
సాక్షి, సంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించడం వల్ల రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందని పేర్కొన్నారు.
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే బాగుటుందని తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, మాజీ సీఎల్పీ నేత షబ్బీర్ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, వంశీచందర్ రెడ్డి, సలీమ్ తదితరులు పాల్లొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment