
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రక్షణ కవచం బీఆర్‌ఎస్సేనని.. ప్రజా పోరాటంలో బీఆర్‌ఎస్ వెనక్కి తగ్గదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు బీఆర్‌ఎస్ ఒక్కటే మార్గమన్నారు. ‘‘తెలంగాణ అస్థిత్వం, పరిరక్షణే మాకు ముఖ్యం. ప్రజల అస్తిత్వం కోసం పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
విస్తృత స్థాయి సమావేశంలో 30 మంది వారి అభిప్రాయాలు చెప్పారు. తెలంగాణ ప్రజల పండుగగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తాం. అందరిని భాగ స్వామ్యం చేస్తూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తాం.
ఏప్రిల్ రెండో వారంలో ప్రతినిధుల సమావేశం ఉంటుంది. ఏప్రిల్ 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. పార్టీ సభ్యత్వ సమోదు కార్య క్రమం. పార్టీ నేతలకు శిక్షణ తరగతులు చేపడతాం. త్వరలోనే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అధ్యక్షలను ఎంపిక చేస్తాం. 2026 ఏప్రిల్ వరకు సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, ప్రజా పోరాటాలు చేస్తాం. రేవంత్ రెడ్డిని వాళ్ల కేబినెట్ మంత్రులే పట్టించుకోవడం లేదు. 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో రేవంత్ చెప్పాలి’’ అని కేటీఆర్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment