నేడు కేసీఆర్‌ జన్మదిన వేడుకలు  | KCR 70th Birthday Celebration, Special Programs At Telangana Bhavan - Sakshi
Sakshi News home page

KCR Birthday Celebration: నేడు కేసీఆర్‌ జన్మదిన వేడుకలు 

Feb 17 2024 3:38 AM | Updated on Feb 17 2024 10:57 AM

KCR 70th birthday celebration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భా రత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు శనివారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరగనున్నాయి. ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుతో పాటు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా కేసీఆర్‌ 70వ పుట్టిన రోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేస్తారు.

కేటీఆర్‌ చేతుల మీదుగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా చేయిస్తారు. అలాగే దివ్యాంగులకు వీల్‌చైర్ల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘తానే ఒక చరిత్ర’పేరిట 30 నిముషాల నిడివి కలిగిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. కాగా, కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు పార్టీ పిలుపునిచి్చంది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement