Balka Suman
-
చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం: బాల్క సుమన్
సాక్షి, తెలంగాణ భవన్: సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీఎం రేవంత్ కాదు కాదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా జరుగుతాయి. సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి.. వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేడు.ఈడీ కేసు జరుగుతుంటే.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. వివేక్.. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాడు. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైంది. పోలీసులు.. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదు. ఈడీ విచారణ జరుగుతున్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరిలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. రూ. 8కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై వివేక్‌ను ఈడీ ప్రశ్నించింది. గత ఏడాది నవంబర్‌లో విశాఖ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు -
రేవంత్ రెడ్డికి నాగార్జున 400 కోట్లు.
-
కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను: బాల్కసుమన్
సాక్షి,హైదరాబాద్:ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్18) సుమన్ మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి, కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయని విమర్శించారు.‘హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్.తమ్మడి కుంట ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్‌లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చడంలేదు. నాగార్జునను 400 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్‌లను కూల్చరు. ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. ప్రజా పాలన నడుస్తలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు. రేవంత్ టీమ్‌లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని, అధికారులను కెసిఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలి పెట్టను’ అని సుమన్ ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి: హైకోర్టు -
మా పార్టీ గుర్తుపై గెలిచిన MLA లను కొనుగోలు చేస్తుండు రేవంత్
-
పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్‌పై చర్యలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో, అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలోనే వారిద్దరూ హస్తం గూటికి చేరారు. ఇక, పోచారం ఇంట్లోనే సీఎం రేవంత్ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసుల కళ్లు గప్పి సీక్రెట్‌గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో, అక్కడ హైటెన్షన్ చోటుచేసుకుంది. కాగా, పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ ఉండగానే బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడంపై సీఎం సెక్యూరిటీ ఆరా తీసింది. భద్రతా లోపంపై నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.. పోచారం ఇంటి వద్దకు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్క సుమన్ చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఉంటాయన్నారు.కాగా, ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. -
బీఆర్ఎస్పై ఇంత విద్వేషమా?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, బీఆర్ఎస్ పార్టీపై విద్వేషంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. స్వయంగా సీఎం నిర్వహిస్తున్న విద్యా శాఖలోనే గందరగోళ పరిస్థితి ఉంటే ఎలా అని నిలదీశారు. కేసీఆర్ ఫొటోలు, పేర్లు ఉన్నాయని స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం వెనక్కి తెప్పించడం దారుణమని వ్యాఖ్యానించారు.మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్ కుమార్‌తో కలిసి బాల్క సుమన్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు బంధు పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు.. హోం శాఖ స్వయంగా సీఎం అధీనంలో ఉన్నా ఆయన సొంత జిల్లాలో పట్ట పగలు వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్ రవాణాలో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా వున్నారని బాల్క సుమన్ విమర్శించారు. -
‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్‌లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. -
రేవంత్, బాబుల మధ్య అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో చర్చలు జరిపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్‌ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంతే అని వారు విశ్లేషించారు. తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రాకేష్ కుమార్, గట్టు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. మోదీ వద్ద బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్‌కు దొరుకుతోందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మగా మారుతారని ఆరోపించారు. బాబు మాదిరిగానే రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కరువు చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వారు విమర్శించారు. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో ఇప్పటికే మార్పు వచ్చిందనీ, ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ప్రకటనల్లో అదశ్యమయ్యిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రైఫిల్ ఎక్కు పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. -
TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబు శిష్యుడు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పిలుపు ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై శనివారం సుమన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం మరోసారి బయటపడిందని సుమన్ విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు-రేవంత్ ఇద్దరూ భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మంత్రులు టీడీపీ ఆఫీస్‌కు పోయి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడే వాళ్ల గురుశిష్యుల బంధం బయటపడింది’’ అని సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మళ్లీ ఆనాటి పాలనను గుర్తు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. ఇక.. బీజేపీతో రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని సుమన్ అన్నారు. దేశంలో.. ఆఖరికి సొంత పార్టీ(బీజేపీ) సీఎంలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది రేవంత్‌రెడ్డికి చాలా తేలికగా దొరుకుతోంది. రేవంత్ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ల షేక్‌హ్యాండ్, పలకరింపులు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందా విషయం. పార్లమెంట్ ఎన్నికల తరవాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం కన్ఫర్మ్ అయింది. గంపగుత్తగా, హోల్ సేల్ గా ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతులో పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని బాల్క సుమన్ పేర్కొన్నారు. -
‘హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది అని కాంగ్రెస్ చెప్తోందని, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదురిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘జర్నలిస్ట్ శంకర్‌పైన దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. సాయి రామ్ రెడ్డి హస్తినాపురం కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కి చెందిన అనుచరుడు. పథకం ప్రకారం శంకర్‌ను చంపాలని చూశారు. గొడవపడినట్టు ఇద్దరు మహిళలను పెట్టి పథకం ప్రకారం చేశారు. పాశవికంగా శంకర్‌పై దాడి జరిగింది. ఈ దాడిని అందరూ ఖండించాలి. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?. అక్షరంతో ప్రశ్నిస్తే అయుధంతో దాడులు చేస్తారా?. హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’అని బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోంది: క్రాంతి మాజీ ఎమ్మెల్యే ‘ఇది ప్రజా పాలన లాగా లేదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లాగా కనిపిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రమేయం లేకుండా తెలంగాణ వచ్చిందనే ప్రతీకారం ఉన్నట్టు ఉంది. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి దాడులు గమనించాలి. ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యం లేదు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం’అని క్రాంతి మండిపడ్డారు. -
‘లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారు? అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. తాము కిషన్‌రెడ్డితో ఏమైనా.. ఎప్పుడైనా పొత్తుల గురించి ఉసెత్తమా? అని అన్నారు. సోమవారం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు. బీఆర్ఎస్ ఒక సెక్యూలర్ పార్టీ మా నాయకుడు సెక్యులర్ నాయకుడు. లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ. .. గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. యూట్యూబ్ ఛానెల్‌లు, మేధావులకు ఈ విద్యార్థినీల ఆత్మహత్యలు కనిపించడం లేదా?. మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారు’ అని బాల్క సుమన్ విమర్శలు చేశారు. -
బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేసి.. విచారణకు రావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో సుమన్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. అదే రోజు బాల్క సుమన్‌పై కాంగెస్ పార్టీ మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేడు పోలీసులు బాల్క సుమన్ నోటీసులు జారీ చేశారు. తనకు వచ్చిన పోలీసు నోటీసులపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. చదవండి: సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు -
బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: బలరాం నాయక్
-
సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
మంచిర్యాల, సాక్షి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు . సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం. 👉: బాల్క్ సుమన్‌పై ఎఫ్ఐఆర్ -
బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా గెలువబోతున్న అంటూ మితిమీరిన విశ్వాసమే చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిండా ముంచింది అనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ, సింగరేణి అధికారులను నిర్లక్ష్యంగా చూడటం. వ్యక్తిగత సహాయకులు నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం. సీనియర్ నాయకులతో నాకు పనిలేదు. నేను ఎవరితో పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ పార్టీ సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం. బాల్క సుమన్ పేరు చెప్పుకొని పలువురు నాయకులు,కార్యకర్తలు సింగరేణి,ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం.తప్పుడు సమాచారం సుమన్ కు చేరవేయడం. అసలయిన విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టడం. నచ్చని నాయకులపై సుమన్ కు చాడీలు చెప్పడం. మందమర్రి,రామకృష్ణపూర్లో సింగరేణి క్వార్టర్ ల విషయంలో సుమన్‌ను నమ్ముకున్న వారికీ కాకుండ, పార్టీ క్యాడర్ లో కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడి వారి బందువులకు క్వార్టర్లను ఇప్పించడం. మందమర్రిలో గిరిజనుల భూములను కబ్జా చేయడం వంటి చర్యలు సుమన్ రెండో విజయానికి అడ్డుగోడల నిలిచాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కోటపల్లి మండలంలో రైతులను కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టపరిచినా స్పందించకపోవడంతో ఆ మండల వాసులు సుమన్‌ను వ్యతిరేకించారు. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా, హైదరాబాద్ కె ఎక్కువ సమయం ఇవ్వడం కూడా సుమన్‌ను నష్టపరిచిందనే ఆరోపణ కూడా ఉంది. ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్ గా ,పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికినీ నియోజక వర్గం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదనే అభిప్రాయాలూ సైతం ఉన్నాయి. గెలిచిన వెంటనే మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తా అని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సుమన్ ఆ హామీని నెరవేర్చకపోవడం కూడా అయన ఓటమికి మరొక కారణమయినదని చెప్పవచ్చు. -
TS Elections Result: చెన్నూర్‌లో నువ్వా? నేనా?
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు. చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోల్‌బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. -
సుమన్‌కు సుడిగుండమే.. ‘చెన్నూరు’ ఆయన పట్టుతప్పుతోందా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు ఈ ఎన్నికలు సుడిగుండంలా మారాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కొడుకులాంటి వాడినని చెప్పుకునే ఈ విద్యార్థి నాయకుడికి నియోజకవర్గంలో తన పట్టు తప్పుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆశించిన మైలేజీ రాక సొంత పార్టీలోనే విస్మయం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి అప్పటి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్‌పై అనూహ్యంగా గెలవడంతో సుమన్ ప్రజాప్రాతినిధ్య జీవితానికి తొలి అడుగు పడింది. 2018 ఎన్నికల్లో చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కాదని ఎంపీగా ఉన్న సుమన్‌కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో టికెట్‌పై పెట్రోల్ ‘మంటల’ మధ్యలోనే ఎన్నికలు ఎదుర్కొన్నారు. చివరికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ వెంకటేష్నేతపై 28వేల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం రెండోసారి చెన్నూర్ టికెట్ దక్కించుకుని బరిలో ఉన్నారు. అభివృద్ధి చెప్పినా.. వ్యతిరేకతేనా? జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూర్‌లోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని ఎమ్మె ల్యే సుమన్, పార్టీ శ్రేణులు చెబుతుంటారు. ప్రత్యేక బుక్లెట్ వేసి మరీ ప్రచారం చేస్తున్నా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ప్రచారం మొదలైన తొలి రోజు నుంచే ఓటర్లు తిరగబడుతున్నారు. ఆర్కేపీ, ఊరు మందమర్రి, చెన్నూరు, గంగారంలో నిరసనలు ఎదురయ్యాయి. చిత్రంగా మందమర్రి, ఆర్కేపీ, చెన్నూరు ఈ మూడు పట్టణాలకు రెండు వందల కోట్ల చొప్పున నిధులు తెచ్చామని చెప్పినా ఆ మే రకు ఓట్లు రాలుతాయా? అంటే చెప్పలేని పరిస్థితి. సుమన్ ప్రజలకు అందుబాటులో లేక, ఆయన పేరు చెప్పి నియోజకవర్గంలో కొందరు నాయకుల దందాలే కొంపముంచే పరిస్థితికి తెచ్చాయని అంటున్నారు. కోటపల్లి పరిధిలో ఓ నాయకుడు చేస్తు న్న భూ కబ్జాలు, బెదిరింపులు, మద్యం దందాలు, సెటిల్మెంట్లు అక్కడి ఓట్లపై దెబ్బ పడుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ వర్గీయులను పక్కకు పెట్టి, కేసులు పెట్టించడంతో వారంతా దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే రెండో సెట్ నామినేషన్ వేసే సందర్భంలో ఎమ్మెల్సీని బతిమాలినా రాకపోతే, చివరకు పార్టీ హైకమాండ్‌తో చెప్పించుకోవల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సొంత నియోజకవర్గ సీనియర్ నాయకుడినే ఆయన లెక్క చేయకపోగా కార్యకర్తలు, నాయకులకు ఫోన్లోనైనా అందుబాటులో ఉండరనే అపవాదు సామాన్య కార్యకర్తల్లో ఉంది. మందమర్రి, ఆర్కేపీలో సింగరేణి క్వార్టర్లు, భూములు ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు, ఆయన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడడంతో వందల కోట్ల అభివృద్ధి ఈ వ్యతిరేకత ముందు నిలవడం లేదు. -
ఓటమి భయంతోనే తనపై ఆరోపణలు: బాల్క సుమన్
-
విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఆ సోదరుల ధనబలం ముందు బీఆర్ఎస్ ప్రతాపమెంత?
ఓ పార్టీ అభ్యర్థి మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్లో తన బలం పెంచుకునేందుకు 30 మందికోసం రూ.2లక్షలు ఖర్చు చేశాడు. దీంతో ఆ అభ్యర్థికే వారు జై కొట్టడం ప్రారంభించారు. పార్టీ కండువాలు కప్పుకొని రోజువారీగా ప్రచారం చేస్తున్నారు. ఓ వాడలో 30 మందిని మాత్రమే తనవైపు తిప్పుకొనేందుకే సదరు అభ్యర్థి అక్షరాల రూ.2లక్షలు ఖర్చు చేయడం విశేషం. ► ఇదీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి చేసే ఎన్నికల ఖర్చుకు చిన్న ఉదాహరణ. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదుగా మారాయి. జిల్లా పరిఽధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో మంచిర్యాల జనరల్, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ, ఖానాపూర్ (జన్నారం) ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలుగా ఉన్నాయి. సాధారణంగా జనరల్ స్థానంలో బలమైన నాయకులు పోటీలో ఉంటే అధికంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా జనరల్ స్థానం కన్నా బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం పెరిగింది. పోటీలో ఉన్నవారు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుండగా ఎన్నికలు చాలా ఖరీదవుతున్నాయి. ధనబలమున్న గడ్డం సోదరులైన మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్ రంగ ప్రవేశంతో ఎన్నికలు మరింత ప్రియమైపోయాయి. బీఆర్ఎస్ బలం తగ్గకుండా.. చెన్నూర్, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థులైన గడ్డం సోదరులకు దీటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య ఖర్చు చేయడంలో పోటీ పడుతున్నారు. ప్రచారం, నాయకులు, కార్యకర్తల చేరికలు, బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలు కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ బహిరంగసభలు విజయవంతం చేసేందుకు రూ.కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకూ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రతిరోజూ ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా కార్యక్రమాలు చేయడమో.. అంతకంటే భారీగా ప్లాన్ చేయడం కోసమో నోట్ల కట్టలు విప్పాల్సి వస్తోంది. మంచిర్యాల నియోజకవర్గం కంటే ఈ రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చు పోటాపోటీగా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థుల హైరానా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు రాల్చేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే బీజేపీ అభ్యర్థులు హైరానా పడుతున్నారు. చెన్నూరు టికెట్ తెచ్చుకున్న దుర్గం అశోక్, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆ రెండు పార్టీలతో డబ్బుల్లో పోటీపడలేకపోతున్నారు. అయినప్పటికీ తమ స్థాయికి మించి ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. పోటీలో ఎక్కడ వెనుకబడిపోతామనే భయంతో చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది. ఇక బీఎస్పీ, స్వతంత్రులుగా పోటీ చేస్తున్నవారైతే ఈ ఖర్చు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పోటీ పడలేక, పోటీ నుంచి తప్పుకోలేక ఇబ్బందిగానే ముందుకు సాగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లోనే ఖర్చు తెల్లవారు మొదలు పొద్దుగుంకేదాకా ప్రచారమంతా ఖర్చుతోనే నడుస్తోంది. ర్యాలీలు, బహిరంగ సభలకు జనసమీకరణ, రవాణా, భోజనాలు, మద్యం, ఊరూరా ప్రచార రథాలు, ప్రకటనలు, కరపత్రాలు, కండువాలు, బహిరంగ సభలు, వసతులు తదితర వాటి కోసం రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి రూ.40లక్షల్లోపే ఖర్చు పరిమితి ఉంది. అయితే ఆ పరిమితి వాస్తవానికి ఎప్పుడో దాటిపోయింది. ఇతర పార్టీల నాయకులు తాము పార్టీ మారేందుకు ‘బేరసారాలు’ మొదలుపెట్టాక ఈ ఖర్చు మరింత పెరిగిపోయింది. నామినేషన్ల ఉపసంహరణలోనూ డబ్బు ప్రవావం ఉంటోంది. ఇక పోలింగ్ సమీపించే కొద్దీ ఈ నోట్ల ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చుపై పకడ్బందీ నిఘా పెడితే ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట పడనుంది. -
సింగరేణి తెలంగాణ కంపెనీనే, కానీ..: సీఎం కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్కు బాస్‌లు ఢిల్లీలో ఉండరని.. తెలంగాణ ప్రజలే దీనికి బాస్‌లు అని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నాం మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మందమర్రి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కేసీఆర్. ‘‘కాంగ్రెస్ నాయకుల చేతిలో ఏమీలేదు. ఢిల్లీలో కట్క వేస్తే ఇక్కడ ఆ పార్టీకి వెలుగు వస్తుంది. అంబేద్కర్‌ను పార్లమెంటు ఎన్నికలలో ఓడగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీనే. కానీ, బీఆర్ఎస్కు ప్రజలే బాస్‌లు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని అన్నారాయన. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓడలు, విమానాలు, రైళ్లు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తోంది. పేకాట క్లబ్ డబ్బులు సంపాదించినోడు మంచిర్యాలలో పోటీ చేస్తున్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలి అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ఈ సింగరేణి అచ్చం తెలంగాణాదే. సింగరేణి మన తెలంగాణ కంపెనీ. కానీ, కేంద్రం వద్ద అప్పులు తెచ్చి అది కట్టలేక నలభై తోమ్మిది శాతం వాటాల్ని కేంద్రానికి అమ్మింది కాంగ్రెస్ పార్టీనే. ప్రాజెక్టులు కట్టలేక ముంచింది కాంగ్రెస్. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగోట్టింది కాంగ్రెస్, కమ్యూనిస్టు లే’’ అని మండిపడ్డారాయన. ‘‘సూట్ కేసులతో వచ్చే వాళ్లు కావాలనా.. జేబులో పైసలు లేని సుమన్ కావాలనా? మీరే నిర్ణయం తీసుకోని ఓట్లు వేయండి’’ అని ప్రజలను కోరారాయన. ‘సుమన్ రాకముందు, సుమన్ వచ్చిన తర్వాత. చెన్నూరు ఏలా మారిందో చూసి ఓట్లు వేయాలి. సుమన్ మా ఇంట్లో ఉంటాడు.. నాతో ఉంటాడు. చైతన్యంతో ఆలోచించి బీఆర్ఎస్కు ఓటు వేయాలి’ అని ప్రజలను కోరారాయన. మహబూబ్‌నగర్, నల్లగొండ,మెదక్ జిల్లాలో సగం ప్రజలు వలసపోయేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారాయన. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. ఓటును అమ్ముకోవద్దు. వాళ్లెవరో చెప్పారని ఓటు వేయొద్దు. ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించండి. పార్టీ అభ్యర్థి నడవడికను విచారించి ఓటేయాలి అని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
అప్పుడు తండ్రిని ఓడించా.. ఇప్పుడు కొడుకుని ఓడిస్తా.. బాల్క సుమన్ ఛాలెంజ్
-
బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బహిరంగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేననని, తనని పంపింది తానేనని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి తెలిపారు. చెన్నూర్‌లో ప్రజాశీర్వాద. ర్యాలీలో సుమన్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్‌లో మనవాళ్లు ఉన్నారు. వాళ్లను కాంగ్రెస్‌లోకి పంపించింది నేనే. ఆ కాంగ్రెస్ నాయకులు కూడా.. ఎన్నికల తర్వాత మన పార్టీలోకి వస్తారు. గతంలో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ వెంకటేశ్ మన పార్టీలోకే వచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూడ బీఆర్ఎస్కే వస్తారు.. ..ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రచారం కోసం వస్తే సహకరించండి. వాళ్ల ప్రచారాన్ని అడ్డుకోవొద్దు అని కార్యకర్తలను ఉద్దేశించి సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో తన బినామీలు ఉన్నారన్న బాల్క సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. -
బెల్లంపల్లి రాజకీయ చరిత్ర.. గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2014లో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య రెండోసారి గెలుపొందారు. ఇక్కడ మాజీ మంత్రి జి.వినోద్ బిఎస్పి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు ఆయన టిఆర్ఎస్లో ఉన్నారు. టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో బిఎస్పి టిక్కెట్ తీసుకుని ఇక్కడ పోటీచేసి ఓటమి చెందారు. చిన్నయ్యకు 11276 ఓట్ల మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు మొత్తం 55026 ఓట్లు రాగా, వినోద్‌కు 31359 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా మూడోస్థానం ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఉన్న కె.వేద పదివేలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. సిపిఐ సీనియర్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ డిపాజిట్ దక్కించు కోలేకపోయారు. కాంగ్రెస్ ఐ మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. భారీ ఆదిక్యతతో.. బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2009లో గెలిచి ఆ శాసనసభలో సిపిఐ పక్ష నేతగా ఉన్న గుండా మల్లేష్ వరసగా ఓటమి చెందారు. 2014లో బెల్లంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య భారీగా 52,528 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో మల్లేష్ కూడా యాక్టివ్‌గా ఉన్నా ఫలితం దక్కేలేదు. 2014లో బెల్లంపల్లిలో టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్రకు 9167 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రముఖ బొగ్గు కేంద్రంగా ఉన్న బెల్లంపల్లి 2009లో రిజర్వుడ్ నియోజకవర్గంగా ఏర్పడింది. మల్లేష్ గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం (ఎస్.సి)లో మూడుసార్లు 1983, 1985, 1994లో విజయం సాధించారు.2009లో నాలుగో సారి గెలిచిన తరువాత మల్లేష్ సిపిఐ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సింగరేణి ఏరియాలో బీజేపీ నేతలను తిరగనివ్వం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని ఓ వైపు చెప్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలానికి పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేసి పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించాలని కేంద్రం చూస్తోందని, సింగరేణి ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించేలా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో సింగరేణి ఏరియాలో ఆ పార్టీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఢిల్లీ బీజేపీ నేతల హస్తం ఉందని, అందులో తెలంగాణ బీజేపీ నాయకులు కేవలం పాత్రధారులేనని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విజయోత్సవ ర్యాలీలా? ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ విజయోత్సవ ర్యాలీలు ఎందుకు తీస్తుందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఎస్సెస్సీ హిందీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దోషి కాదని, ఆయన తప్పు చేసినందునే పోలీసులకు తన ఫోన్ ఇవ్వడం లేదన్నారు. ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీని బ్రోకర్, జుమ్లా, పేపర్ లీక్ పార్టీగా ఆయన అభివర్ణించారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న సంజయ్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.