
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కొంత మంది పదవులు అనుభవించి పార్టీలు మారిపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీలు మారుతున్న వారు ముందుగా వారి పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై శనివారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఆశావహులు అధికంగా ఉంటారని, అందరికీ సీట్లు కేటాయించడం సాధ్యం కాదని చెప్పారు. ఖమ్మం లోక్‌సభ రేసులో రేణుకా చౌదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు కుంతియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment