
ఢిల్లీ: తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ఆందోళనకు దిగారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు కనీసం 40 సీట్లు కేటాయించి, సీఎం అభ్యర్థిగా బీసీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ నేతలు ఆందోళనకు దిగారు. నాలుగు శాతం ఉన్న సామాజికవర్గానికి 40కి పైగా సీట్లు ఇచ్చారని, 60 శాతం ఉన్న బీసీలకు తగిన సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఆందోళనలో నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ సెల్ కన్వీనర్ అశోక్ గౌడ్, పీసీసీ మాజీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment