RC kuntiya
-
మాణిక్యమా.. చాణక్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి మాణిక్యం ఠాగూర్ ఏమైనా మ్యాజిక్ చేయగలరా.. చాణక్యంతో కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలోకి తీసుకురాగలరా? వచ్చీరాగానే వచ్చిపడిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ నావను ఏవిధంగా నడిపించగలరు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్న హాట్‌హాట్ చర్చ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఆర్.సి.కుంతియా స్థానంలో నియమితులైన ఈ తమిళనాడు లోక్‌సభసభ్యుడు మాణిక్యం ఠాగూర్ పని అంత సులవేమీ కాదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది. ఈయన పనితీరు రాష్ట్ర కాంగ్రెస్‌ను గాడిలో పడేస్తుందా? తలపండిన నేతలున్న రాష్ట్రంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి నడపడం సాధ్యమవుతుందా? రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి బాటలోనే టీపీసీసీ అధ్యక్షుడిని కూడా మారుస్తారా? తాజాగా పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ‘మూడు’ను బట్టి... కుంతియా ఇన్చార్జిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిన పెద్ద విజయాలేమీ లేవు. ఆయన ఓ మూసలో వెళ్తారనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరిగేది. అందుకే వేటు పడి ఉంటుందేమోననే చర్చ ఉంది. కానీ, మాణిక్యంపై మాత్రం ఇందుకు భిన్నమైన చర్చ జరుగుతోంది. మాణిక్యం విద్యార్థి సంఘం నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, తమిళనాడు లాంటి రాష్ట్రంలో పార్టీ తరఫున రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన టీపీసీసీ విషయాలను సులువుగానే ఒంటబట్టించుకుంటారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కలిపి... రాష్ట్రంలోని సగానికిపైగా నియోజకవర్గాల్లో మరోసారి ప్రజల తీర్పు రానుంది. ఈ తీర్పు ఆయనతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తును కూడా నిర్దేశించనుంది. జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం ఏది? తాజా పునర్వ్యవస్థీకరణలో ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు. ఎప్పటిలాగే ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డిని సీడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా నియమించిన సోనియా ఇతర నాయకులను పరిగణనలోకి తీసుకోలేదు. అటు ఇతర రాష్ట్రాలకు ఇన్‌చార్జీలుగాకానీ, పార్టీ ప్రధాన కార్యదర్శులుగాకానీ, ఇతర కమిటీల్లో కానీ రాష్ట్రానికి చెందిన నేతలనెవరినీ సోనియా నియమించలేదు. పార్లమెంటు సమావేశాల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఏఐసీసీలో చర్చ ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అనుయాయులుగా పేరొందిన ఒకరిద్దరు నేతలు డోలాయమానంలో పడ్డారు. కానీ, వారు కూడా సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా ఉన్నందున ఆజాద్ ప్రభావం రాష్ట్రంలో కనిపించే అవకాశమేమీలేదని తెలుస్తోంది. -
ఆ రోజు అలా మాట్లాడి తప్పు చేశా!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా గురించి గతంలో బహిరంగంగా మాట్లాడి తప్పు చేశానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పార్టీకి నష్టం జరగకూడదనే ఆలోచన, ఆవేదనలే తనను అలా మాట్లాడించాయని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు వద్దని, అందరినీ కలుపుకుని వెళ్లాలని మాత్రమే చెప్పానని, అయినా తాను చేసింది తప్పేనని అంగీకరించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ నేతలకు ఏదైనా సమస్య ఉంటే అంతర్గత వేదికల్లో మాత్రమే మాట్లాడాలన్న కుంతియా సూచన సరైందేనని, పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడానికి, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి సంబంధం లేదన్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసులోనే జైలుకు వెళ్లారని, ఇప్పుడు జైలుకు వెళ్తే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతాననే ఆలోచనతో జైలుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానులు వారు అభిమానించే వారికి పీసీసీ అధ్యక్ష పదవి రావాలనుకోవడంలో తప్పులేదని, అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి అధిష్టానం ఎవరికి ఇచ్చినా అందరూ సహకరించాలని కోరారు. బలమైన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, టీఆర్ఎస్ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. -
30న భారత్ బచావో ర్యాలీ: కుంతియా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ బచావో ర్యాలీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఆర్సీ కుంతియా కోరారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై నిర్వహించిన సమావేశంలో హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారత్ బచావో నిరసన కార్యక్రమం గురించి చర్చించామని అన్నారు. అలానే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత దేశ ప్రగతి, దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగంపై కూడా చర్చించామని, సమావేశంలో మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఈ నెల 25 వరకు అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25 వరకు భారత్ బచావో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ఢిల్లీలో ఈ నెల 30న తలపెట్టిన భారత్ బచావో ర్యాలీకి తెలంగాణలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రావాలని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్ బచావో నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఈ మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. -
విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం ఇందిరా భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బడే భాయ్.. ఛోటా భాయ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సచివాలయాన్ని కూల్చి వేయాలని చూస్తుంటే .. మోదీ పార్లమెంట్ కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశ ఆర్థిక పరిస్థితిని హృతిక్ రోషన్ సినిమా కలెక్షన్లతో పోల్చడాన్ని కుంతియా తప్పుబట్టారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం కేసీఆర్ పట్టించుకోక పోవడంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెజార్టీ రైతులకు రైతుబంధు డబ్బులు అందలేదన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అదేవిధంగా ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలతో పాటు 16న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను జనంలోకి ఉద్యమ రూపంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోమాలో.. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు వెంటిలేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు. మోదీ విధానాలు అన్నీ సామాన్యులకు వ్యతిరేకంగా ఉండడంతో.. పారిశ్రామిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆర్సీ కుంతియా, హెచ్‌కే పాటిల్, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బోసు రాజు, దాసోజు శ్రవణ్, బొల్లు కిషన్, కోదండ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ప్రజా పోరాటాలకు..కాంగ్రెస్ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ దీనిపై ప్రజా పోరాటాలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ అవినీతిపై పూర్తి సమాచారం, ఆధారాలు సేకరించాలనే నిశ్చయానికి వచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించి ఆధారాల సేకరణకు వీలుగా ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా 26 మందితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, విజయశాంతి, చిన్నారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మల్లురవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, అమీర్ జావేద్‌లను సభ్యులుగా నియమించారు. అవినీతిపై మెమోరాండం రూపంలో రాష్ట్రపతి, గవర్నర్, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమర్పిస్తుంది. -
హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో.. రాజకీయ పార్టీలు ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చినా.. కాంగ్రెస్‌కు ఎవరు పోటీ కాదని, కచ్చితంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా అన్నారు. గురువారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రచారం కోసం గాంధీజీ కళ్ళద్దాలను, గాంధీ పేరును వాడుకుంటారు కానీ, గాడ్సేకు గుడి కడతారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ ఏడు ఎంపీ సీట్లు ఓడిపోవడంతో.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ భయపడుతుందని కుంతియా వ్యాఖ్యానించారు. అందుకే సీపీఐ మద్దతు కోరుతోందని అన్నారు. ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కోదాడలో కుట్ర చేసి ఓడించిందని కుంతియా పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందనీ, తమ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డిలు ప్రచారం చేసి పద్మావతి రెడ్డిని గెలిపిస్తారన్నారు. -
'మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌వే'
సాక్షి, సంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించడం వల్ల రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే బాగుటుందని తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, మాజీ సీఎల్పీ నేత షబ్బీర్ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, వంశీచందర్ రెడ్డి, సలీమ్ తదితరులు పాల్లొన్నారు. -
‘సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటం’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం కూలంకశంగా చర్చించింది. పార్టీ భవిష్యత్, ప్రభుత్వంపై సాగించాల్సిన పోరాటాలు, దానికి అవలంభించాల్సిన విధానాలు, రానున్న మున్సిపల్ ఎన్నికలు.. సాగునీటి ప్రాజెక్టులు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలు మేధోమథనం చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో శనివారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది. టీపీపీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతి యా, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు పాల్గొనగా సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ఇన్కేమెరాగా జరిగిన ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు, దాంతో జరిగే నష్టాలపై నైనాల గోవర్ధన్ వివరించగా, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎలాంటి విధానం అవలంభించాలనే దానిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వివరించారు. జూలై మొదటి వారంలో డీసీసీ సమావేశాలు.. జూలై మొదటి వారంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమా వేశాలు జరపాలని నిర్ణయించారు. ముందుగా కొత్త జిల్లాల్లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. అనంతరం మున్సిపాలిటీల స్థాయిలో కూడా సమావేశాలు జరపనున్నారు. జూలై 1 నుంచి 4లోగా డీసీసీ విçస్తృతస్థాయి సమావేశాలు.. 5 నుంచి 10లోగా అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు పెట్టాలని నిర్ణయం జరిగింది. ఎలాంటి ఇబ్బందులూ లేని నియోజక వర్గాల్లో ఆయా నియోజకవర్గ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యత అప్పజెప్పాలని నిర్ణయించారు. డీసీసీ భవనాలకు ప్రభుత్వం భూములు కేటాయిం చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సమావేశంలో చర్చకు వచ్చింది. సచివాలయం కూల్చివేత విషయాన్ని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, టీఆర్ఎస్ను నిలదీయాలని తీర్మానించారు. మునిసిపాలిటీల్లో ఎన్నికల కోసం అభ్యర్థులను ‘సెలక్ట్ అండ్ ఎలెక్ట్’పద్ధతిలో టికెట్లు కేటాయించాలన్న ప్రతిపాదనలకే నాయకత్వం మొగ్గుచూపిందని సమాచారం. టీపీసీసీ ముఖ్య నాయకులు కొన్ని మున్సిపాలిటీల బాధ్యతలు తీసుకోవాలని తేల్చారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ పరిధిలోని 40 మున్సిపాలిటీలపై ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సచివాలయం సందర్శన... కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం సచివాల యాన్ని సందర్శించి భవనాలను పరిశీలించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఏ భవనం ఎప్పుడు నిర్మించారు? ఎప్పుడు శంకు స్థాప న జరిగింది? ఎప్పుడు ప్రారంభించారో తెలుసుకునేందుకు శిలాఫలకాలను పరిశీలించాలని నిర్ణయించారు. పాత భవనాలను కూల్చివేయకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని, ఈ విషయా న్ని ప్రభుత్వానికి సూచించాలని రేవంత్ చెప్పారు. అద్దె గదుల్లో నడుస్తున్న ప్రభుత్వ శాఖలకు సచివాల య భవనాలను వాడుకోవచ్చని సూచించారు. ప్రతి నెలా ఇలాంటి సమావేశాలు: కుంతియా ప్రతినెలా ఇదే తరహాలో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా సూచించారు. సమన్వయ కమిటీ, వర్కింగ్ కమిటీ, టీపీసీసీ కమిటీ కలసి çసమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతినెలా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండలస్థాయి సమావేశాలు తప్పనిసరిగా జరుపుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 నియోజకవర్గాల్లో బాధ్యులు లేరని, అక్కడ ఒక కమిటీ వేసి కో–ఆర్డినేటర్లను నియమించి పని చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి నాయకులను ఒక్కో నియోజకవర్గంలో ఇన్చార్జ్గా పని చేయించాలని, సీనియర్ లీడర్లు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులతో రాష్ట్రస్థాయిలో సమన్వయ కమిటీని వేయాలని తీర్మానించారు. రాహుల్ రాజీనామాను ఉప సంహరించుకుని మళ్లీ పార్టీలో యాక్టివ్‌గా పనిచేయాలని కోరాలని ఈ సమావేశం నిర్ణయించింది. బాధ్యతతో పనిచేయాలి: కోమటిరెడ్డి ముఖ్యనేతలంతా మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యతతో పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం 20 శాతం పూర్తికాకున్నా హడావుడిగా ప్రారంభించారని పేర్కొ న్నారు. కాళేశ్వరంపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంపై పిల్ వేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కొత్త జిల్లాల వారీగా దత్తత తీసుకొని పార్టీని బలోపేతం చేద్దామని సూచించారు. గ్రామగ్రామాన తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాటాలు: ఉత్తమ్ కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త అసెంబ్లీ భవనాల అవసరమే లేదని, ఇక పాత సచివాలయం కూల్చొ ద్దని కోరారు. సోమవారం జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి సచివాలయాన్ని పరిశీలిస్తారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్న తప్పుడు భావన రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై స్పష్టమైన వైఖరి కోసం కమిటీ వేస్తామన్నారు. అలాగే ప్రాజెక్టులకు బ్యాంకులు ఎలా రుణాలు ఇస్తున్నాయో చూడాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానం చేసి పంపిస్తామని తెలిపారు. -
నీతి నియమాలు ఉంటే రాజీనామా చేయాలి
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం అనైతిక చర్య అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా వ్యాఖ్యానించారు. కుంతియా బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. నీతి నియమాలు, దమ్మూ దైర్యం ఉంటే టీఆర్ఎస్లోకి వెళ్లిన అందరూ రాజీమానా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశామని, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామని, అయినా కూడా ఎలాంటి స్పందన లేదని వివరించారు. ఇదే అంశంపై హైకోర్టులో కూడా కేసు నడుస్తోందని చెప్పారు. హైకోర్టులో కేసు గెలుస్తామని మాకు నమ్మకం ఉందని అన్నారు. టీపీసీసీ పదవి మార్పుపై కాంగ్రెస్ అదిష్టానం దృష్టికి రాలేదని పేర్కొన్నారు. కవిత ఓటమితో కేసీఆర్ ఒక గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. తెలంగాణాలో కేసీఆర్‌కు ప్రజాదరణ తగ్గిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మొదట అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. -
‘కేసీఆర్ నియంత పోకడలకు అడ్డుకట్ట’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పోకడలను లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంతృప్తికర పోటీ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం కుంతియా.. గెలిచిన ఎంపీలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ రోజు రోజుకూ పటిష్టం అవుతోందన్నారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, రాజకీయ ఫిరాయింపులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, పదహారు సీట్లు అంటూ విర్రవీగిన కేసీఆర్‌ను సింగిల్ డిజిట్ వద్ద ఆపి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజాస్వామ్య వాదిలా పనిచేయాలని హితవు పలికారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని, మూడింట గెలిచి, మరో రెండు చోట్ల మెజారిటీతో ఓటమి పాలైందని తెలిపారు. -
కాంగ్రెస్‌తోనే బీసీలకు సామాజిక న్యాయం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్‌లో ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుంతియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిరంతరం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని చెప్పారు. బీసీ వర్గాలకు పార్టీ పదవుల్లో, ప్రభుత్వంలోనూ సమతూకం పాటిస్తూ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ విజయం సాధించిన మూడు రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఓబీసీలకు పెద్ద పీట వేసిందని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీసీసీ ఓబీసీ చైర్మన్‌గా డా.కత్తి వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల చైర్మన్లు ఓబీసీ విభాగం పక్షాన ప్రచారంలో ముందుండి కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ప్రతినబూనారు. అనంతరం 17 పార్లమెంట్ స్థానాల్లో ఓబీసీ కో ఆర్డినేటర్లను నియమిస్తూ కత్తి వెంకటస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమన్వయ కర్త ప్రొఫెసర్ ప్రకాష్ సొనవానే, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
40 మంది స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా సోమవారం జాబితాను ప్రకటించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, నారాయణస్వామి, అశోక్‌చౌహాన్, పరమేశ్వర, మిక్రాకుమార్, చిండియా, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, సిద్దరామయ్య, డీకే శివకుమార్, జైపాల్‌రెడ్డి, ఆర్సీ కుంతియా, శ్రీనివాసన్ కృష్ణన్, సలీంఅహ్మద్, బీఎస్ బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, విజయశాంతి, జానారెడ్డి, మధుయాష్కి, దామోదర రాజనరసింహ, షబ్బీర్‌అలీ, రాములునాయక్, రేవంత్‌రెడ్డి, రేణుకా చౌదరి, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నవజ్యోత్‌సింగ్ సిద్దూ, నితిన్‌రౌత్, నదీమ్ జావేద్, నగ్మా, ఖుష్బు, అనిల్ థామస్, కెప్టెన్ ప్రవీణ్ దావర్ ఉన్నారు. -
లౌకికవాద పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తున్న తమకు లౌకికవాద పార్టీ లు మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో కుంతియా విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం కోసం తాము పోటీ చేస్తున్నామని, లౌకికవాద పార్టీలు పోటీలో లేని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి ఓటమి భయం పట్టుకుందన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ నేతృత్వంలో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని చూసి మోదీకే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మాజీమంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ మనుగడ అగమ్యగోచరం మాజీఎంపీ రాపోలు ఆనందభాస్కర్ హైదరాబాద్: కాంగ్రెస్ అధినాయకత్వంలో విచక్షణ కరువైందని, ఆ పార్టీ మనుగడ అగమ్యగోచరంగా మారిందని అందుకే పార్టీ వీడుతున్నానని మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. తాను ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ 1995లో తెలంగాణ ప్రత్యేక సాధన ఉద్యమంలో తాను కీలకపాత్ర పోషించానని, తర్వాత రాజ్యసభ సభ్యునిగా ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను పార్లమెంట్లో వినిపించానన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సైద్ధాంతిక వైరుధ్యం తనను కలిచివేసిందన్నారు. అందుకే తాను కాంగ్రెస్ లోని అధినాయకత్వంతో విభేదించాల్సిన పరి స్థితి వచ్చిందన్నారు. సబ్బండ జాతుల ప్రయోజనం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి, భారత జాతి సంరక్షణకోసం ప్రజలతో మమేకమయ్యేందుకు నిర్ణయించుకున్నట్లు వివరించారు. -
పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కొంత మంది పదవులు అనుభవించి పార్టీలు మారిపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి ఆర్సీ కుంతియా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీలు మారుతున్న వారు ముందుగా వారి పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై శనివారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఆశావహులు అధికంగా ఉంటారని, అందరికీ సీట్లు కేటాయించడం సాధ్యం కాదని చెప్పారు. ఖమ్మం లోక్‌సభ రేసులో రేణుకా చౌదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు కుంతియా తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వండి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పోటీచేయని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌పార్టీ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతి యా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్లో సంప్రదించినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీచేయడం, మిగతా చోట్ల టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు మద్దతు ఇవ్వడం అనే అంశాలపై నిర్ణయం జాతీయనాయకత్వ పరిధిలో ఉందని చాడ వారికి వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పుడిక తమ చేతుల్లో ఏమీలేదని ఎన్నికల్లో అనుసరించే వైఖరికి సంబంధించి జాతీయ నాయకత్వానికి నివేదించినందున, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు తమను ఒక్కసారి కూడా పలకరించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సంప్రదింపులు జరపడంపట్ల సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకూటమిలో కాంగ్రెస్, సీపీఐ కలసి పోటీ చేశాక, కనీసం ఎన్నికల ఫలితాల సమీక్షకు చొరవ తీసుకోని కాంగ్రెస్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు అవసరం కావడంతో మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీకి చేరిన లెఫ్ట్ పంచాయితీ... సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీల మధ్యనున్న పంచా యితీ ఢిల్లీ చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరిం చాల్సిన రాజకీయవిధానం, పోటీచేయని స్థానాల్లో ఏ పార్టీకి మద్దతునివ్వాలనే విషయంపై ఈ పార్టీల మధ్య అంగీకారం కుదరలేదు. ఈ నేపథ్యంలో పొత్తులపై ఎలాంటి వైఖరిని అవలంబించాలి, ఇరుపార్టీలు పోటీలో లేని సీట్లలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అం శంపై తేల్చాల్సిందిగా జాతీయ నాయకత్వాలను ఆశ్రయించినట్టు సమాచారం. ఐదు దఫాలుగా జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, వాటిపై వెల్లడైన రెండుపార్టీల అభిప్రాయాల గురించి గురువా రం కేంద్ర కమిటీకి సీపీఐ రాష్ట్ర కమిటీ లేఖ రాసింది. సీపీఎంతో పొత్తు అంశం, తాము బరిలో లేని చోట్ల ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై స్పష్టమైన దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరినట్టు తెలిసింది. తాము పోటీచేయని చోట్ల జనసేన, బీఎస్పీ, ఎంసీపీఐ (యూ), బీఎల్పీ, ఎంబీటీ వంటి పార్టీలకు మద్దతు ఇవ్వడంపై తమ నిర్ణయాన్ని జాతీయపార్టీకి సీపీఎం తెలిపినట్టు సమాచారం. గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరితో ఆయా అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు బి.వెంకట్ నామినేషన్ దాఖ లు చేసే కార్యక్రమంలో ఏచూరి పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడే ఏచూరి సమక్షంలో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి పోటీచేయని స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై నిర్ణయిస్తారు. -
పోట్ల లేదా రేణుకా చౌదరి!
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం లోక్‌సభ బరి నుంచి కమ్మ సామాజిక వర్గ నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ నాయకత్వం ప్రతిపాదన కూడా ఇదేనని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోటీ చేస్తారని ప్రచారం సాగినా.. ఖమ్మం కాంగ్రెస్‌లోని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆమె బుధవారం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాను కలిసి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను వివరించారు. అయితే గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో ఉండి టీఆర్ఎస్లో చేరి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేరును కూడా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలబెట్టడం కలిసొస్తుందని పీసీసీ పెద్దలు నివేదించినట్లు తెలుస్తోంది. అయితే రేణుకా చౌదరికి ఢిల్లీ పలుకుబడి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి కాకుండా ఇతర సామాజికవర్గ నేతలకు టికెట్ ఇవ్వాలంటే ఎన్నికల ఖర్చు భరించే స్తోమత ఉన్న నాయకుడికి కేటాయించే అవకాశం ఉంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరతారా..? వైఎస్సార్సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని పరిస్థితుల్లో ఆయన తమ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ పొంగులేటి మాత్రం టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ మారే ప్రసక్తే లేదని తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఆర్థికంగా బలవంతుడైన మరో నేత టికెట్ ఆశిస్తున్నప్పటికీ.. ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. -
రాహుల్ సభను విజయవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న శంషాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాహుల్ సభ ఏర్పాట్లపై చర్చించేందుకుగాను బుధవారం ఇక్కడి గాంధీభవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, రోహిత్‌రెడ్డి, సీతక్క, హరిప్రియ నాయక్‌లతోపాటు పలువురు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల ప్రచారశంఖారావం పూరించేందుకు రాష్ట్రానికి వస్తున్న రాహుల్ సభ విజయవంతమయ్యేలా నాయకులంతా కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకుని లోక్‌సభ ఎన్నికలపై నేతల దృష్టి మళ్లించేందుకుగాను ఈ సభను ఉపయోగించుకోవాలని, రాహుల్సభ స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలిచ్చే విధంగా పెద్దఎత్తున జనసమీకరణ జరపాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ కూడా రేపో, మాపో అంటున్న తరుణంలో జరుగుతున్న రాహుల్ బహిరంగసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీపై భరోసా కలిగించేలా నేతలు పనిచేయాలని కోరారు. ఇంకా నాన్ సీరియస్సేనా? ఓ వైపు లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇంకా స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోతున్న తరుణంలో జరుగుతున్న రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశానికి పలువురు ముఖ్యులు డుమ్మా కొట్టడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులుగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ముఖ్యంగా సభ నిర్వహిస్తున్న సమీప ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. -
కుంతియా వల్లే కాంగ్రెస్ సర్వనాశనం
సాక్షి, హైదరాబాద్: గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ లాంటి నాయకులు ఇన్‌చార్జీలుగా ఉండాల్సిన రాష్ట్రానికి ఆర్.సి.కుంతియా అనే ఐరన్‌లెగ్‌ను ఇన్చార్జిగా నియమించినందువల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ‘ఉత్తమ్, కుంతియాకు హఠావో... కాంగ్రెస్‌కు బచావో’అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై సమీక్ష ఎవరు చేయమన్నారని ప్రశ్నించినందుకే తనపై దాడికి ఉసిగొల్పారని, తనపైకి వచ్చిన వారికి గట్టిగానే సమాధానం చెప్పి తాను సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు. తనను సస్పెండ్ చేశామని టీపీసీసీ చెబుతోందని, ఏఐసీసీ సభ్యుడినయిన తనను సస్పెండ్ చేసే అధికారం వీళ్లకెక్కడిదని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయాలని అధిష్టానం చెబితే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎక్కడ ఉందని నిలదీశారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేశారని, గెలిస్తే సీఎం పదవికి అడ్డం వస్తాననే ఉద్దేశంతో తనను ఓడించాలని పలువురికి ఫోన్లు చేసి పురమాయించారని ఆరోపించారు. తనతోపాటు చాలామందిని ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వివరాలన్నింటితో త్వరలోనే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. బడా ఐరన్‌లెగ్, చోటా ఐరన్‌లెగ్ కలసి రాష్ట్రంలో పార్టీని తమిళనాడు తరహాలో నాశనం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వారి ఆటలు సాగనివ్వబోనని, వారి భరతం పడతానని, కాంగ్రెస్‌పార్టీ పక్షాన పోరాడుతానని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్నట్టు నిజంగా వీళ్లు ఇడియట్లేనని, సిగ్గూశరం లేనోళ్లని, మొత్తం తెలంగాణ కాంగ్రెస్‌పార్టీని ప్రక్షాళన చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా, మండలిలో పార్టీ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసినా ఈ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంకా ఈయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పదవిని పట్టుకుని వేలాడుతున్నారని, వీళ్ల మొహాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదని, కేసీఆర్ మొహం నచ్చినందుకే ఆయనకు ఓట్లేశారని సర్వే అన్నారు. రాష్ట్రంలో కొత్త వారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం ఆశీర్వాదం తనకుందని, తనకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
టీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మహాకూటమి పేరిట టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి వెళ్లినా.. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. ఈ నేపథ్యంలో రాహుల్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియ తదితరులు భేటీ అయి చర్చించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలోని 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించాలని రాహుల్ గాంధీ ఆదేశాలు ఇచ్చారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఉత్తమ్, కుంతియా మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ 33 జిల్లాలకు వెనువెంటనే డీసీసీ అధ్యక్షుల నియమించాలని పీసీసీని రాహుల్ ఆదేశించారు. అదేవిధంగా మండల కమిటీలు, బ్లాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. జనవరి 10వ తేదీలోగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని రాహుల్ ఆదేశించారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులే పంచాయతీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించాలని అధిష్ఠానం ఆదేశించింది. టీ కాంగ్రెస్‌ను పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయాలని రాహుల్ ఆదేశించారు. ప్రస్తుత ప్రదేశ్ ఎన్నికల కమిటీ సైజు ను తగ్గించి, కొత్తగా 15 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నాం’అని వారు తెలిపారు. -
రాహుల్‌తో ఎంపీ కొండా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న సిద్ధాం తంతోపాటు సెక్యులరిజం నుంచీ టీఆర్ఎస్ దూరం గా వెళ్లిపోయిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక క్రమంగా వారికి దూర మవుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌ను విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, హరియాణాకు చెందిన ఎంపీ దీపేందర్‌సింగ్ హుడా పాల్గొన్నారు. 15 నిమిషాలు జరిగిన భేటీలో రాష్ట్రంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చని ప్రాజెక్టులు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని సమస్యలను రాహుల్‌కు ఆయన వివరించారు. కొండా రాకతో పార్టీ బలోపేతం... అనంతరం మీడియాతో కుంతియా మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీతో జట్టుకట్టడం లాంటి అనేక అంశాలపై టీఆర్ఎస్తో విభేదిస్తూ కొండా ఆ పార్టీని వీడారన్నారు. ఈ నెల 23న సోనియా, రాహుల్ సమక్షంలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరతారని వెల్లడించారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై ప్రస్తుతానికి రాహుల్ హామీ ఇవ్వలేదని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. విశ్వేశ్వర్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. కేసీఆర్ వద్ద ఉన్న అనేకమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారేనని, వారంతా తమతో టచ్‌లో ఉన్నట్లు వివరించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నంత మాత్రానా టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కాబోదని, ఎంఐఎం కూడా బీజేపీ వంటి మతతత్వ పార్టీయేనని మీడియా ప్రశ్నకు బదులిచ్చారు. ముస్లిం ఓటు ఎంఐఎంకు వెళ్లాలి.. హిందూ ఓటు బీజేపీకి వెళ్లాలి.. అన్నది వారి అవగాహన అని అన్నారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకమైతే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ తీర్మానాల సమయంలో ప్రతి విషయంలోనూ మద్దతెలా ఇచ్చారని ప్రశ్నించా రు. తెలంగాణలో 9 నెలల ముందుగానే ఎన్నికలు జరపాలన్నది ఓ పథకం ప్రకారం చేశారని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్డీయేలో చేరా లన్నది టీఆర్ఎస్ వ్యూహమని అన్నారు. ప్రజలకు దూరమైన టీఆర్ఎస్... టీఆర్ఎస్ సైద్ధాంతిక మార్పులకు లోనైందని. అం దుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న అసలు సిద్ధాంతాన్ని, సెక్యులరిజాన్ని పక్కకు పెట్టిందన్నా రు. చేవెళ్ల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం రాహుల్‌ని కలిశానని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. వికారాబాద్‌ను శాటిలైట్ సిటీ చేస్తామని, తాండూరు సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వీటన్నింటినీ నెరవేర్చాలని కోరా నన్నారు. రాష్ట్రంలోని సాగునీరు, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలపై భేటీలో చర్చించామన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత టీఆర్ఎస్ ప్రాథమిక ఓటర్లని, ప్రస్తుతం వీరంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పూర్తిగా సైద్ధాంతిక మార్పు కు లోనైందని, దీన్ని సహించలేకే పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ చేయని వాటిని కాంగ్రెస్ ద్వారా సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి రాజీనామాపై స్పందిస్తూ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఇస్తానని పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డితో నాలుగేళ్లుగా విభేదాలు.. మంత్రి మహేందర్‌రెడ్డితో వ్యక్తిగత విభేదాలు పార్టీలో చేరినప్పటి నుంచి ఉన్నాయని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దాని కోసమే అయితే ఇప్పుడు పార్టీ వీడాల్సిన అవసరం లేదని, ఆ పని నాలుగేళ్ల ముందే చేసేవాడినని తెలిపారు. చిన్నచిన్న వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడేవాడి ని కాదన్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో సీఎం మంచిగా ఉండేవారని, అందుకే పలు ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా తక్కువని, అదే కాంగ్రెస్‌లో ఆ వీలు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించగా, గురువారం నిర్వహించబోయే విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వివరిస్తానని చెప్పారు. -
పార్టీ పదవుల్లో సముచిత స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టికెట్లు దక్కని నేతలకు పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో సముచితస్థానం కల్పించి న్యాయం చేస్తా మని ఆశావహులకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్.సి.కుంతియా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. టికెట్ల కేటాయింపులో బీసీ లకు అన్యాయం జరుగుతోందని పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం నిరాహార దీక్షకు దిగారు. కొల్లాపూర్ బరిలో నిలవాలనుకుంటున్న మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్ భవన్‌లోని వసతి గృహంలోనే దీక్షకు దిగారు. షాద్‌నగర్ పై ఆశలు పెట్టుకున్న కడియం పల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవరకద్ర సీటు ఆశిస్తున్న ప్రదీప్ గౌడ్లు భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగా రు. కుంతియా అక్కడికి చేరుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ బీసీలకు 19 సీట్లు ఇస్తే కాంగ్రెస్ 94 స్థానాలకుగాను 22 సీట్లు ఇవ్వనుందన్నారు. -
రెండు రోజుల్లో పూర్తి జాబితా: కుంతియా
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబి తాను విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్సి.కుంతియా వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామన్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు జరుగుతోందని, రెండు రోజుల్లో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్లు దక్కని వారు అసంతృప్తికి లోను కావద్దని, టికెట్లు దక్కని నేతలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్కు ఆయుధంలా మారింది: పొన్నాల సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడం టీఆర్ఎస్కు ఆయుధం లా మారిందని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒక సామాజిక వర్గాన్ని దూరం పెట్టిం దని ప్రచారం చేసుకునే అవకాశం టీఆర్ఎస్కు కలిగిందన్నారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న పొన్నాల.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాను టికెట్ కోరిన తర్వాత కాంగ్రెస్ ఇవ్వకపోవడం ఉండదన్నారు. -
74 స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల ఖరారు
-
74 స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. 74 సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులకు గురువారం సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 26 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. టీడీపీకి 14 స్ధానాలు, టీజేఎస్‌కు 8 స్ధానాలు, సీపీఐకి మూడు స్దానాలు , తెలంగాణ ఇంటిపార్టీకి ఒక స్ధానం కేటాయించామని వెల్లడించారు. 74 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేస్తామని చెప్పారు. ఈనెల11, 12న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో చర్చించిన మీదట మిగిలిన స్దానాల్లో పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తామని కుంతియా పేర్కొన్నారు. 74 స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తవగా, మరో 20 స్ధానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈనెల 10న తొలిజాబితాను హైదరాబాద్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. వ్యూహాత్మక జాప్యం.. 74 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్న కాంగ్రెస్ పార్టీ మిగిలిన 20 స్థానాలపై వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది.రెబల్స్ బెడదను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది. టికెట్ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది. మరోవైపు గల్ఫ్ కార్మికులతో సమావేశమయ్యేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం రాత్రి దుబాయ్ బయలుదేరుతున్నారు. -
9 తర్వాత అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రజా కూటమి అభ్యర్థుల ప్రకట న 9వ తేదీ తర్వాతే ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సి.కుంతియా స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదని, ఇంకా సీపీఐ, తెలంగాణ జనసమితిలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. రెండు మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆలిండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ కార్యదర్శి అబ్దుల్ ఘనీ, ఏఐసీసీ కార్యదర్శులు సలీం ఆహ్మద్, శ్రీనివాసన్‌లతో కలసి మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా అధికారికంగా ప్రకటించలేదన్నా రు. కూటమిగానే ఎన్నికల్లో కలసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఊహాగానాలను నమ్మొద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి ప్రజా కూటమికి మద్దతు లభిస్తోందని చెప్పారు. మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్తో.. టీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపిం చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ బీజేపీతో కలసి వెళ్లడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్ ముస్లింలను మోసం చేశారని విమర్శించారు. కూటమికి ముస్లిం లీగ్ మద్దతు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఆలిండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. బీజేపీకి అన్ని అంశాల్లో మద్దతు ఇస్తు న్న టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ కార్యదర్శి అబ్దుల్ ఘనీ తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపిం చారు. ప్రధాని మోదీ లవ్ జిహాద్, గోరక్షక్‌ల పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ముస్లిం లపై జరుగుతున్న దాడులపై మోదీని కేసీఆర్ ఎందు కు ప్రశ్నించలేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి ముస్లిం లను దగా చేశాడని దుయ్యబట్టారు. ముస్లింలకు ఇచ్చిన ఒక హమీ కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయించి 30 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. -
ఎవరైతే బాగుంటుంది?’
సాక్షి, హైదరాబాద్: ‘మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీలో ఉండాలి.. ఏ నేత పోటీ చేస్తే విజయావకాశాలున్నాయి.. మీ అభిప్రాయంలో ఒక్క నాయకుడి పేరు చెప్పండి..’అంటూ క్షేత్రస్థాయిలోని కార్యకర్తల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంది. ఫలానా నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారనే అంశంపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా గత మూడ్రోజులుగా శక్తి యాప్ ద్వారా ఈ అభిప్రాయ సేకరణ జరిపారు. మొత్తం 4.5 లక్షల మందికి స్వయంగా ఆయన వాయిస్ మెసేజ్‌ను పంపగా, ఆదివారం సాయంత్రానికి 2.2 లక్షల మంది స్పందించి తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహు ల్ గాంధీ ఆదేశాల మేరకు ఆర్టిషీషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో ఏఐసీసీ డేటా అనాలసిస్ విభా గం ద్వారా ఈ అభిప్రాయ సేకరణ చేపట్టారు. బూత్ స్థాయి నాయకులతో పాటు గ్రామ స్థాయి లో చురుకుగా ఉండే నేతలను గుర్తించి ఈ వాయిస్ మెసేజ్‌లను పంపామని, అందులో ఒక్క పేరుతో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. తుది జాబితా కేంద్ర కమిటీకి.. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల అభ్యర్థుల తుది జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి అందజేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ముకుల్ వాస్నిక్‌కు కుంతియా ఈ జాబితా పంపారు. ఇది అక్కడి నుంచి రాహుల్ గాంధీకి చేరనుంది. ఆయన పరిశీలించి ఆమోదించిన తర్వాత తుది జాబితా ను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, నవంబర్ 1లోపు కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని, పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 1వ తేదీనే విడుదల చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండటం గమనార్హం. ‘మాకూ ఆరు సీట్లివ్వండి’ తెలంగాణలో తాము కూడా బలమైన సామాజిక వర్గమని, తమకు ఆరుసీట్లు కేటాయించాలని తెలంగాణ కమ్మ సేవా సమితి కాంగ్రెస్ పార్టీని కోరింది. సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్. జి. విద్యాసాగర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం గోల్కొండ రిసార్ట్స్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్, టీపీసీసీ కోర్ కమిటీ సభ్యులు జానారెడ్డి, షబ్బీర్‌అలీలకు ఈ మేరకు వినతిపత్రం అందజేసింది. కమ్మ కులస్తులు రాష్ట్రంలో 16లక్షలకు మంది పైగా ఉన్నారని, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో గణనీయంగా ఉన్న తాము రాష్ట్రంలోని 35–40 స్థానాల్లో ప్రభావిత శక్తిగా ఉన్నామని తెలియజేశారు. మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలోని 90% మంది కమ్మ కులస్తులు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తారని, తాము మద్దతివ్వనప్పటికీ టీఆర్ఎస్ తమ కులస్తులకు ఆరు సీట్లు కేటాయించినందున కాంగ్రెస్ కూడా కనీసం 6 స్థానాలను తమ కులస్తులకు కేటాయించాలని కోరారు. -
నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను నవంబర్ మొదటివారంలో ఒకే విడతలో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, అలాగే అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టిన అధ్యయనం ఈ నెలాఖరులో పూర్తవుతుందని అన్నారు. స్క్రీనింగ్ కమిటీ సంప్రదింపులు ముగిసిన ఒకటి, రెండు రోజుల అనంతరం నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయా సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలతో స్క్రీనింగ్ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించి నేతల అభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీసీలకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సీట్ల కంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుందని తెలిపారు. ఈ నెల 27న పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. ఆరు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఆ పర్యటనలో ఉదయం మేధావులు, విద్యార్థులు, కార్మికులు, ఆయా సామాజికవర్గాలతో రాహుల్ సమావేశమై మధ్యాహ్నం బహిరంగసభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని, దీని కోసం పొత్తుల్లో కొన్ని సీట్లు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కుంతియా పేర్కొన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని.. ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఎన్నికల తర్వాత కలసిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుం తియా వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో జత కట్టి ముస్లిం ఓట్లను దండుకోవడం కోసమే ప్రభుత్వాన్ని కేసీఆర్ 9 నెలల ముందు రద్దు చేశారని విమర్శించారు. ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసిపోతారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో రోజైన గురువారం కొనసాగింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. కుంతియా మాట్లాడుతూ కుటుంబసభ్యులకు కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు వస్తేనే బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పచ్చి అవకాశవాదని.. తెలంగాణ ఇచ్చిన వెంటనే కుటుంబంతో సహా వెళ్లి సోనియాగాంధీ కాళ్లపై పడిన వ్యక్తి.. ఇప్పుడు రాహుల్‌ను ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రాను న్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కేసీఆర్ హఠావో – తెలం గాణ బచావో’నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రచా రం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ కోరారు. యువత ఉత్సాహం చూస్తుంటే... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో కేసీఆర్ నుంచి విముక్తి : భట్టి తెలంగాణకు పట్టిన కేసీఆర్ శని త్వరలో విముక్తి కాబోతుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో రూ.62 వేల కోట్లకు అంచనా పెంచారని ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరు తో దోపిడీ చేయడం తప్ప పనులు చేసిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రచార కమిటీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్థాయి మరిచి వీధి రౌడీలా పచ్చి బూతు మాట లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఓటుకు రూ.2 వేలు లేదా 3 వేలు పంచబోతున్నారని, ఆ డబ్బు తీసుకొని కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని కోరారు. కేసీఆర్ కూతురు కవితను ఒళ్లు దగ్గర పెట్టుకో అంటూ ఎవరైనా మాట్లాడితే.. కేసీఆర్ ఊరుకుంటారా? అని డీకే అరుణ ప్రశ్నించారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. -
ఓటమి భయంతోనే దూషణలు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ మానసిక సంతులత సరిగ్గా లేదు, సీఎం తన స్థాయికి తగట్టు మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా విమర్శించారు. రాజకీయంగా దిగజారి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతతో ఓటమి భయంపట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ చౌరస్తాలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ పాద యాత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతోనే ఆధికారం చేజారిందని పేర్కొన్నారు. కేసీఆర్ తన వల్లే తెలంగాణ సాధ్యమైందని ప్రజలకు మాయమాటలు చెప్పడంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ందని ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అన్నింటా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. మోదీ గ్రాఫ్ తగ్గుతోంది దేశంలో మోదీ గ్రాఫ్ తగ్గుతోందని.. రాహుల్ గ్రాఫ్ పెరుగుతోందని కుంతియా అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే నష్టం వాటిల్లుతుందనే కేసీఆర్ ముందస్తుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంఐఎంతో దోస్తీ తెంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మోదీతో జతకట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ పిట్టల దొర: షబ్బీర్ కేసీఆర్ అబద్ధాలకోరు, నంబర్ వన్ పిట్టల దొర అని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. కేసీఆర్ మాటలే చెబుతాడు తప్ప..చేతలుండవన్నారు. మోదీ సర్కార్ ప్రజలను దోపిడీ చేసిందని, నోట్ల రద్దు, జీఎస్టీ పేరిట దోపిడీకి పాల్పడి రిలయన్స్‌కు అప్పనంగా అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ తీరును ఎండగట్టారు. -
సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పాటు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ ఏర్పాటు అయిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా వ్యాక్యానించారు. ఆదివారం ముషీరాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్సీ కుంతియాతో పాటు కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, బోసురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల బలిదానం చూసి చలించి సోనియా తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ 9 నెలల ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని సూటిగా అడిగారు. మోదీ, ఎన్డీఏ గ్రాఫ్ తగ్గుతోంది..రాహుల్ గ్రాఫ్ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకుని కుమ్మక్కయ్యారని ఆరోపించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ..హైదరాబాద్‌ని అన్నిరంగాల్లో అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నెంబర్ వన్ పిట్టలదొర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలే చెబుతాడు తప్ప..చేతలుండవన్నారు. ఏఐసీసీ నేత బోసురాజు మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్‌కు సెపరేట్‌గా మేనిఫెస్టో సబ్ కమిటీ వేస్తామని తెలిపారు. గ్రేటర్ సమస్యలపై సబ్‌కమిటీ చర్చిస్తుందన్నారు. 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..తెలంగాణ ఇచ్చింది..తెచ్చింది కాంగ్రెస్సేనని, తెలంగాణాకు అందరూ సపోర్ట్ చేసినా అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ వద్దన్నారని విమర్శించారు. గ్రేటర్లో 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. -
పట్టువిడుపులొద్దు.. గెలిచేవి వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి రూపుదిద్దుకోవడం కోసం పట్టువిడుపులు ప్రదర్శించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ అభిప్రాయపడింది. గెలిచే సీట్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని నిర్ణయించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో జరిగిన ఈ కోర్ కమిటీ సమావేశానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోర్‌కమిటీ సభ్యులు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల ప్రచారంతో పాటు మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అనుసరించాల్సిన వ్యూహం గురించి కూడా చర్చించారు. కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కోరుతున్న స్థానాల సంఖ్య, ఏయే స్థానాలు కోరుతున్నారన్న దానిపై కూలంకషంగా చర్చించినట్టు తెలిసింది. మొత్తం 40–45 స్థానాల్లో పోటీచేస్తామని కూటమిలోని మూడు పార్టీలు కోరుతున్నప్పటికీ.. మొత్తం కలిపి 20 స్థానాలే ఇవ్వాలని నిర్ణయించారు. అంతకంటే ఎక్కువ ఇవ్వడం వల్ల గెలిచే సీట్లను కూడా వదులుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇందులో తెలుగుదేశం–12, సీపీఐకి 3 నుంచి 4, టీజేఎస్‌కు 3 నుంచి 4 స్థానాలతో సరిపెట్టాలని.. అవసరమైతే అదనంగా ఒకటి, రెండు సీట్లలో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించారు. బలమున్న చోట అడుగుదాం.. సంఖ్య విషయంలో రాజీపడకుండా ఉండాలంటే తాము బలంగా ఉన్న చోట్ల కూడా కూటమి పార్టీలు అడుగుతున్న స్థానాలపై పట్టుపట్టాల్సిందేనని కోర్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా ఖమ్మం, వైరా, నకిరేకల్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మంచిర్యాల, చెన్నూరు, ముదోల్, నకిరేకల్, తుంగతుర్తి, వరంగల్ ఈస్ట్, వెస్ట్, మహబూబ్‌నగర్, ఎల్బీనగర్ లాంటి స్థానాల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశమున్నందున వాటిని ఇచ్చేది లేదని.. ఈ స్థానాల్లో పోటీ విషయంలో తమకున్న విజయా వకాశాలను కూటమి పార్టీల ముందుపెట్టాలని భావిస్తున్నారు. నేడు లేదా 10 తర్వాతే.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా శుక్రవారం వెలువడే అవకాశముందని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎక్కడా ఇబ్బందులు లేని స్పష్టమైన స్థానాల గుర్తింపు పూర్తయిందని, 40 మందితో తొలి జాబితా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శుక్రవారం జాబితా ప్రకటించని పక్షంలో ఈ నెల 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
కోడ్ ఉల్లంఘిస్తే కొట్లాటే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అధికార పార్టీ ఎక్కడ దుర్వినియోగానికి పాల్పడ్డా ఎదురించాలని సూచించింది. డబ్బు పంపిణీ నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకటనల వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టాలని, ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా పార్టీతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక నాయకత్వానిదేనని తెలిపింది. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా అధ్యక్షతన టీపీసీసీ ముఖ్య నేతల అత్యవసర సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, పార్టీ ముఖ్య నేతలు గీతారెడ్డి, కోదండరెడ్డి, పద్మావతిరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, గూడూరు నారాయణరెడ్డి, ఆకుల లలిత, సునీతాలక్ష్మారెడ్డి, బండా కార్తీకరెడ్డి, నేరెళ్ల శారద తదితరులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాల్సిన తీరు, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల అమలుపై నేతలు చర్చించారు. అనంతరం కుంతియా, ఉత్తమ్‌లు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారని, ఈ ఉల్లంఘనలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పారు. ముఖ్యంగా రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పైసల పంపిణీని సహించొద్దు.. టీఆర్ఎస్ అభ్యర్థులకు కోట్ల రూపాయలున్నాయని, పైసల పంపిణీ ఎక్కడ జరిగినా అడ్డుకోవాలని కుంతియా, ఉత్తమ్ చెప్పారు. అలాగే రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనల మీద కూడా ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఐదుగురు క్రియాశీల కార్యకర్తలను సిద్ధం చేయాలని, ఏఐసీసీ ఇచ్చిన పార్టీ కార్యాచరణను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 2 నుంచి జన సంపర్క్ అభియాన్ పేరుతో నిర్వహిస్తోన్న ఇంటింటికీ ప్రచారాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆ ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటించండి.. టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా ప్రజల్లోకి వెళ్తున్నారని.. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారని సమావేశంలో ఓ సీనియర్ మహిళా నాయకురాలు అభిప్రాయపడ్డారు. ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లోనైనా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే వారి పని వారు చూసుకుంటారని చెప్పారు. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కుంతియా ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పినట్టు సమాచారం. అలాగే తమకే టికెట్ కావాలని కోరుతూ జనాల్ని తీసుకుని ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దని కూడా ఆయన సూచించారు. ‘అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ దశ పూర్తయింది. షార్ట్‌లిస్ట్ అయిన ఆశావహులపై పార్టీ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది’అని కుంతియా స్పష్టం చేశారు. ‘ఆ ప్రకటనలు కోడ్ ఉల్లంఘనే’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో ఆపద్ధర్మ ముఖ్యమం త్రి, మంత్రులు, టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. అధికార పార్టీ రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్‌గా వాడుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు బలంరాంనాయక్, అం జన్కుమార్ యాదవ్, కోదండరెడ్డి, వినయ్‌లతో కలసి సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి రజత్ కుమార్‌ను కలసి అధికార పార్టీపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న శాసనసభ రద్దయిన మరుక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింద న్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రచారం కల్పించే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, ఆర్టీసీ బస్సులపై ప్రచార ప్రకటనలను కొనసాగించడం కోడ్ ఉల్లంఘనేనని తప్పుబట్టా రు. తక్షణమే వాటిని తొలగించాలన్నారు. తనకు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురిచేసిన తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ కొండా దంపతులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ దంపతులు, మైనారిటీ నేత పాషా కూడా రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంట పాటు నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. అందరూ కలసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొండా దంపతులు, రమేశ్ రాథోడ్ దంపతులు కాంగ్రెస్‌లో చేరడంపై రాహుల్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీరి చేరికలపై ఆయన సానుకూలంగా ఉన్నారని, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో మెజారీటీ స్థానాల్లో గెలుపొందేందుకు వీరి చేరికలు దోహదపడతాయని రాహుల్ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. బలహీనవర్గాల్లో బలమైన కుటుంబంగా కొండా కుటుంబాన్ని రాహుల్ పరిగణిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రమేశ్ రాథోడ్ చేరిక ప్రభావం చూపుతుందని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. బేషరతుగా చేరిక.. ఎన్నికల్లో పోటీపై రాహుల్‌తో భేటీ సందర్భంగా ఎలాంటి చర్చ జరగలేదని, ఎలాంటి షరతుల్లేకుండా కొండా దంపతులు పార్టీలో చేరినట్లు ఉత్తమ్ చెప్పారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం టికెట్ల విషయంలో నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. కొండా సురేఖను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పంపుతామని చెప్పారు. మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ ‘ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు మాపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఇప్పుడు మేం కాంగ్రెస్‌లో చేరాం. ఇక నుంచి కొండా దంపతుల ప్రభావమేంటో చూపిస్తాం. మాలాంటి వారందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టి కుటుంబ లాభాపేక్ష కోసమే పనిచేశారు. టీఆర్ఎస్లో జరుగుతున్న అన్యాయంపై మాలాంటి వారు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మమ్మల్ని బయటకు పంపేలా చేశారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో భేషరతుగా పార్టీలో చేరాం. మా లక్ష్యం టికెట్లు కాదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సేవలందిస్తాం. వరంగల్ తూర్పుతో పాటు 5 నుంచి 6 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాకే మళ్లీ వచ్చి కలుస్తానని రాహుల్‌కు హామీ ఇచ్చాం’అని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల టీఆర్ఎస్లో చేరామని, తమను వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు కొండా మురళి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ దంపతులు పేర్కొన్నారు. -
టికెట్లు అమ్ముకునే వాళ్లా షోకాజ్లిచ్చేది?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొందరు సొంత ప్రయోజనాలు, స్వార్థం కోసం తమ లాంటి యువకులను, తెలంగాణ కోసం కొట్లాడిన వారిని బలిచేస్తున్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. తనను చూసి ఓర్వలేని వ్యక్తులు ఏదో ఒకటి చేసి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టికెట్లు అమ్ముకునే వారితో షోకాజ్ నోటీసులు పంపుతారా? అని నిలదీశారు. ‘పార్టీలో పోస్టులు అమ్ముకుంటారు. కమిటీలు వేసేందుకు డబ్బులు తీసుకుంటారు. టికెట్లు అమ్ముకుంటారు. పక్క పార్టీలతో కుమ్మక్కవుతారు. అలాంటి వాళ్లా నాకు షోకాజ్ నోటీసులిచ్చేది’అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలు ఏమిటో తెలియని వారు నాకు నోటీసులిస్తారా? కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని గుర్తించకుండా రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలంటారా? అని ప్రశ్నలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాతోపాటు పార్టీ కమిటీలపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపిన నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసేందుకుగల కారణాలను వివరించారు. కేసీఆర్‌ను తిడితేనే పదవులా? పార్టీలో అంతర్గతంగా మాట్లాడి సూచనలు చేస్తే పట్టించుకోరని, బలంగా ఏదైనా చెబితే పక్కనపెడతారని, అందుకనే బహిరంగంగా మట్లాడాల్సి వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం ఆవేదనతో కూడినవేనని చెప్పారు. తన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందో లేదో పార్టీ సీనియర్లు గుండెలపై చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీకి సేవ చేస్తామని, తమ లాంటి యువ నాయకులను, కేసీఆర్‌పై గట్టిగా కొట్లాడుతున్న వారిని ముందు పెట్టాలని అడిగడం తప్పేనా? అని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు తమను బలంగా కోరుకుటంన్నారని, అది మరచిపోయి అనర్హులు, పార్టీ మారిన వారు, జైళ్లకు పోయిన వారిని కమిటీల్లో నియమించారని దుయ్యబట్టారు. కమిటీలో కేవలం 25 శాతం మందే అర్హులున్నారని, మిగతా వారంతా అనర్హులేనన్నారు. బూతు పురాణం మాట్లాడితే, కేసీఆర్‌ను తిడితేనా పదవులు ఇస్తారా? అని అడిగారు. రాష్ట్రంలో బలంగా టీఆర్ఎస్ వ్యతిరేక వపనాలు వీస్తున్నాయని, ఈ సమయంలో సత్తా ఉన్న నేతలను ముందుపెట్టాలని కోరారు. ‘మీరే ముఖ్యమంత్రులు, మంత్రులు అవ్వండి. మాకెలాంటి పదవులు వద్దు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం. కానీ మాలాంటి యువకులను ప్రోత్సహించండి. మా సేవలు వాడుకోండి. మంచి వాళ్లకు టికెట్లివ్వండి’అని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. పార్టీ నిద్రపోతోంది... కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాల్సిన బాధ్యత సీనియర్లపై ఉందని, అయితే పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లోనూ సమన్వయం లేకనే పార్టీ ఓడిందన్నారు. పార్టీలో అందరూ ముఖ్యమంత్రి, మంత్రులు కావాలని కోరుకుంటున్న వారు తప్పితే కష్టపడ్డ వారిని ప్రోత్సహించే ఆలోచన ఎవరిలోనూ లేదన్నారు. టీఆర్ఎస్లో చేరిన కె.ఆర్. సురేశ్‌రెడ్డి పేరు పార్టీ కమిటీల్లో ఉందంటేనే పార్టీ నిద్రపోతోందని అర్థమవుతోందని, కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారని, కమిటీలు ఇష్టారీతిగా నియమించారని ఆరోపించారు. ఎన్నికల కమిటీలో 41 మంది ఏమిటని, అంత మంది ఉంటే వారు కొట్టుకోవడానికే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా కమిటీని 9 మందికి కుదించాలన్నారు. ఎన్నికల హామీలన్నీ ఉత్తమ్ చెప్పేశాక మేనిఫెస్టో కమిటీ ఎందుకని ప్రశ్నించారు. రూ. 2 లక్షల చొప్పున రుణ మాఫీ, అందరికీ సన్న బియ్యం, ఉద్యోగాలు, పింఛన్లు పెంపు తదితర హామీలను ప్రకటించాక మెనిఫెస్టో కమిటీ ఏం చేస్తుందన్నారు. వ్యతిరేక శక్తులను ఉత్తమ్ తయారు చేశారు ... పార్టీ నుంచి తనను బయటకు పంపే ఆలోచన రాష్ట్ర ఇన్చార్జి కుంతియాకుగానీ, అధిష్టానానికి కానీ లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తులే బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తనను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము, ధైర్యం స్వార్ధపరులకు లేదన్నారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో తనకు వ్యతిరేక శక్తులుగా కొందరిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తయారు చేశారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు చెబితే బయటకు పంపి మీ కళ్లను మీరే పొడుచుకుంటారా..? అని ప్రశ్నించారు. తనలాంటి వారిని బయటకు పంపితే పార్టీకే నష్టమన్నారు. సీనియర్ నేతలను సమన్వయం చేయడంలో కుంతియా విఫలమవుతున్నారని, తనలాంటి యువకుల సూచనలు వినకుండా ఉత్తమ్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శించారు. దీనిపై హైకమాండ్ ఆలోచించాలన్నారు. పార్టీలో కోవర్టులున్నారు... కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని రాజగోపాల్‌రెడ్డి మరో బాంబు పేల్చారు. ఎదుటి పార్టీ అభ్యర్థిపై బలహీన వ్యక్తలను రంగంలోకి దింపే ప్రయత్నాలను కోవర్టులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గత ఎన్నికల్లో పార్టీని ఓడించారని, ఇప్పుడూ అదే చేయబోతున్నారన్నారు. తాను పార్టీ మారబోతున్నానన్నది ప్రచారమేనని, తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా మరో మూడేళ్ల పదవి ఉందని, అయితే పార్టీ పోటీ చేయమంటేనే మునుగోడు నుంచి చేస్తానని లేదంటే చేయనన్నారు. తనకు అందిన షోకాజ్ నోటీసుపై లేఖ రూపంలో వివరణ ఇస్తానని, దానిపై పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు. -
శనిలా తగిలావు కుంతియా..
సాక్షి, యాదాద్రి: ‘ఎక్కడి నుంచి వచ్చావు.. మాకు శనిలాగా తగిలావు నాయనా.. ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం, కార్యకర్తల కోసం కష్టపడుతున్న నాయకులను కాదని బ్రోకర్‌నా కొడుకులను ఎక్కడి నుంచి తెచ్చావు.. అని ఫోన్ చేసి కుంతియాను నిలదీశా.. నాకు కుంతియా అంటే భయమా.. కుంతియాకు భయపడాలా.. వంద మంది కుంతియాలు వచ్చినా నన్నేం చేయలేరు, నా బీఫారం ఆపలేరు. చాలా బాధగా ఉంది.. ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం కష్టపడేవారికి టికెట్లు ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుంది తప్ప గాంధీభవన్‌లో టీవీల ముందు కూర్చుని మాట్లాడేవారికి, నమస్తే పెడితే ప్రతి నమస్కారం చేయనివారికి టికెట్లు ఇస్తే పార్టీ గెలుస్తుందా? పైరవీకారులను దూరంగా పెట్టాలని, కోమటిరెడ్డి బ్రదర్స్ అవసరమా.. లేదా.. అని నిలదీశాను’ అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్వరంతో అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. బుధవారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ అధిష్టానంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పైరవీకారులను పక్కన పెట్టాలని, మామూలు వ్యక్తులను కాకుండా ప్రజల్లో మమేకమైనవారికి టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఏఐసీసీ ప్రకటించిన వివిధ కమిటీల్లో వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. కమిటీని చూసి నివ్వెరపోయానని, ఇదే విషయాన్ని రాష్ట్ర ఇన్చార్జి కుంతియాకు ఫోన్ చేసి నిలదీశానని తెలిపారు. తెలంగాణకు శనిలా తగిలావని నిలదీశానన్నారు. ప్రజలకు ఎవరు అవసరమో తెలుసుకోకుండా బ్రోకర్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చావని కుంతియాను ప్రశ్నించానని చెప్పారు. కాంగ్రెస్ నేతలే అవమానించారు... ప్రజల కోసం బతుకుతున్నానని, ప్రజల మధ్యన ఉంటానని, అంతకుమించి ఎవరికీ భయపడాల్సిన, తలవంచాల్సిన అవసరం లేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉన్నా తప్పుడు నిర్ణయాలతో ఓడిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచినా, రెండున్నరేళ్లుగా తనను వందసార్లు కాంగ్రెస్ నాయకులే అవమానించి ఇంట్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. పార్టీ గెలవాలంటే మీరైతేనే కుదురుతుందని కార్యకర్తలు బతిమిలాడితే మునుగోడులో పోటీ చేసేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి చెంచాలను పెట్టుకున్నా, నయీం ముఠాను అడ్డు ఉంచుకున్నా, 150 మందిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసినా రెండు వందల ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్పై విజయం సాధించానని గుర్తుచేశారు. ఆ విజయం వల్ల జిల్లా, తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో గుర్తింపు వచ్చిందన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా సేవ చేసేందుకే వస్తున్నానని, పదవీకాంక్షతో కాదని తెలిపారు. కార్యకర్తలకు జీవితం అంకితం కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుని వారి వెంటే ఉంటూ తన జీవితాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తానని రాజగోపాల్‌రెడ్డి ఉద్వేగంగా ప్రకటించారు. ‘మన ప్రభుత్వ ఏర్పాటు ద్వారా మనందరం బాగుంటాం, మన పార్టీ బాగుంటుంది, మన ప్రాంతం బాగుపడుతుంది’ అంటూ వివరించారు. ఎవరినీ విమర్శించకుండా మంచి మనసుతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు. సోనియాగాంధీ, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన తనను 2009 ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందిస్తున్న తరుణంలో గ్రూప్ తగాదాల మూలంగా 2014లో ఓటమి ఎదురైందని తెలిపారు. ఏది ఏమైనా మునుగోడు బరిలో నిలిచి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు. మనందరి లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటేన’ని ఆయన అన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. ఎవరినో విమర్శించాలన్నది తన ఆలోచన కాదని, మంచి మనసుతో ముందుకు సాగుదామని అన్నారు. మనందరి లక్ష్యం ఒక్కటేనని, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటేనని అన్నారు. -
ప్రభుత్వాన్ని ఎందుకు రద్దుచేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఐదేళ్లు పాలించమని టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే, ప్రభుత్వాన్ని ముందుగానే ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో సీఎం కేసీఆర్ చెప్పా లని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అసలు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఆరు సర్వేల్లోను టీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు వచ్చాయని చెబుతున్న కేసీఆర్ ఇక ముందస్తుకు వెళ్లడం దేనికని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న భయం ఆయనలో నెలకొందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని, ముందస్తు ఎన్నికలు జరిగినా, సాధారణ ఎన్నికలు జరి గినా విజయం తమదే అన్ని ధీమా వ్యక్తం చేశారు. ఇక పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్తగా ఏర్పాటు చేసిన కోర్, మేని ఫెస్టో, ప్రచార కమిటీల్లో తెలంగాణ నేతలకు ప్రాతినిథ్యం లేకపోవడంపై మీడియా ప్రశ్నించగా.. ఈ కమిటీలను రాష్ట్రాలవారీగా ఏర్పాటు చేయలేదని, ఈ కమిటీల్లో స్థానం లేని వారికి ఇతర కమిటీల్లో స్థానం కల్పిస్తామని కుంతియా తెలిపారు. సెప్టెంబర్ రెండో వారంలో తొలి జాబితా కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ప్రకటన మొదలు క్షేత్రస్థాయిలో కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా రూపొందిస్తామని ఏఐసీసీ వర్గాలు తెలిపా యి. సెప్టెంబర్ రెండో వారంలో 60 మందితో కూడి న తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. పార్టీకి అనుకూలత, పోటీలేని నియోజకవర్గాల్లో మొదట అభ్యర్థులను ప్రకటించనుంది. ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు చెప్పించుకొని జాబితా విడుదల చేస్తామని తెలిపాయి. రాష్ట్ర స్థాయిలో ప్రచా ర, మేనిఫెస్టో కమిటీలు, కొత్త జిల్లాల వారీగా కమిటీ ఏర్పాటు తుది దశకు వచ్చిందని, వీటి ఆమోదంపై రాహుల్ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పాయి. కుటుంబం నుంచి ఒక్కరికే టిక్కెట్టు ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని రాష్ట్రంలో అనుసరించబోదని.. బలమైన అభ్యర్థులు ఉంటే కుటుంబానికి 2 టికెట్లు ఇస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
ఆదరణ తగ్గుతుందనే ముందస్తు ఎన్నికలు
ఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలని అనుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా ప్రశ్నించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారు..కానీ ముందస్తు ఎన్నికలు పోతామని సంకేతాలు ఇవ్వడం దేనికి నిదర్శమన్నారు. వాళ్ల అవినీతి ఏమైనా బయట పడుతుందేమోనని కేసీఆర్ భయపడుతున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని, తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని జోస్యం చెప్పారు. 2018 ఏప్రిల్ వరకు ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత టీఆర్ఎస్పై ఉందని, కేసీఆర్‌కి తెలంగాణ ప్రజల ఆదరణ తగ్గుతుందనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగితే సెప్టెంబర్ నుంచి తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని, ప్రభుత్వ నిధులు కూడా వృథా అవుతాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా నెరవేర్చారా..ప్రజలకు సమాధానం చెప్పాలని సూటిగా అడిగారు. -
కుంతియాను అవమానించారా?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియాకు అవమానం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై ఆయన కాంగ్రెస్ బస్సుయాత్ర కోఆర్డినేషన్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఇన్చార్జ్గా ఉన్నా కదా. గులాం నబీకి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తారు. అధిష్టానం నుంచి అధికార ప్రకటన రాకముందే ఇలా చేసి నన్ను అవమానించినట్టే. నేనే ఇన్చార్జ్గా ఉండాలని నాకేం లేదు. కానీ పార్టీ ప్రకటించిన తర్వాత ఏమైనా చేసుకోండి. అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని కుంతియా ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.’ కాగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుంతియా సమర్థవంతంగా పని చేయడం లేదని భావించిన అధిష్టానం తాజాగా ఆజాద్ పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. అయితే అధికారిక ప్రకటన రాకముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు ఆజాద్ రాకను స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై కుంతియ కినుక వహించినట్లు సమాచారం. -
‘మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేదు’
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా ఆరోపించారు. మోదీ వైఫల్యాలపై శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఉన్న ఉద్యోగాలు పోయ్యాయని విమర్శించారు. బీజేపీ పాలనలో విద్యావిధానం పూర్తిగా కార్పొరేటికరణ అయిందన్నారు. విదేశాల్లో దాగిఉన్న నల్లధనం తీసుకువచ్చి జన్‌ధన్ ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన మోదీ నల్లధనాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. పెట్రొల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, ముడిచమురు చారెల్ ధర తక్కువగా ఉన్నా కూడా ప్రజల మీద భారం పెంచుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో ప్రజలకు భద్రత కరువైందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే దేశ భద్రతా బలగాల, పౌరుల ప్రాణాలు ఎందుకు పోతున్నాయని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. -
సభ్యత్వ రద్దు అప్రజాస్వామికం: కుంతియా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు, సస్పెన్షన్ల వ్యవహారాన్ని ఏఐసీసీ ఖండించింది. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం దురదృష్టకరం. కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దు అప్రజాస్వామి కం. కాంగ్రెస్ హయాంలో హరీశ్‌రావు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, పార్లమెం టులో టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి గందరగోళం చేసినప్పుడు లేని తప్పు.. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తే వచ్చిందా? టీఆర్ఎస్ నేతలు తమను తాము ప్రజాస్వామికవాదులు అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినంత మాత్రానా ఆందోళనలు ఆగవు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుంది. సభలో ఏం జరిగిందో ఫుటేజీ బయటపెట్టాలి. ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలి’ అని అన్నారు. -
కువైట్‌లో తెలంగాణ కార్మికుల ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ద్వారా స్వదేశానికి రావాలనుకుంటున్న ప్రవాస భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా అన్నారు. వారికి సహాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఏఐసీసీ నేతృత్వంలోని ఓ బృందం ఇటీవల కువైట్‌లో పర్యటించిన సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అనుభవాలను ఆయన గురువారం గాంధీభవన్‌లో మీడియాతో పంచుకున్నారు. వేల సంఖ్యలో తెలంగాణకు చెందిన కార్మికులు తిరిగి వచ్చేయాలనుకుంటున్నారని చెప్పారు. వారు కనీసం టికెట్లకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 20 మందికి టికెట్లు ఇచ్చి తీసుకువచ్చామన్నారు. మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా టికెట్ ఖర్చులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆజాద్‌కు ఘన నివాళులు.. కేంద్రంలో మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు ఏకతాటిపైకి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయమని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్.సి.కుంతియా వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్లో అన్ని సామాజిక వర్గాలను ఏకం చేసినట్టుగానే రాష్ట్రంలోనూ ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ వంటి వారందరినీ ఏకం చేస్తామని ప్రకటించారు. దీనికోసం పీసీసీ స్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక శక్తులన్నీ కాంగ్రెస్‌లో చేరడమో, కాంగ్రెస్‌తో కలిసి పని చేయడమో తప్పదని పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి టీఆర్ఎస్తో సహా మిగిలిన పార్టీల నేతల చేరికలు నిరంతరంగా ఉంటాయన్నారు. ఇక పొత్తులు, కూటమి, సర్దుబాట్లు వంటివన్నీ ఎన్నికల సమయంలో తేలుతాయని, వీటిపై టీపీసీసీ ప్రకటన చేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సారథిగా ప్రొఫెసర్ కోదండరాంపై గౌరవముందని, ఆయన రాజకీయ పార్టీపై ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రతిరూపంగా నిలిచిన కోదండరాంను కాంగ్రెస్ ఏజెంటు అంటూ మాట్లాడటం సరికాదన్నారు. కోదండరాంతో వైరం అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర ఎంతో కీలకమనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవమని వ్యాఖ్యానించారు. జూన్ 2న హైదరాబాద్‌లో సభ టీఆర్ఎస్ ఓడిపోతుందని స్వయంగా మంత్రి కేటీఆరే వ్యాఖ్యానించారన్నారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాదయాత్రలు ఉంటా యని తెలిపారు. మూడు లేదా నాలుగు బృం దాలు పాదయాత్రలుగా జూన్ 2న హైదరాబాద్‌కు చేరాలనే ప్రతిపాదన ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వస్తుందని వెల్లడించారు. జూన్ 2న హైదరాబాద్‌లో 10 లక్షల మందితో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని వెల్లడించారు. అంతకుముందు వరంగల్, మహబూబ్‌నగర్ లేదా మెదక్‌లోనూ రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే చేరికలపై నిర్ణయాలు ఉంటాయని, నాగం జనార్దన్‌రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. కువైట్‌కు కాంగ్రెస్ బృందం గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12న కాంగ్రెస్ బృందం కువైట్‌కు వెళ్తుందని కుంతియా వెల్లడించారు. గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందని తెలిపారు. గల్ఫ్‌లో క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ద్వారా 30 వేల మంది భారతీయ కార్మికులు దేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్మికులకు ఉచితంగా టికెట్లను అందించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చి, సీఎం అయిన తర్వాత కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయలేని దద్దమ్మ కేసీఆర్: ఉత్తమ్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేని దద్దమ్మ అని టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లయినా ఏడు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిం దని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికే లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని.. పదవీ విరమణ చేసిన, కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 2 లక్షలు ఖాళీగా ఉన్నాయన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ నేతృత్వంలో నిరుద్యోగ చైతన్య యాత్రను మంగళవారం జెండా ఉత్తమ్ ప్రారంభించారు. అలంపూర్‌లో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర.. 119 నియోజకవర్గాల్లో 49రోజుల పాటు సాగుతుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను ఎలా మోసం చేస్తున్నదో, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎలా న్యాయం చేయనుందో వివరించడమే యాత్ర లక్ష్యమ న్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి కేటీఆర్ సూటు, బూటు వేసుకుని విదేశాల్లో విలాసాలు చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. -
‘కోదండ రాం మాకు ప్రత్యర్థి కాదు’
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాకు ప్రత్యర్థి కాదని, అలాగే ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కాదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణాలో టీఆర్ఎస్తో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని..పొత్తులకు చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. వాటి గురించి పీసీసీ చీఫ్ స్పందిస్తారని తెలిపారు. కోదండరాం గొప్ప వ్యక్తి అని, ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు. గుజరాత్ మాదిరి అన్ని వర్గాలను కలుపుకుని వెళతామని, టీఆర్ఎస్ ఓడిపోతుందనే విధంగా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయంటూ పరోక్షంగా చురకలు అంటించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని, దీనికి కోసం చాలా మందితో ఉత్తమ్ మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి రావాలని, త్వరలో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు చేస్తామని, జూన్2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ వారం టీఆర్ఎస్, టీడీపీ నుంచి పలువురు ముఖ్యులు కాంగ్రెస్‌లో చేరతారని, బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డిని వద్దని పార్టీలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నామని, ప్రవాస గల్ఫ్ ఎన్నారైలకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందని వివరించారు. ఈ నెల 12 నుంచి కాంగ్రెస్ బృందం కువైట్‌లో పర్యటిస్తుందని, గల్ఫ్‌లో క్షమాబిక్ష (ఆమ్నెస్టీ )పథకంలో..ముప్పై వేల మంది భారతీయ కార్మికులు దేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని, ఆ కార్మికులకు ఫ్రీ టికెట్ లు అందించాలని కోరారు. గల్ఫ్ ఎన్నారైల భాదలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదన్నారు. కువైట్‌కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపించి..ఎన్నారై పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ ఇందుకే ఇచ్చామా?
నల్లగొండ టూటౌన్: తమ కార్యకర్తలను చంపేందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో కుంతియా మాట్లాడారు. శ్రీనివాస్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ హత్యపై పార్లమెంట్లో చర్చ లేవనెత్తుతామని తెలిపారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలను తిప్పికొడతామన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. శ్రీనివాస్ హత్యలో భాగస్వామ్యం ఉన్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కనీసం సంతాపం కూడా తెలపలేదని విమర్శించారు. నార్కట్‌పల్లిలోని కాఫీ డే హోటల్‌కు శ్రీనివాస్‌ను పిలిపించి పార్టీ మారాలంటూ ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరించినది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్యకు సీఎం నుంచి జిల్లా ఎస్పీ వరకు బాధ్యత వహించాలన్నారు. కేసును తప్పుదోవ పట్టించిన ఎస్పీ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హత్య కేసులో నిందితులు జైలుకు వెళ్లిన ఐదు రోజుల్లో బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తమ కార్యకర్తలను హింసించే అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో, బయటా నిలదీస్తామని తెలిపారు. టీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. కానిస్టేబుల్‌కు తక్కువ.. హోంగార్డుకు ఎక్కువ: రేవంత్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కానిస్టేబుల్‌కు తక్కువ.. హోంగార్డుకు ఎక్కువగా ఉన్నందునే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాల్ డేటా ఆధారంగా తొలుత ఎమ్మెల్యే వీరేశం, అతడి కుటుంబ సభ్యుల బట్టలూడదీస్తే.. వారి వెనకాల ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి బయటికి వస్తారని పేర్కొన్నారు. ఆయన వీపు పగులగొడితే సీఎం కేసీఆర్ బయటికి వస్తారన్నారు. కాంగ్రెస్ పాలనలో కన్నెర్ర చేసి ఉంటే కేసీఆర్ కుటుంబం ఊర్లు తిరిగేదా అని ప్రశ్నించారు. మొండేలతో మోరీలు నిండుతాయి: కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తలచుకుంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మొండేలతో మోరీలు నిండుతాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ పార్టీది గాంధీ సిద్ధాంతమన్నారు. పది మందికి సాయం చేసే గుణమే తప్ప తమకు హత్యా రాజకీయాలు తెలియవన్నారు. తనను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతకుముందు శ్రీనివాస్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కుటుంబ పాలన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అమరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను రాజకీయాల నుంచి తప్పిస్తేనే సాధించుకున్న రాష్ట్రానికి సార్థకత చేకూరుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా వ్యాఖ్యానించారు. అందుకోసం ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదం తో ప్రతీ కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించిన ‘జనగర్జన’ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ఆ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్ హామీ నెరవేరలేదని, కానీ, వారి ఇంట్లో అందరికీ పదవులు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు. దేశంలోనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయన్నారు. బుధవారం ఒక్క రోజే కరీంనగర్ జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయన్నారు. దేశం లో మోదీ–అమిత్‌షాను ఢీకొనగలిగిన సత్తా ఉన్న నాయకుడు రాహుల్‌గాంధీ ఒక్కరేనన్నారు. అందుకు నిదర్శనం గుజరాత్ ఎన్నికల ఫలితాలేనని చెప్పారు. 22 ఏళ్లుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా 80 స్థానాలు సాధించటం రాహుల్ గొప్పతనమేనని కుంతియా అన్నారు. అంతా గోబెల్స్ ప్రచారం: ఉత్తమ్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేస్తున్నది గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ చెప్పుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దోపిడీ పాలన సాగుతోందన్నారు. విద్యుత్ విషయంలో ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిటైనా ప్రారంభించారా? అని ప్రశ్నించారు. జైపూర్ వద్ద 12 వందల మెగావాట్ల ప్లాంట్, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు కాంగ్రెస్ హయాంలోనివేనన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉండటానికి కారణం కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల వల్లే సాధ్యమైందన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించకుండా లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టారని ఆరోపించారు. ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రస్తుతం అదే ఆశయం కోసం మరో దఫా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆత్మగౌరవం దొరగడీల్లో బందీగా మారిందన్నారు. రాష్ట్రానికి వస్తున్న రాబడిని సీఎం కేసీఆర్ తన సొంత కుటుంబ విలాసాలకు వాడు కుంటున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని.. అందుకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సభలో మండలి విపక్షనేత షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీకృష్ణ, నేతలు వీహెచ్, అనిల్‌కుమార్ యాదవ్, శ్రావణ్‌కుమార్, మల్లు రవి తదితరులు ప్రసంగించారు. -
కుల, మతాల మధ్య చిచ్చు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు. ఖమ్మం అర్బన్ మండలం చింతగుర్తిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం అధ్యక్షతన గురువారం రాత్రి నిర్వహించిన ప్రజా చైతన్య సభలో కుంతియా మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆదుకోవాల్సిన కేసీఆర్ ప్రభుత్వం వారి ఆకాంక్షలు, ఆశలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే ఈ చిచ్చు వారికే అంటుకోవడం ఖాయమన్నారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులను దేశ ద్రోహుల మాదిరిగా బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించి సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటిస్తే.. అందుకు భిన్నంగా కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రభంజనంలో వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలికి కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, దేశంలో మోడీ శకం ముగిసినట్లేనన్నారు. గుజరాత్ ప్రజల తీర్పు ముందే ఊహించిన మోదీ పదిరోజుల నుంచి ఒక ప్రకటన సైతం చేయలేని దుస్థితి నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందనడానికి ఇది ఉదాహరణగా పేర్కొన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి: ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడక తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగ యువత ఇప్పుడు తీవ్ర నిరాశ, నైరాశ్యంతో కొట్టు మిట్టాడుతోందన్నారు. కొలువులు అడిగిన నిరుద్యోగ యువకులను కేసీఆర్ ప్రభుత్వం జైళ్లలో వేస్తోందని, ఇంతటి నిరంకుశ పాలన గతంలో లేదన్నారు. రాష్ట్రంలో 2014 నాటికి 1,07,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. కేసీఆర్ ప్రభుత్వం కనీసం 7 వేల ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేని దుస్థితిలో ఉందన్నారు. ఇక తెలంగాణ తెచ్చుకున్న ప్రయోజనం ఏముంటుందో.. నిరుద్యోగులకు ఉపశమనం ఎలా కలుగుతుందో కేసీఆర్ ప్రభుత్వమే సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బలహీన, బడుగు వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా.. లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతిగా అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని సీతారామసాగర్ ప్రాజెక్టు అంచనా విలువలను పదింతలు చేసి కాంట్రాక్టర్లు, ప్రభుత్వం ప్రజల సొమ్మును దండుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, శాసనమండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
కుంతియా వద్ద ఖమ్మం కాంగ్రెస్ పంచాయితీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా వద్ద పంచాయితీ జరిగినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికకోసం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రాష్ట్ర నేతలు ఢిల్లీ వచ్చారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు కుంతియాతో సుమారు గంటన్నర సమావేశమై చర్చించినట్టు సమాచారం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవుల్లో తమకు అయిన వారినే నియమించుకుంటున్నారని, పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ టికెట్ల కోసం పార్టీలోకి వస్తున్న కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ముఖ్యమైన అంశాలపై స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారని సమాచారం. ఈ సందర్భంగా నేతలు పరస్పరం వాదనలకు దిగినట్టు తెలిసింది. వర్గపోరు విడిచి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కుంతియా హితవు పలికారు. పార్టీ పటిష్టతకుగాను అందరూ కలసి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించగా, దీనికి రేణుకా చౌదరి, భట్టి, సుధాకర్‌రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది. -
రేవంత్ రెడ్డితో కుంతియా సమావేశం
సాక్షి, హైదరాబాద్ : టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డితో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియ శనివారం భేటీ అయ్యారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ, పార్టీలో రేవంత్ స్థానంతో పాటు, ఆయన పదవిపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు గిరిజన రైతు గర్జన పేరిట ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లుపై కూడా కుంతియా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా టీడీపీలో ఉంటే ఎప్పటికీ సీఎం పీఠం దక్కదని భావించి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారన్న ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రేవంతే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో కార్యకర్తలు ప్లకార్డులు కూడా పట్టారు. రేవంత్‌కు ఉన్న జనాదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదన్న వాదన బయలుదేరింది. ఈ నేపథ్యంలో రేవంత్‌తో కుంతియా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
పోలీసుల చర్య అప్రజాస్వామికం
సాక్షి, న్యూఢిల్లీ: రైతు సమస్యలపై చలో అసెంబ్లీ ర్యాలీని చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను, రైతు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ఖండించారు. ప్రజా స్వామ్యబద్ధంగా రాష్ట్రంలోని రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన ర్యాలీని అనుమతి లేదన్న కారణంతో అడ్డుకోవడం తగదన్నారు. కాంగ్రెస్ నేతలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రైతు సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన ఆనందం ప్రజల్లో లేదని, దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని విమర్శించారు. -
షరతుల్లేకుండా ఎవరైనా చేరొచ్చు
-
షరతుల్లేకుండా ఎవరైనా చేరొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఏ పార్టీ నేతలైనా షరతు ల్లేకుండా కాంగ్రెస్‌లో చేరవచ్చని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా అన్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ఉహాగా నాలు జోరందుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీపై నమ్మకంతో చేరేవారిని ఎవరినైనా ఆహ్వానిస్తామని రేవంత్‌రెడ్డి చేరికను పరోక్షంగా ప్రస్తావించారు. రేవంత్ చేరికపై ఎలాంటి సమాచారం లేదని చెబుతూనే.. ఎవరొచ్చినా చేర్చుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు అన్ని చర్యలు తీసు కొని.. 2019 ఎన్నికలకు సిద్ధమవుతామన్నా రు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి కుటుంబ అభివృద్ధికే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరిం చుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలహీనపడిందని, అమిత్ షా ప్రభా వం లేకపోవడంతో బలపడే అవకాశాలు లేవని గుర్తించే ఆ పార్టీ తెలంగాణకు చెందిన నేతను కేంద్ర కేబినెట్ నుంచి తప్పించిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటామని పేర్కొన్నారు. -
'టీఆర్ఎస్కు బుద్ధి చెబుదాం'
కాంగ్రెస్ శ్రేణులకు నేతల పిలుపు సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యంకాని హామీలు, మాటలతో మభ్యపెడుతున్న టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బుధవారం గాంధీభవన్‌లో ఆయన బి-ఫారాలను జారీ చేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు షబ్బీర్ అలీ సమక్షంలో అభ్యర్థులు బి-ఫారాలను అందుకున్నారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్నను, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి రవికుమార్ గుప్తాను పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరు గురువారం నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన ఆ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేవిధంగా కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, వక్ఫ్‌భూములపై ఏర్పాటైన శాసనసభా సంఘం తొలి సమావేశంలో పాల్గొన్న షబ్బీర్ అలీ.. సర్కారు తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కబ్జాలైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించి బడాబాబులకు ప్రభుత్వం మేలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, టి. జీవన్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత మొక్కుల కోసం ప్రజా సొమ్మును ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని అరుణ వ్యాఖ్యానించారు. తన కోరికలు తీరితే పక్కవాడి తలనీలాలు ఇచ్చినట్టుగా సీఎం వ్యవహారం ఉందని ఆమె అన్నారు. ఇక కేజీ నుంచి పీజీ విద్యపై ప్రభుత్వానికి స్పష్టత లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లబోధన లేకుండా, మధ్యలో ప్రవేశపెడితే ఆచరణలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ హామీ మేరకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు.