సాక్షి, తాడేపల్లి: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని.. శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ వైఫల్యం చెందిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు. శాంతిభద్రతలు అనేవి ఏపీలో లేవు. నందికొట్కూరు లాంటి ఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి వైఎస్ జగన్‌ని ఎలా దూషించాలో టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు మద్యం షాపుల కోసం దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. 2014-19లో అనేక డిస్ట్రిలరీకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. దీని వలన జనం రోగాలపాలు అయ్యారు. అందుకే జగన్ వచ్చాక 48 వేల బెల్టుషాపులు రద్దు చేశారు. జగన్ పాలనలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
‘‘కేరళ మాల్ట్ బ్రాండ్ 90 రూపాయలకు ఇస్తుంటే ఇక్కడ 99 రూపాయలకు పెంచారు. ఇదేనా నాణ్యమైన మద్యం అందిచటం అంటే?. ఈవీఎంలను ఎలా టాంపరింగ్ చేయాలో కూడా లైవ్‌లో చాలామంది చూపిస్తున్నారు. ఇలాంటి వాటిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. జనాభిప్రాయంతో సంబంధం లేకుండా టీడీపీ గెలిచింది. అందుకే ప్రజల ప్రాణాలంటేనే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. టార్గెట్ పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు.’’ అని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’!
‘‘ఇప్పటికే అమ్మఒడి, విద్యాదీవెన, రైతు భరోసాలాంటి పథకాలేవీ అమలు చేయడం లేదు. వైఎస్ జగన్ తొలి రోజునుండే మేనిఫెస్టోని అమలు చేశారు. కేరళా మాల్డ్ మద్యం కర్నాటకలో 90 రూపాయలే. దాన్ని ఏపీలో రూ.99కి ఎందుకు ఇస్తున్నారు?. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచనే ఉండదా చంద్రబాబూ?. ఎంతసేపూ దోపిడీ ఆలోచనలేనా?. మద్యాన్ని వ్యసనంగా మార్చ వద్దు. జేసీ ప్రభాకరరెడ్డిలాంటి వ్యక్తులు డైరెక్టుగా కమిషన్లు అడుగుతున్నారు. మద్యంలోనే 15 శాతం కమిషన్ అడుగుతున్నారంటే మిగతా వాటిల్లో పరిస్థితి ఏంటి?. జేసే లాంటి చాలామంది నాయకులు ఇలా బెదిరించిన వీడియోలు, ఆడియోలు వచ్చాయి. అయినా చంద్రబాబు వారిని ఎందుకు కట్టడి చేయటం లేదు?’’ అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment