
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ ఉంటున్న బాల్క సుమన్ ప్లాట్‌లోకి గత నెల మంచిర్యాలకు చెందిన శంకర్, విజేత, గోపాల్, సంధ్య, అక్రమంగా ప్రవేశించి ఆయన వ్యక్తిగత సహాకుడు సునీల్‌పై దాడికి యత్నించారు.
ఎంపీని దూషించడంతో సునీల్ గతనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శంకర్, విజేతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న గోపాల్, సంధ్యలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనాలు: