
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అనుమతితోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన శనివారం గవర్నర్ హరిచందన్‌కు లేఖ రాసినట్లు రమేష్ సన్నిహితుల ద్వారా తెలిసింది.
అసెంబ్లీ తీర్మానాన్ని అడ్డం పెట్టుకొని.. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, దాన్ని తిరస్కరించాలని లేఖలో నిమ్మగడ్డ పేర్కొనట్టు సమాచారం. అసెంబ్లీలో అలాంటి తీర్మానం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడినట్లు తెలిసింది.