సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది అని కాంగ్రెస్ చెప్తోందని, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదురిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘జర్నలిస్ట్ శంకర్‌పైన దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు.
సాయి రామ్ రెడ్డి హస్తినాపురం కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కి చెందిన అనుచరుడు. పథకం ప్రకారం శంకర్‌ను చంపాలని చూశారు. గొడవపడినట్టు ఇద్దరు మహిళలను పెట్టి పథకం ప్రకారం చేశారు. పాశవికంగా శంకర్‌పై దాడి జరిగింది. ఈ దాడిని అందరూ ఖండించాలి. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?. అక్షరంతో ప్రశ్నిస్తే అయుధంతో దాడులు చేస్తారా?. హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’అని బాల్క సుమన్ ప్రశ్నించారు.
తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోంది: క్రాంతి మాజీ ఎమ్మెల్యే
‘ఇది ప్రజా పాలన లాగా లేదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లాగా కనిపిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రమేయం లేకుండా తెలంగాణ వచ్చిందనే ప్రతీకారం ఉన్నట్టు ఉంది. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి దాడులు గమనించాలి. ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యం లేదు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం’అని క్రాంతి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment