పొరపాటును సవరించుకున్నా.. రాద్ధాంతమా? | Stop Spreading False News says, Gadikota Srikanth Reddy | Sakshi
Sakshi News home page

అసత్య వార్తలకు స్వస్తి చెప్పాలి: శ్రీకాంత్‌రెడ్డి

Published Thu, Jul 23 2020 1:24 PM | Last Updated on Thu, Jul 23 2020 1:25 PM

Stop Spreading False News says, Gadikota Srikanth Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ‘పొరపాటును సవరించుకున్నా ఓ వర్గానికి చెందిన మీడియా రాద్ధాంతం చేయడం దుర్మార్గం’  అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.  ‘నిన్న(జులై 22) పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గంటకు కోట్ల రూపాయలు ఫీజులు తీసుకునే న్యాయవాదులను ఎలా పెట్టుకోగలిగారు.. ఆ డబ్బులు ఆయనకు ఎలా వస్తున్నాయి, ఎక్కడ నుంచి వస్తున్నాయి.. అని మాట్లాడుతూ.. న్యాయవాది అనబోయి పొరపాటున జడ్జి అన్న విషయం వాస్తవం. అది పొరపాటు. (రాజ్యాంగ వ్యవస్థకు నిమ్మగడ్డ వ్యతిరేకం)

అయితే, వెనువెంటనే నా పొరపాటును సవరించుకుని న్యాయవాది అని చెప్పాను. అయితే దానిని ఓ వర్గం మీడియా రాద్ధాంతం చేయటం దుర్మార్గం. జడ్జిలకు ఫీజులు ఎవరైనా ఇస్తారా..? కనీసం ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా.. నేనేదో అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ అభూత కల్పనలు సృష్టించటం బాధ్యతాయుతమైన మీడియా చేసే పని కాదు. ఇప్పటికైనా ఇటువంటి అబద్ధాలు, అసత్య వార్తలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నాను.’ అని ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. (ఎస్ఈసీ విషయంలో తగిన నిర్ణయం తీసుకోండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement