
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించవద్దని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు విశ్రాంత ఐజీ డాక్టర్ ఆలూరి సుందర్‌కుమార్ దాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఈ–మెయిల్ ద్వారా గవర్నర్‌కు వినతిపత్రం పంపారు.
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మంత్రిమండలి సిఫారసు మేరకు కాకుండా రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు మాత్రమే నియమించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని దాస్ తన వినతిపత్రంలో పేర్కొన్నారు.
► ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ నియామకం రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం జరగలేదన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందన్నారు.
► పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–200 కింద నియమితుడైన ఎన్నికల కమిషనర్.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియను చేపట్టలేరని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.
► నిబంధనల మేరకు నిమ్మగడ్డ రమేశ్ నియామకం జరగనందున ఆయనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమన్నారు.
మా తీర్పును అమలు చేయడం లేదెందుకు?
నిమ్మగడ్డ ధిక్కార పిటిషన్‌పై హైకోర్టు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నియామకం విషయంలో తామిచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తమ తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో అధికరణ 243(కే) ప్రకారం గవర్నర్‌కే అధికారం ఉంటుందన్న తమ తీర్పు మేరకు.. ఎన్నికల కమిషనర్‌గా కొనసాగే విషయంలో ఆయనను కలవాలని నిమ్మగడ్డకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సీజే జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.