photo morphing
-
లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి
అల్లిపురం (విశాఖ): లోన్ యాప్ వేధింపులకు విశాఖ నగరంలో ఓ యువకుడు బలైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాణిపేట సీఐ బి.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర తన భార్య అఖిలాదేవి, తల్లి, తండ్రితో కలసి జీవిస్తున్నాడు. ఇతనికి వివాహమై సుమారు 50 రోజులైంది. సముద్రంలో వేటకు వెళ్లి వస్తుంటాడు. భార్య అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఇంటి అవసరాల నిమిత్తం నరేంద్ర ఆన్లైన్ యాప్‌లో రూ.2 వేలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించేశాడు. కానీ.. రుణం తిరిగి చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అఖిల సెల్‌ఫోన్‌కు నరేంద్ర, అఖిల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపించారు. లోన్ తక్షణమే తీర్చకపోతే వాటిని ఇతరులకు సైతం పంపిస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన తరువాత నరేంద్రను అఖిల ఈ విషయం అడగ్గా.. ఇంటి అవసరాల నిమిత్తం తీసుకున్నట్టు చెప్పాడు. తర్వాత అఖిల ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో అఖిల అత్త ఫోన్‌చేసి నరేంద్ర తలుపులు తీయటం లేదని చెప్పటంతో ఇంటికి చేరుకుంది. తలుపులు కొట్టినా ఎంతకీ తీయక పోవటంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూడగా.. నరేంద్ర గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు విరగ్గొట్టి నరేంద్రను కిందికి దించి కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందంయువకుడి మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, మహిళలను అవమానించడం, నేరపూరిత బెదిరింపు, మరొకరి గుర్తింపును మోసపూరితంగా ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక, అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడం తదితర నేరాలపై బీఎన్ఎస్ 108, 79, 351(2), ఐటీ యాక్ట్ సెక్షన్ 66 (సి), 67(ఎ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుని మొబైల్ ఫోన్‌ను పరిశీలించి నేరస్తులను గుర్తించేందుకు సైబర్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
మహిళల భద్రతకు ‘పచ్చ’ముప్పు
సాక్షి, అమరావతి : చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన మునుపెన్నడూలేని రీతిలో బరితెగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు పన్నాగం పన్నుతూ యావత్ మహిళల భద్రతకు పెనుముప్పుగా మారారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ రూపొందించిన ‘వుయ్ యాప్’ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రమాదంగా పరిణమించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘించి రూపొందించిన ఈ యాప్ మహిళల భద్రత పాలిట పెనుగండంగా మారింది. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న టీడీపీ ‘వుయ్ యాప్’ బాగోతం కథాకమామిషు ఏమిటంటే.. వ్యక్తిగత సమాచారం అంతా ‘పచ్చ’ముఠా గుప్పెట్లోరాష్ట్రంలో ఓటర్ల వివరాలన్నింటినీ చంద్రబాబు ముఠా అక్రమంగా సేకరించింది. గతంలో అధికారంలో ఉండగా నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధించారు. ప్రస్తుతం కూడా టీడీపీ అదే రీతిలో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించింది. ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఫొటోలు.. ఇలా పూర్తి వివరాలను వుయ్ యాప్‌లో పొందుపరిచారు. వాటిలో రాష్ట్రంలోని 2.10 కోట్ల మహిళా ఓటర్ల వివరాలు వారి ఫొటోలతో సహా ఉండటం గమనార్హం. అంటే.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యవతులు, మహిళల పూర్తి వ్యక్తిగత సమాచారం అంతా టీడీపీ గుప్పెట్లోకి వచి్చందన్న మాట. ఈ సమచారాన్ని వుయ్ యాప్ ద్వారా టీడీపీ బూత్‌కమిటీలకు చేర్చింది. దీంతో ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు, ఇతర నేరచరితులకు ఈ వివరాలన్నీ అందుబాటులోకి వచ్చినట్లే. వేధింపులకు అవకాశం.. భద్రతకు ముప్పుటీడీపీ పాల్పడుతున్న ఈ అక్రమాలు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెనుముప్పుగా పరిణమించాయి. ఎందుకంటే ఆకతాయిలు మహిళల ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వేధించొచ్చు.. ఫొటోలను ఎవరైనా మార్ఫింగ్ చేసి సైబర్ నేరాలకు పాల్పడొచ్చు.. వారి బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్ చేసి ఆరి్థక నేరాలకు పాల్పడొచ్చు.. ఇలా.. ఎటువంటి నేరాలకైనా పాల్పడేందుకు ఆ యాప్ అవకాశం కలి్పస్తోంది.టీడీపీ కుట్ర కచి్చతంగా రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగకరం. వ్యక్తిగత గోప్యత హక్కుకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో.. వుయ్ యాప్ పేరుతో టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంతోపాటు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెను ప్రమాదాన్ని తీసుకొచి్చందని మేధావులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ)తోపాటు పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించి ఈ యాప్‌ను తొలగించాలని కోరుతున్నారు. చంద్రబాబుతోపాటు వుయ్ యాప్ రూపొందించిన వారిపై కుట్ర కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధ్వంసాలకు బాబు స్కెచ్మరోవైపు.. ఓటమి భయంతో అసలే బెంబేలెత్తుతున్న చంద్రబాబు మహిళా ఓటర్లు పేరెత్తితే రగిలిపోతున్నారు. వారంతా ముక్తకంఠంతో సీఎం జగన్‌కే మద్దతు ప్రకటిస్తుండడంతో బాబుకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో ఆయన విధ్వంసకర కుట్రకు తెరతీశారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు స్కెచ్ వేశారు. మహిళల ఓట్లు ఎలాగూ సాధించలేం కాబట్టి వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా రాబోయే 24 గంటల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు పన్నాగం పన్నారు. రెచ్చగొట్టి దాడులకు తెగబడాలి.. పోలింగ్ బూత్‌లకు వెళ్లే మహిళలను ఆకతాయిలతో రెచ్చగొట్టి.. అసభ్య పదాలతో దూషించి.. వారు దానిపై ప్రశి్నంచగానే టీడీపీ గూండాలు ఘర్షణలకు దిగి.. దాడులకు తెగబడేలా చేయాలన్నది చంద్రబాబు బ్లూప్రింట్. ఈ కుట్రను పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు, నేతలు తమ మందీమార్బలాన్ని, గూండాలను సమీకరించుకుని.. వారికి కర్రలు, కత్తులతోపాటు ఇతర ఆయుధాలను కూడా అందించి పోలింగ్‌ను భగ్నం చేసేందుకు తద్వారా మహిళల ఓటింగ్‌ను తగ్గించేందుకు సన్నద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహిళలే లక్ష్యంగా బాబు కుట్ర..ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలోని ఎన్నికల ముఖచిత్రం ఏమిటన్నది చంద్రబాబుకు స్పష్టమైంది. ప్రజలంతా వైఎస్సార్‌సీపీపట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారన్నది తేలిపోవడం.. మహిళా ఓటర్లు సీఎం జగన్‌కు నీరాజనాలు పడుతున్నారని అన్ని జాతీయ సర్వేలతో సహా స్పష్టంచేస్తుండటంతో ఆయన రగిలిపోతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లుండగా.. వారిలో మహిళా ఓటర్లే 2.10 కోట్ల మంది ఉన్నారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా మొత్తం రూ.2.83 లక్షల కోట్ల మేర లబ్ధి వారికి చేకూర్చి దేశంలోనే కొత్త చరిత్రను సృష్టించడంతో సీఎం జగన్‌కు మహిళలు జేజేలు పలుకుతున్నారు. దీంతో మహిళల ఓట్లపై చంద్రబాబు దాదాపుగా ఆశలు వదిలేసుకోవడం.. టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోవడంతో మహిళా ఓటర్లే లక్ష్యంగా బాబు విధ్వంసానికి కుట్ర పన్నారు.అడ్డుకట్ట వేయాల్సింది ఈసీ, పోలీసులేఈ నేపథ్యంలో.. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ కోసం వెబ్‌కాస్టింగ్, వీడియో రికార్డింగ్ తదితర చర్యలు తీసుకుంటున్నా.. అవి పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితిని మాత్రమే పర్యవేక్షణకు ఉద్దేశించినవి.⇒కానీ, సామాన్య మహిళా ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్ బూత్‌లకు వచ్చే మార్గాల్లోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు తెగబడేందుకు కుట్ర పన్నుతున్న టీడీపీ గూండాలను కట్టడి చేయాలంటే ఆ చర్యలు సరిపోవు. కాబట్టి ఈసీ, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి.. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా.. మహిళలు అత్యధికంగా ఓటింగులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఓటింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారు. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా సాగితే మహిళల ఓటింగ్ శాతం అమాంతంగా పెరుగుతుంది. అందుకే మహిళల ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జాన్యాలకు పాల్పడమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు.అందుకోసం స్థానికంగా ఉండే టీడీపీ రౌడీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, రౌడీ మూకలను రప్పించినట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగించాలని.. తద్వారా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలన్నది చంద్రబాబు పన్నాగం. పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం.. వీలైతే పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి తీసుకొచ్చి శాంతిభద్రతలు అదుపుతప్పేలా చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇందులో భాగమే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు. అవి.. ⇒ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపైనే టీడీపీ గూండాల దాడి. ⇒ మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరిలపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడిచేయించడం.. ⇒ ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ గూండాలు దాడి. -
'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్ చేశారు!'
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు శాంతియుత ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్ పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటోలపై రెజ్లర్లు స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు. ''కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI Technology) ఉపయోగించి మొహాలనే మార్చేస్తున్నారు.. మేమెంత చెప్పండి.. మా నిరసనపై బురద జల్లే ప్రయత్నంలో కొందరు గిట్టని వ్యక్తులు ఇలాంటి తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోను పోస్ట్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాం'' అని భజరంగ్ పునియా ట్వీట్ చేశాడు. దీనిపై సాక్షి మలిక్ స్పందిస్తూ..''అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. IT Cell वाले ये झूठी तस्वीर फैला रहे हैं। हम ये साफ़ कर देते हैं की जो भी ये फ़र्ज़ी तस्वीर पोस्ट करेगा उसके ख़िलाफ़ शिकायत दर्ज की जाएगी। #WrestlersProtest pic.twitter.com/a0MngT1kUa — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్.. 8 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. ట్రోలింగ్లపై 20 కేసులు నమోదు నమోదు చేశామని, మరో 30 మంది ట్రోలర్స్‌కు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్పింగ్ చేసి ట్రోలింగ్ చేశారని డీసీపీ తెలిపారు. ప్రభుత్వ పెద్దలపైనా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా కంటెంట్‌ను పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్నేహా మెహ్రా హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారిలో అట్టాడ శ్రీనివాసరావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను, పెరక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్ ఉన్నట్లు చెప్పారు. -
Hyderabad: యువతి ఫోటో మార్ఫింగ్ చేసి వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: యువతి ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు పంపి వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట్ జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన నవదీప్(18)కు అతడి స్నేహితుడి ద్వారా ఓ యువతి(19) పరిచయమైంది. ఆమె పేరుపై ఇన్‌స్టా ఐడీ తెలుసుకున్న నవదీప్ గుర్తుతెలియని వ్యక్తి పేరుపై ఐడీ క్రియేట్ చేసి సందేశాలు పంపించసాగాడు. ఈ క్రమంలో యువతి ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు రూపొందించి పంపి వేధించంతో పాటు రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నవదీప్‌ను అదుపులోకి తీసుకొని జుడీషియల్ రిమాండ్కుతరలించారు. చదవండి: కన్న కూతురిపై కన్నేసిన కామాంధుడు.. అసభ్యకర ప్రవర్తన -
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
సల్లిడీల్స్ యాప్ సృష్టికర్త అరెస్ట్
న్యూఢిలీ/ఇండోర్: ముస్లిం మహిళల్ని అవమానించడమే లక్ష్యంగా బుల్లి బాయ్ యాప్ కంటే ముందే వచ్చిన సల్లి డీల్స్ యాప్ సృష్టికర్తని మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్‌లో బీసీఏ చదివిన అంకురేశ్వర్ ఠాకూర్ (26) ఈ యాప్ రూపొందించాడని అనుమానంతో ఢిల్లీ పోలీసులు అతనిని శనివారమే అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అంకురేశ్వర్ తన నేరాన్ని అంగీకరించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఐఎఫ్‌ఎస్‌ఒ) కెపీఎస్ మల్హోత్రా ఆదివారం వెల్లడించారు. ముస్లిం మహిళల్ని ట్రోల్ చేయడం కోసం తాను ఈ యాప్‌ని రూపొందించినట్టు అతను చెప్పాడన్నారు. సల్లి డీల్స్ కేసులో ఇదే మొదటి అరెస్ట్. జనవరి 2020లో ఠాకూర్ ట్రేడ్ మహాసభ అనే ట్విటర్ గ్రూపులో చేరాడు. జ్చnజ్ఛటజీౌn అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్‌లో చేరాడు. ఆ గ్రూపు సభ్యులు ముస్లిం మహిళలని ట్రోల్ చేయడంపైనే చర్చలు జరిపేవారు. ఈ నేపథ్యంలో ఠాకూర్ సల్లి డీల్స్ యాప్‌ని డిజైన్ చేసి గత ఏడాది జులైలో గిట్‌హబ్ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచాడు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి వేలానికి పెట్టాడు. ఈ విషయంలో మీడియాలో ప్రధానంగా రావడంతో అతను తన సోషల్ మీడియా అకౌంట్లన్నీ డిలీట్ చేశాడు. కాగా పోలీసుల అదుపులో ఉన్న బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్ విచారణలో తాను సల్లిడీల్స్ను రూపొందించిన వారితో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఠాకూర్‌ని అరెస్ట్ చేశారు. -
‘బుల్లి బాయ్’ సృష్టికర్త అరెస్ట్
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్’ యాప్ సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన నీరజ్ బిష్ణోయ్ (21) ఈ యాప్‌ను తయారు చేశాడని, అతనే ఈ కేసుకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం అస్సాంలోని నీరజ్ సొంతూరు జోర్హత్‌లో ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) బలగాలు అతనిని అదుపులోనికి తీసుకొని ఢిల్లీకి తీసుకువచ్చాయి. పోలీసులు జరిపిన విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్టుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్ ప్రధాన నిందితురాలిగా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరజ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోబీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గిట్‌హబ్ ప్లాట్‌ఫారమ్‌లో బుల్లి బాయ్ యాప్ తయారు చేసి దానికి సంబంధించిన ప్రధాన ట్విట్టర్ అకౌంట్ అతనే నడుపుతున్నాడని ఐఎఫ్‌ఎస్‌ఒ డిప్యూటీ కమిషనర్ కేపీఎస్ మల్హోత్రా మీడియాకి చెప్పారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్), ఇతర గేట్ వేల సహాయంతో అతని జాడని కనిపెట్టామని చెప్పారు. నీరజ్ ల్యాప్‌టాప్‌లో కూడా ఈ యాప్‌ని తయారు చేసినట్టుగా ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయని తెలిపారు. -
ఆన్లైన్లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు..
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ఎలాంటి అనర్థాలకు దాని తీస్తుందో తెలిపే ఉదంతమిది. నగరానికి చెందిన ఓ బాలిక సోషల్ మీడియా ద్వారా మహారాష్ట్ర సైబర్ నేరగాళ్లకు చిక్కింది. నీ కష్టాలు తీరుస్తానంటూ యువతిగా ఆన్లైన్లో పరిచయమైన యువకుడు దగా చేశాడు. బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. ఎట్టకేలకు విషయం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు రావడంతో గురువారం కటకటాల్లోకి చేరాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మారు పేర్లతో.. ►వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ పదో తరగతి తర్వాత మల్టీమీడియా కోర్సు చేయడానికి నగరానికి వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ అక్కడి ఓ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నాడు. ► ఇతగాడు యువతీ యువకుల మారుపేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు, ఫేస్బుక్లో ఆరు నకిలీ ఖాతాలు తెరిచాడు. వీటిని వినియోగించి అనేక మంది యువతులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేస్తున్నాడు. ► నగరానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఎక్కువగా తన ఫోన్‌తోనే ఉంటోంది. వీటితో పాటు ఆమెకు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లోనూ అకౌంట్లు ఉన్నాయి. తనకు వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఆలోచించకుండా యాక్సెప్ట్ చేస్తోంది. చదవండి: ప్రేమించి పెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు ఫొటోలను మార్ఫింగ్ చేసి.. ► ఆమె ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో వేళకాని వేళల్లోనూ వారితో చాటింగ్ చేస్తోంది. ఇలా పుణేకు చెందిన కొందరి చేతిలో చిక్కింది. వాళ్లు ఈ బాలిక ఫొటోలు సేకరించి వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు. ► అవి బాలికకు పంపి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదే సందర్భంలో యువతిగా అజయ్ తెరిచిన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ బాలికకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎప్పటి లాగే దీన్ని బాలిక యాక్సెప్ట్ చేసింది. ► అప్పటి నుంచి యువతి మాదిరిగా బాలికతో చాటింగ్ చేసిన అజయ్ నమ్మకం సంపాదించాడు. దీంతో బాలిక తన ‘పుణే బాధలను’ ఈమెగా ఉన్న ఇతడికి వివరించింది. ఆమె ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని అజయ్ పథకం వేశాడు. సెటిల్ అయిందని నమ్మించి.. ► తాను కూడా ఇలానే, అదే వ్యక్తులతో బాధితురాలిగా మారానని, రూ.5 వేలు, తన వ్యక్తిగత ఫొటోలు పంపితే విషయం సెటిల్ అయిందని చెప్పి నమ్మించాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేదంటూ బాలిక వాపోయింది. ► కనీసం రూ.3 వేలు, వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు పంపితే పుణే వారి వేధింపులు లేకుండా చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో బాధితురాలు తన వ్యక్తిగత ఫొటోలను ఆమెగా ఉన్న అతడికి షేర్ చేసింది. ► డబ్బును తీసుకుని దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చి.. అక్కడి ఓ ప్రాంతంలో పెట్టాలంటూ సూచించాడు. బాధితురాలు అలాగే చేయగా ఆమె వెళ్లే వరకు చాటుగా కాపుకాసి ఆపై మొత్తం తీసుకున్నాడు. చదవండి: ‘గల్ఫ్ నుంచి వస్తున్నా..’ అని ఫోన్ చేసి.. ముంబాయిలో దిగాడు, కానీ.. ► అయినప్పటికీ పుణే నేరగాళ్ల వేధింపులు ఆగకపోవడంతో బాలిక ఆమెగా ఉన్న అజయ్‌ను సంప్రదించింది. వారి వద్ద ఉన్న వాటిని డిలిట్ చేయడానికి మరో రూ.6 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ అతగాడు చెప్పాడు. ► అంత మొత్తం తన వద్ద లేకపోవడంతో బాధితురాలు విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగింది. ► సాంకేతికంగా ముందుకు వెళ్లిన అధికారులు నిందితుడిని గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో అజయ్ మరికొందరు బాలికలు, యువతులను మోసం చేశాడని తేలింది. -
ఐఐటీ విద్యార్థి టెక్నాలజీ ఉపయోగించి.. 50 మంది విద్యార్థులు, టీచర్లను..
న్యూఢిల్లీ: ఐఐటీ విద్యార్థి అనగానే చదువు పూర్తి అయ్యేసరికి లక్షల్లో ఉద్యోగం లేదా సొంతంగా స్టార్టప్ కంపెనీ ఐడియాతో బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అందరు భావిస్తుంటారు. కానీ ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం అమ్మాయిలు, టీచర్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ చివరికి కటకటాల్లోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. ఖరగ్‌పూర్ ఐఐటీలో మహవీర్ బీ.టెక్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను నార్త్ ఢిల్లీలోని ఓ స్కూల్‌కు చెందిన 50 మంది విద్యార్థినులను, టీచర్లను వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో బాధితులను సంప్రదించడానికి మహావీర్ నకిలీ కాలర్ ఐడి, వాట్సప్‌లో వర్చువల్ నంబర్ల కోసం యాప్‌లను ఉపయోగించేవాడు. తెలివిగా తన ఐడెంటిటీ దాచేందుకు, అతను వాయిస్ మార్చే యాప్‌ని కూడా ఉపయోగించేవాడు. అమ్మాయిల పేర్లపై నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసిన అతను .. బాధితుల మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసేవాడు. ఈ అకృత్యాలకు సంబంధించి బుధవారం పాఠశాల యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేసి జరిపిన దర్యాప్తులో.. వేరువేరు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి టీచర్లకు, బాలికలకు ఫోన్ కాల్ చేసి వేధించినట్లు తెలిసింది. ఆన్లైన్ క్లాసుల కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి ఆ ఐఐటీ విద్యార్థి వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. స్కూల్ విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులను కూడా విచారించారు. నిందితుడికి చెందిన పలు వాట్సాప్ వర్చువల్ నెంబర్లు, ఇన్‌స్టా ప్రొఫైల్స్, ఫేక్ కాలర్ ఐడీ యాప్‌లను గుర్తించారు. వాట్సాప్, ఇన్‌స్టా, ఐడీల లాగిన్స్‌ను పరిశీలించగా అతను పాట్నా నుంచి ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మొదట ఓ విద్యార్థినితో పరిచయం ఏర్పరుచుకున్న మహవీర్.. ఆ తర్వాత బాలిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫ్రెండ్స్‌తో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఐఐటీ విద్యార్థి కావడంతో పాటు యాప్ టెక్నాలజీలో మంచి నాలెడ్జ్ ఉండడంతో అతనికి విద్యార్థులను, మహిళలను వేధించడం సులువైంది. ఇందులో కొందరు మైనర్ బాలికలను కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భార్యను కొట్టి చంపి.. మృత దేహంపై కూరగాయల బస్తాలు వేసి.. సొంతూరికి -
ఫొటో మార్ఫింగ్ మోసాలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!
సాక్షి, శ్రీకాకుళం: వందలాదిగా ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ప్రొఫైల్ పిక్స్‌కు లాక్ కూడా పెట్టుకోరు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది అంత మంచి పని కాదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని సైబర్ అవేర్నెస్ వీక్‌లో వారు అవగాహన కల్పిస్తున్నారు. మోసం జరిగే విధానాలు సెక్స్ టార్షన్ సంబంధిత నేరాలు అనేక రకాలుగా జరుగుతాయి. ఇంటర్నెట్లో ఉన్న డేటింగ్ వెబ్సైట్/యాప్స్‌లలో సైబర్ నేరస్తులు ఆకర్షణీయమైన ఫేక్ ప్రొఫైల్ పెడతారు. మొదట్లో తియ్యటి మోటలతో బాధితులను నమ్మించి, వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తీసుకుని తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడతారు. సైబర్ నేరస్తులు ఇంటర్నెట్లో ఫేక్ మాట్రిమోనియల్ వెబ్సైట్లు కూడా రిజిస్టర్ చేసి ఆకర్షణీయమైన ఫేక్ ప్రొఫైల్స్‌ను ఉంచుతారు. ఎవరైనా వీరి ఉచ్చులో పడితే పై మాదిరిగా బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటారు. కొన్నిసార్లు బాధితునికి నేరస్తునిపై పూర్తి నమ్మకం కుదరగానే వారితో నీ పేరు మీద ప్లాట్/హౌస్ కొంటున్నానని, కానీ వారి డబ్బులు స్టాక్ మార్కెట్లో ఇరుక్కున్నాయని, డౌన్ పేమెంట్ కోసం వారి అకౌంట్‌కు మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరి అందిన కాడికి దోచుకుంటారు. పిక్చర్ మార్ఫింగ్ సైబర్ నేరస్తులు ఐడెంటిటీ థెఫ్ట్› ద్వారా బాధితుని ఫొటోలు దొంగిలించి వాటిని మార్ఫింగ్ చేస్తారు. ఇంటర్నెట్/సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేస్తామని, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బును దోచుకోవడం లేదా లైంగికంగా వేధించడం చేస్తారు. వాట్సాప్‌లు, ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సైబర్ నేరస్తులు బాధితులను ఆకర్షించి వారితో సెక్స్ చాట్స్, న్యూడ్ వీడియో కాల్స్‌కు ప్రేరేపించి వాటిని రికార్డు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని, ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌కు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. హనీ ట్రాప్‌లో ఇది ఒక కొత్త తరహా నేరం. ఈ సైబర్ నేరాల్లో స్త్రీలే ఎక్కువగా బాధితులైనప్పటికీ చాలాచోట్ల మగవారు కూడా బాధితులైన ఘటనలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఇంటర్నెట్లో ఉండే డేటింగ్ వెబ్సైట్/యాప్స్, ఫేక్ మాట్రిమోనియల్ సైట్లలో ఉండే ఫేక్ ప్రొఫైల్స్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలి. ► అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్ లేదా వీడియో కాల్స్ వంటివి చేయకూడదు. ► మన పర్సనల్ ఫొటోలు/వీడియోలు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. చాలాసార్లు మనకు బాగా తెలిసిన వ్యక్తే ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు. ► సైబర్ నేరస్తుల నుంచి మన డేటా లేదా ఐడెంటిటీ థెఫ్ట్ కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్‌కు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉంచుకోవాలి. ► టీనేజ్ పిల్లలు ఇలాంటి సైబర్ మోసాలకు తొందరగా ఆకర్షితులవుతారు. వారికి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా వివరించాలి. -
గ్రేట్ ఫాదర్.. మా నాన్నహీరో
‘నాన్నంటే మా నాన్నలా ఉండాలి’ అంటోంది శృతి చతుర్వేది. నిజమే... నాన్న అయినా, అమ్మ అయినా పిల్లలకు అండగా నిలవాల్సింది వాళ్లను సమాజం వేలెత్తి చూపించిన క్షణంలోనే. ఆ క్షణంలో మిగిలిన వారికంటే ముందుగా తల్లిదండ్రులే పిల్లలను నేరస్థులుగా చూడడం మొదలు పెడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులు సమాజానికి భయపడి పిల్లలను దూరంగా ఉంచి, అలా దూరంగా ఉంచడాన్ని తమ నిక్కచ్చితనానికి, కచ్చితత్వానికి కొలమానంగా భావిస్తుంటారు. శృతి చతుర్వేది తండ్రి హరీశ్ చతుర్వేది కూతురు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు అండగా నిలిచాడు. కూతురి వెనుక జరిగిన కుట్రను ఛేదించడంలో సహకరించాడు. తమ ఇంట్లో ఆశ్రయం పొంది, ఘాతుకానికి ఒడిగట్టిన ద్రోహుల్ని ఇంటినుంచి తరిమికొట్టి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. అందుకే శృతి చతుర్వేది తన తండ్రి గురించి అంత గొప్పగా చెప్పగలిగింది. అసలేం జరిగింది? శృతి ఫొటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయి. గౌరవంగా జీవించే ఆ కుటుంబం గురించి బంధువులు, స్నేహితులు అసభ్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఎదురైంది. ఒకరకంగా సామాజిక బహిష్కరణ వంటిది. శృతి తండ్రి ప్రతి ఫొటోనీ నిశితంగా గమనించాడు. నిజానికి ఆ ఫొటోలన్నీ ఆయన గతంలో చూసినవే. అయితే కొత్త పరిసరాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా కనిపిస్తున్నాయి. తమ కుటుంబం పిక్నిక్కి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలో శృతి పక్కన ఆమె కాలేజ్ స్నేహితుల్లో అబ్బాయిల ఫొటోలున్నాయి. గ్రూప్ ఫొటోల నుంచి ఆ అబ్బాయి ఫొటోను క్రాప్ చేసి శృతి పిక్నిక్ ఫొటోతో జత చేశారెవరో. అలాగే మరికొన్ని ఫొటోల్లో శృతిలాగానే కనిపిస్తోంది. కానీ దేహం శృతిది కాదు. మరెవరి దేహానికో శృతి ముఖాన్ని అతికించారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడంతోపాటు ఆ ఫొటోలను తమ కుటుంబానికి ఆత్మీయులైన వాళ్లకు చేరేటట్లు చేశారు. ఇదంతా చేసింది ఎవరు? హరీశ్ చతుర్వేదికి ఒక సందేహం వచ్చింది. చివరికి అతడి సందేహమే నిజమైంది. ఎలా జరిగింది! శృతి చతుర్వేది వయసు 28. ఢిల్లీలో మీడియా మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగి. ఆమె పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల కజిన్ అతడి భార్యతోపాటు శృతి ఇంటికి వచ్చాడు. అతడి ప్రేమను అతడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన అమ్మాయితోపాటు శృతి వాళ్ల ఇంటికి వచ్చి తలదాచుకున్నాడు. అలా వచ్చిన ఆ దంపతులు కొన్ని నెలల పాటు ఉండిపోయారు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక ల్యాప్‌టాప్‌ని అందరూ ఉపయోగించేవారు. శృతి ఇంట్లో అందరూ తెరిచిన పుస్తకంలా ఉండేవారు. ఎవరికీ ఏ రహస్యాలు లేని జీవితాలు వాళ్లవి. ఇంట్లో అందరి ముఖ్యమైన సమాచారంతోపాటు పిక్నిక్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు కూడా అదే ల్యాప్‌టాప్‌లో ఉండేవి. శృతి కజిన్ దంపతులకు ఉద్యోగ ప్రయత్నాల కోసం ఆ ల్యాప్‌టాప్‌నే ఇచ్చారు శృతివాళ్లు. శృతి కజిన్ భార్య కంప్యూటర్ ఇంజనీర్. ఇదంతా చేసింది ఆమే. ఫొటోషాప్‌లో శృతి ఫొటోలను మార్ఫింగ్ చేసింది. వాళ్లకు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో తమకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి వాళ్లనే అభాసుపాలు చేశారు. ఇలా ఉండాలి! శృతి అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఆ రోజు మా నాన్న అంత హుందాగా వ్యవహరించి ఉండకపోతే ఈ రోజు నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్‌గా నిలిచేదాన్ని కాదు. నాకు ధైర్యం చెప్పి, ఆ ద్రోహుల్ని ఇంటి నుంచి తరిమివేశాడు. తండ్రి పిల్లల్ని సమాజం వైపు నిలబడి చూడకూడదు. తన పిల్లల వైపు నిలబడి సమాజాన్ని ఎదుర్కోగలగాలి. ఇది ధైర్యవంతులకే సాధ్యం. మా నాన్న ధీరుడు’’ అంటోంది శృతి చతుర్వేది. -
అశ్లీల చిత్రాలు షేర్ చేసిన భార్య, భర్త అరెస్ట్
సాక్షి, బొమ్మలసత్రం: ఓ మహిళా మరో వ్యక్తితో కలిసి ఫొటో దిగినట్లు ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేసిన ఇద్దరిని టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ దైవప్రసాద్ తెలిపిన వివరాలు.. కర్నూలుకు చెందిన ఓ యువతి నవజ్యోతి హ్యుమన్‌రైట్స్ సభ్యురాలుగా ఉండేది. ఆమెతో పాటు నెహ్రూ నగర్‌కు చెందిన భార్య, భర్త శిరీష, రామకృష్ణారెడ్డి కూడా సభ్యులుగా ఉండేవారు. కొంత కాలం క్రితం యువతితో మనస్పర్థలు రావటంతో రామకృష్ణారెడ్డి, శిరీష నవజ్యోతి హ్యుమన్‌రైట్స్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఎలాగైనా యువతిపై కక్ష సాధించాలన్న ఉద్దేశంతో ఆమె ఫొటోను నవజ్యోతి హ్యుమన్‌రైడ్స్ అధ్యక్షుడి ఫొటోను సేకరించి అశ్లీలంగా ఉన్నట్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవిషయంపై యువతి స్థానిక టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు రామకృష్ణారెడ్డి, శిరీషలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి జైషే మొహమ్మద్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమ్రాన్‌ను సోమవారం నాడు 12 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ ఎన్కౌంటర్లో మట్టుబెట్టామని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. ఈ వార్తను అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. వార్తతోపాటు సైనిక కమాండర్ దుస్తుల్లో ఉన్న కమ్రాన్ ఫొటోను ఇండియా టుడేతోపాటు ఏబీపీ న్యూస్, జీ న్యూస్, ఇండియా టీవీ, అవుట్‌లుక్, ది ఎకనామిక్ టైమ్స్ ఇలా చాలా మీడియా సంస్థలు చూపించాయి. (ఎన్కౌంటర్లో కమ్రాన్ హతం) అది మార్ఫింగ్ ఫొటో అని ఈ మీడియా సంస్థలు గుర్తించినట్లు లేదు. ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ జాన్ బాన్ జోవి ఫొటోను తీసుకొని ఒక తలను మాత్రం మార్ఫింగ్ ద్వారా కమ్రాన్‌గా మార్చారు. పాప్ సింగర్ ఒరిజనల్ ఫొటోతోని పోల్చి చూస్తే ఇది మార్ఫింగ్ ఫొటో అని సులువుగా తెలిసిపోతుంది. జోవి ఎడమ చేతి వాకీటాకీని పట్టుకొని ఉండగా ఆ చేతికి వాచీ కూడా ఉంటుంది. కుడిచేయి నడుము వరకు ఉంటుంది. ఆ రెండు చేతులే కాకుండా ఒంటి మీది ఉన్న దుస్తులు కూడా కమ్రాన్ ఫొటోలో అచ్చుగుద్దినట్లు కనిపిస్తుంది. మార్ఫింగ్‌లో ఫొటో బ్యాక్ గ్రౌండ్‌ను, ఫొటో కలర్ షేడ్‌ను కాస్త మార్చారు. ఫొటోను మార్ఫింగ్ చేయడానికి ఫొటో సాఫ్ట్వేర్ అప్లికేషన్‌తోపాటు అమెజాన్‌కు చెందిన ‘పోలీస్ సూట్ ఫొటో ఫ్రేమ్ మేకర్’ అనే యాప్‌ను వాడినట్లు స్పష్టం అవుతుంది. ఫొటో మార్ఫింగ్‌కు ఎవరు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. ఎన్కౌంటర్లో కమ్రాన్ హతమయ్యాడని సైనిక వర్గాలు ప్రకటించినప్పటికీ ఆయన మృతదేహం ఫొటోలను విడుదల చేయక పోవడం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. -
బాల్క సుమన్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ ఉంటున్న బాల్క సుమన్ ప్లాట్‌లోకి గత నెల మంచిర్యాలకు చెందిన శంకర్, విజేత, గోపాల్, సంధ్య, అక్రమంగా ప్రవేశించి ఆయన వ్యక్తిగత సహాకుడు సునీల్‌పై దాడికి యత్నించారు. ఎంపీని దూషించడంతో సునీల్ గతనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శంకర్, విజేతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న గోపాల్, సంధ్యలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత కథనాలు: బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్ ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన -
ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై రెండు రోజులుగా వైరల్ అవుతున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. పోలీసులు కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి దుర్భాలాషలాడారని గత నెల 7న ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ సుమన్‌ను కలవాలన్నారని, ఆయన లేకపోవడంపై తనపై దౌర్జన్యానికి దిగినట్టు సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సునీల్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఎంపీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న ఇద్దరు మహిళలు విజేత, సంధ్యలపై ఆరు నెలల క్రితం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు వెల్లడించారు. రిమాండ్ కూడా విధించారని, మంచిర్యాలలో రిమాండ్ పూర్తైన తర్వాత.. బయటకు వచ్చిన ఇద్దరు మరో ఇద్దరు యువకులతో కలిసి ఎంపీ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసినట్టు విచారణ వెల్లడైందన్నారు. దీంత్ సునీల్ పోలీసులును ఆశ్రయించారన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు
హైదరాబాద్: ప్రేమ నిరాకరించిన అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాళ్లకు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గతేడాది నుంచి గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని మణికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నూకటి సురేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి కథనం ప్రకారం... నూకటి సురేశ్ బాధితురాలైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటబడ్డాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో బాధితురాలి ఫేస్‌బుక్‌తో పాటు ఆమె ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఖాతాలోకి వెళ్లి బాధితురాలి ఫొటోలను ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి బాధితురాలితో పాటు ఆమె స్నేహితులకు వాట్సాప్‌కు పంపాడు. నకిలీ ఫేస్బుక్ ఖాతాను క్రియేట్ చేసి బాధితురాలి ఫొటోలతో పాటు వాట్సాప్ నంబర్ పోస్టు చేశాడు. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
ఆ జబ్బుకి మందు లేదు!
సినిమాల్లో వీలైనంత గ్లామరస్‌గా కనిపించే కథానాయికలు విడిగా కూడా దాదాపు అలానే ప్రత్యక్షమవుతుంటారు. అందుకు తాజా ఉదాహరణ దీపికా పదుకొనె. హాలీవుడ్ చిత్రం ‘త్రిబుల్ ఎక్స్’ చేయడం మొదలుపెట్టాక, డ్రెస్సుల విషయంలో దీపిక మరింత ధారాళంగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల ముంబైలో జరిగిన ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి లో–నెక్ డ్రెస్‌లో విచ్చేసిన దీపికాను చూసి, చాలామంది కళ్లార్పడం మరచిపోయారట. చూపులు ఎక్కడో చిక్కుకున్నాయట. కొంతమందైతే సభ్యత కూడా మరచిపోయి దీపికా లో–నెక్ అందాలను చూస్తూ ఉండిపోయారట. ఆ విధంగా అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నందుకు దీపిక ఆనందపడే ఉంటారు. అయితే ఆ డ్రెస్ తనను అభాసుపాలు చేస్తుందని ఊహించి ఉండరు. కొందరు ఆకతాయిలు ఆ లో–నెక్కి సంబంధించిన ఫొటోలు తీసుకుని, కంప్యూటర్ మాయాజాలంతో దీపిక ఇంకా హాట్‌గా కనిపించేలా చేశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఆన్లైన్లో హల్చల్ చేసి, అటు ఇటు తిరిగి దీపిక దగ్గరకు చేరాయట. ఆ ఫొటోలను చూసిన దీపికా ఖంగుతిన్నారట. ‘ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం ఉంటుంది. కొందరేమో మా ఫొటోలను మార్ఫింగ్ చేసి పైశాచికానందం పొందుతుంటారు. ‘మార్ఫింగ్’ ఓ జబ్బులాంటిది. ఆ జబ్బు ఉన్నవాళ్లు మానసిక రోగులు కింద లెక్క. పెద్ద పెద్ద జబ్బులకు కూడా మందులు దొరుకుతున్నాయి కానీ, ఈ జబ్బుకి మందులు లేవు. అందుకే వాళ్ల మీద జాలిపడటం మినహా చేయగలిగిందేమీ లేదు’’ అని తన సన్నిహితుల దగ్గర ఘాటుగా స్పందించారట. -
ఫొటోలు మార్పింగ్ చేసి.. ఫేస్బుక్లో పెట్టి
* విద్యార్థినిని డబ్బు డిమాండ్ చేసిన ‘సీనియర్’ * నిందితుడి అరెస్టు సాక్షి, హైదరాబాద్: జూనియర్ విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియా (ఫేస్బుక్)లో అప్లోడ్ ఓ సీనియర్ విద్యార్థి వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తొలగించాలంటే తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం కటకటాల్లోకి నెట్టారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం కథనం ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన యువకుడు ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తనకు జూనియర్ అయిన ఓ విద్యార్థిని ఫేస్బుక్ ఐడీ, పాస్వర్డ్ దొంగచాటుగా తెలుసుకున్నాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చి ఫేస్బుక్లో పెట్టాడు. వాటిని తొలగించాలంటే తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్ నిందితుడిన్న గుర్తించి సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతని వద్ద లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న అశ్లీల చిత్రాలను తొలగించారు. ఈ విధంగా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే నిందితులను కఠినంగా శిక్షిస్తామని సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. -
‘క్రైం’ కిలాడీ
►ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు ►రైల్వే ఇంజినీర్, యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ ►రూ.13 లక్షలు వసూలు ►మరింత సొమ్ముకోసం బెదిరింపులు ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్): సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్‌చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు.. ప్రజలూ బహుపరాక్’ అం టూ గంభీరమైన మాటలు చెబుతాడు. ‘టిప్పుటాపుగా వస్తారు.. తప్పు చేయకపోయినా తప్పులున్నాయంటారు.. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిలోకి లాగుతామంటారు.. ఇలాంటి వాళ్ల మాటలకు బెదిరిపోకండి.. పోలీసుల్ని ఆశ్రయించండి’ అంటూ గొప్పోడిలా సలహాలు ఇస్తాడు. తెరవెనుక మాత్రం అతడే కిలాడీ కేటుగాడని.. తానే అలాంటి పనులు చేస్తూ డబ్బులు గుంజుతుంటాడని తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతయియంది. నేర వార్తలను విభిన్నంగా చదువుతూ.. తెరవెనుక జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన టీవీ యూంకర్ హర్షవర్దన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసి కటకటాల పాలైన హర్షవర్దన్ ముఠా సభ్యులు తననూ బెదిరించారని.. రూ.13 లక్షలు వసూ లు చేశారని ఓ రైల్వే ఇంజినీర్ తాజాగా టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఫొటో మార్ఫింగ్ చేసి రూ.20 లక్షలు అడిగారు హర్షవర్దన్ తననుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడంటూ విజయవాడకు చెందిన రైల్వే ఇంజినీర్ నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్లో సెక్షన్ సీని యర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరినాథ్‌బాబు అదే నగరంలో నివాసం ఉంటున్నారు. అతని ఫొటోను ఓ యువతి ఫొటోతో కంప్యూటర్ సాయంతో మార్ఫింగ్ చేసి దానిని ఇంటర్నెట్లో పెడతామంటూ హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన ఓ టీవీ ఛానల్ నిర్వాహకుడు లూక్‌బాబు, హేలాపురి దినపత్రిక తరఫున ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పనిచేస్తున్న బోడ విజయకుమార్, దరిశిపాముల విజయరత్నం బ్లాక్మెయిల్ చేశారు. ఆ ఫొటోను నెట్లో పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన హరినాథ్‌బాబు వారిని ఈ నెల 2న విజయవాడ రైల్వేస్టేషన్‌కు రమ్మని చెప్పారు. వారికి అక్కడ రూ.13 లక్షలు ఇచ్చారు. అయినా హర్షవర్దన్, అతని ముఠా సభ్యులు మార్ఫింగ్ చేసిన ఫొటోను హరినాథ్‌బాబుకు ఇవ్వలేదు. మరి కొంత సొమ్ము ముట్టచెబితేనే ఫొటోను తిరిగి ఇస్తామన్నారు. ఆ తరువాత ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో హర్షవర్దన్, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హరినాథ్‌బాబు మంగళవారం అర్ధరాత్రి ఏలూరు చేరుకున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన విషయమై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యకిషోర్ తెలిపారు. -
విద్యార్థిని ఫొటో మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో...
►తప్పుడు పనులతో భవిష్యత్తుకు చేటు ►ఫొటోను మార్ఫింగ్ చేసి ‘ఫేస్’ బుక్కయిందొకరు ►ప్రేమించనందుకు కత్తితో దాడి చేసిందింకొకరు ►యువతిని కిడ్నాప్ చేస్తూ చిక్కిన మరో యువకుడు ►ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు కామారెడ్డి: తమ భావి జీవితానికి బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు, యువకులు దారితప్పుతున్నారు. టీనేజ్‌లో తామేం చేస్తున్నామో తెలుసుకోలేని పరిస్థితులలో తప్పుడు పనులకు పాల్పడుతూ జీవి తాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలం లో కామారెడ్డి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనల ను పరిశీలిస్తే యువత ఎలా పెడదోవ పడుతుందో స్పష్టమవుతోంది. వరుసగా జరిగిన ఘటనలు అటు బాధిత కుటుంబాలనే గాక సమాజాన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. చదివి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లలను చదువులకు పంపిస్తుంటే, తోటి స్నేహితులతో కలిసి రకరకా ల వికృత చేష్టలకు పాల్పడడం ద్వారా కన్న వారికి దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ముఖ్యంగా ప్రేమించమంటూ అమ్మాయిలను వేధించడం, ప్రేమించనివారిపై అఘాయిత్యాలు చేయడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సెల్ఫోన్ల ద్వారా యువత ఇంట ర్నెట్‌ను వాడుతూ అశ్లీల దృశ్యాలు, చిత్రాలను చూ స్తూ పెడదోవ పడుతున్నారనే అభిప్రాయం ఉంది. ఇంటర్నెట్ ద్వారా జీవితానికి ఉపయోగపడే అంశాల కు బదులు, ఇతర విషయాల్లోకి మరలుతుండడంతో వారు దారి తప్పుతున్నారు. నేరస్తులుగా మారుతున్నారు. తద్వారా ఉన్నత చదువుల లక్ష్యం కూడా దెబ్బతింటోంది. తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి. సినిమాలు, నేర కథనాల ప్రభావం కౌమార దశ నుంచి యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో తాము చేసేది మంచో చెడో తెలుసుకోలేక పోతుంటారు. ఇదే సమయంలో సినిమాలు, నేర కథనాలను చూసిన యువత, విద్యార్థులు వాటిని అనుకరించడానికి యత్నిస్తుంటారు. ముఖ్యంగా సినిమాల లో టీనేజ్ ప్రేమను ఉద్దేశించినవే ఎక్కువగా వస్తున్నా యి. అందులోని అశ్లీలం, నేర సన్నివేశాలు యువత పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయం లో సినిమాలలో తనను ప్రేమించని అమ్మాయిలపై విలన్లు జరిపే దాడులు వారి మెదడులో నిండిపోతున్నాయి. నిజజీవితంలో తాము ప్రేమలో విఫలమయ్యామని గ్రహించి చాలామంది యువకులు అలాం టి నేర ప్రవృత్తితో వ్యవహరిస్తున్నారు. జరిగిన ఘట నలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. సామాజిక స్పృహను కలిగించే బోధనలు చేయాలి గతంలో యువత, విద్యార్థులు సమాజ శ్రేయస్సు కో సం తపించేవారు. సమాజాన్ని గురించి తెలుసుకునేవారు. పాశ్చాత్య పోకడలతో నేటి యువత త్వరగా దారి తప్పుతున్నారు. యువత, విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగించే బోధనలు చేయాల్సిన అవసరం ఉంది. కెరీర్‌తో పాటు సమాజం గురించి వారికి అవగాహన కల్పించడం ద్వారా సరైన మార్గంలో నడపవ చ్చు. అలాంటి ప్రయత్నాలు విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ తి, ధర్మం, న్యాయం, నాయకత్వ లక్షణాలు వంటి వి షయాలపై విద్యార్థులు, యువతకు అవగాహన క ల్పించాలి. తద్వారా వారు తప్పు చేయడానికి కొంత వరకు వెనుకడుగు వేస్తారు. ఇటీవల జరిగిన ఘటలు ►గతనెల 30న కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రేమించడం లేదన్న కోపంతో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాల డిగ్రీ విద్యార్థి సాయికిరణ్‌రెడ్డి కత్తితో దాడిచేసి గాయపర్చాడు. అంతటితో ఆగకుండా తనూ పొడుచుకున్నాడు. సాయికిరణ్‌రెడ్డి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. సదరు విద్యార్థిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ►భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామానికి చెం దిన సునీల్‌రెడ్డి(17) అనే ఇంటర్ విద్యార్థి అదే గ్రా మానికి చెందిన విద్యార్థిని ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో సునీల్‌రెడ్డిపై పోలీసులు నిర్భయ, ఐటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి ఈనెల 20న అరెస్టు చేశారు. ►ఈ నెల 20న కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి (జి) గ్రామానికి చెందిన బాల్‌రాజు (20) అనే యువ కుడు, కామారెడ్డి పట్టణంలో ఓ యువతిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళుతుండగా స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు'
నిజామాబాద్ : ఓ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిక్కనూరు మండలం గుర్జకుంటకు చెందిన విద్యార్థినిని అదే గ్రామానికి చెందిన సునీల్ రెడ్డి ఫోటోలు తీశాడు. వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిపై నిర్భయ, ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హారజపరిచి రిమాండ్‌కు తరలించారు. -
ఉదయభాను ఫిర్యాదుతో వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు
హైదరాబాద్: తన ఫోటోలను మార్ఫింగ్ చేశారన్న ప్రముఖ వ్యాఖ్యాత, సినిమా, టివి నటి ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మధుమతి’ సినిమా విషయంలో ఆ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ తనని మోసం చేశారని ఉదయభాను ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను చెప్పారు. మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడన్నారు. కనీసం ప్రివ్యూను కూడా తనకు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ను దెబ్బ తీశారని ఆమె బాధపడ్డారు. హాట్ సీన్లలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. తాను చేసిన దాంట్లో అశ్లీలత లేదని తెలిపారు. పైగా పారితోషికం కింద తనకు రెండు లక్షల రూపాయలే ఇచ్చారని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయభాను ఫిర్యాదుతో పోలీసులు వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మార్ఫింగ్ జరిగినట్లు చెబుతున్న దృశ్యాలను, ఫోటోలను ల్యాబ్‌కు పంపారు.