలాగ మాట్లాడుతున్నారు ప్రజలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో ప్రజలకు చెప్పకుండా.. చంద్రబాబును విమర్శించే వారినే ప్రశ్నిస్తానంటూ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప సొంతంగా పవన్ ఏమీ చేయటం లేదు. ఆయనకు మహిళలంటే ద్వేషం. మహిళా సీఐ అనే గౌరవం లేకుండా ఆ పార్టీ నేతలు విమర్శిస్తే వారిని పవన్ వెనుకేసుకు వచ్చారు. వ్యక్తిగతంగా దూషించటం వలనే ఆ సీఐ అలా వ్యవహరించారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మహిళా సీఐకి క్షమాపణలు చెప్పాలి. ఆమెని దూషించిన జనసేన నాయకుడిని హెచ్చరించాలి. చదవండి: టీడీపీలో టికెట్ వార్.. శ్రీకాళహస్తి అభ్యర్థి ఆయనేనా? ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ చెప్పే ధైర్యం లేని పవన్‌కు రాజకీయాలు ఎందుకు?. రాయలసీమలో ఒక ప్రాజెక్టునైనా చంద్రబాబు కట్టలేదు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గండికోట.. అన్నీ దివంగత వైఎస్ఆర్, సీఎం జగనే చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రాయలసీమ గూండాలు అంటూ మమ్మల్ని విమర్శిస్తుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. రాయలసీమలో అభివృద్ధి చేయని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. రాజకీయాల్లో హుందాతనాన్ని దిగజార్చవద్దు. ఊగిపోవటం, తిట్టటం, సాక్ష్యాలు లేకుండా విమర్శలు చేయటం రాజకీయాలు కాదు. మేనిఫెస్టో అమలు చేశామా లేదా అనేది చూడాలి. 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రజల ముంగిట పెడదామా?. 30 లక్షలకుపైగా ఇళ్లు కట్టిస్తుంటే అడ్డుకుంటున్న నీచులు చంద్రబాబు బ్యాచ్. రాజధానిలో పేదలు ఉండటానికి వీల్లేదని అడ్డుకుంటున్నదీ వారే. ఏ అంశం మీదనైనా చర్చకు మేము సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు 14 ఏళ్ల పాలన , వైఎస్ జగన్ 4 ఏళ్ల పాలనపై చర్చకు రాగలరా?. కనీసం శ్వేతపత్రమైనా విడుదల చేయగలరా?. టీడీపీ, జనసేనలు తోడుదొంగల పార్టీలు. వేదికల మీద చెప్పులు చూపించటం రాజకీయమా? చంద్రబాబు శృతి మించి మాట్లాడుతున్నారు. కాలమే వారికి తగిన బుద్ది చెప్తుంది. హిందూ మతం గురించి పవన్ మాట్లాడటం సిగ్గుచేటు. పవన్, చంద్రబాబు ఏ సభలకు వెళ్లినా వారి గురించి మాట్లాడుతూ పక్కవారిని కించపరచటం అలవాటు. కులం, మతతత్వాలను రెచ్చగొట్టటం అలవాటు. బాబు హయాంలో పడగొట్టిన గుళ్లను వైఎస్ జగన్ కట్టిస్తున్నారు. పురంధేశ్వరి చేసే విమర్శలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం. మాది సెక్యులర్ పార్టీ. యూసీసీ గురించి మేము త్వరలోనే ప్రకటిస్తాం’అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు కొత్త ట్విస్ట్.. పార్టీ నేతనే ఓడిస్తానని సవాల్! -
‘సీమ’కు చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పండి
కడప కార్పొరేషన్ : రాయలసీమకు చేసిన ద్రోహానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరాలని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలతో మమేకం కాకుండా 19 గంటలు టెంట్లో ఉంటూ, ఐదు గంటలు మాత్రమే బయట తిరుగుతున్నారని, అందులో ఒక గంల సెల్ఫీలకే సరిపోతోందని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. మొత్తం మీద అది పాదయాత్రలా కాకుండా ఒంటిపూట యాత్రలా ఉందన్నారు. కడప పర్యటనలో లోకేశ్ ‘రాయలసీమ డిక్లరేషన్’ అని మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. గత 27 ఏళ్లలో 14 ఏళ్లు మీ తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇన్నేళ్లలో రాయలసీమకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెప్పకుండా, మళ్లీ అధికారవిుస్తే చేస్తామని చెప్పడం మోసపూరితమన్నారు. రాయలసీమ ప్రజలను రౌడీలు, గూండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి వారి మనోభావాలు దెబ్బతీశారన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయకుండా కాలయాపన.. తెలుగుగంగ ప్రాజెక్టును దివంగత ఎన్టీఆర్ చేపడితే వైఎస్సార్ పూర్తిచేశారని శ్రీకాంత్ తెలిపారు. పదేళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వాటిని తాగునీటి ప్రాజెక్టులుగా మార్చి, శంకుస్థాపనలతోనే కాలయాపన చేశారన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యాకే వాటిని సాగునీటి ప్రాజెక్టులుగా మార్చి పూర్తిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబే ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి వాటాలు దక్కేవన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ పెంచుతుంటే కృష్ణా బ్యారేజీపై ధర్నా చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా వారితో లేఖ రాయించారన్నారు. మరోవైపు.. రాయలసీమలో హైకోర్టు పెడతామంటే అడ్డుకుని, ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడం దారుణమన్నారు. ఇన్ని విధాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న తండ్రీకొడుకులు ఏ ముఖం పెట్టుకుని ‘రాయలసీమ డిక్లరేషన్’ అంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు మూడుసార్లు అవకాశవిుస్తే కుప్పానికి నీళ్లివ్వలేని మీరు రాయలసీమకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పంకు రెవెన్యూ డివిజన్ తెచ్చారని, మున్సిపాలిటీగా మార్చారని శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం ఈ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తూ, కాంట్రాక్టు కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తున్నారన్నారు. కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో నాలుగేళ్లలో వెయ్యి కోట్ల కేంద్ర నిధుల్ని ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు. బాబు బాధ్యతారాహిత్యం.. సామాన్యుడికి ఎలా మేలు చేయాలో ఆలోచించకుండా కర్ణాటకలో ఇచ్చిన హామీలను తీసుకొచ్చి మేనిఫెస్టోలో చేర్చారని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. అన్నిదేశాలు, రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కృషిచేస్తుంటే చంద్రబాబు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఎంతమందినైనా కనండి అంటూ రివర్స్‌లో చెబుతున్నారని మండిపడ్డారు. -
‘ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లో మీడియాలో ప్రచారం కోసం ఆదినారాయణ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ‘‘పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతి పేరిట యాత్ర చేయించారు. హైకోర్టు ఆధార్ కార్డులు అడిగితే యాత్ర ఎత్తేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరగాలని ప్రభుత్వం పరితపిస్తోంది. సీఎం జగన్ ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక దూషణలకు దిగుతున్నారు. ఆదినారాయణరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది? -
ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నా
రాయచోటి: ప్రజా సేవే ధ్యేయంగా తాను పనిచేస్తానని, ప్రజల వద్ద తలదించుకునే పనిని ఎప్పుడూ చేయనని, ఆరోజు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు లేకుండా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాయచోటిలో మంగళవారం తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ భూముల విలువ బాగా పెరిగి, భూ దందాలపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అంతకు ముందే తాను ప్రభుత్వ భూములు కాపాడాలని అధికారులకు సూచించానన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో జరిగింది తప్పేనని, ఈ స్థలం కబ్జాకు గురైందన్న విషయం పత్రికల ద్వారానే తనకు తెలిసిందని అన్నారు. రిజిస్ట్రేషన్లను ఎక్కడైనా చేసుకోవచ్చన్న చట్టం వల్ల రాయచోటికి సంబంధించిన 938 రిజిస్ట్రేషన్లు ఇతర ప్రాంతాల్లో జరిగాయని చెప్పారు. వీటిలో 275 రిజెక్ట్ అయ్యాయన్నారు. ఇలా వేరే ప్రాంతాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాటిని చేయించుకున్న వారికే ఎరుక అన్నారు. లక్కిరెడ్డిపల్లె ఎస్సీల భూ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యేపైన కూడా తాను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని అన్నారు. ఆ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరానన్నారు. -
రాయలసీమ అంటే చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?
-
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకోవడం తప్పా?
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకోవడం తప్పెలా అవుతుందని శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కడపలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ విధానంపై కొన్ని నెలలుగా ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. రాజధానిని ఎప్పుడు ప్రకటించారు, వీరంతా భూములు ఎప్పుడెప్పుడు కొన్నారనే విషయాలను సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో తాము బయటపెట్టామని ఆయన గుర్తుచేశారు. బౌన్సర్లను పెట్టుకుని యాత్రలో అసభ్యకరంగా నృత్యాలు చేయడం విచారకరమన్నారు. పద్నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయంటే అది వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్ ఘనతేనన్నారు. కర్నూలులో హైకోర్టును ద్వేషించడం దారుణం ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటుంటే చంద్రబాబు ద్వేషించడం దారుణమని.. దానిని అడ్డుకుంటే ఉపేక్షిం చేదిలేదని హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని తీర్మానించిన బీజేపీ నాయకులు ఇప్పుడు నోరెందుకు మెదపడంలేదని నిలదీశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయం, సోమశిల ప్రాజెక్టుల వల్ల లక్షల ఎకరాల భూములు, ఊర్లను కోల్పోయిన రైతులే త్యాగధనులని, ఆకుపచ్చ కండువా వేసుకున్నంత మాత్రాన రైతులు అయిపోరని ఎద్దేవా చేశారు. వికేంద్రీకరణవల్ల ఏ ఆఫీసు ఎక్కడికి తరలిపోకుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ నారాయణ, రామకృష్ణలాంటి వారు 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్‌ను ప్రశంసించకుండా, అమరావతి రైతుల కోసం పోరాటం చేయడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ఎన్నిసార్లు తన వైఖరి మార్చుకున్నారో లెక్కేలేదన్నారు. త్వరలో రాయలసీమ జేఏసీ ఏర్పాటు రాయలసీమలోని ప్రజా ప్రతినిధులు, మేధావులు, అన్ని పార్టీల నాయకులతో కలిసి రాయలసీమ జేఏసీ ఏర్పాటుచేయనున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు, టీజీ వెంకటేష్ లాంటివారు రాయలసీమ ద్రోహులన్నారు. రాజీనామాలు తమకు కొత్త కాదని, తమ నాయకుడు ఆదేశిస్తే రాయలసీమ కోసం రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. -
ఆర్బీకేలు ఆధునిక దేవాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఆధునిక దేవాలయాలుగా మారాయని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు బుధవారం ‘వ్యవసాయం–అనుబంధ రంగాలు’ పై స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను వ్యవసాయాన్ని పండుగ చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. డ్యాములు కళకళలాడుతున్నాయి. కరువు లేదు. చంద్రబాబు హయాంలో కరువు తప్ప ఇంకోటి లేదు. విత్తు దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సీఎం జగన్ రైతుకు భరోసా ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టేందుకు అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మా ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపి మార్కెట్‌కంటే ఎక్కువ రేటుకే కల్లాల వద్దే ధాన్యం కొంటోంది. కోళ్ల పరిశ్రమ, ఆక్వా, సెరీకల్చర్ ఇలా అన్ని వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకుంటోంది. వ్యవసాయం అంటే బాబుకు నిర్లక్ష్యం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. నాడు వైఎస్సార్ వ్యవసాయానికి ఊపిరి పోస్తే.. ఆయన తనయుడిగా సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేశారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు కట్టలేదని రైతులపై కేసులు పెట్టారు. ఎంతో మంది పల్లెలను వదిలి వలస వెళ్లిపోయారు. వారిని వైఎస్సార్ వెనక్కి తీసుకొచ్చి వ్యవసాయం చేయించారు. ఆయన ఆశయ సాధనకు సీఎం జగన్ రైతులపై రూపాయి భారం పడకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారు. 30 ఏళ్ల పాటు ఆటంకం లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగును పెంచాలి. ప్రకృతి వ్యవసాయంపైనా దృష్టి సారించాం. బాబు ఐదేళ్లలో ఒక్క గింజ కూడా కొనలేదు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రైతును మోసం చేసే వాడు భూమిపై బతికి బట్టకట్టలేడు. ఆనాడు చంద్రబాబు రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారు. వ్యవసాయం దండగ అన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అందువల్లే ఆయనకు ఈ దుర్గతి పట్టింది. సీఎం జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మా దగ్గర ఒక్క ధాన్యం గింజ కూడా కొనలేదు. ఇప్పుడు మా ప్రాంతంలో రైసు మిల్లులు లేకపోయినా ధాన్యం కొని, రాయదుర్గం నుంచి చిత్తూరుకు ప్రభుత్వమే తరలిస్తోంది. మా దగ్గర ఆదర్శ భారత కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కువ లోన్లు ఇస్తున్నారు. వాటికి వడ్డీ రాయితీ రావట్లేదు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని కోఆపరేటివ్ సొసైటీలకు కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలి. రైతుల సంక్షేమం ఆగదు మాజీ ఉప సభాపతి కోన రఘుపతి కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాలు ఆగలేదు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఒక చరిత్ర. ఒక్క రూపాయికే పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 3 వేల కోట్లు ఇవ్వడం వంటివి రైతుల గురించి ఆలోచించే వారే చేస్తారు. కోవిడ్ సమయంలోనూ ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. చంద్రబాబు రూ.88 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి దగా చేశారు. మా సీఎం జగన్ రైతు భరోసాతో వ్యవసాయానికి ఊపిరి పోశారు. ఆర్బీకేల ద్వారా 98 శాతం పంట నమోదు, విక్రయం జరుగుతోంది. పక్క రాష్ట్రాల వారు వచ్చి మన ఆర్బీకేల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆర్బీకేలను బ్యాంకులతో అనుసంధానం చేసి రైతులకు ఆర్థిక సపోర్టును మరింత పెంచాలి. ఉచిత విద్యుత్ రైతులకు వరం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైఎస్సార్ హయాంలోనే రైతుల స్వర్ణ యుగం ప్రారంభమైంది. వైఎస్సార్ తర్వాత రైతులను పట్టించుకున్న నాయకుడు సీఎం జగన్. రైతుల కోసం ఈ మూడేళ్లలో చరిత్రలో లేనన్ని పథకాలు తెచ్చారు. ఆర్బీకేలు ప్రతి గ్రామంలో ఆధునిక దేవాలయాలుగా మారాయి. పశువులకు అంబులెన్సులు వచ్చాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏరా>్పటు చేసి సాగులో మెళకువలు నేర్పుతున్నారు. గతంలో కంటే ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. -
వైఎస్సార్ గొప్పతనం భావితరాలకూ తెలియాలి
సాక్షి, అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు సంబంధించిన బిల్లును మంగళవారం ఆమె అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, మంచితనం, గొప్పదనం భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే హెల్త్ వర్సిటీకి ఆయన పేరు పెట్టామని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు కాపాడారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంలో తప్పేంటి? ఎన్టీఆర్‌ను వాడు, వీడు అని సంబోధించిన వ్యక్తి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫొటో, పేరు కనిపించకూడదని మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగువారు ఎవరూ మర్చిపోలేదు. (2019 ఎన్నికల ముందు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు) చంద్రబాబు, రాధాకృష్ణ మనసులో ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మాటలు చంద్రబాబువి కాదా? ‘ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీయే ఉందా ఇంకా.. అని రాధాకృష్ణ అడిగితే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు మారుస్తాం.. అది ఎప్పుడో మరిచిపోయారు.. వాడిది అయిపోయింది.. వాడిది అప్పుడు’ అని ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడారు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అప్పట్లో చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో ప్రచురితమైన పత్రికల్లో ఇది కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబుకు ఎన్టీఆర్ మీదున్న గౌరవం. (ఆ క్లిప్పింగ్స్ ప్రదర్శించారు) సీఎం వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ మీద అపార గౌరవం ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు’ అని చెప్పారు. ప్రజలతో విడదీయలేని బంధం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటేనే తెలుగు ప్రజలకు విడదీయలేని ఒక బంధం.. ఒక భావోద్వేగం అని మంత్రి రజిని చెప్పారు. ‘వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన 800 మంది అందుకు సాక్ష్యం. ఒక మనిషి శాసిస్తే.. గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుందంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్సార్. వైఎస్సార్ గొప్ప మానవతావాది. పరిపాలన దక్షుడు. ప్రజల కోసమే బతికాడు. ప్రజల కోసం వెళ్తూనే మరణించాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 8 మెడికల్ కాలేజీలు ఉంటే.. వైఎస్సార్ 3 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడుగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు. మొత్తం మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి. వైఎస్సార్ ఎన్నో గొప్ప పనులు చేసినందున మనం క్రెడిట్ తీసుకోవడంలో తప్పు లేదు’ అని చెప్పారు. ఔరంగజేబుకు, చంద్రబాబుకు తేడా లేదు నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం చంద్రబాబు, ఔరంగజేబు ఒక్కటే. మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. తమ్ముడిని కూడా మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశాడు. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసరడం కాదు.. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు రావాలి. పేద వారిని దగ్గరకు తీసుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందా? సత్య హరిశ్చంద్రుడిని వైఎస్ జగన్ రూపంలో చూశాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంది పలుకుతుంది. ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంతో గౌరవం. వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నాం. రాజకీయంగా ఏమీ లేక, టీడీపీ సభ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు అబ్బయ్య చౌదరి, దెందులూరు ఎమ్మెల్యే సభలో టీడీపీ సభ్యుల తీరు చాలా బాధాకరం. స్పీకర్ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారం కోల్పోతేనే టీడీపీకి ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. అధికారంలో లేనప్పుడే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ‘ఎన్టీఆర్ పేరును ఆరోగ్యశ్రీ పథకంలో తీసేస్తా, వాడి పేరు కనబడకుండా చేస్తా, ఇక ఏ పథకానికి వాడి పేరు పెట్టను’ అని చెప్పింది చంద్రబాబే. ప్రతి పథకానికి చంద్రన్న పేరు పెట్టుకున్న వీళ్లు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటించడం తగదు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు. ఎన్టీఆర్‌ను మా పార్టీ గౌరవించింది. హెల్త్ వర్సిటీకి ఎందుకు వైఎస్సార్ పేరు పెట్టాలనుకున్నామో తెలుసుకోకుండా ఆందోళన చేయడం తగదు. వైఎస్సార్ పేరు ఆమోదయోగ్యం మంత్రి, మేరుగు నాగార్జున దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పేదల ఆరోగ్యానికి అండగా నిలిచింది. పేద ప్రజల కోసం ఆలోచన చేసే రూపాయి డాక్టర్‌గా వైఎస్సార్‌కు పేరుంది. అలాంటి మహనీయుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే బాగుంటుందని భావించాం. సీఎం వైఎస్ జగన్ ఏ మండలానికి వెళ్లినా బ్రహా్మండమైన ఆస్పత్రి, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖరరెడ్డి పేరు ఆమోదయోగ్యం అని భావిస్తున్నాం. ఇక టీడీపీ వాళ్ల బాగోతం గురించి ఎంత చెప్పినా తక్కువే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయులు, రామానాయుడులు సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ను బహిరంగంగానే కొట్టారు. వీధి రౌడీగా ఉండి మర్డర్ కేసు వల్ల విజయవాడ నుంచి వెళ్లి విశాఖపట్నంలో స్థిరపడిన రామకృష్ణబాబు కూడా చేయి చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ సభలో రౌడీలా ప్రవర్తించారు. ఎన్టీఆర్ పట్ల బాబుకు గౌరవం లేదు మంత్రి, అంబటి రాంబాబు తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన చాలా దురదృష్టకరం. రెడ్ లైన్ దాటి, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి, దౌర్జన్యం చేస్తూ, కాగితాలు చించి పైకి విసరడం ఏమిటీ? ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న పచ్చ కాగితాలు తెచ్చి చించి పడేయడం చూస్తే వారికి వాళ్ల నాయకుడి మీద ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడూ అనుకోలేదు. మా ప్రభుత్వం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యులు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీని తెచ్చిన ఆ మహానుభావుడి పేరును హెల్త్ వర్సిటీకి పెట్టాలని భావిస్తున్నాం. ఎన్టీఆర్‌ను అవమానించింది చంద్రబాబే. ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. -
వాళ్ల కన్నా మాకే ఎక్కువ గౌరవం: గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
ఆ వ్యాఖ్యల వెనుక బాబు రహస్య అజెండా
సాక్షి, అమరావతి: ‘రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం‘ అంటూ అమరావతి యాత్రికులు చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు రహస్య అజెండా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అమరావతి యాత్ర పేరుతో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు బండారాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలన్నదే తన ఉద్దేశమన్నారు. అమరావతి పాదయాత్రలో వారు మాట్లాడిన మాటలు సీమ వాసిగా, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే, తాము మధ్యాంధ్రప్రదేశ్ పేరిట ఉద్యమించాల్సి ఉంటుందన్న వారి మాటల వెనుక కచి్చతంగా చంద్రబాబు ఉన్నారని అర్థమవుతోందన్నారు. శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. పసుపు కండువాలతో యాత్ర చేయండి ► కృష్ణా నది నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టు కోసం మేము త్యాగం చేసి, మీకు నీళ్లు ఇస్తుంటే, రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం అని విద్వేషాలు రెచ్చగొడతారా? రాయలసీమకు న్యాయ రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో అర్థం కావడం లేదు. ► చంద్రబాబుకు అధికారమే పరమావధి. రాష్ట్ర విభజనకు మూల కారకుడయ్యారు. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలంటే చంద్రబాబుకు ద్వేషం. రైతుల ముసుగులో గ్రీన్ కండువాలు ఎందుకు.. పచ్చ కండువాలతో యాత్ర చేయండి. ఐదేళ్లు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క హోటల్ కట్టావా బాబూ? అక్కడ టీ తాగాలన్నా, భోజనం చేయాలన్నా దిక్కు లేదు. రాష్ట్రంలో అశాంతి, అలజడులు సృష్టిద్దామనుకుంటే చూస్తూ ఊరుకోం. చంద్రబాబు కాలంలో నక్సలిజం, కరువు కాటకాలు ► 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, రాష్ట్రాన్ని కరువు ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయన పాలన తొలి నాళ్లలో నక్సలిజం, కరువు కాటకాలు, క్షీణించిన శాంతిభద్రతలతో రాష్ట్రం తల్లడిల్లింది. ► దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ అధికారం చేపట్టాక, వాటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రానికి సరికొత్త దశ, దిశ నిర్ధేశిస్తూ, సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారు. వ్యవసాయం దండగ అని బాబు అంటే.. కాదు పండుగ అని నిరూపించారు. ► రాష్ట్ర విభజన తర్వాత ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాని నుంచి తప్పించుకునేందుకు అమరావతి బాట పట్టారు. సినిమా సెట్టింగులు మాదిరిగా గ్రాఫిక్స్ చూపించి, డల్లాస్, సింగపూర్, మలేషియా చేస్తానని చెప్పి ప్రజలను మభ్య పెట్టారు. నిపుణుల మాటలను లెక్క చేయకుండా ఇక్కడి రైతులనూ మోసం చేశారు. ప్రజలు 2019లో అధికారం ఊడగొట్టినా బుద్ధి రాలేదు. ► హైదరాబాద్‌లో రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్, సాఫ్ట్వేర్ అన్నీ తన ఘనతేనని చెప్పుకుంటారు. అవుటర్ రింగు రోడ్డు, ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన నేత వైఎస్సార్. నేదురుమల్లి జనార్దనరెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులు ప్రారంభించారు. ► శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని హక్కుగా రావాల్సి ఉన్నా దానికీ బాబు అడ్డుపడుతున్నారు. రాయలసీమ అంటే విషం కక్కుతున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఇతరత్రా అన్ని విషయాలపై అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా పారిపోతారు. -
‘ఆడి కార్లలో వచ్చి పాదయాత్ర చేసేవారిని రైతులు అంటామా?’
సాక్షి, తాడేపల్లి: అమరావతిలోనే సంపద సృష్టించాలా? మిగతా ప్రాంతాలకు అర్హత లేదా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆడికార్లలో వచ్చి పాదయాత్ర చేసేవారిని రైతులు అంటామా? అని దుయ్యబట్టారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు కారకుడైన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ‘రాజధాని పేరుతో సెలెక్ట్.. ఎలెక్ట్.. కలెక్ట్ యాత్ర’ సంక్షేమం, అభివృద్ధితో దివంగత మహానేత వైఎస్సార్ ప్రజలకు ధైర్యం కల్పించారు. చంద్రబాబు తనకు తాను విజన్ ఉన్న వ్యక్తిగా ప్రచారం చేయించుకుంటారు. అమరావతికి వ్యతిరేకంగా మేం ఏ రోజూ మాట్లాడలేదు. అమరావతితో పాటు కర్నూలు, విశాఖ రాజధానులుగా ఉండాలని ఆలోచిస్తున్నాం. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేదే మా అభిమతం అని’’ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు: ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
-
‘ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారంటూ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సత్యకుమార్ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. సత్యకుమార్ కాదు.. అసత్యకుమార్ అని పేరు పెట్టుకోవాలంటూ ఆయన దుయ్యబట్టారు. చదవండి: 'టార్గెట్ 175' కుప్పం నుంచే తొలి అడుగు ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో స్కాం జరిగిందన్న బీజేపీ విమర్శలు వాస్తవం కాదా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని, ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా, సమన్వయంతో పని చేయాలని శ్రేణులకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి సూచించారు. ఈనెల 8, 9వ తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని తెలిపారు. కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా వ్యవహరించాలని నేతలను కోరారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ, జనరల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ల సమావేశంలో ప్లీనరీకి సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో సీఎం జగన్ మేలు చేస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు. మహిళలకు అన్ని రంగాలలో సమాన వాటా కల్పిస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో మంత్రివర్గంలో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనని గుర్తు చేశారు. చిరస్థాయిగా వైఎస్సార్సీపీ: సజ్జల వైఎస్సార్సీపీని ప్రజలు తమ హృదయాలలో చిరస్థాయిగా పదిలపరుచుకున్నారని ప్లీనరీ ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ కన్వీనర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందుకే సాధారణ ఎన్నికలలో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చారన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో సైతం 80 శాతం మంది ప్రజాప్రతినిధులు పార్టీ నుంచే ఎన్నికయ్యారని గుర్తు చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు. ప్రజలు ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలను అంచనాలకు మించి విజయవంతం చేయాలని సూచించారు. ప్లీనరీకి సంబంధించిన పలు అంశాలను ఆయన పూర్తిస్థాయిలో సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకం: వైవీ సుబ్బారెడ్డి ప్లీనరీ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతో భరోసాగా ఉన్నారని గుర్తు చేస్తూ వారి అంచనాలకు అనుగుణంగా ప్లీనరీ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్లీనరీ ఆహ్వాన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిష్టను ఇనుమడించేలా ప్లీనరీ సమావేశాలు జరగాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. సమావేశంలో విజయసాయిరెడ్డితోపాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగ నాగార్జున, మంత్రి విడదల రజని, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రాత్మకం: గడికోట అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ చరిత్రాత్మకమైందని ప్లీనరీ వాలంటీర్స్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీని కన్నతల్లిగా భావించే ప్రతి ఒక్కరికీ ప్లీనరీ అపురూపమైన పండుగలా నిలుస్తుందన్నారు. గత ప్లీనరీలో పార్టీ అజెండాను వివరించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నామనేది ఈ ప్లీనరీ ద్వారా వివరిస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ నిర్వహించే ప్రాంతాన్ని పార్టీ నేతలతో కలసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. -
పాలనలో నూతన ఒరవడి: శ్రీకాంత్‌రెడ్డి
కడప సెవెన్ రోడ్స్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సరికొత్త ఒరవడి సృష్టించారని వైఎస్సార్ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమబోర్డు చైర్మన్ పులి సునీల్‌కుమార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎస్ఏ కరీముల్లా, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత శ్రీరంజన్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. మూడేళ్లలో 1.14 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చి దాదాపు రూ.2 లక్షల కోట్లను పారదర్శకంగా ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి తలకిందులైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పారు. విద్యారంగాన్ని తీర్చిదిద్ది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► బీసీ నేత కృష్ణయ్యకు మేం రాజ్యసభ టిక్కెట్ ఇస్తే తప్పుబడుతున్న బాబు గతంలో నిర్మలా సీతారామన్, సురేష్‌ప్రభుకు ఎలా ఇచ్చారు? ► కరువు ప్రాంతాలకు నీరందించేలా 40 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేసిన హంద్రీ–నీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా? ఆయన హయాంలో నక్సలిజం పేట్రేగి పోయి శాంతి భద్రతలు క్షీణించాయి. ► ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఇల్లూ నిర్మించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు మా వెంట వస్తే నిజం నిరూపిస్తాం. ► దివంగత వైఎస్సార్ హయాంలోనే హైదరాబాద్‌లో రింగ్‌రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇతర అభివృద్ధి జరిగింది. అమరావతిలో చంద్రబాబు చేసిందేమీ లేదు. -
టీడీపీ నిర్వహించింది మహానాడా.. బూతునాడా?
-
చంద్రబాబు 14ఏళ్లలో ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు?
-
బీసీల ద్రోహి చంద్రబాబు
రాయచోటి/ సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. ఏ ముఖం పెట్టుకుని రాయలసీమకు వచ్చావు? ఎక్కడ ఏం జరిగినా పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అని విమర్శించే నీవూ సీమలోనే పుట్టావన్న విషయం మర్చిపోయావు. నీ పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు చేశావా? అన్ని వర్గాల వారికి మేము మేలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే నీ పని. ఇప్పటికే బీసీ ద్రోహిగా ముద్ర వేసుకున్నావు. ఇకనైనా పద్ధతి మార్చుకో’ అని సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం వారు తాడేపల్లి, రాయచోటిలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులకు రూ.వేల కోట్లు ముంచేసి, ఆ డబ్బులు తనకు తెచ్చిచ్చిన వారికి ఒకప్పుడు రాజ్యసభ సీట్లిచ్చిన చంద్రబాబు చరిత్ర అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన చరిత్ర మరచి ఇవాళ సీఎం జగన్‌పై విమర్శలు చేయడం దారుణం అన్నారు. ‘ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లు ఇస్తే.. పక్క రాష్ట్రం అంటూ నసుగుతున్నాడు. కృష్ణయ్య తెలంగాణకు చెందిన వారైనా, బీసీల సంక్షేమం కోసం దాదాపు 40 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా పో రాడుతున్నారు. తన పార్టీలో ఉంటేనేమో కృష్ణయ్య గొప్ప వాడు. వైఎస్సార్సీపీలో ఉంటే ప్రక్క రాష్ట్రం వాడి కింద లెక్కలోకి వస్తాడు. ఇంతకూ మీరు నివాసం ఉంటోంది తెలంగాణలోనే కదా?’ అని నిప్పులు చెరిగారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఎంపీలను బీజేపీకి తాకట్టు పెట్టావుగా.. ► బ్యాంకులను ముంచేసిన వారిని రాజ్యసభ సభ్యులుగా చేసిన చంద్రబాబు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే, భయపడి.. గంపగుత్తగా వారందరినీ బీజేపీలోకి పంపించారు. ► పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డితో డబ్బుల మూటలు మోయించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేçస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి, రాత్రికి రాత్రి కరకట్టకు పరుగెత్తుకుంటూ వచ్చావు. అలాంటి చంద్రబాబు ఇవాళ పక్క రాష్ట్రం వారని మాట్లాడుతున్నారు. ► ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సామాజిక న్యాయం దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది. 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు బీసీలు. అన్ని రాజకీయ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు కట్టిందేమిటి? ► పులివెందుల బస్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా? అని ఈ పెద్దమనిషి (చంద్రబాబు) మాట్లాడటంలో అర్థం లేదు. పులివెందులలో అతి పెద్ద బస్టాండ్ త్వరలో పూర్తవుతుంది. అసలు మీరు కట్టిందేమిటి? ► అమరావతిని పూర్తిగా గ్రాఫిక్స్‌లో చూపించి మభ్య పెట్టావు. చివరకు కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సీఎం జగన్ పూర్తి చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టకుండా అడ్డుకుంది మీరు కాదా? ► మేము మూడు రాజధానులు కడతాం. మీకు స్వాగతించే ధైర్యం ఉందా? నిజానికి మీరు ఆ ఐదేళ్లలో సొంత రాష్ట్రంలో కాకుండా తెలంగాణలోని హైదరాబాద్‌లో రూ.250 కోట్లతో సొంత భవనం మాత్రమే కట్టుకున్నారు. అమరావతి రాజధాని అంటున్న మీరు అక్కడ మాత్రం ఇల్లు కట్టుకోలేదు. వీపు పగలగొడతారని భయం.. ► దేశ వ్యాప్తంగా డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరగటానికి కారణం ఎవరు? బీజేపీని ఏమైనా అంటే వీపు పగలగొడతారని భయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మీదపడి ఏడుస్తున్నారు. ఇలాం టి ప్రతిపక్ష నేత ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. ► గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న స్పందన చూసి మీకు వణుకు పుడుతోంది. అక్కడక్కడ మీ పచ్చ బ్యాచ్ ఎవరైనా మాట్లాడితే రాక్షసానందం పొందుతున్నారు. ► గత మూడేళ్లలో మా ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి రూ.1.40 లక్షలు జమ చేసింది. ఇలా మీరు ఎంత చేశారో చెప్పగలరా? మీ హయాంలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేసి, రూ.80 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి పోయారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నీ ఆపేయమంటారా? భవిష్యత్ ఉండదనే బెంగ ► ఒంగోలులో మహానాడుకు ఎవరో అడ్డుపడ్డారంటారు. జనం రారని భయంతో మీరే వేదిక మార్చుకున్నారు. దీనికీ మాపైనే ఏడుపా? రోజూ శ్రీలంక.. శ్రీలంక అంటూ కలవరింపులు. మీరు ఆ దేశానికి వెళ్లి అక్కడే సెటిలైతే మంచిది. ► ఇన్నేళ్ల నీ పరిపాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి అయినా మేలు చేశావా? ముస్లింల మీద దేశద్రోహం కేసులు పెట్టావు,. మత్స్యకారులను, నాయీబ్రాహ్మణులను అవమానించావు. చివరకు రాయలసీమ వాసులనూ అవమానించావు. అందుకే నీవు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. ► గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఇప్పుడు బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలకు రాజ్యసభ సీట్లు ఇచ్చి సీఎం జగన్ గౌరవించారు. యావత్తు బీసీ ప్రపంచం ఆనంద పడే రోజు ఇది. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో 15 మందికి స్థానం కల్పించారు. ఇందులో పది మంది బీసీలున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత మంది లేరు. బీసీలకు సీఎం జగన్ చేసిన మేలుతో ఇక తనకు భవిష్యత్తు ఉండదనే బాధ, బెంగతో చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. -
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు.. అందుకే ఇలా: గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు దిగజారి ఉన్మాద భాష మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో జనం లేకపోవడంతో చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. తన తాబేదార్లకు మించి దిగజారుడు భాషలో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్దం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ప్రజలకు అందుతుంటే చంద్రబాబుకు ఆక్రోశం వస్తోందని, గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమన్ని వివరిస్తుంటే తట్టుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నాం. చంద్రబాబులాగా విడగొట్టి సంక్షేమాన్ని నిర్వీర్యం చేయలేదు. నువ్వు చేయలేనిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. నారాయణ సంస్థలు నారాయణవి కాదంటే ప్రజలు విస్తుపోతున్నారు. తప్పు చేస్తున్న వారిని శిక్షిస్తే కక్ష సాధింపు చర్యలు అంటారు. ముఖ్యమంత్రి సమీప బంధువు అయినా కూడా తప్పు చేస్తే శిక్ష పడింది. నీ హయాంలో తప్పు జరిగిన వారిని వెనకేసుకొచ్చి రాజీ పంచాయితీలు చేశావు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎంతో అద్భుమైనది. చంద్రబాబు ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచినా సమస్యలు తీర్చలేదు. కుప్పం నియోజకవర్గాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. హంగు ఆర్భాటం లేకుండా ప్రజల్లోకి వెళ్లి మంచి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన’ అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు,బాలకృష్ణ పై శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్
-
‘నారాయణ వచ్చాక.. ఆ పార్టీ భ్రష్టు పట్టింది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నారాయణ వచ్చాక కమ్యూనిస్ట్ పార్టీ భ్రష్టు పట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కమ్యూనిస్ట్ పార్టీ క్యాపటలిస్ట్ పార్టీగా మారిపోయిందన్నారు. పవన్కల్యాణది నిమిషానికో మాట.. పూటకో తీరు అంటూ ఆయన దుయ్యబట్టారు. చదవండి: రాజకీయ లబ్ధికే పవన్ పాకులాట జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎక్కడ లోపం జరిగిందో చెబితే సరిదిద్దుకునే నైజం జగన్‌ది. పవన్ అవి అడగకపోగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే పార్టీ టీడీపీ. ప్రజలతో మమేకం అవటంమే మా లక్ష్యం. అడ్డమైన విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. -
చర్చకు రమ్మంటే.. టీడీపీ అలా చేసింది
సాక్షి, అమరావతి: సభలో సభ్యులు అందరూ మాట్లాడతారని అనుకున్నామని, కానీ, టీడీపీ తీరుతో అంతా తలకిందులైందని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్‌ని అవమానిస్తూ టీడీపీ సభ్యులు ఘోరాలకు పాల్పడ్డారని, అది చూసి ముఖ్యమంత్రి సహా అంతా ఆశ్చర్యపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే అని, టీడీపీ సభ్యులు పబ్లిసిటీ కోసం అసెంబ్లీలో గవర్నర్ ని సైతం అవమానపరిచారని గుర్తు చేశారు. ఆపై సభలోనూ టీడీపీ సభ్యులు సరిగా వ్యవహరించలేదు. ఏదైనా అనుమానం ఉంటే అడగాల్సింది. కానీ, వాళ్ల ప్రవర్తన చూశాక.. టీడీపీ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేవలం సభలో అలజడి సృష్టించడానికే వాళ్లు వచ్చారు. సభలోకి వచ్చి గొడవ చేసి బయటకు వెళ్లిపోవడమే పనిగా పెట్టుకున్నారు. సభ జరిగినంత కాలం చిడతలు కొట్టడం, కాగితాలు చించటం చేశారు. పోనీ.. వారు వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనీయకుండా చేశారు. ఇళ్ల పట్టాల మీద స్వల్ప కాలిక చర్చ పెడితే దానిలో కూడా మాట్లాడలేదు. తమ ఎల్లో మీడియా ద్వారా పోలవరం ఎత్తు తగ్గించారంటూ రచ్చ చేశారు. సరేనని దానిపై చర్చ పెడితే టీడీపీ సభ్యులు మాట్లాడలేదు. మద్యం పాలసీపై స్వల్ప కాలిక చర్చ పెడితే.. అందులోనూ పాల్గొనలేదు. ఆఖరికి.. అసెంబ్లీ హక్కుల గురించి చర్చ పెట్టినా వారు రాలేదు. ప్రతీ అంశంపై సీఎం జగన్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. అసలు చర్చలపై పట్టుబట్టిందే వాళ్లు. కానీ, చర్చకు రాకుండా గొడవలు చేశారు అంటూ టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్. -
బీజేపీకి రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా ?
-
‘హోదా’ ఎందుకివ్వలేదో చెప్పండి
కడప కార్పొరేషన్: ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ.. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను ఏపీకి ఎందుకివ్వలేదో చెప్పాలని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ నిర్వహించిన రణభేరిపై శనివారం కడప కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చెయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా లాభం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలేదన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలోనే రాయలసీమ అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. పో తిరెడ్డిపాడును విస్తరించడం ద్వారా ఆయన రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీఎం వైఎస్ జగన్ మరింత మేలుచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర సహకారం లేనందునే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ముందుకు సాగకుండా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందన్నారు. ఇక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వైఎస్సార్సీపీకి వచ్చే నష్టమేమీలేదన్నారు. ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని మీటింగులు పెట్టినా బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. బీజేపీ రణభేరికి జెండా, అజెండా లేదన్నారు. విభజన సమస్యలు తీర్చలేదుగానీ.. మరో కార్యక్రమంలో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విభజనవల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీలో ఇప్పుడున్న సమస్యలను పరి ష్కరించడం చేతగాని బీజేపీ, కొత్త సమస్యల కోసం పోరాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ సమస్యనూ ఇంతవరకూ పరిష్కరించలేదని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న గాలేరు–నగరి, హంద్రీ–నీవా, గండికోట ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి సురేష్ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
ఇంకోసారి అలా మాట్లాడితే బాగోదు.. టీడీపీ సభ్యులపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
రూల్ 64 చదవండి
-
జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ దుష్ప్రచారం: శ్రీకాంత్‌రెడ్డి
-
మార్షల్స్ లేకపోతే.. గవర్నర్‌ను టీడీపీ సభ్యులు ఏం చేసేవారో?
సాక్షి, అమరావతి: శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు ఆయనపై దాడిచేసేందుకు కూడా వెనుకాడని రీతిలో ప్రవర్తించారని.. పోడియం వద్ద మార్షల్స్ లేకపోతే ఏం చేసేవారోనని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు దారుణంగా వ్యవహరించారని, వారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం అసెంబ్లీలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్ మాట్లాడారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని, సంక్షేమ పథకాలు నేరుగా పేదల ఇంటికే చేరాలని సీఎం వైఎస్ జగన్ దేశంలోనే రోల్‌మోడల్‌గా పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలుచేయకపోయి ఉండుంటే రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉండేదని, వలసలు విపరీతంగా పెరిగేవని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ సమయంలో ఏపీ ప్రజలు సంతోషంగా జీవించారని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందని వివరించారు. పేద వారికి కావాల్సింది విద్య, వైద్యమని.. ఈ రెండు రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని చెప్పారు. వ్యాక్సినేషన్లో ఏపీ అందరికీ ఆదర్శంగా నిలిచిందని.. మహిళా సాధికారత ఏ మేరకు సాకారమైందో అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్‌కు స్కోచ్ సంస్థ అవార్డు ప్రకటించిందన్నారు. ప్రతిపక్షానికి దశ, దిశ లేవు అంబటి మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీకి ఒక దశ, దిశ లేవని, కేడర్‌ను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం 30.70 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిచ్చిందన్నారు. ఇక, రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణపై సభలో చర్చ జరగాలని ఆయన స్పీకర్‌ను కోరారు. సంక్షేమ ఫలాలు అందించడమే విధ్వంసమా? జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎక్కడా అమలుచేయనన్ని సంక్షేమ ఫలాలను అందించడమే విధ్వంసమా?.. సామాజిక న్యాయం పాటించడమే విధ్వంసమా?.. అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ వెయ్యి రోజుల పాలనపై టీడీపీ చార్జిషీట్ విడుదల చేయడంపై మండిపడ్డారు. పుట్టబోయే బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ ప్రతీఒక్కరి అవసరాలను తీరుస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు తమ గుండెల్లో పెట్టు కుని పూజిస్తున్నారన్నారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి రాళ్లు, చెప్పులతో చంద్ర బాబు కొట్టిస్తే మా నాయకుడు ఆ మహనీయుడి పేరు ఓ జిల్లాకు పెడుతున్నారన్నారు. -
టీడీపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి
-
ప్రజాస్వామ్యంపై టీడీపీకి కొంచెం కూడా గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించిన వేళ.. సభలో టీడీపీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. గవర్నర్‌ను అగౌరవపర్చేలా టీడీపీ వ్యవహరించింది. ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ నుంచి మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో రుజువైందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘గవర్నర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా!. ఆయన వయసును కూడా చూడకుండా వ్యవహరించారు. అసలు బడ్జెట్ పత్రాల్లో ఏముందో కూడా వారు చూడకుండా చించేశారు. గవర్నర్ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడి చేసినట్టే!. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు ఎంతోహుందాగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ఆ పని చేయట్లేదు. సంస్కార హీనులుగా వ్యవహరించడం టీడీపీ నేతలకు ఎంత వరకు సమంజసం’’ అని ప్రశ్నించారు. రైతుల ముసుగులో టీడీపీ డ్రామాలు ఆడుతోందని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారాయన. టీడీపీ నేతలు రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. బీఏసీ లో అచ్చెన్నాయుడు వ్యవహారశైలి చూశాం. వారు సభని కొనసాగించ కూడదన్నట్టే ఉన్నారు. సభను, వ్యవస్థలను అగౌరవపరచవద్దని టీడీపీ వారికి చెప్తున్నాం’ అని విజ్ఞప్తి చేశారు గడికోట శ్రీకాంత్‌రెడ్డి. -
అసెంబ్లీకి ఉన్న హక్కులపై చర్చించాలని భావిస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలే అత్యంత ప్రాధాన్యంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో టీడీపీలా కాకుండా మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరు తెచ్చి సమావేశాల నుంచి వెళ్లిపోయారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి హాజరవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి రాజకీయం చెయ్యాలని అనుకుంటున్నారు. టీడీపీ బయట మాట్లాడేవి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి. వివేకా హత్యపై తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దానిపై కూడా అసెంబ్లీ లో మేము చర్చించేందుకు మేము సిద్ధం. అసెంబ్లీ అధికారాలపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన లేఖ రాశారు. దీనిపై బీఏసీలో స్పీకర్ అనుమతితో చర్చించాలని కోరతాం. అసెంబ్లీకి ఉన్న హక్కులపై కూడా చర్చించాలని భావిస్తున్నట్లు చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చదవండి: (సైకిల్ యాత్రలో అపశృతి.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యే) -
ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం టీడీపీకి లేదు’
-
‘ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం టీడీపీకి లేదు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద చల్లడమే కొందరు కుట్ర దారుల పని అంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతోందని.. రిపోర్ట్ రాకముందే అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’ ‘‘విచారణలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై ప్రభుత్వమే కేసు వేయించిందని దుష్ప్రచారం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతోనే సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదయ్యిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక అజెండాతో కుట్ర చేస్తున్నారు. మంచి చేసేవారిపై రోజుక కథనంతో దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మరణాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం కూడా టీడీపీకి లేదని’’ శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబటారు. -
అజెండాలో చేర్చినప్పుడు నోరెత్తలేదేం?
సాక్షి, మచిలీపట్నం, కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలుత విభజన సమస్యల పరిష్కార కమిటీ అజెండాలో చేర్చినప్పుడు ఏమాత్రం స్పందించని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు తొలగించగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు తహతహ లాడుతున్నారని మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తన కోవర్టులను బీజేపీలో చేర్చి నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకుని కనీసం అదికూడా సాధించలేని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. నాడు కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజుతో హోదా అవసరం లేదని అర్ధరాత్రి ప్రకటన చేయించారని గుర్తు చేశారు. మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో, గడికోట శ్రీకాంత్‌రెడ్డి కడపలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నీచ రాజకీయాలొద్దు.. ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఒక్క రూపాౖయెనా తెచ్చారా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేయడంలో చంద్రబాబు మార్గదర్శకత్వంలో కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈర‡్ష్య, నీచ రాజకీయాలను కట్టి పెట్టాలని సూచించారు. విభజన అంశాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ అజెండాలో తొలుత చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీలో చేరిన తన కోవర్టుల ద్వారా చంద్రబాబు తొలగింప చేశారని చెప్పారు. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే కదలిక ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజన సమస్యలను పరిష్కరించాలని కోరటాన్ని మంత్రి నాని గుర్తు చేశారు. ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైందని, ఏపీకి జరిగిన అన్యాయంపై దృష్టి సారించాలని ప్రధానిని సీఎం కోరారన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై స్పందించిన ప్రధాని అపరిష్కృత అంశాలకు సంబంధించి కమిటీని నియమించారని తెలిపారు. ప్రతిపక్షం కాదు.. పనికిమాలిన పక్షం టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరుకున్న కొందరు నాయకులు చంద్రబాబు అజెండాను అక్కడ అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్షం కాదని, పనికిమాలిన పక్షమని «ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పదేపదే ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తూ డిమాండ్‌ను సజీవంగా ఉంచారని చెప్పారు. -
‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీటింగుల్లో స్ట్రాటజీ ఉండదని, అర్థం లేకుండా మాట్లాడుతుంటాడని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడంపై ఏమీ పాలుపోక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉన్న వ్యక్తి తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరు పెట్టారని స్పష్టం చేశారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్, అన్నమయ్య, సత్యసాయి లాంటి వారు ఒక్క ప్రాంతానికి పరిమితమైన వారు కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని, వారిని గౌరవించుకోడానికే ప్రభుత్వం ఆ పేర్లు పెట్టిందని తెలిపారు. దాంట్లోనూ చంద్రబాబు రెచ్చగొట్టే ధోరణి విడనాడలేదని, ఏదన్నా తాను చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంటగా ఉందని దుయ్యబట్టారు. ఒక్కసారి ఆయన గురించి ఎన్టీఆర్ ఏమన్నాడో చంద్రబాబు వీడియోలు చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వంటి ద్రోహి ఎవ్వరూ లేరని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. చదవండి: మహారాష్ట్ర 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అదే విధంగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్తీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తారని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని తాము చెప్తూనే ఉన్నామని పేర్కొన్నారు. చర్చల కోసం ఉద్యోగులు రాకపోతున్నా కమిటీ సభ్యులు వేచి చూస్తున్నారని, సమస్య ఏదైనా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాంటిది ఉద్యోగుల సమస్య పక్కదోవ పట్టించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. -
క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ అధినేత చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కడపలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అయిపోయి పదిరోజులైనా జూదం, క్యాసినోలని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి అయిన తరువాతే హైదరాబాద్‌లో నైట్ లైఫ్ కల్చర్ ఏర్పాటు చేశానని చెప్పారని గుర్తు చేశారు. డిస్కోలు, బార్లు, పబ్‌లు, క్యాసినోలే నైట్ లైఫ్ అన్నారు. నైట్ లైఫ్ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ప్రభుత్వంపై చంద్రబాబు కవాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇదే చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ప్రజల సంతోషాన్ని కాలరాస్తున్నారు అని మాట్లాడే వాడని విమర్శించారు. ‘ఉద్యోగులు టీడీపీ హయాంలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే..చంద్రబాబు ఈ సంఘాల అంతు చూస్తా..తోకలు కత్తరిస్తానని బెదిరించాడు. ఈ రోజు సంఘాలన్ని ఏకతాటిపైకి రండి అని పిలుపునిస్తున్నారు. ఈ రోజురాష్ట్రంలో ప్రెండ్లీ ప్రభుత్వం ఉంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోంది. కరోనా లేని సమయంలో ఉద్యోగులు అడగకపోయినా కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఐఆర్ 27 శాతం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఐదు డీఏలు ఇస్తే వెసులుబాటు ఉంటుందని ఇలా చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇస్తున్న రూ.10 వేల కోట్ల భారం ఎక్కడికి వెళ్తుంది. ప్రభుత్వానికి భారమైన ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
స్నేహపూర్వక ప్రభుత్వమిది
సాక్షి, అమరావతి: తమది ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా వ్యవహరించే ప్రభుత్వమని, ఏ ఒక్కరినీ విస్మరించబోమని, రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ప్రజాస్వామ్యయుతంగా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా ముందుకు వెళ్లదని చెప్పారు. ఆవేశాలకు లోనై ప్రభుత్వాన్ని కించపరిచేలా కొంత మంది మాట్లాడుతుండటం సరైన పద్ధతి కాదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చిందని, ఇలా ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఇచ్చారా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకే అధికారంలోకి రాగానే లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చిందని వివరించారు. శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగులకు నష్టం రానివ్వదు ► ఉద్యోగులు నష్టపోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. పీఆర్సీపై తెలంగాణతో పోల్చి చూసుకోవాలి. ఎక్కడా ఇంత పీఆర్సీ లేదు. కరోనా సమయంలోనూ సీఎం జగన్ రూ.18 వేల కోట్లు ఐఆర్ కింద ఇచ్చారు. ఆరోజున ఐఆర్ ఇవ్వకపోతే.. రూ.18,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడి ఉండేది కాదు. ► ఆ రూ.18,000 కోట్లతో చిన్న చిన్న కాంట్రాక్టు బిల్లులన్నీ క్లియర్ చేసి ఉండేవాళ్లం. గత ప్రభుత్వం రూ.80 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయింది. చేతికి ఎముకే లేదన్నట్లు తండ్రికి మించిన దానగుణం సీఎం జగన్‌లో ఎన్నోసార్లు చూశాం. ► రూ.10 వేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. ఉద్యోగులు వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు. ఉద్యోగుల సమస్యలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం కాదిది. ► ప్రభుత్వ ఉద్యోగుల్ని కించపరిచే వారిని, బానిసలుగా చూసే వారిని గత ప్రభుత్వాల్లో చూశాం. బహిరంగ వేదికలపైన వేధించిన రోజులు అందరికీ గుర్తున్నాయి. పబ్లిక్‌గా ఓ పత్రికాధిపతి.. ఆనాడు సీఎంగా ఉన్న వ్యక్తితో కలిసి టీ తాగుతూ ఉద్యోగుల గురించి ఘోరంగా, అసభ్య పదజాలంతో మాట్లాడింది లైవ్‌లో అందరం చూశాం. ► అలాంటి వారు ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగుల మేలు గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం. వారి ట్రాప్‌లో పడొద్దు. వారిది ఆర్టిఫిషియల్ ప్రేమ. దివంగత సీఎం వైఎస్సార్ ఉద్యోగుల మంచి ఎలా కోరుకునే వారో అదే బాటలో సీఎం జగన్ ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వంపై బురదజల్లొద్దు కొంత మంది మాటలు విని రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లకండి. అందరం ఒకరికొకరు చేతులు కలిపి నడిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ఉద్యోగులు పునరాలోచన చేయాలి. సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ మనిషిగా చూడాలని, ఓటరుగా చూడొద్దన్న ప్రభుత్వం ఇది. సీఎం ఒకమాట చెబితే దానిపై నిలబడతారు. ఉద్యోగులకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. -
‘ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశ్యం కాదన్నారు. కచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. చదవండి: వేతనాలు తగ్గవు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టీకరణ ఉద్యోగులు ఆవేశాలకు లోను కావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలనే ఆలోచించే ప్రభుత్వమిదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పదివేల కోట్ల భారం పడుతున్నా సీఎం వైఎస్ జగన్ వెనుకాడలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దు
-
'పది వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు.. లెక్క చెప్పగలరా?'
సాక్షి, తాడేపల్లి: అభివృద్ధి అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన సాగిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చర్చించారు. అయితేవాస్తవాలకు దూరంగా పరిపాలన సాగించిన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వాస్తవాలు చెబుతుంటే సహించలేకపోతున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలం గడిపారు. రాజధాని కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు. అక్కడ రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు.. లెక్క చెప్పగలరా?. అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు కూడా కట్టుకోలేదు. వాస్తవాలకు దూరంగా చంద్రబాబు పాలనసాగింది. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. వందల కోట్ల చందాలతో న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర నిర్వహించారు' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చదవండి: (టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు) -
‘టీడీపీ వ్యవహారం చూసి జనం నవ్వుకుంటున్నారు’
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరపాలనుకున్నామని, బీఏసీ సమావేశంలో ప్రతిపక్షం అడిగారని వారానికి పెంచామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని మండిపడ్డారు. చదవండి: రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం: విజయసాయిరెడ్డి కౌరవసభ అని ఆరోపించి వెళ్లిపోయారని, వాస్తవానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని శ్రీకాంత్ మండిపడ్డారు. ఈ సభలో బీసీలు, మైనారిటీల అంశాలతోపాటు మహిళా సాధికారత, వరదల వల్ల నష్టపోయిన వాటిపై, విద్యారంగంపై సుధీర్ఘంగా చర్చ జరిపామని తెలిపారు. నేరుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు. చదవండి: AP: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా 34 గంటలు చర్చలు జరిపామని, 93 మంది సభలో మాట్లాడారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. కానీ ప్రతిపక్షం రాకపోవడం దారుణమని, సభలో మహిళలను కించపరిచింది టీడీపీ అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన 28 ప్రశ్నలకు సమాధానం చెప్పామని.. వారి వ్యవహారం చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. తమ ప్రభుత్వం ఎవరినీ అవమానించదని, అనేక అంశాలపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని పేర్కొన్నారు. -
పచ్చి అబద్ధాలతో దారుణ కథనాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై టీడీపీ అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలతో దారుణమైన కథనాలను ప్రచురించాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడైన దస్తగిరి వాంగ్మూలం అంటూ అందులో లేని విషయాలను కూడా ప్రచురించారని మండిపడ్డారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు. హత్యకు గురి కావటానికి ఏడాదిన్నర క్రితం ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోవటానికి, దస్తగిరి వాంగ్మూలానికి ముడిపెడుతూ కథనాలు వెలువరించడం ఏమిటని ప్రశ్నించారు. దస్తగిరి ఏదో అంటే అది సీబీఐ దర్యాప్తు సంస్థే చెప్పిందనే తరహాలో కథనాలు ఏమిటని నిలదీశారు. రాజకీయంగా ఎదగాలంటే ప్రజల మన్ననలు పొందాలే కానీ ఇంత దిగజారుడుతనం పనికిరాదన్నారు. తండ్రిని పోగొట్టుకున్నప్పుడు, బాబాయి చనిపోయినప్పుడు రెండు సందర్భాల్లోనూ వైఎస్ జగన్‌పై అలాంటి కుట్రలే పన్నారని చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడం మినహా ప్రజల గురించి, రాష్ట్రం గురించి ప్రతిపక్ష పార్టీ, దాని అనుకూల మీడియా ఆలోచించడం మరచిపోయిందని ధ్వజమెత్తారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు అందుకు అంగీకరించలేదు సరికదా రాష్ట్రానికి సీబీఐ రాకూడదంటూ ఉత్తర్వులిచ్చారని చెప్పారు. సీబీఐ విచారణకు సీఎం జగన్మోహన్రెడ్డి అంగీకరించకపోయి ఉంటే అసలు దర్యాప్తు జరిగి ఉండేది కాదన్నారు. ఇందులో కర్ణాటకకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నందున కుటుంబ సభ్యుల కోరిక మేరకు సీబీఐ విచారణకు ఆదేశించారని తెలిపారు. ఏదో సీబీఐ చెప్పినట్లుగా కథనాలా? టీడీపీ అనుకూల పత్రికలు ఇవాళ తాటికాయంత అక్షరాలతో అసత్యాలు ప్రచురించాయి. వైఎస్ అవినాష్‌రెడ్డిని ఇందులో ఎలా ఇరికించాలనే ఏకైక అజెండాతో విషం చిమ్మాయి. కుట్రదారులు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అని పెద్దక్షరాలతో ప్రచురించారు. వార్త కింద వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని రాశారు. ఇది నైతికతా? ఇలాంటి కుట్రలు ఎందుకు? దస్తగిరి చంపినట్లు అంగీకరించినట్లు రాశారు. దస్తగిరికి గంగిరెడ్డి చెప్పాడని కాకుండా ఏదో సీబీఐ చెప్పినట్లుగా ప్రచురించారు. ఎవరి పేరైనా చెప్పొచ్చు.. ఫలానా వారు ఉన్నారని దస్తగిరికి గంగిరెడ్డి చెప్పాడట! అవతలివారిని ఇరికించాలంటే ఎవరి పేరైనా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పేరు చెప్పొచ్చు, ప్రధానమంత్రి పేరు చెప్పొచ్చు. పూర్తి విచారణ జరగకుండానే ఫలానా వారి ద్వారా జరిగిందన్న రీతిలో కథనాలు వెలువరించడం ఏమిటి? దీన్ని పట్టుకొని టీడీపీ నేతలు ప్రెస్మీట్లకు దిగుతున్నారు. చంద్రబాబు క్యాంపు రాజకీయాలు.. టీడీపీ అధికారంలో ఉండగా వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన్ను అత్యంత గౌరవిస్తారు. కొన్ని కారణాలతో కొద్ది రోజుల పాటు పార్టీని విడిచినా తర్వాత తిరిగి వచ్చి జిల్లాలో అన్నీ తానై చూసుకున్నారు. శాసన మండలిలో మంచి వ్యక్తి ప్రాతినిధ్యం ఉండాలని భావించి నాడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన్ను నిలిపారు. కానీ వివేకానందరెడ్డి గెలిస్తే జిల్లాలో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్ట పెరుగుతుందనే ఆందోళనతో చంద్రబాబు చేయని కుట్ర లేదు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కడప నుంచి ప్రత్యేక విమానాల్లో పాండిచ్చేరి తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కుటుంబంలో చిచ్చుపెట్టాలని చూశారు. ఆయన దౌర్భాగ్యపు రాజకీయాలను ప్రజలు మరువరు. అలాంటి నీచానికి ఒడిగట్టి వివేకానందరెడ్డిని చంద్రబాబు ఓడించారు. వివేకా విజయం కోసం ఆనాడు వైఎస్ జగన్ ఎంతో ప్రయత్నించారు. ఆయనన్నారు... ఈయన విన్నారు! చంద్రబాబు రాజకీయంగా తుడిచిపెట్టుకుపోయారు. ఇక టీడీపీకి మనుగడ లేదనే భయంతో ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించకుండా వైఎస్సార్ కుటుంబంపై బురద చల్లేందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యపై నిజాలు బయటకు రావాలని మేం కోరుకుంటున్నాం. పూర్తిస్థాయి విచారణ జరగాలి. ఎవరో చెప్పారని కాకుండా వాస్తవాలన్నీ బయటకు రావాలి. ఆయనన్నారు... ఈయన విన్నారు అన్నట్లుగా కాకుండా ఆధారాలతో సహా వెలికి తీయాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. తమ కుటుంబంపై అసత్యాలతో దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్ అవినాష్‌రెడ్డి భావిస్తున్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన దుఃఖంలో మేం ఉంటే తమ పబ్బం గడుపుకునేందుకు అసత్య కథనాలు ప్రచురించినందుకు సిగ్గు పడాలి. ఆ పత్రికలూ రిపోర్టు పూర్తిగా చదవాలి. కావాలంటే మీకు పంపిస్తాం. ఉన్నది ఉన్నట్లు రాస్తే బాగుంటుంది. దిగజారకండి. -
ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు
-
ఇది ప్రజా విజయం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఇది ప్రజా విజయమని.. ప్రజలను నమ్ముకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ పోటీ చేసినా కథ నడిపింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. బీజేపీ, టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయాయి. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘బద్వేల్ ఫలితం మరింత బాధ్యత పెంచింది. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇది. ఇది దళితులు, బీసీలు, సామాన్యుల విజయం. ప్రజలు మా వైపే నిలిచారు సీఎం జగన్ పారదర్శక పాలనకు ప్రజలు అండగా నిలిచారు. నిరంతరం దుష్ప్రచారం చేసే టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పారు. బీజేపీ గతంలో ఇచ్చిన హామీలు విస్మరించినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని హామీలేవి బీజేపీ నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఆయన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అందుకే ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారని’’ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
బీజేపీ కుయుక్తులు.. టీడీపీ కుట్రలు
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకులు కుయుక్తులుతో ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఉప ఎన్నికలో పోటీకి దూరమని ప్రకటించిన టీడీపీ కుట్రలతో ముందుకెళ్లిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం రాత్రి కడపలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి భయంతో వైఎస్సార్సీపీపై విమర్శలకు దిగుతోందని దుయ్యబట్టారు. గెలవలేమని తెలిసినా వైఎస్సార్సీపీకి మెజార్టీ తగ్గించాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు ఎక్కడికక్కడ బూత్‌ల వద్ద కుయుక్తులకు తెర లేపారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఐడీ కార్డులు, ఇతరత్రా కారణాలు చెబుతూ బూత్‌ల వద్దకు ఓటర్లు రాకుండా అడ్డుకునే కుట్ర చేయడం దారుణమన్నారు. బీజేపీ నాయకులు కోరిన విధంగానే 281 బూత్‌లలోనూ వెబ్ కాస్టింగ్‌తోపాటు లైవ్ కవరేజ్ చేశారన్నారు. అయినప్పటికీ ఓట్లు రావన్న కారణంతో బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏదో ఒక అరాచకం చేసి ఓటర్లను రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ అభ్యర్థి పోటీ చేయకపోయినా అన్ని బూత్‌లలో బీజేపీ తరఫున టీడీపీ కార్యకర్తలే ఏజెంట్లుగా కూర్చోవడం చూస్తే కుట్ర రాజకీయాలు ఏమేరకు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏం చూసి బీజేపీకి ఓట్లేస్తారు బీజేపీకి ఏం చూసి ప్రజలు ఓట్లేస్తారని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. బద్వేలులో అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగకపోయినా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఏదో జరిగినట్టు మాట్లాడటం తగదన్నారు. వారికి బలం లేనిచోట ఏజెంట్లను పెట్టుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన ఘటన ఒక్కటైనా చూపించాలన్నారు. -
బద్వేల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారు: ఆదిములపు సురేష్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘‘వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సీఎం జగన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బద్వేల్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుంటున్నాం. బద్వేల్ ఉపఎన్నికలో ప్రలు ఏకపక్ష తీర్పు ఇస్తారు’’ అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీజేపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు. బీజేపీ పరిధిలో లేని హామీలు ఇస్తున్నారు. బద్వేల్లో బీజేపీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తుందట. రాజ్యాంగం ప్రకారం పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి. బద్వేలు ఉప ఎన్నికలో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారు’’ అని మంత్రి సురేష్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి) స్థానిక బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేస్తా: గడికోట ‘‘నేను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు. ఈ ఆరోపణలు నిజమని స్థానిక బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేస్తా. సోము వీర్రాజు అందుకు సిద్ధమా’’ అని ప్రశ్నించారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్నాం. సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైంది’’ అన్నారు. (చదవండి: బద్వేలులో టీడీపీ.. బీజేపీకి ఓట్లు వేస్తామంటోంది) ‘‘పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కేంద్రం బాధ్యత కాదా. సమస్యలపై వైసీపీ, బీజేపీ అభ్యర్థులు బహిరంగ చర్చకు సిద్ధమా. ఏపీకి ఇచ్చిన హామీలు అమలుకు బీజేపీ ప్రయత్నించాలి’’ అన్నారు. చదవండి: 'కాంగ్రెస్ చేసిన పాపం దేశంలోనే కనుమరుగయ్యేలా చేసింది' -
పట్టాభి వాడిన పదాలకు అర్ధమేమిటో తెలుసా?
-
టీడీపీది వికృత క్రీడ: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, కడప: రాష్ట్రంలో టీడీపీ రాజకీయ ఉనికి కోల్పోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు డైరెక్షన్లో అంతా జరిగిందని.. ముఖ్యమంత్రిపై కుట్ర ప్రకారమే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారన్నారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకోవచ్చు. టీడీపీలో హుందాతనం కరువైందన్నారు. పట్టాభి వ్యాఖ్యలు ఏరకంగా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. (చదవండి: బూతు పురాణం) ‘‘చంద్రబాబు ప్లాన్ ప్రకారం రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు ఆకస్మికంగా ఏపీకి ఎందుకు వచ్చారు? చంద్రబాబు వైఖరి దారుణం. టీడీపీది వికృత క్రీడ. పట్టాభితో నీచాతి నీచంగా మాట్లాడించారు. ప్రజల్లో కోపం వస్తుందని చంద్రబాబుకు తెలుసు. పట్టాభి వాడిన పదాలకు అర్థమేమిటో తెలుసా?. చంద్రబాబు హయాంలో ఎవరిని అడిగినా వెన్నుపోటు, కుట్రే అంటారు. రెండున్నరేళ్లలో సీఎం జగన్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందించారని’’ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సీఎం ఆదేశించారు. నీచ రాజకీయాలు చేసేదే చంద్రబాబు. పబ్లిసిటీ కోసం ఆయన దేనికైనా తెగిస్తారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: బాబు ఆస్థానం.. అవినీతి ప్రస్థానం: కుప్పంలో అడ్డగోలు దోపిడీ -
‘టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు’
సాక్షి, వైఎస్సార్ కడప: గత ప్రభుత్వం బద్వేల్ అభివృద్ధిని పట్టించుకోలేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాము బ్రహ్మంసాగర్ ద్వారా 7 మండలాలకు నీరు అందించామని తెలిపారు. బద్వేల్‌కు తాగు, సాగు నీటిని అందిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.130 కోట్లతో బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. -
‘బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తాం’
సాక్షి, తాడేపల్లి: బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయని తెలిపారు. 98 శాతం ఇచ్చిన హామీలు అమలు చేశామని, ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీ విజయలు దక్కాయని గుర్తుచేశారు. కొందరు కులమతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను తెరపైకి తెచ్చి లబ్ధిపొందే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులిచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. -
పింఛన్లపై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ఎవరికీ పింఛను తొలగించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా తెలియజేశారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో బుధవారం విప్ల సమావేశం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హత ఉన్న ఎవరి పింఛనూ తీసేయదని స్పష్టం చేశారు. టీడీపీ హయంలో కేవలం 39 లక్షల మందికే పింఛన్లు అందేవన్నారు. అదీ రూ.350 కోట్లు మాత్రమే అందజేసేవారని, ఈ ప్రభుత్వం 61 లక్షల మందికి రూ.1,400 కోట్లు పింఛన్ల రూపంలో అందిస్తోందన్నారు. ఒక వేళ అనర్హత ఉండి తీసేయాలన్నా వారికి నోటీసు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే తీసి వేయాలని సీఎం జగన్ సూచించారన్నారు.