Local bodies elections
-
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ కొత్త ఎత్తులు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా తర్జనభర్జన పడుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించినా అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో ఆ పార్టీ నుంచి భారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కూటమి వైపు తిప్పుకొనేందుకు కుట్రలు పన్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపారు. అయినా కూటమి వైపు రావడానికి ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీకి పెడితే ఓడిపోవడం ఖాయమనే అంచనాకు కూటమి నేతలు వచ్చారు. సీఎం చంద్రబాబు రెండుసార్లు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో జరిపిన చర్చల్లో గెలవడానికి సరిపడా ప్రజాప్రతినిధులు లేరని తేలింది. సరిపడినంతమందిని కూటమి వైపు తెస్తేనే అభ్యర్ధిని ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మొదట్లో అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పోటీకి దింపాలని భావించారు. అయితే వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీకి దిగడం, మెజారిటీ ప్రతినిధులు వైఎస్సార్సీపీ వైపే ఉండడంతో పీలా గోవిందు చేతులెత్తేశారు. దీంతో గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన వ్యాపారవేత్త బైరా దిలీప్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన అయితే భారీగా డబ్బు ఖర్చు పెట్టి వైఎస్సార్సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తారని టీడీపీ సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లు దాఖలుకు గడువు ముగిసే లోగా అవకాశాలు మెరుగుపడితే దిలీప్‌ను పోటీకి దింపాలని చూస్తున్నారు. లేనిపక్షంలో పోటీకి దూరంగా ఉండడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. -
నేడు, రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళ, బుధవారాల్లో ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో నేడు, రేపు భేటీ కానున్నారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులు వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం ఉండదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్ వేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. 220 సర్పంచ్‌లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5364 వార్డు సభ్యుల ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎన్నికలైతే నిర్వహించాలి కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. విచారణను ధర్మాసనం.. రెండు వారాలు వాయిదా వేసింది. చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు -
సిపాయి ఎంపికపై హర్షం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి.. స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మరో సారి జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి కల్చరల్/శ్రీకాళహస్తి/రేణిగుంట/ఏర్పేడు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎంపికపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యరి్థగా ఎంపికయ్యారు. విషయం తెలుసుకున్న వన్నెకుల క్షత్రియ సంఘం నేతలు సంబరాల్లో మునిగి తేలారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడులో బాణసంచా పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు బుజ్జిరెడ్డి, బీసీ నాయకుఉల వేలాయు«ధం తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్తు రామారావు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మరో బీసీ నాయకుడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టం కట్టారు. ఇచ్ఛాపురంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఎంపిక చేశారు. అట్టడుగు వర్గాలకు చెందిన వారిని సీఎం ఒక్కొక్కరిగా రాజకీయంగా పైకి తీసు కొస్తున్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపిస్తూ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పస్తూనే.. పెద్దల సభలకు కూడా వారినే ఎంపిక చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూనే.. నాయకత్వ లక్షణాలున్న వారికి రాజ్యాధికారాన్ని అప్పగిస్తున్నారు. ఇప్పటికే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా చేయడంతో పాటు మంత్రి సీటుపై కూర్చోబెట్టారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట కాళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతా రాంను ఏకంగా రాష్ట్ర శాసన సభాపతిగా నియమించారు. అదే కాళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా విజయను జెడ్పీ చైర్‌పర్సన్‌గా, దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీగా చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావును మంత్రిని చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగానే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పాలవలస విక్రాంత్‌ను ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీని చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతిలకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించారు. తాజాగా యాద వ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును ఎమ్మెల్సీ చేస్తున్నారు. కళింగ వైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళను సుడా చైర్మన్‌గా, అదే సామాజిక వర్గానికి చెందిన అంధవరపు సూరిబాబును రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌ను చేశారు. సామాజిక వర్గాల సమతుల్యత ఎస్సీ, ఎస్టీ, రెడ్డిక తదితర సామాజిక వర్గాల వారికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలకు సంబంధించి సామాజిక సమతుల్యత పాటించారు. ఎలాంటి కుటుంబ చరిత్ర లేకపోయినా దక్షత ఉంటే సాధారణ వ్యక్తిని సైతం ఉన్నత పదవిలో కూర్చోబెట్టవచ్చని చేసి చూపించారు. తాజాగా నర్తు రామారావును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి మరో కీలక పదవి ఇచ్చినట్టు అయింది. -
ఎన్నికల బరిలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’
Actor Vijay's fans plan to contest urban local body polls: నటుడు విజయ్ రాజకీయ తెరంగేట్రంపై చాలాకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఎం. చంద్రశేఖర్ విజయ్ మక్కల్ ఇయక్కం అంటూ పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించారు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే విజయ్‌కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు చేసుకుంటున్నారనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడరాదని ఆంక్షలు విధించినా అభిమానులు గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం వారంతా విజయ్ను కలిసి ఫొటోలు దిగి పండుగ చేసుకున్నారు. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) ఇది రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని గురించి విజయ్ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుపై పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. -
22 స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతోనే
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈవీఎంల విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కాకినాడ కార్పొ రేషన్ ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు, నవంబర్‌లో నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 పుర పాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ రెండు విడతల్లోను బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసుల కా రణంగా రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకా కుళం, మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థల్లో ను, ఆముదాలవలస, రాజాం (శ్రీకాకుళం జిల్లా), తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి (పశ్చిమగోదావరి), వైఎస్సార్ తాడి గడప, గుడివాడ (కృష్ణా), బాపట్ల, పొన్నూరు, నర సరావుపేట (గుంటూరు), కందుకూరు, పొదిలి (ప్రకాశం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), బి.కొత్తకోట, శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈవీఎంల విధానంలోనే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వారం రోజుల కిందట తన కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఈవీఎంల విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికలు ఈవీఎంల విధానంలో నిర్వహించిన విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 8 వేల ఈవీఎంలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా నాలుగువేల బూత్‌లలోనే పోలింగ్ ఉంటుందని, ఇందుకు ఆ ఈవీఎంలు సరిపోతాయని వివరించారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలను ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లతో కలిపి ఉండే మిషన్లతో నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద వీవీప్యాట్లు లేని పాత ఈవీఎంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్‌ను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు కేసులపైనా దృష్టి ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మునిసిపల్‌శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. నెలరోజుల కిందట నీలం సాహ్ని మునిసిపల్‌శాఖ అకారులతో సమావేశమై ఆయా కేసుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. -
త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
అగర్తలా: త్రిపుర స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్థానిక సంస్థల్లోని మొత్తం 334 స్థానాలకు గాను 329 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)లోని మొత్తం 51 స్థానాలతోపాటు రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. ఏఎంసీలో ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎం పార్టీలు అనూహ్యంగా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయాయి. ఇంకా, ఖొవాయ్, బెలోనియా, కుమార్‌ఘాట్, ధర్మానగర్, తెలియమురా మున్సిపల్ కౌన్సిళ్లతోపాటు సబ్రూమ్ నగర్, అమర్‌పూర్‌నగర్ తదితర పంచాయత్‌లలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నవంబర్ 25వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. మతకలహాలు, ఘర్షణలు, కోర్టు కేసులు.. ఎన్నికలను ప్రశాంతంగా జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్థానిక సంస్థలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. సుపరిపాలనకే త్రిపుర ప్రజలు మొగ్గు: ప్రధాని త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో కూడిన రాజకీయాలకే త్రిపుర ప్రజలు మొగ్గు చూపారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో పోటీచేద్దాం: చంద్రబాబు
సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో గతంలో ఆగిపోయిన స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీచేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఆగిపోయిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే టీడీపీలో సందిగ్ధం నెలకొంది. గతంలో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటనే దానిపై కొంత అయోమయం నెలకొంది. చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో పోటీలో ఉంటున్నట్లు చెప్పడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురవడంతో టీడీపీ కుంగిపోయింది. దీంతో ప్రజా పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. చంద్రబాబు నిర్ణయంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయన్ని ధిక్కరించి అనేకచోట్ల పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ తర్వాత బద్వేలు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకోవడంపైనా పార్టీలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. వరుస ఓటములకు భయపడి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో గతంలో ఆగిపో యిన స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో కచ్చితం గా పోటీచేయాలని పార్టీ శ్రేణులు, నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పోటీకి దూరంగా ఉండి గతంలో చేసిన తప్పును మళ్లీ చేయవద్దని సీనియర్లు చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు చంద్రబాబు అంగీకరించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నేతలకు సూచించారు. -
దుర్మార్గం: వెంటపడి చీర కొంగు లాగేసి..
ఉత్తర ప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వేడి రాజేస్తున్నాయి. పార్టీల మధ్య, ప్రత్యర్థులతో కుమ్ములాటలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలిగించే ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. నామినేషన్‌ను అడ్డుకునేందుకు ఓ మహిళను చీరపట్టి లాగారు రాజకీయ ప్రత్యర్థులు. లక్నో: సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను ప్రత్యర్థులు చీర కొంగు పట్టిలాగారు. పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ ఆమె నామినేషన్ సెంటర్లోకి వెళ్లాల్సి ఉంది. అయితే గడువు దగ్గర పడుతుండడంతో ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లు ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను సైతం లాక్కున్నారు. అక్కడే ఉన్న కొందరు ఆమెకు మద్ధతుగా రావడంతో వాళ్లు ఆగిపోయారు. pic.twitter.com/TqepdO3y4W — Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021 తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఎకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఇక దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లేనని సమాజ్‌వాదీ పార్టీ అంటోంది. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్ ఖేరీలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఘటనపై స్పందించాడు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చెందిన గుండాలు చెలరేగిపోతున్నారు అంటూ క్యాఫ్షన్ ఉంచాడు. యూపీలో 825 పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గురవారం చాలాచోట్ల నామినేషన్ల పర్వంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు అందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. पीएम साहब और सीएम साहब इसके लिए भी बधाई दीजिए कि यूपी में आपके कार्यकर्ताओं ने ⭐कितनी जगह बमबाजी, गोलीबारी, पत्थरबाजी की ⭐कितने लोगों का पर्चा लूटा ⭐कितने पत्रकारों को पीटा ⭐कितनी जगह महिलाओं से बदतमीजी की कानून व्यवस्था की आंख पर पट्टी बांधकर, लोकतंत्र का चीरहरण चल रहा है। pic.twitter.com/6H9L390frB — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 8, 2021 -
తుదిదశ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దాష్టీకం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం.. నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్ప దని తెలియడం.. వెరసి పల్లెపోరు తుదిదశలోను ఆదివారం టీడీపీ మద్దతుదారులు చెలరేగిపోయారు. కుట్రలకు తెరతీసి వీరంగం వేశారు. ఓవైపు పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలె త్తేలా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబ డ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతుచూస్తా మంటూ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతోపాటు దాడులు చేశారు. మొదటి మూడు విడతల పోలింగ్‌లో ఓటమికి ప్రతిగా దాడులు కొనసాగి స్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను హత్యచేశారు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడిచేశారు. ప్రకాశం జిల్లాలో మహిళ మీద దాడిచేసి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండిళ్లపై దాడిచేసి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపైనా దాడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం ఐదో వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావును ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబురావు కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధుడు నడవలేకపోవడంతో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న ఫకీరయ్య సాయం చేశారు. దీన్ని తప్పుబట్టిన టీడీపీ మద్దతుదార్ల ఏజెంట్లు ఫకీరయ్యతో వాగ్వాదానికి దిగడమేగాక కుర్చీతో ఆయనపై దాడిచేశారు. దీంతో ఫకీరయ్య వర్గీయులు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన కుర్చీల దాడిలో ఫకీరయ్య గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు. దొంగ ఓట్లను.. ప్రశ్నించినందుకు.. సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్సీపీ అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారితో టీడీపీ వారు వాగ్వాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పోలీసులు లాఠీలు ఉపయోగించి చెదరగొట్టారు. లక్కరాజు గార్లపాడులో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ అభిమానులతో వాగ్వాదానికి దిగారు. పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడైన ప్రభాకర్‌తో ఆయన బంధువు సురేశ్ ఓటు వేయించి తీసుకెళుతుండగా పోలింగ్ కేంద్రం బయట ఉన్న టీడీపీ వర్గీయులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. దీంతో సురేశ్ పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రెండువర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలం తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ఒక గ్రామస్తుడిని కొట్టడంతో ఆగ్రహి ంచిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అమ రావతి మండలం ఉంగుటూరు పోలింగ్ కేంద్రం లోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డు కున్నారు. రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది చావపాడులో ఓటు వేయడానికి రావడంతో వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డుకున్నారు. నాలుగు కుటుంబాలపై దాడి సత్తెనపల్లి: దళితులు మా చెప్పుచేతల్లో ఉండాలి.. మాకే ఎదురు నిలబడతారా.. ఏమనుకుంటున్నారు.. అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో నాలుగు దళిత కుటుంబాలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేశారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాని ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారు వల్లెపల్లి శ్రీనివాసరావు సర్పంచి పదవికి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలవడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణసంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారురా.., కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి..’ అంటూ కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. టీడీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచుమర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను, మరో పదిమంది కర్రలు, రాళ్లతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓడిపోయామని దాడి.. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమాని తిప్పిరెడ్డి వెంకటరెడ్డి.. టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై 353 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీ అభిమానులు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా.. ఓటమి పాలైన సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమాని కె.నర్సిరెడ్డి గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వచ్చిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ఎన్నికల్లో రాజీచేస్తావా.. అంటూ చంపేసిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్ జిల్లాలో దారుణం బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండ లం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్‌రెడ్డి (52)ని దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచా యతీల సర్పంచులుగా వైఎస్సార్సీపీ అభిమా నులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకో లేని పలు గురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్‌రెడ్డితో ఘర్షణకు దిగారు. ‘నువ్వు రాజీచేస్తావా..’ అం టూ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. భాస్క ర్‌రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపో యారు. ఈ విషయం తెలిసి భాస్కర్‌రెడ్డి కుటుం బసభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకుగురైన భాస్కర్‌రెడ్డి గుడిసెకు నిప్పు.. మొక్కజొన్న తోట ధ్వంసం కుప్పంరూరల్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీవారు దారుణంగా ఓడిపోవడంతో తట్టుకోలేని టీడీపీ వారు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తు న్నారు. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పం చాయతీ ఊరునాయునిపల్లెలో శనివారం రెండు ఇళ్ల మీద దాడిచేయడమేగాక గుడిసెకు నిప్పం టించారు. మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. ఈ పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్ï Üపీ అభిమాని ఝాన్సీరాణి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్ర శేఖర్, పవన్‌కల్యాణ్, చంద్రబాబు, మురుగేష్, లక్ష్మీపతి, కదిరప్ప, మరో ఇద్దరు టీడీపీ వ్యక్తులు వైఎస్సార్సీపీ అభిమానులైన బాలాజీ, కృష్ణమూర్తి ఇళ్ల మీద దాడిచేశారు. కృష్ణమూర్తి పొలంలోని గుడిసెకు నిప్పుపెట్టి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన కృష్ణమూర్తి, బాలాజీ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ఆహుతైన కృష్ణమూర్తి గుడిసె, ధ్వంసమైన మొక్కజొన్న తోట మహిళపై దాడి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెంలో ఆదివారం తాను చెప్పిన వారికి ఓటు వేయలేదని ఓ మహిళపై గ్రామ టీడీపీ నాయకుడు దాడిచేశాడు. ఈ విషయమై బాధితురాలు బోడా మధుబాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఈనెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి విజయం సాధించారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ వ్యక్తులు రెండు రోజులుగా గ్రామంలో చిన్నచిన్న గొడవలకు దిగారు. ఈ క్రమంలో ఆదివారం బోడా శ్రీను.. వైఎస్సార్సీపీ మద్దతదారుడికి ఓటేశావంటు మధుబాలపై దాడిచేశాడు. దుర్భాషలాడుతూ ఆమె ఇంటి ముందు ఉన్న పందిరిని కూలదోసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశాడు. శ్రీను నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇంటిపై దాడిచేసి కూలదోసిన పందిరి -
గోపాలకృష్ణ, గిరిజాశంకర్‌ల బదిలీ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచన మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, తిరుపతి పట్టణ ఎస్పీని బదిలీ చేయడంతో పాటు కొత్తవారి నియామకం నిమిత్తం మూడేసి పేర్లతో ప్యానల్ పంపాల్సిందిగా ఎస్ఈసీ కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వీరిలో ఎస్ఈసీ సూచించిన వారిని ఆ విధుల్లో నియమించాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. -
ప్రజల ప్రాణాలతో ఈసీ చెలగాటం సరికాదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం ప్రజల ప్రాణాలతో చెలగాటమేనన్నారు. తమ్మినేని శనివారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. నిమ్మగడ్డ ప్రెస్‌మీట్ పొలిటికల్ ప్రెస్‌మీట్‌లా ఉందని, బాధ్యత గల అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి, ఏకగ్రీవాలు కూడా అయ్యాక ఎన్నికలు నిలిపేసిన ఎన్నికల కమిషనర్.. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వద్దని ప్రజలు, ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏమవుతుందో గుర్తెరగాలని హితవు పలికారు. నియంతృత్వ పోకడలకు విరుగుడు ప్రజాభిప్రాయ సేకరణ ఒక్కటేనన్నారు. ఎన్నికలపై ఈసీ పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. -
ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది
సాక్షి, అమరావతి: ‘ఎన్నికలు నిర్వహించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్‌కు ఉన్నట్టే... తమ ప్రాణాలను కాపాడుకునే రాజ్యాంగబద్ధ హక్కు ఉద్యోగులకూ ఉంది. ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తిగత పంతానికి పోకుండా ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. ‘రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు. వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరవుతారా?’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయని, అది పూర్తి కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2018లోనే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినప్పటికీ అప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎన్నికల కమిషనర్ నాడు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్ 23న కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడే నిమ్మగడ్డకు రాజ్యాంగబద్ధ అధికారాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ఎన్నికల విధులంటే వేల మందిని కలవాలి.. ఎన్నికలు బహిష్కరిస్తామని తాము అనలేదని, ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశాకే ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. ఎన్నికల కమిషనర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయాలి’ అని కోరారు. కరోనా కారణంగా న్యాయస్థానాలు సైతం ఆన్లైన్ ద్వారానే వాదనలు వింటున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో వేలాదిమందిని కలవాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, తీర్పు ఎలా వచ్చినా ఉద్యోగుల అభిప్రాయం మాత్రం ఇదేనన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయొద్దని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోందని, తాము మాత్రం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నామని వివరించారు. -
మొండిగా ముందుకెళ్తే బహిష్కరిస్తాం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో కోరాయి. లేదంటే ఎన్నికల విధుల్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశాయి. మొండిగా ముందుకెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించాయి. శనివారం విజయవాడలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యి.. ఎస్ఈసీ తీరుపై చర్చించారు. కరోనా సమయంలో ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయా సంఘాల నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రోజుకొక కేసు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు వందలు, వేలల్లో కరోనా కేసులు వస్తున్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు. వెంటనే ఎన్నికలు నిలుపుదల చేయాలి. ఎన్నికల కమిషనర్ మొండిగా ముందుకువెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటి? తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉద్యోగుల్లో 20 – 30 శాతం మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి వుంటుంది. వారందరి ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు సరికాదు. – చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఏకపక్ష నిర్ణయం సరికాదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించలేం. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలకం. ఇప్పటికే 150 మంది రెవెన్యూ ఉద్యోగులు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని పంతం నెగ్గించుకోవడం కోసం ఎస్ఈసీ.. కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. ఎన్నికలకు సిద్ధంగా లేమని సీఎస్ చెప్పినా నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి? – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికల విధుల్లో పాల్గొనడం కష్టం వరదలు, బందోబస్తు విధులు నిర్వర్తిస్తూ 109 మంది పోలీసులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 25 శాతం మంది పోలీసు సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. 75 శాతం మంది పోలీసులే విధులు నిర్వర్తిస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహించాలి. – జనకుల శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు వాయిదా వేయండి ఎనిమిది నెలలుగా కంటి మీద కునుకు లేకుండా పని చేశాం. వ్యాక్సిన్ వస్తుందనే సంతోషంలో ఉండగా దాన్ని తుడిచి వేసేలా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం బాధాకరం. ఇప్పటికే ఎంతో మంది రెవెన్యూ ఉద్యోగులు చనిపోయారు. కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాల్సిందే. – కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాకూ జీవించే హక్కు ఉంది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం మాకూ జీవించే హక్కు ఉంది. కరోనాకు మమ్మల్ని బలి చేయొద్దు. మహిళా ఉద్యోగులుగా ఎన్నో కష్టాలు పడుతూ పని చేస్తున్నాం. విధులు ముగించుకుని ఇంటికి వెళితే పక్కనున్న వాళ్లు మాతో మాట్లాడటానికి భయపడుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ రాకమునుపే ఎన్నికలకు ఎందుకు అంత తొందర? – ఎం మాధురి, తహశీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్ని బహిష్కరిస్తాం ఏకపక్షంగా స్థానిక ఎన్నికలకు ఇచి్చన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోకపోతే ఎన్నికల్ని బహిష్కరిస్తాం. వ్యాక్సినేషన్‌తోపాటు ఎన్నో ఏళ్లుగా టీచర్లు ఎదురు చూస్తున్న బదిలీల కౌన్సిలింగ్ ఆగిపోతుంది. అందువల్ల ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదు. – గిరిప్రసాద్, మల్లు శ్రీధర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వ్యవస్థ కోసం పనిచేయాలి ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరు. ప్రభుత్వ అభ్యర్థనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదు. ఎన్నికల కమిషన్ ఉన్నది వ్యక్తుల కోసం కాదు. వ్యవస్థ కోసం పనిచేయాలి. – సుదీర్‌బాబు, ఉపాధ్యాయ సంఘాల నేత కొత్త రకం కరోనా వణికిస్తోంది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఓ వైపు బ్రిటన్, అమెరికా వంటి దేశాలు కొత్తరకం కరోనాతో వణికిపోతున్నాయి. అలాంటి కొన్ని కేసులు మన రాష్ట్రంలోనూ నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలని అనుకోవడం సమంజసం కాదు. – డా.జయదీర్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ ప్రజారోగ్య పరిరక్షణకు అడ్డంకి ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎన్నికల ప్రక్రియ చేపట్టడం సమ్మతం కాదు. వైద్య, ఆరోగ్య, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ వంటి శాఖలు వ్యాక్సిన్ పంపిణీ విధులలో నిమగ్నమైన తరుణంలో ఎన్నికలు కచ్చితంగా విఘాతం కలిగిస్తాయి. ప్రజారోగ్య పరిరక్షణకు ఎన్నికల ప్రక్రియ తీవ్ర అడ్డంకిగా మారుతుంది. – కేఆర్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందరి నోటా అదే మాట కరోనా భయపెడుతున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూచిపూడి మోహన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామల సింహాచలం, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.బాలభాస్కర్, డి.ప్రవీణ్, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాబా, రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్, ప్రభుత్వం డ్రైవర్ల సంఘం సంపాని శ్రీనివాసరావు తదితరులు ఎస్ఈసీ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిమ్మగడ్డకు ఉద్యోగుల ప్రాణాలు పట్టవా?
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ నిమ్మగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని, ఎస్ఈసీకి ఉద్యోగుల ప్రాణాలు ఎస్ఈసీకి పట్టవా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వ్యాక్సినేషన్ పంపిణీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. నిమ్మగడ్డ పునరాలోచించి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ( ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో) ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ దుర్మార్గంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేమని ఉద్యోగులు చెప్తున్నారు.. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో నిమ్మగడ్డ నిర్ణయం సరికాదు’’ అన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. ‘‘ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదు. చంద్రబాబు చెప్పిందే నిమ్మగడ్డ చేస్తున్నారు. ఎస్ఈసీ నిర్ణయంతో ప్రజలు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు’’ అన్నారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘కరోనా బారిన పడి 109 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహిస్తే మంచిది’’ అని అన్నారు. -
నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.(చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. -
మళ్లీ ఏకపక్ష నిర్ణయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేశారు. విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్‌తో అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌లు సమావేశమై దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోందని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని, ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం అనుకూల వాతావరణం లేదని వివరించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని వి/æ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కోవిడ్ కేసు నమోదైనప్పుడు దాన్ని కారణంగా చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేస్తూ గతేడాది మార్చి 15న ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన నిమ్మగడ్డ తాజాగా వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అంతా తీరిక లేకుండా ఉన్న తరుణంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం పట్ల ఉద్యోగ వర్గాలు విస్తుపోతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోందని, దాని ప్రభావం దేశంపైనా, రాష్ట్రంపైనా ఉంటుందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అధికార యంత్రాంగం అంతా ఈ విధుల్లో చురుగ్గా నిమగ్నమైన తరుణంలో ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ నిమ్మగడ్డ ముందే నిర్ణయించుకున్న ప్రకారం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం చేసిన వి/æ్ఞప్తిని తోసిపుచ్చుతూ షెడ్యూలు విడుదల చేయడాన్ని బట్టి నిమ్మగడ్డ ఏకపక్ష వైఖరి, వివాదాస్పద నిర్ణయాలు తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. హైకోర్టు ఉత్తర్వులు బుట్టదాఖలు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో అక్టోబర్ 28న ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా అందుకు అనువైన పరిస్థితులు లేవని, ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఏర్పడగానే తెలియజేస్తామని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ లిఖితపూర్వకంగా తెలియచేశారు. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా ఈ కార్యక్రమంలోనే నిమగ్నమవుతారని.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు.. సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి మూడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఐదో తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో 7వతేదీన ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియచేసింది. వ్యాక్సిన్ సన్నద్ధతపై 11న ప్రధాని సమావేశం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమయ్యాయని, దీనిపై ఈనెల 9న కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని.. ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారని.. ఈ నేపథ్యంలో ఈనెల 13 వరకూ ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్ సన్నద్ధత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని.. అప్పటివరకూ సమావేశాన్ని వాయిదా వేయాలని ఎస్ఈసీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా శుక్రవారమే సంప్రదింపులకు హాజరు కావాలని, లేదంటే తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటానని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్షంగా తన విధానాన్ని వెల్లడించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఎస్ఈసీ నిమ్మగడ్డతో సమావేశమైంది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆవశ్యకతను వివరించి కనీసం వ్యాక్సినేషన్ మొదటి దశ పూర్తయ్యే వరకైనా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడం గమనార్హం. తన ఉత్తర్వులను తానే ఉల్లంఘించిన వైనం.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2019 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా అధికారులు ఓటర్ల జాబితాను రూపొందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించి 2020 తాజా జాబితాను రూపొందించింది. తాజా జాబితాలో ఉన్న ఓటర్లకూ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేలా 2020 జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపొందించాలని.. ఆ మేరకు వార్డులను విభజించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, 13 జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ 2020 నవంబర్ 17న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితా రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఓటర్ల జాబితా సిద్ధం కాకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు జారీ చేయడం ద్వారా నిమ్మగడ్డ తాను జారీ చేసిన ఉత్తర్వులను తానే ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. దీన్నేమంటారు.? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిశాక, పురపాలక ఎన్నికల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముగిశాక కరోనా సాకుతో మార్చి 15న అర్ధాంతరంగా ఆ ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఆ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుండా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఆయన వ్యవహారశైలి ఎంత వితండంగా, ఏకపక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు విడతల్లో ‘పంచాయతీ’ పోరు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 5న తొలివిడత 9, 13, 17వ తేదీల్లో విడతలవారీగా పూర్తి 17న ఓట్ల లెక్కింపు.. అదే రోజు సర్పంచి,ఉప సర్పంచి ఎన్నికలు.. నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ వర్తిస్తుందని ఎస్ఈసీ ఉత్తర్వులు -
‘పంచాయతీ’ పోరు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం షెడ్యూల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులంతా ఆ విధుల్లో నిమగ్నమయ్యారని, ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి లిఖితపూర్వకంగా తెలియజేసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ ఏకపక్షంగా షెడ్యూల్‌ను ప్రకటించడం గమనార్హం. ఫిబ్రవరి ఐదో తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికలు, 9, 13, 17వ తేదీల్లో మరో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు కౌంటింగ్, సర్పంచి, ఉప సర్పంచి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 నుంచి, మిగతా విడతల ఎన్నికలకు ఈ నెల 29, ఫిబ్రవరి 2, 6వ తేదీల నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నేటి నుంచి ఎన్నికల కోడ్: ఈనెల 9 (శనివారం) నుంచే ఎన్నికల నిబంధనావళి (కోడ్) అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కోడ్ వర్తిస్తుందని, పట్టణ ప్రాంతాల్లో వర్తించదన్నారు. -
స్థానిక ఎన్నికలపై సంప్రదింపులు జరపండి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో.. ఇరుపక్షాలు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న నాటినుంచి మూడురోజుల్లో సంప్రదింపులు మొదలు పెట్టాలని ఇరుపక్షాలను ఆదేశించింది. సంప్రదింపుల తేదీ, వేదికలను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్యకార్యదర్శుల స్థాయికి తగ్గని అధికారులు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాలని స్పష్టం చేసింది. కోవిడ్–19కు సంబంధించి వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలు తదితరాలన్నింటినీ కూడా కమిషన్ ముందు ఉంచవచ్చునంది. ప్రభుత్వం తన వాదనలను లిఖితపూర్వకంగా కమిషన్ ముందు ఉంచవచ్చునని, అందుకు మద్దతుగా ఉన్న రికార్డులను కూడా సమర్పించవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి మంగళవారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతనెల 17న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గతవారం విచారణ జరిపిన జస్టిస్ శేషసాయి.. ఇరుపక్షాలు సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ దిశగా ఉత్తర్వులు జారీచేస్తానని చెప్పిన ఆయన మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తన ఉత్తర్వులను కోర్టు హాలులో చదివి వినిపించారు. కరోనా కారణంగా మొత్తం మానవాళి ఎంతో బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఎన్నికల కమిషనర్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ చెప్పిన వాదనలను రికార్డ్ చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇరుపక్షాలు సంప్రదింపుల ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఇంకేమైనా ఈ ఉత్తర్వులకు జతచేయాల్సి ఉందా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణ నెల గురించి కూడా కమిషన్ వద్ద లేవనెత్తే వెసులుబాటు ఇవ్వాలని తమ వాదనల సందర్భంగా కోరామని గుర్తుచేశారు. రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌ను ప్రారంభించనుందన్నారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఈ డ్రై రన్ జరగనుందని, అందులో మన రాష్ట్రం కూడా ఉందని చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వివరాలన్నింటినీ సంప్రదింపుల సమయంలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఈ ఆదేశాల ద్వారా ప్రభుత్వ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికలపై కూర్చొని మాట్లాడుకోండి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏకపక్ష నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇరుపక్షాల (ప్రభుత్వం, ఎస్ఈసీ) అధికారులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. సంప్రదింపుల ప్రక్రియ జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనా టీకాల ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అప్పుడు స్థానిక ఎన్నికలు సాధ్యం కాదన్న అభ్యంతరాలన్నింటినీ ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సమస్య పరిష్కారం కావడం అందరికీ మంచిదని, అంతిమంగా అందరికీ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఇతర అంశాలేవీ ఈ కోర్టుకు అవసరం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి స్థాయికి తగ్గని హోదా కలిగిన ముగ్గురు అధికారుల బృందం ఎన్నికల కమిషన్‌ను కలవాలని సూచించింది. సమావేశం వేదికను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని పేర్కొంది. సంప్రదింపులు జరిపి సామరస్యపూర్వకంగా పరిష్కారానికి రావాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అదే రోజు సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అభ్యంతరాలన్నీ ఎస్ఈసీ ముందు ఉంచండి... కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారని విచారణ సందర్భంగా జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని కూడా కోర్టు దృష్టికి తెచ్చారన్నారు. ఈ వివరాలన్నింటితో పాటు అభ్యంతరాలను కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మూడు రోజుల్లోపు ఎన్నికల కమిషన్ ముందుంచాల్సి ఉంటుందని తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారమే ముందుకు.. దీనిపై ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ ఎన్నికల కమిషనర్ మొత్తం ప్రక్రియను ముగించేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల తేదీ ఇంకా నోటిఫై చేయలేదని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణ నెలను నిర్ణయించేశారని ఏజీ పేర్కొనడంతో నెలతో తమకు సంబంధం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలైనా ఎన్నికల కమిషన్ ముందు ఉంచవచ్చని స్పష్టం చేశారు. సంప్రదింపుల విషయంలో కోర్టు సూచించిన ప్రతిపాదనకు తమకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ తెలిపారు. సదుద్దేశంతో చేపట్టాలి.. సంప్రదింపుల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, స్పష్టతతో చేపట్టాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఫిబ్రవరి నెలపై కూడా చర్చించాలన్నారు. తేదీలకే పరిమితం కాకూడదన్నారు. అన్ని అంశాలపై చర్చిస్తామంటే సంప్రదింపులకు అభ్యంతరం లేదన్నారు. సంప్రదింపుల ప్రక్రియ మొక్కుబడిగా ఉండరాదని, నిజమైన స్ఫూర్తి, సదుద్దేశాలతో చేపట్టాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి విచారణను వాయిదా వేశారు. -
కేరళ ‘స్థానికం’లో ఎల్డీఎఫ్ జయకేతనం
తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఫ్) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం.. ఎల్డీఎఫ్ 514 గ్రామ పంచాయతీల్లో పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం కార్పొరేషన్ ఎల్డీఎఫ్ పరమైంది. కేరళలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు నిరాశే మిగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ వంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి తాజా ఎన్నికల ఫలితాలు ఊరట కలిగించాయనే చెప్పారు. కేరళలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ప్రభుత్వం కోరినట్లు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై గత శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో చాలా లోతుగా విచారణ జరపాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఎన్నికలను పూర్తి చేయలేదు. తర్వాత 2019లో రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలవగా.. అందులో ధర్మాసనం పలు ఆదేశాలిచ్చింది. పర్యవసానంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ కోవిడ్‌వల్ల వాయిదా పడింది. ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఈ కోర్టు అడ్డుకోగలదా? అలా అడ్డుకోవడం ధర్మాసనమిచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అన్నది పరిశీలించాలి. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందా? లేక కేవలం వాయిదా పడిందా? అన్నదీ పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైవుంటే.. ఎస్ఈసీ ఉత్తర్వులపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వవచ్చా? అన్నదీ పరిశీలించాలి. ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్ఈసీ ఇటీవల జారీచేసిన ప్రొసీడింగ్స్ హేతుబద్ధమైన అంశాల ఆధారంగా జారీచేసింది కాదని ఏజీ చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని సంప్రదించాకనే నిర్ణయించామని ఎస్ఈసీ న్యాయవాది అంటున్నారు. కాబట్టి ఈ దశలో ఎస్ఈసీ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనా? కావా? అన్నదానిని ఈ కోర్టు తేల్చజాలదు. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని నిర్ణయిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను ఎన్నికల కమిషనర్ ఈ కోర్టుకు తప్పక వివరించాలి. పైన చెప్పిన అంశాలన్నింటినీ తేల్చేందుకు ఎస్ఈసీ నుంచి పూర్తిస్థాయి కౌంటర్ అవసరం. తుది ఉత్తర్వులిచ్చేముందు ఈ మొత్తం వ్యవహారంలో లేవనెత్తిన పలు అంశాల వాస్తవికతపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కారణాలరీత్యా ప్రస్తుత దశలో ప్రభుత్వం కోరినట్టుగా మధ్యంతర ఉత్తర్వులివ్వలేమన్నారు. -
‘స్థానికం’పై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అనుమతితోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన శనివారం గవర్నర్ హరిచందన్‌కు లేఖ రాసినట్లు రమేష్ సన్నిహితుల ద్వారా తెలిసింది. అసెంబ్లీ తీర్మానాన్ని అడ్డం పెట్టుకొని.. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, దాన్ని తిరస్కరించాలని లేఖలో నిమ్మగడ్డ పేర్కొనట్టు సమాచారం. అసెంబ్లీలో అలాంటి తీర్మానం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ నిలుపుదలపై నిర్ణయం వాయిదా
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఉత్తర్వులపై న్యాయస్థానం సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లోగా నిర్వహించాలని 2018లోనే హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిందన్నారు. ఎన్నికల వాయిదాకు అప్పటి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను హైకోర్టు తోసిపుచ్చిందన్నారు. అయితే న్యాయస్థానం ఆదేశించిన విధంగా ఎన్నికల నిర్వహణలో కమిషన్ విఫలమైందని నివేదించారు. అనంతరం 2020లో ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసిందని తెలిపారు. ఆ తరువాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వద్దనేందుకు సహేతుకమైన కారణం ఉందని, ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, దీని తరువాతే మిగిలినవని తేల్చి చెప్పారు. షెడ్యూల్ రాకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా మొదలవుతుంది? పరిపాలనాపరమైన కారణాల వల్ల గతంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రమైనదని, ఫలానా సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎవరూ శాసించలేరన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు స్పందిస్తూ ఎన్నికల షెడ్యూల్ రాకుండా ప్రక్రియ ఎలా మొదలవుతుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఏజీ శ్రీరామ్ నివేదించారు.