రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా | Telangana SEC Parthasarathi Tests Positive For COVID-19 | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా

Published Sat, Apr 10 2021 2:16 AM | Last Updated on Sat, Apr 10 2021 10:08 AM

Telangana SEC Parthasarathi Tests Positive For COVID-19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‌గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. కాగా ఈ నెల 28న నిమ్స్‌లో ఆయన కోవిడ్‌ టీకా తొలిడోసు వేసుకున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగా ఈ నెల 7న ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి పార్థసారథి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement