Telangana Bhavan
-
కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ విషయాన్ని నేను గమనిస్తున్నా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పేరిట మళ్లీ ఏదో ఒక రూపంలో తెలంగాణలో అడుగు పెడుతానంటున్నడు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావొద్దు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, పార్టీ రజతోత్సవాల నిర్వహణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తదితర అంశాలపై మాట్లాడారు. సీఎంకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది ‘తెలంగాణ ప్రజలకు నచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అధికారంలో వచ్చినా కాంగ్రెస్‌కు అచ్చి రాలేదు. మంత్రివర్గానికి, సీఎంకు నడుమ సమన్వయం లేదు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చెప్పడం ద్వారా ఆయనకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది. మనం ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం పెంచుకుంటూ వచ్చి ప్రజలకు కావాల్సినవి సమకూర్చాం. కానీ గడిచిన మూడు త్రైమాసికాల్లో రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఖజానాను ఎలా నింపాలో వారికి తెలియడం లేదు..’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ ‘తెలంగాణ సమాజం సామాజిక, చారిత్రక అవసరాల కోసం తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. అలా పురుడు పోసుకున్న బిడ్డను నలిపివేయాలని ఎన్నో కుట్రలు సాగాయి. గతం గాయాల నుంచి కోలుకుంటున్న మనం తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముంది. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే ప్రజలను తిరిగి చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఇతర ముఖ్య నేతలు 7 నెలల పాటు సంస్థాగత నిర్మాణం ‘ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పనిచేయాలి. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, అదే నెల 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి సంబంధించి సబ్ కమిటీ బాధ్యతలు హరీశ్‌రావుకు అప్పగిస్తున్నాం. ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. అక్టోబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తాం. త్వరలో 30 మందికి పైగా కీలక నేతలతో భేటీ జరిపి అన్ని అంశాలపైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం. సోషల్ మీడియా సహా పార్టీ అనుబంధ కమిటీలను బలోపేతం చేస్తాం..’ అని కేసీఆర్ తెలిపారు. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందుకే ఓటమి ‘రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. కానీ బీఆర్ఎస్కు తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాం. కొత్త తరానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యం, బీఆర్ఎస్ పోషించిన పాత్రను వివరించాలి. తెలంగాణ చరిత్రను అర్ధం చేసుకుంటే గుండె బరువెక్కుతుంది. భారతదేశంలో విలీనం తర్వాత కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోలేక పోయింది. రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ అడుగడుగునా కుట్రపూరిత రాజకీయాలు చేసింది. వలసాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను అన్ని విధాల నాశనం చేశారు. తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో నా ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా తెలంగాణ తనకు తాను నిలబడాలనే ఆకాంక్షతో పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పార్టీ యంత్రాంగంతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, వివిధ వర్గాలను కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో పార్టీ రజతోత్సవ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించాలి. తెలంగాణ చరిత్ర, బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించే డాక్యుమెంటరీలకు రూపకల్పన జరగాలి..’ అని మాజీ సీఎం ఆదేశించారు. అభిప్రాయాలు వెల్లడించిన నేతలు సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులతో పాటు సీనియర్, జూనియర్ నాయకులు 29 మంది మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, యువతతో పాటు వివిధ వర్గాలకు చేరువ కావాల్సిన అవసరం, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయాలనే ఆభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాకేశ్‌రెడ్డి, రాజా వరప్రసాద్, మూల విజయారెడ్డి, దాసరి ఉష, సత్య తదితరులు ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు సహా మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, తదితర నేతలు హాజరయ్యారు. -
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సేనని.. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు బీఆర్ఎస్ ఒక్కటే మార్గమన్నారు. ‘‘తెలంగాణ అస్థిత్వం, పరిరక్షణే మాకు ముఖ్యం. ప్రజల అస్తిత్వం కోసం పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.విస్తృత స్థాయి సమావేశంలో 30 మంది వారి అభిప్రాయాలు చెప్పారు. తెలంగాణ ప్రజల పండుగగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తాం. అందరిని భాగ స్వామ్యం చేస్తూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తాం.ఏప్రిల్ రెండో వారంలో ప్రతినిధుల సమావేశం ఉంటుంది. ఏప్రిల్ 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. పార్టీ సభ్యత్వ సమోదు కార్య క్రమం. పార్టీ నేతలకు శిక్షణ తరగతులు చేపడతాం. త్వరలోనే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అధ్యక్షలను ఎంపిక చేస్తాం. 2026 ఏప్రిల్ వరకు సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, ప్రజా పోరాటాలు చేస్తాం. రేవంత్ రెడ్డిని వాళ్ల కేబినెట్ మంత్రులే పట్టించుకోవడం లేదు. 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో రేవంత్ చెప్పాలి’’ అని కేటీఆర్ నిలదీశారు. -
తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తుండటంతో కోలాహలం
-
బీఆర్ఎస్ పనైపోయిందని మనవాళ్లే ప్రచారం చేశారు: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన ఆయన మండిపడ్డారు.‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 27న భారీ బహిరంగ సభఇక.. ఏప్రిల్‌లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్‌కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.భవిష్యత్తు బీఆర్ఎస్దేత్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి. బీఆర్ఎస్.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్ఎస్దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం.ఉప ఎన్నికలు గ్యారెంటీతెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన. ఒర్రకండిరా బాబూ..సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ రెన్యువల్అంతకు ముందు .. కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్‌లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. -
తెలంగాణ భవన్ కు కేసీఆర్
-
నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు రానున్నారు. తెలంగాణ భవన్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు కలుపుకొని సుమారు 400 మందికి ఆహ్వానం పంపారు.ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు చేపట్టాల్సిన రాజకీయ కార్యకలాపాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పేరిట ఆవిర్భవించిన బీఆర్ఎస్ వచ్చే ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. -
తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ జాతిపిత కేసీఆర్. నా ఒక్కడికే కాదు అందరికీ ఆయన బాపు. తెలంగాణ జాతికి, నాలుగు కోట్ల ప్రజలకు హీరో. సమైక్య పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన మహానుభావుడు. కారణ జన్ముడు ఆయన. కేసీఆర్ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదినం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ధన, కుల, మీడియా బలం లేకున్నా.. 25 ఏళ్ల క్రితం జనబలం, గుండె బలంతో పార్టీని ఏర్పాటు చేసి అవమానాలు, ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని తెలంగాణ కలను సాకారం చేశారు’అని అన్నారు. తెలంగాణలోని ఏ మూలకు వెళ్లి పలకరించినా అన్ని వర్గాలు.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ‘తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి ఆయన చేతిలో పెట్టడమే కేసీఆర్‌కు మనం ఇచ్చే బహుమానం. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 60 లక్షల మంది గులాబీ సైనికులు పనిచేయాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం: హరీశ్‌రావు ‘కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. ఆయనకు తెలంగాణతో ఉన్న బంధం, తల్లీబిడ్డల పేగుబంధం లాంటిది. గతంలో తెలుగుదేశంలో పనిచేసినా కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించారు. కేసీఆర్ మొండి పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తెచి్చన తెలంగాణను కన్నబిడ్డలా చూసుకుని, పదేళ్లలో అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికే రోల్‌మోడల్‌గా చేశారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో సీఎం రేవంత్ 20–20 మ్యాచ్‌లు అంటూ.. డబ్బుల కోసం తొండి మ్యాచ్ ఆడుతున్నారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని రేవంత్ తాపత్రయపడుతున్నారు. అన్ని వర్గాలూ.. రేవంత్ పాలన బాగోలేదంటూ, కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా కోరుకుంటున్నాయి. భవిష్యత్తులో మరో మూడు టర్ములు బీఆర్ఎస్ గెలుపొందడానికి కృషి జరుగుతోంది’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘రేవంత్ ఒక పిల్ల కాకి. కేసీఆర్ కళ్లు తెరిస్తే ఆయన పని ఖతమవుతుంది’అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణభవన్‌లో ఘనంగా వేడుకలు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు కలసి కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. కేసీఆర్ రాజకీయ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా రూపొందించిన ఫొటోలు, వీడియోను ప్రదర్శించారు.పార్టీ నేతలు కవిత, బండ ప్రకాశ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, రవిచంద్ర, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాలేరు వెంకటేశ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు చెప్పేందుకు ఎర్రవల్లికి బయలుదేరి వెళ్లారు. కార్యకర్తలు, అభిమానులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కేసీఆర్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జీవితానికి సరిపడే స్ఫూర్తిని ఇచ్చారు‘ప్రతీ కొడుకు నాన్నే తనకు హీరో అని చెప్తాడు. కానీ మా నాన్న నాకే కాదు తెలంగాణకే హీరో. మీ పోరాటంతో సాధించిన ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో మీ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతీక్షణం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. జీవితకాలానికి సరిపడా మీరు అందించిన స్ఫూర్తికి కృతజ్ఞతలు. నాన్నా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు’. –‘ఎక్స్’లో కేటీఆర్హ్యాపీ బర్త్‌డే డాడీ: కవితహ్యాపీ బర్త్‌డే డాడీ.. అంటూ కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, యుద్ధ నినాదం‘మీరు నా తలనిమిరే తల్లిప్రేమ. నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేరి్పంచి, నాలో ప్రజాసేవా సంస్కారాన్ని రంగరించి ఉద్యమ కార్యాచరణలో నడిపించారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, ఉద్రేకం, స్వాభిమానం, యుద్ధ నినాదం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం’. –‘ఎక్స్’లో హరీశ్‌రావు -
నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదిన వేడుకలు సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భాగంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేస్తారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.తెలంగాణ భవన్లో జరిగే కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పండ్ల పంపిణీ, అన్నదానం, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారని తలసాని వెల్లడించారు.మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. కాగా, కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘వృక్షార్చన’లో భాగంగా పంజగుట్టలోని జలగం వెంగళరావు పార్కులో 40 మంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
చాలా కాలం తర్వాత BRS ఆఫీస్ కు రానున్న కేసీఆర్
-
19న తెలంగాణ భవన్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KCR) సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు రానున్నారు. పార్టీ ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్‌కు 25 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు పార్టీ తరఫున ఆహ్వానం పంపించారు. కేసీఆర్ అధ్యక్షత న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బహిరంగ సభ వేదిక ఖరారు చేసే అవకాశంరాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అనుసరించాల్సిన కార్యాచ రణపైనా ఈ భేటీలో సమగ్రంగా చర్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజల హక్కులను కాపాడే దిశగా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ సత్తా చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభా వేదికను కూడా 19న జరిగే భేటీలో ఖరారు చేసే అవకాశముంది. ఆహ్వానితులు కచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.ఆరు నెలల తర్వాత..సుమారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత ఏడాది జూలై 23న తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్ నేతలతో భేటీలో ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేతలను తయారు చేసుకోవడం బీఆర్ఎస్కు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. -
కాంగ్రెస్ నేతలు కనిపిస్తే.. జనం కొట్టేలా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రం నలుమూలలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తే జనం కొట్టేలా ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా పోలీసు సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ కాకుండా మరొకరు ఆ స్థానంలో ఉంటే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునే వారు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శనివారం వేర్వేరుగా జరిగిన సిర్పూర్ కాగజ్‌నగర్,వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఏడాది లోపే కాంగ్రెస్ దగాకోరు విధానాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని.. రేవంత్‌రెడ్డి పుణ్యాన మరో 15 ఏళ్ల వరకు తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలోని మంత్రులు అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారని ఆరోపించారు. రేవంత్ ఐరన్ లెగ్ సీఎం.. ‘‘ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్‌కు గుండు సున్నా తీసుకువచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించి ఢిల్లీలో ముగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో బీజేపీ, ప్రధాని మోదీకి అతిపెద్ద కార్యకర్తలా పనిచేస్తున్నారు. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది చొప్పున గెలిచినా బడ్జెట్లో తెలంగాణకు దక్కింది శూన్యం..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క బీజేపీ ఎంపీ నోరు మెదపలేదేమని ప్రశ్నించారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే కేంద్రాన్ని నిలదీసేవారని చెప్పారు. మోసగాళ్లంతా వెళ్లిపోయారు ‘‘మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకు ఇవ్వడానికి వణికిపోతున్నారు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో పేదల సంక్షేమం కోసం అనేక మంచి పనులు చేసిన కేసీఆర్.. సూర్యుడి తరహాలో కొంతకాలం మబ్బుల చాటుకు వెళ్లారని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తమతో కలసి పనిచేసేందుకు అధికార పార్టీ ఆహ్వానాన్ని పక్కనపెట్టి మరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. చిన్న చిన్న తప్పుల వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని పేర్కొన్నారు. మరో పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు. గెలిచే అభ్యర్థులకు అవకాశాలు ఇస్తామని, కలసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నేడు బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల భేటీ రాష్ట్రంలో కులగణన లోటుపాట్లను ఎత్తిచూపడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ ఆదివారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రావాలంటూ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కలిపి సుమారు 500 మందికిపైగా ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ బీసీ నేతల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీని గెలిపించిన రాహుల్ గాం«దీకి కంగ్రాట్స్! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాం«దీకి కంగ్రాట్స్’’అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. -
రోజంతా ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏసీబీ విచారణకు హాజరు కావడం తీవ్ర ఉత్కంఠను రేపింది. ఆయన్ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో..విచారణ అనంతరం ఆయన తిరిగి వచ్చేవరకు ఉత్కంఠ కొనసాగింది. ముఖ్య నేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగి తేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఉదయాన్నే కొద్దిసేపు గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం కేటీఆర్ తిరిగి వచ్చేవరకు అక్కడే ఉన్న ఆయన.. పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలు విడతల వారీగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల రాకతో తెలంగాణ భవన్లో హడావుడి నెలకొంది. సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో నాయకులు స్వాగతం పలికారు. గుమ్మడికాయతో దిష్టితీసి, మంగళ హారతులు ఇచ్చారు. తర్వాత నందినగర్ నివాసానికి చేరుకున్న కేటీఆర్‌కు సతీమణి శైలిమ, సోదరి కవిత తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఇలావుండగా ఏసీబీ కార్యాలయానికి దారితీసే రహదారుల్లో 8 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. సుమారుగా 400 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. మరోవైపు రెండురోజులుగా నందినగర్ నివాసంలోనే బస చేసిన కేటీఆర్.. న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో తన తరఫున వాదిస్తున్న వారితో ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన తీరుపై చర్చించారు. -
వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలవంతంగా పెట్టించిన కేసులో విషయం ఏమీ లేకపోవడంతో ఏసీబీ అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ‘పాడిందే పాడరా’ అన్నట్లు 82 ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారు. తెలంగాణ ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లుగా నిబద్ధతతో, పైసా అవినీతికి తావు లేకుండా పనిచేశా అని చెప్పా. ఏసీబీ మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా.ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటా. ఏడాది కాలంగా లగచర్ల, హైడ్రా, విద్యుత్ చార్జీల పెంపు వంటి అనేక అంశాలపై కొట్లాడుతున్నాం. కేసులు పెట్టి మా కేడర్, ప్రజల దృష్టిని రేవంత్ మళ్లించలేరు. అవసరమైతే తెలంగాణ కోసం చస్తాను తప్ప ఇలాంటి కేసులకు తలవంచేది లేదు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులతో విచారణకు హాజరైన కేటీఆర్.. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఉదయం విచారణకు వెళ్లే ముందు నందినగర్ నివాసం వద్ద కూడా ఆయన మాట్లాడారు.అణా పైసా అవినీతి లేదని చెప్పా‘తెలంగాణకు పెట్టుబడులు తేవడం, ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలనే దూరదృష్టితో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కష్టపడి ఫార్ములా ఈ రేస్‌ను తెచ్చానని చెప్పా. ఇందులో అణాపైసా అవినీతి లేదని స్పష్టం చేశా. అలాంటి గలీజు పనులు చేయడం రేవంత్‌కు అలవాటు అని కుండబద్ధలు కొట్టి చెప్పా. ఇక్కడ నుంచి డబ్బులు పంపాం.. డబ్బులు అందినట్లు ఎఫ్ఈఓ (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) వాళ్లు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని చెపితే ఏసీబీ అధికారులు నీళ్లు మింగుతున్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ ఇతరులను కూడా పంపి పైశాచిక, శునకానందం పొందాలని చూస్తున్నాడు. రేవంత్ తరహాలో నేను లుచ్చా పనులు చేయలేదు. కేబినెట్లో ఉంటూ లాండ్ క్రూజర్లు కొనుగోలు చేయలేదు. బావ మరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టు ఇవ్వలేదు. రేవంత్ తరహాలో డబ్బు సంచులతో దొరకలేదు. పెట్టుబడులు తెచ్చేందుకు విదేశాలు తిరిగా. రేవంత్ పెట్టే కేసులకు భయపడేవారెవరూ తెలంగాణలో కానీ బీఆర్ఎస్లో కానీ లేరు..’ అని కేటీఆర్ అన్నారు.రేవంత్‌ను ఎవరూ సీఎంగా గుర్తించడం లేదు‘ఇదొక లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం. రాష్ట్రంలో రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. తనను గుర్తించని వారిపై కేసులు పెట్టి లోపలేస్తున్నడు. ఏడాది తర్వాత కూడా ఆయనను ఎవరూ సీఎంగా గుర్తు పట్టకపోతే నేనేం చేయాలి. కేసులకు భయపడేది లేదు, బాధపడేది లేదు. లేని అవినీతిని పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎక్కడ దొరుకుతుంది? ఏసీబీకి రేవంత్ మళ్లీ ప్రశ్నలు పంపితే తిరిగి పిలుస్తారేమో. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంది. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతా. కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాదంతా రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఉంటాం. ఎంత కొట్టినా రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పెన్షన్, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టం వస్తే మేమున్నామంటూ వచ్చిన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రేవంత్ ఒక లొట్టపీసు సీఎం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై పెట్టిన కేసు లొట్టపీసు (డొల్ల) అని, రేవంత్‌రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన తాను రేవంత్ సర్కారు పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ సమయం నాటి పరిస్థితులు, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరుల త్యాగాలతో పోలిస్తే తాను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘నాపై పెట్టిన కేసును రేవంత్ తీర్చుకుంటున్న ప్రతీకారమని ప్రజలు అనుకుంటున్నారు. తమ భూముల కోసం లగచర్ల గిరిజనులు 40 రోజులపాటు జైలులో గడిపిన దానితో పోలిస్తే నేను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదు. అక్రమ కేసులపై చట్ట ప్రకారం పోరాడుతా. కేసుల గురించి ఆలోచించకుండా రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ మోసగిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలి. కొత్త సంవత్సరంలో తెలంగాణ కోసం కలిసి నడుస్తూ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. ఏడాది కాలంలో పార్టీకి కొత్త కమిటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి’అని కేటీఆర్ వెల్లడించారు.కేటీఆర్‌కు ఆపద వస్తే అండగా నిలుస్తాం: మాజీమంత్రి హరీశ్రావుప్రశ్నించే గొంతుక కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో రోజురోజుకూ రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుండటంతో అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. ఆపద సమయంలో కార్యకర్తలు, నాయకులకు అండగా నిలిచిన తరహాలో కేటీఆర్‌కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని చెప్పారు. రేవంత్ ఏడాది పాలన కోతలు, ఎగవేతలు, కేసులు అన్నట్టుగా తయారైందన్నారు. రేవంత్ ప్రభుత్వం హామీలు ఎగవేస్తున్న తీరును ప్రశ్నించిన తనపై మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు. లగచర్ల, అల్లు అర్జున్, టీఎస్ నుంచి టీజీగా మార్పు, తెలంగాణ రాజముద్ర మార్పు వంటి దృష్టి మళ్లింపు కార్యక్రమాలు మినహా ప్రభుత్వం ఏడాదిలో చేసిందేమీ లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బు లు లేవని చెబుతున్న సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుల భూముల కోసం కల్వకుర్తి వరకు ఆరు లేన్ల రహదారిని వేసుకుంటున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో స్వర్ణయుగం రాగా, కాంగ్రెస్ పాలనలో కారుచీకట్లు కమ్ముకున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి విమర్శించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రసంగించారు. -
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల నిరసనలు
-
బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసనలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణభవన్ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. రైతుబంధు గోవిందా.. తులం బంగారం గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీఆర్ఎస్ నేతలు అదానీ-రేవంత్ ఫొటోతో ఉన్న టీ షర్ట్స్ ధరించి సమావేశాలకు వచ్చారు. ఈ సందర్బంగా అసెంబ్లీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం, వారిని తెలంగాణ భవన్ వద్ద వదిలేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.బీఆర్ఎస్ నేతలంతా తెలంగాణభవన్ ముందు కూర్చుని నినాదాలు చేస్తూ.. అదానీ రేవంత్ భాయ్ భాయ్..కోహినూర్ హోటల్ మే దేకో రేవంత్ అదానీ ...కొడంగల్ మే దేకో రేవంత్ అదానీ ...రామన్నపేట మే దేకో రేవంత్ అదానీ ..కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు .. అంటూ నినాదాలు చేశారు.ఇదే సమయంలో కాంగ్రెస్ ఒచ్చి గోవిందా .. రేవంత్ ఒచ్చి గోవిందా ...కల్యాణ లక్షి గోవిందా ..తులం బంగారం గోవిందా ..బతుకమ్మ చీరలు గోవిందా ..చెపలు పెంచుడు గోవిందా ..గొర్రెలు పంచుడు గోవిందా ..రైతు బందు గోవిందా ..రైతు రుణ మాఫీ గోవిందా ... అంటూ నిరసనలు తెలుపుతున్నారు. -
తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన లగచర్ల గ్రామస్తులు
-
కేటీఆర్ తో గ్రూప్-1 అభ్యర్థుల భేటీ
-
తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం
-
రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హైడ్రా, మూసీ సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో అసలు పాలనే లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి అధికారంలోకి వచి్చంది మొదలుకొని తొమ్మిది నెలలుగా తమ అధినేత కేసీఆర్‌ను దూషించడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చరిత్ర తెలియని కొందరు సెపె్టంబర్ 17ను రాజకీయాల కోసం వక్రీకరించారన్నారు. రాష్ట్రంలో అసలు పాలనే లేదని, అయినా సెపె్టంబర్ 17ను సీఎం రేవంత్ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తాం.. ‘తెలంగాణ తల్లి ఆత్మను అవమానిస్తూ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టావు. ఇన్నిరోజులు సోనియాగాం«దీ, రాహుల్‌ను తిట్టిన రేవంత్ ఇప్పుడు దానిని కప్పి పుచ్చుకునేందుకు, ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ విగ్రహాన్ని పెట్టాడు. మేము అధికారంలోకి వచి్చన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాం«దీభవన్‌కు తరలిస్తాం. రేవంత్‌కు అంత ఇష్టమైతే జూబ్లీహి ల్స్ ఇంట్లో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. గణేశ్ నిమజ్జనం రోజున రేవంత్‌కు చెబుతున్నా రాసిపెట్టుకో. రాజీవ్ విగ్రహం తొలగింపు కచి్చతంగా జరిగి తీరుతుంది’అని కేటీఆర్ ప్రకటించారు. హామీలు అమలు చేసేంతవరకు ప్రభుత్వం వెంటపడతాం ‘రాజీవ్ విగ్రహావిష్కరణ సందర్భంగా రేవంత్ మాట్లాడిన పనికిమాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్‌ను కాపాడుతూ పదేళ్లపాటు తెలంగాణకు ఒక్క నొక్కు పడకుండా శాంతిభద్రతలను కేసీఆర్ కాపాడారు. రేవంత్‌కు చేతనైతే నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, పెంచిన పెన్షన్లు, 2 లక్షల ఉద్యోగాలు తదితర హామీలను నెరవేర్చాలి. కానీ రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వం వెంటపడతాం. తెలంగాణతల్లి విగ్రహానికి పాలాభిõÙకం చేసేందుకు వెళుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నేతల అరెస్టు అక్రమం’అని కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యత దిన వేడుకలు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణభవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. అంతకుముందు సచివాలయం ఎదుట రాజీవ్‌గాం«ధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు తెలంగాణభవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిõÙకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి, బాలరాజుయాదవ్ పాల్గొన్నారు. -
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
-
తెలంగాణ భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్/మణికొండ: మహిళలను కించపరిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. ఖబడ్దార్ కౌశిక్‌రెడ్డి అంటూ కల్వ సుజాతతోపాటు పలువురు మహిళా నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భవన్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకు దిగిన మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా చీర, గాజులను చూపారని ధ్వజమెత్తారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే కౌశిక్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కౌశిక్ క్షమాపణ చెప్పకపోతే గవర్నర్‌ను, స్పీకర్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.కౌశిక్‌రెడ్డి.. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లో తిరిగే పరిస్థితి ఉండదని ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.ప్రకాశ్‌గౌడ్ హెచ్చరించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీకి సంఘీభావం తెలిపేందుకు వారు తమ అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి పిల్ల బచ్చా అని, తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు సీజనల్ పొలిటీషియన్ అని, వారు మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కౌశిక్ యత్నిస్తున్నారని, దానిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రాష్టం విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేçశం, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫయూమ్ పాల్గొన్నారు. కేసీఆర్ స్పందించాలి: అద్దంకి దయాకర్ పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీని ఆంధ్రోడు అన్న కౌశిక్ మాట లు హాస్యాస్పదమని, ఈ మాటలపై కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. పదేళ్లు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నాడని, అప్పుడు ఆంధ్రోడని ఎందుకు అనలేదో చెప్పాలన్నారు. సెంటిమెంట్‌ను వాడుకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల ని డిమాండ్ చేశారు. కౌశిక్ లాంటి కమెడియన్‌ను ఎందుకు ఎన్నుకున్నామా అని హుజూరాబాద్ ఓటర్లు ఫీలవుతున్నారని పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళలంటే చిన్న చూపని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. అధికారం పోగానే మళ్లీ ఆంధ్ర.. తెలంగాణ లొల్లి గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కౌశిక్ ఆంధ్రోళ్ల పేరుతో మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కౌశిక్ వ్యాఖ్యలను సమర్థించకపోతే కేసీఆర్ ఆయనను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు తెలంగాణ భవన్ వద్దకు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే ఫోటోలు దగ్దం చేశారు. మహిళలపై కౌశిక్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడాడడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ లాంటి వల్లనే వదల్లేదని, కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.కాగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్‌గా ప్రకటించినప్పటి నుంచి విమర్శల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు.అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోగా.. గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో ఇంటి అద్దాలను పగులగొట్టారు.చదవండి: పక్కా ప్రణాళికతోనే కౌశిక్‌రెడ్డిపై దాడి: హరీష్‌రావు -
తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తొందరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక రాబోతుంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ తరఫున రాజయ్య గెలవబోతున్నారు. అలాగే, తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు వస్తాయి.. అంటూ కామెంట్స్ చేశారు.కాగా, స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ మార్పాక రవి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయం. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో రాజయ్య విజయం సాధించబోతున్నారు. కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. పార్టీ మారిన నేతలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చూస్తున్నాం. మూడు ఉప ఎన్నికలు ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కేసు హైకోర్టులో నడుస్తుంది. ఇతర పార్టీల్లోకి వెళ్లిన మంచి నాయకులు మళ్ళీ తిరిగి వస్తున్నారు. 2014లో 63 సీట్లు, 2018లో 86 సీట్లు, మొన్న మనకు 39 సీట్లు వచ్చాయి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి, మోదీతో కలిసి లేని వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు. కేరళలో సీపీఎం గెలవలేదు. తమిళనాడులో సీపీఎం మద్దతు తెలిపితే గెలిచింది. దేశం మొత్తం నిట్టనిలువునా చీలింది. ఏ కూటమిలో లేని వాళ్లు ఒక్క సీటు కూడా గెలవలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు మేము అందరం మోస పోయాం. కరెంట్ పోతే తొండలు, ఉడుతలు పడ్డాయని ప్రకటన చేస్తున్నారు. ఊసరవెల్లులు ఉన్న రాష్ట్రంలో తొండలు, ఉడుతలు రావటం కామన్.30వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. యువత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైఖరి చూస్తున్నారు. నిరుద్యోగులు తిరగబడుతున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కోసం ప్రశ్నిస్తున్నారు నిరుద్యుగులు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?. జాబ్ క్యాలెండర్ కాదు.. మొన్న వాళ్ళు ఇచ్చింది జాబ్ లెస్ క్యాలెండర్. ఇప్పటి వరకు రైతుబంధు(రైతుభరోసా)కే దిక్కులేదు. రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని అన్నారు చేయలేదు. రుణమాఫీ కాలేదు.. రాహుల్ గాంధీ సభకు రాలేదు. బోనస్ ఇస్తామని చెప్పాడు. సన్న వడ్లకే అని మళ్ళీ మాట మార్చాడు రేవంత్ రెడ్డి. సన్న వడ్లకు నువ్వూ ఇచ్చేది ఏంది?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని అన్నాడు. రేవంత్ రెడ్డికి బంగారం షాపు వాడు తెలుసో లేదో. బస్సుల్లో అల్లం వెల్లుల్లి ఓల్చితే తప్పా అని మంత్రి సీతక్క అంటున్నారు. మేము వద్దు అనలేదు కదా. మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి.కేసీఆర్ ఉన్నప్పుడు బస్సుల్లో ఏనాడైనా ఆడబిడ్డలు కొట్టుకున్నారా?. కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటున్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కుటుంబం కనిపించటం లేదా. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి తమ్ముళ్ల ఫొటోలు కనిపిస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం. వెళ్లిన నేతల గురించి ఆలోచన వద్దు.ఎమ్మెల్సీ కవిత అన్నగా చెల్లెను కలిస్తే బీజేపీ వాళ్ళ కాళ్లు మొక్కాడని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మాకేం అవసరం. బీజేపీలో పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు. ఇంకో 50ఏళ్లు పార్టీని బ్రహ్మాండంగా నడుపుకుంటాం. త్వరలోనే పార్టీ పదవులు కూడా ఇస్తాం. నియోజకవర్గాల వారీగా కేసీఆర్ కలుస్తారు. ముందు స్టేషన్ ఘన్పూర్ వాళ్లనే కలిపిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. -
బండి సంజయ్ సీఎం రేవంత్‌కు కోవర్టు: కేపీ వివేకానంద
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీజేపీ నాయకులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవర్టుగా మారారు. కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీ వేదికగా బయటపడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలని పొగుడుతూ మాట్లాడాడు. ఢిల్లీలో కుస్తీ గల్లిలో దోస్తీ కాంగ్రెస్, బీజేపీ పని. ఈ రెండు పార్టీలకు చెరో 8 పార్లమెంట్ స్థానాలను ప్రజలు ఇచ్చారు.. ఇస్తే రాష్ట్రానికి ఏం తెచ్చారు?. కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలని అంటున్నారు బండి సంజయ్. ఎందుకు కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలి?. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసిఆర్ అరెస్ట్ చేయాలా?. ఈ నెల రెండో తేదీన సుంకిశాల ప్రమాదం జరిగింది. సుంకిశాల ప్రమాదం చిన్నదిగా చూపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఆ కాంట్రాక్టు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం లేదు ప్రభుత్వం’అని అన్నారు.బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్‌ను కచ్చితంగా జైలులో వేస్తారు. ఒకవేళ కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుంది. బీఆర్ఎస్ పాలనను మా కేడర్ మరిచిపోదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్‌కు ఉంది’ అని అన్నారు. -
నేను గరళ కంఠుడిని.. బాధను దిగమింగుకుంటున్నా!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయంగా ఎదుర్కొనలేక నా కూతురు కవితను కేసులో ఇరికించారు. తండ్రిగా నాకు ఎంతో బాధ ఉన్నా సంయమనంతో మౌనం పాటిస్తున్నా. గరళ కంఠుడిలా బాధను దిగమింగుకుంటున్నా. అగ్ని పర్వతంలా ఉన్నా. నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో తెలుసు. పార్టీలో ఉండే వారు ఉంటారు.. వెళ్లే వారు వెళ్తారు. పార్టీలో ఉండాలా.. వద్దా అనేది వాళ్ల ధర్మం. కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రజలు తలచుకుంటే ఏమైనా జరగొచ్చు. పార్టీకి ఇది క్లిష్ట సమయం అనే వాదన సరికాదు. లక్షలాది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది. ధైర్యం చెడకుండా ఇష్టంతో జనంతో మమేకమవుదాం’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో మంగళవారం సుమారు మూడు గంటలపాటు కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపలా బయటా పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ తదితరాలపై కేసీఆర్ ప్రసంగించారు. ‘అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తయారు చేసిన చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. ఉద్యమ కాలంలో ఢిల్లీతోపాటు స్థానికంగా బలమైన శక్తులతో పోరాడాం. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో మనది విజయగాథ. అందరం ఇష్టంతో పనిచేద్దాం. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హనీమూన్ పీరియడ్ ముగిసింది ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు రూపొందించేందుకు కొంత వ్యవధి ఇచ్చాం. అయితే 8 నెలలు కావస్తున్నా విద్య, వైద్యం, విద్యుత్ సహా ఏ రంగంపైనా ఒక స్పష్టత లేకుండా పోయింది. కొత్త విధానాలు రూపొందించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసినందున ఇకపై ప్రజాక్షేత్రంలో మనం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. ఏకకాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసం.. ఈ అంశాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలి. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు హామీలు ఇవ్వడం సహజం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం ప్రజలను మోసగించడమే’అని కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో రాష్ట్ర అవతరణ మొదలుకుని బీఆర్ఎస్ దూరదృష్టితో అమలు చేసిన పథకాలు, పనులను సోదాహరణంగా వివరించారు. వ్యవసాయ రంగం స్థిరీకరణకు చేసిన ప్రయత్నాలను సుదీర్ఘంగా వివరించారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. -
అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ బీఆర్ఎస్ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. -
తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక భేటీ
-
తెలంగాణ భవన్‌కు గులాబీ బాస్
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయనపాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్‌కు కేటీఆర్ చేరుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.రైతు రుణమాఫీ, నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించాలని కేసీఆర్ సూచించనున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కూడా గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.కాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు సమావేశాలు జరగనున్నాయి. మధ్యలో ఆదివారం 28వ తేదీన సభకు సెలవు ప్రకటించింది. 25వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 31వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. -
తెలంగాణభవన్‌లో వేడుకలు.. బంగారు బోనమెత్తిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అమ్మవారికి సమర్పించారు.కాగా, తెలంగాణభవన్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో లాల్ దర్వాజ బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఇక, వేడుకల్లో భాగంగా ఆయన బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు.అనంతరం, రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. దేవుడు ఒక్కడే. భిన్న రూపాల్లో మనం దేవుడికి కొలుస్తాము. అదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనం. బోనాల ఉత్సావాల్లో ఈ సంస్కృతి కనిపిస్తుంది అని కామెంట్స్ చేశారు. -
విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఒక వైపు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ, మరో వైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగా వ్యవహరించిందన్నారు. రాజ్యాంగ నియమాలకు లోబడే ఆయా పార్టీల శాసనసభా పక్షాలు బీఆర్ఎస్లో విలీనమయ్యాయని వివరించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్తూ.. కాంగ్రెస్ కండువాలు కప్పుతుండగా, రాహుల్‌గాంధీ మాత్రం రాజ్యాంగ విలువల గురించి నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ద్వంద్వ విధానాలకు రాహుల్ గాంధీ స్వస్తి పలికి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేతలు విన్యాసాలు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20 శాతం మాత్రమేనన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం 33 శాతం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. దీనిని బట్టే బీఆర్ఎస్ పార్టీ ఉందో లేదో కాంగ్రెస్ నేతలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఆగడాలను జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తాం పార్లమెంటులో రాహుల్ రాజ్యాంగాన్ని చేత పట్టు కుని దానినే అపహాస్యం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో శనివా రం రాహుల్ గాంధీకి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామని ప్రకటించిన రాహుల్ .. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను జాతీయ స్థాయిలో ప్రశి్నస్తామని, రాహుల్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో రాహుల్‌ను బీజేపీ ఇక్కట్లకు గురిచేసిన సందర్భంలో పారీ్టలకు అతీతంగా తాము సానుభూతి చూపిన విషయాన్ని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. -
బీఆర్ఎస్ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా.. వారంతా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, వారంతా పార్టీ మారుతున్నారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పోరేటర్లు రెడీ అయ్యారు.కాగా, తెలంగాణ భవన్లో నేడు హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినిపించనున్నారు. ఈ క్రమంలోనే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు రెడీ అయ్యారు.అయితే, రేపటి సమావేశంలో కౌన్సిల్ హాల్లోనే బైఠాయించాలని వారు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. సంఖ్యా బలం చూసుకుంటే తమకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెబుతున్నారు. దీంతో, రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగిన సమావేశానికి హైదరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి మాధవరం కృష్ణారావు, అరికేపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో, వీరు పార్టీ మారుతున్నారా? అనే చర్చ మొదలైంది. -
‘స్టార్’ హోటల్‌కు తెలంగాణ భవన్ బాధ్యతలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ నిర్మాణ బాధ్యతలను పేరు గాంచిన స్టార్ హోటల్‌కు అప్పగించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిర్మాణంతో పాటు నిర్వహణను సైతం స్టార్ హోటల్ యాజమాన్యమే చూసుకునేలా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఇటీవల మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లోనే సీఎం ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే ఈ ఐకానిక్ భవనాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీలు ఇచి్చన ప్రెజెంటేషన్‌ను రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరో డిజైన్‌తో రావాలని సూచించారు. అయితే ఇప్పటికే డిజైన్లను ప్రెజెంట్ చేసింది ‘స్టార్ హోటల్’కు సంబంధించిన వారా? లేక ఇతర ప్రైవేటు సంస్థలా? అనేది తేలాల్సి ఉంది. రెండుచోట్ల భవనాలు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన గత మార్చి నెలలో పూర్తి అయ్యింది. ఏపీ భవన్ మొత్తం 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ మార్చి 15న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ భవన్ మొత్తం విలువ రూ.9,913.505 కోట్లు అని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించగా.. ఇందులో 3 ఎకరాల విస్తీర్ణంలో శబరి బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో పటౌడీ హౌస్ ఉన్నాయి.శబరి బ్లాక్ ఏరియా అంతా హైదరాబాద్ హౌస్ పక్కకు ఉంటుంది. ఈ ఏరియాలోనే గవర్నర్ బ్లాక్, ముఖ్యమంత్రి బ్లాక్, రాష్ట్ర కేబినెట్ మంత్రుల బ్లాక్.. మూడూ కలిపి 5.245 ఎకరాల స్థలంలో ఒక భవనం నిర్మించనున్నారు. ఇక 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ స్థలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేందుకు సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మించనున్నారు. ప్రతిరోజూ 100 రూమ్‌లు తెలంగాణ వారికే.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా తెలంగాణ భవన్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలోనే స్టార్ హోటల్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తాజ్ గ్రూప్ లేదా ఇతర స్టార్ హోటల్ గ్రూప్‌కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రతిరోజూ ఒక వంద రూమ్‌లు తెలంగాణ నుంచి వచి్చన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు. -
రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం(జూన్23)తెలంగాణ భవన్లో మరో నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.‘రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటి? రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులకు ఇవ్వాలి. కమిటీ అంటే రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విద్యుత్ బిల్లుల మాఫీ స్కీమ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు వచ్చేది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. పురుషులు,మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయి. విద్యుత్ కమిషన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. వారం రోజుల్లో కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. పవర్ కమిషన్ ముందుకు వెళ్లి నాకు ఉన్న సమాచారాన్ని ఇస్తాను. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతాను. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలి. లేదంటే కమిషన్ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకోవాలి’అని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్పై ఇంత విద్వేషమా?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, బీఆర్ఎస్ పార్టీపై విద్వేషంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. స్వయంగా సీఎం నిర్వహిస్తున్న విద్యా శాఖలోనే గందరగోళ పరిస్థితి ఉంటే ఎలా అని నిలదీశారు. కేసీఆర్ ఫొటోలు, పేర్లు ఉన్నాయని స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం వెనక్కి తెప్పించడం దారుణమని వ్యాఖ్యానించారు.మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్ కుమార్‌తో కలిసి బాల్క సుమన్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు బంధు పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు.. హోం శాఖ స్వయంగా సీఎం అధీనంలో ఉన్నా ఆయన సొంత జిల్లాలో పట్ట పగలు వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్ రవాణాలో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా వున్నారని బాల్క సుమన్ విమర్శించారు. -
తెలంగాణ రక్షణ కోసమే గులాబీ జెండా పుట్టింది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో జయాపజయాలు మనకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ప్రధానం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టిన ప్రజలే ఇప్పుడు అన్నంల మన్ను పోసుకున్నట్లు అయిపాయే అనుకుంటున్నరు. అనతి కాలంలోనే అప్రతిష్ట పాలైన ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రీప్లేస్మెంట్ మనమే. ప్రజల్లో ఉన్న అసంతృప్తి సమయం వచ్చినప్పుడు బాంబు పేలినట్లు పేలుతుంది. అది ఎంతో దూరం ఉందని నేననుకోవడం లేదు. సమీప భవిష్యత్తులో మళ్లీ పాలన మన భుజాల మీదనే పడుతుంది. తెలంగాణకు భవిష్యత్తు బీఆర్ఎస్ జెండానే ..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సరైన పంథా లేక 1969 ఉద్యమం విఫలం ‘నాడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ 1969 ఉద్యమం సరైన పంథా లేకపోవడంవల్ల ఘోరంగా విఫలమైంది. 1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్ ప్రధాన అంశంగా ఉండేవి. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను ఇక్కడి నుంచి పంపించాలని ఇక్కడి యువత పోరాటం చేశారు. అయితే ముల్కీ రూల్స్ వ్యతిరేక పోరాటంలో రాజ్‌భవన్ దగ్గర 8 మంది విద్యార్థులను కాల్చి చంపారు. ఉద్యమం సమసిపోయింది. తెలంగాణ రాలేదు. ఆ తర్వాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. ముల్కీ రూల్స్ ఉద్యమం లీగల్ బ్యాటిల్‌గా సుప్రీంకోర్టుకు వెళ్లింది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో 1973లో ముల్కీ రూల్స్ కొనసాగుతాయని తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. దాంతోటి ఆంధ్రాలో వెంటనే జై ఆంధ్రా ఉద్యమం మొదలుపెట్టిన్రు. ఆ తర్వాత కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. ముల్కీ రూల్స్‌ను రద్దు చేసింది. ఇంత చేసినా తెలంగాణ నుంచి ఎవరూ నోరు మెదపలే. మారు మాట్లాడలే..’అని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి ఘోరాలకు జయశంకర్ సార్ సాక్షి ‘ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. ఆయన లాంటి మనుషులు అరుదుగా ఉంటారు. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. తెలంగాణ అస్తిత్వం కోల్పోవద్దని, తెలంగాణగనే ఉండాలని నిర్ణయించుకుని పోరాట పంథా ఎంచుకున్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించినా జయశంకర్ సార్ బెదరలేదు. పోరాట పంథాను వీడలేదు. అలా అనేక సందర్భాల్లో ఆయన బెదిరింపులను ఎదుర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని అణచడం కోసం నాటి ప్రభుత్వాలు చేసిన ఘోరాలు అన్నింటికీ ఆయన సాక్షి. 1969 ఉద్యమంలో చాలామంది పెద్దలు పోరాటం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన విజయసింహారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి పోరాటంలో అగ్రభాగాన ఉండేవారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1969లో ఇక్కడి పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్ధిగా ఉంటూ అనేకసార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇలా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు. వాళ్లందరికీ మనం తలెత్తి మొక్కాల్సిందే..’అని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీ వాడొద్దన్నారు ‘2001లో తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పటికీ 1999 నుంచే చర్చోపచర్చలు జరిగాయి. తెలంగాణ వాదులు, మేధావులతో కలిసి ఉద్యమ పంథాపై ప్రణాళికలు తయారు చేశాం. పదవులకు రాజీనామా చేసి పార్టీ పెడితే పది మంది వెంటలేరు. అప్పుడు మీటింగ్‌లు పెట్టినా పది, పదిహేను మంది కూడా వచ్చేవారు కాదు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవులు చూసుకున్నారు. అసెంబ్లీలో తెలంగాణ పదం వాడొద్దని అప్పటి స్పీకర్ ప్రణయ భాస్కర్ చెప్పారు. వెనుకబడిన ప్రాంతం అనాలని శాసనసభముఖంగా వ్యాఖ్యానించారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వాళ్లు కూడా లేరు. నేను పాలమూరులో సభ పెట్టి పోరాటం చేస్తే అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయి. కరీంనగర్లో సింహగర్జనను సూపర్ డూపర్ హిట్ చేశాం. సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఉండాలని నేను నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది. తెలంగాణ వస్తుందని ఎవరూ ఊహించలేదు. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది..’అని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల మహా వృక్షం ‘బీఆర్ఎస్ను ఖతం చేస్తమని అంటున్నరు. మోకాలంత ఎత్తు లేనోడు కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల మహావృక్షం. ఖతం చేస్తే ఖతమైతదా? కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేదు. ఖతమైందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం ఉంది. కానీ నేను బస్సు యాత్ర మొదలు పెట్టంగనే మళ్లీ అదే గర్జన కనిపించింది. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాం. మరో ఎమ్మెల్సీగా రాకేశ్‌రెడ్డి గెలువబోతున్నడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ గెలిచేది బీఆరెస్సే. 105 సీట్లు వస్తయని ఒకాయన మొన్న వచ్చి చెప్పిండు. ఎగ్జిట్ పోల్స్‌లో ఒకడు 11 వస్తయన్నడు. ఇంకొకడు ఒకటే వస్తదన్నడు. రెండు నుంచి మూడు వస్తయని ఇంకో ఆయన అన్నడు. 11 వస్తే పొంగిపోయేది లేదు. తక్కువ వస్తే కుంగిపోయేది లేదు. ఎలక్షన్లు చాలా చూసినం. ఏదేమైనా భవిష్యత్తు మనదే...’అని మాజీ సీఎం చెప్పారు. కాంగ్రెస్ వాళ్లకు పాలన తెలియదు ‘నోటికి హద్దు లేకుండా హామీలు ఇచ్చిన్రు. ఆరునెలల్లో అంతా తలకిందులైంది. కళ్యాణలక్ష్మి, రైతుబంధు, కేసీఆర్ కిట్, దళితబంధు అన్నీ బందయ్యాయి. గీత కార్మికులను వేధిస్తున్నారు. కల్లు గీసి అమ్ముకునే గౌడలను జైళ్లల్ల పెడుతున్నారు. ఒకరు కాదు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. ఇంత తొందరగ రావద్దు. కానీ అనతికాలంలోనే ఈ ప్రభుత్వం అప్రదిష్టపాలైంది. ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ వాళ్లతో ఏంకాదు. వారికి పాలన తెలియదు. అనుభం లేదు. అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్ల మలుచుకోవాలో తెలుస్తలేదు..’అని కేసీఆర్ విమర్శించారు. లోగో ప్రజల గుండెల మీద ఉంటది ‘రాష్ట్ర ప్రభుత్వ లోగో ప్రజల గుండెల మీద ఉంటది. అప్పట్లో ఏం చేసినా, పదులు, వందల సంఖ్యలో కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకునే వాళ్లం. సమిష్టి నిర్ణయంతో చేసినం. దేవుడిచ్చిన ఆయుష్షు, చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసమే పనిచేస్తా..’అని కేసీఆర్ అన్నారు. -
చిల్లర రాజకీయాల కోసం కొందరు ఉద్యమాన్ని వాడుకున్నారు: కేసీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమన్నారు. కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఖతమైంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు. మనకు మనమే కాదు, ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. కొన్ని క్షణాల గొప్పగా ఉంటాయి, కొన్ని క్షణాలు బాధగా ఉంటాయి. ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉంది. అన్ని పదవుల్లో నేను అనేక రోజులు చేశాను.1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మంచైనా చెడైనా మీతోనే ఉంటాము అని పనిచేసింది టీఎన్జీవో సంఘం. మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఉండేది ఆనాడు. వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితేనే చేస్తా అని ఉద్యమంలోకి వచ్చాను. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది. జయశంకర్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.మళ్ళీ ఉద్యమం నేను మొదలు పెట్టాను. చావనైనా చావాలి లేదంటే చంపాలి అని నేను ముందున్నాను. పాతాళంలో ఉన్న తెలంగాణపైకి తీసుకొచ్చాం. పాటతో మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలువాలే. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది. 25ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నాడు. ఖతం అయితదా?. మళ్ళీ నేను బస్సెక్కితే చూసారు కదా నా వెంట వచ్చారు మొత్తం. వందకు వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మొన్న నాదగ్గరికి ఒకరు వచ్చి చెప్పాడు ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 105 స్థానాలు వస్తాయని చెప్పారు.రైతు బంధు అనేది ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గు చూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు, వెర్రిమొర్రి వేషాలు అన్ని కనిపిస్తున్నాయి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. కరెంట్ లేక జనం చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎక్కువ రోజులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్ డౌన్ అవుతుంది. గత పదేళల్లో రైతులకు విత్తనాలను సక్రమంగా ఇచ్చాం. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి లైన్లో నిల్చోవాలన్సిన పరిస్థితి వచ్చింది.మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం గెలిచాం. వరంగల్‌లో హీరో రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నాడు. పార్లమెంట్లో ఎన్నైనా రావొచ్చు. ఎక్కువ సీట్లు వస్తే పొంగి పోయేది లేదు. తక్కువ వస్తే కుంగి పోయేది లేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్టీ ప్లీనరీ సమావేశం చేసుకోలేదు. పార్టీ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు ఘనంగా అద్భుతంగా చేసుకుందాం’ అని కామెంట్స్ చేశారు. -
తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
-
‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బి–టాక్స్, యు–ట్యాక్స్, ఆర్ఆర్– ట్యాక్స్ రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25న కమిటీ వేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించింది..’అని కేటీఆర్ విమర్శించారు. టెండర్ మొత్తానికంటే అదనంగా వసూళ్లు ‘మిల్లర్లు క్వింటాలు రూ.2,100కు కొంటామన్నప్పటికీ సగటున రూ.200 తగ్గించి రూ.1,885– రూ.2,007 మధ్య ఆ 4 సంస్థలు కొనేలా ఒప్పందం చేశారు. టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చెల్లించాలి. మిల్లర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. కానీ మిల్లర్లతో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయి. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డాయి. టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ‘సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. పార్లమెంటు ఎన్నికలు’అంటూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.236 అదనంగా చెల్లించి తీరాలని ఒత్తిడి చేస్తున్నారు. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామంటూ బంపరాఫర్ కూడా ఇచ్చారు. ఈ మేరకు జలసౌధలో అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 35 ఎల్ఎంటీలకు గాను కింటాలుకు రూ.200 చొప్పున రూ.700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం లిఫ్ట్ చేసేందుకు గడువు ఈ నెల 23తో అయిపోయింది. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన రూ.700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్‌లైన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు..’అని కేటీఆర్ ఆరోపించారు. సన్న బియ్యం పేరిట మరో స్కాం ‘రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలి. వీటి కోసం కూడా పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.42–45 ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు రూ.15 అదనంగా అంటే రూ.57కు టెండర్ ఖరారు చేశారు. 2.20 ఎల్ఎంటీలకు కిలోకు అదనంగా రూ.15 చొప్పున రూ.300 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.1,000–1,100 కోట్ల స్కామ్ జరిగింది..’అపి కేటీఆర్ వివరించారు. ‘మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి విద్యాశాఖకు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులే కొనాల్సి వచ్చేది. కానీ 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం కిలో రూ.22.59 పైసలకు అమ్మేశారు..’అని విమర్శించారు. -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
అది నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్
సాక్షి, తెలంగాణభవన్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలిచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.కాగా, కేటీఆర్ శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది?. ఎప్పుడు పరీక్షలు పెట్టారు. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి. కాంగ్రెస్ వచ్చాక 32వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించి పెడితే ఆయన నియామక పత్రాలు ఇచ్చారు. ఇది రేవంత్ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు నియామక పత్రాలు ఇవ్వలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. నాలుగైదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. నీళ్ళు, నిధులు, నియామకాలు టాగ్ లైన్‌తో రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణకు తప్ప, వేరే రాష్ట్రానికి ఉందా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే. మేము గత పదేళ్ళలో రెండు లక్షల 32 వేల 308 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ది విషయంలో దేశంలో తెలంగాణ కంటే ముందు మరే రాష్ట్రం ఉందో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి?. ఇది నిరూపిస్తే నేను రేపు(ఆదివారం) ఈ సమయానికి రాజీనామాచ చేస్తా. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నా సవాల్‌కు సిద్ధమేనా?. ఒక మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరెంట్ పోతుంది అని ఎలా అంటాడు. ఆయన మంత్రా? జోకరా?. కేఏ పాల్ జోకర్ కాదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే జోకర్. ఆసుపత్రిలో కరెంట్ పోతే జనరేటర్ లేదా?. ఇదేం ప్రభుత్వం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు -
ప్రధాని రేసులో ఉంటా!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధానిగా పనిచేసే అవకాశం వస్తే వంద శాతం రేసులో ఉంటానని.. అవకాశం వస్తే వదులుకునేంత అమాయకుడిని కాదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను కొనసాగిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అందరినీ సంప్రదించి.. తనకున్న రాజకీయ సంబంధాలు, శక్తి, తెలివిని రంగరించి ప్రాంతీయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఏదో ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టిస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలిచితీరుతుందని చెప్పారు. కాంగ్రెస్ 9 చోట్ల మూడో స్థానంలో ఉందని.. బీజేపీ రెండో స్థానంలో ఉన్నా బీఆర్ఎస్కు చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. 16 రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ముగియడంతో శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు పార్టీని వీడటంతో ఆయన స్థానంలో రాజ్యసభ ఎంపీ కేఆర్.సురేశ్‌రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ ఇస్తున్నా. జాతీయ రాజకీయాల్లో మా పార్టీ తరఫున ఆయన కీలక ప్లేయర్‌గా ఉంటారు. ఈ అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలని అక్కడి నేతలు కోరుతున్నారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అక్కడా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పేరిట పోటీచేసి గెలుస్తాం. హైదరాబాద్ గొంతు కోస్తే సహించరు.. కేంద్ర పాలిత ప్రాంతం పేరిట హైదరాబాద్ గొంతు కోస్తే తెలంగాణ ప్రజలు సహించరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వంటివారు కూడా దేశానికి రెండో రాజధాని కావాలని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పిచ్చివాళ్లకు స్థానమిస్తే హైదరాబాద్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ తెలంగాణ సొంతం.. ఎన్నటికీ వదులుకోబోం. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్ బీజేపీలో చేరతాడని కాంగ్రెస్ నేతలే అనుమానిస్తున్నారు. 26 నుంచి 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు రెడీగా ఉన్నామని మాతో అంటున్నారు. కారు షెడ్డుకు వెళ్లిందంటున్న రేవంత్‌రెడ్డి.. మా ధాటికి రేపు ఎక్కడికి పోతాడో చూద్దాం. పనులు, పైరవీల కోసమే కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు.. ప్రభుత్వంలో వందల మంది అధికారులు ఉంటారు. అందులో ఒకరైన రాధాకిషన్‌రావు ఎవరు? ఫోన్ ట్యాపింగ్‌కు సీఎంకు ఏం సంబంధం? గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వం ఉండదు. నిఘా విభాగం నుంచి ప్రభుత్వం కేవలం సమాచారం మాత్రమే కోరుతుంది. ట్యాపింగ్ పూర్తిగా పోలీసు విభాగం అంతర్గత విషయం. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం.. హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్ జరుగుతుంది. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు రైతు భరోసా, ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్, నాలుగు విడతల డీఏ విడుదల వంటివి ఉండగా రైతులకు రూ.40 వేల కోట్ల రుణమాఫీ సాధ్యం కాదు. ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నం సఫలం కాదు. మేం ఎంతో ఆలోచించి ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. భాష విషయంలో రేవంత్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రేవంత్ ఓటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలర్, భూ కబ్జాకోరు. ఆయన చేతకానితనంతోనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ప్యారగాన్ చెప్పులు లేని కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు. ఆరు నెలల పాలనలో ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయ, చేనేత తదితర రంగాల్లో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ముంచుతుంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. లక్ష మంది రేవంత్‌లు వచ్చినా బీఆర్ఎస్ను తుడిచిపెట్టలేరు.. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర. నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం తెచ్చా. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ.. తెలంగాణ గుండెల్లో కేసీఆర్ ఉంటరు. గెలుపోటములు పక్కన పెడితే తెలంగాణ ఎమోషన్ కేసీఆర్. 65 లక్షల మంది సభ్యత్వం కలిగిన మహా సముద్రం లాంటి బీఆర్ఎస్ను తుడిచిపెట్టడం లక్ష మంది రేవంత్‌లు వచ్చినా సాధ్యం కాదు. కేసీఆర్‌ను గిల్లి పడేస్తం అనుకునే వాళ్లు పిచ్చివాళ్లు. మోదీ దుర్మార్గాలు పెరిగాయ్..ప్రధాని మోదీ దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఆయన గోబెల్స్ మాదిరిగా అవసరాన్ని బట్టి మాట్లాడుతారు. నాలుక మడతేయడం ఆయనకు వచ్చినంతగా ఎవరికీ రాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేవుడి పేరిట ఓట్లు కొల్లగొట్టే పార్టీ బీజేపీ. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా.. అసమానతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు అందరికీ న్యాయం జరగాలి. ఎస్సీ రిజర్వేషన్లు 15% నుంచి 19 శాతానికి పెంచాలి. అల్పాదాయం ఉన్న ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మోదీ సృష్టించిన రాజకీయ కుట్ర. నేనూ, కేజ్రీవాల్ మోదీకి కంటిలో నలుసులా తయారయ్యాం. మోదీ కుడి భుజం బీఎల్ సంతో‹Ùను అరెస్టు చేసేందుకు వెళ్లినందునే.. నా కూతురు కవితను టార్గెట్ చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేం ఈ కుట్రలను ఎదుర్కొంటాం. -
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం(మే11) తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘ప్రజాగ్రహం కాంగ్రెస్‌ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్ వేస్ట్ చేశారు. కరెంట్‌ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్‌లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫాం చేద్దామంటున్నరు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు. -
అసెంబ్లీ రద్దు కావొచ్చు: కేసీఆర్
‘‘బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులు బాధపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉందంటూ ఆ పార్టీలోకి వెళితే.. అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు నాతో వాపోయారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా అని నన్ను సంప్రదించారు. కానీ ఇప్పుడు వద్దని వారించాను..’’ సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతతో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా బీజేపీ కథ నడుస్తోందని.. రేవంత్ బీజేపీలోకి వెళ్లినా ఆయన వెంట వెళ్లేందుకు కరుడుగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. సుమారు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘‘గతంలో బీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేలతోపాటు ఏడుగురు ఎంఐఎం సభ్యులను కలుపుకొని 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. మనం అప్రమత్తమై అందులో భాగస్వాములైన స్వామీజీల కుట్రలను బట్టబయలు చేశాం. ప్రధాని మోదీ దుర్మార్గుడు. తెలంగాణలో 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా? రేవంత్ బీజేపీలోకి వెళ్లినా, వెళ్లకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిది చోట్ల గెలుస్తాం..: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతాయని.. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని కేసీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సునాయాసంగా గెలిచే పరిస్థితులు ఉంటాయన్నారు. రాజకీయాల్లో తొందరపాటు ఆలోచ నలు సరికాదని, కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులు అక్కడి పరిస్థితులు చూసి తిరిగి వస్తామంటున్నారని చెప్పారు. కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని, బుల్లెట్లలాంటి నాయకులను తయారు చేసుకుంటామని పేర్కొన్నారు. ‘కొందరు నాయకులు వెళ్లినపుడు కొంత మంచే జరుగుతుంద’ంటూ కడి యం శ్రీహరి పార్టీ వీడటాన్ని ప్రస్తావించి విమర్శించారు. ‘‘2006 కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులు అందరూ కాంగ్రెస్‌కు అమ్ముడుపోయినా భారీ మెజారిటీ సాధించాం. డబ్బులు ఉంటేనే గెలుస్తామనే అభిప్రాయం సరికాదు. ఇప్పటివరకు అందిన సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం. మరో మూడు చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయి’’ అని కేసీఆర్ చెప్పారు. బీఎల్ సంతోష్ పై కేసు వల్లే కవిత అరెస్టు.. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ఆయన ఆఫీసు దాకా వెళ్లారు. దీనిపై కక్ష సాధింపులో భాగంగా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారు. కవిత తప్పు చేసినట్టు వంద రూపాయల ఆధారం కూడా చూపలేదు. బీఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోయి ఉంటే కవిత అరెస్టు ఉండేది కాదు. ఆమెను కుట్రపూరితంగా మద్యం విధానం కేసులో ఇరికించారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందనే అతి ప్రచారాన్ని సృష్టించారని చెప్పారు. జాతీయ స్థాయిలో వివిధ పారీ్టల నేతలతో తాను జరుపుతున్న సంభాషణల ప్రకారం.. మోదీ ప్రాభవం అంతగా లేదని స్పష్టమవుతోందన్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా బలమైన నేత లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ నెల చివరి వారం నుంచి బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారం కోసం ఈనెల చివరి వారం నుంచి బస్సు యాత్ర చేస్తానని.. సాయంత్రం సమయాల్లో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు చోట్ల రోడ్‌షోలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతోపాటు వివిధ వర్గాలతో భేటీ అవుతానని వెల్లడించారు. బస్సుయాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో లక్ష మందితో మినీ సభలు కూడా ఏర్పాటు చేద్దామన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ఇస్తే షెడ్యూలు ప్రకటిస్తానని నేతలకు సూచించారు. కేటీఆర్, హరీశ్ హైదరాబాద్ పరిధిలోని నియోజకర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటారని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ను తిరస్కరించలేదని.. మరో నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తే మెజారిటీ సీట్లు సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేతకాదు.. ‘‘రేవంత్ సందూక్‌లో సరుకు లేదు. ధాన్యం కొనుగోలు, రుణమాఫీ సహా ఏదీ ఈ ప్రభుత్వానికి చేతకాదు. ధాన్యం కొనుగోలును గాడిలో పెట్టేందుకు మనం అధికారంలో వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు శ్రమించాం. ధాన్యం బహిరంగ వేలంలో అవకతవకలు జరిగాయి. ధాన్యం కొనడం చేతకాక మిల్లర్ల మీద కేసులు బనాయిస్తున్నారు. రైతు సమస్యలపై పార్టీ నాయకులు, కేడర్ ఎక్కడికక్కడ స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద రూ.500 బోనస్ కోసం డిమాండ్ చేయాలి. ధాన్యం కొనుగోలుపై సిద్దిపేట తరహాలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్షలాది పోస్టుకార్డులపై ప్రభుత్వ హామీలను గుర్తుకు చేయాలి..’’ అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి కర్నాటక, తమిళనాడుకు నీళ్లు తరలించుకుపోయి ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా వెళ్తున్న కేంద్రాన్ని అడ్డుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతేనని మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ కట్టాలన్న సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే పార్టీ యంత్రాంగం అంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త సల్వాజి మాధవరావుపై పెట్టిన అక్రమ కేసులపై తాను సభలో మాట్లాడితే 10వేల మంది సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారని తెలిపారు. అభ్యర్థులకు బీ ఫారాలు.. చెక్కుల పంపిణీ తెలంగాణ భవన్లో గురువారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్.. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలతో జరిగిన భేటీలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రచార వ్యూహం, ఎజెండా, బస్సుయాత్ర వంటి అంశాలపై చర్చించి.. దిశా నిర్దేశం చేశారు. అనంతరం పార్టీ తరఫున పోటీ చేస్తున్న 17 మంది లోక్‌సభ అభ్యర్ధులకు బీ ఫారాలను, ఎన్నికల ఖర్చు కోసం రూ.95లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి నివేదితకు బీ ఫారం, రూ.45 లక్షల చెక్కును అందజేశారు. -
అన్ని వ్యవస్థలు రేవంత్ గుప్పిట్లోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, కోవాలక్ష్మి, నేతలు జీవన్‌రెడ్డి, పి.శశిధర్‌రెడ్డి గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ► ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంలో స్పీకర్ చేస్తున్న జాప్యంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్రూంలో దాక్కున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉపఎన్నికలు వస్తాయని వెల్లడించారు. ► బీఆర్ఎస్ తరపున ఎన్నికై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నా స్పీకర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తాము అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తమకు సమయం ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపినట్టు వెల్లడించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారు. దీనిని తెలంగాణ స్పీకర్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ ఎవరిని కొట్టాలో చెప్పాలి. అభద్రతాభావంతో ఉన్న రేవంత్ కొడంగల్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ► 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. -
బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట రూ. 20 వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్ పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. వచ్చే బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీలకు మండలానికో అంతర్జాతీయ స్థాయి గురుకులాల ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరో మూడేళ్లలో జరగనున్న పూలే ద్విశతాద్ది ఉత్సవాల నాటికి హైదరాబాద్‌లో ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ మేరకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీలకు ఇచి్చన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం బీసీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారికి రాజకీయ అవకాశాల కోసం బీఆర్ఎస్ మాత్రమే పాటుపడుతోందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడంతోపాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించామని చెప్పారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో బీసీల అభ్యున్నతిని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించి చూపామని.. ఫూలే ఆలోచనా విధానంలో భాగంగా వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశామని వివరించారు. నేత, యాదవ, ముదిరాజ్, గౌడ సామాజికవర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామని... అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్‌పై బడుగు, బలహీనవర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని ఎమ్మెల్సీ మధుసూధనాచారి అన్నారు. గత పదేళ్లలో సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. -
ప్రయత్నిస్తే మంచి ఫలితమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార పక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రయతి్నస్తే ఈ ఎన్నికల్లో విజయం పొందే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు మంచిగా పడుతాయని చెప్పారు. అయితే ధరలు అధికమవుతాయన్నారు. ఈ ఏడాదంతా కేసీఆర్‌కు బాగుంటుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాశి కర్కాటకం అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నందున ఈ సంవత్సరమంతా కేసీఆర్‌కు బాగుంటుందని తెలిపారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని, వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలా ఉంటే కేటీఆర్ ప్రజాభిమానాన్ని పొందుతారు కేటీఆర్‌ది మకర రాశి అని, ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందని పండితులు తెలిపారు. మాటను కట్టడి చేసుకొని మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందని పండితులు తెలిపారు. -
ఈశాన్యం వైపు నడుద్దాం.. తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్లో వాస్తు రీత్యా మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు అధినేత కేసీఆర్ ప్రమాదం బారిన పడటం, నేతలు పార్టీ వీడటం, కవిత అరెస్టు తదితర ఘటనల నేపథ్యంలో వాస్తు నిపుణుల సూచనల మేరకు పలు మార్పులు చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా వాయవ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. వాస్తు నిపుణుల సలహా మేరకు ఇకపై ఈశాన్యం వైపు ఉన్న గేటును రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును తెరిచి వాహనాల రాకపోకలకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. మరోవైపు వీధి పోటును దృష్టిలో పెట్టుకుని దక్షిణభాగంలో ఉన్న గేటు వద్ద యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అబ్బే.. వాస్తు మార్పులు కాదు కానీ.. అయితే పార్టీ వర్గాలు మాత్రం వాస్తు మార్పులు కాదని అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్ ఇతర కీలక నేతలు తెలంగాణ భవన్‌కు వస్తున్న సందర్భాల్లో వాయువ్య దిశలో ఉన్న గేటు ఎదురుగా రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని చెప్తున్నాయి. దీంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈశాన్యం గేటు నుంచి రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇన్నాళ్లూ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈశాన్యం గేటును ఉపయోగించుకోలేక పోయామని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్‌ను అనుకుని నిర్మించిన విశాలమైన రోడ్డుతో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తీరుతాయని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
నలుగురితో బీఆర్ఎస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఖరారు చేశారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్, సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆయా సమావేశాల్లో పార్టీ నేతలు చర్చించి అభ్యర్థుల పేర్లకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంయుక్త ఎన్నికల ఇన్చార్జిలుగా ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను కేసీఆర్ నియమించారు. నేడు ఉమ్మడి పాలమూరు నేతలతో భేటీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో భాగంగా కేసీఆర్ మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. నాగర్‌కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి.రాములు ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు పి.భరత్‌ను బీజేపీ నాగర్‌కర్నూలు అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల నుంచి బీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. అయితే మంగళవారం నాటి భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఆల ఖరారు..నేడు ప్రకటన ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. దీంతో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చర్చల అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మంగళవారం జరిగే భేటీ అనంతరం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. రాహుల్‌గాందీతో పోటీకైనా రెడీ: నామా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పోటీ చేసినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు ప్రకటించారు. తనను మరోమారు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నామా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు ఎంపీగా గెలిచా. అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు’అని నామా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తప్పు చేశామనుకుంటున్నారు: మాలోత్ కవిత మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ఎంపీ మాలోత్ కవిత ధన్యవాదాలు తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంటు వేదికగా తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి ఓట్లు వేసి తప్పు చేశామనే చర్చ ప్రజల్లో జరుగుతోందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని అన్నారు. -
కాంగ్రెస్‌పై వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కారు ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. వాటి కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆదివారం తెలంగాణ భవన్‌కు విచ్చేసిన కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేశారు. అయితే ఆదివారం అష్టమి కావడంతో అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు కరీంనగర్, పెద్దపల్లితో పాటు మరికొన్ని స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించనున్నారు. కాగా పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రెగ్యులరైజేషన్ ఉచితంగా చేయాలి విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైందని కేసీఆర్ చెప్పారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని, నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. అంతా కలిసి పని చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో బీఆర్ఎస్ను కాంగ్రెస్ విమర్శించిందని, ప్రజల రక్తం పీలుస్తున్నారని వ్యాఖ్యానించిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. పైగా అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ కింద ఉచితంగా ప్లాట్లు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఓ పన్ను పాడైందని పళ్లన్నీ పీకేయలేం కదా! ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని, మిడ్ మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలని, రాజకీయం చేస్తామంటే ప్రజలు గమనిస్తారని అన్నారు. ఒక పన్ను పాడైతే.. చికిత్స చేసుకుంటాం తప్ప.. మొత్తం పళ్లన్నీ పీకి వేసుకోలేం కదా? అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు చేయాలని, మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని నేతలకు సూచించారు. బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్త కాదన్న ఆయన.. ఓడితే కుంగి పోయేది లేదు.. గెలిస్తే పొంగి పోయేది లేదని అన్నారు. కాంగ్రెస్‌లో వాళ్ల కుంపటి వాళ్ళు సర్దుకోవడానికే టైం సరిపోతుందని విమర్శించారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తామని, ధైర్యంగా ఉండాలని నాయకులకు భరోసా ఇచ్చారు. మెజారిటీ సీట్లు మనవే.. ముందుగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో మాట్లాడిన కేసీఆర్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 12న భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించారు. సభను విజయవంతం చేసే బాధ్యతను గంగుల కమలాకర్‌కు అప్పగించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలువబోతున్నదని చెప్పారు. అలాగే మెజారిటీ స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
‘హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది అని కాంగ్రెస్ చెప్తోందని, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదురిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘జర్నలిస్ట్ శంకర్‌పైన దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. సాయి రామ్ రెడ్డి హస్తినాపురం కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కి చెందిన అనుచరుడు. పథకం ప్రకారం శంకర్‌ను చంపాలని చూశారు. గొడవపడినట్టు ఇద్దరు మహిళలను పెట్టి పథకం ప్రకారం చేశారు. పాశవికంగా శంకర్‌పై దాడి జరిగింది. ఈ దాడిని అందరూ ఖండించాలి. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?. అక్షరంతో ప్రశ్నిస్తే అయుధంతో దాడులు చేస్తారా?. హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’అని బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోంది: క్రాంతి మాజీ ఎమ్మెల్యే ‘ఇది ప్రజా పాలన లాగా లేదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లాగా కనిపిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రమేయం లేకుండా తెలంగాణ వచ్చిందనే ప్రతీకారం ఉన్నట్టు ఉంది. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి దాడులు గమనించాలి. ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యం లేదు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం’అని క్రాంతి మండిపడ్డారు. -
‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. ఆయన తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమే. నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ నీటివాటా తేలేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయి. ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోయాయి.. 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు.. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం. కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. -
నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: భా రత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు శనివారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరగనున్నాయి. ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా కేసీఆర్ 70వ పుట్టిన రోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్‌ను కట్ చేస్తారు. కేటీఆర్ చేతుల మీదుగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా చేయిస్తారు. అలాగే దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘తానే ఒక చరిత్ర’పేరిట 30 నిముషాల నిడివి కలిగిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. కాగా, కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు పార్టీ పిలుపునిచి్చంది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. -
నీకు చేతకాకపోతే తప్పుకో...నేను చేసి చూపిస్తా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించడం చేతకాకపోతే తప్పుకొని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని, రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేశారు. ‘నాకు చేత కాదు.. నువ్వు చేసి చూపించమని రేవంత్ అడిగితే నేను సిద్ధం.. నాకు బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా’ అని అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడా రు. ‘శాసనసభ పవిత్రత, సంప్రదాయాలను సీఎం రేవంత్ మంట గలుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బురద రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రభుత్వం ఎంత తక్కువ చేసి మాట్లాడినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని, ప్రజలకు జీవధార. ఈ ప్రాజెక్టు విషయంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో ఏ తరహా విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. విచారణ జరిపి బాధ్యులను శిక్షించండి..’అని హరీశ్‌రావు అన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి ‘ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి, యుద్ధ ప్రాతిపదిక మరమ్మతు పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి. రెండు పిల్లర్లు కుంగాయనే నెపంతో మొత్తం ప్రాజెక్టు ప్రతిష్టను డామేజ్ చేసే దుష్టపన్నాగానికి కాంగ్రెస్ పాల్పడుతోంది. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి పొలాలకు నీళ్లు మళ్లించండి కానీ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగింది. ప్రాజెక్టు ఫలాల గురించి చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. గతంలో కడెంవాగు ప్రాజెక్టు, సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పునరుద్ధరించడం జరిగింది. పోలవరం డయాఫ్రం వాల్, రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కారకులను శిక్షించి, ప్రాజెక్టులను పునరుద్ధరించి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారు..’అని హరీశ్ వ్యాఖ్యానించారు. కాలువలు తవ్వి నీళ్లివ్వకపోతే కష్టాలే ‘రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ డైవర్షన్ టూర్ పెట్టుకుని, ఇంజనీర్లు వాస్తవాలు చెబుతున్నా దబాయిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో హెడ్ వర్క్స్ పూర్తయిన తర్వాతే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై నిధులు వెచ్చిస్తాం. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తే, మేము అన్ని పనులు పూర్తి చేసి 6.36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం కాలువలు తవ్వి నీరు ఇవ్వకుంటే సాగు, తాగునీటి కష్టాలు వస్తాయి..’అని మాజీ మంత్రి హెచ్చరించారు. రీ ఇంజనీరింగ్ వల్లే అంచనాల పెంపు ‘రీ ఇంజనీరింగ్ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాణహిత–చేవెళ్ళ ఆంచనా విలువ రూ.17 వేల కోట్లతో మొదలై రూ.38 వేల కోట్లకు పెరిగింది. ఆ తర్వాత కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి రూ.40 వేల కోట్లకు పెరిగింది. తట్ట మట్టి ఎత్తకుండానే ప్రాజెక్టు అంచనా విలువ రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగినట్టు?. కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యం పెంచాం. కొత్త జలాశయాలు ప్రతిపాదించాం. జలాశయాల సామర్థ్యం పెరగడంతోనే అంచనాలు పెరిగాయి..’అని హరీశ్‌రావు వివరించారు. -
KRMB వివాదం, కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలపై సమీక్ష
-
తెలంగాణ భవన్‌కు నేడు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బీఆర్ఎస్ అధి నేత, శాసనసభ పక్షనేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తెలంగాణభవన్‌కు రానున్నా రు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయ కులతో సమావేశమవుతారు. ఈ మేరకు ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు రావాలని అధినేత ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా చర్చించను న్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావే శాల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ప్రజాక్షే త్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంలాంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కేసీఆర్ చర్చించి నేతలకు సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణభవన్‌కు కేసీఆర్ రానుండటంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశముంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు వచ్చి కలవనున్నారు. -
గణతంత్ర వేడుకలు: స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న సందర్భంగా స్పృహ తప్ప కిందపడిపోయారు. దీంతో, హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ పతకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. కాగా, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్బంగా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పృహ తప్పి పడిపోయారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సహచర బీఆర్ఎస్ నేతలు ఆయనను పట్టుకున్నారు. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై కిందపడి పోయిన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. pic.twitter.com/FkgrFqc0iF — Telugu Scribe (@TeluguScribe) January 26, 2024 -
సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగానే కలిశాం
-
కాంగ్రెస్ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, అవి 420 హామీలని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని, అబద్ధాలు మాట్లాడించారని, వాస్తవాలు ఏంటో తెలియజేసేందుకు ‘స్వేద’పత్రం విడుదల చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తెలంగాణ సమగ్ర అభివృద్ధిని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని, రూ.2 లక్షల రుణం తెచ్చుకోండని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయాలని, లేకుంటే కేసులు పెట్టమని ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యవసాయ రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తా మని ఇచ్చిన హామీని విస్మరించి, ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు. ప్రియాంకాగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క అలా చెప్పలేదని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టేది లేదని పునరుద్ఘాటించారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ అదానీని తిడితే, రేవంత్‌రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని, నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతున్నదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా వస్తున్నాడని కేటీఆర్ నిలదీశారు. ఈసారి కూడా మెదక్ మనదే ... మెదక్ లోక్‌సభ సెగ్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని కేటీఆర్ అన్నారు. గత ఎంపీ ఎన్నిక ల్లో హరీశ్‌రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయడంతో అత్యధిక మెజారిటీ సాధించామని, మరోసారి అది పునరావృతం కావాలన్నారు. కొందరు దు్రష్పచారం చేయడంతోనే మెదక్ పార్లమెంట్ పరిధిలో తాను ఒక్కదాన్నే ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. పనికొచ్చే సమీక్షలు చేయడం లేదు: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం పనికొచ్చే సమీక్షలు చేయడం లేదని, సమీక్షల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ లీకులు ఇస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదంతా ఓ ఆరునెలలు సాగుతుందేమో, ఆ తర్వాత చెల్లదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, భవిష్యత్‌లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందన్నారు. కొందరు బీఆర్ఎస్ నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, చెత్త పార్టీ నుంచి వెళ్లిపోతోందని భావిద్దామని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్లు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు బస్సు వేసుకుని భాదితుల దగ్గరికి వచ్చి అండగా ఉంటారన్నారు. రైతు బంధు విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
స్వామి వివేకానంద బాటలో నడవాలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తి బాటలో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్లు వివేకానంద చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చిన్నతనంలోనే అనేక విషయాలపై పట్టు సాధించిన వ్యక్తి అని అన్నారు. పొన్నంకు క్రిబ్కో చైర్మన్ సన్మానం.. ఢిల్లీ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రపాల్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందలాది సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినా ఏనాడూ ప్రజలను రోడ్ల మీద వరుసల్లో నిలబెట్టలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించామే తప్ప రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మళ్లీ గెలిచేవాళ్లమని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాల ముందు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఓడిపోయింది. అధికారంలోకి వస్తామనే ఆశలు లేని కాంగ్రెస్.. నోటికొచ్చిన హామీలను ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు. కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు, అత్యధిక వేతనాలు, 46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినా ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదు. బీఆర్ఎస్కు అసెంబ్లీలో మూడో వంతు సీట్లు రాగా, 14 స్థానాల్లో కేవలం 6 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయాం. కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు ఓట్ల తేడా కేవలం 1.85 శాతం మాత్రమే. గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటాం. స్థానిక సంస్థలు మొదలుకుని అసెంబ్లీ ఎన్నికల దాకా బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు పార్టీకి అండగా ఉన్నారు’అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల పేరిట రేవంత్ రెడ్డి నాటకాలాడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే స్వేదపత్రం రూపొందించాం. అన్ని వర్గాలకు పార్టీ దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం’అని కేటీఆర్ చెప్పారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే: హరీశ్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ది చేసినా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసింది. రుణమాఫీ, ధాన్యానికి బోనస్ తదితరాలపై మాట తప్పి దగా చేశారు. విద్యుత్‌లో కొత్త విధానం అంటే విద్యుత్‌ను 48 గంటలు ఇస్తారా. లోక్‌సభ ఎన్నికల్లో సమష్టిగా కష్టపడదాం. నెల రోజుల్లో కేసీఆర్ తెలంగాణ భవన్లో ఉంటారు. కేడర్‌కు ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని మీ ముందుకొస్తాం. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి కేడర్ పిల్లలకు సహకారం అందిస్తాం. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు తెలంగాణ భవన్‌తోపాటు జిల్లా కార్యాలయాల్లోనూ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. మండల, జిల్లా కమిటీలు వేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్త కాదు. గల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడటం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌కు చూపింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అప్పుడే కుమ్ములాటలు కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయని, మంత్రి పొంగులేటి తానే నంబర్ 2గా చెప్పుకుంటున్నారని, డిప్యూటీ సీఎం భట్టి ముఖ్యమంత్రి పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ‘కేటీఆర్, హరీశ్‌రావు కృష్ణార్జునుల తరహాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలి. గతంలో ఎంపికైన దళిత బంధు లబి్ధదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం’అని కడియం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి చెందినట్టు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాగా, తెలంగాణ భవన్లో ఎనిమిదో రోజు వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, మధుసుధనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాము. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపాడలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది. సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఈ సమవేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు. -
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు. జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్‌లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్ -
పట్నం వర్సెస్ పైలట్.. స్వల్ప ఉద్రిక్తత!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది. ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది! చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. -
రెండో రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ ఎస్ మీటింగ్
-
ఏకపక్ష నిర్ణయాలు ఉండవు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కేవలం బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష నిర్ణయాలుండవు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. లోక్ సభ సన్నాహక సమావేశాల తొలిరోజు బుధవారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేగులు తెగేదాకా పోరాడేది బీఆరెస్సే ‘బీఆర్ఎస్ దళం, గళం పార్లమెంటులో ఉండాలి. బీఆర్ఎస్ వల్లే పార్లమెంటులో తెలంగాణ మాట ప్రతిధ్వనిస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. బెంగాల్‌కు మమతా బెనర్జీ, తమిళనాడుకు డీఎంకే స్టాలిన్, ఏపీకి జగన్, చంద్రబాబు, ఒడిశాకు నవీన్ పట్నాయక్, బీహార్‌కు నితీశ్‌కుమార్, మహారాష్ట్రకు శరద్ పవార్ తరహాలో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక, పర్యాయపదం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆ తర్వాత విభజన హామీల అమలు, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కొట్లాడింది కూడా కేసీఆర్ మాత్రమే. మోదీ, రాహుల్ ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడరు. తెలంగాణ గళానికి బలం లేకపోతే పార్లమెంటులో తెలంగాణ పదం వినపడకుండాపోయే చాన్స్ ఉంది..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు కార్యాచరణ ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటాం. చిన్న చిన్న లోటు పాట్లను సరిదిద్దుకునే దిశగా అంతర్గతంగా కార్యాచరణ ప్రారంభించాం. కేసీఆర్ కోలుకునేందుకు మరో ఐదారు వారాలు పడుతుంది. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చి అందరితోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదిలాబాద్ లోక్‌సభ సమీక్ష సందర్భంగా సుమారు 26 మంది నేతలు మాట్లాడిన అంశాలను క్రోడీకరించి కేసీఆర్‌కు వివరిస్తాం. స్థానిక వ్యతిరేకతతో కొందరు ఎమ్మెల్యేలు ఓడినా సీఎంగా కేసీఆర్ ఉంటారని ప్రజలు భావించినట్లు మా నేతలు చెప్తున్నారు. అభివృద్ధి విషయాల్లో ఎక్కడా బీఆర్ఎస్ పనితీరుపై ఫిర్యాదులు లేవు. కాంగ్రెస్ ఫేక్ ప్రాపగాండాతో యువత, ఉద్యోగులు కొంత దూరమయ్యారు. పార్టీ, పాలనలో కొన్ని లోటుపాట్లు సవరించక పోవడం వల్ల ఓటమి పాలయ్యామనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దానికనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తాం..’ అని చెప్పారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడతాం ‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమని స్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యా లుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్ని స్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. కేడర్‌కు అండగా ఉంటూ కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం..’ అని కేటీఆర్ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
4న ఆటో డ్రైవర్ల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’పథకంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా బస్స్టాండ్లు, బస్ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ నెల 4న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ‘మహా ధర్నా’నిర్వహిస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి దెబ్బతిన్న ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రతీనెల రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్, జి.రాంబాబు యాదవ్, వేముల మారయ్య తెలంగాణభవన్‌లో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 9వ తేదీ నుంచి అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఆటో, టాటా మ్యాజిక్, ఓలా, ఉబర్, సెవెన్ సీటర్ వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు డ్రైవర్ల స్థితిగతులను ఆధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కార్మిక విభాగం నేతలు వెల్లడించారు. -
3 నుంచి లోక్‌సభ సన్నాహక భేటీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మూడో తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ అమలుపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. జనవరి 3 నుంచి 21 వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 13 నుంచి 15 వర కు విరామం ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సుమారు పది రోజుల పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తదితర సీనియ ర్ నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే సన్నాహక సమావేశాలకు షెడ్యూల్ సిద్ధం చేశారు. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవ ర్గంతో ప్రారంభమయ్యే భేటీలు 21న సికింద్రాబా ద్, హైదరాబాద్ సెగ్మెంట్లతో పూర్తవుతాయి. కేటీఆర్, సీనియర్ల సమక్షంలో.. కేటీఆర్‌తో పాటు కె.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, సంబంధిత లోక్‌సభ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లాపార్టీ అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలు భేటీలకు హాజరవుతారు. పార్టీ పరంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరి అభిప్రాయాలు తీసుకుని పటిష్ట కార్యాచరణ రూపొందించనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతోనే చాలా సీట్లు చేజారిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఏ నియోజకవర్గ భేటీ ఎప్పుడు? జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి,ౖ 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్ సభ భేటీలు జరగనున్నాయి. 16న నల్లగొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజిగిరి, 21 సికింద్రా బాద్, హైదరాబాద్ సమావేశాలు ఉంటాయి. -
ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ప్రతి గెలుపులో పాఠాలుంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని.. ఆ గుణపాఠాలు నేర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చామని, నిరుద్యోగులకు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. కానీ సరైన విధంగా ప్రచారం చేసుకోలేకపోయామని పేర్కొన్నారు. ‘నిజం గడప దాటే లోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంద’న్న సామెత నిజమైందని.. కాంగ్రెస్ అబద్ధాలు, అలవి గాని హామీలను ప్రజలు నమ్మారని వ్యాఖ్యానించారు. యూట్యూబ్‌లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే నివారించలేకపోయామని, దానితోనూ కొంత నష్టం జరిగిందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ‘స్వేద పత్రం’ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. కేవలం 1.85శాతం ఓట్లతో తాము ఓడిపోయామని.. ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల తేడాతో కోల్పోయామని చెప్పారు. ఇది ఘోర పరాజయం కాదని, ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. మీరు విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. వందరోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మొన్ననే నాలుక మడతేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా.. ఉప ముఖ్యమంత్రి తాము ఆమాటే అనలేద న్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆరు గ్యారంటీలు కాదు. 142 హామీలున్నాయి. వాటిని లెక్కతీశాం. మా పార్టీ తరఫున శాఖల వారీగా షాడో టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో వాటిని షాడో కేబినెట్ అంటారు. అలాంటిదే మా లెజి స్లేచర్లో ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతిరంగంలో సర్కారు పనితీరు.. వారు ఏం చేస్తున్నారు? ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? తదితర అంశాలన్నింటినీ నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తాం..’’ అని కేటీఆర్ చెప్పారు. దీప స్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వబోమని, పడిపోనివ్వబోమని పేర్కొన్నారు. ఏ విచారణకైనా మేం సిద్ధం రాజకీయాల్లో పోటీకి వెళ్లిన ప్రతిసారీ గెలుస్తామనే ఆశిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడుతామని, ప్రతి అంశంపై రివ్యూ చేస్తామని చెప్పారు. ‘‘అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా? కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా? అనేది వారి విజ్ఞత. ఏ విచారణ అయినా.. ఏ కమిషన్ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కావాలంటే విచారణ చేయాలని మేమే సభలో డిమాండ్ చేశాం. అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యువత విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించిందని.. అప్పుడే స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా ఉందని చెప్పారు. తమ తరఫున చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరిగాయని.. సవరించుకొని ముందుకెళ్తామని వివరించారు. ఉద్యోగుల జీతాల విషయంలో కరోనా ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతే కొంత ఇబ్బంది వచ్చిందని.. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఊహించని వాళ్లు ఓడిపోయారు! మీడియాతో లంచ్ సందర్భంగా కూడా కేటీఆర్ పలు అంశాలపై చిట్‌చాట్ చేశారు. ‘‘ప్రజల తీర్పును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత చేసినా ఎలా ఓడిపోయాం? ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోవాలి, అక్కడ కేసీఆర్ సీఎంగా ఉండాలని ప్రజలు ఓట్లేసినట్టు చెపుతున్నారు. కోనేరు కోనప్ప, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, సింగిరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి వంటి వారు ఓడిపోతారని ఎవరైనా అనుకుంటారా? వారికి రెండు సార్లు అవకాశం ఇచ్చాం కదా.. ఓసారి వీళ్లకు ఇద్దామని ప్రజలు భావించారని అనిపిస్తోంది..’’ అని పేర్కొన్నారు. -
రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా.. నూతన తెలంగాణ భవన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధానిలో నూతన తెలంగాణ భవన్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఢిల్లీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో జరిపిన సమీక్ష సందర్భంగా కొత్త భవన్ నిర్మాణం చేపట్టేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పార్టీ పెద్దలను కలిసేందుకు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఉమ్మడి ఆస్తుల విభజన అంశాలపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం, అందులో ఉన్న భవనాలు, వాటి ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ వాటా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని, ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు వివరించారు. ఇందులో పునర్విభజన చట్టం ప్రకారం 42ః58 నిష్పత్తిలో తెలంగాణకు 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు వస్తుందని చెప్పారు. ప్రస్తుత భవనాలు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుత భవనాలన్నీ మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవని, చాలావరకు శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేయిస్తున్నామని గౌరవ్ ఉప్పల్ వివరించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని చెప్పారు. ఇదే సమయంలో ఆస్తుల విభజన ప్రక్రియను వేగిరం చేసే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పదవుల భర్తీపై కేసీతో భేటీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, రాజకీయ వ్యవహారాల కమిటీలో చేసిన తీర్మానాలు, ఆరు గ్యారంటీల అమలు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, మద్దతుగా నిలిచిన జేఏసీ, కుల సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేసీ సూచించినట్లు తెలిసింది. మంత్రి పదవుల భర్తీపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంకతో చర్చించిన అనంతరమే ఓ నిర్ణయానికి రావాలని తీర్మానించినట్లు సమాచారం. రాజకీయ ప్రముఖులకు రేవంత్ విందు ఢిల్లీలోని రాజకీయ ప్రముఖులు, గతంలో తనతో కలిసి పనిచేసిన ఎంపీలకు రేవంత్‌రెడ్డి విందు ఇచ్చారు. తుగ్లక్‌రోడ్డులోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఎంపీలు శశిథరూర్, మాణిక్యం ఠాగూర్, సుదీప్ బందోపోధ్యాయ, దీపేందర్ హుడా, సుప్రియా సూలే, కార్తి చిదంబరం, మాగుంట శ్రీనివాసరెడ్డి, డీకే సురేశ్, రఘురామ కృష్ణరాజు, సీఎం రమేశ్, నిరంజన్‌రెడ్డితోపాటు మరికొందరు హాజరైనట్లు తెలిసింది. -
ఢిల్లీలో కోమటిరెడ్డి.. రింగ్‌రోడ్, తెలంగాణ భవన్‌పై కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్‌ను పరిశీలించారు. అనంతరం, ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ ఏర్పాటుపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వెంకట రెడ్డి మాట్లాడుతూ..‘ఢిల్లీలో వీలైనంత త్వరగా కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న భవన్లో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదు. గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన వైఖరి మేం తీసుకుంటాం. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మరొక మణిహారం. ట్రిపుల్ ఆర్ సహా పలు జాతీయ రహదారుల అంశాలపై మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీ చైర్మన్‌ను కలుస్తున్నాం. రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వారితో కోమటిరెడ్డితో మాట్లాడుతూ..‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అని అప్పటి పీఎం మన్మోహన్ చెప్పారు. ఇప్పటికీ విభజన చట్టం అమలుపరచకపోవడం బాధాకరం. నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు, అమలుపరిచే బాధ్యత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిది’ అని వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. తుంటి ఎముక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఆల్పాహారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదుట ఉన్న గన్‌పార్కుకు చేరుకొని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు హాజరవుతారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ తరపున ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. విపక్ష నేతగా ఉండేందుకు కేసీఆర్ మొగ్గు శాసనసభలో 119 మంది సభ్యులకుగాను బీఆర్ఎస్ తర పున 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అవతరించిన నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండేందుకు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తారనే ప్రచారం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, శాసనసభా పక్ష నేతగా హరీశ్‌రావుకు చెరో పదవి అప్పగిస్తారని బీఆర్ఎస్లో చర్చ కూడా జరిగింది. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ తరపున కేసీఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తే అటు పారీ్టకి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమైనట్టు సమాచారం. -
జనంలో ఉందాం!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలు వేరే పార్టీకి అవకాశం ఇచ్చినా మనకు గౌరవ ప్రదమైన స్థానాలు కట్టబెట్టారు. ప్రజలు మనకు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దాం. ఓటమితో అధైర్య పడకుండా జనంలో ఉంటూ ప్రజలకు సంబంధించిన అంశాలపై పోరాడుదాం..’అని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలతో తెలంగాణ భవన్‌కు వచ్చారు. గెలుపొందిన ఎమ్మెల్యేలను కేటీఆర్ అభినందించారు. ఓటమి పాలైన అభ్యర్థులకు ధైర్యంగా ఉండి కలిసి పనిచేద్దామంటూ భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి సానుకూల స్పందన ‘ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వం విషయంలో ఒక సానుకూల స్పందన వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదంటూ సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. తెలంగాణ బాగు కోరుకున్న అనేక మంది భావోద్వేగానికి గురవుతూ సందేశాలు పెడుతున్నారు. ఓటమితో నిరాశ చెందకుండా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుదాం. రెండు మూడురోజుల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళదాం. ప్రభుత్వంలో, అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్ కేంద్రంగా విధులు, కార్యకలాపాలు కొనసాగించిన మనమంతా ఇకపై తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందాం’అని కేటీఆర్ అన్నారు. నేతల భావోద్వేగం ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు భావోద్వేగానికి గురయ్యారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా పార్టీ అడుగుజాడల్లో నడిచిన తాము ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. పలువురు నేతలు కేటీఆర్, కవితతో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. వందలాది మంది తెలంగాణ భవన్‌కు తరలిరావడంతో పరిసరాలు సందడిగా కనిపించాయి. సుమారు మూడు గంటల పాటు తెలంగాణ భవన్‌లోనే గడిపిన కేటీఆర్ కొందరితో గ్రూపుగా, మరికొందరితో ముఖాముఖి సంభాషించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కృష్ణారావు, గోపీనాథ్, వివేకానంద, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాతీర్పును గౌరవిద్దాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా జనవరి 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశమున్నా ప్రజల తీర్పును గౌరవిస్తూ హుందాగా తప్పుకున్నాం. ప్రజల తీర్పును గౌరవిస్తూ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. రాష్ట్ర రాజకీయాలు, పాలనలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం..’అంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుందాం. ఎన్నికల క్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజం. నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని తిరిగి చూరగొనాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుంది. అందువల్ల నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. త్వరలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని కూడా ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుందాం..’అని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లకుపైగా సుస్థిర పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంతో చెరగని ముద్ర వేసుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టడమేగాకుండా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించి గొప్ప పరివర్తన తీసుకురాగలిగామన్నారు. బీఆర్ఎస్ అంటే ఒక భరోసా అనే విశ్వాసాన్ని కలిగించామని చెప్పారు. మెజారిటీ ఎంత వచ్చింది? ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఏ తరహా పోటీని ఎదుర్కొన్నారు? లాంటి కొన్ని సాధారణ అంశాలను కూడా కేసీఆర్ ఆరా తీశారని ఆయనను కలిసిన నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో ఆయన కుశల ప్రశ్నలు సైతం వేసినట్లు చెప్పారు. హరీశ్, తదితరుల భేటీ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేటీఆర్ ఫామ్‌హౌస్ భేటీకి వెళ్లలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్‌రావు కూడా కేసీఆర్‌ను కలిశారు. గజ్వేల్ ఎన్నికలో కేసీఆర్ ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ‘ఎన్నిక ధ్రువీకరణ సర్టిఫికెట్’ను అందజేశారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై కోలుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య స్థితిపై కేసీఆర్ వాకబు చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రగతిభవన్ నుంచి ఫామ్‌హౌస్‌కు.. కేసీఆర్ దంపతులు ఆదివారం రాత్రి ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఒకటి రెండు రోజుల్లో బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి మారనున్నారు. వ్యక్తిగత సామానును తరలించే పని జరుగుతున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ జనవాడలోని ఫామ్‌హౌస్ నుంచి రాకపోకలు సాగించే అవకాశమున్నట్లు తెలిసింది. -
తెలంగాణభవన్: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ..
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్.. గెలిచిన బీఆర్ఎస్ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, సహ పలువురు మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్ కార్యాచరణపై నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఓటమి, తదితర కీలక అంశాలపై కేటీఆర్ చర్చించనున్నారు. -
హ్యాట్రిక్‌పై బీఆర్ఎస్ ధీమా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పార్టీ సాధించబోయే ఫలితంపై బీఆర్ఎస్ పోస్టుమార్టం ప్రారంభించింది. 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పార్టీ సొంత బలంతోనే వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పోలింగ్ ముగిశాక తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా ఆదివారం వెలువడే ఫలితాలు ఉంటాయని బీఆర్ఎస్ గట్టిగా విశ్వసిస్తోంది. సీఎం కేసీఆర్ దంపతులు గురువారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హెలికాప్టర్లో వెళ్లి సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరిగి ఫామ్‌హౌజ్‌కు చేరుకున్న కేసీఆర్.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ పార్టీ అభ్యర్థులు, నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావు తాము ప్రాతినిధ్యం వహి స్తున్న సిరిసిల్ల, సిద్దిపేట సెగ్మెంట్లలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూనే, తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అధికారం ఖాయమంటూ వార్‌రూమ్ నివేదిక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వార్‌రూమ్‌లను ప్రారంభించింది. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ సహా అనేక అంశాలను అవి సమన్వయం చేస్తూ వచ్చాయి. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను అందజేశాయి. ఆ నివేదికల ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఫలితాలను బీఆర్ఎస్ అంచనా వేసుకుంది. ఈ క్రమంలో పోల్ మేనేజ్మెంట్లో ప్రతిపక్షాల కంటే ముందంజలో ఉన్నామని, అది కలసి వస్తుందని ధీమా గా ఉంది. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు, ప్ర భుత్వ పథకాల లబ్దిదారులు, విద్యావంతులైన యు వత, క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ అనుకూలించినట్టు భావిస్తోంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లబ్దిదారుల్లో 90శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్కే ఓటేశారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడలేదని వార్‌రూమ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తంగా 40కిపైగా సీట్లలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించే పరిస్థితి ఉందని, ఇది కాంగ్రెస్‌కు పగ్గాలు వేసిందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని లెక్కలు వేసుకుంటోంది. కేవలం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ తమపై పైచేయి సాధించే అవకాశం ఉన్నట్టు పోలింగ్ సరళిని బట్టి అంచనాకు వస్తోంది. వర్గాల వారీగా లెక్కలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో గ్రామీణ ప్రాంత యువత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ పడ్డాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. తొలిసారి ఓటు హక్కు పొందిన వారిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కే వేశారని అంటోంది. క్షేత్రస్థాయిలో చాలాచోట్ల కాంగ్రెస్‌కు పటిష్ట యంత్రాంగం లేకపోవడాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు అనువుగా మల్చుకోవడంలో సఫలమయ్యారని క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏజెన్సీలు పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక క్షేత్రస్థాయిలో సామాజికవర్గాల వారీగా ఓటింగ్ తీరునూ బీఆర్ఎస్ మదింపు చేస్తోంది. దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువత అంశాలతోపాటు పార్టీ అభ్యర్థులపై, వారి అనుచరులపై వ్యతిరేకత వంటివి కొంత మేర ప్రతికూలత చూపినట్టు భావిస్తోంది. -
తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్లో దీక్ష దివస్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని కార్యక్రమాలను నిలిపివేయాలని కోరింది. దీంతో, ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో జరుపుతున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే, ఈ కార్యక్రమాన్ని భవన్ లోపలే జరుపుకోవాలని అధికారులు సూచించారు. దీంతో, కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తెలంగాణ భవన్లో దీక్ష దివస్ కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నవంబర్ 29వ తేదీన కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చారు. అందుకే ఈరోజున దీక్ష దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు కార్యక్రమం జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్లో కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచించింది. ఈ క్రమంలో ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు, లీగల్ టీమ్ సూచించారు. అనంతరం, డీసీపీతో కూడా వారు మాట్లాడారు. దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్ లోపలే కార్యక్రమం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు. ఇక, కమిషన్ సూచనల మేరకు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు సమాచారం. ఇక, వేడుకల కోసం కేటీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. మరోవైపు.. దీక్ష దివస్ సందర్భంగా కేటీఆర్ రక్తదానం చేశారు. #DeekshaDiwas చరిత్రను మలుపుతిప్పిన దీక్ష..! తల్లి తెలంగాణ సంకెళ్లను తెంచిన సత్యాగ్రహం... స్వరాష్ట్ర సమరంలో సముజ్వల సన్నివేశం... స్వాతంత్ర్య పోరాటాన్నిమించిన సమున్నత సందర్భం... యావత్ జాతి ఏకమై ఉద్యమ కడలి ఉవ్వెత్తున ఎగసిన దృశ్యం... చావునోట్లో తలబెట్టి గెలిచిన సాహసం... ఢిల్లీ… pic.twitter.com/fhrD5eTzUr — KTR (@KTRBRS) November 29, 2023 -
రేవంత్‌కు అధికారమిస్తే కోఠిలో అమ్మేస్తాడు
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ. అమరుల స్తూపం వద్దకు వచ్చి మద్యం పంచకుండా గెలుద్దాం, ప్రమాణాలు చేద్దాం రా.. అంటున్నాడు. నోట్లకట్టలతో పచ్చిగా దొరికిన దొంగ నీతులు చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్‌రెడ్డిని రేటెంత రెడ్డి అంటున్నారు. ఆయన చేతికి అధికారమిస్తే రాష్ట్రాన్ని కోఠిలో చారాణాకు అమ్మేస్తాడు. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు బతిమాలుతున్నారని.. ఎందుకు చాన్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డబ్బు సంచులతో వచ్చినా ఇక్కడ చేసేదేమీ లేదని.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో ఐదు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని డీకే చెప్పడంపై నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ యుద్ధంలో తమతో పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యమ సమయంలో యువత, విద్యార్థుల చావులకు కారణమైందని, ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం ‘‘గతంలో ప్రశ్నపత్రాలు లీక్ చేసింది బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెంచా గాడు కాదా? గ్రూప్–2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేసిందే బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్. ఆ తర్వాత పరీక్ష రద్దు చేస్తే గొడవ చేసిందీ వీళ్లే. కోర్టులో కేసు వేసి గ్రూప్–2 పరీక్షను రద్దు చేయించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర మెంట్ పెడతారు వాళ్లు. పరీక్షల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగినట్టు ఒప్పుకుంటున్నా. డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటా..’’అని కేటీఆర్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే వేదికల ద్వారా తిప్పికొట్టి వాస్తవాలు ప్రచారం చేయాలని బీఆర్ఎస్వీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా దీటుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదేళ్ల వయసున్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని.. 2014 ముందు నాటి పరిస్థితులను వారికి తెలియచేయాలని.. ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే వారి డొల్లతనాన్ని బయట పెట్టాలని సూచించారు. రాబోయే నెల రోజులపాటు 33 జిల్లాల్లో విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ అభివృద్దిపై చర్చ పెట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, నారాయణపేటల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ చేరికతో మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఆసక్తితోనే తాను బీఆర్ఎస్లో చేరినట్టు ఎర్ర శేఖర్ అన్నారు. ముదిరాజ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.