State Election Commissioner
-
కూటమికి కళ్లెం వేయండి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అధికార కూటమి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని చెప్పింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలను సజావుగా నడిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులతో కూడిన వైఎస్సార్సీపీ బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పిడుగురాళ్ల ఎన్నిక రద్దు చేయాలి: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కూటమి నేతలు పోలీసు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెడుతున్నారని, ఇళ్లను కూల్చివేసి, అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల ఎన్నికను రద్దు చేసి, మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.తునిలో కూటమి పార్టీ ల వల్ల ఇప్పటికి రెండు దఫాలు వాయిదా పడిందని చెప్పారు. పాలకొండలో ఒకే ఒక్క ఎస్సీ సభ్యురాలు ఉంటే ఆమెను కూడా వారి పార్టీ తరపున నిలబెట్టే ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఈ వ్యవహరంలో జోక్యం చేసుకుని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తారా?: దేవినేని అవినాష్ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులను భయపెట్టి ఓట్లేయించుకుంటున్న టీడీపీ నేతల అకృత్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తునిలో ఏకంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపైనే దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడం ఇది నాలుగోసారి అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అధికార పార్టీ ఆగడాలను, అప్రజాస్వామిక విధానాలను అధికారులు చేష్టలుడిగి చూస్తున్న వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అధికారవ్యవస్థలేవీ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే చలో తునికి పిలుపునిచ్చామన్నారు. హద్దుల్లేకుండా దమనకాండ: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాలకొండ, తుని, పిడుగురాళ్లలో వైఎస్సార్సీపీ ప్రతినిధులమీద అధికార పార్టీ దౌర్జన్యాలు, కిడ్నాపులు చేస్తూ దమనకాండకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని అన్నారు. -
Munugode Bypoll: ఆన్లైన్లో డబ్బులు పంపిణీ.. రిజర్వ్ బ్యాంక్ సాయం కోరతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘మునుగోడు నియోజకవర్గంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై నల్లగొండ జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరాం. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం’’అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురిచేసే వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకుల సహకారాన్ని కోరే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే దీనిపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వికాస్‌రాజ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కొత్త ఓటర్లపై కోర్టు తీర్పు మేరకు నిర్ణయం మునుగోడులో 24 వేలకుపైగా కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మా వాదనలు వినిపించాం. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎన్ని ఆమోదించాం? ఎన్ని తిరస్కరించాం? కారణాలేమిటన్నది కోర్టుకు వివరించాం. కోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. వేలకోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. టీఆర్ఎస్ పేరుమార్పుపై సమాచారం లేదు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చాలంటూ ఆ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. పార్టీ పేరు మార్పునకు అనుమతిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి సమాచారం కోరలేదు. పార్టీ పేరు మార్పునకు అనుమతి విషయంలో ఇంకా ఈసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఫిర్యాదుపై డీజీపీ, జిల్లా ఎస్పీల నుంచి నివేదిక కోరాం. ఇంకా అందలేదు. ఎక్కువ మంది ఉన్నా నిర్వహించగలం గతంలో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసినా విజయవంతంగా ఎన్నికలు జరిపాం. మునుగోడులో ఇప్పటివరకు 40 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను తెప్పించి సిద్ధంగా పెట్టాం. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకుగాను గురువారం నాటికి 2,40,287 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికకు పాత ఈవీఎంలనే వాడుతున్నాం. ఒక పోలింగ్ కేంద్రానికి ఒక కంట్రోల్ యూనిట్ సరిపోతుంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 2,126 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నాం. 1,500 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నాం. 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2,500 మందిని పోలింగ్ బందోబస్తు విధులకు వాడుకుంటాం. ప్రలోభాల కట్టడికి కఠిన చర్యలు మునుగోడు నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 113 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నాం. మరో 45 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, వీడియో స్క్వాడ్స్, అబ్జర్వర్ల బృందాలు పరిశీలన జరుపుతున్నాయి. ఇప్పటివరకు రూ.20 లక్షల నగదు, రూ.16.2 లక్షల విలువ చేసే మద్యం జప్తు చేశాం. రోజువారీ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాం. నియోజకవర్గంలోని 70 బెల్ట్ షాపులను మూయించాం. మద్యం సంబంధిత కేసుల్లో 60 మంది అరెస్టయ్యారు. అనుమతి లేని ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు అంటించడం వంటి ఘటనల్లో 15వేలకుపైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. -
22 స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతోనే
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈవీఎంల విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కాకినాడ కార్పొ రేషన్ ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు, నవంబర్‌లో నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 పుర పాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ రెండు విడతల్లోను బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసుల కా రణంగా రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకా కుళం, మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థల్లో ను, ఆముదాలవలస, రాజాం (శ్రీకాకుళం జిల్లా), తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి (పశ్చిమగోదావరి), వైఎస్సార్ తాడి గడప, గుడివాడ (కృష్ణా), బాపట్ల, పొన్నూరు, నర సరావుపేట (గుంటూరు), కందుకూరు, పొదిలి (ప్రకాశం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), బి.కొత్తకోట, శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈవీఎంల విధానంలోనే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వారం రోజుల కిందట తన కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఈవీఎంల విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికలు ఈవీఎంల విధానంలో నిర్వహించిన విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 8 వేల ఈవీఎంలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా నాలుగువేల బూత్‌లలోనే పోలింగ్ ఉంటుందని, ఇందుకు ఆ ఈవీఎంలు సరిపోతాయని వివరించారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలను ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లతో కలిపి ఉండే మిషన్లతో నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద వీవీప్యాట్లు లేని పాత ఈవీఎంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్‌ను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు కేసులపైనా దృష్టి ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మునిసిపల్‌శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. నెలరోజుల కిందట నీలం సాహ్ని మునిసిపల్‌శాఖ అకారులతో సమావేశమై ఆయా కేసుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. -
టీడీపీ తప్పుడు ప్రచారం.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మిస్డ్ కాల్ ఇస్తే టీడీపీ ప్రభుత్వం రాగానే పన్ను మినహాయింపులు అంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యలయ ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్రకు ఫిర్యాదు చేశారు. ప్రజలను మభ్యపెడుతూ నిబంధనల ఉల్లంఘనకి పాల్పడిన టీడీపీ జాతీయ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కోరారు. చదవండి: (కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా) -
స్వేచ్ఛగా బద్వేలు ఉప ఎన్నిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపేసినట్లు తెలిపారు. ఎన్నికకు 12 గంటల ముందుగానే నియోజకవర్గం సరిహద్దులన్నీ మూసేయాలని, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించొద్దని ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 7 నుంచి 30 వ తేదీ రాత్రి 10 గంటల వరకూ, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్2న మద్యం షాపులను మూసేయాలన్నారు. 30న నియోజకవర్గంలో అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. హుజూరాబాద్‌లో ముగిసిన ప్రచార హోరు తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. 30న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు నాలుగు నెలలపాటు ప్రచార పర్వం సాగింది. -
నీలం సాహ్ని నియామకం సరైందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకం సరైందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రాజ్యాంగానికే లోబడే గవర్నర్ ఆమెను నియమించారని పేర్కొంది. గవర్నర్ నిర్ణయాన్ని ఏ రకంగానూ తప్పుపట్టలేమని పేర్కొంది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కోవారెంటో పిటిషన్‌ను కొట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన సలహాదారుగా పనిచేశారని, అందువల్ల ఎన్నికల కమిషనర్‌గా ఆమె స్వతంత్రంగా విధులు నిర్వర్తించలేరన్నది పిటిషనర్ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేసింది. నీలం సాహ్ని స్వతంత్రంగా వ్యవహరించలేరనేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని ఆక్షేపించింది. ఆమె నియామకం విషయంలో ఏకపక్షత, దురుద్దేశాలు ఉన్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారంది. ఎన్నికల కమిషనర్‌గా ఆమెను నియమించడం వల్ల పిటిషనర్ చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కులకు ఎలాంటి విఘాతం కలగలేదని తెలిపింది. హక్కుల ఉల్లంఘన జరగనప్పుడు పిటిషనర్ ‘మాండమస్’ కోరలేరని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పునిచ్చారు. ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది మహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ నియామకం కూడా అలాగే జరిగింది.. ‘‘మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్’ ప్రకారం జడ్జిల నియామకాలు జరుగుతాయి. దీని ప్రకారం.. సీఎం ఓ న్యాయవాది పేరును జడ్జి పోస్టుకు సిఫారసు చేయొచ్చు. అలా సిఫారసు చేసిన పేరును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా జడ్జి అయిన న్యాయవాది.. న్యాయమూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించలేరని ఎవరైనా చెప్పగలరా? ఇదే తీరులో ప్రస్తుత కేసులో కూడా గవర్నర్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యే నాటికి ఆమె ప్రధాన సలహాదారు పోస్టులో లేరు. కాబట్టి ఆమె రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నారని చెప్పడానికి వీల్లేదు’ అని జస్టిస్ దేవానంద్ తన తీర్పులో పేర్కొన్నారు. -
చేతులెత్తే విధానంలో.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు.. సభ్యులు చేతులు ఎత్తే విధానంలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలకు లేఖ రాశారు. మండల, జిల్లా పరిషత్‌ల వారీగా ఆ రోజు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్లు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధానాన్ని ఎస్ఈసీ ఆ లేఖలో వివరించారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులలో సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కోఆప్టెడెడ్ సభ్యల ఎన్నిక నిర్వహించాలని ఆమె సూచించారు. అదే విధంగా.. జిల్లా పరిధిలో ఎన్నికైన జెడ్పీటీసీలలో సగం మంది హాజరైతే జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లు, ఇద్దరు కోఆప్టెడెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలన్నారు. ఈ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకే ఓటు హక్కు ఉంటుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉండదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. అయితే, ఎన్నిక జరుగుతున్న సమయంలో వారు ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఆ సమావేశాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. ఎన్నిక జరిగే సమయంలో వారికి సమావేశ మందిరంలో ముందు వరుస సీట్లు కేటాయించాలని కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. ఇక ఎంపీపీ ఎన్నిక పూర్తయితే ఆ మండలంలో ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలని.. జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తయితే ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగించాలని కూడా తెలిపింది. ‘విప్’ అధికారం జనసేనకు లేదు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసే అధికారం ఎస్ఈసీ వద్ద గుర్తింపు కలిగిన 18 రాజకీయ పార్టీలకు మాత్రమే ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంటూ వాటి పేర్లను ప్రకటించింది. ఆ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు ఉన్నాయి. అయితే, జనసేన పార్టీకి అందులో చోటు దక్కలేదు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా జనసేనకు ఆ హోదా లేకపోవడంతో విప్ జారీచేసే అధికారం ఆ పార్టీకి దక్కలేదని కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. 24న ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని మండల పరిషత్‌లలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయించాలని నీలం సాహ్ని ఆదేశించారు. అలాగే, 25వ తేదీ మధ్యాహ్నం జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించాలని ఆమె సూచించారు. -
నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: లెక్కించాల్సిన బ్యాలెట్ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్‌ల్లోనూ రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్ జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను సంప్రదించారు. అయితే, రాత్రి 12 గంటల సమయానికి ఆ రెండు ఎంపీటీసీలకు సంబంధించి అధికారులకు ఎలాంటి లిఖితపూర్వక నివేదికలు అందని కారణంగా అక్కడ ఎలాంటి అ«ధికార నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను ఒక బాక్సులో నీళ్లు చేరడంతో లెక్కింపునకు అంతరాయం కలిగింది. అప్పటికి లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్సుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలతకు 355 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, మిగిలిన బాక్సులో 600 ఓట్లున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదే కారణంతో ముద్దనూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఉమాదేవికి 6,409 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ ఆమె గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. ఇక, జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను రెండింటిలో నీళ్లు చేరడంతో కౌంటింగ్ ఆపేశారు. ఇదే కారణంతో జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం కూడా ఆగిపోయింది. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ పై విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచినా.. పోలింగ్ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. -
నేడు ‘ఏలూరు కార్పొరేషన్’ ఫలితాలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు డివిజన్లు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మరో 47 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా.. వీటికి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో 47 టేబుళ్లపై ఏకకాలంలో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 47 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, మరో 254 మంది సిబ్బందితోపాటు, అదనంగా 200 మంది ఏలూరు కార్పొరేషన్ సిబ్బంది ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారని నగర కమిషనర్ డి.చంద్రశేఖర్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు జరిగే సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం సందర్శించారు. కౌంటింగ్ హాళ్లను, టేబుళ్ల అమరికను పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆమెకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ విధించామని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. మొత్తం 175 మంది పోలీసులను నియమించామన్నారు. -
నిష్ణాతులైన వారే నియామకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుల నియామకంలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, పరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు నిర్వర్తించాల్సిన విధులను వారి నియామక జీవోల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరించారు. వారి నియామకం తాత్కాలికమైనదని తెలిపారు. ఆ నియామకాలపై ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ప్రభుత్వ అవసరాలను బట్టి వారి నియామకం ఉంటుందన్నారు. వీరి నియామకాన్ని ప్రజాధనం వృథా అనే కోణంలో చూడటానికి వీల్లేదని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. సలహాదారులను నియమించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా? వారు మీడియాతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడారని తెలిపారు. సాహ్ని నియామకం సరైనదే.. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించడం సంప్రదాయంగా వస్తోందని శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం విషయంలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి ఏ రకమైన సలహాలు ఇవ్వలేదని, సిఫారసు చేయలేదని తెలిపారు. ఒకవేళ సలహా ఇచ్చినా, సిఫారసు చేసినా దానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలనలో సమర్థత కలిగిన వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, అంతిమంగా గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే నీలం సాహ్నిని నియమించారని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆమె ఎస్ఈసీగా నియమితులయ్యారని చెప్పారు. ఆమె నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు శుక్రవారం వాదనలు వినిపిస్తూ.. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించారని, ఆమె పేరును గవర్నర్‌కు సీఎం సిఫారసు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులే నియమితులు కావాలని నిబంధనలు చెబుతున్నప్పుడు, వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్ఈసీ నియామకం, పిటిషనర్ విచారణార్హత తదితరాలపై గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నీలం సాహ్నిని నియమించడం వల్ల పిటిషనర్ వ్యక్తిగత హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సాహ్ని నియామకం వల్ల తనకు ఎలా వ్యక్తిగత నష్టం జరిగిందో, ఆమె నియామకం వల్ల ఏ రకంగా ప్రభావితం అయ్యారో ఎక్కడా చెప్పలేదని వివరిం చారు. వ్యక్తిగతంగా హక్కులు ప్రభావితం కానప్పుడు అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) అవుతుందని, పిల్‌ను ధర్మాసనమే విచారించాల్సి ఉం టుందన్నారు. అలాగే పిటిషనర్ కో–వారెంటో ఉత్తర్వులు కోరుతున్నారని, కో–వారెంటో పిటిషన్ దాఖలు చేసినప్పుడు దానిని ఎవరు విచారించాలన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) నిర్ణయిస్తారని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్‌రావు స్పందిస్తూ.. నీలం సాహ్ని నియామకం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని, అందువల్లే ఓ పౌరుడిగా సవాల్ చేశారని చెప్పారు. హెకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో–వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్జీ) చింతల సుమన్ గత విచారణ సమయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుల నియామక విధానం, వారి విధులు, బాధ్యతలు తదితరాలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. -
నీలం సాహ్ని నియామకం సరైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని నియామకం సరైనదేనని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే కింద తనకున్న విచక్షణాధికారాల మేరకు గవర్నర్ ఆమెను నియమించారని తెలిపారు. ఎస్ఈసీ నియామకానికి గవర్నర్ పెద్ద ఎత్తున కసరత్తు చేశారని వివరించారు. 25 ఏళ్ల అనుభవం ఉండి, గత మూడేళ్ల కాలంలో పదవీ విరమణ చేసిన 11 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను, వారి వార్షిక పనితీరు మదింపు నివేదికలను (ఏపీఏఆర్) తెప్పించుకుని పరిశీలించారని చెప్పారు. ఇందులో నీలం సాహ్నికి గత ఐదేళ్లుగా 10 గ్రేడింగ్ ఉందని, మిగిలిన ఏ అధికారికీ ఇంత గ్రేడింగ్ లేదన్నారు. అలాగే ఆమెపై ఎలాంటి కేసులు, ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో లేవని తెలిపారు. పిటిషనర్ వాదనల్లో అర్థం లేదు.. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించే ముందు సుప్రీంకోర్టు తీర్పును సైతం గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారని మీనా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తేనే ఆమెను ఎస్ఈసీగా నియమించాలని గవర్నర్ షరతు విధించారని, దీంతో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారన్నారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాకే ఆమెను ఎస్ఈసీగా నియమించారని వివరించారు. అందువల్ల ప్రభుత్వ సలహాదారును ఎస్ఈసీగా నియమించారంటూ పిటిషనర్ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. అధికరణ 243కే కింద గవర్నర్ కార్యనిర్వాహక నిర్ణయాధికారాన్ని ఉపయోగించి తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్షకున్న అవకాశం చాలా స్వల్పమని గుర్తు చేశారు. నిరాధార ఆరోపణలు, స్వీయ ప్రకటనల ఆధారంగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్ న్యాయప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకే.. ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మీనా కౌంటర్ దాఖలు చేశారు. కోవారెంటో పిటిషన్ మంగళవారం విచారణకు రాగా ప్రభుత్వంతోపాటు ఇతరులు దాఖలు చేసిన కౌంటర్లకు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్‌రావు గడువు కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను జూలై 8కి వాయిదా వేశారు. గవర్నర్ పరిగణనలోకి తీసుకున్న 11 మంది అధికారులతో పాటు సీఎంవో విశ్రాంత ఐఏఎస్‌లు శామ్యూల్, ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లను సూచించిందని మీనా పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని నీలం సాహ్ని వైపు గవర్నర్ మొగ్గు చూపారన్నారు. ఆమె సీఎస్‌గా పనిచేశారని, ఆ పోస్టు ప్రభుత్వాలతో సంబంధం లేని తటస్థ పోస్టు అని తెలిపారు. -
నీలం సాహ్ని నియామకంపై వేసిన పిటిషన్ ఉపసంహరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు తన పిల్‌ను ఉపసంహరించుకున్నాడు. చదవండి: పిల్ వేయడమంటే ఆషామాషీ అయిపోయింది.. -
సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది. కేసుతో సంబంధం లేని అంశాల ప్రస్తావన సింగిల్ జడ్జి తన తీర్పులో ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని, అంతర్జాతీయ ఒడంబడికలు, అవసరానికి మించి తీర్పులను ప్రస్తావించారని ఎస్ఈసీ నివేదించారు. టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి, జనసేన పిటిషన్ ఆధారంగా తీర్పు వెలువరించారన్నారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని జనసేన తన పిటిషన్లో ఎక్కడా కోరలేదని, అయినా సింగిల్ జడ్జి ఆ అంశం ఆధారంగా ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ పేర్కొన్నారు. 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని వర్ల రామయ్య కోరితే సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టివేశారన్నారు. సింగిల్ జడ్జి తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలనేకం ఉన్నాయన్నారు. సింగిల్ జడ్జి వ్యాఖ్యలు సరికాదు.. సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా తనపై వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ఓ రాజ్యాంగ సంస్థగా హైకోర్టు స్వతంత్రంగా విధులు నిర్వహిస్తున్న మాదిరిగానే ఎన్నికల కమిషనర్ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. సింగిల్ జడ్జి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరారు. ఉమ్మడిగా వర్తిస్తుంది.. స్థానిక సంస్థల కాలపరిమితి 2018–19లోనే ముగిసిందని, వాటికి సత్వరమే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్న విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు అని తన ఉత్తర్వుల్లో చెప్పిందే కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ అంటూ వేర్వేరుగా చెప్పలేదన్నారు. అందువల్ల 4 వారాల ఎన్నికల నియమావళి అమలు అన్ని ఎన్నికలకు ఉమ్మడిగా వర్తిస్తుందన్నారు. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల నియమావళి అమలు చేయలేదన్న వాదన చెల్లదన్నారు. సుప్రీం ఎన్నోసార్లు చెప్పింది.. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులిచ్చిందని, సింగిల్ జడ్జి అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ వివరించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు అయిందన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదన్నారు. -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‌గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. కాగా ఈ నెల 28న నిమ్స్‌లో ఆయన కోవిడ్ టీకా తొలిడోసు వేసుకున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగా ఈ నెల 7న ఎస్ఈసీ కార్యాలయం నుంచి పార్థసారథి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పరిషత్ ఎన్నికల రోజున సెలవు ప్రకటించాలి: ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ రోజున(ఏప్రిల్ 8) సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని కోరారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కార్యాలయాలు, వ్యాపారాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రదేశాల్లో అన్ని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. వాహనాలు వినియోగానికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్‌ల నిర్వహణకు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని.. ఒకే ప్రదేశంలో, ఒకే సమయానికి మీటింగ్‌లు నిర్వహించాల్సి వన్తే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతులిస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను అధికారుల వద్దకు చేర్చే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన ఇంక్ మార్క్ ఇంకా పోయి ఉండదు కాబట్టి పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఇంక్ రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. -
‘పరిషత్’ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమెకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కూడా ఎస్ఈసీతో వేరుగా భేటీ అయ్యారు. ఆ తరువాత ద్వివేది, గిరిజాశంకర్ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్వైజరీ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్వైజరీ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు జిల్లాల్లోని అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ద్వివేది ఆదేశించారు. -
ఏపీ: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్ఈసీ కోరారు. చదవండి: ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్ జెండా ఎత్తేసిన చంద్రబాబు -
ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ నిర్వహణపై ఎస్ఈసీ నీలంసాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ నీలంసాహ్ని సూచించారు. రాజకీయ పార్టీలతో కూడా శుక్రవారం ఉదయం ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్ఈసీ తీసుకున్నారు. చదవండి: ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. -
ఎన్నికల ప్రారంభం ప్రక్రియల్లో నీలం సాహ్ని
-
ఏపీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చదవండి: పీఆర్సీపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం: ఎన్ఐఏ సోదాలు -
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొనసాగింపుపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, అదనపు డీజీలు డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, సంజయ్, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. రేపు(శుక్రవారం) రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. -
ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్ఈసీ నీలం సాహ్ని గురువారం కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. కాగా, ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలపై చర్చించారు. సాయంత్రం ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియ మిగిలి ఉంది. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది కాకుండా ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. చదవండి: ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా? -
ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని
-
ఆగిన చోట నుంచే ఆరంభం: ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం అర్థాంతరంగా ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నీలంసాహ్ని తాను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు గురువారం ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పట్లో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి ఈ నెల 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైన చోట 9వ తేదీన రీ పోలింగ్ జరిపి, పదవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కనీసం ఐదు రోజులు పూర్తిగా ప్రచారానికి అవకాశం ఉండేలా.. ఎన్నికల కొనసాగింపు ప్రకటనకు, పోలింగ్ తేదీకి మధ్య ఆరు రోజుల సమయం కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు నీలం సాహ్ని ప్రకటించారు. 526 జెడ్పీటీసీ స్థానాలకు, 7,321 ఎంపీటీసీ స్థానాలకు.. ఏడాది క్రితం నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మినహాయించి 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,321 ఎంపీటీసీ స్థానాల్లో 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కోర్టు కేసు కారణంగా కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, 9,692 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిలో 2,371 ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,321 చోట్ల ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 652 చోట్ల ఎన్నికలు జరిపేందుకు అప్పట్లో నోటిఫికేషన్ జారీ అయింది. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 526 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ స్థానాలలో మొత్తం 2092 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. చకచకా పరిణామాలు.. గురువారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగాకలిశారు. కొద్దిసేపటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి కొత్త ఎస్ఈసీతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీఎన్నికలకు సంబంధించి మిగిలిపోయిన ఆరు రోజుల ప్రక్రియ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కరొనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించే వీలుంటుందన్న అంశాన్ని ఆయన నీలం సాహ్నితో వివరించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్, పోలీసు అధికారులతో సమావేశం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎస్ నుంచి అందిన వినతి మేరకు కొత్త ఎస్ఈసీ నీలంసాహ్ని ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్, పోలీసు అదనపు డీజీ లిద్దరూ ఎన్నికల నిర్వహణకు సన్నదద్దతను తెలియజేయడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపునకు పూర్తి సన్నద్దంగా ఉండాలంటూ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో నీలం సాహ్ని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపరు ముద్రణ, బ్యాలెట్ బాక్సు్ల, సరిపడినన్ని ఓటర్ల జాబితాలు సిద్దం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ కూడా వీడియో కాన్ఫరెన్సో్ల పాల్గొని కరోనా జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై సూచనలు తీసుకునేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 19 రాజకీయ పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. పార్టీ అభ్యర్ధులు చనిపోయిన చోట ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉండి, అభ్యర్ధులు చనిపోయిన చోట నిబంధనల ప్రకారం ఆయా పార్టీలు మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు వీలుగా ఆ స్థానాల్లో ఎన్నికలు తాత్కాలికంగా మరికొంత కాలం వాయిదా వేయాలని నిర్ణయించారు. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో ఉన్న వారు మరణించిన చోట మాత్రం ఎన్నికలను యధావిధిగా కొనసాగిస్తారు. అయితే, చనిపోయిన అభ్యర్ధి పేరు బ్యాలెట్ నుంచి ™తొలగిస్తారు. ఏకగ్రీవమైన వారితో కలిసి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 88 మంది, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 13 మరణించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం గుర్తించింది. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన 88 మందిలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు చనిపోయారని, అక్కడ మాత్రమే ఎన్నికలు యధావిధిగాకొనసాగుతాయని అదికారులు తెలిపారు. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన13 మందిలో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఉన్నారని, అక్కడ మాత్రం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఏకగ్రీవాలపైనా కలెక్టర్లకు స్సష్టత ఏడాది క్రితం నామినేషన్ ఉపసంహరణ రోజే 2371 ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికలు ఏకగ్రీవం కాగా, 126 జడ్సీ స్థానాలు ఏకగ్రీవంగానే ముగిశాయి. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో పాటు ఎన్నికల నిబంధనలు ప్రకారం అలాంటి వారికి స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలుపొందినటుŠుట ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఏడాది క్రిత్రమే ధృవీకరణ పత్రాలు అందుకున్నప్పటికీ కొత్తగా ఎన్నికైన సభ్యులతో సమానంగా పదవీ కాలం ఉంటుంది. ఈ మేరకు నీలంసాహ్ని గురువారం కలెక్టర్లు, అధికారులకు స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక వీడియో సందేశం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాను పక్షపాతం లేకుండా పనిచేస్తానని, ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తాననినీలం సాహ్ని పేర్కొన్నారు. చదవండి: ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా? -
నిమ్మగడ్డ వాస్తవాలను దాచిపెట్టారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టారని, ఇందుకు గాను అతనిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్‌కు రాసిన లేఖలు గవర్నర్ కార్యాలయం ద్వారానే లీక్ అయ్యాయని పరోక్షంగా చెబుతూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. అయితే, మార్చి 12న గవర్నర్‌కు రాసిన లేఖ కాపీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి సైతం పంపారని, ఈ విషయాన్ని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించకుండా దాచిపెట్టారని మోహన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్ఈసీ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో నిమ్మగడ్డ రమేశ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల కమిషనర్ పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అందువల్ల ఆయన రాజ్యాంగ వ్యవస్థగా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదు చేయజాలరని వివరించారు. వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేసి, గవర్నర్‌కు, ఎన్నికల కమిషనర్‌కు మధ్య రాసిన లేఖలు లీక్ అయ్యాయంటూ కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్‌తో తాను సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ బహిర్గతం అయ్యాయని, దీనిపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోంశాఖను, సీబీఐని ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం మరోసారి విచారించారు. రహస్య లేఖ ఎలా అవుతుంది.. మార్చి 12న నిమ్మగడ్డ మధురై, రామేశ్వరం వెళుతున్నట్టు గవర్నర్‌కు సమాచారం ఇచ్చారని, ఇది రహస్య లేఖ ఎలా అవుతుందని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఈ లేఖలోని కొంత భాగాన్ని మాత్రమే హైకోర్టు ముందుంచి మోసపూరితంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. ఆ లేఖను పూర్తిగా పరిశీలిస్తే ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి పంపిన విషయం అర్థమవుతోందని కోర్టుకు నివేదించారు. వారి కార్యాలయాల్లో కూడా లీక్ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. లేఖల లీక్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని, సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏం తేలుస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో నిర్దేశించిన నేరాల విషయంలో మాత్రమే సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. నిమ్మగడ్డ తన పిటిషన్లో ఎక్కడా నేరం జరిగినట్టు చెప్పలేదని, అలాంటప్పుడు సీబీఐ ఎలా దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. సీబీఐ తన పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. అధికరణ 226 కింద పిటిషనర్ కోరిన అభ్యర్థనను న్యాయస్థానం మన్నించడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై సీబీఐ నివేదిక తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా పలు కేసుల్లో హైకోర్టు తీర్పుల సందర్భంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వెలువడిన పోస్టులపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీనికి సంబంధించిన వ్యాజ్యంపై జస్టిస్ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు.. రోడ్డుపై తాగి న్యూసెన్స్ సృష్టించిన నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అదుపు చేయడంపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై పోస్టులు వెలువడిన విషయం విదితమే. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కొందరిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 12న ఉత్తర్వులిచ్చింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ తన ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టు ముందుంచింది. ఈ మొత్తం వ్యవహారంలో అంతర్జాతీయ సోషల్ మీడియా కంపెనీలు ఉండటంతో వాటినుంచి సమాచారం తెప్పించుకునేందుకు సమయం పడుతుందని, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. దర్యాప్తును పూర్తి చేసేందుకు సమయం పడుతుందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ ఎస్ఈసీగా ముగిసిన నిమ్మగడ్డ పదవీ కాలం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసింది. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన పదవీ విరమణ చేశారు. పదవీకాలం ముగియడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరారు. రేపు(గురువారం) ఉదయం 9.30 కొత్త ఎస్ఈసీగా మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం జెడ్పీ ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, జెడ్పీ ఎన్నికలకి ఇప్పటికే కోర్టు అడ్డంకులు తొలగిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవాలని ప్రకటించాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏకగ్రీవాలని మినహాయించి మిగిలిన జెడ్పిటీసీ, ఎంపీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. -
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ రమేష్
-
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ఎన్‌ఈసీగా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు(మార్చి 31) పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి, మీడియా ద్వారా అపూర్వ సహకారం అందిందన్నారు. తనకు అందించిన సహకారం ఎంతో విలువైనదని, ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం సంతృప్తి కలిగించిందన్నారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపామని, అధికారులు సిబ్బంది ఎంతో నిబద్దతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిందని, ప్రభుత్వ సాయంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి ‘సీఎస్, డీజీపీ సహా కలెక్టర్లు ఎస్పీలు పూర్తిగా సహకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. మా బాధ్యతలు నిర్వహించడంలో హైకోర్టు మాకు సంపూర్ణ సహకారంగా అందించింది. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చట్ట సభలపట్ల పూర్తి విశ్వాసం ఉండాల్సిందే. నేను 7 ఏళ్లపాటు గవర్నర్ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశాను. రాజ్యాంగ వ్యవస్థలపై నాకు అపార విశ్వాసం ఉంది. నామినేషన్ల ఉపసంహరించడంపై హైకోర్టు ఆదేశాలను శిరసావహించా. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన మంచి పద్దతి అమల్లో ఉంది. అన్నింటినీ నివేదిక రూపంలో క్రోడీకరించి వాటిని అమలు చేయాలని గవర్నర్‌కు నివేదిక అందిస్తా. చేయాల్సిన సంస్కరణలపై నివేదికలో పొందుపరిచా. సిఫార్సులు అమలు చేస్తే శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి. నాకు వారసులుగా నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఎస్ఈసీ నీలం సాహ్నికి అభినందనలు తెలియజేశాను. నేనెప్పుడూ అధికారిక సమాచారాన్ని బయటకు లీక్ చేయలేదు. వ్యవస్థకు సంబంధించి స్వతంత్రత, నిబద్దతపై ఎవరూ రాజీ పడటానికి వీల్లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుంది. అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగాను.’ అని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ రిటైనింగ్ వాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్ -
నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్
సాక్షి, అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అపాయింట్ మెంట్ దొరకలేదు. నిమ్మగడ్డ పదవీకాలం బుధవారంతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరుతూ నిమ్మగడ్డ నాలుగు రోజుల క్రితమే రాజ్‌భవన్ కార్యాలయ అధికారులకు తెలియజేశారు. అయితే నిమ్మగడ్డను కలిసేందుకు గవర్నర్ ఆసక్తి చూపలేద ని సమాచారం. మంగళవారమంతా కమిషన్ కార్యాలయంలో ఉన్న నిమ్మగడ్డ గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూశారు. కానీ పిలుపు రాకపోవడం తో రమేష్ తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. మార్చి 19న తనను అత్యవసరంగా కలవాలంటూ ఒకరోజు ముందు గానే గవర్నర్ సమాచారమిచ్చినప్పటికీ.. తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ నిమ్మగడ్డ ఆయన్ను కలవని విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసే అంశంపై చర్చించేందుకే గవర్నర్ అత్యవసరంగా 19న తనను కలవాలని ఎస్ఈసీని ఆదేశించగా, తన హయాంలో ఆ ఎన్నికలు జరిపేందుకు ఏమా త్రం ఆసక్తిగా లేని నిమ్మగడ్డ ఏవో కారణాలు చెప్పి అప్పుడు ఆయన్ని కలవలేదన్న విమర్శలున్నాయి. (చదవండి: ఎన్నికలకు టైం లేదు!) -
ఏపీ: ఎస్ఈసీ పదవికి ముగ్గురి పేర్లు ప్రతిపాదన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న నీలంసాహ్ని, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు ఎం.శామ్యూల్, ఇంకో రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుతం రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్‌కు నివేదించింది. ఈ ముగ్గరిలో గవర్నర్ ఎవరి పేరును ఆమోదిస్తే.. వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ఈ నియామకం జరిగితే వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయించి కోవిడ్ వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
ఎన్నికలకు టైం లేదు!
సాక్షి, అమరావతి: తన హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరిపే పరిస్థితి లేదని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దీనికి కారణమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న తనకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తగినంత సమయం లేదన్నారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. తిరిగి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే కొత్త తేదీలను ఖరారు చేయాలని, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించిందని నిమ్మగడ్డ అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయడం ద్వారా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను నిర్వహించానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ బాధ్యత తదుపరి ఎస్ఈసీదే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉండటం, పోలింగ్ సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం, మరోవైపు తన పదవీ కాలం ఈ నెలాఖరు (మార్చి 31వ తేదీ)తో ముగుస్తున్న కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించలేకపోతున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. తన తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేవారు ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిన్న అలా.. నేడు ఇలా దాదాపు నెలన్నర క్రితం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకైనా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా నిమ్మగడ్డ నిరాకరించారు. ఎన్ని అవాంతరాలు తలెత్తినా తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అలా మొండిగా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేకపోవడానికి అదే వ్యాక్సినేషన్‌ను సాకుగా చూపుతుండటం పట్ల అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
పోలింగ్‌కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరిగ్గా వంద మంది పోలింగ్ జరగడానికి ముందే చనిపోయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖల పరిశీలనలో వెల్లడైంది. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సైతం కొందరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యాక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేసిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. అప్పట్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై అధికారులు వాకబు చేసినట్టు తెలిసింది. 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 87 మంది, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 మంది చనిపోయారని నిర్ధారించారు. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 9,692 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,321 స్థానాల్లో పోటీ జరుగుతుండగా, 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 2371 మందిలో చిత్తూరులో ఐదుగురు.. విజయనగరం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున 8 మంది చనిపోయారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న 19 వేల మందిలో 79 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారే కావడం గమనార్హం. ఐదుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు. ఏకగ్రీవంగా నెగ్గిన జెడ్పీటీసీ సభ్యుడొకరు.. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను అప్పట్లో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన 652 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒకరు మృతి చెందారు. ఏకగ్రీవంగా ముగిసినవి పోను 526 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 2,092 మంది పోటీలో ఉన్నారు. వీరిలో చనిపోయిన 12 మందిలో (ఏకగ్రీవమై చనిపోయిన వ్యక్తి కాకుండా) 11 మంది వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారు. ఆ స్థానాల్లో మళ్లీ నామినేషన్‌కు వీలు! అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సంప్రదాయం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట మాత్రం ఈ అవకాశం ఉండని చెబుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. -
గవర్నర్‌కు నేను రాసిన లేఖలు లీకయ్యాయి..
సాక్షి, అమరావతి: తాను గవర్నర్‌తో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ లీక్ అయ్యాయని, దీనిపై ఫిర్యాదు చేసినా ఆయన ముఖ్య కార్యదర్శి విచారణ జరపడంలో విఫలమయ్యారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోం శాఖను, సీబీఐని ఆదేశించాలని కోరారు. లీకేజీపై 72 గంటల్లో మధ్యంతర నివేదికను సమర్పించేలా సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, మంత్రులు.. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గుంటూరు వాసి మెట్టు రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ముందు విచారణకు వచ్చింది. నిమ్మగడ్డ తనకు బాగా తెలిసిన వ్యక్తి అని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించనని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావుకు జస్టిస్ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో దీన్ని మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. రహస్య లేఖల ద్వారా గవర్నర్‌ను సంప్రదించాను: నిమ్మగడ్డ ‘ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో నేను రహస్య లేఖల ద్వారా గవర్నర్‌ను సంప్రదించాను. రెండు రాజ్యాంగ కార్యనిర్వాహకుల మధ్య సాగిన ఈ లేఖలను ప్రజానీకానికి, మీడియాకు బహిర్గతం చేయడానికి వీల్లేదు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాలతో వీటిని ప్రజాబాహుళ్యంలోకి తెచ్చారు. ఈ నెల 18న అసెంబ్లీ కార్యదర్శి నుంచి నాకు ఓ లేఖ అందింది. నేను రాసిన లేఖల ఆధారంగా మంత్రులు.. బొత్స, పెద్దిరెడ్డిలు నాపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను దూషించారు. ఏపీ పోలీసులకు లేఖల లీకేజీ దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తే వాటిని నేనే లీక్ చేశానని ఇరికిస్తారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సి వచ్చింది’ అని నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
మీ అధికారాలకు పరిమితులు లేవా?
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను శనివారం గట్టిగా నిలదీసింది. ఒక 2 నెలల తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామంటే ఎలా? అని ఆయనను ప్రశ్నించింది. కోర్టులు అధికార రహితమని భావిస్తున్నారా? అని నిలదీసింది. ఎన్నికల కమిషనర్ తనకున్న విచక్షణాధికారాలను ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలని స్పష్టం చేసింది. వాటికి పరిమితులు లేవని అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఆ విచక్షణాధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ప్రకటించారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదని గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మరోసారి న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ముందుకు విచారణకొచ్చింది. నిమ్మగడ్డ కోర్టుకు బాధ్యత వహించాల్సిందే.. ముందుగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్ ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానం ప్రశ్నించజాలదని, పరీక్షించజాలదని తెలిపారు. పరీక్షించడమంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో అయితే పరిషత్ ఎన్నికలు నిలిచిపోయాయో అక్కడి నుంచే నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందన్నారు. గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికలు పూర్తి కాగానే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారని వివరించారు. ఆయన కోర్టుకు బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. మరో 11 రోజులు మాత్రమే నిమ్మగడ్డ పదవిలో ఉంటారని, పరిషత్ ఎన్నికల పూర్తికి 6 రోజులు సరిపోతాయని, ఇప్పుడు ఆయన సెలవుపై వెళుతూ తనను ఏ రకంగానూ ప్రశ్నించకూడదనడం ఆయన తీరుకు నిదర్శనమన్నారు. ఎన్నికలు నిర్వహించేలా కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. న్యాయ సమీక్షకు ఎన్నికల కమిషనర్ అతీతుడేమీ కాదు.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మరో రాజ్యాంగ వ్యవస్థ పట్ల బాధ్యతారాహిత్యంతో, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ ఓ రాజకీయ పార్టీ కార్యాలయంలో తయారైందని, దీనిపై విచారణ కూడా జరుగుతోందన్నారు. కోర్టు ప్రశ్నించడం తన స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని ఆయన చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ న్యాయ సమీక్షకు అతీతుడు కారని తెలిపారు. అతీతుడిని అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అందరి వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఈ ఏడాది ఫిబ్రవరి 18న జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మొదటిదశ నుంచి విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల ప్రకారం గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికను ప్రకటించి తీరాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికపై వారి ప్రత్యర్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే, వారు సంబంధిత ఎన్నికల ట్రిబ్యునల్‌లో ఆ ఎన్నికను సవాలు చేసుకోవచ్చునంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు, ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఈ మధ్యలో ఎన్నికలకు సంబంధించి వచ్చే ఏ ఫిర్యాదుపైన కూడా విచారణ జరిపే అధికారం ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల్లోని రూల్ 99 ప్రకారం ఎన్నికల కమిషన్‌కు లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఎన్నికను రద్దు చేసే అధికారం కూడా ఎన్నికలకు కమిషన్‌కు లేదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాలు విచారణ చేయదగ్గవే అయినా కూడా, అందులో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదంది. ఓసారి ఎన్నిక ముగిసిన తరువాత ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ట్రిబ్యునల్ మాత్రమే విచారణ జరపాలని చట్టం చెబుతోందని గుర్తుచేసింది. మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాల విషయంలో స్పష్టమైన, నిర్దిష్ట ఆధారాలు ఉండాలంది. ఇలాంటివాటిని న్యాయపరంగా సుశిక్షితులైన న్యాయాధికారి మాత్రమే విచారణ జరపగలరని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఎన్నికల కమిషనర్ గత నెల 18న జారీచేసిన ఉత్తర్వులతో పాటు బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుత్తూ ఫారం–10 అందుకున్న పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు గత వారం వాయిదా వేసిన తీర్పును మంగళవారం వెలువరించారు. సమాచారం సేకరించవచ్చు ఎన్నికల ప్రక్రియలో లోపాలను సవరించేందుకు ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవచ్చని, సమాచార సేకరణకు మాత్రమే కమిషన్ విచారణను పరిమితం చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై, సిబ్బంది చర్యలు తీసుకునేందుకు సైతం సమాచారం సేకరించవచ్చన్నారు. సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వీయ అవసరాల నిమిత్తం లేదా చట్ట సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనసభకు, పార్లమెంట్‌కు పంపొచ్చని పేర్కొన్నారు. తీర్పు వెలువరించిన తరువాత అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని కోరారు. అలా చేయడం ద్వారా సమస్యలు వస్తాయన్న న్యాయమూర్తి.. అది ఈ వ్యాజ్యాలతో సంబంధం లేని స్వతంత్ర అంశమని చెప్పారు. జనసేన పిటిషన్‌పై విచారణ 23కి వాయిదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు విచారణను వాయిదా వేశారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిమ్మగడ్డ 'వెనకడుగు'
సాక్షి, అమరావతి: ఎన్ని అవాంతరాలు ఎదురైనా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టు బట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజా పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారని రాజకీయ పార్టీలు, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు, అవకాశాలు ఉన్నా.. కావాలనే దాట వేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిషన్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించిన అదనపు సిబ్బందిని నిమ్మగడ్డ వారి మాతృశాఖలకు తిరిగి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీరు చూస్తుంటే ‘పరిషత్’ ఎన్ని కలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదనే విషయం స్పష్ట మవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చిన నలుగురు ఏఎస్వో స్థాయి అధికారులను మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే మాతృశాఖలకు తిరిగి వెనక్కి వెళ్లేందుకు నిమ్మగడ్డ అనుమతి ఇచ్చారు. సోమవారం మరో నలుగుర్ని వారి పాత విధులకు పంపేందుకు నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా అందుకు ఆయన సుముఖంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. న్యాయపరమైన చిక్కులు లేకున్నా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలు ఏమీలేవు. ఒక ట్రెండు పార్టీలు మాత్రమే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, ఎన్నికల ప్రక్రియను మొదటినుంచీ చేపట్టాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాయి. ఆగిపోయిన ఎన్నికలను రద్దుచేయాలనిగానీ, తాత్కాలికంగా నిలిపివేయాలని గానీ కోర్టు తీర్పులు కూడా ఏమీ లేవు. ‘పరిషత్’ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గతంలోనే ముగిసిన దృష్ట్యా ఆ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు వారం రోజులకు మించి అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. టీడీపీకి నష్టమని భావించి.. ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ నిమ్మగడ్డ వాటి జోలికి వెళ్లకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా వెలువడ్డాయి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించుకున్న నిమ్మగడ్డ ప్రభుత్వం వారిస్తున్నా ఎన్నికల నిర్వహణకు సిద్ధçమయ్యారని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కనీసం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఎన్నికలు జరపాల్సిందేనని పట్టుబట్టి ఆ ఎన్నికలకు నిమ్మగడ్డ పూనుకున్నారు. చివరకు ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించకపోగా.. తీవ్ర నష్టం చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే కనీసం తాను కమిషనర్‌గా ఉన్నంత వరకైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని నిమ్మగడ్డ నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
పంచాయతీ రీ కౌంటింగ్‌పై ఈసీ మరో కీలక ఉత్తర్వు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపులో ఎక్కడెక్కడ రీ కౌంటింగ్ జరిగింది? ఎందుకు నిర్వహించారు? తదితర అంశాలపై తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికలు జరిగిన ప్రతి చోట కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి వివరాలతో పంచాయతీలవారీగా నివేదికలు అందజేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 5లోగా నివేదిక ఇవ్వాలి ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు మొదలైంది..? లెక్కింపు సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందా? కరెంటు సరఫరా ఎందుకు నిలిచిపోయింది? కౌంటింగ్ పూర్తయ్యాక ఓడిపోయిన అభ్యర్ధి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్నారా? తదితర వివరాలు పంచాయతీల వారీగా స్పష్టంగా ఉండాలని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్‌ను నిమ్మగడ్డ తాజాగా పంచాయతీరాజ్ శాఖకు పంపారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన నివేదికలను ఈనెల 5లోగా పంపాలని పేర్కొన్నారు. ఎలా సాధ్యం? పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పంపే నివేదికలపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వేర్వేరుగా తమ అభిప్రాయాలను జోడించి ఎన్నికల కమిషన్‌కు పంపాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కాకుండా 10,890 పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగిందని, భారీగా ఉన్న పంచాయతీలపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏ ప్రాతిపదికన విడివిడిగా అభిప్రాయాలు వెల్లడించాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా మూడు రోజుల వ్యవధిలోనే ఒక్కో పంచాయతీలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీడీవోకు, అక్కడ నుంచి డీపీవో, జిల్లా కలెక్టర్లకు నివేదికలు అందడం, పరిశీలన జరిపి అభిప్రాయాలు తెలియచేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు అధికారుల్లో ఉత్పన్నమవుతున్నాయి. వివాదాలన్నీ ట్రిబ్యునల్‌లోనే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పది రోజుల క్రితమే ముగిసింది. గెలిచిన సర్పంచి అభ్యర్ధులు, వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి వివాదాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్‌లోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ముగిసిన ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని పేర్కొంటున్నారు. ఇదంతా గందరగోళానికి గురి చేసేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వలంటీర్ల ఫోన్ల స్వాధీనం సరికాదు
సాక్షి, అమరావతి: వార్డు వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీచేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, పద్మజారెడ్డిలు హాజరుకాగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఎం నుంచి వైవీ రావు, సీపీఐ తరఫున జల్లి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలితో పాటు బీజేపీ, జనసేన తదితర పార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలవల్ల వార్డు వలంటీర్లు వారి రోజు వారీ విధులు నిర్వర్తించే పరిస్థితి ఉండదని, నిబంధనల పేరుతో వారికి ఆటంకాలు కలిగే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధులు, వికలాంగులకు రవాణా సౌకర్యం వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగమే వారికి ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటుచేస్తుందని సమావేశంలో కమిషనర్ వివరించారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పలుచోట్ల బదిలీలు జరుగుతున్నాయని పలువురు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకురాగా.. ‘దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న వారి బదిలీలకు తానే సీఎస్‌కు సిఫార్సు చేశానని, అందుకనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయ’ంటూ కమిషనర్ బదులిచ్చారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: వర్ల పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సమావేశంలో వర్ల రామయ్య ప్రస్తావించడంతో నిమ్మగడ్డ ఆయన్ను వారించి మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడాలని సూచించారు. అయినా, అదే అంశాన్ని పెద్ద గొంతుతో పదేపదే ప్రస్తావిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశానంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ, మేం మొన్నమొన్నటి వరకు చూసిన నిమ్మగడ్డలా ఆయన కనిపించడంలేదని.. ఆయనపై మాకు అనుమానాలున్నాయని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
విశేషాధికారాల ముసుగులో.. టీడీపీ సేవ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ప్రక్రియ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజాగా మరో ఉత్తర్వు జారీచేశారు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ కొందరు టీడీపీ నేతలకు మాత్రం ఇప్పుడు నామినేషన్ వేసుకునేందుకు తన విశేషాధికారాలతో అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక మళ్లీ వాటిని వేసేందుకు వీల్లేదని ఎన్నికల చట్టాలు స్పష్టంగా చెబుతున్నా నిమ్మగడ్డ వాటన్నింటినీ తోసిరాజని.. ఫిర్యాదులు, వినతులు వచ్చాయంటూ ఓ పార్టీకి లబ్ధిచేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలను దెబ్బతీసేందుకే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు.. నామినేషన్లపై తామెంలాంటి ఫిర్యాదు చేయలేదని, వినతులు కూడా పంపలేదంటూ ఇద్దరు నేతలు స్పందించినట్లు తెలిసింది. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని, ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తిలేదని వారు ఎన్నికల అధికారులకు స్పష్టంచేసినట్లు సమాచారం. వివరాలివీ.. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులలో టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు ప్రత్యేకంగా నామినేషన్ల దాఖలుకు వీలుకల్పిస్తూ నిమ్మగడ్డ సోమవారం ఆదేశాలు జారీచేశారు. నిజానికి ఈ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ 2020 మార్చి 13నే ముగిసింది. ఆ మరసటి రోజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యాక కరోనా సాకుతో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశారు. అప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి కొనసాగిస్తున్నట్లు గత నెలలో ఎస్ఈసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల దాఖలు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశంలేదు. కానీ, నిమ్మగడ్డ మాత్రం.. పలువురు టీడీపీ నేతలకు అవకాశం కల్పిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలను అడ్డుకునేందుకేనా!? నిజానికి తిరుపతి నగరపాలక సంస్థలోని ఆరు డివిజన్లలో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అవీ వైఎస్సార్సీపీ అభ్యర్థులవే. అంటే ఇక్కడ వీరి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే. అయితే, ఇప్పుడు ఆ ఆరు డివిజన్లలో నామినేషన్లకు మళ్లీ అవకాశం కల్పించడమంటే వైఎస్సార్సీపీకి అయ్యే ఏకగ్రీవాలకు గండికొట్టి టీడీపీకి లబ్ధిచేకూర్చడమేనన్నది స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు, రాయచోటిలోనూ ఇదే లక్ష్యం కనపిస్తోందంటున్నారు. అవి ఫోర్జరీలేమో.. ఇదిలా ఉంటే.. పుంగనూరులోని 14, 28 వార్డుల్లో కొత్తగా నామినేషన్ దాఖలకు అవకాశం దక్కిన వారిలో ఇద్దరు నాయకులు ఎస్ఈసీ నిర్ణయంపై విస్మయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తాము అసలు కొత్తగా నామినేషన్ వేసేందుకు జిల్లా కలెక్టరుకుగానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కుగానీ ఎలాంటి వినతులు పంపలేదని.. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని వారు ఎన్నికల అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తి కూడా లేదని వారు స్పష్టంచేసినట్లు తెలిసింది. అప్పుడు అడ్డుకున్నారంటూ.. తిరుపతి నగరపాలక సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్లలో ఐదుగురు టీడీపీ, ఒక బీజేపీ నేత పేర్లను ప్రత్యేకంగా తెలియజేస్తూ మంగళవారం సా.3 గంటల వరకు వారి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే, పుంగనూరు మున్సిపాలిటీలోని 9, 14, 28 వార్డులు.. వైఎస్సార్ జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని 20, 31 వార్డుల్లో ఐదుగురు టీడీపీ నేతల పేర్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. గతంలో వీరు నామినేషన్లు వేయడానికి సిద్ధపడగా, ప్రత్యర్థులు వీరిని అడ్డుకున్నట్లుగా తాను నిర్ధారణకు వచ్చానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో కూడా 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ముగ్గురితో వారి ప్రత్యర్థులు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని.. వారికీ ఇప్పుడు మళ్లీ నామినేషన్ దాఖలకు అవకాశం కల్పిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు. -
పోస్ట్‌మేన్‌లా ఎన్నికల కమిషనర్: అచ్చెన్నాయుడు
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టుమేన్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడంపై కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తిరుపతితోపాటు ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను భయపెట్టి, అక్రమ కేసులు మోపుతున్నారని ఆరోపించారు. -
నామినేషనే వేయని వారికి ఇప్పుడు అవకాశం కుదరదు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో గతంలో అసలు నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులకు ఇప్పుడు అవకాశమివ్వడానికి, స్కూృటినీలో తిరస్కరణకు గురైన వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలకు లోబడి కొన్ని పరిమితుల మేరకు బలవంతపు చర్యల ద్వారా నామినేషన్లు విరమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమ లేదా మంగళవారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ విజయవాడలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నేతలతోనూ వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మున్సిపల్ ఎన్నికల్లో బలవంతం మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి ఫిర్యాదులపై కొన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాయి. మరికొన్ని చోట్ల నుంచి కూడా తెప్పించుకుంటాం. పాక్షికంగా పునరుద్ధరించడం రాష్ట్రస్థాయిలో జరుగుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యల వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం ఐదుగురు మించి చేయడానికి వీలులేదన్నారు. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యగా పరిగణిస్తామన్నారు. పరిమితంగా రోడ్డు షోలకు అనుమతిస్తామన్నారు. సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. -
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో శనివారం రాత్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు చక్కగా జరిగాయన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరుకు ఓటింగ్ స్లిప్ చేరాలని చెప్పారు. ఈ ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచడంతో పాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఓటరుకు తమ ఓటు, పోలింగ్‌స్టేషన్ వివరాలు అందించాలని ఆదేశించారు. పార్టీ ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి ఇస్తున్నామన్నారు. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఒత్తిడికి, ప్రలోభాలకు లోనై నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభ్యర్థిస్తే సానుకూలంగా స్పందిస్తామన్నారు. మార్చి 1న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. స్థానికంలోనూ ఈసీ నిబంధనలే.. సాక్షి, అమరావతి: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధనలను.. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కలెక్టర్లు, ఎన్నికల నిర్వహణాధికారులు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. -
మీ సదుద్దేశాలపై అనుమానం కలుగుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సదుద్దేశాలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మాట చెప్పేందుకు ఈ న్యాయస్థానం ఎంతమాత్రం సంశయించడంలేదని తెలిపింది. ఎన్నికల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుంటే, వెంటనే ఎందుకు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఆ తరువాత కూడా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి, అది విచారణకు రాకున్నా కూడా పట్టించుకోలేదని.. 42 రోజులపాటు ఆ పిటిషన్‌ను అలా వదిలేశారంటే ఎన్నికల కమిషనర్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని వ్యాఖ్యానించింది. ఇక్కడే ఎన్నికల కమిషనర్ తీరుపై ఈ న్యాయస్థానానికి సందేహాలు కలుగుతున్నాయంది. కేసు పూర్వాపరాలివీ.. ఎన్నికల కమిషన్‌కు రూ.40 లక్షలు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ మొత్తాలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు, ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. కమిషన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని అమలుచేయలేదంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దేవానంద్ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలను అధికారులు అమలుచేయలేదన్నారు. కొత్త ఓటర్ల జాబితా తయారుచేయలేదని తెలిపారు. దీంతో 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. గత ఏడాది నవంబర్ 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలకే ఈ కోర్టు పరిమితం అవుతుందని తెలిపారు. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారా? లేదా? అన్నదే చూస్తామన్నారు. ఒకవేళ తాజా సమస్యలపై ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుంటే, వాటిపై మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవాలని, వాటిని ఈ వ్యాజ్యంలో కలపవద్దని స్పష్టంచేశారు. అనంతరం.. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేశామన్నారు. నిజమైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను అమలుచేయలేదన్న న్యాయమూర్తి, దీనిపై స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలను ఆదేశించారు. ముందు కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని సుమన్ అభ్యర్థించడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను మార్చి 22కి వాయిదా వేశారు. -
బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదుల్ని స్వీకరించండి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలలో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరైనా తమ నామినేషన్‌ను బలవంతంగా విత్‌డ్రా చేయించినట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే స్వీకరించాలని మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అలా అందిన ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని, వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వచ్చే 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలోనే ఎస్ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే.. గత ఏడాది మార్చిలో జరిగిన నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నామినేషన్ వేయకుండా అడ్డగింతలకు సంబంధించిన బాధితులు ఉంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారనడానికి ఆధారాలతో సంబధిత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం/ఆ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయడం లేదా ఆ ఘటనకు సంబంధించి ప్రముఖ పత్రికలు, టీవీ చానళ్లలో ప్రసారమైన కథనాలను సా«క్ష్యాలుగా కలెక్టర్ల ముందు ఉంచాలని పేర్కొన్నారు. అలాంటి సమాచారం ఉంటే కలెక్టర్ల నుంచి తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని నిమ్మగడ్డ పేర్కొన్నారు. -
మంత్రి కొడాలి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మంత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, కమిషనర్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ సోమవారం హైకోర్టు ముందుంచింది. వీటిని కోర్టు హాలులోనే వీక్షించిన హైకోర్టు ఇరుపక్షాల నుంచి మరింత స్పష్టతను ఆశిస్తూ విచారణను వాయిదా వేసింది. మీడియాతో మాట్లాడకుండా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారం రోజుల్లో మూడు వ్యాజ్యాలు వచ్చాయని, భావ ప్రకటన స్వేచ్ఛ, పరిమితులపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా నియమిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ పార్క్ హయత్‌లో కొందరు రాజకీయ నాయకులను నిమ్మగడ్డ కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. జోగి రమేశ్ వ్యాజ్యం పరిష్కారం.. మీడియాతో మాట్లాడేందుకు, పార్టీ విధానాలు, విజయాలు, కార్యక్రమాల గురించి తెలియజేసేందుకు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు అనుమతినిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 21 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఆ ఉత్తర్వులను జోగి రమేశ్ ఉల్లంఘించలేదని తెలుపుతూ జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటింటికీ రేషన్.. తొలగిన అడ్డంకి
ఇంటింటికీ రేషన్ పథకం వెనుక పెద్ద సదుద్దేశం ఉంది. ఈ పథకం కొత్తది కాదు. దీన్ని ప్రభుత్వం ఇప్పటికే పట్టణాల్లో అమలు చేస్తోంది. ఈ పథకం కోసం ఆపరేటర్లు బ్యాంకుల రుణాలు పొంది వాహనాలు కొన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టు వాహనాలకు మళ్లీ తటస్థ రంగులు వేయాలంటే భారీ ఖర్చు అవుతుంది. వాహనాలపై సీఎం ఫొటోలు ఉండటంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెబుతోంది. సీఎం ఫొటో ఉండరాదన్న నిషేధం ఏదీ లేదు. ఆ వాహనాలపై రంగులను ఓ రాజకీయ పార్టీకి ఆపాదించడం సరికాదు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు సరికాదు. – హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ పథకం అమలుకు బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మార్చి 15వ తేదీ వరకు నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు సంచార వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకోవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ‘ఇంటింటికీ రేషన్’ పథకానికి బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు. సీఎం ఫొటో వాడటంపై నిషేధం లేదు ‘ఇంటింటికీ రేషన్ పథకం వెనుక పేదలకు, అవసరం ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాలు అందచేయాలన్న భారీ సదుద్దేశం, ప్రయోజనం దాగి ఉంది. ప్రజల సంక్షేమం, ఆరోగ్యమే సుప్రీం లా. అదే ఈ మధ్యంతర ఉత్తర్వుల జారీకి కారణం. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. 3.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను అందించేందుకు వేల వాహనాలను ఆపరేటర్లు కొనుగోలు చేశారు. దీని కోసం వారు డబ్బు పెట్టుబడిగా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారు. వాహనాలకు రీ పెయింటింగ్ నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే సమయానికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సంచార వాహనాలకు తటస్థ రంగులు వేసేంత వరకు ఈ పథకం అమలును నిలిపేయడం సరికాదన్నది ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ న్యాయస్థానం ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతోంది’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాహనాలపై రంగులు, ఫొటోల విషయమై దాఖలైన ఓ కేసులో విచారణ జరిపిన సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ ప్రకటనల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దల ఫొటోలను ఉపయోగించడంపై సుప్రీం కోర్టు ఎలాంటి నిషేధం విధించలేదని, ముఖ్యమంత్రి ఫొటో కూడా ఉండొచ్చని తెలిపిందన్నారు. వాహనాలపై ఉపయోగించినవన్నీ సాధారణ రంగులేనని, అధికార పార్టీ రంగులను పోలి ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్ అంతిమ నిర్ణయానికి రావడం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పల్లెల్లో కదిలిన వాహనాలు ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పల్లెల్లోనూ ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా మొబైల్ వాహనాలు సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. ఇంటింటా సరుకులు పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 22 లక్షల కార్డుదారులకు ఇంటివద్దే సరుకులు పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్–అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి పలకడం.. తూకంలో అక్రమాలు, మోసాలకు తావు లేకుండా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులను పేదల గడప వద్దే అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 9,260 మొబైల్ వాహనాలను కొనుగోలు చేసిన విషయం విదితమే. వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెలలో ప్రారంభించగా.. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.45 కోట్లకు పైగా కార్డుదారులకు ఇంటింటింకీ వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఈ వాహనాను ఆపాలంటూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులివ్వడంతో గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ కార్యక్రమం నిలిచిపోయింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో రేషన్ పంపిణీకి మార్గం సుగమమైంది. -
మున్సిపల్ నగారా.. ఆగిన చోట నుంచే
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. గత ఏడాది మార్చిలో.. మధ్యలో ఆగిపోయిన చోట నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే మార్చి 10వ తేదీన పోలింగ్ నిర్వహించి, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ఎన్నికలు అర్ధంతరంగా ఆగిపోయిన 12 నగర పాలక సంస్థలకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలో ఉండగా ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఇక్కడ ఎన్నికలకు బ్రేక్ గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలువడే నాటికి.. కోర్టు వివాదాలు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా అప్పుడే విలీనం కావడం తదితర కారణాలతో 16 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు. పామిడి నగర పంచాయతీని డౌన్‌గ్రేడ్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడిన 12 చోట్ల వార్డుల విభజన, ఓటర్ల జాబితాలు తయారీ వంటి ప్రక్రియ చేపట్టనందున వాటిలోనూ ఎన్నికలు పక్కనపెట్టారు. ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు రాజాం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గుడివాడ, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, ఆమదాలవలస, రాజంపేట, పామిడి, భీమవరం, జగ్గయ్యపేట, ఆకివీడు, దర్శి, గురజాల, దాచేపల్లి, కొండపల్లి, పెనుకొండ, కమలాపురం, బేతంచర్ల, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం. ఎన్నికలు జరిగేవి... శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, పాలకొండ విజయనగరం: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెలిమర్ల విశాఖపట్నం: నర్సీపట్నం, యలమంచిలితూర్పుగోదావరి: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మడివరం పశ్చిమ గోదావరి: నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం కృష్ణా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు. గుంటూరు: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల ప్రకాశం: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నెల్లూరు: వెంకటగిరి, అత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట అనంతపురం: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర కర్నూలు: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, గూడూరు, ఆళ్లగడ్డ, అత్మకూరు వైఎస్సార్: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల చిత్తూరు: మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు ఎన్నికలు జరగని కార్పొరేషన్లు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2017లోనే ఎన్నికలు నిర్వహించారు. ఇక కోర్టు వివాదాల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లలో ఎన్నికలు నిలిపివేశారు. ఎన్నికలు జరిగేవి విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు. -
రెండో విడత స్థానిక ఎన్నికలూ ప్రశాంతం
సాక్షి, అమరావతి: చెదురుమదురు ఘటనలు మినహా రెండో విడత ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలోనే జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు దాదాపు సగం పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయినట్టు తెలిపారు. సాధారణ ఎన్నికల స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట గట్టి నిఘా ఉంటుందని తెలిపారు. మూడో విడతలోనూ అవాంతరాల్లేకుండా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. -
వివరాలు లేకుండా పిల్ ఎలా వేస్తారు?
సాక్షి, అమరావతి: కనీస వివరాల్లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై హైకోర్టు సోమవారం పిటిషనర్‌ను నిలదీసింది. ప్రాథమిక సమాచారం లేకుండా పిల్ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి పిల్లతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని న్యాయస్థానం హెచ్చరించింది. అనంతరం.. వివరాలు సమర్పించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌కు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని, ఆ వివరాలు రావాల్సి ఉందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమిషనర్ ప్రొసీడింగ్స్‌పై.. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగంలోని అధికరణ 243(కే) కింద ఉన్న అధికారాలను సవరిస్తూ పార్లమెంట్లో పెట్టిన బిల్లు, తదనంతర పరిణామాలను తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ వివరాలు తెలియకుండా ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం సాధ్యం కాదని పేర్కొంది. సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎస్ఈసీ గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ న్యాయవాది ఆర్.మహంతి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నవంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వులను ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు సవాల్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపింది. 243కేను సవరించారా? బిల్లు తరువాత పరిణామాలు తెలియకుండా వ్యాజ్యాన్ని ఎలా విచారించగలమని ప్రశ్నించింది. బిల్లు, తరువాతి పరిణామాలన్నింటినీ తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. -
ఆ ఏకగ్రీవాలు సక్రమమే
సాక్షి, అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై 4 రోజుల కిందట అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్.. సోమవారం ఆ ఏకగ్రీవాలన్నీ సక్రమమేనని తేల్చారు. వీటిని అధికారికంగా ప్రకటించవచ్చని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. కలెక్టర్ల నివేదికలతో పాటు ఆయా జిల్లాల అబ్జర్వర్ల నుంచి తీసుకున్న సమాచారం మేరకు.. 2 జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. -
నిర్బంధ ఉత్తర్వులు ఏకపక్షం
సాక్షి, అమరావతి: తనను ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆదివారం ఉదయం విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్పీకర్‌కు రాసిన లేఖకు ఇది ప్రతి చర్య ► స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 28న రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసిన నిమ్మగడ్డ అందులో నాపై పలు తప్పుడు ఆరోపణలు చేశారు. ► ఈ నేపథ్యంలో గత నెల 30న నేను అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసి, సభా హక్కుల ఉల్లంఘన కింద నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని కోరాను. ఇది నిమ్మగడ్డ రమేష్‌కు ఎంత మాత్రం నచ్చలేదు. ► దీంతో తిరుపతిలో ఈ నెల 5న నేను మాట్లాడిన మాటలను నిమ్మగడ్డ వక్రీకరించారు. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఎలాంటి వివరణ కోరలేదు. ఇలా చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ► ప్రొటోకాల్ ప్రకారం ఈ నెల 7న తిరుపతిలో నేను రాష్ట్రపతిని ఆహ్వానించాల్సి ఉంది. అయితే నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల నేను స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ దృష్ట్యా ఎస్ఈసీ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. -
మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బంధం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పారు. ఈ ఆదేశాల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ► శుక్రవారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపై రాజకీయ పార్టీలు, సాధారణ పౌరుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. మంత్రి మాటలు ఓటర్ల మనసులో భయాందోళనలు సృష్టించాయి. ► మంత్రి వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వతంత్రతను బెదిరించడం కిందకు వస్తుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. ► అత్యున్నత పదవిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి ఉద్దేశ పూర్వకంగానే చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఉంది. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. ► జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు స్వేచ్ఛాయుతంగా, న్యాయపరంగా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నా. ► వైద్య సహాయం తీసుకోవడానికి, ఇతర సహేతుక కారణాల తెలిపిన సందర్భాలలో ఈ ఆంక్షలు వర్తించవు. అలాంటి సందర్భాల్లోనూ మంత్రిని మీడియాకు, అతని మద్దతు దారులకు, అనుచరులకు దూరంగా ఉంచాలి. మంత్రిగా అధికార పత్రాలను పరిశీలించవచ్చు. ఈ ఆదేశాలు కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే. పరివర్తన, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆదేశాలపై భవిష్యత్‌లో పునరాలోచన చేసేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉంటుంది. రిటర్నింగ్ అధికారులకు రక్షణ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు అభద్రతా భావనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని పేర్కొన్నారు. వీరిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నా ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి విధిగా తీసుకోవాలన్నారు. బెదిరింపు ప్రకటనలను ఎంతటి పెద్దవారు ఇచ్చినా లెక్క పెట్టవలసిన అవసరం లేదన్నారు. -
ఏకగ్రీవాలైన చోట అధికారుల్ని మార్చడమేంటి!
కర్నూలు (రాజ్‌విహార్): ఏకగ్రీవాలు జరిగిన చోట ఎంపీడీవోలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాయడం సరి కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో బుధవారం మాట్లాడారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల క్రమంలో ఏకగ్రీవాలు అయిన చోట ఎంపీడీవోలను బదిలీ చేయాలని సీఎస్‌కు ఎస్ఈసీ లేఖ రాయడం విచారకరమన్నారు. గ్రామ స్వరాజ్యానికి విఘాతం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లు ఉన్నప్పటికీ ఎస్ఈసీ ప్రత్యేక యాప్ తయారు చేసిందని, ఇది తమ హక్కు అని చెప్పే ముందు బాధ్యతలను తెలుసుకుని అనుసరించాలని బొత్స పేర్కొన్నారు. -
నేటితో ముగియనున్న గడువు
సాక్షి, అమరావతి: తొలి విడతలో ఈ నెల 9వ తేదీన పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం 3 గంటలతో గడువు ముగియనుంది. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. నామినేషన్ల పరిశీలన తర్వాత సర్పంచ్ పదవులకు 18,168, ఆయా గ్రామాల్లో వార్డు పదవులకు 77,554 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నచోట ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నచోట అభ్యర్థులకు క్రమపద్ధతిలో ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్లోని 7 మండలాలు, ఎటపాక రెవెన్యూ డివిజన్లోని 4 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని తగ్గించాలంటూ ఆ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రతిపాదించారు. ఆ మండలాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న దృష్ట్యా మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి కోరారు. రెండో విడత గ్రామాల్లో... రెండో విడతలో 3,327 పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు 33,562 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఆ గ్రామాల్లో బుధవారం కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. గురువారం సాయంత్రం 5 గంటలతో ఈ కార్యక్రమం ముగియనుంది. కాగా, గ్రామాల్లో దాఖలయ్యే నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు అన్లైన్లో అప్లోడ్ చేయడానికి వీలుగా పంచాయతీరాజ్ శాఖప్రత్యేక వెబ్ అప్లికేషన్ రూపొందించింది. దీనికి సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను జిల్లాల వారీగా డీపీవోలకు పంపించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ తెలిపారు. సదరు లింక్ ఆధారంగా నామినేషన్ల సమాచారాన్ని ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
ఆ యాప్‌పై నిషేధ ఉత్తర్వులివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ).. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారిక యాప్‌లను కాకుండా ప్రైవేట్ యాప్‌ను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రైవేట్ యాప్ ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ విజిల్’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కె.సుధాకర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ నిమిత్తం న్యాయవాది ఎం.జయరామ్‌రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీని గురించి ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. నిమ్మగడ్డ ఆది నుంచీ తెలుగుదేశం పక్షమే ► ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆది నుంచీ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని రక్షిస్తూ వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తే ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. టీడీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి సరిపుచ్చారు. ► తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఎన్నికల బరిలో ఉన్న వారిని బెదిరించారు. వారిపై దౌర్జన్యం చేశారు. అయినా నిమ్మగడ్డ ఏ రకంగానూ స్పందించలేదు. పారదర్శకత అంటే ఇదేనా? ► తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడంలో భాగంగా నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ రూపకల్పన అత్యంత రహస్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందువల్ల అత్యంత భద్రతా ప్రమాణాలతో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘సి–విజిల్, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్‌లను ఉపయోగించేలా ఎన్నికల కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయండి. ► నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్ ద్వారా పౌరుల సమాచారం బయటకు వెల్లడయ్యే ప్రమాదం ఉంది. తప్పుడు వీడియోలు సృష్టించే అవకాశం ఉంది. ► సీ విజిల్ యాప్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన కమిషనర్.. దాన్ని పూర్తిగా విస్మరించి తన సొంత యాప్ ఆధారంగా సమాచారం తెప్పించుకోవాలని నిర్ణయించారు. సమాచార హక్కు చట్టం కింద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ ప్రైవేట్ యాప్ గురించి సమాచారం కోరాం. ► ఈ యాప్ పేరు.. రూపకల్పన ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. టెండర్లు ఆహ్వానించారా.. భద్రత ప్రమాణాలు ఏమిటి తదితర వివరాలు కోరినా, ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రత ఆడిట్ జరిగిన తర్వాతే యాప్ బయటకు రావాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కమిషనర్ తయారు చేయించిన సొంత యాప్ ఈ ప్రమాణాలను పాటించలేదు. -
ఈ–వాచ్ యాప్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ, అందరి అనుమానాలను నిజం చేస్తూ, కీలకమైన ఎన్నికల నిఘా వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ ప్రముఖ కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ పేరును తెరపైకి తెచ్చి ఎన్నికల ప్రక్రియతో ఆటలాడారు. రోజుకో రకంగా మాట్లాడుతూ పారదర్శకతకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన సొంత యాప్‌ను తాజాగా ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆ ఫిర్యాదులను తొలుత నిమ్మగడ్డ ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలించాకే కలెక్టర్లకు పంపుతారు. అంటే వడపోత అనంతరం అవసరాన్ని బట్టి మాత్రమే ఎంపిక చేసిన ఫిర్యాదులను పరిశీలించేలా ఏర్పాట్లు జరిగినట్లు స్పష్టమవుతోంది. కాగా ఈ యాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. తమ కంపెనీ పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. యాప్ రూపకల్పనకు సంబంధించి నిమ్మగడ్డ తన ప్రెస్మీట్లో ప్రస్తావించిన సాంబశివరావు, మదన్‌మోహన్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమతో కేవలం యాప్‌ల గురించి మాత్రమే మాట్లాడారని, తమ కంపెనీ ద్వారా దీన్ని రూపొందించలేదని వెల్లడించారు. కమిషన్ తన సొంత వనరులతో యాప్ తయారీ చేసుకున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంత సాంకేతిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అసలసక్కడ ఉన్నారా? అన్ని వనరులున్నాయా? కమిషన్ కార్యాలయంలో ఎవరితోనూ సంబంధం లేకుండా నిమ్మగడ్డ ఒంటిచేత్తో ఓ యాప్‌ను ఆగమేఘాలపై తేవడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ ద్వారా దీన్ని రూపొందించినట్లు చెప్పలేక, సొంత వనరులంటూ ఆయన చెబుతున్నారని స్పష్టమవుతోంది. ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో.. ఎన్నికల్లో పారదర్శకత కోసం 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా తయారు చేయించి జడ్పీటీసీ, ఎన్నికల్లో వినియోగించిన నిఘా యాప్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి నిమ్మగడ్డ తన సొంత యాప్ ’ఈ–వాచ్’ను బుధవారం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆవిష్కరించడం పలు సందేహాలకు తావిస్తోంది. గురువారం నుంచి ఇది ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్ ప్రకటించింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్‌ను సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసిన వారు, ఆ పార్టీ సానుభూతిపరులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా, ప్రైవేట్ ఏజెన్సీల రూపంలో ఎన్నికల కమిషన్ కార్యాలయంలో చొరబడి ఈ తతంగాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడవుతోంది. తాము అనుకున్నట్లుగా ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి ఫిర్యాదులను పంపే అవకాశం ఉంది. కాల్ సెంటర్లో ఐదుగురు వ్యక్తుల ద్వారా.. ఎన్నికల అక్రమాలపై యాప్ ద్వారా ఎవరు ఫిర్యాదు చేసినా నేరుగా కలెక్టర్లు, ఎస్పీలకు వెళ్లదని రాష్ట్ర ఎన్నికల కమిషనే ప్రకటించింది. యాప్ ద్వారా నమోదయ్యే ఫిర్యాదు ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉండే కాల్ సెంటర్‌కు చేరుతుంది. అయితే ఆ కాల్ సెంటర్ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు వివరించారు. దీన్ని సమర్ధించుకుంటూ దేశంలో ఏ కాల్ సెంటర్‌లోనైనా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులే పనిచేస్తారని, వారిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉద్యోగులు పర్యవేక్షిస్తుంటారని నిమ్మగడ్డ తెలిపారు. యాప్‌తో అనుసంధానించి కమిషన్ కార్యాలయంలో ఏర్పాటయ్యే కాల్ సెంటర్లో ఐదుగురు వ్యక్తులు ఉంటారని, వారంతా ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన వారని వెల్లడించారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీ పేరు ప్రత్యేకంగా చెప్పకుండానే రిలయన్స్‌కు పార్ట్నర్గా వ్యవహరించే సునందకు సంబంధించినదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం సృష్టికర్తలదే..! యాప్ ద్వారా అందే ఫిర్యాదులను కాల్ సెంటర్లో పనిచేసే ప్రైవేట్ వ్యక్తులు తీవ్రతను బట్టి వర్గీకరించి కలెక్టర్లకు ఏవి పంపాలో నిర్థారించేలా ప్రక్రియను రూపొందించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి తెలిపారు. యాప్‌ను పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచనలు, సలహాల మేరకు తయారు చేయించినట్లు చెప్పారు. యాప్ నిర్వహణలో బగ్స్ లాంటి సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఐటీ విభాగం ద్వారా కాకుండా యాప్ తయారు చేసిన వారి ద్వారానే పరిష్కరించనున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. నిపుణులు లేకుండా.. రూపాయి ఖర్చు కాకుండా సాధ్యమేనా? సాధారణంగా ఓ యాప్, వెబ్‌సైట్‌కు రూపకల్పన చేయాలంటే కనీసం రూ.లక్షల్లోనే ఖర్చవుతుంది. కానీ నిమ్మగడ్డ యాప్ తయారీకి ఎలాంటి ఖర్చు కాలేదని ఆయనే ప్రకటించడంతో సందేహాలు ముసురుకుంటున్నాయి. కమిషన్ కార్యాలయంలో ఉండే వనరులను వినియోగించుకుని సొంతంగా యాప్, వెబ్ అప్లికేషన్ తయారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. అయితే అధికారిక వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో స్టాఫ్ట్వేర్ పరంగా ప్రావీణ్యం కలిగిన ఉద్యోగులెవరూ లేరు. అలాంటప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ యాప్ ఎలా తయారు చేశారని సామాన్యుడికి కూడా అనుమానం కలుగుతుంది. దీన్ని బట్టి ఎక్కడో తయారు చేసిన యాప్‌ను ఈ ఎన్నికలకు వినియోగిస్తున్నట్లు నిర్థారణ అవుతోంది. ఫిర్యాదుదారులకు రక్షణుందా? యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వారి వివరాలు కాల్‌సెంటర్ సిబ్బందికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే యాప్ హ్యాకింగ్ జరిగే అవకాశాల గురించి ఏమాత్రం పరిశీలన చేయకుండానే హడావుడిగా ఆవిష్కరించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిర్యాదుదారుల వివరాలు బహిర్గతమైతే గ్రామాల్లో అశాంతికి ఆజ్యం పోసినట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. జియో యాప్ తెద్దామనుకున్నాం కానీ.. పంచాయతీ ఎన్నికల కోసం జియో యాప్ తెస్తున్నట్లు తొలుత నిమ్మగడ్డ స్వయంగా మీడియాకు చెప్పారు. అయితే ఇప్పుడు సొంతంగా తయారు చేయించామంటూ మరో యాప్ ప్రవేశపెట్టారు. ‘మొదట రిలయెన్స్ జియో ద్వారా దీనిని పెడతామని చెప్పా. జియో యాప్‌లో అంతర్భాగంగా చేద్దామనుకున్నాం. కానీ సాంకేతిపరమైన సమస్యలొచ్చాయి. పరిష్కరించే సమయం లేక మేమే సొంతంగా తయారు చేయించాం. ప్రభుత్వం నిఘా యాప్ తీసుకురావడం మంచిదే. కాకపోతే అది అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లు తోచలేదు. నిఘా యాప్‌పై అపనమ్మకం ఉందని కాదు. ఎన్నికల కమిషనర్ తోడ్పాటు లేకుండా వాళ్లు సొంతంగా చేసుకున్నారు. ఆ నిఘా యాప్‌ను వాళ్లు ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల కమిషన్‌కు ఆ నిఘా యాప్‌పై అపనమ్మకం లేదు. కమిషన్ అవసరాలకు ‘ఈ వాచ్’ యాప్ తెస్తున్నాం’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ‘ఈ–వాచ్’... ఇలా –యాప్, వెబ్ అప్లికేషన్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయగానే అది కాల్ సెంటర్‌కు వెళుతుంది. – కాల్ సెంటర్ ఫిర్యాదులను కేటగిరీలవారీగా.. తీవ్రమైన ఫిర్యాదా.. ? సాధారణ ఫిర్యాదా? అని వర్గీకరిస్తుంది. తర్వాత ఆ ఫిర్యాదును సంబంధిత కలెక్టర్లకు కాల్ సెంటర్ ప్రతినిధులు పంపుతారు. –కలెక్టర్లు ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నాక తిరిగి యాప్‌లో వివరాలు నమోదు చేస్తే కాల్ సెంటర్‌కు అందుతాయి. –కాల్ సెంటర్లో ఉండే వ్యక్తులు ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఫోను చేసి సక్రమంగా పరిష్కరించారా... లేదా? అని వాకబు చేస్తారు. – ఫిర్యాదుదారుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ఫిర్యాదును తిరిగి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. – యాప్ ద్వారా అందే ఫిర్యాదుల వివరాలు అందరికీ తెలిసేలా వెబ్సైట్లో ఉండవు. కేవలం ఎన్ని ఫిర్యాదులు వచ్చాయన్న సంఖ్య మాత్రమే డ్యాష్ బోర్డు రూపంలో ఉంచుతారు. ఏకగ్రీవ నినాదం బాగా వెనుకబడింది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సాక్షి, అమరావతి/తిరుపతి: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ‘ఈ–వాచ్’ యాప్ ద్వారా అందే సీరియస్ ఫిర్యాదులను కలెక్టర్లు, ఎస్పీలు సకాలంలో పరిష్కరించని పక్షంలో ఎన్నికనే రద్దు చేయాల్సి ఉంటుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. అతి తీవ్రత ఉండే ఫిర్యాదులను అరగంటలోపే పరిష్కరించాలన్నారు. ఎన్నికల నిఘాకు తాను సొంతంగా తయారు చేయించిన ‘ఈ–వాచ్’ యాప్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ యాప్‌పై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఏకగ్రీవం నినాదం బాగా వెనుకబడిపోయిందని, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్లు వేస్తున్నారన్నారు. తక్కువ మాట్లాడతా.. యాప్‌పై కొందరు కోర్టుకు వెళ్లడంపై ఆయన స్పందిస్తూ.. ‘వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. మన పని మనం చేసుకుంటాం. సుప్రీంకోర్టు చెప్పాక ఇక ఆగుతాయా? చిన్నాచితకా ఉంటూ ఉంటాయి. కోర్టులో కేసు పడకపోతే ఆశ్చర్యపోవాలి గానీ కేసు వేశారంటే.. నాకైతే ఏమీ ఆశ్చర్యం కలిగించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. తాను తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేసుకుంటూ పోతానన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు కన్నబాబు, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, సంజయ్ పాల్గొన్నారు. తాను మాట్లాడటం పూర్తవగానే విలేకరుల ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే నిమ్మగడ్డ నిష్క్రమించారు. కాగా, రాజ్యాంగంలో తన పరిధి చాలా చిన్నదని, ఆ మేరకే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నానని ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పారు. చిత్తూరు జిల్లా అధికారులతో తిరుపతిలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. -
నేడే నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్!
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పారదర్శకతకు పాతరేశారు. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టుచాటుగా ప్రైవేట్ యాప్ రూపొందించుకుని ఆ బండారం బయటపడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే ఎన్నికలలో వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా రహస్యంగా ఉంచిన ఆ యాప్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ కూడా ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు. ఇప్పటివరకు యాప్ వివరాలు ఏమాత్రం వెల్లడించకుండా ఆయన గోప్యంగా ఉంచారు. యాప్ తయారు చేసింది ఎవరు? కంట్రోల్ కేంద్రం ఎక్కడుంది? ఎవరు పర్యవేక్షిస్తారు? సిబ్బంది ఎవరు? ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారు? తదితర వివరాలు బహిర్గతం కాకుండా గోప్యత పాటించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పూర్తి పారదర్శకతతో జరగాల్సిన ఎన్నికలకు ఉపయోగించే యాప్‌ను అనుమతులు లేకుండానే ఆవిష్కరించేందుకు నిమ్మగడ్డ ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. మరోవైపు యాప్‌లో అందే సమాచారాన్ని తొలుత తాను మాత్రమే చూసి ఆ తర్వాత ఎంపిక చేసిన డేటానే జిల్లా కలెక్టర్లకు పంపేలా నిమ్మగడ్డ ఇప్పటికే లాగిన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అనుమతులు తప్పనిసరి.. సాధారణంగా ప్రభుత్వంలోగానీ, ప్రభుత్వ వ్యవస్థలలోగానీ యాప్‌లు, ఇతర సాఫ్ట్వేర్లు ఉపయోగించాలంటే నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలి. యాప్‌లో నమోదు చేసే సమాచారం (డేటా) నిర్ణీత వ్యక్తులు మినహా ఇతరులకు చేరకుండా, హ్యాక్ చేసే వీలు లేకుండా డేటా సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయా? అని ఏపీటీఎస్ విభాగం నిపుణులు పరిశీలన చేశాక అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. యాప్‌లలో నమోదు చేసే సమాచారాన్ని బయట వ్యక్తులు మార్చేసే అవకాశం (మార్ఫింగ్, ఎడిటింగ్) లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ డేటా సెంటర్ (అన్ని రకాల ప్రభుత్వ యాప్‌లు, వెబ్సైట్ సమాచారం నిల్వ చేసే కేంద్రం)తో అనుసంధానించేలా అనుమతి పొందాలి. అయితే డేటా భద్రతకు ఉద్దేశించిన అనుమతులేవీ తీసుకోకుండానే యాప్‌ను తెచ్చేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. తద్వారా ఎన్నికల ప్రక్రియలో దురుద్దేశాలతో వ్యవహరిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరి లబ్ధి కోసం? ఎన్నికల కోసం ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ తయారు చేయించిన యాప్ ఉన్నప్పటికీ దాన్ని కాదని అనుమతులు లేని ప్రైవేట్ యాప్‌ను ఎన్నికల పర్యవేక్షణకు వినియోగించాలన్న నిర్ణయం వెనుక టీడీపీకి లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశం దాగి ఉన్నట్లు భావిస్తున్నారు. కొందరు టీడీపీ ముఖ్యలు హైదరాబాద్ నుంచి పర్యవేక్షించేలా యాప్‌లో ఏర్పాట్లు జరిగినట్లు కమిషన్ కార్యాలయ వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో రాజకీయాలను చొప్పించడం ద్వారా ప్రశాంతతకు భంగం కలిగే ప్రమాదం నెలకొందన్న ఆందోళన గ్రామాల్లో వ్యక్తమవుతోంది. -
శ్రీకాకుళం, విజయనగరం అధికారులతో ఎస్ఈసీ సమీక్ష
అరసవల్లి/సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘నేనెప్పుడూ వివాదాల జోలికి వెళ్లను.. 40 ఏళ్లలో ఎక్కడా వివాదాలకు పోలేదు. కనీసం ఏ వ్యక్తిని, ఏ రాజకీయ పార్టీనుద్దేశించి కూడా ఇంతవరకు మాట్లాడలేదు.. మాట్లాడే వ్యవహార శైలి నాది కాదు..’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తాను రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తున్నానని, తనకు అన్ని రాజకీయ పార్టీలు సమానమేనని చెప్పారు. ఆయన సోమవారం శ్రీకాకుళం, విజయనగరం కలెక్టరేట్లలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోను, విజయనగరంలోను నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అని, అలాంటి వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ చొరబడేలా ప్రయత్నించడం, భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటే.. అలాంటి అనుభవాలే కచ్చితంగా ఆ వ్యవస్థలకు కూడా ఎదురవుతాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకం కాదని, అయితే బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం అంగీకరించేది లేదని చెప్పారు. 2013, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు అధికంగానే జరిగాయన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా, అలాగే ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించేందుకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, బుధవారం ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో తొలివిడతలో 321 పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లు అద్భుతంగా చేశారంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్‌లను ప్రశంసించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ సమయంలో జరిగిన ఘటనపై విలేకరులు అడిగినా ఆయన ఏమాత్రం స్పందించకుండా వెనుదిరిగారు. రేపు తిరుపతికి నిమ్మగడ్డ చిత్తూరు కలెక్టరేట్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతి రానున్నారు. సాయంత్రం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌కు ఉత్తర్వులు అందాయి. -
నిమ్మగడ్డ తీరును ఎండగట్టిన హైకోర్టు న్యాయమూర్తి
సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేయడం లేదంటూ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ప్రచారం కోసం దాఖలు చేస్తున్నారా? అంటూ హైకోర్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను నిలదీసింది. గత నెల 18న దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ 42 రోజుల పాటు ఈ కోర్టు ముందు విచారణకు రాలేదని.. అయితే, పిటిషన్లో ప్రతీ అక్షరం మాత్రం డిసెంబర్ 19నే అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైందని.. దీంతో పిటిషన్ వేసిన ప్రయోజనం నెరవేరినట్లు కమిషనర్ భావించినట్లున్నారని హైకోర్టు తెలిపింది. దీని ఆధారంగానే నిమ్మగడ్డ రమేష్ ప్రచారం కోసమే కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారన్న అభిప్రాయం ఈ న్యాయస్థానానికి కలుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదీ కోర్టు ధిక్కార పిటిషన్.. తమకు కేటాయించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడంలేదని, నిధులు విడుదల చేసేలా ఆదేశాలివ్వడంతో పాటు విధి నిర్వహణలో తమకు ఆర్థిక, ఆర్థికేతర సహాయ, సహకారాలు అందించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఎన్నికల కమిషన్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలుచేయడంలేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది డిసెంబర్ 18న కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం జనవరి 29న విచారణకు రాగా, ఇందులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రతివాదిగా చేసేందుకు కమిషన్ తరఫు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు జాప్యం ఎందుకు? ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, న్యాయమూర్తి తనకు కొన్ని విషయాలపై స్పష్టతనివ్వాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్‌ను ఆదేశించారు. డిసెంబర్ 18న పిటిషన్ దాఖలు చేస్తే అది జనవరి 29 వరకు ఎందుకు విచారణకు రాలేదని.. ఇన్ని రోజుల జాప్యం మీ తప్పా, రిజిస్ట్రీ తప్పా అంటూ అడిగారు. కేసు విచారణకు వచ్చేందుకు రిజిస్ట్రీకి లేఖలు రాశానని, ఫోన్లు కూడా చేశానని అశ్వనీ చెప్పారు. అత్యవసరంలేదని భావించే 42రోజులు మౌనంగా ఉన్నారా? అంటూ న్యాయమూర్తి మళ్లీ ప్రశ్నించారు. ‘నిజంగా అత్యవసరమని భావించే ఉంటే ఈ కోర్టులో ప్రస్తావించి ఉండేవారు. ఆ పనిచేయలేదంటే వారు ఏ ప్రయోజనం ఆశించి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారో సులభంగా అర్థమవుతోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నారంటే ప్రతివాదులపై (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి) ఒత్తిడి పెంచడానికి ఇలా చేస్తున్నారని ఈ కోర్టు భావిస్తోంది. ఎన్నికల కమిషనర్ సదుద్దేశాలపై ఈ కోర్టుకు సందేహం కలుగుతోంది’.. అని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు ఓ పిటిషన్ విచారణకు రాకపోవడం అంటే ఈ కోర్టు రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేనని న్యాయమూర్తి తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎస్ నీలం సాహ్ని, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలకు నోటీసులు జారీచేశారు. అంతేకాక.. నవంబర్‌లో తమ ఉత్తర్వులకు సంబంధించి తీసుకున్న చర్యలపై తాము కోరిన నివేదికను తదుపరి విచారణ సమయంలో తన ముందుంచాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి స్పష్టంచేశారు. అలాగే, పిటిషన్ విచారణకు రాక ముందే వాటిని పత్రికలకు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో కమిషనర్‌కు తగిన సలహా ఇవ్వాలని కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌కు సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. -
‘కంట్రోల్ రూమ్’ కనుసన్నల్లో నిమ్మగడ్డ యాప్!
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన పదవిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న వికృత క్రీడ పరాకాష్టకు చేరుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఎన్నికల ప్రక్రియను ఛిన్నాభిన్నం చేసి అధికారులను గందరగోళానికి గురి చేసేందుకు టెక్నాలజీ చాటున ఎత్తుగడలకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న ఫిర్యాదులు మాత్రమే స్వీకరించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ యాప్‌ను అత్యంత గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు తమ పార్టీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు పంపడం.. వాటిని నిమ్మగడ్డ యాప్‌కు చేరవేయడం.. అక్కడి నుంచి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ఛిన్నాభిన్నం చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తద్వారా అధికార వైఎస్సార్ సీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని బురద చల్లేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రజల ఓట్లతో గెలవడం అసాధ్యమని గత సార్వత్రిక ఎన్నికలు రుజువు చేయడంతో దొడ్డి దారి వ్యూహాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పదును పెడుతున్నట్లు వెల్లడవుతోంది. మార్ఫింగ్ అవకాశాలు పుష్కలం నిమ్మగడ్డ సొంతంగా రూపొందించుకున్న ప్రైవేట్ యాప్‌లో ఫిర్యాదులను మార్ఫింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీడియోలను ఎడిటింగ్ చేసి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్, వెబ్‌కాస్టింగ్, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ఇలాంటి వాటికి ఏమాత్రంఅవకాశం లేదు. అందుకనే వాటిని పక్కనపెట్టి నిమ్మగడ్డ ఓ ప్రైవేట్ యాప్ తెచ్చారు. దీనివల్ల తమకు అవసరమైన చోట మార్ఫింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లైవ్ టెలికాస్టింగ్ జరిగే వెబ్‌కాస్టింగ్‌లో వీటికి తావుండదు. ఫిర్యాదులకు టీడీపీ వాట్సాప్ నంబర్ ఈ యాప్ పూర్తి వివరాలను ఎస్ఈసీ ఇంతవరకు వెల్లడించలేదు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ‘యాప్’ ఆపరేషన్ మొదలు కావడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల పరిధిలో ఉన్న ఆ యాప్‌ను టీడీపీ కార్యాలయంలోని ‘కంట్రోల్ రూం’ నుంచి నియంత్రించేలా కార్యాచరణకు ఉపక్రమించారు. ఎన్నికల ప్రక్రియపై కంట్రోల్ రూమ్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయాలని సూచిస్తూ ఫొటోలు, వీడియోలు పంపేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్‌ను కేటాయిస్తూ టీడీపీ తన శ్రేణులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. ఈ యాప్ వివరాలు, ఇతర సమాచారాన్ని వెల్లడించకుండానే టీడీపీ ఫిర్యాదుల కోసం సొంత ఏర్పాట్లు చేసుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలను ఆ వాట్సాప్ నంబర్‌కు పంపాలన్నది టీడీపీ తమ పార్టీ శ్రేణులకు పరోక్షంగా సూచించింది. తమ పార్టీ కార్యకర్తలు పంపించే తప్పుడు ఫిర్యాదులను టీడీపీ కార్యాలయంలోని కంట్రోల్ రూం నుంచి నేరుగా ఎన్నికల కమిషన్ యాప్‌కు పంపడం... వీటి ఆధారంగా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని టీడీపీకి రాజకీయ ప్రయోజనం కల్పించాలన్నది అసలు పన్నాగమని నిపుణులు పేర్కొంటున్నారు. గోప్యంగా సొంత ‘యాప్’... పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు తాను ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెడతానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇటీవల ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల పర్యవేక్షణకు వినియోగిస్తున్న పారదర్శకమైన వెబ్ కాస్టింగ్ విధానాన్ని కాదని ఆయన సొంత యాప్‌ను తెస్తానని చెప్పడం పట్ల నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ యాప్‌ను ఎవరు రూపొందించారు? యాప్ పర్యవేక్షణ, ఎవరి నియంత్రణలో ఉంటుంది? తదితర వివరాలను ఆయన ఏమాత్రం వెల్లడించ లేదు. ఇదంతా టీడీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలోనే సాగుతోందని ఎన్నికల కమిషన్ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న వారికిగానీ, సాధారణ ప్రజలకు గానీ ఇంతవరకు యాప్ వివరాలను వెల్లడించ లేదు. నిమ్మగడ్డ యాప్ కంట్రోల్ కేంద్రం ఎక్కడ? కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు ‘సీ–విజిల్’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా అమలు చేసింది. ఎన్నికల నిబంధనల అమలును దీని ద్వారా పర్యవేక్షించింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. అంతర్జాతీయంగా కూడా భారత్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రశంసలు వచ్చాయి. పారదర్శకంగా ఉండే ఈ యాప్ అందుబాటులో ఉండగా ఎక్కడ తయారైందో తెలియని సొంత యాప్‌ను నిమ్మగడ్డ తేవడంపై సందేహాలు అలముకుంటున్నాయి. అసలు నిమ్మగడ్డ యాప్ ఎక్కడ తయారైంది? ఎవరు పర్యవేక్షిస్తారు? కంట్రోల్ కేంద్రం ఎక్కడ? సిబ్బంది ఎవరు? కార్యాలయం ఎక్కడుంది? ఫిర్యాదులను ఎవరు చూస్తారు? టెండర్లు పిలిచారా? అనే వివరాలను ఏమాత్రం వెల్లడించకుండా గుట్టుగా ప్రైవేట్ యాప్‌ను సిద్ధం చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ యాప్ పర్యవేక్షణ కేంద్రం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో లేదన్నది మాత్రం సుస్పష్టం. ఇలా ఫిర్యాదు... అలా చర్యలు! యాప్ నియంత్రణ ఎక్కడుందనే వివరాలను అధికార వర్గాలకు తెలియకుండా నిమ్మగడ్డ రహస్యంగా ఉంచారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ‘కంట్రోల్ రూం’ లోగుట్టు దాగుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. యాప్ ప్రవేశపెడుతున్నట్టు అధికారికంగా వెల్లడించగానే అసలు కథ మొదలవుతుంది. అప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి తెప్పించిన ఫొటోలు, వీడియోలను యాప్‌లో అనుసంధానిస్తారు. యాప్ నిర్వహణ టీడీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలోనే ఉండటంతో వాటినే కంట్రోల్ రూం నుంచి స్వీకరించి నిమ్మగడ్డకు అందజేస్తారు. ఇతరులు చేసే ఫిర్యాదులు బుట్టదాఖలు కానున్నాయి. టీడీపీ మద్దతుదారులు ఓడిపోతారని నిర్ధారణ అయ్యే పంచాయతీల్లో పోలింగ్‌ను నిలిపేయడం, ఓట్ల లెక్కింపును వాయిదా వేయడం, పోలింగ్ రద్దు చేయడం లాంటి చర్యలకు దిగే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
సొంత గడ్డకు నిమ్మగడ్డ
సాక్షి, తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల): ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆదివారం స్వగ్రామం దుగ్గిరాలకు విచ్చేశారు. ఆయన రాకను పురస్కరించుకొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పొడవునా స్వాగతం పలికారు. ఏడాదిగా సొంతూరుకు వెళ్లని నిమ్మగడ్డ, ఇప్పుడు బిజీగా గడుపుతున్న వేళఊర్లో ప్రత్యక్షమవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దుగ్గిరాల మండలానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఆయన్ను కలిసి ఇంట్లో గంటన్నర పైనే మాట్లాడారు. నిమ్మగడ్డను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ జంపాల కృష్ణారావు, దుగ్గిరాల బీజేపీ నాయకురాలు చుండూరు ఉమ తదితరులు ఉన్నారు. దుగ్గిరాల తహసీల్దార్ మల్లేశ్వరి నిమ్మగడ్డకు స్వాగతం పలికారు. చదవండి: (పరిటాల సునీతకు ఎదురుదెబ్బ) -
రేపు ఉత్తరాంధ్ర పర్యటనకు ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రేపటి నుండి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్ఈసీ.. మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకొని, అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం, సాయంత్రం 7 గంటల నుంచి విజయనగరం జిల్లా అధికారులతో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఆ రాత్రికి విశాఖలోనే బస చేయనున్న ఎస్ఈసీ.. 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకొని, రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. -
ఎన్నికలను ఏ శక్తీ ఆపలేదు
కడప సిటీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల స్పష్టమైన తీర్పుతో పంచాయతీ ఎన్నికలను ఇక ఏ శక్తీ ఆపలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. శనివారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడం తన విధి అని, రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల నిర్వహణ చేపట్టామన్నారు. 2006లో 36 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతున్నాయన్నారు. బలవంతంగా ఏకగ్రీవాలకు పాల్పడటం తగదని, ఆ దిశగా ప్రభావితం చేసే వారిపై షాడో బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం అని, ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండవని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం పనితీరు బాగుందని, పనితనం ఉన్న వారిపై ఆరోపణలు రావడం సహజమే అన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు. నిజం నిర్భయంగా చెబుతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న ఈ జిల్లాలో ఒక అధికారిక సమావేశంలో పాల్గొనడం చాలా సంతృప్తికరంగా ఉందని నిమ్మగడ్డ అన్నారు. వైఎస్సార్ వద్ద పని చేయడం వల్లే తన కెరీర్లో గొప్ప మలుపు వచ్చిందని చెప్పారు. ఆయన వద్ద మూడేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన తనను, ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్‌భవన్‌లో ఉన్నత బాధ్యతల కోసం పంపించారన్నారు. అలా వెళ్లిన తాను అక్కడ ఏడేళ్లు ఉండిపోయి ఎలక్షన్ కమిషనర్‌ను అయ్యానని వివరించారు. రాజ్ భవన్ ఆశీస్సులతోనే తనకు ఈ పదవి వచ్చిందన్నారు. అందువల్ల తన హృదయంలో వైఎస్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. తానెప్పుడూ నిజాన్ని నిర్భీతిగా, ధైర్యంగా చెబుతానన్నారు. ఇటీవల కొన్ని పరిణామాల వల్ల వచ్చిన సీబీఐ కేసుల్లో తాను ప్రధాన సాక్షినని, రేపు కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చాలా విషయాల్లో ఇదివరకే సాక్ష్యం చెప్పానన్నారు. ఇలాంటి కేసుల్లో సాక్ష్యం చెప్పే వారికి కోర్టు అనేక రక్షణలు ఇచ్చిందన్నారు. అందువల్ల నిర్భీతితో తాను చెప్పాల్సింది చెబుతానన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మంత్రుల పర్యటనలకు ప్రభుత్వ వాహనాలొద్దు
సాక్షి, అమరావతి : పార్టీయేతర ప్రాతిపదికన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులెవరూ పల్లెల్లో పర్యటించే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వోద్యోగులెవరినీ వెంట తీసుకెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వ వాహనాలతో సహా ఇతరత్రా ఏ ప్రభుత్వ సదుపాయాలను వారు వినియోగించకూడదని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కోడ్ అమలులో ఉందని.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ వాహనాలను సమకూర్చవద్దని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఏ ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందకూడదని స్పష్టంచేశారు. అంతేకాక.. కేబినెట్ ర్యాంకు హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా ఉండే వారు పార్టీ కార్యాలయాలకు వెళ్లి రావడానికి కూడా ప్రభుత్వ వాహనాలు వినియోగించుకోకూడదని.. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ పార్టీకి సంబంధించిన ప్రెస్మీట్లలోనూ పాల్గొనడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఆ లేఖలో సీఎస్‌కు వివరించారు. -
నోటి మాటే ఫై'న'ల్
సాక్షి, అమరావతి: ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యవస్థలంటే.. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా అది ఎందుకోసమో తెలియచేస్తూ పారదర్శకత కోసం నోట్ ఫైల్స్‌తో కూడిన దస్త్రం (ఫైల్) ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎలాంటి నోట్ ఫైల్స్, ఫైల్స్ లేకుండానే వరుసగా అత్యంత వివాదాస్పద నిర్ణయాలను ఎడాపెడా తీసుకుంటున్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో సహా ఇటీవల నిమ్మగడ్డ పలు వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం ఎందుకు తీసుకున్నారో తెలియజేసే ఫైళ్లు కూడా లేవని విశ్వసనీయంగా తెలిసింది. నిమ్మగడ్డ రమేష్‌కుమారే ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ వెంటనే తనకు విచక్షణాధికారాలు ఉన్నాయంటూ నిబంధనలను తుంగలోకి తొక్కి చర్యల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం నిత్యకృత్యంగా మారింది. నిమ్మగడ్డ నిర్ణయాలు అప్రజాస్వామికంగా, పూర్తిగా రాచరికపు పోకడలను తలపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చరిత్రలో పేరుపొందిన నియంతలను సైతం మరిపిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రపతి నుంచి న్యాయమూర్తుల దాకా.. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు తమకు అందే వినతులు, తాము తీసుకునే నిర్ణయాలకు సంబంధించి అన్ని వివరాలను ఒక ఫైల్ రూపంలో పొందుపరచడం అనవాయితీ అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉన్నత న్యాయస్థానాల్లో వెలువరించే తీర్పులకు సంబంధించి కూడా ఆ కేసుల తాలూకు అన్ని వివరాలను ప్రత్యేకంగా పైళ్ల రూపంలో పొందుపరుస్తారని పేర్కొన్నాయి. నిర్ణయం ఎంత చిన్నదైనా.. ప్రభుత్వ అధికారులు ఎంత చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ‘ప్రతిపాదన’ అనే ప్రాధమిక రూపం నుంచి ప్రక్రియ మొదలవుతుంది. తొలిదశలో ప్రతిపాదన నోట్ ఫైల్‌గా రూపుదిద్దుకుంటుంది. సాధారణంగా కార్యాలయ దిగువస్థాయి అధికారి నోట్‌ఫైల్‌ను రూపొందించి తన పై అధికారికి పంపిస్తారు. పై అధికారి నోట్ ఫైల్లో అవసరమైన మార్పులు చేయడంతో పాటు తన అభిప్రాయాన్ని, రూల్ పొజిషన్‌ను పేర్కొంటూ సంతకం చేస్తారు. అక్కడ నుంచి సంబంధిత ఉన్నతాధికారికి ఫైలు వెళుతుంది. అవసరమైన మార్పులు చేర్పులు అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఆ ప్రతిపాదన ఉంటే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇదే విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు లేదా ఇతరులెవరైనా ఫిర్యాదులు చేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. కానీ నిమ్మగడ్డ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఎక్కడో తయారైన ఆదేశాలను జారీ చేస్తున్నారా? ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం నోట్ ఫైల్స్ కూడా లేకుండా వివాదస్పద ఆదేశాలను జారీ చేస్తున్న నిమ్మగడ్డ బయట ఎక్కడో రూపొందించిన వాటిని తన పేరుతో విడుదల చేస్తున్నట్లు పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే వాయిదా వేసినప్పుడు నిమ్మగడ్డ 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయంలో తయారైన లేఖపై ఆయన సంతకం చేసి పంపినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాకుండా బయట తయారై వచ్చిన లేఖను నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు పంపారన్న ఫిర్యాదుపై సీఐడీ విచారణ ప్రారంభం కాగా కోర్టు జోక్యంతో నిలిచిపోయింది. తాజాగా కూడా నిమ్మగడ్డ ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాకుండా బయటే రూపుదిద్దుకుని వస్తున్నాయని, వాటినే నిమ్మగడ్డ తన పేరుతో జారీ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తీర్పులు రావడమే ఆలస్యం.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని నిమ్మగడ్డ ఛాంబరు (ఆయన విజయవాడలో ఉంటే రాత్రి వేళ కూడా అక్కడే గడుపుతూ నిద్రపోతుంటారు)లోకి ఎప్పడో ప్రత్యేక పరిస్థితుల్లో మినహా కార్యాలయ అధికారులను సైతం రానివ్వరని సిబ్బంది వెల్లడించారు. చాలా సందర్భాల్లో కీలక ఆదేశాలను నిమ్మగడ్డ తన ఛాంబరు నుంచే మొదట పేపరు మీద రాసి వాటిని వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అటెండర్ ద్వారా ఒకరిద్దరు అధికారుల వద్దకు పంపి టైపు చేయించి అనంతరం ఆ కాగితాలపై సంతకాలు చేసి ఆదేశాల పేరుతో జారీ చేస్తున్నారని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నిమ్మగడ్డ చెబుతున్న ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. కానీ కోర్టు తీర్పులు లాంటివి వచ్చిన తర్వాత కేవలం 10 – 20 నిమిషాల వ్యవధిలోనే పేజీలకు పేజీలు ఆదేశాలు రూపొందించి మెరుపు వేగంతో జారీ చేస్తున్నారంటే దీని వెనుక అదృశ్య హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇలాంటి ఉత్తర్వులు రూపొందించేందుకు ఓ రాజకీయ పార్టీ ట్రస్టు భవన్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రతను ఆ అదృశ్య శక్తులు నీరుగారుస్తున్నాయని, కమిషన్ కార్యాలయ ఉద్యోగులను కాకుండా ట్రస్టు భవన్ సేవలను వినియోగించుకోవడం వెనక లక్ష్యం ఏమిటనేది వరుసగా జారీ అవుతున్న వివాదాస్పద ఉత్తర్వులే రుజువు చేస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తనకున్న విచక్షణాధికారాలతో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ నెల 23న ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడానికి ప్రవీణ్ ప్రకాశే కారణమని తాను చేయించిన విచారణల్లో తేలిందన్నారు. నేను నిబంధనల మేరకే పనిచేశా: పవీణ్ ప్రకాశ్ వివరణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాను నిబంధనల ప్రకారమే పనిచేశానని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖపై వివరణ ఇస్తూ ఆయన సీఎస్‌కు శుక్రవారం లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖలో పూర్తి అంశాలను వివరించలేదన్నారు. ఎస్ఈసీ నుంచి తనకు మెయిల్ ద్వారా వచ్చిన లేఖపై తాను వెంటనే స్పందించానని, జీఏడీ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) కార్యాలయం స్వతంత్రమైంది కాదని, జీఏడీకి సీఎస్ అధిపతి అని, తాను ఆయనకే రిపోర్టు చేస్తాననే విషయాన్ని రమేష్ తెలుసుకోవాలన్నారు. జీఏడీలోని ఐదుగురు ముఖ్య కార్యదర్శుల్లో జీఏడీ పొలిటికల్ కార్యదర్శి సీఎస్‌కు సపోర్టింగ్ అధికారి మాత్రమేనన్నారు. కాబట్టి తాను స్పందించలేదని ఎస్ఈసీ అనడం ఎంతవరకు న్యాయమని, ఇది నైతికమా? అని ప్రశ్నించారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై న్యాయవివాదం కొనసాగుతున్నందున, యథాతథస్థితి కొనసాగించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తెలిపిన విషయం కలెక్టర్లు, ఎస్పీలందరికీ తెలుసు. వారు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడానికి అదే కారణం. ఈ అంశంలో నేను ప్రత్యేకంగా అధికారులను ఆదేశించింది ఏమీ లేదు. దీంతో నాకెలాంటి సంబంధం లేదు. వాస్తవాలిలా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ జరక్కుండా నేను అడ్డుకున్నానని ఎస్ఈసీ అనడం ఏమాత్రం సమంజసం కాదు’’ అని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. -
బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకోం
సాక్షి ప్రతినిధి, అనంతపురం, సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నిర్దిష్టంగా ఇన్ని జరగాలనే పిడివాదంతో చేసే ఏకగ్రీవాలను అంగీకరించేది లేదన్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అనంతపురం, కర్నూలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షణ కోసం కొత్త యాప్ ‘జియో’ తయారు చేశామని, గ్రామాల నుంచి నేరుగా రికార్డింగ్ మెసేజ్‌లతో పాటు సందేశాలు కూడా పంపవచ్చని తెలిపారు. యాప్, కాల్సెంటర్లను డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రాష్ట్ర సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవాలైన చోట్ల సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని ఆదేశించారు. ఏకగ్రీవాలకు ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని, అది గతం నుంచే ఉందన్నారు. రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఉందని విపక్ష పార్టీల నాయకులు ఏకగ్రీవాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. సమాచార శాఖ కమిషనర్‌ను సంజాయిషీ కోరానని, ఆయనపై చర్యలు కూడా తీసుకోబోతున్నానన్నారు. ఇప్పటివరకూ ఎన్నికల కమిషనర్లు నాలుగు గోడల మధ్య పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేశారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా షాడో టీంలను విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పెంచినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఓటు వేసేందుకు వస్తే చివరిలో పీపీఈ కిట్లు ధరించి వినియోగించుకునేలా అవకాశం ఇస్తామన్నారు. నిన్ను సెన్సూర్ చేస్తా ఉన్నతాధికారికి నిమ్మగడ్డ బెదిరింపులు పత్రికలు, టీవీలు చూడలేదన్నందుకు ఓ ఉన్నతాధికారిని సెన్సూర్ చేస్తానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ బెదిరించడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో సమీక్ష సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఈ రోజు పత్రికలు చూశావా? గవర్నరు వద్ద ఏం జరిగిందో తెలుసా?’ అంటూ కోనేరు రంగారావు సిఫారసుల కమిటీ(కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడును నిమ్మగడ్డ ప్రశ్నించారు. పత్రికలు, టీవీలు చూడకపోతే ఎన్నికల సమయంలో నువ్వేం పని చేస్తావంటూ చిందులు తొక్కినట్టు తెలిసింది. సెన్సూర్ చేస్తానంటూ మూడుసార్లు బెదిరించినట్లు సమాచారం. తాను తెల్లవారుజామునే వచ్చి రిటర్నింగ్ అధికారులకు ఫోన్లు చేసే పనిలో నిమగ్నమైనట్లు ఆయన పేర్కొనడంతో ‘గవర్నర్ వద్దకు వెళ్లి రాజకీయ పార్టీలు ఏం చెప్పాయో తెలియకపోతే ఏం డ్యూటీ చేస్తావ్?’ అని మరోసారి హెచ్చరించారు. అనంతరం ఆయన పేరు తెలుసుకుని నిమ్మగడ్డ సారీ చెప్పినట్లు తెలిసింది. మీడియాపై చిందులు... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌లను తప్పించాలంటూ రాసిన లేఖలపై నిమ్మగడ్డను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన సహనం కోల్పోయి గద్దించారు. ‘ఉండవయ్యా...ఉండు’ అంటూ చిర్రుబుర్రులాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడంపై ఏ చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు. -
యాప్‌పై నిమ్మగడ్డ తెలిసే మాట్లాడుతున్నారా?
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను ‘యాప్’ ద్వారా నియంత్రించేందుకు పన్నిన కుట్ర లోతులు.. మెల్లగా బహిర్గతమవుతున్నాయి. ఈ ‘యాప్’ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్న మాటలు, పాటిస్తున్న గోప్యత చూస్తుంటే... అసలీ ఎన్నికల్లో పారదర్శకత మచ్చుకైనా ఉంటుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ యాప్ జియోలో ఏపీ పంచాయతీ ఎన్నికల పేరిట లభ్యమవుతుందని, దీనికి రికార్డింగ్ మెసేజ్‌లు, ఫొటోలు, సందేశాలు పంపవచ్చని శుక్రవారం అనంతపురంలో విలేకరులతో చెప్పారాయన. సందేశం ఇచ్చిన వారికి రిప్లై ఇస్తామంటూ... తొలిసారికే ఇది విజయవంతం కాదని, మూడో దశకల్లా బలపడుతుందని, పట్టు వస్తుందని చెప్పారు. ఈ మాటలు విన్నవారికి... ఇలా మాట్లాడుతున్నది ఒక ఎన్నికల కమిషనరేనా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారేనా? అనే సందేహం రాక మానదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలై... తొలి దశ పోలింగ్ కూడా సమీపిస్తోంది. ఇప్పటికీ ఈ యాప్ గురించి ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డకు తప్ప ఎవ్వరికీ వివరాలు తెలియవు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని రెండు రోజుల కిందట ‘సాక్షి’తో చెప్పిన నిమ్మగడ్డ కార్యదర్శి... శుక్రవారం నాలిక కర్చుకున్నారు. అలాంటిదేమీ పంపలేదన్నారు. ఇంకా విచిత్రమేంటంటే... జియోలో యాప్ ఉంటుందనే మాటకు అర్థమే లేదు. జియో అనేది బయటి యాప్‌లను హోస్ట్ చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్ లాంటి ప్లాట్‌ఫామ్ కాదు. ప్రస్తుతానికి అదో మొబైల్ నెట్వర్క్. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ మాదిరే ఇది కూడా. మరి దీన్లో అధికారిక యాప్‌ను ఎలా ఆవిష్కరిస్తారు? మొదటి దశకు సక్సెస్ కాదని, చివరి దశకల్లా పట్టు వస్తుందని చెప్పటమేంటి? అసలీయన తెలిసే మాట్లాడుతున్నారా? లేక బయటి నుంచి ఎవరో చెప్పమన్న మాటలను చెబుతూ... తడబడుతున్నారా? కావాలని తప్పుడు మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారా? తనకు కావాల్సిన వారికే లాగిన్? యాప్ వివరాలు తన కార్యాలయంలో కూడా ఎవ్వరికీ తెలియకుండా సొంత వ్యవహారంలా చక్కబెడుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్... ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను తెరిచి చూసుకునేందుకు వీలైన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇది ఆయనకు, ఆయనకు ఇష్టమైన కొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్యులకు మాత్రమే ఉంటుందని విశ్వసనీయంగా తెలియవచ్చింది. లాగిన్ తన ఒక్కడి దగ్గరే ఉంటుందన్న విషయాన్ని నిమ్మగడ్డ స్వయంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది కానీ... వారికి సీఈసీ పంపిన ఫిర్యాదులు మాత్రమే ఎవరి జిల్లావి వారికి కనిపిస్తాయి. దీనివల్ల సీఈసీ తనకు వచ్చిన ఫిర్యాదుల్లో కావాలనుకున్న వాటిని మాత్రమే కలెక్టర్లకు పంపించే అవకాశం ఉంటుంది. తనకు ఇష్టం లేని ఫిర్యాదుల్ని అక్కడే డిలీట్ చేసేయొచ్చు కూడా. ఎక్కడా నిఘా లేకుండా, ప్రభుత్వ అ«దీనంలో కాకుండా ఒక ప్రయివేటు వ్యక్తి మాదిరిగా ఇలా యాప్‌ను నిర్వహించటం అత్యంత ప్రమాదమన్నది ప్రజాస్వామ్య వాదుల మాట. సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటాయి. కానీ వేటికీ సంబంధం లేకుండా తనే సొంత యాప్‌ను తయారు చేయించుకుని, తన ఒక్కడి వద్దే లాగిన్ ఉంచుకుని ఈయన ఏం చేయాలనుకుంటున్నారు? అసలు పారదర్శకత అనే మాటకు అర్థమైనా తెలుసా? రాజ్యాంగబద్ధమైన పదవిని అడ్డంపెట్టుకుని ఇలా విలువల్ని కాలరాయటం కరెక్టేనా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. యాప్ తయారైందా.. లేదా.. అదీ రహస్యమే!! ఈ ఎన్నికల కోసం తానే ప్రత్యేక యాప్ తయారు చేయిస్తున్నట్టు చెప్పి నిమ్మగడ్డ ఏడాది కిత్రం పంచాయతీరాజ్ శాఖ తయారు చేయించిన నిఘా యాప్‌ను సైతం పక్కన పెట్టాలని ఆదేశాలిచ్చారు. అయితే, నిఘా యాప్‌కు బదులుగా ఆయన చెబుతున్న యాప్ ఇప్పటికే తయారైందా.. లేదా అన్నది తేల్చటం లేదు. గోప్యత పాటిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అనంతపురంలో శుక్రవారం విలేకరులు అడిగినప్పుడు ఇంకా ఆ యాప్ తయారు చేయించడం పూర్తి కాలేదనే చెప్పటం గమనార్హం. మరో పక్క పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా శుక్రవారం ప్రారంభమైంది. 3249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన్ల పోలింగ్ కూడా జరగబోతుంది. అంటే ఖచ్చితంగా మరో పది రోజులకు మించి సమయం లేదు. మరి ఈయన ఉద్దేశమేంటి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తయారు చేసి, తమ అ«దీనంలో నడిపిస్తున్న యాప్‌ను ఈయన వాడతారా? చివరి రోజు వరకూ ఎవ్వరికీ చెప్పకుండా ఇలాగే అందరినీ చీకట్లో ఉంచాలన్నది ఆయన వ్యూహమా? ‘ఔట్ సోర్సింగ్’ సిబ్బందిలో టీడీపీ హస్తం! ఇటీవలే కమిషన్ కార్యాలయంలో ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పిన నిమ్మగడ్డ... ఆ సెల్‌కు కేటాయించిన ఫోన్ నెంబర్లు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. ఎన్నికల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా నియమించిన ఉద్యోగులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో 15 మంది లోపే రెగ్యులర్ ఉద్యోగుల పనిచేస్తున్నారని.. మరో 20 మంది దాకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు సెల్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చూస్తున్నారు. వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసిన వాళ్లు కూడా ఉన్నారని సమాచారం. వారికే ఈ సెల్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సమాచారం. -
నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా..
‘పార్టీయేతర ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి కనుక ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులకు మద్దతుగా రాజకీయ పార్టీలు కటౌట్లు, హోర్డింగ్‌లు, గోడలపై పెయింటింగ్‌లు, బ్యానర్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయకూడదు’ – 2018 అక్టోబర్ 25న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు సాక్షి, అమరావతి: ప్రభుత్వం మారిపోతే ఎన్నికల నిబంధనలూ మారిపోతాయా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల విషయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక మరోలా నడుచుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రమేయాన్ని నిరోధించిన ఆయన ఇప్పుడు వాటి జోక్యాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నట్లు తాజా పరిణామాలతో వెల్లడవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని ప్రోత్సహించేలా వాటి నుంచి ఫిర్యాదులు స్వీకరించడం.. గ్రామాల్లో శాంతి, ఐక్యతకు దోహదం చేసే ఏకగ్రీవ ఎన్నికలపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందంటూ హెచ్చరికలు జారీ చేయడం ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మరోవైపు విశేషాధికారాల పేరుతో అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ, ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జోక్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని విశ్లేషిస్తున్నారు. చదవండి: విద్వేషాలకే వింత రాజకీయం రాజకీయాల రంగు పులిమేలా.. పార్టీ రహితంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావులేకుండా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించేలా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తప్పుబట్టడం విస్మయం కలిగిస్తోంది. రాజకీయాల రంగు పులుముకుంటే పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు దారి తీసి ప్రశాంతతకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించింది. చదవండి: సెన్సూర్ అధికారం ఎస్ఈసీది కాదు ఈ నేపథ్యంలో అసలు రాజకీయ పార్టీల ప్రమేయమే ఉండకూడదని తానే ఆదేశాలు జారీ చేసి మళ్లీ ఇప్పుడు ఏకగ్రీవ ప్రకటనలపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాయనడంపై అధికార యంత్రాంగం, నిపుణులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను తప్పుబట్టడమే కాకుండా ప్రకటనలిచ్చిన అధికారులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయడాన్ని విపరీత ధోరణిగా అభివర్ణిస్తున్నారు. 2018లో నెంబరు 145–ఎస్ఈసీ–బి2– ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలకు రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకూడదు. అంటే ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. టీడీపీ మేనిఫెస్టో.. ఉల్లంఘన కాదా? పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని ప్రోత్సహించేలా ఎస్ఈసీ వ్యవహరిస్తుండటాన్ని అలుసుగా తీసుకొని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మునుపెన్నడూ లేని వింత పోకడలకు తెర తీశారు. పార్టీయేతర ప్రాతిపదికన జరిగే పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు కనీసం బ్యానర్లు కూడా కట్టకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తే.. చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటర్లకు హామీలు గుప్పిస్తూ తాజాగా ఏకంగా మేనిఫెస్టోనే విడుదల చేయడం గమనార్హం. మరి ఇది ఎలాంటి ఉల్లంఘన కిందకు వస్తుందో ఉత్తర్వులిచ్చిన నిమ్మగడ్డే తేల్చాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏకగ్రీవాలకు నజరానాలు ఆనవాయితీనే
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం పెంపొందాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడుందో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ చెప్పాలన్నారు. ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై పలు ప్రశ్నలను సంధిస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి ఏమన్నారంటే.. నిమ్మగడ్డకు కంగారెందుకు? ► ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు జరగకూడదా? ఏకగ్రీవాలను అడ్డుకోవడమే మీ ఉద్దేశమా? రాష్ట్రంలోలో గ్రామీణ పాలన, సచివాలయ వ్యవస్థ, ఇళ్ల వద్దకే సంక్షేమ పాలనను ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కొనియాడుతుంటే ఎస్ఈసీని అడ్డుపెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ► ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్వాతంత్య్రం రాకముందు నుంచి ‘పంచాల’ పేరుతో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టీడీపీ హయాంలో ఏకగ్రీవాలను ఎందుకు తప్పుబట్టలేదు? అప్పటికే ఉన్న జీవోపై కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ► ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచనలు చేయడం దురదృష్టకరం. ఏకగ్రీవాలకు అస్కారం ఇవ్వరాదని బాబు టెలికాన్ఫరెన్సులో చెప్పిన మాటలనే ఎస్ఈసీ వల్లె వేశారు. ► ఏకగ్రీవాలు ఎక్కువైతే వ్యతిరేకిస్తామన్నట్లు నిమ్మగడ్డ అనడం రాజకీయం కాదా? ► ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారు? ► పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా, పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసి కూడా ఏకగ్రీవాలు ఫలానా పార్టీకి అనుకూలంగా, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాయనే అభిప్రాయాన్ని కలిగించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ► పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలనేందుకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో, ఏ చట్టంలో అది పొందుపరిచారో నిమ్మగడ్డ వెల్లడించగలరా? ► అధికారులతో ఎలాంటి సమస్యా లేదంటూనే.. తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవు అన్నట్లుగా కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా? ► సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌లకు ఎస్ఈసీ పంపిన 9 పేజీల అభిశంసన లేఖను తిరిగి ఎన్నికల కమిషన్‌కే పంపాలని నిర్ణయించాం. మార్చి 31 తరువాత నిమ్మగడ్డ రమేష్ చౌదరి టీడీపీలో చేరి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎన్నికల కమిషనరే చట్టాలను ఉల్లంఘించారు ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 కి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందని రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్ 2 (34) ప్రకారం ఎన్నికల జాబితా తయారు చేయడం, దానిని ప్రచురించడానికి ఏ సంవత్సరంలో జాబితా సిద్ధం చేశారో ఆ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీ (క్వాలిఫైయింగ్ డేట్)గా గుర్తిస్తారని తెలిపారు. సెక్షన్ 11 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అధికారి ఈ క్వాలిఫయింగ్ డేట్‌ను ఆధారంగా చేసుకుని పంచాయతీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తారని, ఈ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారికి అప్పగిస్తూ 2000 ఆగస్టు 4న అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. దీనినే ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. నిబంధనలకు ఎస్ఈసీ తిలోదకాలు.. 2019లో చట్టపరంగా ఈ ప్రక్రియను అనుసరించిన కమిషనర్ 2021 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ సమయంలో ఎందుకు తిలోదకాలు ఇచ్చారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2021 జనవరి 1 క్వాలిఫైయింగ్ డేట్ ప్రకారం పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను పక్కన పెట్టడంతో ఎన్నికల చట్ట నిబంధనలను సాక్షాత్తూ ఎన్నికల కమిషనరే ఉల్లంఘించినట్లు అవుతోందన్నారు. దీనికి ప్రభుత్వం, ఉద్యోగులను కారణంగా చూపడం సమంజసం కాదన్నారు. -
ఏకగ్రీవాల ప్రకటనపై అభ్యంతరాలు
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రకటనలున్నాయనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ‘ప్రభుత్వ ప్రకటనలను తప్పుబడుతూ నాలుగైదు రాజకీయ పార్టీలు కొత్త విషయాన్ని ఎన్నికల కమిషన్ ముందుకు తెచ్చాయి. ఎన్నికలు మొదలయ్యాక ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలు కమిషన్ పరిధిలోనే ఉంటాయి. ఈ ప్రకటనపై ఐ అండ్ పీఆర్ కమిషనర్ నుంచి సంజాయిషీ కోరా’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు. మీడియాతో నిమ్మగడ్డ సమావేశం వివరాలివీ.. అపరిమితమైతే పరిశీలనే సాధారణంగా జరిగే ఏకగ్రీవ ఎన్నికలకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతే నిశితంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేసే ఔత్సాహిక అభ్యర్థులకు అండగా నిలబడాలని కలెక్టర్లకు చెప్పా. ఇందుకు ఆటంకాలు కల్పిస్తే చర్యలు తీసుకోవాలని సూచించాం. తుది నిర్ణయం తీసుకోలేదు.. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయని, దాని మూలంగానే ఏకగ్రీవాలు అయ్యాయని ఆరోపణలున్నాయి. ఇవన్నీ కమిషన్ విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం ఏకగ్రీవాలు జరిగితే క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించాం. ఎన్నికలు సజావుగా జరుగుతాయని నాకు నమ్మకం ఉంది. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే సుప్రీం తీర్పును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని భావించి, అన్ని విషయాలు న్యాయస్థానాల ముందుంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. సంయమనం పాటించేలా చూడాలని కోరా ఇవాళ కలెక్టర్ల సమావేశం తర్వాత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఎన్నికల కమిషనర్‌ను వ్యక్తిగతంగా నిందించడం తగదని, ప్రభుత్వంలో ఉన్న అధికార పెద్దలు సంయమనం పాటించి ఎన్నికల కమిషన్ ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేయాలని గవర్నర్‌ను కోరా. ఈ విషయంపై సీఎస్‌కు గవర్నర్ సూచన చేసినట్లు తెలిసింది. మంత్రులందరికీ సీఎస్ చెప్పి ఉంటారు. కానీ సాయంత్రానికి ఓ మంత్రి.. ఎవరి ప్రాపకం కోసమో తాను ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నట్లు మాట్లాడడం బాధాకరం. అవి రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకం. ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నది వాస్తవమే. వాళ్లకు హానికరంగా ఉండేటట్లు నేనేమీ చేయలేదే. నేనేమీ వాళ్ల బదిలీ, క్రమశిక్షణ చర్యలు కోరలేదు. సస్పెండ్ చేస్తాననలేదు. కేవలం ‘సెన్సూర్’ చేశా. వారు మెరుగైన పనితీరు ప్రదర్శించి, పోకడలో మార్పు ఉంటే పునరాలోచించే అవకాశం ఉంటుంది. పొద్దున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణను గిరిజా శంకర్‌కే అప్పగించా. జిల్లాలో సమస్యలుంటే ఆయన్నే సంప్రదించాలని కలెక్టర్లకు సూచించా. నేను వారి ప్రతిష్ట, గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నించా. -
ఏకగ్రీవాలపై కమిషన్ కన్ను
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పునరుద్ఘాటించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాన్ఫరెన్స్ వివరాలపై కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అంకితభావంతో నిర్వహించాలన్నారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని, కమిషన్ విశేషాధికారాలను దుర్వినియోగం కానివ్వబోమని చెప్పారు. ‘గతం చూడొద్దు.. నేనూ చూడను.. ఎన్నికలు సజావుగా నడపడమే ధ్యేయంగా అందరూ పనిచేయాలి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహశీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించినా, ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించం. అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం’ అని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై తీవ్ర పదజాలంతో మాట్లాడినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. ప్రత్యేక యాప్‌తో పోలింగ్ పర్యవేక్షణ.. ఎన్నికల రోజు వెబ్‌కాస్టింగ్‌కు బదులుగా ప్రత్యేక యాప్ ద్వారా పోలింగ్ బూత్ బయట, లోపల జరిగే అంశాలపై దృష్టి సారిస్తామని ఎస్ఈసీ తెలిపారు. ఇందుకోసం కొత్త యాప్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లను, ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చని, వీటిని పరిశీలించేందుకు కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ ఎన్నికలలో వలంటీర్లను వినియోగించరాదని, వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సమన్వయంతో నిర్వహించుకుందాం: సీఎస్ ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో సమర్ధంగా నిర్వహించుకుందామని కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు పోలీసు బృందాలను పోలింగ్‌కు రెండు రోజుల ముందే సిద్ధం చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తొలివిడత పోలింగ్ 9వ తేదీన జరగనుండగా 7వ తేదీకల్లా విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ అందేలా ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్, ఎన్నికల ఫారాలను సిద్ధం చేయడం, బ్యాలెట్ బాక్స్‌లు బూత్‌లకు తరలింపు ప్రక్రియలో కలెక్టర్లకు పూర్తి స్థాయి అధికారాలుంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కలెక్టర్లు పంపే ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి శానిటైజర్లు, మాసు్కలు, గ్లౌజులు అందుబాటులో ఉంచుతామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ తెలిపారు. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి, తదుపరి పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందికి, అధికారులకు వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, ఏడీజీ సంజయ్ పాల్గొన్నారు. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవోలు, డీపీవోలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆదిత్యనాథ్ దాస్, గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ దాదాపు పావుగంట పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌తో ఆయన చాంబర్లో సమావేశమై చర్చలు జరిపారు. నేనే జిల్లాల్లో పర్యటిస్తా.. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలను రాష్ట్ర ఎన్నికల అథారిటీ హోదాలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ చూసుకుంటారని.. స్వేచ్ఛ, పారదర్శకంగా నిర్వహించే క్రమంలో తనకు అనేక ఇతర పనులు ఉంటాయని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్లు ఎవరూ తనతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని, వాటిని పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల సమయంలో తాను స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కోడ్, నిబంధనల అమలులో అధికారులెవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. మూడు జిల్లాల్లో షెడ్యూల్ మార్చాలని వినతి విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విడతల వారీగా ఎన్నికలు జరిపే మండలాలలో మార్పులు చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు కోరినట్లు తెలిసింది. అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన ప్రాంతాలలో చివరి విడతలో ఎన్నికలు జరిపేలా ఏర్పాట్లు చేశామని, అయితే నోటిఫికేషన్ రీషెడ్యూల్లో తొలి విడత ఎన్నికలను ఆఖరి విడతకు మార్చడం వల్ల సమస్య ఉత్పన్నమైనట్లు కలెక్టర్లు నిమ్మగడ్డ దృష్టికి తెచ్చారు. విజయనగరం కలెక్టర్ ప్రతిపాదన పట్ల నిమ్మగడ్డ సానుకూలంగా స్పందించారని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా పంపాలని సూచించినట్లు తెలిసింది. -
లక్ష్మణ రేఖ దాటొద్దు
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధ ప్రక్రియ. అందులో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరికీ లక్ష్మణ రేఖ ఉంటుంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారితో సహా ఎవరూ కూడా ఆ రేఖను అతిక్రమించకూడదు. అందరూ తమ పరిధిని గుర్తెరిగి సమన్వయంతో పని చేయాలి’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హితవు చెప్పినట్టు సమాచారం. ‘ఎన్నికల నిర్వహణ అన్నది ఒక్కరితో సాధ్యం కాదని.. యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని విశ్వాసంలోకి తీసుకుని సమన్వయం, సంయమనంతో వ్యవహరించాలి’ అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం యావత్తూ సమాయత్తమవుతున్న తరుణంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మంగళవారం ఏకపక్షంగా చర్యలకు సిఫార్సు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. నిమ్మగడ్డ తన పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా వ్యవహరించారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు నిబద్ధతతో పని చేస్తున్న ఉన్నతాధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. నిమ్మగడ్డ చర్యలు ఒక చెడు సంప్రదాయానికి తెరతీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను కలవాల్సిందిగా గవర్నర్ హరిచందన్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను ఆదేశించినట్టు సమాచారం. దాంతో నిమ్మగడ్డ బుధవారం రాజ్‌భవన్‌కు చేరుకుని దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యల గురించి గవర్నర్ ఆరా తీశారు. అనంతరం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఇద్దరిపై ఎందుకు ‘సెన్సూ్యర్’ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని గవర్నర్ ప్రశ్నించినట్టు సమాచారం. గవర్నర్ హరిచందన్‌తో సమావేశమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ నేరుగా ఎలా చర్యలు తీసుకుంటారు? ► నేరుగా క్రమశిక్షణా చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదు కదా అని గవర్నర్.. నిమ్మగడ్డకు గుర్తు చేసినట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న దృక్పథంతోనే ఉన్నతాధికారులు వ్యవహరించారని, అదేమీ తప్పుకాదని గవర్నర్ చెప్పినట్టు సమాచారం. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందున ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పంచాయతీ ఎన్నికల వాయిదా కోరాయి తప్ప, ఇతరత్రా కారణాలు లేవు కదా అని అన్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం వ్యవహారంపై తనకూ సమాచారం ఉందని గవర్నర్ చెప్పడంతో నిమ్మగడ్డ మరేమీ మాట్లాడలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► అయ్యిందేదో అయ్యింది.. ఇకనైనా భేషజాలు విడిచిపెట్టి అధికార యంత్రాంగాన్ని కలుపుకుని ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ సున్నితంగా అయినాసరే కచ్చితంగా చెప్పారని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. గవర్నర్ మాటలతో ఒకింత మార్పు! ► గవర్నర్ మాటలు నిమ్మగడ్డ రమేష్‌పై బాగానే ప్రభావం చూపించాయనిపిస్తోంది. ఆయనతో భేటీ అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తీరే ఇందుకు నిదర్శనం. సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్, పంచాయతీ రాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌లతో సహా ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగంతో రోజువారీ సమీక్ష, సమన్వయ బాధ్యతలను పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ నిర్వర్తిస్తారని, ఆయన ఆదేశాలను పాటించాలని నిమ్మగడ్డ.. కలెక్టర్లకు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ► సరైన సమయంలో గవర్నర్ జోక్యం చేసుకుని నిమ్మగడ్డ రమేష్‌కు తన పరిధి, పరిమితులను గుర్తు చేయడం ప్రభావం చూపింది. రాష్ట్రంలో ఉన్నతాధికారులతోపాటు యావత్ అధికార యంత్రాంగం మనోస్థైర్యం ఇనుమడించిందని అధికార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. -
ఎస్ఈసీ వ్యాఖ్యలు తమ నిబద్దతను శంకించేలా ఉన్నాయి..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వినియోగించుకుంటామంటూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిబద్దతని శంకించేలా ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ మండి పడ్డారు. గతంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారని, కరోనా పరిస్ధితుల దృష్ట్యా మాత్రమే తాము ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్ఈసీని కోరామన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహిస్తే ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులపై తాము ఎస్ఈసీకి వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్ర ఉద్యోగులను కించపరుస్తూ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వాడుకుంటామని చెప్పడంపై ఎస్ఈసీని ప్రశ్నించామన్నారు. అయితే ప్లాన్ బి కింద రాష్ట్ర ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు ఆలోచన చేశామని ఎస్ఈసీ వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేస్తామని గతంలో ఎస్ఈసీ ప్రకటించారని, వాటి విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రకటనలతో సరిపెట్టకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కరోనా నుంచి రక్షణ కల్పించాలని తాము ఎస్ఈసీని కోరామన్నారు. ఎస్ఈసీని కలిసిన వారిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్సి ఆస్కార్ రావు తదితరులు ఉన్నారు. -
ఎన్నికల విధుల్లో పాల్గొనండి
సాక్షి, అమరావతి: ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కోడ్ అమలు, ఉద్యోగుల విధుల గురించి చెప్పిన ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి కూడా వారికి వివరించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహించడం కష్టమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో బుధవారం జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తానని హమీ ఇచ్చారు. ఇక తమ భద్రతకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు పలు అనుమానాలు లేవనెత్తగా ఆయన నివృత్తి చేశారు. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. సమావేశానంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో మృతిచెందితే రూ.50 లక్షలు ఇవ్వాలి తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని.. కానీ, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా సోకి మృతిచెందితే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరామన్నారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయవద్దని.. ఆరోగ్య సమస్యలున్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. తాము ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉద్యోగులకు న్యాయం జరగలేదని, అయినా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి అడిగితే తమకు రాజకీయాలు ఆపాదించారని, గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించండి అని నినాదాలు చేయించారని తెలిపారు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవలేని వారు కూడా తమను విమర్శిస్తున్నారని, ఉద్యోగులతో వైరం మంచిది కాదని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ తమను వివాదంలోకి లాగిందని, తాము ఎప్పుడూ వారితో విభేదించలేదన్నారు. తమపై వ్యాఖ్యలు చేశాకే తాము వ్యాఖ్యలు చేశామని చెప్పారు. ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఎన్నికలకు సహకరిస్తాం ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పామని, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరగా తాను ఆ విషయాన్ని ఎన్నికల కమిషనర్‌తో చర్చిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరగా ఆయన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఇప్పటికీ ఉద్యోగులు ఎన్నికలకు సిద్ధంగా లేరని.. తమ సంఘం జిల్లాల సభ్యులు ఎన్నికలకు వెళ్లలేమని చెబుతున్నారని చెప్పారు. వారిని ఒప్పించి ఎన్నికలకు సహకరిస్తామని, కానీ.. ఉద్యోగులకు కోవిడ్ నుంచి పూర్తి రక్షణ కల్పించాల్సిందేనని కోరామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. ఎక్కువ వయసున్న ఉద్యోగులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరామన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటామని, పీపీఈ కిట్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారని, అవన్నీ జరిగేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
పోలింగ్ విధులకు కేంద్ర ఉద్యోగులు!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను పోలింగ్ సిబ్బందిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచించారు. తనకున్న విశేషాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిస్తూ నిమ్మగడ్డ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా కలెక్టర్లు మొదటి ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, రాష్ట్ర సహకార సంస్థల ఉద్యోగులనే ఎన్నికల విధులలో వినియోగించుకోవాలని నిమ్మగడ్డ ఆ ఉత్తర్వులో సూచించారు. అప్పటికీ సిబ్బంది సరిపోని పక్షంలోనే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను వినియోగించుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల విధులకు కేంద్ర ప్రభుత్వోద్యోగులను వినియోగించుకోవడానికి అవకాశమివ్వాలని కేంద్ర కేబినేట్ సెక్రటరీకి కూడా లేఖ రాసినట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఈనెల 27 లేదా అంతకంటే ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వపరంగా పూర్తి తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని కోరారు. -
ఏపీ: పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఎస్ఈసీ రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్ఈసీ -
గతేడాది ‘స్థానికం’ నోటిఫికేషన్ నాటికి ఒక్క కేసే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గతేడాది మార్చిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు జారీ చేసి కూడా కరోనా ఉందంటూ వాయిదా వేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం నాడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ప్రభావం ఏమాత్రం లేనప్పుడే పోలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేదని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పటితో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడే చాలా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. నాడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ నాటికి రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు ఉంది. ఇప్పుడు సగటున రోజుకు 170 నుంచి 180 వరకూ నమోదవుతున్నాయి. పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. లక్షలాది మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరి అప్పుడు వాయిదా వేసి ఇప్పుడెందుకు నోటిఫికేషన్ ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ఉద్యోగులు మరోవైపు వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ఈ సమయంలో ఎన్నికలు సరికాదని విన్నవిస్తున్నా మొండిగా వ్యవహరించడం వెనుక కొందరి రహస్య పాత్ర ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసులు లేనప్పుడు వాయిదా వేసి.. గత ఏడాది మార్చి 7వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సమయంతో పోలిస్తే కరోనా పరిస్థితులు ఇప్పుడే ఆందోళనకరంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో మర్కజ్ యాత్రికులు తిరిగి రావడం, వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు పెద్ద ఎత్తున వలస కార్మీకుల రాకతో క్రమంగా పెరిగిపోయాయి. గతేడాది మార్చిలో కరోనా కేసులు లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను మధ్యలోనే వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాజాగా కోవిడ్ సెకండ్ వేవ్ చెలరేగిన వేళ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా పరిస్థితులు ఇలా ► స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ గతేడాది మార్చి 7న విడుదలైంది. ఆ సమయానికి రాష్ట్రంలో నమోదైన కేసులు కేవలం ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. ► ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీ మార్చి 21 నాటికి రాష్ట్రంలో కేసులు 13 మాత్రమే ఉన్నాయి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు మార్చి 27న నిర్వహించనున్నట్లు షెడ్యూలు జారీ చేయగా అప్పటికి 13 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ► రెండో దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు సమయానికి అంటే మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 నాటికి 167 కేసులున్నాయి. అయితే ముందుగా ప్రకటించిన ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే అప్పటికి పోలింగ్ ముగిసేది. ► స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేసిన గత మార్చి 15వతేదీ నాటికి రాష్ట్రంలో నమోదైంది కేవలం 3 కేసులు మాత్రమే. ► తాజాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన జనవరి 23న రాష్ట్రంలో 172 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగటున వారానికి 1,260 కరోనా కేసులు నమోదవుతున్నాయి. -
నిమ్మగడ్డపైనే నిఘా పెట్టాలి
సాక్షి, అమరావతి: తనపై నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డీజీపీకి లేఖ రాశారని, అసలు నిఘా పెట్టాల్సింది ఆయనపైనేనని రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయనే ఎవరెవరినో కలుస్తున్నారని, ఈ విషయం అందరికీ తెలుసని చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనను బెదిరించినట్లు, తన ద్వారా ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ డీజీపీకి లేఖ రాయడం సరికాదన్నారు. ఆయన్ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాత్రమే తాను చెప్పానని, అవి ఆయన్ను ఉద్దేశించి కాదన్నారు. అయినా, తనపై నిఘా పెట్టినా అభ్యంతరం లేదన్నారు. తాను ఉద్యోగులు, వారి రక్షణ గురించి మాత్రమే మాట్లాడానని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమిటని అడిగామని చెప్పారు. 30 నెలలుగా ఏం చేశారు? ఎన్నికల కమిషనర్‌కి ప్రభుత్వానికి ఏదైనా ఉంటే వాళ్లే చూసుకోవాలని, వారి మధ్య జరిగే పోరాటంలో ఉద్యోగుల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వెంటనే ఎన్నికలు పెడితే వచ్చే లాభం, వ్యాక్సినేషన్ పూర్తయ్యాక జరిగితే వచ్చే నష్టం ఏమిటో ఎస్ఈసీ చెప్పాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. 30 నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలన ఉందని, ఇంతకాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నా వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వంటి నాయకులే సిద్ధంగా లేరని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారని.. సిద్ధంగా ఉన్న వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి హద్దుల్లో ఉండాలి టీడీపీ అధికార ప్రతినిధి తమ గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆయన హద్దుల్లో ఉండాలని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులను అడ్డగోలుగా వాడుకుంది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. సచివాలయం నుంచి బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టుకి ఉద్యోగుల్ని తీసుకెళ్లారని.. ఢిల్లీలో దీక్షలు చేసి అక్కడికి తమను తీసుకెళ్లారని.. నవ నిర్మాణ దీక్షలు చేసి వాటికి ఉద్యోగులను తరలించారని.. ఇలా టీడీపీ ప్రభుత్వం వాడుకున్నంతగా ఉద్యోగుల్ని ఎవరూ వాడుకోలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం అలాంటి ఒక్కదానిక్కూడా ఉద్యోగులను తీసుకెళ్లలేదని చెప్పారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అరవపాల్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌పై నిఘా పెట్టాలని తాము డీజీపీని కోరతామని చెప్పారు. తమపై మాట తూలితే సహించేది లేదన్నారు.