తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది: ఉత్తమ్‌ | Uttam Kumar Reddy Congratulates To TPCC New Committee | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది: ఉత్తమ్‌

Published Tue, Jul 6 2021 4:42 PM | Last Updated on Tue, Jul 6 2021 7:07 PM

Uttam Kumar Reddy Congratulates To TPCC New Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పని చేసిన కార్యకర్తలు, నాయకులు ఎన్నో త్యాగాలు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోలీసుల వేధింపులను కూడా తట్టుకొని నిలబడ్డ ప్రతి కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ నియమించిన తెలంగాణ పీసీసీ కొత్త కమిటీకి అభినందనలు తెలియజేశారు.

సుదీర్ఘ కాలం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 119 నియోజకవర్గ స్థాయిలో పని చేసిన కార్యకర్తలు, నాయకులుఉ ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండకపోయినా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, క్షేత్ర స్థాయిలో, సంస్థాగతంగా పార్టీ బలమే కార్యకర్తలని గుర్తుచేశారు. కార్యకర్తల చెమటతోనే ఇన్నాళ్లు పార్టీ నిలబడిందని ఉత్తమ్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement