సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టికెట్లు దక్కని నేతలకు పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో సముచితస్థానం కల్పించి న్యాయం చేస్తా మని ఆశావహులకు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. టికెట్ల కేటాయింపులో బీసీ లకు అన్యాయం జరుగుతోందని పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం నిరాహార దీక్షకు దిగారు. కొల్లాపూర్ బరిలో నిలవాలనుకుంటున్న మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్ భవన్‌లోని వసతి గృహంలోనే దీక్షకు దిగారు. షాద్‌నగర్ పై ఆశలు పెట్టుకున్న కడియం పల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవరకద్ర సీటు ఆశిస్తున్న ప్రదీప్ గౌడ్‌లు భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగా రు. కుంతియా అక్కడికి చేరుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్ బీసీలకు 19 సీట్లు ఇస్తే కాంగ్రెస్ 94 స్థానాలకుగాను 22 సీట్లు ఇవ్వనుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment