
సాక్షి, హైదరాబాద్: కనీసం హిందీ, ఇంగ్లిష్ రాకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఎలా సాధ్యమని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడారు. ఓ సారి హోదా కావాలని, మరోసారి వద్దని చెప్పే బాబు ఈ విషయంలో ఆయన విధానమెంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కుమారులను, జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల కోసం వాడుకున్న మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏపీ మంత్రులు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి తప్పకుండా సీఎం కేసీఆర్ లేఖ రాస్తారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment