సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పోకడలను లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంతృప్తికర పోటీ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం కుంతియా.. గెలిచిన ఎంపీలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ రోజు రోజుకూ పటిష్టం అవుతోందన్నారు.
కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, రాజకీయ ఫిరాయింపులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, పదహారు సీట్లు అంటూ విర్రవీగిన కేసీఆర్‌ను సింగిల్ డిజిట్ వద్ద ఆపి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజాస్వామ్య వాదిలా పనిచేయాలని హితవు పలికారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని, మూడింట గెలిచి, మరో రెండు చోట్ల మెజారిటీతో ఓటమి పాలైందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment