తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం అనైతిక చర్య అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా వ్యాఖ్యానించారు. కుంతియా బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. నీతి నియమాలు, దమ్మూ దైర్యం ఉంటే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన అందరూ రాజీమానా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశామని, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామని, అయినా కూడా ఎలాంటి స్పందన లేదని వివరించారు.
ఇదే అంశంపై హైకోర్టులో కూడా కేసు నడుస్తోందని చెప్పారు. హైకోర్టులో కేసు గెలుస్తామని మాకు నమ్మకం ఉందని అన్నారు. టీపీసీసీ పదవి మార్పుపై కాంగ్రెస్ అదిష్టానం దృష్టికి రాలేదని పేర్కొన్నారు. కవిత ఓటమితో కేసీఆర్ ఒక గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. తెలంగాణాలో కేసీఆర్‌కు ప్రజాదరణ తగ్గిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మొదట అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment