
సాక్షి, తెలంగాణభవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటరిచ్చారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతుందన్నారు. అలాగే, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సంస్కారం ఉందా?. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలని ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి.. మళ్లీ మాట మార్చి బీఆర్‌ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారు. రేవంత్ భాష వలన తెలంగాణ పరువుపోతుంది.
అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ కట్టాలని పేదలను వేధిస్తోంది. ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని రైతులకు చెప్పారు. ఫోర్త్ సిటీ అని మరో 15వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఏమనాలి. ఫార్మా సిటీ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలి. లేకపోతే ఫార్మా సిటీ నిర్మాణం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించండి.
కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా నిన్న రేవంత్ సభలో మాట్లాడారు. మోదీ మంచోడు.. కిషన్ రెడ్డి చెడ్డ వ్యక్తి అని రేవంత్ అంటాడు. అటు రాహుల్ గాంధీ మాత్రం మోదీ చెడ్డ వ్యక్తి అని అంటాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రేవంత్ సర్కార్‌ను బండకేసి కొట్టారు. 15 నెలలకే రాష్ట్రానికి ఈ ప్రభుత్వం భారమైంది.

రేవంత్‌కు సవాల్..
రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నా. మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం?. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment