
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక సమావేశం ఎల్లుండి(బుధవారం) జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఈ కీలక భేటీకి హాజరు కానున్నారని తెలిపింది.